ఆదిత్య 369 సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరోగా బాలకృష్ణ కాదు! | Nandamuri Mokshagna Debut with Aditya 369 Sequel Movie | Sakshi
Sakshi News home page

Unstoppable with NBK: ఆదిత్య 369 సీక్వెల్‌.. హీరోగా బాలకృష్ణ కాదు!

Published Wed, Dec 4 2024 6:10 PM | Last Updated on Wed, Dec 4 2024 6:27 PM

Nandamuri Mokshagna Debut with Aditya 369 Sequel Movie

కొన్ని సినిమాలు ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ కోవలోకి వస్తాయి. ఆదిత్య 369 మూవీ అలాంటి కేటగిరీలోకే వస్తుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ నందమూరి బాలకృష్ణ ఐకానిక్ చిత్రాల్లో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పోషించిన పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.

ఆదిత్య 369కి సీక్వెల్‌
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ ప్రకటించారు. అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్‌ రాబోతుందని వెల్లడించాడు. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపాడు. ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు. 

ఆ రోజుదాకా ఆగాల్సిందే
ఈ అప్‌డేట్‌ తెలియజేయడం కోసం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ NBK అప్ కమింగ్ ఎపిసోడ్‌లో ఆదిత్య 369 అవతార్‌లో కనిపించనుండటం విశేషం. ఆదిత్య 999 మ్యాక్స్ ప్రత్యేక గ్లింప్ల్స్‌తో పాటు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే డిసెంబర్‌ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమయ్యే ఫుల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే! కాగా భూత, భవిష్యత్‌ కాలాల్లోకి హీరోహీరోయిన్లు ప్రయాణిస్తే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేదే కథ! ఈ టైమ్‌ ట్రావెల్‌ కథతో సింగీతం 1991లో 'ఆదిత్య 369' అనే అద్భుతాన్ని సృష్టించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement