ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను | AR Rahman on Abhijeet Bhattacharya's criticism for overusing technology | Sakshi
Sakshi News home page

ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను

Published Thu, Apr 17 2025 4:44 AM | Last Updated on Thu, Apr 17 2025 4:44 AM

AR Rahman on Abhijeet Bhattacharya's criticism for overusing technology

– ఏఆర్‌ రెహమాన్‌

‘‘సింగర్‌ అభిజీత్‌ అంటే నాకెంతో అభిమానం. నాపై ఎన్ని విమర్శలు చేసినా ఆయన్ను గౌరవిస్తూనే ఉంటాను. ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను. ఒక్కొక్కరికీ ఒక్కో అభి్ప్రాయం ఉంటుంది. నా పని తీరుపై ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని ఆ విధంగా బయటపెట్టారు’’ అని పేర్కొన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌. విషయం ఏంటంటే... ఏఆర్‌ రెహమాన్‌ డిజిటల్‌ టూల్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారని, దీంతో సంప్రదాయ సంగీత వాద్యకారులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని అభిజీత్‌ పేర్కొన్నారు. 

ఈ విషయంపై రెహమాన్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ...‘‘దుబాయ్‌ వేదికగా 60మంది మహిళలతో ఓ ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి ఉద్యోగాలు కల్పించి, ప్రతి నెలా జీతాలు ఇస్తున్నాను. వారికి ఆరోగ్య, జీవిత బీమా సౌకర్యాలనూ కల్పించాను. అది ‘ఛావా’ కావొచ్చు... ‘΄పొన్నియిన్‌ సెల్వన్‌’ కావొచ్చు... నా ప్రతి సినిమాలో 200 నుంచి 300 మంది వరకు మ్యూజీషియన్స్‌ ఇన్‌వాల్వ్‌ అవుతారు. కొన్ని పాటలపై 1000 మంది మ్యూజీషియన్స్‌ వర్క్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయను. సో... నా వర్కింగ్‌ స్టైల్‌పై అందరికీ అవగాహన ఉండకపోవచ్చు’’ అన్నారు.
 
అందుకే ‘వండర్‌మెంట్‌’ అని పెట్టా: రెహమాన్, ఆయన భార్య సైరా భాను విడి విడిగా ఉండటం, అలాగే ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం వంటి విషయాలు చర్చనీయాంశం కావడం పట్ల ఆ ఇంటర్వ్యూలో రెహమాన్‌ స్పందిస్తూ... ‘‘ఇది అమానవీయం. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి ఒక్కరిలోనూ ఓ ప్రత్యేకమైన గుణం ఉంటుంది. వాళ్ల ఇంట్లో వారే సూపర్‌హీరో. కానీ.. నేను సూపర్‌ హీరో అయ్యేలా చేసింది మాత్రం నా అభిమానులే. నేను ఆస్పత్రిలో చేరాననగానే ఎంతో ప్రేమతో సందేశాలు పంపారు. ఇంతమంది అభిమానం సొంతం చేసుకోవడం నాకు ‘వండర్‌’గా అనిపించింది. అందుకే నా తర్వాతి మ్యూజికల్‌ టూర్‌కి ‘వండర్‌మెంట్‌’ అని పేరు పెట్టుకున్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement