Nandamuri Mokshagna
-
ఆదిత్య 369 సీక్వెల్ ఫిక్స్.. హీరోగా బాలకృష్ణ కాదు!
కొన్ని సినిమాలు ఆల్‌టైమ్ ఫేవరెట్ కోవలోకి వస్తాయి. ఆదిత్య 369 మూవీ అలాంటి కేటగిరీలోకే వస్తుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ నందమూరి బాలకృష్ణ ఐకానిక్ చిత్రాల్లో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పోషించిన పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.ఆదిత్య 369కి సీక్వెల్తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్లో బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్ రాబోతుందని వెల్లడించాడు. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపాడు. ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు. ఆ రోజుదాకా ఆగాల్సిందేఈ అప్డేట్ తెలియజేయడం కోసం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ NBK అప్ కమింగ్ ఎపిసోడ్లో ఆదిత్య 369 అవతార్‌లో కనిపించనుండటం విశేషం. ఆదిత్య 999 మ్యాక్స్ ప్రత్యేక గ్లింప్ల్స్‌తో పాటు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే! కాగా భూత, భవిష్యత్ కాలాల్లోకి హీరోహీరోయిన్లు ప్రయాణిస్తే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేదే కథ! ఈ టైమ్ ట్రావెల్ కథతో సింగీతం 1991లో 'ఆదిత్య 369' అనే అద్భుతాన్ని సృష్టించాడు.చదవండి: హత్య కేసులో హీరోయిన్ సోదరి అరెస్ట్.. 20 ఏళ్లుగా మాటల్లేవ్! -
బాలయ్య వారసుడి గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్‌గా ఎవరంటే?
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలి సినిమా చేయబోతున్నారు. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ ఏడాది హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. అంతకుముందు సింబా ఇజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ చాలాసార్లు హింట్ ఇస్తూ వచ్చారు. తాజాగా నందమూరి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. With great joy & privilege, Introducing you…“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁Happy birthday Mokshu 🥳 Welcome to @ThePVCU 🤗Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏 Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024 -
బాలయ్య అభిమానుల అత్యుత్సాహం..
సాక్షి, కృష్ణా జిల్లా : జిల్లాలోని కంచికచెర్లలో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులు హల్చల్ చేశారు. జాతీయ రహదారిపై బాణాసంచా కాలుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులతో పాటు తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతీయ రహదారిపై భారీ బైక్ ర్యాలీ తీశారు. అక్కడే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో స్థానికులు ఎం జరుగుతుందోనన్న ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో బైకులు హైవేపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
మోక్షజ్ఞ తెరంగేట్రం ఆ సినిమాతోనే..!
నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని భావించారు. అయితే బాలయ్య మాత్రం వారసుడ్ని పరిచయం చేసేందుకు మరింత సమయం తీసుకున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా టాలీవుడ్ లో మోక్షజ్ఞ అరంగేట్రానికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సమయంలో నందమూరి వారసుడ్ని పరిచయం చేసే అవకాశాన్ని మిస్ అయిన దర్శకుడు క్రిష్, ఎన్టీఆర్ బయోపిక్‌తో మోక్షజ్ఞను పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాల్లో మోక్షజ్ఞ, ఎన్టీఆర్‌గా కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ: బాలకృష్ణ
హిందూపురం: తన తనయుడు మోక్షజ్ఞ త్వరలో సినీ రంగ ప్రవేశం చేయనున్నట్టు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. బుధవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గం హిందూపురంలో బాలకృష్ణ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తనను ఆదరించినట్టే తన కొడుకును కూడా ఆదరించాలని ప్రేక్షకులకు బాలకృష్ణ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జూన్ కల్లా మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం తన 102 చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. కె.ఎస్. రవికుమార్ దర్శకుడు. నయనతార, నటాషా దోషీ కథానాయికలు. సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
మోక్షజ్ఞ లాంచింగ్‌కు నిర్మాత ఫిక్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వందో సినిమాలోనే మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపిస్తాడంటూ ప్రచారం జరిగినా.. కథా పరంగా కుదరకపోవటంతో విరమించుకున్నారు. అయితే తాజాగా మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు నిర్మాత సాయి కొర్రపాటి. పలు సక్సెస్ఫుల్ చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. అందుకే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను సాయికి అప్పగించాడు బాలయ్య. ప్రస్తుతానికి మోక్షజ్ఞ హీరోగా చేయబోయే సినిమా కోసం కథ ఎంపిక చేసే పనిలో ఉన్నారు నిర్మాత. వారాహి చలన చిత్ర బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించేది మాత్రం సాయి కొర్రపాటి ప్రకటించలేదు. -
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి డైరెక్టర్ ఫిక్స్..?
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి చాలా రోజులుగా రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు.. ఎవరి దర్శకత్వంలో సెట్స్ మీదకు వెళ్లనుందన్న విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. బాలయ్య వందో సినిమాలో మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరిగినా.. ఆ విషయంపై కూడా నందమూరి కుటుంబ సభ్యులు, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి బాలకృష్ణ డైరెక్టర్‌ను ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ సమయంలో క్రిష్ పనితీరు నచ్చిన బాలయ్య, అతని దర్శకత్వంలోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను 2017 చివర్లోగాని 2018 మొదట్లో గాని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, వారాహి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.