Kalyan Singh
-
జ్ఞానవాపి, రామ జన్మభూమి వివాదాల వెనక ములాయం సింగ్ పాత్ర ఏంటి?
లక్నో: అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అయోధ్య, జ్ఞానవాపి మసీదు వివాదాల వెనక ఒక కామన్ పేరు వినిపిస్తోంది. ఆయనే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్. ఈ వివాదాల వెనక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటంటే..? కరసేవకులపై కాల్పులు.. 1990 అక్టోబర్‌లో ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కరసేవ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కరసేవకులపై ములాయం ప్రభుత్వం 28,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించింది. అయినప్పటికీ బారికేడ్లను దాటి కరసేవకులు బాబ్రీ మసీదు ప్రదేశానికి చేరుకున్నారు. మసీదుపై కాశాయ జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెలువడ్డాయి. బాబ్రి మసీదు కూల్చివేత.. అయోధ్యలో కరసేవకుల ఘటన తర్వాత 1991లో యూపీలో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. మరుసటి ఏడాది 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటన జరిగింది. ఈ పరిణామాల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న పీవీ నరసింహరావు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ములాయం మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈ పాలనా కాలంలోనే జ్ఞానవాపి సెల్లార్లో హిందువుల పూజలను ములాయం ప్రభుత్వం నిలిపివేసింది. జ్ఞానవాపిలో పూజలు నిలిపివేత.. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ (వ్యాస్జీ కా తెహ్ఖానా)లో 1993 వరకు పూజాలు జరిగాయి. సెల్లార్లో 200 ఏళ్లకు పైగా వ్యాస్ కుటుంబం పూజలు చేశారు. వారి కుటుంబ పేరుమీదుగానే ఆ సెల్లార్‌కు వ్యాస్జీ కా తెహ్ఖానా అని పేరు వచ్చింది. అయితే.. 1993 డిసెంబర్లో ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపి మసీదులో పూజలను నిలిపివేసింది. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించిందని శైలేంద్ర వ్యాస్ కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. మసీదు ప్రాంతంలో దేవాలయం.. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లు ఏఎస్ఐ సర్వే తెలిపిందని హిందూ తరుపు న్యాయవాది విష్ణశంకర్ జైన్ వెల్లడించారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం.. కాలక్రమంలో అనేక యుద్ధాలు, విధ్వంసం తర్వాత పునర్నిర్మాణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. దక్షిణాసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన పండితుడు యుగేశ్వర్ కౌశల్ ప్రకారం.. మహారాజా జయచంద్ర తన పట్టాభిషేకం తర్వాత సుమారు 1170-89 ADలో ఈ ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ శిథిలాల పైన ప్రస్తుత జ్ఞానవాపి మసీదును నిర్మించాడని విశ్వసిస్తారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం -
ఏకంగా పది సార్లు.. 20 ఏళ్లుగా చెరగని మాజీ సీఎం రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిసారి ఎన్నికల్లో ‘తొలి’సారి ఎమ్మెల్యేలు అధికంగా ఉంటారు. గడిచిన నాలుగు ఎన్నికలు పరిశీలిస్తే 2017లో అత్యధికంగా మూడింట రెండొంతులు అంటే 403 మందికి 239 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నాలుగైదు దశాబ్దాల ఎన్నికల్లో తొలి గళం అధికంగా వినిపించింది 2017 నాటి 17వ అసెంబ్లీ ఫలితాల్లోనే. ప్రస్తుత ఎన్నికల్లో అతిపెద్ద మల్లయోధుడు ఆజంఖాన్ రాంపూర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. పదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఆజంఖాన్ యత్నిస్తున్నారు. తొమ్మిదోసారి అడుగుపెట్టే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో సురేశ్‌కుమార్ ఖన్నా(బీజేపీ) షాజహన్‌పూర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. రామ్ గోవింద్ చౌదరి కూడా ఎస్పీ తరఫున బల్లియా పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇక బీజేపీ, టీఎంసీ, బీఎస్పీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్యామ సుందర్ శర్మ ఈసారి బీఎస్పీ నుంచి బరిలో దిగనున్నారు. అఖిలేశ్ సర్కారులో మంత్రిగా పనిచేసిన దుర్గా ప్రసాద్ యాదవ్ కూడా తొమ్మిదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్ మహానా, రాంపాల్ వర్మ, రమాపతి శాస్త్రి, జయ ప్రతాప్‌సింగ్ (బీజేపీ) ఎనిమిదో సారి గెలుపుకోసం యత్నిస్తున్నారు. రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా ఏడోసారి కుండా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఫతే బహదూర్ (బీజేపీ) ఆరుసార్లు గెలిచి కేంపియర్‌గంజ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అజయ్ ప్రతాప్ సింగ్ (బీజేపీ) కర్నల్ గంజ్ నుంచి, నరేంద్రసింగ్ వర్మ (ఎస్పీ) మహమ్మదాబాద్ నుంచి ఇక్బాల్ మహమ్మద్ (ఎస్పీ) సంబల్ నుంచి ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. (క్లిక్: సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?) 20 ఏళ్లుగా చెరగని రికార్డు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్ పదిసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన రికార్డు రెండు దశాబ్దాలుగా చెరగని రికార్డుగా ఉంది. తొలిసారి జనసంఘ్ నుంచి 1967లో ఎన్నికైన కల్యాణ్ సింగ్ 2002లో రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరఫున పదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ గెలిస్తే ఈ రికార్డును సమయం చేసే అవకాశం ఉంది. 1967లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. (చదవండి: యూపీలో పోలింగ్‌కు... ఇస్లామాబాద్ సిద్ధం!) -
సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?
ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 21, 1998న గవర్నర్ రమేశ్ భండారీ డిస్మిస్ చేయడంతో లోక్తాంత్రిక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగదాంబికా పాల్ సీఎం పదవి చేపట్టారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి.. మళ్లీ బలపరీక్షకు ఆదేశించింది. దీంట్లో నెగ్గి కల్యాణ్‌సింగ్ మళ్లీ సీఎం అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక 10 రోజుల్లోపే దిగిపోయిన వారి జాబితా ఇది... చదవండి: 14 మంది ప్రధానుల్లో 9 మంది యూపీ నుంచే.. -
బండి సంజయ్ పాదయాత్ర 28కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి ప్రారభించాల్సిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ఈ నెల 28కి వాయిదా పడింది. బీజేపీ సీనియర్‌నేత, మాజీ సీఎం, మాజీ గవర్నర్ కల్యాణ్‌సింగ్ మృతి నేపథ్యంలో పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తున్నందున పాదయాత్రను వాయిదా వేసినట్లు బీజేపీ ఆదివారం అధికారికంగా వెల్లడించింది. తొలుత ఈ పాదయాత్రను క్విట్ ఇండియా దినోత్సవం ఆగస్ట్ 9 నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించగా..పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులపై చర్చ, ఓటింగ్ వంటి అంశాల నేపథ్యంలో ఈ నెల 24కు వాయిదా వేశారు. తాజాగా కల్యాణ్‌సింగ్ మరణంతో నాలుగురోజుల పాటు మరోసారి పాదయాత్ర వాయిదా పడినట్లైంది. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన బండి సంజయ్ ఈ అంశంపై చర్చించారు. ఈనెల 28 శనివారం ఉదయం తొమ్మిదన్నర గంటలకు చారి్మనార్ వద్ద భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి తెలంగాణ ఇన్చార్జి తరుణ్ ఛుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్‌లతో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌కు ప్రధాని మోదీ నివాళి
-
యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌కు ప్రధాని మోదీ నివాళి
లక్నో: యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. కల్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అంతకుముందు లక్నో చేరుకున్న ప్రధానికి మోదీకి.. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ తొలితరం నాయకుడైన కల్యాణ్ సింగ్ శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. 89 ఏళ్ల కల్యాణ్ సింగ్ జూలై 4 నుంచి సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐ)లో చికిత్స పొందుతున్నారు. చేరినప్పటినుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ పలు అవయవాలు పనిచేయకుండా పోవడం, సెప్సిస్ (రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలంపై దాడి చేయడం)తో ఆయన మరణించారని ఎస్జీపీజీఐ తెలిపింది. -
యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ కన్నుమూత
-
యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ కన్నుమూత
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ తొలితరం నాయకుడు కల్యాణ్ సింగ్ శనివారం రాత్రి కన్నుమూశారు. 89 ఏళ్ల కల్యాణ్ సింగ్ జూలై 4 నుంచి సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐ)లో చికిత్స పొందుతున్నారు. చేరినప్పటినుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ పలు అవయవాలు పనిచేయకుండా పోవడం, సెప్సిస్ (రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలంపై దాడి చేయడం)తో ఆయన మరణించారని ఎస్జీపీజీఐ తెలిపింది. కల్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. సమాజంలో బలహీన వర్గాలకు ఆయన గొంతుగా నిల్చారని ప్రస్తుతించారు. హిందుత్వానికి కేరాఫ్ అడ్రస్ ‘‘యూపీ సీఎంగా నేను కూలిపోయే సమయంలో బాబ్రీ కూలిపోవడం విధి రాత. మసీదు కూలిపోకపోతే కోర్టులు ఎప్పటికీ యథాతధ స్థితి కొనసాగించేవి. ఏదైనా మందిరం పూర్తయ్యాక చూడాలన్నది నా ఆశ’’ అని 2020 ఆగస్టులో అయోధ్య రామమందిర భూమిపూజ సందర్భంగా కల్యాణ్‌సింగ్ వ్యాఖ్యానించారు. కానీ ఆ ఆశ తీరకుండానే మరణించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కల్యాణ్ రెండుమార్లు పనిచేశారు. పది అసెంబ్లీ ఎన్నికల్లో 9సార్లు ఆయన గెలుపొందారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా ఉన్నారు. తర్వాత జనసంఘ్‌లో అనంతరం బీజేపీలో కీలక పాత్ర పోషించారు. ఏ పార్టీలో ఉన్నా హిందూవాదాన్ని బలంగా వినిపించేవారు. తొలిసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది. దాంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, కేంద్రం యూపీ అసెంబ్లీని రద్దు చేసింది. అనంతరం 1997లో ఆయన రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యారు. లక్నో కార్పొరేటర్ కుసుమ్ రాయ్ ప్రభుత్వ వ్యవహారాలను శాసిస్తున్నారని సొంత ఎమ్మెల్యేల నుంచే అసమ్మతి పెరగడంతో 1999 నవంబరులో బీజేపీ హైకమాండ్ ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించింది. తర్వాత పార్టీ నుంచి బహిష్కరించింది. కల్యాణ్ సింగ్ 2010లో జనక్రాంతి పార్టీ పేరిట సొంత కుంపటి పెట్టుకున్నారు. 2014లో తిరిగి బీజేపీలో చేరారు. అదే సంవత్సరం ఆయన్ను రాజస్తాన్ గవర్నర్‌గా నియమించారు. -
Kalyan Singh: క్షీణించిన మాజీ సీఎం ఆరోగ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐఎంఎస్) బుధ వారం వెల్లడించింది. మంగళవారం సాయం త్రం నుంచి ఆయన వెంటిలేటర్ మీదనే ఉన్నా డని చెప్పింది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపింది. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనోలజీ విభాగాలకు చెం దిన నిపుణులు నిరంతరం ఆయన్ను పరిశీ లిస్తున్నారని ఆస్పత్రి వెల్లడించింది. ఇదిలా ఉం డగా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్ప త్రిని సందర్శించారు. కల్యాణ్ సింగ్ ఆరో గ్యం గురించి వాకబు చేసినట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలి పారు. -
ఐసీయూలో మాజీ సీఎం.. ప్రధాని మోదీ ఆరా
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (89) అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆదివారం చేర్పించారు. ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ , న్యూరో ఓటోలజీ విభాగాల నిపుణుల బృందాన్ని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. కల్యాణ్‌సింగ్ త్వరగా కోలుకోవాలని ఆ రాముణ్ని ప్రార్థిస్తున్నానంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. మరోవైపు కల్యాణ్ సింగ్ ఆరోగ్యపరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు రాజ్‌వీర్‌కు ఫోన్ చేసి, వివరాలను తెలుసుకున్నారు. అలాగే ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సీఎం యోగీని కోరారు. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వాత్రా దేవ్ సింగ్ ఆసుపత్రిని సందర్శించిన కల్యాణ్ సింగ్‌ను పరామర్శించారు. కాగా రాజస్థాన్ గవర్నర్‌గా కూడా కల్యాణ్ సింగ్ పనిచేశారు. आज लखनऊ स्थित डॉ.राम मनोहर लोहिया आयुर्विज्ञान संस्थान पहुंचकर राजस्थान के पूर्व राज्यपाल एवं उ.प्र. के पूर्व CM श्री कल्याण सिंह जी के स्वास्थ्य के बारे में जानकारी प्राप्त की व डॉक्टरों को देखभाल हेतु निर्देशित किया। प्रभु श्री राम से प्रार्थना है कि आपको शीघ्र स्वस्थ करें। pic.twitter.com/VLjEQVey0G — Yogi Adityanath (@myogiadityanath) July 4, 2021 -
1992 డిసెంబర్ 6న ఏం జరిగింది ?
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో ఆ రోజు అయోధ్యలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వివరించింది. కరసేవకులు మసీదుని కూలగొట్టడానికి వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో వేలల్లో పోలీసుల్ని పట్టణంలో మోహరించారు. అయితే లక్షన్నర మంది వరకు కరసేవకులు ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో వారిని అడ్డుకోవడం సాధ్యం కాలేదని నివేదిక వెల్లడించింది. మన్మోహన్ సింగ్ లిబర్హాన్ ఆధ్వర్యంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉదయం 12:15కి మొదలైన కూల్చివేత కార్యక్రమం సాయంత్రం 5:30కి ముగిసింది. 1992 డిసెంబర్ 5 నుంచే అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యూపీలో నాటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం భారీగా పోలీసుల్ని మోహరించింది. 35 కంపెనీల ప్రావిన్షియల్ ఆర్మీడ్ కాన్‌స్టబ్యులరీ (పీఏసీ), 195 కంపెనీల పారామిలటరీ బలగాలు, నాలుగు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 15 బాష్ప వాయు స్క్వాడ్స్, 15 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్ఐలు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్లు మోహరించారు. ఉదయం 10:30 గంటలకి అడ్వాణీ, జోషి వంటి బీజేపీ అగ్రనాయకులు కరసేవ ప్రారంభం చూడడం కోసం వచ్చారు. ఒక 20 నిమిషాల సేపు అక్కడే గడిపిన వారు రామ్‌కథ కుంజ్‌లో మతాధికారులు ఇచ్చే ప్రసంగాలు వినడానికి వెళ్లారు. పలుగు పారలతో మసీదుపై దాడి మసీదు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఒక టీనేజీ యువకుడు 12 గంటల సమయంలో మసీదు గుమ్మటంపైకి నెమ్మదిగా ఎక్కాడు. అతని వెంట మరో 150 మంది వరకు పైకి ఎక్కి గునపాలు, ఇనుప రాడ్లు, పలుగులు, పారలతో మసీదుని కూల్చడం మొదలుపెట్టారు. మరో పావు గంట గడిచేసరికి 5 వేల మంది వరకు కరసేవకులు మసీదుపైకి ఎక్కేశారు. చేతికి దొరికిన ఆయుధాలతో కూల్చే పని కొనసాగించారు. అడ్వాణీ, జోషి, అశోక్ సింఘాల్, విజయ్‌రాజె సింథియా వంటి నేతలు వారిని వెనక్కి వచ్చేయమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కరసేవకులు వినిపించుకోలేదు. భద్రతా బలగాలు, మీడియా ప్రతినిధులపైకి ఇటుకలు విసురుతూ ఉద్రిక్తతలకు తెర తీశారు. పోలీసు బలగాలు అడ్డుకోలేకపోయాయి జిల్లా మెజిస్ట్రేట్ పారామిలటరీ బలగాల్ని మోహరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్లెవరూ కాల్పులకు దిగకూడదన్న షరతు మీద ఆ నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ బలగాలకు అనుమతించారు. కానీ వారు వివాదాస్పద కట్టడం దగ్గరకి వెళ్లడంలో విఫలమయ్యారు. మార్గం మధ్యలోనే వారిని కరసేవకులు అడ్డుకున్నారు. ఇక రాష్ట పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్ట కుండా మిన్నకుండిపోయారు. మసీదులో ఒక భాగం కూలిపోగానే డీజీపీ కాల్పులకు అనుమతి అడిగితే కళ్యాణ్‌సింగ్ నిరాకరిం చారు. మసీదు కూలడం మొదలు కావడంతో ఒక్కసారిగా అయోధ్యలో మత ఘర్షణలు పెచ్చరిల్లాయి. సాయంత్రమ య్యేసరికి మసీదు అంతా నేలమట్టమైంది. కేంద్ర కేబినెట్ యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టుగా ప్రకటించింది. -
గవర్నర్ మార్పు వెనుక ఆంతర్యం అదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పదవీ బాధ్యతల్లో ఉన్న రాజస్తాన్ గవర్నర్ కళ్యాన్ సింగ్‌ను తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో కళ్యాన్ సింగ్ విచారణను ఎదుర్కొంటున్నారు. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీలు క్రిమినల్ కుట్రకు పాల్పడినట్టు అభియోగాలు మోపబడ్డ విషయం తెలిసిందే. 2001లో సీబీఐ కోర్టు కుట్ర అభియోగాల నుంచి ఈ ముగ్గురు నేతలకు విముక్తి కల్పించింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు ఏడేళ్ల కిందట సమర్థించగా.. 2017లో సుప్రీంకోర్టు అద్వానీ, జోషి, ఉమాభారతిలపై అభియోగాల ఎత్తివేత కుదరదని, ఈ అభియోగాలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేయడంతో బాబ్రీ అంశం మరలా తెర మీదకి వచ్చింది. విచారణకు కళ్యాన్‌సింగ్.. అయితే బాబ్రీ దుర్ఘటన సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాన్ సింగ్ పేరును కూడా చార్జ్‌షీట్‌లో చేర్చిన సీబీఐ సుప్రీం ఆదేశాలతో విచారణను మరింత వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా కళ్యాన్ సింగ్‌ను కూడా సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గవర్నర్ పదవిలో ఉండటంతో విచారణకు అడ్డు వస్తుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ప్రకారం నేర విచారణను ఎదుర్కొంటున్న గవర్నర్లను తప్పించే అధికారం రాష్ట్రపతి ఉంటుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్నట్లు, కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా ముందస్తుగా ఆయన స్థానంలో మరొకరిని నియమించినట్లు సమాచారం. కాగా 1992 డిసెంబర్6న హిందూ సంఘాలు బాబ్రి మసీదును కూల్చివేసిన సమయంలో కళ్యాన్ సింగ్ ప్రభుత్వం వారికి సహకరించిందని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. గవర్నర్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కల్రాజ్ మిశ్రాను రాజస్తాన్‌కు బదిలీ చేసింది. అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. -
చిక్కుల్లో గవర్నర్ కల్యాణ్ సింగ్
న్యూఢిల్లీ: రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్(87) మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమర్పించిన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గత నెల 25న యూపీలోని అలీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. కాబట్టి మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటాం. దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరముంది. మే 23న మోదీ మళ్లీ ప్రధాని కావాలని మేమంతా కోరుకుంటున్నాం. దేశంలోని ప్రతీ బీజేపీ కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలి’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విచారణ జరిపిన ఈసీ.. కల్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళితో పాటు గవర్నర్ పదవికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. ఈ నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. విదేశీ పర్యటన నుంచి బుధవారం భారత్‌కు చేరుకున్న కోవింద్, సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నివేదికను హోంశాఖకు పంపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు ఎదుర్కొన్న తొలి గవర్నర్‌గా కల్యాణ్ సింగ్ నిలిచే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. సింగ్‌కు ముందు 1990ల్లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన గుల్షర్ అహ్మద్ తన కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో పొసగకపోవడంతో 1999లో పార్టీకి రాజీనామా చేసిన కల్యాణ్ సింగ్, తిరిగి 2004లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక కేంద్ర ప్రభుత్వం కల్యాణ్ సింగ్ ను రాజస్తాన్ గవర్నర్‌గా నియమించింది. -
రాజస్తాన్ గవర్నర్‌ది కోడ్ ఉల్లంఘనే
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని వ్యాఖ్యానించిన రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. కల్యాణ్ సింగ్‌పై రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. మార్చి 23న అలీగఢ్‌లో కల్యాణ్ సింగ్ తన నివాసంలో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ‘ మనమంతా బీజేపీ కార్యకర్తలం. బీజేపీ గెలవాలని మనం కోరుకుంటున్నాం. మోదీ మరోసారి ప్రధాని కావాలి. మోదీ మళ్లీ ప్రధాని కావడం అవసరం’ అని వ్యాఖ్యానించారు. టికెట్ల పంపిణీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. 1990లో అప్పటి హిమాచల్ గవర్నర్ గుల్షర్ అహ్మద్ తన కొడుకు తరఫున ప్రచారంలో పాల్గొనడంతో ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గవర్నర్.!
జైపూర్ : రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్‌పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ చర్యపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు దృష్టికి తీసుకొచ్చింది. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తటస్థంగా ఉండాల్సింది పోయి పక్షపాతంగా వ్యవహరించారని తెలిపింది. ఈ మేరకు కోవింద్‌కు లేఖ రాసింది. మార్చి 23న అలీఘర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. .. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. బీజేపీ ఘనవిజయం సాధిస్తుంది. నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతాడు. ఆయన ప్రధాని కావడం దేశానికి అవసరం’ అని వాఖ్యానించారు. కాగా, గవర్నర్ వ్యాఖ్యలపై సీఎం అశోక్ గహ్లోత్ స్పందించారు. గవర్నర్ కల్యాణ్‌సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఇలాంటి చర్యలు ఆ పదవికి ఉన్న హుందాతనాన్ని తగ్గిస్తాయి అని విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కూడా కల్యాణ్‌సింగ్ అంటే తనకు అభిమానమని, ఎంతో సీనియర్ లీడర్ అయిన ఆయన బాధ్యతాయుత పదవిలో కొనసాగుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని ట్వీట్ చేశారు. -
మోదీని బాహాటంగా సమర్థించిన గవర్నర్
జైపూర్ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికవడం దేశానికి అవసరమని రాజస్ధాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యానించి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. రానున్న సార్వత్రి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని ఆకాంక్షించిన కళ్యాణ్ సింగ్ మనమంతా బీజేపీ కార్యకర్తలమేనన్నారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నర్ తటస్థ వైఖరి తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా తటస్ధంగా ఉండాల్సిన గవర్నర్ బీజేపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాగా గవర్నర్ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. యూపీలోని అలీగఢ్‌లో రాజస్ధాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మనమంతా బీజేపీ కార్యకర్తలమని, తిరిగి బీజేపీ విజయం సాధించాలని మనం కోరుకుంటున్నామని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాగా 1992లో బాబ్రీమసీదు విధ్వంసం జరిగిన సమయంలో కళ్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్నారు. 87 సంవత్సరాల కళ్యాణ్ సింగ్ ఆ తర్వాత కొన్నేళ్లకు పార్టీని వీడారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఆయనను రాజస్ధాన్ గవర్నర్‌గా నియమించింది. -
మాజీ సీఎంతో చేతులు కలపడం పెద్దతప్పే
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్.. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రిపై కల్యాణ్ సింగ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కల్యాణ్ సింగ్‌తో చేతులు కలపడం పెద్దతప్పని ములాయం అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ఎంపీ భగ్వతి సింగ్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ములాయం.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కల్యాణ్ సింగ్‌తో పొత్తు పెట్టుకోవడం తాను చేసిన పెద్ద పొరపాటని అంగీకరిస్తున్నానని చెప్పారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ ఆయనకు దూరమైందని తప్పును ఒప్పుకుని పార్టీకి క్షమాపణలు చెప్పానని ములాయం అన్నారు. 2002లో బీజేపీకి దూరమైన కల్యాణ్ సింగ్ రాష్ట్రీయ క్రాంతి పార్టీ పెట్టారు. 2009 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కల్యాణ్ సింగ్ పార్టీతో పొత్తుపెట్టుకుంది. దీనివల్ల తమ పార్టీకి చాలా నష్టం జరిగిందని ములాయం చెప్పారు. కాగా కల్యాణ్ మళ్లీ బీజేపీ గూటికి చేరారు. -
'అధినాయక్'పై గవర్నర్ VS గవర్నర్
కోల్‌కతా: జాతీయ గీతం జనగణమనలో 'అధినాయక్' అనే పదాన్ని తొలగించాలన్న రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ వ్యాఖ్యలపై త్రిపుర గవర్నర్ టతగట రాయ్ విబేధించారు. జాతీయ గీతంలో మార్పులో చేయగాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని, మనకు స్వాతంత్ర్య వచ్చి 67 ఏళ్లు అవుతోందని, అధినాయక్ అన్న పదం బ్రిటీష్‌కు సంబంధించినది ఎందుకు అవుతుందని త్రిపుర గవర్నర్ ట్వీట్ చేశారు. జనగణమనలోని 'అధినాయక్' అంటే బ్రిటీషర్లను కీర్తించడమేనని, ఈ పదాన్ని తొలగించాలని కల్యాణ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీకే చెందిన పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత, ప్రస్తుత త్రిపుర గవర్నర్ విబేధించారు. -
జాతీయ గీతంలో ‘అధినాయక్’ను తొలగించాలి
జైపూర్: జాతీయ గీతం ‘జనగణమన’లోని అధినాయక్ పదాన్ని తొలగించాలని రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ డిమాండ్ చేశారు. దాని స్థానంలో ‘మంగళ్’ పదాన్ని చేర్చాలన్నారు. ‘జనగణమన అధినాయక్ జయహో’ వాక్యంలో అధినాయక్ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆ పదం ఆంగ్లేయుల పాలనను పొగిడేలా ఉందని చెప్పారు. ఆ వాక్యాన్ని ‘జనగణమన మంగళ్ గాయే’గా మార్చాలని పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన రాజస్థాన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అయన మాట్లాడారు. ఈ గీతం రాసిన టాగూరు అంటే తనకు గౌరవమని, అయినా ‘అధినాయక్’ పదాన్ని తీసేయాల్సిందేనని అన్నారు. -
'యూపీలో ఐదుగురు ముఖ్యమంత్రులు'
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వమే లేదని మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నిలకల నాటి ఇప్పటివరకు 100కు పైగా మతఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పౌరులకు భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదని చెప్పారు. అత్యాచారాలు అధికమయ్యాయని అన్నారు. యూపీలో ఇప్పుడు ఐదుగురు ముఖ్యమంత్రులున్నారని వ్యంగ్యంగా అన్నారు. ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్, ఆజంఖాన్ నలుగురు ముఖ్యమంత్రులైతే.. అఖిలేష్ యాదవ్ ఐదో సీఎం అని అన్నారు. వారసత్వ రాజకీయాలను జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారని కళ్యాణ్ సింగ్ చెప్పారు.