
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. గతేడాది చివర్లో తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. దాదాపు 28 ఏళ్ల తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ ఆస్పత్రి పాలయ్యారు. డీ హైడ్రేషన్‌కు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం డిశ్ఛార్డ్ అయ్యారు.
తాజాగా ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై ఆయన భార్య సైరా భాను ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నానని తెలిపారు. ఆయనకు ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరినట్లు నాకు తెలిసింది.. ఆ దేవుడి ఆశీర్వాదంతో ప్రస్తుతం బాగానే ఉన్నారని.. ఎవరూ కూడా ఆందోళనకు గురి కావొద్దని అభిమానులను కోరారు. అయితే మేమిద్దరం ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని అన్నారు. కేవలం నా ఆరోగ్య సమస్యల కారణంగానే విడిపోయామని.. గత రెండేళ్లుగా నా పరిస్థితి బాగాలేదని పేర్కొన్నారు. నా వల్ల ఆయనకు అదనపు ఒత్తిడిని గురి చేయవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని.. అందువల్ల తనను మాజీ భార్య అని పిలవవద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేసింది.
కాగా.. ఏఆర్ రెహమాన్, సైరా భాను 1995లో వివాహం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. సైరా తరపు లాయర్ వందనా షా ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా.. ఈ జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు.
రెహమాన్ సినీ ప్రయాణం
ఏఆర్ రెహమాన్.. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఎన్నో హిట్ చిత్రాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు. తెలుగులో గ్యాంగ్‌మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు పని చేశాడు. ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఛావాకు అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రస్తుతం రామ్‌చరణ్-బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనను ప్రభుత్వం.. పద్మ శ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకుగానూ రెండు ఆస్కార్లు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment