జాతీయ గీతంలో ‘అధినాయక్’ను తొలగించాలి | national anthem, "adhinayak 'to be removed | Sakshi
Sakshi News home page

జాతీయ గీతంలో ‘అధినాయక్’ను తొలగించాలి

Published Wed, Jul 8 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

జాతీయ గీతంలో ‘అధినాయక్’ను తొలగించాలి

జాతీయ గీతంలో ‘అధినాయక్’ను తొలగించాలి

జైపూర్: జాతీయ గీతం ‘జనగణమన’లోని అధినాయక్ పదాన్ని తొలగించాలని రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ డిమాండ్ చేశారు. దాని స్థానంలో ‘మంగళ్’ పదాన్ని చేర్చాలన్నారు. ‘జనగణమన అధినాయక్ జయహో’ వాక్యంలో అధినాయక్ ఎవరని ఆయన  ప్రశ్నించారు. ఆ పదం ఆంగ్లేయుల పాలనను పొగిడేలా ఉందని చెప్పారు.

ఆ వాక్యాన్ని ‘జనగణమన మంగళ్ గాయే’గా మార్చాలని పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన రాజస్థాన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అయన మాట్లాడారు. ఈ గీతం రాసిన  టాగూరు అంటే తనకు గౌరవమని, అయినా ‘అధినాయక్’ పదాన్ని తీసేయాల్సిందేనని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement