ramakrishana
-
పోలీసుల బ్రెయిన్.. అదిరిన ప్లాన్.. కాపాడిన ట్రాఫిక్ క్రేన్..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో మొరాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రేన్ సాయంతో అంబులెన్స్‌ను అక్కడి నుంచి తరలించి యువకుడి ప్రాణాలు కాపాడిన ఘటన నల్లకుంట పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయేంద్ర ప్రసాద్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం ఓ అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాత్రి 9 గంటల సమయంలో హబ్సిగూడ చౌరస్తా వద్దకు అంబులెన్స్ మొరాయించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నల్లకుంట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై నిరంజన్, ఏఎస్ఐ వెంకటేశ్వర రావును అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ సిబ్బంది అంబులెన్స్‌ను తోసుకుంటూ సిగ్నల్స్ వద్ద నుంచి ముందుకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో చూడగా 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. చలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు ఎలాగైనా యువకుడిని ఆస్పత్రికి తరలించాలనే తపనతో వెంటనే ట్రాఫిక్ క్రేన్‌కు అంబులెన్స్ కట్టి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అది సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వరకు చేరుకోగానే మరో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. గాయపడిన యువకుడిని అందులోకి మార్చి ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరుకు నెటిజనులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. -
నందమూరి రామకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ఆయన తన కారును డ్రైవ్ చేసుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్10 మీదుగా వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. (చదవండి: తెలంగాణ కొత్త సెక్రటేరియల్ ప్రారంభోత్సవం వాయిదా) -
రామకృష్ణ, నారాయణ చంద్రబాబుకు అమ్ముడుపోయారు : పేర్ని నాని
-
రామకృష్ణపై దేవులపల్లి అమర్ ఫైర్
సాక్షి, అమరావతి : సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిపై అంతరాష్ట్ర, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేస్తున్న విమర్శలు ఖండించారు. ప్రభుత్వ సలహాదారులు ఏ విధంగా సలహాలు, సూచలనలు ఇవ్వాలో తమకు తెలుసని, రామకృష్ణ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం తమకు లేదని హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం అమర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ సలహాదారుల మీద చేసిన వ్యాఖ్యలు చదివాను. సలహాదారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు పత్రికా ప్రకటన ద్వారానో, వీధి ప్రదర్శనల ద్వారానో ప్రకటించే విధంగా ఉండవు. అధికారంలో భాగస్వామ్యం కోసమో, చట్ట సభల్లో సొంత శక్తితో వెళ్లలేక అధికార పక్షాల మొప్పు కోసమో, లేదా ఇతర ప్రయోజనాల కోసం చేసే ప్రదర్శనలు కావు. ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ప్రజా బాహుళ్యానికి మంచి చేసేందుకు ప్రభుత్వానికి అవసరమైన రీతిలో, తగిన సమయంలో ఇచ్చే విధంగా ఉంటాయి. ఇవ్వనీ రామకృష్ణ లాంటి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదు. సీపీఐని కొంతైనా మెరుగుపరిచేందుకు ఎవరైనా మంచి సలహాదారుడిని వెతుక్కోవాలని నా సూచన’ అని లేఖలో పేర్కొన్నారు. -
దేశం అన్ని రంగాల్లో కుంటుపడింది
-
‘రాయితీ సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారు’
సాక్షి, విజయవాడ: బీజేపీ విధానాలతో దేశంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీవీకే భవన్లో ‘కార్పొరేట్లకు వరాలు -సామాన్యులపై భారాలు’ అనే అంశంపై వామపక్షాల సదస్సు జరిగింది. బీజేపీ విధానాలను వామపక్షాలు ఎండగట్టాయి. ఈ సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ..ఆర్థిక మాంద్యం తో అన్ని రంగాలు కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మాంద్యాన్ని కూడా కార్పొరేట్లకు రాయితీలతో అనుకూలంగా మారుస్తున్నారని విమర్శించారు. ధనిక వర్గాలకు మోదీ ప్రభుత్వం ఊడిగం.. అన్ని ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్సంస్థలను ప్రోత్సహిస్తున్నారన్నారు. డబ్బున్న వర్గాలకు మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ధ్వజమెత్తారు. అంబానీ, ఆదానీలు వేలకోట్లకు పడగ లెత్తుతున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తుందని.. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని ప్రస్తావించారు.16న కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త రాస్తారోకోలో భాగంగా విజయవాడలో రాస్తా రోకో నిర్వహిస్తున్నామని తెలిపారు. దసరాకు కొట్టొచ్చినట్టు కనబడింది: మధు ఆర్థిక మాంద్యం తీవ్రత దసరా పండుగకు కొట్టొచ్చినట్టు కనబడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 10 శాతం నిరుద్యోగం నమోదయిందన్నారు. బ్యాంకుల వద్ద సొమ్ము తీసి కార్పొరేట్ రంగానికి రాయితీలు ప్రకటించారని మండిపడ్డారు. పన్నులు తగ్గించి, రాయితీలు ప్రకటించడం వలన ప్రభుత్వానికి రాబడి తగ్గిపోతుందన్నారు. రాయితీలలో వచ్చిన సొమ్ము భారతదేశంలో పెట్టుబడి పెట్టడం లేదని.. విదేశాలకు తరలిస్తున్నారన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించిన రాయితీల వలన మాంద్యం మరింత అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని సూచించారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి... కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని.. ప్రభుత్వ పనులకు నిధులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 21 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ నిలిపివేయాలన్నారు. 100 శాతం విదేశీ పెట్టుబడులు వాపసు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, ఆత్మహత్యలు నిరోధించాలన్నారు. దేశవ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు పెన్షన్ 3 వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. -
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు రిమాండ్
సాక్షి, గుంతకల్లు: రైల్ రోకో కేసులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు వారం రోజుల రిమాండ్ విధిస్తూ గుంతకల్లు రైల్వేకోర్టు స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ టి.వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు. రైతాంగ సమస్యలపై కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి 2008 జూలై 7న అనంతపురం రైల్వేస్టేషన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాటమయ్య, జాఫర్లు రైల్ రోకో చేశారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు రైల్వే యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. గుంతకల్లు రైల్వే కోర్టు స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో తొమ్మిదేళ్ల పాటు విచారణ కొనసాగగా..2017లో కాటమయ్య, జాఫర్‌ల పేర్లను న్యాయస్థానం కొట్టివేసింది. కేసు వాదనలు జరుగుతున్న సమయంలో రామకృష్ణ కోర్టుకు సక్రమంగా హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి 2017 జూన్ 15న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దాన్ని కూడా రామకృష్ణ తీసుకోలేదు. ఈ క్రమంలో బుధవారం రైల్వేకోర్టులో రామకృష్ణ హాజరయ్యారు. ఆయన నిర్లక్ష్య వైఖరికి వారం రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రామకృష్ణను అనంతపురం సబ్ జైలుకు తరలించారు. -
ఆడదన్నవాళ్లే అభినందిస్తున్నారు
‘‘ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉంటనే సినిమా చూడటానికి థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని దర్శకుడు హర్ష కొనుగంటి అన్నారు. తేజస్ కంచర్ల, దక్షా, ప్రియా వడ్లమాని, రమ్య, తేజ్, అభినవ్, దినేష్ ముఖ్యతారలుగా ‘హుషారు’ అనే చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. ఇందులో రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర చేశారు. వచ్చే నెల 1కి ఈ సినిమా 50రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు హర్ష మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నా సినిమా 50 రోజుల పూర్తి చేసుకోబోతుండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఈ శుక్రవారం ఓ వేడుక నిర్వహించాలనుకుంటున్నాం. ఈ సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత సరిగ్గా ఆడదని చాలామంది నాతో అన్నారు. అయినప్పటికీ నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నటీనటులందరూ బాగా నటించారు. రథన్ మంచి మ్యాజిక్ ఇచ్చారు. ఎవరైతే ఈ సినిమా ఆడదు అన్నారో రిజల్ట్ వచ్చిన తర్వాత వారే శుభాకాంక్షలు చెప్పారు. మా టార్గెట్ ఆడియన్స్ యూత్ అనుకున్నాం. వాళ్లు మళ్లీ మళ్లీ మా సినిమాను చూశారు. ఇందులో ‘ఉండిపోరాదే’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాట బాగుందని అల్లు అర్జున్‌గారు ట్వీట్ చేయడం హ్యాపీ. ఈ సినిమా తమిళం, హిందీలో రీమేక్ కాబోతుంది. నేను డైరెక్ట్ చేయడం లేదు. నా నెక్ట్స్ మూవీ కోసం రెండు సబ్జెక్ట్స్‌ను అనుకుంటున్నాను. ఇందులో ఒక యూత్‌ఫుల్ మూవీ ఉంది. విజయ్ దేవరకొండకు వినిపించాలనుకుంటున్నాను’’ అని అన్నారు. -
రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం: రామకృష్ణ
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి పది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రచారంలో తప్ప... రాష్ట్రంలో అభివృద్ధి ఏమి జరగలేదని అన్నారు. ఎన్నికల స్టెంట్లో భాగంగానే చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నాడని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పని చేస్తున్నాడని అన్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
మోదీ రాకను నిరసిస్తూ నిరసనలు
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను నిరసిస్తూ జనవరి ఐదున రాష్ట్ర వ్యాప్యంగా వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బుధవారం జరిగిన 9 వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆయన మండిపడ్డారు. ఈనెల 28న కరువు బంద్‌ను పాటిస్తున్నట్లు వివిధ పార్టీల నేతలు ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామకృష్ణ ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఏడు యూనివర్సిటీలకు వీసీలు లేరని, 60 శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమపై కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విభజన హామీల అమలు కోసం జనవరి 4న పార్లమెంట్ ముందు ధర్మా చేస్తున్నట్లు మధు ప్రకటించారు. -
ఔను... వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు
సాక్షి, మధిర: గతంలో ఉప్పు, నిప్పుగా ఉండే ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు నేడు ఒకే పార్టీలో ఉన్నారు. ఎర్రుపాలెం మండలానికి చెందిన భద్రాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. గతంలో అయిలూరి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడుకానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పుడుకానీ ప్రత్యర్థి వర్గంగా టీడీపీకి చెందిన చావా రామకృష్ణ ఉన్నారు. ఆ మండలం లో ఈ రెండు వర్గాల మధ్య గ్రూపు తగాదా లు, పార్టీల విభేదాలు ఉండేవి. ప్రతీ గ్రామంలో వారిరువురికీ అనుచరులు ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల వర్గీయునిగా కొనసాగుతున్న చావా రామకృష్ణ, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరునిగా ఉన్న అయిలూరి వెంకటేశ్వరరెడ్డి వేర్వేరు సందర్భాల్లో టీఆర్ఎస్ చేరారు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి చొరవతో ఆ ఇద్దరు నాయకులు ఎర్రుపాలెం మం డలంలో టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో ప్రత్యర్థివర్గాలుగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉండి కమల్‌రాజ్ గెలుపుకోసం ఒకే వాహనంలో తిరుగుతూ ప్రచారం చేయడం గమనార్హం. మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేకత ఉంది. ఆ మండలంలో ఏ అభ్యర్థికి మెజార్టీ వస్తుందో ఆ అభ్యర్థే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సం దర్భాలు ఉన్నాయి. దీంతో అయిలూరి వెంకటేశ్వ రరెడ్డి, చావా రామకృష్ణ కమల్‌రాజ్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఇప్పటికే చావా రామకృష్ణకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అప్పగించగా రాబోయే ప్రభుత్వంలో అయిలూరికి సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి హామీ ఇచ్చినట్లు సమాచారం. బుధవారం మధిరలో కమల్‌రాజ్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారిద్దరూ కోర్టు ఆవరణలో ఉన్న వేపచెట్టుకింద కూర్చొని రాజకీయ పరిస్థితుల గురించి చర్చించు కోవడం గమనార్హం వారిద్దరి కలయికను ఆప్రాంతంలో ఉన్న వారు ఆసక్తిగా తిలకించారు. -
చంద్రబాబును ఓడించండి: సీపీఐ
మైదుకూరు(వైఎస్సార్ కడప) : ‘టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 640 మండలాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదు.. ఏ ఒక్కరికీ లబ్ధి చేకూరలేదు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది..వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. సీపీఐ జిల్లా జిల్లా మహాసభల్లో భాగంగా సోమవారం రెండో రోజు మైదుకూరులోని ఏ–1 కల్యాణ మండపంలో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా అమరావతి, పోలవరం గురించే ఆలోచిస్తూ వచ్చారన్నారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, చీప్ లిక్కర్ మాఫియాలు పేట్రేగిపోతున్నాయన్నారు. కర్నూలులో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ ఫ్యాక్టరీలో 12 మంది దుర్మరణం చెందారన్నారు. అధికారుల నుంచి ఎమ్మెల్యే, ఎంపీలు, టీడీపీ నాయకులందరూ లంచాలకు పని చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత రూ.94వేల కోట్ల రాష్ట్ర అప్పును చంద్రబాబునాయుడు రూ.2.49 లక్షల కోట్లు చేశారని, ఈయనకు అప్పులు చేయటమే తెలుసని, ప్రజలకు మేలు చేయటం తెలియదన్నారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించారని, దీంతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. టీవీలు, పేపర్లలో గొప్ప ప్రకటనలు తప్ప చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం 90శాతం కార్పొరేట్ మీడియాను చేతిలో పెట్టుకుని అధిక ప్రచారం చేయించుకుని, ప్రజలను మభ్యపెట్టి గెలిచారన్నారు. నిరుద్యోగులందరికి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి యువతకు పంగనామం పెట్టారన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ ప్రభావంతో 2.64 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, కోట్లాది ఉద్యోగులు వీధినపడ్డారన్నారు. వేల కోట్లు రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ, లలిత్‌మోదీలు విదేశాల్లో జీవిస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు, జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవులు వెంకటరమణ, పులి కృష్ణమూర్తి, ఎంవీ సుబ్బారెడ్డి, నాగసుబ్బారెడ్డి, చంద్ర, శేఖర్, వెంకటేష్, శివ, స్థానిక నాయకులు పి.శ్రీరాములు, షావల్లి, పుల్లయ్య, బీఓ రమణ, మహిళా నాయకురాలు మున్నీ, బండి అరుణ తదితరులు పాల్గొన్నారు. -
‘ఏన్డీఏ నుంచి ఆయన బయటకు రావాలి’
సాక్షి, విజయవాడ : మంత్రి పదవులు వదులుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.రామకృష్ణ ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చి ప్రత్యేక హోదాకోసం పోరాడాలన్నారు. హోదా విషయంపై విజయవాడలో ఈ నెల 19న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయలేదన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపినా, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడకపోవడం బాధాకరం అన్నారు. బీజేపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్ రాజకీయ నిర్ణయం అనడం సిగ్గుచేటని విమర్శించారు. ఏనాడు రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు రెండో రాజధాని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
'సీమకు చంద్రబాబు అన్యాయం చేశారు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో హంద్రీ-నీవా ఆయకట్టు సాధనసమితి బహిరంగలేఖ విడుదల చేసింది. సీపీఐ నేత రామకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టిసీమ పేరుతో చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేశారని సీపీఐ నేత ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులును పక్కనపెట్టి ఇంకుడు గుంతలు నిర్మించడం న్యాయమా అని ఏపీ సీఎం బాబుని ప్రశ్నించారు.