
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ఆయన తన కారును డ్రైవ్ చేసుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్10 మీదుగా వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.