Aditya 369
-
ఆదిత్య 369 సీక్వెల్ ఫిక్స్.. హీరోగా బాలకృష్ణ కాదు!
కొన్ని సినిమాలు ఆల్‌టైమ్ ఫేవరెట్ కోవలోకి వస్తాయి. ఆదిత్య 369 మూవీ అలాంటి కేటగిరీలోకే వస్తుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ నందమూరి బాలకృష్ణ ఐకానిక్ చిత్రాల్లో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పోషించిన పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.ఆదిత్య 369కి సీక్వెల్తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్లో బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్ రాబోతుందని వెల్లడించాడు. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపాడు. ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు. ఆ రోజుదాకా ఆగాల్సిందేఈ అప్డేట్ తెలియజేయడం కోసం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ NBK అప్ కమింగ్ ఎపిసోడ్లో ఆదిత్య 369 అవతార్‌లో కనిపించనుండటం విశేషం. ఆదిత్య 999 మ్యాక్స్ ప్రత్యేక గ్లింప్ల్స్‌తో పాటు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే! కాగా భూత, భవిష్యత్ కాలాల్లోకి హీరోహీరోయిన్లు ప్రయాణిస్తే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేదే కథ! ఈ టైమ్ ట్రావెల్ కథతో సింగీతం 1991లో 'ఆదిత్య 369' అనే అద్భుతాన్ని సృష్టించాడు.చదవండి: హత్య కేసులో హీరోయిన్ సోదరి అరెస్ట్.. 20 ఏళ్లుగా మాటల్లేవ్! -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?
ఈమె తెలుగు ఓ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తెలుగునాట కథానాయికగా భలే గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో అదిరిపోయే క్లాసిక్ బ్లాక్‌బస్టర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లో దాదాపు 100కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ) పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మోహిని. హా.. అవును మీరు ఊహించింది కరెక్టే. తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ ట్రావెల్ మూవీ 'ఆదిత్య 369'. ఈ సినిమాలో నటించిన హీరోయినే ఈమె. తమిళనాడులోని తంజావుర్‌లో పుట్టి పెరిగిన ఈమె.. 1991లో 'ఈరమణ రోజావే' చిత్రంతో కథానాయికగా మారింది. అదే ఏడాది తెలుగులో వచ్చిన 'ఆదిత్య 369'లో హీరోయిన్గా చేసిన తర్వాత ఈమెకు బోలెడంత ఫేమ్ దక్కింది. 'ఆదిత్య 369' సినిమాతో పాటు 'డిటెక్టివ్ నారద', 'మామ బాగున్నావా', 'హిట్లర్' తదితర తెలుగు సినిమాల్లో మోహిని హీరోయిన్గా చేసింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కలిపి 100కి పైగా సినిమాల్లో నటించింది. 2011లో చివరగా 'కలెక్టర్' అనే మలయాళ మూవీలో నటించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఇక 1999లోనే భరత్ అనే వ్యక్తిని మోహిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నాడు. అయితే చాలారోజుల తర్వాత రీసెంట్గా ఓ ఈవెంట్లో కనిపించిన మోహినిని చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత గుర్తొచ్చి ఈమె ఆమే కదా అని మాట్లాడుకున్నారు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?) -
‘ఆదిత్య 999’ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తా: బాలకృష్ణ
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం లో వచ్చిన ఆదిత్య 369 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా ఆదిత్య 999 సినిమా చేయబోతున్నట్లు గతంలో బాలకృష్ణ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో లేదో అనునుకున్నారు. తాజాగా ‘ఆదిత్య 999’ కచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది ఆదిత్య 999 చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు స్పష్టం చేశాడు. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దాస్ కా దమ్కీ ట్రైలర్ ను హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో బాలయ్య లాంఛనంగా ఆవిష్కరించారు. ట్రైలర్ చాలా బాగుందని, విజయం తథ్యమని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రేక్షకులు మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తున్నారని తెలిపిన బాలకృష్ణ... దమ్కీ చిత్ర నటీనటులు, నిర్మాణ విలువలు బాగున్నాయని కితాబిచ్చారు. విశ్వక్ సేన్ తన తొలిచిత్రం నుంచి ఎంతో కష్టపడుతూ ఎదుగుతున్నాడన్న బాలకృష్ణ... విశ్వక్ సేన్ చిత్రాలు చూస్తే తన యుక్త వయస్సులో చేసిన సినిమాలు గూర్తొచ్చాయని ప్రశంసించారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న దమ్కీని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని విశ్వక్ సేన్ వెల్లడించారు. -
గతంలోకి వెళ్లాలనుందా..? ఈ సినిమాలు చూసేయండి..
Telugu Time Travel Movies And Web Series: భారతీయ సినీ ప్రపంచంలో అనేక రకాల సినిమాలు వచ్చాయి. అందులో ఎన్నో రకాల జోనర్లు ఉన్నాయి. అది ఏ జోనరైనా సరే ఆ జోనర్‌కు తగినట్టు చూపిస్తే చాలనుకుంటాడు సగటు సినీ ప్రేమికుడు. అలా ప్రేక్షకులు నచ్చే మెచ్చే జోనర్లలో ఒకటి 'టైమ్ ట్రావెల్' జోనర్. కాలంతో పాటు ప్రయాణం చేసే కథలు చాలా అరుదుగానే వస్తుంటాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే అంతా ఆశామాషీ కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్, బోలెడంత బడ్జెట్‌తో పాటు ప్రేక్షకుడిని కన్విన్స్ చేసేలా కూడా ఉండాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' నుంచి ఇటీవల వచ్చిన అద్భుతం సినిమా వరకు అలరించిన టైమ్ ట్రావెల్ చిత్రాలను చూద్దాం. 1 - ఆదిత్య 369 నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఆదిత్య 369 చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలి టైమ్ ట్రావెల్ చిత్రం. ఇందులో కృష్ణ కుమార్, శ్రీ కృష్ణదేవరాయలుగా రెండు పాత్రల్లో బాలకృష్ణ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 18, 1991లో విడుదలైన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను హాలీవుడ్ చిత్రం 'బ్యాక్ టూ ఫ్యూచర్', హెచ్.జి. వెల్స్ రచించిన 'టైమ్ మేషీన్' పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. 2 - 24 తమిళ స్టార్ హీరో సూర్య మూడు విభన్న పాత్రలతో మెప్పించిన చిత్రం 24. ఈ సినిమాను వైవిధ్య చిత్రాల దర్శకుడు కె. విక్రమ్ కుమార్ తెరకెక్కించారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వాచ్ రిపేరర్, సైంటిస్ట్, విలన్‌గా సూర్య అదరగొట్టారు. ఇందులో వాచ్ రూపంలో టైమ్ మేషీన్ ఉంటుంది. ఆ వాచ్‌ను రిపేర్ చేసే క్రమంలో టైమ్ మేషీన్ ద్వారా సూర్య గతంలోకి ప్రవేశిస్తాడు. 3- ప్లే బ్యాక్ గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్ లైన్ ద్వారా కనెక్షన్ ఏర్పడితే ఎలా ఉంటుందనేదే 'ప్లే బ్యాక్' సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద పనిచేసిన హరిప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో దినేష్, అనన్య ప్రధానపాత్రల్లో నటించారు. వీరిలో ఒకరు 1993లో బ్రతికుంటే, మరొకరు 2019 కాలంలో జీవిస్తూ ఉంటారు. అయితే 26 ఏళ్ల టైమ్ గ్యాప్ ఉన్న ఈ పాత్రల మధ్య సంబంధం ఏంటీ ? ఫోన్ కాల్స్ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో అని తెలిపేదే కథ. ఈ సినిమా ప్రస్తుతం 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 4 - అద్భుతం తేజ సజ్జా, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం అద్భుతం. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ఇద్దరు ఒక ఫోన్ కాల్‌తో విరమించుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకే మొబైల్ నంబర్‌తో ఫోన్ కాల్ వస్తుండంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా ప్రారంభమైన సినిమా వాళ్లిద్దరూ వేరు వేరు సంవత్సరంలో జీవిస్తున్నారని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మూవీలో 26 సంవత్సరాలు టైమ్ గ్యాప్ ఉంటే ఇందులో ఐదేళ్ల గ్యాప్ ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలను మార్చే నేపథ్యంతో సాగుతుందీ సినిమా. ఈ చిత్రం నవంబర్ 19, 2021లో హాట్‌స్టార్‌లో విడుదలైంది. 5 - ఆ ! దర్శకుడిగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రం ఆ !. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో నాని, ప్రశాంత్ తిపిర్నేని నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్ర, శ్రీనివాస్ అవసరాల, ప్రియ దర్శిని, మురళి శర్మ నటించగా, రెండు పాత్రలకు నాని, రవితేజ వాయిస్ ఇచ్చారు. అయితే ఈ సినిమా పూర్తి తరహా టైమ్ ట్రావెల్ చిత్రం కాదు. కానీ ఇందులో వాచ్మెన్ శివ పాత్ర సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు. సైంటిస్ట్ అయి టైమ్ మేషీన్ కనిపెట్టి ఎప్పుడూ చూడని తన తల్లిదండ్రులను కలవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతని దగ్గరికి భవిష్యత్తు నుంచి పార్వతి అనే పాత్ర వస్తుంది. ఇలా ఈ పాత్రల ద్వారా టైమ్ ట్రావెల్‌ను చూపించాడు దర్శకుడు. అయితే పార్వతికి, శివకు ఉన్న రిలేషన్ ఏంటనేది మాత్రం సినిమాలో బెస్ట్ ట్విస్ట్. 6 - కుడి ఎడమైతే టైమ్ ట్రావెల్ జోనర్లో వచ్చిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. అమలాపాల్, ఈశ్వర్ రచిరాజు, రాహుల్ విజయ్ నటించిన ఈ వెబ్ సిరీస్‌లో టైమ్ లూప్ (Time Loop) గురించి వివరించారు. ఒకే సమయంలో ఆగిపోవడం. అంటే పాత్రలు, సంభాషణలు, సంఘటనలు రిపీట్ అవుతుంటాయన్నమాట. మల్టీపుల్ స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథతో ఆకట్టుకున్నాడు దర్శకుడు పవన్ కుమార్. -
బాలయ్య క్లారిటీ.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా?
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరపై ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మోక్షజ్ఞను తెర మీద చూసేందుకు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ నటించిన తొలి సైన్స్ ఫిక్ష్‌న్ మూవీ ‘ఆదిత్య 369’ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాలయ్య మరో సారి ఈ చిత్ర స్వీక్వెల్ పై స్పందిస్తూ పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నారు. ‘ఆదిత్య 369’ సినిమాకు సంబంధించి బాలయ్య మీడియాతో ముచ్చటించారు. అందులో.. ఈ సినిమాకు సీక్వెల్‌ను 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు, ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పారు. అయితే ఇంకా దర్శకుడిని ఖరారు చేయలేదని చెబుతూ.. తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు. కాగా ‘ఆదిత్య 369’ చిత్రం అప్పట్లోనే ఓ రేంజ్ గ్రాఫిక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయంతో నెవ్వర్ బిఫోర్ అనేలా ‘ఆదిత్య 999’ మ్యాక్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మరో రెండేళ్ల సమయం పడుతుందని ఆయన తెలిపారు. దీని బట్టి చూస్తే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం.. ఇంకో రెండేళ్లు వెయిట్ చెయ్యాలని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా గతంలో బాలయ్య.. తాను నటించిన ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌తో మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. -
ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?
గడియారం గిర్రున వెనక్కి తిరిగితే... ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి రావచ్చు... గిర్రున ముందుకు తిరిగితే... ఫ్యూచర్‌ని చూడొచ్చు. ఇంగ్లిష్ సినిమాల్లో ఇలాంటి కథలు కామన్. తెలుగు ప్రేక్షకులకూ పాస్ట్నీ, ఫ్యూచర్‌నీ చూపించిన ఘనత ‘ఆదిత్య 369’ది. అప్పట్లో గ్రాఫిక్స్ సౌకర్యం లేని రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అంటే చిన్న విషయం కానే కాదు. అందుకే తొలి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ క్లాసిక్‌గా నిలిచిపోయింది. నేటి (జూలై 18)తో ఈ చిత్రానికి 30 ఏళ్లు. ఈ టైమ్ ట్రావెల్ కథ పట్టాలెక్కడానికి ముఖ్య కారణం ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 30 ఏళ్లయిన సందర్భంగా హీరో బాలకృష్ణ – దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.. ముగ్గురూ బాలూని తలుచుకున్నారు. ఇక ‘ఆదిత్య 369’ గురించి ఈ ముగ్గురూ ఏం చెప్పారో తెలుసుకుందాం. విమానం స్మూత్‌గా వెళుతోంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పక్క పక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. ఈ ట్రావెల్ టైమ్‌లో ఎస్పీబీకి తన మనసులో ఉన్న ట్రావెల్ మిషన్ స్టోరీ చెప్పారు సింగీతం. ఎస్పీబీ ఎగ్జయిట్ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ఈ విషయం గురించి సింగీతం మాట్లాడుతూ – ‘‘ఆ రోజు నేను ఎస్పీబీగారిని కలవకపోతే ఈ సినిమా ఉండేది కాదేమో. అలాగే శ్రీ కృష్ణదేవరాయలు పాత్రను బాలకృష్ణగారు చేయకపోతే సినిమా లేదని కథ చెప్పినప్పుడే కృష్ణప్రసాద్‌గారు అన్నారు. అయితే టైం మెషిన్‌ను తాను కనిపెట్టినట్లు చెప్తున్నారని, కానీ, హెచ్‌జీ వెల్స్ అనే రైటర్ రాసిన ది టైమ్ మెషిన్ అనే పుస్తకం తనకు కాలేజీ రోజుల నుంచే స్ఫూర్తి అని సింగీతం అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా టీం పంచుకున్న విశేషాలు కింద వీడియోలో ఉన్నాయి. ఎస్పీబీతో బాలకృష్ణ, శివలెంక బాలకృష్ణగారికి నేను 30 నిమిషాల పాటు కథ చెబితే, ‘నాన్నగారు (ఎన్టీఆర్) కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకూ చేయాలని ఉంది’ అని 30 సెకన్లలో సినిమాకి ఓకే చెప్పారు. అప్పటికి ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’. టైమ్ మెషీన్ నేపథ్యంలో సాగే సినిమా. ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ నిర్మించడానికి ముందుకు వచ్చారు కృష్ణప్రసాద్‌గారు. ప్రతి సినిమా పునః పుట్టినరోజు చేసుకుంటుంది. అయితే, ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే... ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగితే మేం ఇండియాలో లైవ్ లో చూశాం. ఆ తర్వాత చాలామంది ఫోన్ చేసి, ‘సార్.. మీరు ఆ రోజు ‘ఆదిత్య 369’లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజు జరిగింది’ అన్నారు. సినిమాలో పోలీస్ స్టేషన్‌ను ఫైవ్ స్టార్ హోటల్‌లా చేశాం. అదింకా రాలేదు. ఎయిర్ ట్రాఫిక్ గురించి చెప్పాం. అదింకా రాలేదు. భవిష్యత్తులో అవన్నీ వస్తాయి. నేను ఎన్నో సినిమాలు చేశాను. అయితే అవి ఈ రోజులకు అన్వయించుకునే సినిమాలు కాదు. ఈ ఒక్క ‘ఆదిత్య 369’ను మాత్రం అన్వయించుకోవచ్చు’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది శివైక్యమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గురించి. ఆయనే మా సంధానకర్త. ఇటువంటి సినిమా చేయడానికి నిర్మాతకు ధైర్యం ఉండాలి. దర్శకుడికి ప్యాషన్ ఉండాలి. హీరోకి ప్యాషన్, ధైర్యంతో పాటు దాని గురించి అవగాహన ఉండాలి. మేం ట్రెండ్ సెట్టర్స్ అనుకోండి. ఇటువంటి సినిమా ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. అప్పట్లో ‘ఆదిత్య 369’ చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ సినిమాకు గుండెకాయ శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. గ్రాఫిక్స్ లేని రోజుల్లో మొట్టమొదటిసారి వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి... సినిమా నెగటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. కృష్ణ్ణప్రసాద్‌గారు ‘ఆదిత్య 369’ తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. అలాంటి నిర్మాత ఇండస్ట్రీకి అవసరం. ముందు ముందు ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు. బాలకృష్ణ, సింగీతం, శివలెంక కృష్ణప్రసాద్ శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో తొలి సినిమా ‘చిన్నోడు పెద్దోడు’ విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న సమయంలో బాలు (ఎస్పీబీ) అంకుల్ ‘కృష్ణా.. ఓ పెద్ద సినిమా చెయ్. నేను హీరోలతో మాట్లాడతాను’ అన్నారు. సింగీతంగారిని కలమన్నారు. కలిస్తే.. ఆయన ‘ఆదిత్య 369’ కథ చెప్పారు. టైమ్ ట్రావెలింగ్ కథ. భారతీయ తెరపై రాని కథాంశంతో సినిమా తీయడం ఒక రకమైన సాహసమని సింగీతంగారితో అన్నాను. బాలు అంకుల్ అయితే ‘భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్‌లా నిలబడుతుంది’ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో సింగీతంగారితో ఈ సినిమా చేస్తా’ అన్నాను. కథ విని, ‘ఆదిత్య 369’ని బాలకృష్ణగారు చేయాలనుకోవడం నా అదృష్టం అనుకోవాలి. 1990లో ఈ సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయ్యాక పీసీ శ్రీరామ్ గారికి సుస్తీ చేసింది. దాంతో కెమెరామేన్ వీఎస్సార్ స్వామిగారితో బాలకృష్ణగారు మాట్లాడారు. అలా... వర్తమానంలో నడిచే సీన్లకు పీసీ శ్రీరామ్, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సన్నివేశాలకు వీఎస్సార్ స్వామిగారు, భవిష్యత్తును చూపించే సీన్లకు కబీర్ లాల్ ఛాయాగ్రాహ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్ర కళాదర్శకుడు పేకేటి రంగాగారికి, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన సాంబ శివరావుగారికి నంది అవార్డు వచ్చింది. గౌతమ్ రాజుగారి ఎడిటింగ్, ఇళయరాజాగారి మ్యూజిక్, బాలు అంకుల్, జానకిగారు, జిక్కీ గార్ల గానం.. అన్నీ అద్భుతం. అయితే బడ్జెట్ పరంగా అనుకున్నదానికంటే పెరిగితే బయ్యర్లు సహకరించారు. వ్యాపారంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బు సంపాదిస్తాం. కానీ, పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ‘ఆదిత్య 369’ వల్ల నాకు వచ్చిన గౌరవం 50 ఏళ్లయినా ఉంటుంది. టాప్ 100 సినిమాల్లో ఈ సినిమా ఒకటి కావడం నా అదృష్టం’’ అన్నారు. -
సైన్స్ ఈస్ట్‌మన్ కలర్లో..
సైన్సు క్లాసు పిల్లలకు విజ్ఞానం. సినిమా వాళ్లకు వినోదం. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సైన్సు ఆధారంగా తయారైన తెలుగు సినిమాలెన్నో. నేడు నేషనల్ సైన్స్ డే సందర్భంగా... ఆదివారం ప్రత్యేకం హాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ తీయడం క్షణాల్లో పని. వారు కథలు ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. ఆత్రేయ ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని రాశారు. హాలీవుడ్ వాళ్లు కలల్లోకి వెళ్లడాన్ని కూడా తీసుకుని సినిమాలు తీశారు. ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్’ అనే ఒక సినిమాలో హీరో హీరోయిన్ ఇక మన మధ్య ప్రేమ వద్దు అనుకుంటారు. బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిపోయినా పాత జ్ఞాపకాలు మాత్రం ఉంటాయి కదా. ఆ జ్ఞాపకాలు మాత్రం ఎందుకు అనుకుని ఒక టెక్నాలజీ ద్వారా ఆ జ్ఞాపకాలన్నీ ఇద్దరూ చెరిపేసుకుంటారు. ఆ తర్వాత ఏమయ్యింది అనేది కథ. చూడండి ఎంత బాగా ఆలోచించారో. తెలుగులో ఈ స్థాయి ఆలోచన రావడానికి చాలా కాలం పడుతుంది. కాని తెలుగు ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తమిళ భాషల్లో సైన్స్‌ని కమర్షియల్ సినిమాకు బాగానే ఉపయోగించుకున్నారు. తెలుగులో జేమ్స్‌బాండ్ తరహా క్రైమ్ సినిమాలు మొదలయ్యాక సైన్సు, సైంటిస్టు అనే మాటలు ప్రేక్షకులకు ఎక్కువగా వినిపించడం మొదలయ్యాయి. ఒక సైంటిస్ట్ ఏదో ఫార్ములా కనిపెడతాడు. దాని కోసం విలన్ వెంటపడతాడు. ఆ సైంటిస్ట్ కూతురు తండ్రి కోసం వెతుకుతుంటుంది. హీరో సాయం చేస్తాడు. మనకు సైన్స్ అంటే ఒక ల్యాబ్, బుడగలు తేలే బీకర్లు మాత్రంగా చాలా కాలం సినిమాలు నడిచాయి. కాని సైన్స్‌ను లేశమాత్రంగా కథల్లో ప్రవేశ పెట్టడం మెల్లగా మొదలైంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ నటించిన ‘దొరికితే దొంగలు’ దాదాపుగా సైన్స్ ఫిక్షన్‌గా చెప్పే వీలైన తొలి తెలుగు సినిమా అనుకోవచ్చు. ఇందులో రాజనాల, సత్యనారాయణ, అల్లురామలింగయ్యలు తెర వెనుక సైంటిఫిక్ పవర్స్‌ను అడ్డుపెట్టుకొని నానా అఘాయిత్యాలు చేస్తుంటారు. చివరకు ఎన్.టి.ఆర్ వారి ఆట కట్టిస్తాడు. ఆ తర్వాతి రోజుల్లో కృష్ణ ‘రహస్య గూఢచారి’ సినిమా వచ్చింది. ఇందులో విలన్ సత్యనారాయణ విజ్ఞాన శాస్త్రాన్ని ఔపోసన పట్టి అణు రాకెట్లు తయారు చేస్తాడు. ‘ఒక మీట నొక్కితే కుంభవృష్టి కురుస్తుంది.. ఒక మీట నొక్కితే సముద్రం ఆవిరవుతుంది’ అని చెబుతాడు. అయితే సహజంగానే కృష్ణ అతణ్ణి మట్టి కరిపిస్తాడు. కాని రహస్య గూఢచారిలో విలన్ చేసిన పని మనిషి త్వరలోనే చేస్తాడనిపిస్తుంది. దర్శకుడు గీతాకృష్ణ ‘కోకిల’ అనే సినిమా తీశారు. ఇందులో ప్రమాదరీత్యా కళ్లు పోయిన హీరోకు వేరొకరి కళ్లు అమరుస్తారు. అయితే అతడు కళ్లు తెరిచినప్పటి నుంచి ఒక హత్య జరిగిన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎవరి కళ్లయితే నరేశ్‌కు పెట్టారో ఆ కళ్లు ఆఖరిసారిగా ఆ హత్యను చూశాయి. ఆ కళ్లకు ఆ మెమొరి అలా ఉండిపోయి ఆ దృశ్యం ఇప్పుడు నరేశ్‌కు కనిపిస్తూ ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా జనం ఓకే చేశారు. సినిమా హిట్ అయ్యింది. ∙∙ అయితే తెలుగువాళ్లు ఈనాటికీ గొప్పగా చెప్పుకోదగ్గ సైన్స్ ఫిక్షన్ మాత్రం ‘ఆదిత్యా 369’ సినిమాయే. టైమ్ మిషన్ ఆధారంగా అల్లుకున్న ఈ కథ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇందులో హీరో బాలకృష్ణ హీరోయిన్ను తోడు చేసుకుని టైమ్ మిషన్‌లో రాయలవారి కాలానికి వెళతాడు. ఆ తర్వాత అత్యంత రేడియేషన్ ఉండే భవిష్యత్ కాలానికి కూడా వెళతాడు. ఆ సినిమా లో వీడియో కాల్స్, సెల్‌ఫోన్ కాల్స్ లాంటివి ఊహించారు. ఆ సినిమాలో సైంటిస్ట్‌గా టిన్నూ ఆనంద్ నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా తీసినందుకు గాను దర్శకుడు సింగీతం శ్రీనివాస్ చాలా మంది ప్రేక్షకులకు మరింత ఇష్టులు అయ్యారు. దీని సీక్వెల్ గురించి ఎన్నో ప్రయత్నాలు సాగాయి కాని జరగలేదు. సైన్స్ ఫిక్షన్‌ను పెద్ద హీరోల మీద భారీగా ఉపయోగించాలి కాని కామెడీగా కాదని సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘నాని’ నిరూపించింది. ఇందులో కూడా ఒక పిచ్చి సైంటిస్ట్ చేసిన ఒక ప్రయోగం వికటించి చిన్న పిల్లాడు పెద్దవాడిగా మారడం ఆ పెద్దగా ఉన్న సమయంలో వివాహం కూడా జరిగిపోవడం ఇవన్నీ ఫన్నీగా ఉన్నా జనం మెచ్చలేదు. మహేశ్ బాబు అభినయం, ఏ.ఆర్.రెహమాన్, అమీషా పటేల్ అల్లరి సినిమాను కాపాడలేకపోయాయి. ∙∙ అదే సమయంలో తమిళం నుంచి డబ్ అయిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు తెలుగువే అన్నంత బాగా ఇక్కడ హిట్ అయ్యాయి. శంకర్ తీసిన ‘రోబో’ పెద్ద సంచలనం రేపింది. శాస్త్రం శృతి మించితే మనిషికి బానిసగా ఉండటం కాక మనిషినే బానిసగా చేసుకుంటుందని చెప్పిన ఈ సినిమా కలెక్షన్ల దుమారం రేపింది. రజనీకాంత్‌కు భారీ హిట్‌ను ఇచ్చింది. దీని కొనసాగింపుగా సెల్ టవర్ల దుష్ఫలితాలను తీసుకుని ‘రోబో2’ తీశారు కాని జనం మెచ్చలేదు. స్పష్టత కరువై ఎవరు హీరోనో ఎవరు విలనో తెలియకుండా పోయింది. హీరో సూర్య దర్శకుడు మురగదాస్‌తో కలిసి చేసిన ‘సెవెన్త్ సెన్స్’ భారతీయ సనాతన శక్తులను, శాస్త్రీయ శక్తులను చర్చించింది. ఇందులో వైరస్ చైనా నుంచి దిగుమతి అయినట్టు చూపడం మొన్న కరోనా సమయంలో చర్చకు వచ్చింది. సూర్య దర్శకుడు విక్రమ్ కుమార్‌తో తీసిన ‘24’ కూడా హిట్ అయ్యింది. ఈ సినిమా సమయాన్ని బంధించడం గురించి అందమైన ఊహ చేసింది. అలాంటి రోజులు వస్తాయేమో తెలియదు. అలాగే అంతరిక్షం కథాంశంగా వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ కూడా మంచి మార్కులే సంపాదించింది. ∙∙ సైన్స్ ఫిక్షన్ మీద తెలుగు సినిమా పెట్టుకున్న నమ్మకం అన్నిసార్లు సక్సెస్ ఇవ్వలేదు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అంతరిక్షం’ తొలి తెలుగు అంతరిక్ష నేపథ్య సినిమాగా నమోదైనా విజయం సాధించలేదు. హీరో వరుణ్‌తేజ్‌ను ఇది నిరాశ పరిచింది. ఇక విజయేంద్ర ప్రసాద్ కథతో వచ్చిన ‘శ్రీవల్లి’ సినిమా బ్రైన్ వేవ్‌ను కంట్రోల్లోకి తెచ్చుకోవడం వల్ల ఎదుటివారిని తమ అదుపులోకి తేవడం అనే అంశాన్ని చర్చించినా జనానికి కనెక్ట్ కాలేదు. పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో, రవితేజా ‘డిస్కో రాజా’లో శాస్త్రీయ అంశం కనిపించింది. సైన్స్ ఒక సముద్రం. దాని నుంచి ఎన్ని కథలైనా అల్లవచ్చు. అయితే విజ్ఞానం, వినోదం సమపాళ్లలో కలిపినప్పుడు ఆ జానర్ హిట్ అయ్యింది. భవిష్యత్తులో మంచి సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వస్తాయని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
20 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా అన్నారు
‘‘ఈ తరం ప్రేక్షకులు కూడా మీరు ‘ఆదిత్య 369’ చిత్రనిర్మాత కదా అని గుర్తుపడుతున్నారు. పాతికేళ్ల క్రితం విడుదలైన ఆ చిత్రం గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటే.. గర్వంగానూ, సంతోషంగానూ ఉంది. ఈ ఏడాది ‘జెంటిల్మన్’తో సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ కావడం నాకు డబుల్ ధమాకా’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఆదిత్య 369’ విడుదలై నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ పలు విశేషాలను పంచుకున్నారు.... ఓ రోజు బాలు అంకుల్ (ఎస్పీ బాలసుబ్రమణ్యం) ఫోన్ చేసి ‘సింగీతం ఓ కథ చెప్పారు, బాగుంది. ఆ సినిమా చేస్తే, ఇండస్ట్రీలో నీకో మంచి స్థానం ఖాయం’ అని గొప్పగా చెప్పారు. వెంటనే సింగీతంగారిని కలిశాను. ‘‘హాలీవుడ్ మూవీ ‘బ్యాక్ టు ఫ్యూచర్’ ఆధారంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కథ రాశానండీ’’ అని 45 నిమిషాల పాటు నేరేషన్ ఇచ్చారు. కథ చాలా కొత్తగా ఉంది. విపరీతంగా నచ్చేసింది అప్పటి వరకూ ఎన్టీఆర్, ఏయన్నార్‌లు మాత్రమే శ్రీకృష్ణ దేవరాయులు పాత్ర పోషించారు. ఈ కథకు బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరని సింగీతమే సలహా ఇచ్చారు. దేవి ఫిలింస్ అధినేత దేవీ వరప్రసాద్ సహాయంతో బాలయ్యను కలసి కథ వినిపించాం. కొత్త నిర్మాత, ప్రయోగాత్మక సినిమా అని ఆలోచించకుండా.. కథ నమ్మి అంగీకరించారు. ఇళయరాజా సంగీతం, జంధ్యాల రచన, తెనాలి రామకృష్ణుడిగా చంద్రమోహన్.. ఇలా మంచి టీమ్ సెట్ అయ్యింది మొదట ‘యుగపురుషుడు’ టైటిల్ అనుకున్నాం. అప్పటికి పదేళ్ల క్రితమే ఎన్టీఆర్‌గారు ఆ టైటిల్‌తో ఓ సినిమా చేశారు. నాన్నగారి టైటిల్ కంటే మరొకటి ఆలోచిస్తే బాగుంటుందని బాలయ్య కోరడంతో ‘ఆదిత్య 369’ పెట్టడం జరిగింది. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్, వియస్సార్ స్వామీ, కబీర్‌లాల్.. సినిమాటోగ్రాఫర్లు గా చేశారు. అప్పట్లో గ్రాఫిక్స్ లేవు కదా. ఆప్టికల్ పద్ధతిలోనే చిత్రీకరించాం. టైమ్ మెషీన్ తయారీకి ఐదు లక్షలు, శ్రీకృష్ణదేవరాయులిగా బాలయ్య కాస్ట్యూమ్స్, నగలకు 10 లక్షలు ఖర్చయింది. అప్పట్లో రూ. 1.20 కోట్లతో సినిమా తీస్తే సేఫ్. ఈ సినిమా బడ్జెట్ కోటిన్నర దాటింది. అన్నపూర్ణ స్టూడియోలో నాలుగు ఫ్లోర్లలో వేసిన సెట్స్ చూసి భారీ చిత్రమని అందరికీ అర్థమైంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎక్కువ రేటుకి కొన్నారు. నిర్మాతగా నాకూ, వాళ్లకీ లాభాలు వచ్చాయి. 1991 జూలై 18న సినిమా విడుదైలైంది. ‘శ్రీకృష్ణదేవరాయులిగా బాలయ్యను బాగా చూపించారు’ అని ఎన్టీఆర్‌గారు మెచ్చుకున్నారు. ఇరవై ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా. చాలా అడ్వాన్డ్స్‌గా తీశారని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసించారు ‘మంచి చిత్రం తీశారండీ’ అని చిరంజీవిగారు ప్రశంసించి, ‘పిల్లలూ మీరు మిస్ కావొద్దు’ అని ప్రత్యేకంగా ఓ ట్రైలర్లో నటించారు. విజయశాంతిగారు కూడా ట్రైలర్లో నటించారు తెలుగులో దిగ్విజయంగా వంద రోజులు ప్రదర్శింపబడిన ఈ చిత్రాన్ని తమిళంలో ‘అపూర్వశక్తి 369’ పేరుతో, హిందీలో ‘మిషన్ 369’ పేరుతో అనువదించగా.. రెండు భాషల్లోనూ విజయం సాధించింది. -
నారి నారి నడుమ నాని!
నాని మంచి ఫ్యామిలీ హీరో. పిల్లలూ, పెద్దలూ అందరూ ఇష్టపడతారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి హాయిగా సాగే కుటుంబ కథాచిత్రాలు తీస్తారు. యువతరం కూడా ఆయన చిత్రాలను ఆస్వాదిస్తారు. ఇలా యూత్‌కీ, ఫ్యామిలీస్‌కి దగ్గరైన ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ వస్తే, కచ్చితంగా విభిన్నంగా ఉంటుందని చెప్చొచ్చు. ‘అష్టా చమ్మా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ థ్రిల్లింగ్ మూవీ రూపొందుతోంది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నాని ఇద్దరు కథానాయికలతో రొమాన్స్ చేస్తారు. ఆ పాత్రలను సురభి, నివేదా థామస్ చేస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మంచి రొమాంటిక్ కథతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ సమాహారంతో సాగే ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఈ నెల 6 వరకూ సాగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడతాం. మే నెలాఖరున లేక జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. -
విహారం: వైగన్... మధ్యయుగపు అనుభూతి!
ఆదిత్య 369 సినిమా చూసినపుడల్లా... అలాంటి టైమ్ మెషీన్ ఒకటి అందుబాటులో ఉండి మనకు కూడా అలా ముందుకూ వెనక్కు వెళ్లే అవకాశం కనుక వస్తే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. ముందుకు తీసుకెళ్లలేం గాని... టైం మెషీన్ లేకుండానే వెనక్కు వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే, షరతులు వర్తిస్తాయి. ఆ అద్భుతం... వైగన్! చక్కటి వీధులు.. గుంతలు లేని, వంకరలు లేని, మరమ్మతులు అవసరం లేని ఫుట్‌పాత్‌లతో కూడిన వీధులు... వాటికి ఇరువైపులా బొమ్మలు గీసినంత అందంగా ఉండే ఇళ్లు. వీధిలో ఇవతలి ఇంటి బాల్కనీ నుంచి అవతలి ఇంటి బాల్కనీలో వ్యక్తులతో ముచ్చట్లు చెప్పుకునేలా ఓ క్రమపద్ధతిలో ఆ నిర్మాణాలు. ఇంటింటికీ అమర్చిన వీధిదీపాలు. భూగర్భ మంచినీటి, మురుగు నీటి పారుదల... కాలికి మట్టి అంటని రోడ్లు. పగలు అద్భుతంగా రాత్రి సుందరంగా ఉంటుంది ఆ చిన్న నగరం. వైగన్ నగరం... వైశాల్యంలో జనాభాలో చిన్నదే. పేరులో, ఖ్యాతిలో పెద్దది. జనాభా యాభై వేలు, విస్తీర్ణం 25 చదరపు కిలోమీటర్లు. (మన హైదరాబాదు 700 చదరపు కిలోమీటర్లు కాబట్టి అది ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి). వైగన్ ఫిలిప్పీన్స్ దేశంలో పశ్చిమోత్తరాన ఉంటుంది. దక్షిణ చైనా సముద్రానికి ఎదురుగా ఉండే ఇలాకోస్ సర్ దీవిలో తీరానికి దగ్గరగా ఉంటుంది. ఏ నగరానికి లేని అవకాశం నగరం చిన్నదే గాని విశిష్టతలు బోలెడు. పెద్ద దీవిలో ఒక చిన్న దీవి ఈ నగరం. బహుశా చాలా పెద్ద నగరాలకు కూడా లేని ఒక అద్భుతమైన అవకాశం ఈ బుల్లి నగరానికి దక్కింది. కేవలం ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల ఈ నగరానికి నలువైపులా మూడు నదులున్నాయి. అవి కూడా జీవనదులు. ఏడాదిలో 365 రోజులూ ప్రవహిస్తుంటాయి. అంతేనా... ఇంకో అద్భుతం కూడా ఉంది. నగరం నుంచి సైకిల్‌పై వెళ్లగలిగినంత దూరంలో సముద్ర తీరం ఉంది. అది దక్షిణ చైనా సముద్ర తీరం. కళ్ల ముందు మధ్యయుగపు జాడలు ఫిలిప్పీన్స్‌లోని ఈ ప్రాంతాన్ని పదహారో శతాబ్దంలో స్పానిష్‌లు పరిపాలించారు. దీంతో ఇక్కడ భవనాలు యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో ఉంటాయి. అంతేకాదు... ఇది అత్యుత్తమ ప్రణాళికతో నిర్మించిన నగరం. అందుకే వీధులు అయినా, ఇళ్లయినా చాలా చక్కగా అందంగా రూపుదిద్దబడ్డాయి. ఈ ఊళ్లో ప్రతి కట్టడానికి వందేళ్ల నుంచి ఐదువందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అంటే... ఆధునిక ఆర్సీసీ బిల్డింగులు, వోల్వో బస్సులు ఇలాంటివేవీ ఇక్కడ కనపడవు. టక్ టక్ మని తిరిగే గుర్రపు బగ్గీలు... మన వద్ద కూడా కనిపించకుండా పోయిన మరమగ్గాలు సైతం ఉన్నాయి. అవి సజీవంగా, చక్కటి ఆదాయంతో నడుస్తున్నాయి. వీధుల్లో రోడ్లన్నీ సిమెంటు, బ్లాక్ టాప్ రోడ్లు కాదు. మధ్యయుగాల నాటి రాతి రోడ్లు. విద్యుద్దీపాలు కూడా అప్పటి మోడల్లోనే ఉంటాయి. పాత భవనాలు కదా అని పాడైపోయిన స్థితిలో ఉంటాయనుకునేరు. ఇప్పటికీ ఫ్రెష్‌గా చక్కటి నిర్వహణతో హాయిగా జీవించడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఈ విశిష్టమైన నగరాన్ని యునెస్కో ‘ప్రపంచ వారసత్వపు ప్రదేశం’గా గుర్తించింది. చిన్న నగరం బోలెడు విశిష్టతలు ! శివారులను కూడా కలిపి ఈ నగరాన్ని ఓ జిల్లా కేంద్రం చేశారు. ఈ జిల్లాకు రెండే రెండు ప్రధాన ఆదాయ వనరులు. ఒకటి పర్యాటకం. రెండు వ్యవసాయం. పుష్కలమైన నదీజలాలతో 1400 హెక్టార్ల భూమిలో ఇక్కడ వ్యవసాయం కొనసాగుతోంది. దీనివల్ల ఇక్కడి ప్రజలకు అందుబాటులోనే వ్యవసాయ ఉత్పత్తులు దొరుకుతాయి. అంటే ప్రాంతం చిన్నదైనా స్వావలంబన కలిగినది. చూడదగ్గ ప్రదేశాలు.. నగరం పక్కనే అడవి. సహజసిద్ధంగా ఏర్పడిన రాళ్లే బెంచీలు. ఏపుగా పెరిగిన వెదురు చెట్లు, మనం మరెక్కడా చూడని చిన్నచిన్న కొత్త రకం మొక్కలు వంటివన్నీ కనిపిస్తాయి. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆ చిట్టడవిలో నడుస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా నగరంలో ప్రవేశ రుసుము లేని ఓ జంతు ప్రదర్శన శాల కూడా ఉంది. ఇందులో అంతరించిన రాకాసి బల్లులు ఇంకా బతికున్నాయా అన్న అనుమానం వచ్చేంతటి సహజంగా చెక్కిన రాకాసి బల్లుల బొమ్మలు ఆహ్వానం పలుకుతాయి. అక్కడ స్థానికంగా పేరు గాంచిన కొన్ని జంతువులను చూడొచ్చు. వైగన్లోని కొన్ని వీధుల్లో ఖలీసా రైడ్ (గర్రపు బగ్గీ) బాగుంటుంది. గంటన్నర ప్రయాణానికి 150 పెసోలు (ఆ దేశపు కరెన్సీ అడుగుతారు. అంటే మన కరెన్సీలో 210 రూపాయిలు. వీరికి ఇంగ్లిష్ రాదు. ఇంకా వైగన్ కాథడ్రల్, బాంటే చర్చి, సిఖియా ప్రదర్శన శాల, క్రిసోలోగో మ్యూజియం, మధ్యయుగం నాటి మట్టి కుండలు తయారుచేసే కుటీర పరిశ్రమలు, మరమగ్గాల నేతపని, బర్గోస్ నేషనల్ మ్యూజియం వంటివి చాలా ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. బీచ్ కూడా చాలా దగ్గర. ఒక్కే ఒక్క డిస్కో క్లబ్ మినహా నైట్ లైఫ్ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకమైన మనుషులు. మోసాలు తక్కువ. దాదాపు అన్ని దేశాల వారు తినదగిన రుచికరమైన తిండి దొరుకుతుంది. ఎలా చేరుకోవాలి ఈ చిన్నసిటీకి దగ్గర్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందండోయ్. గతంలో ప్రైవేటుగా వాడేవారు కానీ.. ఇపుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయ్యింది. అయితే ఇంకా వైగన్ ఎయిర్‌పోర్టుకు మాత్రం ఇపుడు ఫ్లైట్లు కావల్సినన్ని నడవడం లేదు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నుంచి ట్యాక్సీలో తొమ్మిది గంటలు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా మనీలా నుంచి లావోగ్కు విమానంలో వెళితే అక్కడి నుంచి గంటన్నర ట్యాక్సీ ప్రయాణం. అక్కడ మీరు దిగే హోటల్స్ కూడా పురాతన భవనాలే. కానీ ఇబ్బందేమీ ఉండదు. అన్ని సదుపాయాలు ఉంటాయి. -
'ఆదిత్య 369'కు సీక్వెల్
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 81 ఏళ్ల వయసులో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన గతంలో తీసిన 'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ తీసే యోచనలో ఉన్నారు. టైమ్ మిషన్ కథాంశంగా 1991లో విడుదల ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇందులో బాలకృష్ణ సరసన మోహిని హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజైన రెండు దశాబ్దాల తర్వాత సింగీతం సీక్వెల తీయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో కూడా టైమ్ మిషనే కథాంశమయినా స్ర్కీన్ ప్లే విభిన్నంగా ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి బాలకృష్ణతో త్వరలో చర్చించనున్నట్టు చెప్పారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన 'వెలకమ్ ఒబామా' సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది.