!['యూపీలో ఐదుగురు ముఖ్యమంత్రులు'](/styles/webp/s3/article_images/2017/09/2/41407735354_625x300.jpg.webp?itok=cA2z_1Vf)
'యూపీలో ఐదుగురు ముఖ్యమంత్రులు'
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వమే లేదని మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నిలకల నాటి ఇప్పటివరకు 100కు పైగా మతఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పౌరులకు భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదని చెప్పారు.
అత్యాచారాలు అధికమయ్యాయని అన్నారు. యూపీలో ఇప్పుడు ఐదుగురు ముఖ్యమంత్రులున్నారని వ్యంగ్యంగా అన్నారు. ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్, ఆజంఖాన్ నలుగురు ముఖ్యమంత్రులైతే.. అఖిలేష్ యాదవ్ ఐదో సీఎం అని అన్నారు. వారసత్వ రాజకీయాలను జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారని కళ్యాణ్ సింగ్ చెప్పారు.