entry
-
పండగ పూట మరోసారి ‘మంచు’ వివాదం (ఫోటోలు)
-
సినిమాల్లోకి అకీరా నందన్.. రేణు దేశాయ్ ఏమన్నారంటే?
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. 2023లో చివరిసారిగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే ఇటీవల కుటుంబంతో కలిసి ఆధ్యాత్రిక యాత్రలో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితమే కాశీ పర్యటనకు వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైంది రేణు దేశాయ్. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందించింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ..' ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒక మదర్‌గా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి. అంతవరకు వెయిట్ చేయండి' అని అన్నారు.గోదావరి జిల్లాల గురించి మాట్లాడుతూ..'గోదావరి జిల్లాల్లో ఉండే అందమైన లొకేషన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు అద్భుతంగా ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు నిర్ణయించడం సంతోషం. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషమే. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశా' అని అన్నారు. -
2024: బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూనే అదరగొట్టిన యంగ్ సెన్సేషన్స్ (ఫోటోలు)
-
Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ..
మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమేనా?న్యాయానికి కులం, మతం,ప్రాంతం ఉంటాయా?కంటికి కనిపించేది, చెవికి వినిపించేదంతా న్యాయమేనా?సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సంధించే ప్రశ్నలివి. యు.కె. ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఆ దేశం తన అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపింది. ‘లాపతా లేడీస్’తో పాటు ఆస్కార్‌లో ‘సంతోష్’ కూడా భారతీయ మహిళల కథను పోటీకి నిలపనుంది.ఈ వ్యవస్థ ఎలా నడుస్తోందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటే పై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసొస్తే పాలనా వ్యవస్థలో తన కంటే పై అధికారి ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసొస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్లు, కాటేసే కోరలు ఉంటాయి.ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు. కాని మారదు. మారాలనుకున్నా మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసింతో కూసింతో గాలి ఆడి పనులు అవుతుంటాయి అంతే.డాక్యుమెంటరీ మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ సినిమా మన భారతీయ వ్యవస్థ– అది కుల వ్యవస్థ కాని పాలనా వ్యవస్థ గాని ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కళ్లతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది.కథ ఏమిటి?‘సంతోష్’ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్ సైని అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహానా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్‌లాంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్‌కు ఒక కానిస్టేబుల్‌కు పెళ్లవుతుంది. కానీ డ్యూటీలో ఉండగా భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ‘నా కొడుకును మింగింది’ అని అత్తగారు సూటి పోటి మాటలంటే అమ్మ గారింట్లోని వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్ అవుతుంది. కాని పోలీసులంటే బయట ఉండే మనుషుల్లాంటి వారేనని అక్కడ దారుణమైన పురుషస్వామ్యం, కుల పెత్తనం, అవినీతి, మత ద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో వేశారని గ్రామస్తులు విచారణకు వెళ్లిన సంతోష్‌కు చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనేదే కథ.మహిళలపై హింసకు వ్యతిరేకంగాలండన్లో పుట్టి పెరిగిన బ్రిటిష్ ఇండియన్ సంధ్యా సూరి గతంలో ‘ఐ ఫర్ ఇండియా’ డాక్యుమెంటరీలో ‘ఫీల్డ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్జిఓలతో పని చేస్తున్నప్పుడు ‘నిర్భయ’ ఘటన ఆమెను హతాశురాలిని చేసింది. ఆ సమయంలో నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్లలోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు ‘సంతోష్’ సినిమా తీయాలని అనిపించింది. అయితే దీని నిర్మాణం కోసం ఆమె యు.కె/జర్మన్/ఫ్రెంచ్ దేశాల ఫిల్మ్ ఫండింగ్ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీతా రాజ్వర్ (పంచాయత్ ఫేమ్), సంజయ్ బిష్ణోయ్ తదితరులు ఇందులో నటించారు.ఆస్కార్ ఎంట్రీమేలో జరిగిన 77వ కాన్స్‌లో బహు ప్రశంసలు పొందిన ‘సంతోష్’ను 97వ ఆస్కార్ అవార్డుల పోటీలో తన దేశ అఫిషియల్ ఎంట్రీగా పంపాలని యూకే భావించడం ఈ కథకు, దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపతా లేడీస్ స్త్రీల కథకాగా ‘సంతోష్’ కూడా స్త్రీల కథే కావడం విశేషం.ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
బాలయ్య వారసుడి గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్‌గా ఎవరంటే?
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలి సినిమా చేయబోతున్నారు. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ ఏడాది హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. అంతకుముందు సింబా ఇజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ చాలాసార్లు హింట్ ఇస్తూ వచ్చారు. తాజాగా నందమూరి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. With great joy & privilege, Introducing you…“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁Happy birthday Mokshu 🥳 Welcome to @ThePVCU 🤗Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏 Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024 -
బంగ్లాదేశ్ సంక్షోభం: ఒడిశా అప్రమత్తం.. తీరంలో గస్తీ పెంపు
అశాంతితో దెబ్బతిన్న బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడాలని చూస్తున్న అక్కడి ప్రజలను అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 480 కిలోమీటర్ల తీరప్రాంతంలో నిఘాను మరింతగా పెంచింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.ఒడిశా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు చిన్న పడవలను ఉపయోగించి ఒడిశాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొన్న సమయంలో, అక్కడి నేరస్తులు జైలు నుండి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. అలాంటి వారు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నయని, అందుకే తాము మరింత అప్రమత్తం అయ్యామన్నారు.నేరస్తులలో పాటు సామాన్యులు కూడా ఒడిశాలోకి చొరబడే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని 18 మెరైన్ పోలీస్ స్టేషన్లను హై అలర్ట్‌లో ఉంచామన్నారు. మరోవైపు ఒడిశాలోకి బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించేందుకు ప్రత్యేకించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోస్తా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించింది. కేంద్రపారా, జగత్సింగ్పూర్, భద్రక్ తదితర జిల్లాలపై నిఘా సారించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
ధోతీ ధరించాడని అనుమతి నిరాకరణ.. మాల్ అధికారులకు షాక్
బెంగళూరు: ధోతీ ధరించారన్న కారణంతో ఓ రైతును మాల్ సిబ్బంది లోపలికి అనుమతించలేని ఘటన మంగళవారం బెంగళూరులో చోటుచేసుకున్న విఫయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా కూడా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ఈ విషయం అధికారుల దృష్టికి చేరింది. సంబంధిత మాల్‌పై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. వృద్ధ రైతుకు ధోతి ధరించినందుకు ప్రవేశం నిరాకరించిన జీటీ వరల్డ్ షాపింగ్ మాల్‌ను వారం రోజులపాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.వృద్ధ రైతుకు ధోతీ ధరించినందుకు ప్రవేశం నిరాకరించడంతో బెంగళూరు షాపింగ్ మాల్‌ను వారం రోజుల పాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి చర్యకు పాల్పడినందుకు చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందుకే ఏడు రోజులు మూసివేయాలని ఆదేశించినట్లు గురువారం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ వెల్లడించారు.Under Karnataka Congress govt patronage Farmers are being abused and insulted for wearing Dhoti? Banned entry in a mall! Karnataka CM wears a dhoti! Dhoti is our pride.. should farmer wear a tuxedo in a mall? How is Karnataka Congress allowing this? They are most anti… pic.twitter.com/NvctuwPBpp— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) July 17, 2024 కాగా బెంగళూరులోని జీటీ మాల్లో సినిమా చూసేందుకు ఓ తండ్రీ, కుమారులు వచ్చారు. మాల్‌లోకి వెళ్తుండగా అక్కడి భద్రతా సిబ్బంది ఆ రైతుని అడ్డగించి లోపలికి అనుమతి నిరాకరించారు. ఆ రైతు ధోతీ ధరించిన కారణంగా అనుమతి లేదని సిబ్బంది తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో మాల్ యాజమాన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా మాల్ యజమాని, సెక్యూరిటీ సిబ్బంది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 126(2) కింద కేసు నమోదు అయ్యింది. అలాగే బుధవారం రైతు సంఘాలు మాల్ ఎదుట ఆందోళనకు కూడా దిగాయి. ఆ రైతుకి, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే వేలాదిమంది రైతులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో ఆ భద్రతా సిబ్బంది రైతు, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పారు. -
ధోతీ ధరించాడని.. మాల్‌లోకి అనుమతి నిరాకరణ!
బెంగళూరు: ధోతీని ధరించినందుకు ఓ వృద్ధరైతుకు షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశం నిరాకరించారు. ఈ ఘటన బెంగళూరులోని జీటీ మాల్లో చోటుచేసుకుంది. ఒక వృద్ధ రైతు జీటీ మాల్లో సినిమా చూడటానికి తన కుమారుడితో కలిసి వెళ్లారు. అయితే వృద్ధుడు ధరించిన ధోతీని చూసి.. భద్రతా సిబ్బంది ఆయన్ని, ఆయన కుమారుడుని మాల్ లోపలికి వెళ్లకుండా ఆపేశారు.This mall should be fined! Elderly farmer denied entry to GT world shopping mall in #Bengaluru cuz he was wearing a Dhoti 🤷🏽♀️Fakeerappa, a farmer in his 70's was hoping to watch a movie with his family, had booked his ticket prior, but was stopped at the gates of GT mall… pic.twitter.com/xpKaeBJzzf— Nabila Jamal (@nabilajamal_) July 17, 2024 మాల్ యాజమాన్యం ధోతీ ధరించినవారిని లోపలికి అనుమతించకూడదని ఆదేశించినట్లు తెలిపారు. మాల్‌లోకి ప్యాంట్స్ వేసుకొని వచ్చినవాళ్లను మాత్రమే అనుమతించాలని చెప్పారని అన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో వృద్ధుడిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. తర్వాత ఆయనకు క్షమాపణలు తెలిపారు.మరోవైపు.. ‘ఈ ఘటనపై పోలీసులు మాల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే వేలమంది రైతులతో నిరసనకు దిగతాం’ అని రైతు నాయకుడు కురుబురు శాంతకుమార్ డిమాండ్ చేశారు. ఇక.. సోషల్‌మీడియాలో సైతం నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ.. మాల్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ఓ వ్యక్తి సంచి నెత్తిన పెట్టుకొని రాజాజీనగర్ మెట్రోస్టేషన్‌కు వెళ్లితే.. అక్కడి సిబ్బంది ఆయన దుస్తులు సరిగాలేని అనుమతింలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారటంతో స్టేషన్ ప్లాట్‌ఫామ్ అధికారులు క్షమాపణలు తెలిపారు. -
బాలీవుడ్ కాలింగ్
ప్రతి ఏడాది బాలీవుడ్ తారలు కొంతమంది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్ హీరోయిన్లను బాలీవుడ్ పిలిచింది. బాలీవుడ్ నుంచి కాల్ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. కెరీర్లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్‌లో ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌ను కూడా పూర్తి చేశారామె. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది.ఇలా హిందీలో రెండు వెబ్ సిరీస్‌లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, రాజ్‌కుమార్ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ విన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.కాస్త ఆలస్యంగా... దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్ ఒకరు. నటిగా సౌత్‌లో తన సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూపించిన కీర్తీ సురేష్ బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్ (తమిళ డైరెక్టర్)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్’ తెరకెక్కింది.జ్యోతిదేశ్ పాండే, మురాద్ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్‌లో హిందీలో ఓ యాక్షన్ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో ముందు హీరో యిన్‌గా కీర్తీ సురేష్‌ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్ ఈ ్రపాజెక్ట్ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్’ ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఏక్ దిన్ హీరోయిన్ సాయి పల్లవికి సౌత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్ షూటింగ్ జపాన్‌లో జరిగింది. ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్ దిన్’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్ ఖాన్. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్’లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్‌బీర్ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని బాలీవుడ్ టాక్. కబురొచ్చింది ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్ నుంచి కబురొచ్చిందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్ హీరోగా ‘దిలేర్’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్ దేశ్‌ముఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. కేరాఫ్ మహారాజ్ఞి ‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు సంయుక్తా మీనన్. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించి పాపులర్ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్గా కాదు... ఓ లీడ్ రోల్లో... కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్‌లో ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్‌తేజ్ ఉప్పలపాటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకుడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. -
పోర్ట్ ఆఫ్ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!
హైదరాబాద్ నుంచి బదిలీ అయి మహబూబ్ నగర్లో పని చేస్తున్నప్పుడు మా పిల్లల కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఆరు మాసాల సెలవు పెట్టి బయలుదేరాను. కుటుంబ సభ్యుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడమే తప్ప నేను వెళ్లడం మొదటి సారి కావడంతో కంగారు పడ్డాను. మా ఇంట్లోనేమో ‘ మీరు పోతున్నది అమెరికా మాత్రమే... చంద్రమండలానికి కాదు కదా ! ఇక్కడేదన్నా మరిచినా యూఎస్‌లో అన్నీ దొరుకుతాయి, మీకు కావలసిన పుస్తకాలు కూడా పుష్కలంగా ‘ అని జోక్ చేశారు. రాత్రి ఒంటి గంటకు ఎగిరే విమానం కోసం ఎందుకైనా మంచిదని మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరి, అన్ని చెకింగ్ లు పూర్తి చేసుకొని మొత్తం మీద ఫ్లైట్ ఎక్కేశా. నా పక్క సీట్లోనే కూర్చున్న ఓ అమ్మాయి సెల్ ఫోన్ పట్టుకొని అచ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడడం చూసి నేనూ మాట కలిపా, ఆమెది వరంగల్, ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తున్నట్లు చెప్పింది. అమ్మా నాకిది మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ, ప్రయాణంలో కాస్త గైడ్ చేస్తుండు అన్నాను మాట వరసకి , మధ్యలో ఫ్లైట్ మారడం గురించే నా వర్రీ అంతా. ‘అయ్యో అంకుల్ నేను విమానం ఎక్కడమే ఇది ఫస్ట్ టైమ్, మీరే నాకు చెప్పాలి ! ‘ అన్నది నవ్వుతూ ఆమె. వేళాపాల లేకుండా ఏదో ఒకటి ఇస్తున్నారు తినడానికి, తాగడానికి రుచిపచి లేని ఆహారం. ఏక దాటిగా దాదాపు 10 గంటలు సీట్లో కూర్చోలేక, హ్యాండ్ లగేజీ తీసుకోడానికో, కాలకృత్యాలు తీర్చుకోడానికో, నేను మధ్యమధ్య లేస్తుంటే, మరో పక్కనున్న శ్వేతమహిళ తాను కదలలేక విసుక్కోవడం నాకు నచ్చలేదు. ఎలాగైతేనేం ఫ్రాంక్ ఫర్ట్లో అడుగు పెట్టాక, అక్కడి నుండి ఎయిర్‌పోర్ట్‌లోని మరో టర్మినల్‌కు వెళ్ళడానికి బస్సు రెడీగా ఉండడం బాగుంది. బస్సు దిగగానే హ్యూస్టన్ వెళ్లాల్సిన ఫ్లైట్ టెర్మినల్‌కి ఎలా వెళ్లాలో ఒకటికి రెండుసార్లు చెప్పింది అక్కడున్న జర్మనీ అమ్మాయి. వాళ్ల మర్యాద బాగుందనిపించింది. అదే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ..మా ఫ్లైట్ జార్జ్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి ఓ అరగంట ముందే మాకు కస్టమ్ ఫార్మ్స్ ఇచ్చారు పూర్తి చేయడానికి. దిగిన తర్వాత నేరుగా బయటకు వెళ్లొచ్చన్న మూడ్‌లో ఉన్నాను. అక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. మనం విమానం దిగగానే.. అమెరికాలో అడుగుపెట్టినట్టు కాదన్న విషయం తెలిసింది. ఫ్లైట్ నుంచి లాండ్ అయిన ప్రతీ ఒక్కరు అక్కడి సెక్యూరిటీ నిఘాలోకి వెళ్తారు. వాళ్లు సూచించిన మార్గంలోనే /దారిలోనే నడవాలి. అది కాస్తా.. తీరిగ్గా చెక్ పాయింట్‌కు దారి తీస్తుంది. దాన్నే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీని అమెరికాలో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది. అమెరికా దేశంలో ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వ్యవస్థను 1789లో ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలను పొందుపరిచారు. వీసా అక్కడ వరకే..యూఎస్ కాన్సులేట్ వాళ్లు వీసా ఇవ్వగానే.. అమెరికాలో వాలిపోవచ్చని అనుకుంటారు. ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఏ దేశం నుంచి ఏ నగరంలోని కాన్సులేట్ వాళ్లు వీసా ఇచ్చినా.. దాని పరిధి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వరకే. ఇక్కడి అధికారులు వచ్చే వ్యక్తులను, వారి దగ్గరున్న డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అంటే హైదరాబాద్‌లో వీసా అధికారికి ఏ విషయమయితే చెప్పినామో.. దానికి మద్ధతుగా వెంట తెచ్చుకున్న ధృవపత్రాలను పరిశీలిస్తారు. అలాగే అనుబంధ ప్రశ్నలు అడుగుతారు. అనుమానం వస్తే అమెరికాలోకి అడుగుపెట్టకుండా తిరిగి వెనక్కి పంపిస్తారు. నాకు ఎదురయిన అనుభవం ఏంటంటే.. నేను విమానంలో ఇచ్చిన కస్టమ్ ఫాంలో ఒక ప్రశ్న ఉంది. యూఎస్‌లో ఎంత కాలం ఉంటారు అని అడిగినప్పుడు అనాలోచితంగా 4 నెలలు అని రాశా, అది తప్పయింది. నిజానికి మా వాళ్లు నాకు 6 నెలల తర్వాతకు రిటర్న్ టికెట్ తీసుకున్నారు. దీన్ని పసిగట్టారు అక్కడి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అధికారులు. ‘ మీ రిటర్న్ టికెట్ 6 నెలలకు ఉంది కదా ’ అని క్లియర్ చేయకుండా పై అధికారి దగ్గరకు పంపారు. నేనేదో అమెరికాలోనే ఉండిపోడానికి వచ్చినట్లు ఆయనగారు పదే పదే అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాను. నేను ఆనాటి ప్రభుత్వ సర్వీస్‌లోనే ఉన్న అధికారినని తెలుసుకున్నాక మాత్రం వదిలిపెట్టేశారు. మన వాళ్లు ఎదుర్కునే పరీక్ష ఏంటంటే.? పోర్ట్ ఆఫ్ ఎంట్రీ గురించి అవగాహన లేకుండా.. చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ఉదాహరణకు తొలిసారి అమెరికా వెళ్లాల్సిన వారు, కాలిఫోర్నియాలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లాలని వీసా అధికారికి చెబుతారు. తీరా వెళ్లేప్పుడు మాత్రం న్యూయార్క్ సిటీ చూసి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. న్యూయార్క్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇక్కడికెందుకు వచ్చారని అడిగితే ఖంగు తింటారు. అమెరికాకు ఏ పని మీద వెళ్తున్నాం.? ఆ పనికి సరిపోయేలా దగ్గరున్న నగరానికే వస్తున్నామా? లేక తింగరి వేషాలు వేస్తున్నామా అన్నది పసిగట్టేస్తారు ఇక్కడి అధికారులు. పైగా మన పాస్‌పోర్ట్‌లో వీరు వేసే స్టాంపింగ్ డేట్ మనకు కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీకి మించి మనం అమెరికాలో ఉండడానికి వీల్లేదు. ఉదాహరణకు మీరు B1/B2 వీసా ఉండి అమెరికాలో జరగబోయే ఓ తెలుగు మహాసభలకు వస్తున్నారు. అదే పని మీద వీసా తీసుకున్నారు. కానీ మీ మనసులో దేశమంతా తిరిగితే బాగుంటుందన్న ఆలోచన ఉంది. అది దాచిపెట్టి సభల కోసం వచ్చామని చెబితే స్టాంపింగ్ కేవలం నెల మాత్రమే వేస్తాడు. పద్ధతిగా వివరిస్తే మాత్రం ఆరు నెలల స్టాంపింగ్ వేస్తాడు. విద్యార్థులు.. జాగ్రత్త పడాలి ఇక్కడికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇబ్బందులు పడతారు. అమెరికాకు సిద్ధం కాగానే.. మన స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే.. సీనియర్లు, అమెరికాలో అప్పటికే ఉంటోన్న స్టూడెంట్స్‌తో వాట్సాప్/ఫేస్బుక్ చాటింగ్ మొదలు పెడతారు. ఎక్కడ పార్ట్‌టైం ఉద్యోగాలు దొరుకుతాయి? డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చన్న ప్రశ్నలు వేస్తారు. ఆ చాట్ అలాగే ఫోన్లలో ఉంటుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అధికారికి మీ మీద డౌట్ వస్తే.. మీ ఫోన్ తీసుకుంటారు. మొత్తం చెక్ చేస్తారు. విద్యార్థులు చదువుకోవడానికి రావాలి గానీ.. డబ్బుల కోసం వస్తారా? అని వెనక్కి పంపిస్తారు. మనం ఎంతగా వాదించినా వృధా ప్రయాసే. ఏ దేశానికి వెళ్తే అక్కడి నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అలా కోరుకుంటారు కూడా. వేముల ప్రభాకర్(చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
టాలీవుడ్లో వరుస హిట్స్.. అప్పుడే ఎంట్రీ ఇస్తోంది!
గతేడాది విరూపాక్ష, సర్ సినిమాలతో సూపర్‌హిట్స్ తన ఖాతాలో వేసుకున్న భామ సంయుక్త మీనన్. ప్రస్తుతం టాలీవుడ్ హీరో నిఖిల్ సరసన స్వయంభులో కనిపించనుంది. అంతే కాకుండా ఆ తర్వాత శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. అప్పుడే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది.కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా కీ రోల్స్ చేయనున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు చరణ్ తేజ్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆమె ఫస్ట్ హిందీ మూవీ కంటెండ్ బేస్ట్‌గా ఉండబోతోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. సర్ మూవీతో హిట్ కొట్టిన భామ.. వెంట వెంటనే అవకాశాలను కొల్లగొడుతోంది. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్‌తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్‌లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్‌చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్‌లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!
సాధారణంగా ఏ గుడికైన కుటుంబ సమేతం వెళ్లి దర్శించుకుంటాం. కానీ ఓ గుడికి మాత్రం అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెళ్ల కలిసి వెల్లకూడదట. అలాంటి వింత ఆలయం భారత్‌లో ఒకటి ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకని ఈ నిషేధం విధించారంటే.. ఆ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు భోళా శంకరుడు ఆలయం. ఈ శివాలయాన్నిఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఇసుకరాయితో నిర్మించారట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితతంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోనే ఓ చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఎందుకు ఈ నిషేధం అంటే.. ఈ ఆలయాన్ని కేవలం రాత్రుళ్లులోనే నిర్మించారట. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పి నారాయణ్ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడట. రోజూ అతడి భార్యే అతనికి భోజనం తీసుకొచ్చేదట. కానీ, ఓ రోజు నారాయణ్ చెల్లెలు భోజనం తీసుకుని ఆలయంలోకి వచ్చింది. నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదవశాత్తు చూస్తుంది. దీన్ని నారాయణ్ చాలా అవమానంగా భావించి ఆ గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోకి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అంటే అక్క తమ్ముడు, అన్నా- చెల్లికి మ్రాతమే నో ఎంట్రీ. అంటే అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లుకు ఇది వర్తించదు. ఏదీఏమైన కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి, ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజెర్ట్గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
పూరీ ఆలయంలోనికి అక్రమంగా బంగ్లాదేశీయులు
ఒడిశాలోని పూరీలో గల జగన్నాథ ఆలయంలోకి అనధికారికంగా తొమ్మిది మంది బంగ్లాదేశీయులు ప్రవేశించారు. వీరిని ఒడిశా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి వెళ్లడాన్ని తాము చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తమకు చెప్పారని ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వీహెచ్‌పీ కార్యకర్తలు సింగ్‌ద్వార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు హిందూయేతర బంగ్లాదేశీయులు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని పూరీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం హిందువులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోనికి హిందువులు కానివారు ప్రవేశిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయుల పాస్‌పోర్టులను తనిఖీ చేస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ సమయంలో ఒకరు హిందువని తేలింది. మిగిలిన పాస్‌పోర్టులపై విచారణ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఆలయంలోనికి ప్రవేశించినట్లు విచారణలో తేలింది. -
కేంద్రంపై యూకే రచయిత నిటాషా సంచలన ఆరోపణలు
లండన్: భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్‌కు భారత ప్రభుత్వం ఎంట్రీ నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన తనను ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారని ఆమె తెలిపారు. అనంతరం తిరిగి తనను లండన్ పంపేశారని, అడిగితే నీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారన్నారు. ఈ విషయాలన్నింటిని ఆమె తాజాగా ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై మాట్లాడేందుకు కర్ణాటక ప్రభత్వం నన్ను ఆహ్వానించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నన్ను ఎయిర్‌పోర్టులోనే ఆపేసి తిరిగి లండన్ పంపించివేసింది. నా వద్ద అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. గతంలో ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేసినందుకే నన్ను వెనక్కిపంపుతున్నట్లు అధికారులు అనధికారికంగా నాతో చెప్పారు. లండన్ నుంచి 24 గంటల పాటు ప్రయాణించి బెంగళూరు వస్తే మళ్లీ 24 గంటలు అటు ఇటు తిప్పి నన్ను ఎయిర్‌పోర్టులోనే ఉంచారు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పడుకోవడానికి కొద్దిగా స్థలం చూపించారు. అక్కడ కూడా కనీసం దిండు ఇవ్వలేదు. సీసీ కెమరా పర్యవేక్షణలో ఉంచారు. నేను ఎన్నోసార్లు భారత్ వచ్చాను. నాకు దేశంలోకి అనుమతి లేనట్లు కనీసం ముందుగా కూడా చెప్పలేదు. కర్ణాటక ప్రభుత్వమే నాకు టికెట్లు ఇచ్చింది’అని కౌల్ ఎక్స్‌లో తెలిపారు. ఇదీ చదవండి.. భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు -
వేరే భాషల్లో స్టార్ హీరోయిన్లు.. తెలుగు తెరపై వాలిపోతున్నారు
ప్రతీ ఏడాదీ తెలుగు తెరపై కొత్త తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది కూడా కొందరు సొగసరులు టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. కొందరు ఇప్పటికే వేరే భాషల్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లి, తెలుగు తెరకు కొత్త తారగా పరిచయం అవుతున్నారు. ఇంకొందరు వేరే భాషల్లో ఇప్పుడిప్పుడే పైకొస్తూ తెలుగుకి వస్తున్నారు. ‘సొగసరీ... స్వాగతం’ అంటూ వీరి రాక కోసం తెలుగు తెర వేచి చూస్తోంది. మోస్ట్ వాంటెడ్ హిందీలో పదిహేనేళ్లకు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో భాగమయ్యారు దీపికా పదుకోన్. కానీ తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయలేదు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం దీపికాను తెలుగుకు ఆహ్వానించింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్. ఇక ‘హెలెన్’, ‘కప్పెలా’ వంటి మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అన్నా బెన్ కూడా ‘కల్కి 28 98ఏడీ’తోనే తెలుగుకు ఎంట్రీ ఇస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. స్వాగతం బంగారం దివంగత ప్రముఖ తార శ్రీదేవికి ఇటు దక్షిణాదిన అటు ఉత్తరాదిన బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె వారసురాలిగా ముందు ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఎంట్రీని తెలుగు ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆశిస్తున్నారు. ‘దేవర’ సినిమాతో అది నెరవేరుతోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో జాన్వీ పాత్ర పేరు తంగమ్ (బంగారం). కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోనూ జాన్వీ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈసారి నో డౌట్ హీరోయిన్ మాళవిక ఎంట్రీ టాలీవుడ్లో ఎప్పుడో జరగాల్సింది. విజయ్ దేవరకొండ, మాళవికా మోహనన్ జంటగా ఓ సినిమా ్రపారంభమై, అది క్యాన్సిల్ అయ్యింది. ఈ బ్యూటీ ఇప్పుడు ‘రాజా సాబ్’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. బచ్చన్‌కు జోడీగా.. హిందీ చిత్రం ‘యారియా 2’లో ఓ చిన్న పాత్ర చేసి పెద్ద పేరు తెచ్చుకున్నారు భాగ్య శ్రీ భోర్సె. ఈ పుణే మోడల్ ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగుకు పరిచయం కానున్నారు. హీరో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు భాగ్య శ్రీ భోర్సె. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలిసింది. ప్రపంచ సుందరి కూడా... 2017లో మిస్ వరల్డ్‌గా నిలిచిన బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ కూడా తెలుగు తెరపై కనిపించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మానుషీకి తెలుగులో తొలి చిత్రం. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శక్తీ ప్రతాప్ సింగ్ దర్శకుడు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మార్చి 1న రిలీజ్ కానుంది. ఇది వరుణ్ తేజ్‌కు హిందీలో తొలి చిత్రం కావడం విశేషం. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ పతాకాలపై సందీప్ ముద్దా ఈ సినిమాను నిర్మించారు. నాట్యం టు నటన నాట్య కళాకారిణి ప్రీతీ ముకుందన్ ‘కన్నప్ప’ సినిమాతో తెలుగు తెరపై నటిగా కనిపించనున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ముఖేష్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ప్రీతీ ముకుందన్‌ను తీసుకున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్లపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. బుజ్జి కన్నా.. వస్తున్నా... తెలుగు ప్రేక్షకులకు ‘బుట్ట బొమ్మ’ అంటే పూజా హెగ్డే, ‘బేబమ్మ’ అంటే కృతీశెట్టి గుర్తొస్తారు. అలాగే ‘బుజ్జి కన్నా’ అంటే మలయాళ బ్యూటీ ఇవానా గుర్తొస్తారు. తమిళ హిట్ ‘లవ్ టుడే’లో హీరోయిన్ ఇవానా ‘బుజ్జి కన్నా..’ అంటూ ప్రేమికుడిపై కురిపించిన ప్రేమ అందర్నీ ఆకట్టుకుంది. ‘లవ్ టుడే’ చిత్రం తెలుగులో అనువాదమై బంపర్ హిట్‌గా నిలిచింది. దీంతో తెలుగులో ఇవానాకు చాన్స్‌లు దక్కాయి. అలా స్ట్రెయిట్ ఫిల్మ్ ‘సెల్ఫిష్’తో ‘బుజ్జికన్నా.. వస్తున్నా!’ అంటూ తెలుగు కుర్రాళ్ల మనసులను మరో మారు గెలిచేందుకు వస్తున్నారు ఇవానా. ఇందులో ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. విశాల్ కాశీ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. తెలుసు కదా... యశ్ ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో కన్నడలో, విక్రమ్ ‘కోబ్రా’తో తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు మంగుళూరు బ్యూటీ శ్రీనిధీ శెట్టి. ఈ యంగ్ బ్యూటీ ‘తెలుసు కదా’ అంటూ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, రాశీ ఖన్నా మరో హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డాటర్ ఆఫ్ జానీ లీవర్ బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు జానీ లీవర్ కుమార్తె జెమీ లీవర్ హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు వస్తున్నారు. ‘హౌస్‌ఫుల్ 4’, ‘భూత్ పోలీస్’ వంటి హిందీ సినిమాల్లో మెరిసిన జెమీ లీవర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు. రామ్ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘నా మాతృభాష తెలుగులో సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఓ విధంగా మా గ్రాండ్ మదర్‌కు నేను ఇస్తున్న ఓ నివాళిగా ఈ సినిమాను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు జెమీ. ఇక బాలీవుడ్ సినిమాల్లో పాపులర్ అయిన జానీ లీవర్ స్వస్థలం కనిగిరి అనే విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంకెంత మంది కొత్త సొగసరులకు తెలుగు పరిశ్రమ స్వాగతం పలుకుతుందో చూడాలి. -
వచ్చే వారం రిలయన్స్ డేటా సెంటర్ ప్రారంభం
చెన్నై: వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్స్ విభా గంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇస్తోంది. వచ్చే వారం చెన్నైలో సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీ సంస్థలతో కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. చెన్నైలో 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఈ జాయింట్ వెంచర్ సంస్థ ముంబైలో మరో 40 మెగావాట్ల సెంటర్ కోసం 2.15 ఎకరాలు కొనుగోలు చేసింది. -
Avram Manchu: ఐదేళ్లకే సినిమాలో ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు తనయుడు (ఫోటోలు)
-
మంచు వారసుడొస్తున్నాడు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ!
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం ద్వారా మంచు వారసుడు సినీ అరంగేట్రం చేయనున్నారు. విష్ణు మంచు వారసుడిగా అవ్రామ్ కన్నప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మోహన్ బాబు మూడో తరం కూడా సినిమాల్లోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో అవ్రామ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. విష్ణు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. అవ్రామ్తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు.కన్నప్ప మొదటి షెడ్యూల్ ముగియగానే విష్ణు మంచు తనకు సహకరించిన టీంకు థాంక్స్ చెప్పారు. -
బిగ్‌బాస్‌లో రతికా రోజ్.. ఓకే చెప్పేసిందా?
గతేడాది బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాలిటీ షో బిగ్‌బాస్. దాదాపు 100 రోజులకు పైగా సినీ ప్రేక్షకులను అలరించింది. డిసెంబర్ 17న ముగిసిన ఈ సీజన్లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర నటుడు అమర్దీప్ రన్నరప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే అంతకుముందు జరిగిన సీజన్లతో పోలిస్తే ఈ సారి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు త్వరలోనే మరో సీజన్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ మొదలు కానున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ రియాలిటీ షో ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7లో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు. ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో సారి కూడా ఎలిమినేట్ అయి బయటకొచ్చిన కంటెస్టెంట్ రతికా రోజ్. అయితే మరోసారి రతికా బిగ్‌బాస్ షోకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ సీజన్లో రతికా ఎంట్రీ ఇవ్వనుందని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రతికా ఓ సినిమాలో నటిస్తోంది. -
స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్‌గా ఎవరంటే?
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి స్టార్‌గా ఎదిగిన వాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారాయన. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తండ్రిబాటలోనే పయనించేందుకు ఆయన వారసుడు వచ్చేస్తున్నాడు. విజయ్ సేతుపతి కుమారుడు సూర్య తెరంగేట్రానికి అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'ఫీనిక్స్' అనే టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సీనియర్ స్టంట్ మాస్టర్ అరసు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఏకే బ్రేవ్‌మన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంతో అరసు డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. గతంలో ఆయన ఇండియన్ 2, జవాన్ సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేశారు. కాగా.. ఆయన కుమారుడు సూర్య 'నానుమ్ రౌడీ ధాన్'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఆ తర్వాత 'సింధుబాద్'చిత్రంలో సహాయక పాత్రలో కనిపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విడుతలై పార్ట్ 2'లో సూర్య కనిపించనున్నారు. కాగా... ఈ చిత్రానికి సీఎస్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని డైరెక్టర్ అరసు తెలిపారు. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్‌తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి!
సినిమా ఇండస్ట్రీలో స్వీటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనుష్కనే. ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అలరించారు. ఈ బెంగళూరు భామ మొదట్లో యోగా టీచర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సూపర్ అనే తెలుగు చిత్రంలో నాగార్జునకు జంటగా నటించే అవకాశం వరించింది. అలా తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్ని తన అందాలతో కొల్లగొట్టిన అనుష్క ఆ తర్వాత రెండు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో మరింతగా గ్లామరస్‌గా నటించి తడితడి అందాలతో తమిళ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించారు. ఇంకేముంది ఈ రెండు భాషల్లోనూ వరుసగా అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలాంటి గ్లామరస్ నటిని అరుంధతి చిత్రంతో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ చిత్రం తమిళంలోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భాగమతి చిత్రాలతో తనలోని నట దాహాన్ని తీర్చుకున్న అనుష్క, బాహుబలి చిత్రంతో నటిగా మరో అంతస్తుకు చేరుకుంది. అలా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించిన ఈ భామ సైజ్ జీరో అనే చిత్రంలో నటించడానికి ఏ హీరోయిన్ చేయని సాహసం చేశారు. అందులోని పాత్ర కోసం బరువును విపరీతంగా పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత బరువు తగ్గడానికి ఇప్పటి వరకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. దీంతో అవకాశాలు ఆమెకు దూరమయ్యాయనే అనే చెప్పాలి. ఇటీవలే రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం అనుష్కకు మంచి కమ్ బ్యాక్‌గా నిలిచింది. దీంతో నూతన ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు తాజాగా ఒక మలయాళ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. హోమ్ చిత్రం ఫేమ్ రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జై సూర్యకు జంటగా అనుష్క నటిస్తున్నారు. ఇది చారిత్రక కథ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు తెలిసింది. తన పాత్ర కొత్తగా ఉండకపోతే అనుష్క ఇందులో నటించడానికి సమ్మతించి ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో మేనల్లుడు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, అమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాను త్వరలోనే సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అతను చివరిగా కంగనా రనౌత్‌తో కలిసి 2015లో విడుదలైన కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఆదివారం ముంబయిలో జరిగిన ముంబయిలో జరిగిన ఐఎఫ్‌పీ ఫెస్టివల్ సీజన్ -13 ముఖ్య అతిథిగా హాజరైన ఇమ్రాన్ ఖాన్ తన పునరాగమనంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. "రీ ఎంట్రీపై నా దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. కానీ ప్రస్తుతం స్క్రిప్ట్‌లను చదువుతున్నా. బాలీవుడ్ చిత్రనిర్మాతలతోనూ మాట్లాడుతున్నా. వచ్చే ఏడాది రీ ఎంట్రీ ఉంటుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. సినిమాల గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'సినిమాలను చూడటం, హీరోల నుంచి ప్రేరణ పొందడం వల్ల ప్రేక్షకుల నుంచి తనకు ప్రశంసలు వచ్చాయి. సినిమా చూస్తున్న అనుభూతిని ఆస్వాదించానని.. ఈ ప్రపంచంతో తాను భావోద్వేగాలతో ముడిపడి ఉన్నట్లు చెప్పాడు. నా చిన్నప్పుడు సినిమాలు చూసి ఆనందించాను. నాకు 8 ఏళ్ల వయస్సులో ఇండియానా జోన్స్ చూడటం ఇప్పటికీ గుర్తుంది. అది నా మనసును కదిలించింది. నేను ఇండియానా జోన్స్ హీరో లాగే గోధుమ రంగు లెదర్ జాకెట్ కొన్నాను. ఇదే నేను ఓ హీరోని అనుకరించడానికి ప్రయత్నించిన తొలి జ్ఞాపకం" అని గుర్తు చేసుకున్నారు. తన సినిమా 'జానే తు యా జానే నా' సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 80వ దశకంలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ లాంటి యాక్షన్ చిత్రాలు ఉండేవి.. ఇండియన్ సినిమాలో ఈ పాత్రలు తక్కువగా ఉన్నాయని నేను భావించానని తెలిపారు. కాగా.. ఇటీవలే ఇమ్రాన్ అబ్బాస్ టైర్వాలాతో వెబ్ సిరీస్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) -
హీరోయిన్గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?
ముందానై ముడిచ్చు చిత్రంతో కథానాయకిగా పరిచయమై తన చిలిపితనంతో కూడిన నటనతో అందరినీ ఆకర్షించిన మలయాళ నటి ఊర్వశి. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. 1980-90 ప్రాంతంలో ప్రముఖ కథానాయకిగా వెలిగిన ఆమె తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్‌కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?) నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే మలయాళ నటుడు మనోజ్ కే.జయన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుంజట్టా అనే కూతురు ఉంది. అయితే కొన్నేళ్లకే మనస్పర్థల కారణంగా ఊర్వశి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అయినా కూతురు ఇద్దరి వద్ద ఉంటూ పెరుగుతూ వచ్చింది. కాగా.. ఆ తరువాత ఊర్వశి రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమె కూతురు కుంజట్టాతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఊర్వశి వారసురాలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. కుంజట్టాకు కథనాయకికి కావలసిన అన్ని లక్షణాలు ఉండడంతో తర్వాత హీరోయిన్ అనే ప్రచారం ఊపందుకుంది. ఊర్వశి ఉద్దేశం కూడా అదే కావచ్చు అంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఇన్నాళ్లకు తన కూతురితో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కుంజట్టాను హీరోయిన్గా పరిచయం చేయడానికి కొందరు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంపై ఊర్వశి ఎలాంటి ప్రకటన చేయలేదు. (ఇది చదవండి: ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్! ) -
బిర్లా ‘ఓపస్’ పెయింట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ రంగంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇచి్చంది. ఈ మేరకు ‘బిర్లా ఓపస్’ బ్రాండ్‌ను గురువారం ఆవిష్కరించింది. డెకోరేటివ్ పెయింట్ల వ్యాపారంలో గ్రాసిమ్ రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. 2024 జనవరి–మార్చి కాలంలో బిర్లా ఓపస్ ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ హరియణా, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో పెయింట్ల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 133.2 కోట్ల లీటర్లు. అధిక వృద్ధి ఉన్న విపణిలోకి ప్రవేశించడానికి కొత్త విభాగం వీలు కలి్పస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ సందర్భంగా అన్నారు. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రెండేళ్లుగా బలమైన పునాదిని నిర్మించినట్టు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో రెండవ స్థానంలో నిలిచి లాభదాయక కంపెనీగా ఎదగడానికి ప్రయతి్నస్తున్నామన్నారు. డెకోరేటివ్ పెయింట్స్ పరిశ్రమ భారత్‌లో రెండంకెల వృద్ధితో ఏటా రూ.70,000 కోట్లు నమోదు చేస్తోంది. 2022–23లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 23 శాతం వృద్ధితో రూ.1.17 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, గ్రాసిమ్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 0.12 శాతం క్షీణించి రూ.1,931.40 వద్ద స్థిరపడింది. -
తెలుగులో సూపర్ హిట్స్ కొట్టిన హీరోయిన్.. ఆ సినిమాతో రీ ఎంట్రీ!
అప్పట్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన కొందరు హీరోయిన్లు లేటు వయసులో రీఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించిన నటీమణులు అవకాశం వస్తే ఏ పాత్రలోనైనా అలరించేందుకు సిద్ధంగా ఉంటారు. అలా ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా నటిస్తున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మరో నటి టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ అందాల నటి ఎవరో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'ఇంకా లేటెందుకు.. త్వరగా పెళ్లి చేసుకోండి'.. మిల్కీ బ్యూటీకి నెటిజన్స్ సలహా!) తెలుగువారికి హీరో భాను చందర్ పేరు సుపరిచితమే. ఆయన హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం‘నిరీక్షణ’. ఈ మూవీతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న భామ అర్చన. 1980లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అర్చన తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. మీనాక్షి పొన్నుంగా అనే కోలీవుడ్ టీవీ సీరియల్లోనూ కనిపించారు. భానుచందర్ సరసన నటించిన ‘నిరీక్షణ’ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె చేసిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం 1986లో రిలీజ్ కాగా.. ఈ సినిమాలో ఆమె నటనకు నంది అవార్డ్ దక్కింది. మధురగీతం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్చన ఆ తర్వాత వీడు, లేడీస్ టైలర్, దాసీ,ఉక్కు సంకెళ్లు, మట్టి మనుషులు, భారత్‌బంద్, పచ్చతోరణం లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. అయితే భాను చందర్, అర్చన నటించిన ‘వీడు’ చిత్రానికి నేషనల్ అవార్డ్‌తో పాటు ఫిలింఫేర్ కూడా దక్కింది. దాసి చిత్రానికి సైతం మరోసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ గెలుచుకున్నారు. అయితే కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అర్చన రీఎంట్రీకి ఇస్తోంది. ప్రస్తుతం ఆమె షష్ఠిపూర్తి అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్ రిలీజ్ చేయగా ఈ విషయం బయటకొచ్చింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అర్చన మళ్లీ నటిస్తుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న చిత్రం 'షష్టిపూర్తి'. ఇందులో రూపేష్ కుమార్ చౌదరి హీరో. కథానాయకుడిగా నటించడంతో పాటు సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనకు జోడీగా కథానాయిక ఆకాంక్షా సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్టేక్'... పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి) -
కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!
పాత నీరు పోక, కొత్త నీరు రాక అన్న సామెత సినీ పరిశ్రమకు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా కొత్త నటీమణులు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి పరితపిస్తుంటారు. అలా చాలా మంది క్రేజీ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. తాజాగా నటి మాల్వీ మల్హోత్రా కోలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. (ఇది చదవండి: మీ క్యాలెండర్లో ఇది మార్క్ చేసుకోండి: చిరంజీవి ) హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఈ పంజాబీ బ్యూటీ ముంబాయిలో నటిగా శిక్షణ పొంది ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. మొదట బుల్లితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ.. అలా వెండితెరలోనూ నాయకిగా నటిస్తున్నారు. ఇప్పటికే పంజాబీ, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న ఈ భామ ఇప్పుడు కోలీవుడ్‌కు ఎంట్రీ షురూ అయ్యిందన్నది తాజా సమాచారం. నటుడు ఆర్కే సరసన నటించే అవకాశం ఈమెను వరించింది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న 'తిరగబడరా సామీ' చిత్రంలో మాల్వీ మల్హోత్రా నటిస్తోంది. ఇందులో మరో కథానాయిక మన్నారా చోప్రా కూడా కనిపించనుంది. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) మలయాళంలో రఫీ దర్శకత్వంలో దిలీప్, కీర్తీసురేశ్, హనీరోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన రింగ్ మాస్టర్ 2014లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ కాబోతోంది. ఇందులో నటుడు ఆర్కే కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన ఇంతకు ముందు ఎల్లామ్ అవన్ సెయల్, అళగర్ మలై, వైగో ఎక్స్‌ప్రెస్ వంటి పలు విజయవతమైన చిత్రాల్లో నటించారు. కాగా చిన్న గ్యాప్ తరువాత ఈయన నటిస్తున్న ఈ చిత్రంలో నటి మాల్వీ మల్హోత్రా నాయకిగా నటించనున్నారు. బిగ్‌బాస్ అభిరామి ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఆర్.కన్నన్ దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by MALVI MALHOTRA (@malvimalhotra) -
పీక్స్ కి చేరిన ధోని రవీంధ్ర జడేజా గొడవలు...మధ్యలో ఏంట్రీ ఇచ్చిన జడ్డు వైఫ్
-
ధోనీ రాకతో దద్దరిల్లిన స్టేడియం
-
ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ సడెన్ ఎంట్రీ! నోటీసులు పంపుతామని వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ క్యాంటిన్లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దీంతో మండిపడ్డ ఢిల్లీ యూనివర్సిటీ ఆయనకు నోటీసులు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి రాహుల్ గాంధీకి ఈ విషయమై మంగళవారం లేదా బుధవారం నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మెన్స్ హాస్టల్‌ను రాహుల్ శుక్రవారం సందర్శించి, అక్కడ కొంతమంది విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే వారితోపాటు ఆయన భోజనం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దీన్ని సహించం.. అంటూ రాహుల్‌కి నోటీసులు పంపుతామని చెప్పారు. ఆయన క్యాంపస్‌లో అనధికారికంగా పర్యటించారని, ఆయన లోపలికి ప్రవేశించేటప్పుడూ చాలామంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అన్నారు. ఇలాంటి ఘటనను పునరావృతం చేయకుండా ఉండాలని, అలాగే విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పారు. నిజానికి ఈ ఘటన విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, ఇలాంటి విషయాల్లో నాయకులు కచ్చితంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలాఉండగా రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఆరోపించింది. ఐతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయమని అన్నారు. -
వీడియో: ధోనీ రాకతో దద్దరిల్లిన స్టేడియం
-
టీమిండియాలోకి యశస్వి జైస్వాల్ ఎంట్రీ..?
-
గన్ షాట్ : మాణిక్ ఎంట్రీతో టీ-కాంగ్రెస్ లో మంట చల్లారుతుందా..?
-
హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్న వారసులు
-
భారత్‌లో మారడోనా బ్రాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్ బ్రాండ్ మారడోనా భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, దివంగత డీగో మారడోనా పేరుతో ఈ బ్రాండ్‌ను అర్జెంటీనా కంపెనీ సట్వికా ఎస్ఏ ప్రమోట్ చేస్తోంది. మారడోనా బ్రాండ్ కింద స్పోర్ట్స్ గూడ్స్‌తోపాటు ఐవేర్, ఎలక్ట్రానిక్స్, ఫుట్‌వేర్, బెవరేజెస్, పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్ ఇక్కడి మార్కెట్లో మూడు, నాలుగు నెలల్లో రంగ ప్రవేశం చేయనున్నాయి. భారత ప్రత్యేక భాగస్వామిగా బ్రాడ్ఫోర్డ్ లైసెన్స్ ఇండియాను సట్వికా నియమించింది. మారడోనా బ్రాండ్ ఉత్పత్తుల విక్రయానికి ప్రముఖ ఫ్యాషన్ కంపెనీలు, ఈ–కామర్స్ రిటైలర్స్‌తో చర్చిస్తున్నట్టు బ్రాడ్ఫోర్డ్ తెలిపింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, కంజ్యూమర్ గూడ్స్, స్పోర్ట్స్ వంటి విభాగాల్లో 60కిపైగా బ్రాండ్స్‌ను బ్రాడ్ఫోర్డ్ భారత్‌లో నిర్వహిస్తోంది. ప్రపంచంలో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఒకరైన మారడోనా.. 1986 వరల్డ్ కప్ అర్జెంటీనా వశం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి 36 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌గా అర్జెంటీనా నిలిచిన సంగతి తెలిసిందే. -
వైరల్ వీడియో: వధువు ఎంట్రీ మాములుగా లేదు! దివి నుంచి వచ్చిన దేవతలా దిగింది
-
వధువు ఎంట్రీ మాములుగా లేదు! దివి నుంచి వచ్చిన దేవతలా దిగింది
ఇటీవల వధువరులు భలే గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. కొందరూ తమ రేంజ్‌కి తగ్గట్టుగా పెళ్లి చేసుకుంటే, మరికొందరూ అతి తక్కువ ఖర్చుతో కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చేసి చూపిస్తున్నారు. అదంతా ఒక ఎత్తైతే..పెళ్లి మండపానికి కూడా వధువు లేదా వరుడు కూడా చాలా వైరైటీగా ఎంట్రీ ఇచ్చి బంధువులను, కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే తరహాలో ఇక్కడొక పెళ్లి కూతురు ఇచ్చిన ఎంట్రీ చూస్తే వామ్మో! అంటారు. వివరాల్లో కెళ్తే...ఇక్కడొక వధువు తన తండ్రితో కలిసి ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్లంతా ఆ! అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ పెళ్లి మండపంలోని సీలింగ్‌కి కేబుల్స్‌తో సస్సెండ్ చేసిని అందమైన రోప్‌వే మాదిరిగా ఉండే దానిలో నుంచొని వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసి కొందరూ నెటిజన్లు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి పడిపోతే ఏమౌవుతుంది అంటూ మండిపడుతూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: ఈగనా మజాకా! ఏకంగా పది గ్రామాల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి..) -
Viral Video: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..
-
మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న బాలయ్య తన కుమారుడి వెండితెర ఆరంగ్రేటంపై తొలిసారి స్పందించారు. ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తారా అన్న వార్తలపై అంతా దైవ నిర్ణయం అని నవ్వుతూ అన్నారు. అఖండ సీక్వెల్‌పై బాలయ్య ఏమన్నారంటే.. బాలయ్య బ్లాక్‌బస్టర్ చిత్రం అఖండ. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని.. అధికారిక ప్రకటించడమే ఆలస్యమని అన్నారు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌కు హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. కాగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. -
పాన్ ఇండియా మూవీతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కృతిశెట్టి
తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన కృతీ శెట్టి మాలీవుడ్‌కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళంలో ‘అజయంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మీ కూడా కథానాయికలుగా కనిపిస్తారు. చదవండి: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి ‘‘మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టోవినో థామస్ మూడు పాత్రల్లో కనిపిస్తారు. మణియన్, అజయన్, కుంజికే పాత్రలు పోషిస్తున్నారాయన. కథ రీత్యా కేరళలోని కలరి మార్షల్ ఆర్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దీంతో కలరి విద్యలో టోవినో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం జరిగింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఎస్‌యూవీల్లోకి హోండా రీ–ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్‌యూవీలైన సీఆర్–వి, బీఆర్–వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్–వి, జాజ్ ఎస్‌యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్‌తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
శుభ'మస్తు'గా పర భాష హీరోయిన్లు.. తెలుగులోకి పరిచయం
పేరులోనే శుభాన్ని మోసుకొచ్చింది ఉగాది.. ఇది ‘శుభకృత్’ నామ సంవత్సరం.. శుభకృత్ అంటే ‘మంచి చేసేది’ అని అర్థం. మంచే జరుగుతుందనే ఆశావాహ దృక్పథంతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికిన వేళ. తెలుగు చిత్రసీమ కూడా కొత్త కథానాయికలను ‘శుభమస్తు’ అంటూ ఆహ్వానిస్తోంది. కొత్త తెలుగు సంవత్సరంలో పలువురు నాయికలు పరిచయం కానున్నారు. ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ముంబై బ్యూటీలు తెలుగు తెరపై మెరవడం కొత్తేం కాదు. ఇప్పటికే ఎంతోమంది హిందీ భామలు ఇక్కడ నిరూపించుకున్నారు. తాజాగా కొందరు ముంబై సే ఆయా (ముంబై నుంచి వచ్చారు). వీళ్లల్లో ఆల్రెడీ హిందీలో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న దీపికా పదుకొణె తెలుగు తెరకు పరిచయం కానున్నారు. దీపికా అనగానే చాలామంది బాలీవుడ్ హీరోయిన్ అనే అనుకుంటారు. కానీ హీరోయిన్గా ఆమె కెరీర్ మొదలైంది ఉపేంద్ర హీరోగా 2006లో విడుదలైన కన్నడ ఫిల్మ్ ‘ఐశ్వర్య’తోనే. ఈ సినిమా తర్వాత దీపికా హిందీలో చేసిన ‘ఓం శాంతి ఓం’ అద్భుత విజయం సాధించడంతో బాలీవుడ్లోనే సెటిలైపోయారు ఈ మంగుళూరు బ్యూటీ. అయితే 2007లో రజనీకాంత్ చేసిన తమిళ ఫిల్మ్ ‘కొచ్చయాడన్’తో మళ్లీ సౌత్‌లో నటించారు. అయితే అది యానిమేషన్ మూవీ కాబట్టి.. ఎక్కువ రోజులు పని చేయలేదామె. ఎనిమిదేళ్ల తర్వాత సౌత్‌లో ‘ప్రాజెక్ట్ కె’లో భాగమయ్యారు. దీపికా పదుకొణెకు తెలుగులో ఇదే తొలి సినిమా. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఇక 2019లో హిందీలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించిన అనన్య పాండే ‘లైగర్’తో తెలుగువైపు అడుగులు వేశారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఇంకోవైపు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందిన మరో ఫిల్మ్ ‘గని’తో తెలుగు గడప తొక్కారు సయీ మంజ్రేకర్. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ‘గని’ చిత్రంలో సయీ మంజ్రేకర్ ఓ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్ కానుంది. బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న మిథిలా పాల్కర్ తెలుగుకి వచ్చారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఓరి దేవుడా..’ చిత్రంలో తెలుగు తెరపై కనిపించనున్నారామె. తమిళ హిట్ ఫిల్మ్ ‘ఓ మై కడవులే..’కి ఇది తెలుగు రీమేక్. ఒకే సినిమాతో ఇరువురు భామలు ఒకే సినిమా (‘టైగర్ నాగేశ్వరరావు’)తో ఇద్దరు బ్యూటీలు పరిచయం కానున్నారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో కథానాయికలు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఉగాది పర్వదినానా (శనివారం) ఆరంభమైంది. ఇంతకీ నూపుర్ సనన్ ఎవరంటే.. ఇప్పటికే నార్త్, సౌత్‌లో స్టార్ అనిపించుకున్న కృతీ సనన్ చెల్లెలు. మరో భామ గాయత్రీ భరద్వాజ్ ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018, సెఫోరా మిస్ గ్లామరస్, జియో మిస్ పాపులర్ ఇలా పలు టైటిల్స్‌ను గెల్చుకున్నారు. ఫ్రమ్ ఫారిన్ తమిళ హీరో శివకార్తికేయన్ కోసం ఉక్రెయిన్ నుంచి వచ్చారు మరియా ర్యాబోషప్క. కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క నటిస్తున్నారు. ఇక నాగశౌర్య కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు న్యూజిల్యాండ్ బ్యూటీ షిర్లే సేథియా. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణ వ్రిందా విహారి’ చిత్రంలో షిర్లే సేథియా హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుంది. మాలీవుడ్ టు టాలీవుడ్ మలయాళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన నజ్రియా నజీమ్ సుందరం కోసం తెలుగుకి వచ్చారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అంటే... సుందరానికీ’ చిత్రంలో నజ్రియా కథానాయికగా నటిస్తున్నారు. మరోవైపు మాలీవుడ్‌లో దూసుకెళ్తోన్న సంయుక్తా మీనన్ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సర్’ (తమిళంలో ‘వాతి’)లో సంయుక్తా హీరోయిన్గా చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. అలాగే కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న టైమ్ ట్రావెల్ ఫిల్మ్‌లో సంయుక్త హీరోయిన్గా కనిపిస్తారు. అంతే కాదండోయ్.. మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తున్నారీ బ్యూటీ. ఇక మరో పాపులర్ మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మీ సైతం తెలుగులో నిరూపించుకునేందుకు రెడీ అయ్యారు. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేశ్ కాంబినేషన్లో రిలీజ్‌కు రెడీ అయిన చిత్రం ‘గాడ్సే’. ఈ చిత్రంతో ఐశ్వర్యా లక్ష్మీ తెలుగులో తొలి అడుగు వేశారు. వీరితో పాటు అనిఖా కృష్ణన్ కూడా తెలుగుకు హాయ్ చెబుతున్నారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘కప్పెలా’ తెలుగు రీమేక్ ‘బుట్టబొమ్మ’ (వర్కింగ్ టైటిల్)లో అనిఖా నటిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హీరోలు. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదికి దాదాపు పది మంది కథానాయికలు తెలుగుకి వస్తున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా తెలుగులో పరిచయమై ప్రతిభను నిరూపించుకునేందుకు కథలు వింటున్నారు. -
మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న బొద్దుగుమ్మ..
Poonam Bajwa Again Back To Kollywood Movies: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేదంటే ఎంట్రీ ఇచ్చిన వెంటనే లేదా కొన్ని రోజులకు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా మంది ముద్దుగుమ్మలే ఉన్నారు. ఈ జాబితాలో చెప్పుకోదగిన వాళ్ల వరుసలో ముందుంటుంది పూనమ్ బజ్వా. టాలీవుడ్లో ‘మొదటి సినిమా’తో తన మొదటి సినిమాను ప్రారంభించింది ఈ అమ్మడు. ఆ తర్వాత బాస్, పరుగు వంటి చిత్రాలతో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదవ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికింది అనుకున్నారంతా. కానీ తరువాత ఏం జరిగిందే ఏమో గానీ సీన్ రివర్స్ అయింది. మెలి మెల్లిగా వెండితెరకు దూరమైంది పూనమ్ బజ్వా. తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో అడపదడపా నటిస్తూ వచ్చిన ఈ బొద్దుగుమ్మ కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చదవండి: హాట్ టాపిక్‌గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. చిరు సినిమాకు అన్ని కోట్లా ? ఈ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ 'గురుమూర్తి' అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమతోంది. నటరాజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ టాకీస్ పతాకంపై శివ చలపతి, సాయి శరవణన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేటీ ధనశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజాయితీపరుడైన పోలీసు అధికారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఆయన ఎలా ఛేదించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. వంటి పలు ఆసక్తికరమైన ఘటనలతో ఈ చిత్రం రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. చదవండి: 100 కోట్ల క్లబ్లో అలియా చిత్రం.. ఎలా ఎంజాయ్ చేస్తుందంటే ? -
వెండితెరపై ‘రచ్చ’.. ఒకే ఒక్క ఛాన్స్.. అదే అతన్ని హీరోగా మార్చేసింది..
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): ఒక్క ఛాన్స్.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే యువత జపించే మంత్రమిది. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే ఈ రంగంలో రాణించడం కష్టం. తెరమీద మెరవాలంటే కటౌట్ అదిరిపోవాలి. అయితే లక్ష్య సాధనతో శ్రమిస్తే అదృష్టం వెన్నంటే వస్తుందని నిరూపించాడు గుంతకల్లుకు చెందిన పాడి శ్రీధరన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో పడిన శ్రమ చివరకు అతన్ని హీరోగా మార్చేసింది. ఎస్‌డీవీ క్రియేషన్స్ బ్యానర్లో వెంకటేష్ దర్శకత్వం వహించిన ‘రచ్చ రచ్చ’ సినిమాలో శ్రీధరన్, మాధురి జంటగా నటించారు. ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి కుటుంబ నేపథ్యం... గుంతకల్లు లోని హెచ్పీసీ డిపో ప్రాంతానికి చెందిన పాడి వెంకటేశులు, పాడి లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పాడి శ్రీధరన్ 1990లో జన్మించారు. అనారోగ్యం కారణంగా 1996లో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి శ్రీధరన్ బరువు బాధ్యతలన్నీ అన్న కిరణ్బాబునే చూసుకునేవారు. శ్రీధరన్‌కు అన్నతో పాటు ముగ్గురు అక్కలూ ఉన్నారు. గుంతకల్లులోని సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి వరకు, ఎస్కేపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, శ్రీశంకరానందలో డిగ్రీ, హైదరాబాద్‌లోని సీఎంఆర్ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేశారు. అన్నావదినలే తల్లిదండ్రులు లేని లోటును తీర్చి బాగా చదివించారు. సినిమాలంటే మక్కువ.. శ్రీధరన్ తండ్రి వెంకటేశులు ప్రముఖ రంగస్థల నటుడు. తండ్రి స్ఫూర్తితో తానూ నటుడిగా రాణించాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎంసీఏ పూర్తి చేశాక సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తానంటూ సినీ పరిశ్రమలోని దర్శకుల చుట్టూ తిరిగారు. 2014లో తొలిసారిగా ‘డెవిల్స్ బుక్’ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అనంతరం లయన్, డిక్టేటర్, జిల్, చుట్టాలబ్బాయి తదితర సినిమాల్లో సైడ్ రోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 2021లో ఓటీటీ ద్వారా ప్రదర్శింపబడిన ‘మరణ శ్వాస’ సినిమాలో హీరోగా అరంగ్రేటం చేశారు. సెలబ్రెటీగా ఎదగాలన్నదే నా లక్ష్యం.. సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. రంగస్థల నటుడిగా మా నాన్న చాలా నాటికల్లో నటించారు. 2014లో మొట్టమొదటి సారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. వెండితెరపై వెలగాలన్న నా కలను నిజం చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డాను. నటనలో నా ప్రతిభను గుర్తించిన ఎస్‌డీవీ క్రియేషన్స్ వారు రచ్చ రచ్చ సినిమా ద్వారా హీరోగా అవకాశమిచ్చారు. నిర్మాతలు... దర్శకుల సహకారం, ప్రేక్షక దేవుళ్ల ఆదరాభిమానాలతో భవిష్యత్తులో మంచి సినిమాల్లో నటించి ఒక సెలబ్రెటీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నా. – పాడి శ్రీధరన్, సినీ హీరో -
కోలీవుడ్‌లో లక్ పరీక్షించుకోనున్న మంచు విష్ణు
కురళ్ 388 చిత్రంతో తెలుగుస్టార్ నటుడు మంచువిష్ణు కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. నటుడు మోహన్‌బాబు పెద్దకొడుకే మంచువిష్ణు. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం కురళ్ 388. రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్, కిరన్ ధనబాలా కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నటి సురభి హీరోయిన్గా, సంపత్‌కుమార్, నాజర్, మునీష్కాంత్, రామదాస్, జయప్రకాష్, పంజు సుబ్బు తలైవాసల్ విజయ్, ప్రగతి, సురేఖవాణి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. జీఎస్ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. దీనికి ఎస్ఎస్ తమన్ సంగీతం, రాజేష్ యాదవ్ ఛాయాగ్రహణం అందించినట్లు దర్శకుడు తెలిపారు. చదవండి: Mahesh Babu: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై ఆసక్తిగా స్పందించిన మహేశ్ బాబు -
వధువరుల గ్రాండ్ ఎంట్రీ.. షాక్‌కు గురైన బంధువులు.. వైరల్ వీడియో..
-
వధువరుల గ్రాండ్ ఎంట్రీ.. షాక్‌కు గురైన బంధువులు.. వైరల్ వీడియో..
వివాహ వేడుకను ప్రతి ఒక్కరు తమ జీవితకాలమంతా గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. ప్రీవెడ్డింగ్ షూట్ మొదలుకొని.. అప్పగింతల వరకు ప్రతి కార్యక్రమాన్ని వీడియో రూపంలో భద్రపరుచుకుంటున్నారు. వివాహన్ని ట్రెండ్‌కు తగ్గట్టుగ నిర్వహించుకోవడానికి యువత ఎంత ఖర్చుకైన వెనకాడటం లేదు. పెళ్లికి సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ..ఈ కోవకు చెందిన ఒక పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నేటి యువత తమ పెళ్లిలో ఏదో ఒక కొత్తదనం ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఈ వివాహంలో.. వధువరులు ప్రత్యేకంగా తమ పెళ్లిమండపానికి చేరుకోవాలనుకున్నారు. దీనిలో భాగంగా.. ఒక ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఆ బల్లను గాలిలో ఒక వాహనం సహయంతో పైకి ఎత్తేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో.. అందంగా ముస్తాబైన.. వధువరులు బల్లపై కూర్చుని మండపం వైపు వస్తున్నారు. వేడుకకు హజరైన బంధువులు, స్నేహితులు వారి రాకను ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు కూడా మండపాన్ని, బంధువుల వైపు ఆనందంగా చూస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఊహించని సంఘటన జరిగింది. పాపం.. వధువరులు ప్రయాణిస్తున్న బల్ల ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో వారు.. కింద పడిపోయారు. మండపంలో ఉన్న.. బంధువులంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని వధువరులను పైకి ఎత్తారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వివాహం ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం.. బ్రైడ్స్ స్పెషల్ అనే ట్వీటర్ ఖాతాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం ఎంట్రీరా బాబు..’, ‘పాపం.. దెబ్బలేం తగల్లేవు కదా..’, ‘ ఇవేం.. ట్రెండీ ఆలోచనలు.. ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
గ్లామరస్ రబియా దూకుడు, పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
చండీగఢ్: మాజీ క్రికెటర్, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కుమార్తె రబియా సిద్దూ మరోసారి సంచలనంగా మారింది. ఇటీవల ఒక మీటింగ్‌లో తళుక్కున మెరిసిన రబియా తాజాగా చేసిన హడావిడి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పూర్తి పరిణతి చెందిన రాజకీయ నాయకురాలిగా సందడి చేస్తూ తన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి బజ్ క్రియేట్ చేశారు. పీపీసీసీ పనుల్లో సిద్ధూ బిజీబిజీగా ఉంటే ఆయన కుమార్తె రబియా రాజకీయంగా దూసుకుపోతారనే ఊహాగానాల మధ్య పూర్తి రంగంలోకి దిగిపోయింది. సిద్దూ అసెంబ్లీ నియోజకవర్గం అమృత్సర్ ఈస్ట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు, ఆమె సుడిగాలి పర్యటన స్థానికులను ఆకట్టుకుంది. అంతేకాదు ఆయా పనుల కొనసాగింపుపై కూడా హామీలను గుప్పించడం విశేషంగా నిలిచింది. వార్తలను గతంలో రుబియా ఖండించినప్పటికీ..ఇటీవల కేవలం పది రోజుల వ్యవధిలోనే వివిధ కార్యక్రమాలతో చూపిస్తున్న రబియా దూకుడు పోలిటిక్స్‌లోకి ఎంట్రీ ఖాయం అనే ఊహాగానాల్ని తెరపైకితెచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్ సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనుందా అనే అనుమానాలు భారీగా నెలకొన్నాయి. అయితే తాను రాజకీయాల్లో చేరబోతున్నానన్న వార్తలను రబియా ఖండించింది. పంజాబ్ సంక్షోభంలో కూరుకుపోయిన తన తండ్రి తరపున తాను పనిచేస్తున్నట్టు ఇటీవల వెల్లడించారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన రోడ్లు, పార్కులు, అభివృద్ధి పనులను ముఖ్యంగా రూ .33 లక్షల విలువైన పార్కుల సుందరీకరణ, పనులను చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు సిద్ధూకి, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇదే ఆఖరి అవకాశం అంటూ సిద్దూ 13 పాయింట్ల ఎజెండాతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా పంజాబ్ ప్రభుత్వాన్ని కదిలించాలంటూ అక్టోబర్ 15న రాసిన నాలుగు పేజల లేఖ ఇపుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చదవండి : Samantha: అంత పవర్ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత కాగా 2012 లో శిరోమణి అకాలీదళ్-బీజేపీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ అసెంబ్లీ సీటును గెలుచుకోగా, 2009లో కాంగ్రెస్ టికెట్‌పై సిద్ధూ అదే స్థానాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రబియా సిద్దూ ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. బాలీవుడ్ నటులకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. -
మళ్లీ రాజకీయాల్లోకి సూపర్‌స్టార్ రజనీకాంత్?
-
22 ప్రవేశమార్గాలను మూసేసిన నేపాల్
ఖట్మాండూ: భారత్‌లో కరోనా తీవ్ర వ్యాప్తి నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం భారత సరిహద్దులో ఉన్న 22 ప్రవేశ మార్గాలను మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్‌తో ఉన్న 35 బోర్డర్ పాయింట్లలో 22 మార్గాలను మూసేయాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేవలం 13 మార్గాలు మాత్రమే ప్రజల రాకపోకలకు వీలుగా తెరచి ఉన్నాయి. చదవండి: (భారత్‌లో కరోనా పరిస్థితి విషాదకరం) -
రజనీ ఎంట్రీ.. సన్నిహితుడి కీలక వ్యాఖ్యలు
సాక్షి, చెన్నె: తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఉండి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అయితే తాను రాజకీయాల్లోకి రాను అనే ప్రకటన తాజాఎన్నికల వరకు మాత్రమేనని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పుకొచ్చారు. రజనీకాంత్ చేసిన ప్రకటనలో ‘ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను’ అని చెప్పలేదని గుర్తుచేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత రజనీ రాజకీయ ఎంట్రీ ఉంటుందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. దీంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ మొదలైంది. గాంధీయ మక్కల్ ఇయ్యకమ్ (జీఎంఐ) అధినేత, రజనీకాంత్ సన్నిహితుడు తమిళరువి మణియన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘రజనీ ఇక రాజకీయాల్లోకి రాను అనే ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రాలేనని చెప్పుకొచ్చారు. అందుకే రజనీ మక్కల్ మండ్రమ్ (ఆర్ఎంఎం)ను ఇంకా రద్దు చేయలేదు. ఒకవేళ భవిష్యత్‌లో రజనీ రాజకీయాల్లోకి వస్తానంటే గాంధీయ మక్కల్ ఇయ్యకమ్ సహాయం చేస్తుంది. లేకపోతే స్వచ్ఛంద సంస్థగా కొనసాగుతుంది’’ అని మణియన్ తెలిపారు. రెండు నెలల కిందట తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి రజనీకాంత్ సంచలన చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనారోగ్యం బారిన పడడంతో యూటర్న్ తీసుకుని ‘రాజకీయాల్లోకి రాను’.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సేవ చేస్తా’ అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రేక్షకాభిమానులు, ప్రజలు రజనీ రాజకీయాల్లోకి రావాలనే విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. దీనిపై కూడా ఇటీవల రజనీ ‘తనను ఇబ్బంది పెట్టవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉంటే రజనీ మాత్రం రాజకీయాల్లోకి రావాలనే పెద్ద ఎత్తున ప్రజలు కోరుతున్నారు. -
భారత్‌కు టెస్లా వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై కంపెనీ కార్లు పరుగులు తీయనున్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో ప్రవేశించనున్నట్టు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అక్టోబరు 2న టెస్లా క్లబ్ ఇండియా ట్వీట్‌కు సమాధానంగా వెల్లడించారు. 2016లోనే భారత్‌కు రావాలని భావించి బుకింగ్స్ కూడా స్వీకరించింది. ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ, ఈ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కంపెనీ తన ఆలోచనను విరమించుకుంది. అయితే నాలుగేళ్ల క్రితం బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు తొలి ప్రాధాన్యత ఉండనుంది. ఆన్లైన్ వేదిక ద్వారా..: ఒకట్రెండేళ్ల వరకు డీలర్షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని టెస్లా నిర్ణయించింది. ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా మాత్రమే కార్యకలాపాలను నిర్వహించనుందని వాహన విక్రయంలో ఉన్న ప్రముఖ కంపెనీ ఎండీ ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇక భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుతోంది. తయారీ లేదా అసెంబ్లింగ్ ప్లాంటుతోపాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రం నెలకొల్పాలని భావిస్తోంది. ఈ విషయాలను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధ్రువీకరించారు. తొలుత విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి, అమ్మకాలనుబట్టి తయారీ ప్లాంటు నెలకొల్పుతుందని చెప్పారు. మోడల్–3కి జనవరిలో బుకింగ్స్: టెస్లా ముందుగా మోడల్–3 లగ్జరీ కారును ప్రవేశపెట్టనుంది. దీని కోసం జనవరిలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. పూర్తిగా తయారైన కారును ఇక్కడికి దిగుమతి చేయనున్నారు. కారు ధర రూ.55–60 లక్షలు ఉండనుంది. డెలివరీలు మార్చి చివరి నుంచి ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కంపెనీ తయారు చేసే కార్లలో ఇదే చవకైనది. ఒకసారి చార్జీ చేస్తే 381 నుంచి 580 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. -
భారత నౌకా దళంలో తొలిసారిగా..
సాక్షి, న్యూఢిల్లీ : భారత నౌకాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు అడుగుపెట్టనున్నారు. భారత నౌకా దళంలో పలు ర్యాంకుల్లో ఎంతోమంది మహిళా అధికారులున్నా యుద్ధనౌకల్లో వీరి నియామకం ఇదే తొలిసారి. ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, సిబ్బంది క్వార్టర్లలో ప్రైవసీ ఇబ్బందులు, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్రూంల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటివరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియోగించలేదు. ఈ ఇద్దరు మహిళా అధికారులు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళం అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక ఎంహెచ్-60ఆర్ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఎంహెచ్-60ఆర్ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్మెరైన్లను గుర్తిస్తాయి. 2018లో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లాక్‌హీడ్-మార్టిన్ నిర్మించిన ఈ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేశారు. కాగా రఫేల్ యుద్ధవిమానాలకు ఎంపిక చేసిన పైలట్లలో ఓ మహిళా పైలట్‌ను ఐఏఎఫ్ నియమించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో నేవీలో ఇద్దరు మహిళా అధికారుల నియామకం సైన్యంలో మహిళలకు సమ ప్రాతినిథ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపింది. చదవండి : విశాఖ గూఢచర్యం కేసు.. మరొకరి అరెస్ట్ -
హృతిక్ హాలీవుడ్ ఎంట్రీ..
ముంబై : బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ గ్లోబల్ స్టార్లా మారునున్నారు. హాలీవుడ్లో ఎంటరయ్యేందుకు అమెరికాకు చెందిన గెర్ష్ ఏజెన్సీతో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఒప్పందంపై సంతకాలు చేశారు. హృతిక్ నాయకత్వంలో అంతర్జాతీయ సినీ వినోద రంగంలో భారత్‌ను ముందు నిలుపుతామని, దేశంలో వినూత్న క్రియేటర్లకు ఇతర మార్కెట్లను అందుబాటులోకి తీసుకువస్తామని గెర్ష్‌తో భాగస్వామ్యం ద్వారా హృతిక్ విజన్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని సెలబ్రిటీ మేనేజ్మెంట్ సంస్థ క్వాన్ మేనేజర్ అమృతా సేన్ వెల్లడించారు. గెర్ష్ ఏజెన్సీ హృతిక్‌ను హాలీవుడ్‌కు పరిచయం చేయడంతో పాటు భారత్‌లో ఆయా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా చూస్తుంది. నటుడు, నిర్మాత రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్ 2000లో కహోనా ప్యార్ హై మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లకే బ్లాక్‌బస్టర్ మూవీలతో హృతిక్ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఇటీవల విడుదలైన హృతిక్ సినిమాలు సూపర్ 30, వార్ మూవీలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. చదవండి : హృతిక్‌రోషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు -
రామ్‌చరణ్ ఇన్...
స్టార్లు ఏం చేస్తుంటారు? ఏ సినిమాలు చేస్తున్నారు? ఎక్కడ వెకేషన్లో ఉన్నారు అనే అప్డేట్స్ అభిమానులకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అందుబాటులోకి రావడం అభిమానులకు పండగలాంటిదే. ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్టాగ్రామ్ ఇలా విభిన్న యాప్స్‌లో అకౌంట్స్ ఓపెన్ చేసి తమ గురించిన అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉంటారు రామ్‌చరణ్. తన సినిమాలు, డైట్.. ఇలా చాలా విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. తాజాగా రామ్‌చరణ్ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి పోస్ట్‌గా తన స్టిల్‌ను అప్లోడ్ చేశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్, సైరా’ అప్డేట్స్ అన్నీ ఇందులో షేర్ చేస్తారని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. -
మరో స్టార్ కిడ్ ఎంట్రీ
బాలీవుడ్లో స్టార్ కిడ్స్ ఎంట్రీ ఈ మధ్య బాగా కనిపిస్తోంది. శ్రీదేవి తనయ జాన్వీ ఆల్రెడీ ఎంట్రీ ఇవ్వగా సైఫ్ కుమార్తె సారా అలీఖాన్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ పూజా బేడీ కుమార్తె కూడా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. హిందీ చిత్రాలు ‘జో జీతా వహీ సికందర్, లూటేరా’ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు పూజా బేడి. తెలుగులో ‘చిట్టెమ్మ మొగుడు, శక్తి’ సినిమాల్లోనూ ఆమె కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. దర్శకుడు నితిన్ కక్కర్ తెరకెక్కించనున్న ‘జవానీ జానేమన్’ సినిమా ద్వారా పూజా బేడి కుమార్తె ఆలియా ఫర్నీచర్‌వాలా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. సైఫ్ కుమార్తెగా ఆలియా నటించనున్నారని టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మెగా ఎంట్రీ
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఇది మెగా ఎంట్రీ అనే చెప్పాలి. ఎందుకంటే ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, విశిష్ట దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించనున్న చిత్రంతో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నారు. దర్శకుడు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. -
బాలీవుడ్ ఎంట్రీ!
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ‘కబాలి’, ‘కాలా’ చేసిన దర్శకుడు పా. రంజిత్. ఆయన తదుపరి చిత్రం ఏంటా? అని కోలీవుడ్ ఎదురు చూస్తోంది. అయితే పా. రంజిత్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. నమహా పిక్చర్స్ నిర్మించబోయే పీరియాడికల్ డ్రామా ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారాయన. రంజిత్ తీసిన గత చిత్రాలు చూసి నిర్మాతలు షరీన్, కిశోర్ అరోరా ఆయన్నే డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యారట. ఈ పీరియాడికల్ డ్రామా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనుందని సమాచారం. ప్రతి సినిమాను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించే రంజిత్ ఈ చిత్రాన్ని కూడా అదే స్టైల్లో తెరకెక్కిస్తారని ఊహించవచ్చు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు ఓ తమిళ చిత్రం చేయడానికి కూడా రంజిత్ కమిట్ అయ్యారు. -
ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు ఆర్జున్ ఎంట్రీ అదుర్స్
-
ఇండిగో మరో నిర్వాకం
-
ఇండిగో మరో నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: దేశీయ ఎయిర్ క్యారియర్ ఇండిగో మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సమయాని కంటే ముందే వచ్చినా ఆలస్యమైందని చెప్పి విమానం ఎక్కకుండా వైమానిక సిబ్బంది ఓ ప్రయాణిడిని అడ్డుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 21వ తేదీన చోటు చేసుకోగా..సిబ్బంది వైఖరిపై మండిపడుతూ బాధితుడు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇండిగో సిబ్బందినీ నిలదీస్తున్న వైనం ఈ వీడియోలో రికార్డయింది. దీంతో ఈ విడియో వైరల్ అయింది. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు 6ఈ-743ఎయిర్టికెట్ను బుక్ చేసుకున్నారు. విమానం బయలుదేరే సమయం ఉదయం 5.40గంటలు కాగా, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని 5.22గంటలకు ఎయిర్‌లైన్స్ బస్సు ఎక్కి విమానం దగ్గరికి చేరుకున్నారు. కానీ ఆలస్యంగా వచ్చానని చెప్పి విమానం ఎక్కనీయకుండా సిబ్బంది తిరస్కరించడంతో వివాదం మొదలైంది. బోర్డింగ్ పాస్‌తో సహా, నిర్దేశిత సమయం కంటే ముందుగా చేరుకున్నప్పటికీ తనతోపాటు ఓ మహిళ, ఒక బాలుడినీ విమానం ఎక్కడానికి అంగీకరించలేదంటూ బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తచేశారు. విమానం ఎక్కేందుకు సమయం కంటే ముందే వచ్చానని, అయినా తనను ఎక్కనీయకుండా అడ్డుకున్నారని వాపోయారు. ఆలస్యమైతే..బోర్డింగ్ పాస్ తీసుకొని, బస్సు ఎలా ఎక్కేవాళ్లమని, ఇది ఇండిగో, దాని సిబ్బంది అహంకార ధోరణికి నిదర్శమని మండిపడ్డారు. మరోవైపు ఈ ఘటనను ధృవీకరించిన ఇండిగో తప్పును ఒప్పుకుంది. బోర్డింగ్ గేట్ సిబ్బంది నిర్లక్ష్యమని అంగీకరించింది. బోర్డింగ్ ముగిసిన తరువాత విమానంలోకి అనుమతించకపోవడం తమ సిబ్బంది తప్పుగా పేర్కొంది. ప్రయాణికుడిని తరువాత ఫ్లైట్ ద్వారా గోవాకు ఉచితంగా తరలించడం సహా,ఇతర అవకాశాలను కల్పించామని వివరణ ఇచ్చుకుంది. -
సినిమాలు పూర్తవగానే రాజకీయాల్లోకి...
సాక్షి, చెన్నై: చేతిలో ఉన్న రెండు సినిమాల పూర్తికాగానే రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు నటుడు కమల్‌హాసన్ తెలిపారు. ఓ తమిళ వారపత్రికకు కమల్ రాస్తున్న ధారావాహిక శీర్షికలో పలు విషయాలను ప్రస్తావించారు. సినిమాలు ముగించుకుని రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నానని అమెరికాలో తాను చేసిన ప్రకటన అక్కడి అభిమానులను ఆవేదనలో ముంచెత్తిందని తెలిపారు. అందరూ రాజకీయాల్లోకి వచ్చేపుడు తాను వస్తానని గతంలో చెప్పానని, ఆనాటి మాట ప్రకారం తాను వచ్చే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. మరోవైపు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
రజనీ వచ్చేస్తున్నాడు...!
సాక్షి ప్రతినిధి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ 'రజనీ పేరవై' (రజనీ సమాఖ్య) పేరుతో సంస్థను ఏర్పాటుచేసి రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడులో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనే చెప్పినట్లుగా ఈనెల 31వ తేదీన పేరవైని ప్రకటిస్తారని అంటున్నారు. రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నరజనీకాంత్ ఈ ఏడాది మేలో ఐదు రోజులు అభిమానులను కలిశారు. రెండో విడత సమావేశాలను ఈనెల 26వ తేదీన ప్రారంభించగా గురువారం మూడోరోజు నాటి సమావేశాలు జరిగాయి. చివరి రోజైన 31వ తేదీన రజనీ పేరవైని ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే, తాను హీరోగా నటించిన బాబా చిత్రంలో రజనీకాంత్ తన నాలుగువేళ్లలో రెండింటిని చిత్రంగా మడిచిన వైనం, అడుగున తెల్లతామరపువ్వు బొమ్మను 'రజనీ పేరవై' చిహ్నంగా పరిచయం చేయవచ్చని చెబుతున్నారు. 20-30 మధ్య వయస్కులైన యువకులను పేరవైలో సభ్యులుగా చేర్చుకునేలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలకు ఆదేశాలు అందాయి. ప్రస్తుతం పేరవైని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడమేకానీ, రాజకీయ పార్టీ ప్రకటన, అజెండా, జెండా వంటి వాటికి రజనీ వెళ్లరని సమాచారం. తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దుచేసే పరిస్థితులు అసన్నమైన వెంటనే రాజకీయ పార్టీ ప్రకటన చేయాలని రజనీ వ్యూహంగా ఉంది. నియోజవర్గాలవారీగా జనాభా, ఓటర్లు, స్థానిక సమస్యలపై సమాచారం సేకరించే బాధ్యతలను పేరవై ప్రతినిధులకు అప్పగిస్తారు. అంతేగాక తాను పార్టీ పెడితే కోలివుడ్ నుండి ఎవరెవరు వస్తారని రహస్య సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. మాంసాహార విందు ఇస్తా కాగా, మూడోరోజైన గురువారం నాటి సమావేశానికి హాజరైన అభిమానులతో ఫోటోలు దిగిన రజనీకాంత్... మీకందరికీ మాంసాహార భోజనం వడ్డించాలని ఉంది, అయితే ఈ రాఘవేంద్ర కల్యాణ మండపంలో మాంసాహారం నిషేధమని అన్నారు. ఏదో ఒక రోజున తన అభిమానులందరికీ మాంసాహార విందు ఇస్తానని చెప్పారు. మధురై, విరుదునగర్, సేలం, నామక్కల్ జిల్లాలకు చెందిన అభిమానులు హాజరై రాజకీయాల్లోకి రావాలంటూ కాళ్లపైపడి బతిమాలుకున్నారు. దేవుడు, తల్లిదండ్రులకు మాత్రమే ముందుగా కాళ్లకు నమస్కారం చేయాలని రజనీ వారిని వారించారు. -
చల్..చలో..చలో..!
అకాడమీలో శిక్షణకు క్రీడాకారుల ఎంపిక భానుగుడి(కాకినాడ): శాప్ ఆధ్వర్యంలో నాణ్యమైన క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ,అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో మెరిసేలా అకాడమీలలో కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లాలోనే నిష్ణాతులైన కోచ్‌లతో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా 13 జిల్లాలో పలు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులనుంచి శనివారం దరఖాస్తులు స్వీకరించి, నైపుణ్యాలను పరిశీలించారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్ లకు సంబంధించి రాష్ట్రస్థాయిలో 96మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకోగా వారికి శరీరధారుడ్య పరీక్షలు నిర్వహించారు. అథ్లెటిక్స్‌కు 31 మంది, జూడోకు 27, జిమ్నాస్టిక్స్‌కు–7, వెయిట్ లిప్టింగ్‌కు 31 మంది క్రీడాకారులు హాజరయ్యారని డీఎస్డీవో సయ్యద్ సాహెబ్ తెలిపారు. వీరందరికీ పలు పరీక్షలు నిర్వహించి ప్రతీ క్రీడకు 20 మంది చొప్పున క్రీడకారులను ఎంపిక చేస్తామన్నారు. ప్రతీ ఈవెంట్‌కు సంబంధించి నైపుణ్య పరీక్షలు నిర్వహించి క్రీడాకారుల ఎంపికలుంటాయన్నారు. ఎంపికలను శాప్ అడిషనల్ డైరక్టర్ ఎస్వీ రమణ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలిపారు. నేడు సత్తిగీత, ఎన్.లక్ష్మి హాజరు నేడు జరిగే ఎంపికలకు అంతర్జాతీయ అథ్లెట్ సత్తిగీత, వెయిట్‌లిఫ్టర్ ఎన్.లక్ష్మిలు హాజరు కానున్నారు. వీరితో విద్యార్థినులకు మోటివేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఎస్డీవో తెలిపారు.రాష్ట్ర ఒలింపిక్ అసోషియేషన్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామ్, జిమ్నాస్టిక్స్ ప్రెసిడెంట్ రామరాజు, జూడో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెకంట్,బాబులు ఎంపికలు నిర్వహించారు. -
వెండితెరపై గీతామాధురి..
వియ్ లవ్ బ్యాడ్ బోయ్స్.. మగాళ్లు వట్టి మాయగాళ్లు..! అంటూ తన గాత్రం ఆకట్టుకున్న నవతరం గాయని గీతామాధురి. ట్రెడిషనల్ సాంగ్స్, మెలోడీస్, ఫాస్ట్ బీట్ వెస్ట్రన్ సాంగ్స్, హస్కీ ఐటెమ్ నంబర్లతో తనదైన స్పీడ్ చూపించిన ఈ యువ గాయని లుక్స్ స్టైల్స్ తోను మెప్పిస్తోంది. ఇటీవలే `అతిథి` అనే షార్ట్ ఫిలింలో లీడ్ రోల్ పోషించిన గీతామాధురి త్వరలోనే వెండితెర మీద కూడా సందడి చేయనుందట. అయితే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో గీతామాధురి హీరోయిన్ గా నటిస్తుందా..? లేక అతిథి పాత్రలోనే కనిపించనుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే సింగర్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గీతా, ఈసినిమా రిలీజ్ అయిన తరువాత నటిగానూ బిజీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
ఆస్కార్ ఎంట్రీకి తమిళ సినిమా
జాతీయ అవార్డును గెలుచుకున్న తమిళ చిత్రం ’విరసణై’ ఆస్కార్ ఎంట్రీకి అవకాశం దక్కించుకుంది. భారతదేశం నుంచి 'ఉత్తమ విదేశీ భాషా చిత్రం' కేటగిరీలో ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 29 చిత్రాలు పోటీ పడగా, చివరకు విసరణై బరిలో నిలిచింది. ఈ మేరకు ఎఫ్ఎఫ్ఐ చైర్మన్ కేతన్ మెహతా ధ్రువీకరించారు. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలను భావోద్వేగాలతో తెరకెక్కిస్తాడనే పేరున్న తమిళ దర్శకుడు వెట్రిమాన్ రూపొందించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు జాతీయ అవార్డులను అందుకుంది. ఖాకీల కర్కశత్వాన్ని ప్రధానంగా చూపించిన 'విసరణై'.. ఎం.చంద్రకుమార్ నవల 'లాకప్' ఆధారంగా తెరకెక్కింది. థియేటర్లలో విడుదల కాకాముందే 72వ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. కాగా 89 వ ఆస్కార్ అవార్డు వేడుకలు 2017 ఫిబ్రవరిలో లాస్ ఏంజెలెస్‌లో జరుగనున్నాయి. -
ఓపన్ డిగ్రీ ప్రవేశానికి 20న తుది గడువు
అనంతపురం సప్తగిరి సర్కిల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపన్ డిగ్రీలో ప్రవేశానికి ఈనెల 20న తుది గడువు అని అనంతపురం మహిళా అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ రామచంద్రుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి 2012–2016 వరకు అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఓపన్ ఇంటర్, పాలిటెక్నిక్, నర్సింగ్ 10+2 పాసైన వారు అర్హులన్నారు. అదేవిధంగా ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఈనెల 20 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–245908 నంబర్‌కు సంప్రదించాలన్నారు. -
ఐటీ ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే ఎలా...
హైదరాబాద్ : ఐటీ సెక్టార్లో ఆటోమేషన్‌కు పెరుగుతున్న డిమాండ్ లక్షల ఉద్యోగాలకు గండి కొట్టనుందన్న నేపథ్యంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా పట్టు సాధించాలని సూచిస్తున్నారు ఐటీ నిపుణులు. ఐటీ విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలు అలవర్చుకోవాలని ఇండస్ట్రి నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో, హెచ్ఆర్ హెడ్ టీవీ మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్, పైథాన్ లాంటి కోడింగ్ లాంగ్వేజ్‌లపై పట్టు ఉన్నవారికి వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాలు ఎక్కడికి పోవని స్పష్టంచేశారు. ప్రస్తుతం బీటెక్ చదువులు 10వ తరగతి చదివిన విద్యార్థితో సరిపోతుందని, విద్యార్థులు మరింత టెక్నికల్ నాలెడ్జ్‌ను పొందడానికి కేవలం బ్యాచ్‌లర్ డిగ్రీలతో సరిపెట్టుకోకుండా, మాస్టర్ డిగ్రీలను(పోస్ట్-గ్రాడ్యుయేషన్) కూడా చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని లేకపోతే అసలకే తగ్గిపోతున్న ఉద్యోగాల్లో, ఉద్యోగం సంపాదించడం కష్టతరమవుతుందని హెచ్చరించారు. ప్రతేడాది ఐటీ మార్కెట్లోకి వచ్చే 6.5 లక్షల మందిలో కేవలం 2-2.5లక్షల మంది ఇంజనీర్లే ఉద్యోగాలను సంపాదిస్తున్నారని పాయ్ పేర్కొన్నారు.. ఆటోమేషన్ ప్రభావంతో ఏటా కొత్తగా వచ్చే ఉద్యోగాల్లో ప్రారంభ, మధ్యస్థాయి ఉద్యోగాల్లో 10 శాతం వరకూ కోతపడనుందని పేర్కొన్నారు. గణాంకాల పరంగా చూసుకుంటే ఏటా 2 నుంచి 2.5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంటే, వాటిలో 25వేల నుంచి 50 వేల వరకు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. ఐటీ ఇండస్ట్రిలో మొత్తంలో 45 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, వారిలో 4,50,000 మంది మధ్యస్థాయి ఉద్యోగులేనన్నారు. అయితే ఆటోమేషన్ వల్ల వచ్చే దశాబ్దంలోనే వారిలో సగం మంది ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని తెలిపారు. మధ్యస్థాయి ఉద్యోగుల్లో చాలామంది ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారని, ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ఐటీ సంస్థలు ఆటోమేషన్‌పై మొగ్గుచూపుతున్నాయని అన్నారు. -
పీజీలో ప్రవేశానికి చివరి అవకాశం
కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోని అభ్యర్థులు ఈనెల 29, 30వ తేదీల్లో కామర్స్ విభాగంలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. పీజీలో ప్రవేశానికి ఇదే చివరి అవకాశమని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు. అలాగే, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే గడువు ఆగస్టు 5వ తేదీతో ముగియనుందని తెలిపారు. అయితే, గతంలో ఆప్షన్లు ఇచ్చుకోని అభ్యర్థులకు ఆగస్టు 6, 7వ తేదీల్లో అవకాశం కల్పిస్తున్నట్లు వారు వివరించారు. -
ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం టౌన్ : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ కె.రామచంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్ష పాసైన వారు అర్హులు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, నర్సింగ్, డిప్లొమో, టెన్ ప్లస్ 2 ఉత్తీర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజును ఆగస్టు 20లోగా చెల్లించాలని, ఇతర వివరాలకు 08554–245908 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చునని సూచించారు. -
24 మంత్ర ఆర్గానిక్ నూతన శ్రేణి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేంద్రియ ఆహారోత్పత్తుల రంగంలో ఉన్న శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్స్ 24 మంత్ర ఆర్గానిక్ బ్రాండ్‌లో కొత్త విభాగాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెడీ టు డ్రింక్, రెడీ టు కుక్ విభాగాల్లో ప్రవేశించిన ఈ సంస్థ తొమ్మిది రకాల ఉత్పత్తులను విడుదల చేసింది. కంపెనీ మొత్తం 200 రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. 15 ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. 2018 నాటికి మరో నాలుగైదు ఏర్పాటు చేస్తామని సంస్థ వ్యవస్థాపకులు రాజ్ శీలం ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో 25,000 మందికిపైగా రైతులతో కలిసి 1.5 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో అయిదు లక్షల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా సంస్థకు మూడు లక్షల మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. మూడు నాలుగేళ్లలో 10 లక్షల మంది కస్టమర్లకు చేరువ అవుతామని కంపెనీ సీఈవో ఎన్.బాలసుబ్రమణియన్ తెలిపారు. ఆన్లైన్ విక్రయాలు ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 2018 కల్లా 20-25 శాతానికి చేరుతుందని కంపెనీ భావిస్తోంది. -
పెళ్లి మండపానికి బుల్లెట్‌పై వచ్చిన అయేషా
-
ఎంట్రీ, స్పోర్ట్స్ వాహన విభాగాల్లో
బజాజ్ మోటార్‌సైకిల్స్ హవా హైదరాబాద్: ఎంట్రీ, స్పోర్ట్స్ వాహన మార్కెట్ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ బజాజ్ మోటార్‌సైకిల్స్‌ప్రకటించింది. సీటీ-100, ప్లాటినం వంటి బైక్స్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది మాసాల్లో తమ ఎంట్రీ విభాగం మార్కెట్ వాటా 23 శాతం నుంచి 36 శాతానికి పెరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త అవెంజర్, పల్సర్ ఆర్ఎస్ 200, పల్సర్ ఏఎస్ 200 వంటి తదితర బైక్స్ ఆవిష్కరణ వల్ల నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో కంపెనీ మార్కెట్ వాటా రూ.లక్ష లోపు స్పోర్ట్స్ వాహన విభాగంలోనూ 53 శాతానికి చేరినట్లు పేర్కొంది. ఎంట్రీ, స్పోర్ట్స్ విభాగాల వాటా మొత్తం పరిశ్రమలో 43 శాతంగా ఉందని, ఇందులో తమ కంపెనీ 36 శాతం వాటాతో అగ్రపథంలో దూసుకెళ్తోందని బజాజ్ ఆటో (మోటార్‌సైకిల్స్ బిజినెస్) ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. టూవీలర్ మార్కెట్లో ఎంట్రీ, ఎగ్జిక్యూటివ్, స్పోర్ట్స్ అనే మూడు విభాగాలు ఉంటాయి. -
1 నవంబర్,1800 వైట్‌హౌస్ ప్రవేశం!
ఆ నేడు అమెరికా అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ తన నివాసాన్ని తొలిసారిగా వైట్‌హౌస్‌లోకి మార్చారు. అంతకు ముందు వరకు అమెరికా అధ్యక్షుని నివాసం ఫిలడెల్ఫియాలోని మార్కెట్ స్ట్రీట్ మ్యాన్షన్‌లో ఉండేది. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ , పెన్సిల్వేనియాలో (వాషింగ్టన్) ఎంపిక చేసిన స్థలంలో 1792లో కట్టడం మొదలు పెట్టారు. రెండో అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్ హయాం లో పూర్తయింది. దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు 13 కోట్ల రూపాయలు ఖర్చయిందని అంచనా. వైట్‌హౌస్‌లో ఉన్న తొలి అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. అప్పటినుంచి అమెరికా అధ్యక్షులందరూ ఇందులోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వైట్‌హౌస్ అని వ్యవహరిస్తున్న ఈ భవనానికి దాన్ని కట్టాక వందేళ్లకి కానీ ఆ పేరు ఏర్పడలేదు. ఒకసారి అది కాలిపోయిన ప్పుడు మరమ్మతుల కోసం తెల్లరంగు వేశారు. దాంతో ప్రజలు దానిని వైట్‌హౌస్ అని పిలిచేవారు. అయితే అధికారికంగా మాత్రం 1901లో థియోడర్ రూజ్వెల్ట్ దీనిని వైట్ హౌస్ అని పిలిచారు. అత్యవసర సమయంలో విధులు నిర్వహించేందుకు వీలుగా దీని భూగర్భంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఓ బంకర్ ఉంది. -
50 ఏళ్ల తరువాత నోటీసులా?
భూ రికార్డుల్లో తప్పుడు ఎంట్రీలపై కొనుగోలుదారులకు నోటీసులా.. తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: తప్పుడు పద్ధతుల ద్వారా లబ్ధిదారు పొందిన ఉత్తర్వులను సరిచేసే అధికారం ప్రభుత్వానికి కొంతకాలం వరకే ఉంటుందని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహేతుక కాలపరిమితిలోపే ఆ ఉత్తర్వులను సరిచేయాలని పేర్కొంది. దాదాపు యాభై ఏళ్ల క్రితం నాటి భూ రికార్డుల్లోని ఎంట్రీలు తప్పుడువని, వాటని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రంగారెడ్డి జిల్లాలోని గోపన్‌పల్లి గ్రామస్తులకు యాభై సంవత్సరాల తరువాత షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. రికార్డుల్లో తప్పుడు ఎంట్రీలు పడిన 50 ఏళ్ల తరువాత(2004లో) ఆంధ్రప్రదేశ్(తెలంగాణ ప్రాంతం) భూ రెవెన్యూ చట్టంలోని సవరణ అధికారాన్ని (రివిజన్ పవర్) ఉపయోగించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఎంతకాలం లోపు రివిజన్ పవర్ ఉపయోగించాలన్న విషయంలో స్పష్టత లేకున్నా.. ఇన్నాళ్ల తరువాత దాన్ని ఉపయోగించడం న్యాయపాలనకు విరుద్ధమని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ సీ నాగప్పన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. మానవ జీవితంలోని అన్ని చర్యలు, లావాదేవీలను ఏనాటికైనా సవాలు చేసే అవకాశం ఉండటం సమాజంలో అస్థిరతకు దారితీస్తుందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. న్యాయపాలన ప్రజాజీవితానికి అనుగుణంగా ఉండాలని తీర్పు రాసిన జస్టిస్ నాగప్పన్ సూచించారు. ఒక లావాదేవీ తప్పని తేలితే.. ఎప్పటికైనా దాన్ని సరిచేయొచ్చనే భావన సరికాదని, ఆ సందర్భాల్లో రివిజన్ పవర్‌ను ఉపయోగించడం కూడా తప్పే అవుతుందని జస్టిస్ ఠాకూర్ తేల్చి చెప్పారు. రివిజన్ పవర్‌తో జారీ చేసిన నోటీసులు న్యాయ విరుద్ధమని హైకోర్టు తీర్పివ్వడం సరైన చర్యేనన్నారు. విషయమేంటంటే: రంగారెడ్డి జిల్లా, గోపనపల్లి గ్రామంలో జాగిర్దార్ల ద్వారా తమకు సంక్రమించిన భూమిలో 90 ఎకరాలను పలువురు పట్టాదారులు అమ్మేశారు. అయితే, ఆ జాగిర్దారీ వ్యవస్థ అప్పటికే రద్దయినందున ఆ వ్యవస్థ ద్వారా సంక్రమించిన భూమిని ‘చిన్న కంచ’(పశువుల మేత కొరకు ఉపయోగించే భూమి)గా వర్గీకరించారని, అది ప్రభుత్వానికి చెందుతుందని, ఆ భూమిని అప్పటి పట్వారీ తప్పుగా రికార్డుల్లో చూపారని పేర్కొంటూ రివిజన్ పవర్ ద్వారా ఆ భూమిని కొన్నవారికి 2004లో ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గోపన్‌పల్లి గ్రామంలోని ఆ 90 ఎకరాలు సహా మొత్తం 477 ఎకరాలను ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ 1991లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
క్యా సీన్ హై!
అనిల్‌కపూర్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో ఎస్టాబ్లిష్ అయ్యేందుకు తాపత్రయ పడుతున్న ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ ఎప్పుడూ కొత్తదనం కోసం తాపత్రయపడుతుంటోంది. అందుకు నిదర్శనం... ఈ చిన్నది చేస్తున్న తాజా చిత్రం ‘డాలీ కీ డోలీ’లో పెళ్లి పేరుతో మగవారిని ఆటపట్టించే పాత్ర వేస్తోంది. అందులోని ఒకే ఒక్క సన్నివేశానికి ఏకంగా పదహారు రకాల పెళ్లికూతురు గెటప్‌లు మార్చేసిందట. మహారాస్ట్రియన్, కేథలిక్, గుజరాతీ, ముస్లిం, దక్షిణభారత తదితర పెళ్లి కూతురిలా సింగారించుకుందని సమాచారం. అయితే దర్శకుడు చెప్పినదానికి విసుక్కోకుండా... వెంటవెంటనే వెళ్లి ఓపిగ్గా డ్రెస్సులు మార్చుకుని వచ్చిందట సోనమ్. -
కుప్పలు తెప్పలు...
సంక్షేమ దరఖాస్తులు 12 లక్షలు పైనే... అధికారుల అంచనాలు తలకిందులు గడువులోగా విచారణ కష్టమే సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ‘సంక్షేమ’ దరఖాస్తులు అధికారుల అంచనాలకు మించి వచ్చాయి. ఇప్పటి వరకు పన్నెండు లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ఆహార భద్రత కార్డుల కోసం సోమవారం నాటికి రేషన్ షాపుల్లోని కేంద్రాలకు 8 లక్షల 7వేల 872 దరఖాస్తులు వచ్చాయి. ఇక నిర్ణీత సమయంలో ఈ దరఖాస్తులను ఎంట్రీ చేయడం, లెక్కించటం, విచారణ చేపట్టడం కష్టమవుతుందని ఒక ఉద్యోగి ఆవేదన వ్యక్తంచేశారు. కాగా ప్రభుత్వం మొదట దరఖాస్తుల స్వీకరణకు సోమవారం వరకు గడువు విధించినప్పటికీ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అంచనాకు మించి... అంచనాలకు మించి నగరంలో సంక్షేమ పథకాల కోసం లక్షల్లో దరఖాస్తులు రావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం తెల్లరేషన్ కార్డులు 6.24 లక్షలు ఉండగా ... తాజాగా దరఖాస్తులు మాత్రం 8,07,872 వచ్చాయి. అదేవిధంగా సామాజిక పెన్షన్లు 87 వేల 477 ఉండగా.. తాజాగా 1, 28,101 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా పెన్షన్లు ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ముందుగా పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, విచారించవలసి ఉంది. వచ్చేనెల 8 నుంచి కొత్త వారికి పెన్షన్లు పంపిణీ చేయాలనే యోచనతో ప్రభుత్వం ఉండటంతో అధికార యంత్రాంగం దృష్టిసారించింది.