బెంగళూరు : సినిమా థియెటర్లో జాతీయగీతం వచ్చేటప్పుడు నిల్చోలేదని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాలు.. జితిన్ కుమార్(29) అనే వ్యక్తి బుధవారం అవెంజర్స్ సినిమా చూడటానికి స్థానిక ఐనాక్స్‌మాల్‌కి వెళ్లాడు. అయితే సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం వచ్చినప్పుడు జితన్ లేవలేదు. దాంతో సుమన్ అనే వ్యక్తి జితిన్‌తో గొడవపడటం ప్రారంభించాడు. వీరి గొడవ వలన ఇతర ప్రేక్షకులు ఇబ్బంది పడటంతో మాల్ సిబ్బంది వచ్చి వారిని బయటకు వెళ్లమని చెప్పారు. అనంతరం సుమన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జితిన్ మీద ఫిర్యాదు చేశాడు. జితిన్ జాతీయ గీతాన్ని అవమానపరిచాడని.. దీని గురించి ప్రశ్నించినందుకు తనను కూడా నిందించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దాంతో పోలీసులు జితిన్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం గురించి జితిన్ ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని తెలియజేశాడు. జరిగిన విషయం పూర్తిగా తెలసుకోకుండానే.. మీడియా తనను దేశ ద్రోహిగా చిత్రీకరించిందని జితిన్ వాపోయాడు. ఈ వివాదం గురించి జితిన్ మాట్లాడుతూ.. ‘జాతీయ గీతం వచ్చినప్పుడు నేను లేవలేదు. దాంతో కొందరు దుండగులు నాతో గొడవకు దిగారు. వారిలో ఒక వ్యక్తి నన్ను శారీరకంగా గాయపర్చాడు. మాల్ యాజమాన్యం దీనిపై స్పందించలేదు. అంతేకాక నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాకు కనీసం బెయిల్ కూడా లభించలేదు. ఈ విషయంలో మీడియా స్పందించిన తీరు నాక చాలా బాధకల్గించింది. నా తరఫు వాదన వినకుండానే.. నన్ను దేశ ద్రోహిగా చిత్రికరించార’ని జితిన్ వాపోయాడు. అంతేకాక ట్విటర్ వేదికగా ఐనాక్స్‌ను బాయ్‌కాట్ చేయాలని కోరుతున్నాడు.
@ndtv @TimesNow @abpnewstv @IndiaToday
— Jithin Chand (@jithknot) May 10, 2019
I was assaulted and harassed by thugs at an @INOXMovies theater
Heres the Reddit post.https://t.co/SW5rsgiEUL
Now the mall came out officially denying anything happened.
This is not right!
Please share and retweet#BOYCOTTINOX
Comments
Please login to add a commentAdd a comment