
పాట్నా: బీహార్ సీఎం నితిష్ కుమార్ (Bihar Cm Nitish Kumar) వివాదంలో చిక్కుకున్నారు.గురువారం పాట్నాలో జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌కు హాజరైనవారందరూ జాతీయ గీతం (National Anthem) ఆలాపన చేస్తుంటే సీఎం నితీష్ వింతగా ప్రవర్తించారు. పక్కన ఉన్న వారిని కదిలిస్తూ, వారితో మాట కలుపుతూ, అభివాదం చేస్తూ కనిపించారు.
ప్రస్తుతం, ఆ ఘటన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మన ముఖ్యమంత్రికి ఏమైంది? ఆయన బాగానే ఉన్నారు కదా? బాగుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని బీహార్ ప్రజలు ప్రశ్నిస్తుంటే.. నెటిజన్లు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకి ఏమైందంటే?
మార్చి 20 నుండి 25 వరకు పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సెపక్ తక్రా ప్రపంచ కప్ -2025 (SepakTakraw World Cup 2025)పోటీలు ప్రారంభమయ్యాయి. గురువారం ఈ పోటీల్ని సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన చేసిన చేష్టలతో ప్రతిపక్షాల నుంచే కాదు,రాష్ట్ర ప్రజల నుంచి విమర్శలు చేయించుకునేలా ప్రవర్తించారు.
कम से कम कृपया राष्ट्र गान का तो अपमान मत करिए मा॰ मुख्यमंत्री जी।
युवा, छात्र, महिला और बुजुर्गों को तो आप प्रतिदिन अपमानित करते ही है।
कभी महात्मा गांधी जी के शहादत दिवस पर ताली बजा उनकी शहादत का मखौल उड़ाते है तो कभी राष्ट्रगान का!
PS: आपको याद दिला दें कि आप एक बड़े प्रदेश… pic.twitter.com/rFDXcGxRdV— Tejashwi Yadav (@yadavtejashwi) March 20, 2025
అసలేమైందంటే?
సెపక్ తక్రా ప్రపంచ కప్ - 2025 ప్రారంభ వేడుకల్లో జాతీయ గీత ఆలాపన కార్యక్రమం జరిగింది. అందరూ జాతీయ గీతం ఆలపిస్తుంటే వేదికపై ఉన్న సీఎం నితీష్ మాత్రం తన పక్కనే జాతీయ గీతం ఆలాపన చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీఎం నితీష్‌కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ దీపక్ కుమార్‌ను కదిలించారు. దీంతో ఐఏఎస్ దీపక్ కుమార్.. నితీష్‌ను వద్దని వారించే ప్రయత్నించారు. బదులుగా ఇక చాలు.. చాలు అని సంజ్ఞలు చేస్తూ కనిపించారు.
మీరు ముఖ్యమంత్రన్న విషయం మరిచిపోకండి
ఈ ఘటనపై ఆర్‌జేడీ నేత,మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం సార్ మీరు ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రన్న విషయం మరిచిపోకండి. మానసికంగా, శారీరకంగా స్థిరంగా లేరు. ఈ స్థితిలో ఉండటం రాష్ట్రానికి చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలా పదే పదే బీహార్‌ను అవమానించకండి. దయచేసి జాతీయగీతాన్నైనా గౌరవించండి. మీరు ప్రతిరోజూ యువత, విద్యార్థులు, మహిళలు, వృద్ధులను అవమానిస్తారు. కొన్నిసార్లు మహాత్మా గాంధీ అమరవీరుల దినోత్సవం నాడు చప్పట్లు కొడతారు. అమరవీరులను అపహాస్యం చేస్తారు.కొన్నిసార్లు మీరు జాతీయ గీతంపై చప్పట్లు కొడతారు’అని దుయ్యబట్టారు.