పాట్నా: బీహార్ పోలీస్ కార్యక్రమంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్‌ను చేతులు జోడించి అభ్యర్థించారు.
సోమవారం బీహార్‌లో కొత్తగా నియమితులైన 1,239 మంది పోలీసు అధికారులకు అపాయింట్‌మెంట్ లెటర్లను అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్ తన ప్రసంగం మధ్యలో చేతులు జోడించి బీహార్ డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి త్వరలో మరిన్ని రిక్రూట్‌మెంట్‌లు జరిగేలా చూస్తారా? అని అడిగారు.
సీఎం నితిష్ కుమార్ విజ్ఞప్తితో డీజీపీ అలోక్ రాజ్ మెరుపు వేగంతో స్పందించారు. వేదికపై కూర్చొన్న డీజీపీ ఒక్కసారి లేచి సెల్యూట్ చేశారు. వెంటనే నితీష్ కుమార్ లేదు ముందు మీరు పోలీస్ రిక్రూట్‌మెంట్ త్వరగా చేస్తారా? అని మరోసారి అడిగారు. అందుకు డీజీపీ స్పందిస్తూ.. సీఎం నితీష్ ఆదేశాలను అమలు చేసేందుకు బీహార్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. త్వరలో పోలీసు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తాం’ అని అన్నారు.
వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతవారం బీహార్ ప్రతిపక్ష ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగనన్ని దారుణాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. కానీ చర్యలు లేవు. ఫిర్యాదు చేస్తే విచారణ శూన్యం. ప్రజలకు న్యాయం జరగదు. ఇకపై సీఎం నితీష్ కుమార్ బీహార్‌ను నడపలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం నితీష్ కుమార్ డీజీపీ అలోక్ రాజ్ పోలీస్ రిక్రూట్ మెంట్ జరిగేలా చూడాలని కోరుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment