
హీరో బాలకృష్ణ కెరీర్‌లోని విజయవంతమైన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1991లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ చిత్రాన్ని 4కేలో డిజిటలైజ్ చేశాం. సౌండ్‌ని కూడా 5.1 క్వాలిటీలోకి మార్చాం.
34 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటి ట్రెండ్‌కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ చిత్రాన్ని నేను నిర్మించడానికి ఎంతో సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి రుణపడి ఉంటాను. ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నామని చెప్పగానే బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావుగార్లు ఎగ్జయిట్ అయ్యారు.
ఇళయరాజాగారి సంగీతం, జంధ్యాలగారి మాటలు, పీసీ శ్రీరామ్, వీఎస్‌ఆర్ స్వామి, కబీర్ లాల్ ఛాయాగ్రహణం ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఇప్పటి వరకు 15 సినిమాలు నిర్మించినప్పటికీ నాకు మంచి గుర్తింపుని, మా శ్రీదేవి మూవీస్ పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసిన చిత్రం ‘ఆదిత్య 369’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment