నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హనుమాన్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ తొలి సినిమా చేయబోతున్నారు. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. ఈ ఏడాది హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. అంతకుముందు సింబా ఇజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ చాలాసార్లు హింట్ ఇస్తూ వచ్చారు. తాజాగా నందమూరి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
With great joy & privilege, Introducing you…
“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁
Happy birthday Mokshu 🥳
Welcome to @ThePVCU 🤗
Let’s do it 🤞
Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏
Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024
Comments
Please login to add a commentAdd a comment