సాక్షి, అమరావతి : సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిపై అంతరాష్ట్ర, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేస్తున్న విమర్శలు ఖండించారు. ప్రభుత్వ సలహాదారులు ఏ విధంగా సలహాలు, సూచలనలు ఇవ్వాలో తమకు తెలుసని, రామకృష్ణ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం తమకు లేదని హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం అమర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
‘సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ సలహాదారుల మీద చేసిన వ్యాఖ్యలు చదివాను. సలహాదారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు పత్రికా ప్రకటన ద్వారానో, వీధి ప్రదర్శనల ద్వారానో ప్రకటించే విధంగా ఉండవు. అధికారంలో భాగస్వామ్యం కోసమో, చట్ట సభల్లో సొంత శక్తితో వెళ్లలేక అధికార పక్షాల మొప్పు కోసమో, లేదా ఇతర ప్రయోజనాల కోసం చేసే ప్రదర్శనలు కావు. ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ప్రజా బాహుళ్యానికి మంచి చేసేందుకు ప్రభుత్వానికి అవసరమైన రీతిలో, తగిన సమయంలో ఇచ్చే విధంగా ఉంటాయి. ఇవ్వనీ రామకృష్ణ లాంటి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదు. సీపీఐని కొంతైనా మెరుగుపరిచేందుకు ఎవరైనా మంచి సలహాదారుడిని వెతుక్కోవాలని నా సూచన’ అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment