
ఢిల్లీ: ఏపీకి పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లు ఎంత పొగిడినా ఏపీ ప్రత్యేకంగా నిధులేమి ఇవ్వలేదని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజల ఆశలను నీరు గార్చారన్నారు రామకృష్ణ. ‘ చంద్రబాబు ఎన్నికల వాగ్దానాలే నెరవేర్చలేక పోతున్నారు.
రాజధాని కోసం లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ప్రజలపై భారం మోపుతున్నారు. వెనుకబడిన ప్రాంతా అభివృద్ధిపై చంద్రబాబుకు శ్రద్ధలేదు. కర్నూలు. కడప విమానాశ్రాయల ఆదాయం తగ్గిపోయింది. ఏపీ విభజన చట్టలోని స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా అమలు చేయాలని అడగలేదు. అందరినీ కలుపుకని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన చట్టంలోని హామీలను సాధించాలి’ అని రామకృష్ణ సూచించారు.