రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. 2023లో చివరిసారిగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే ఇటీవల కుటుంబంతో కలిసి ఆధ్యాత్రిక యాత్రలో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితమే కాశీ పర్యటనకు వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైంది రేణు దేశాయ్. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందించింది.
రేణు దేశాయ్ మాట్లాడుతూ..' ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒక మదర్‌గా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి. అంతవరకు వెయిట్ చేయండి' అని అన్నారు.
గోదావరి జిల్లాల గురించి మాట్లాడుతూ..'గోదావరి జిల్లాల్లో ఉండే అందమైన లొకేషన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు అద్భుతంగా ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు నిర్ణయించడం సంతోషం. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషమే. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశా' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment