Akira Nandan
-
సినిమాల్లోకి అకీరా నందన్.. రేణు దేశాయ్ ఏమన్నారంటే?
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. 2023లో చివరిసారిగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే ఇటీవల కుటుంబంతో కలిసి ఆధ్యాత్రిక యాత్రలో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితమే కాశీ పర్యటనకు వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైంది రేణు దేశాయ్. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందించింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ..' ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒక మదర్‌గా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి. అంతవరకు వెయిట్ చేయండి' అని అన్నారు.గోదావరి జిల్లాల గురించి మాట్లాడుతూ..'గోదావరి జిల్లాల్లో ఉండే అందమైన లొకేషన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు అద్భుతంగా ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు నిర్ణయించడం సంతోషం. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషమే. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశా' అని అన్నారు. -
అకీరా విషయంలో టెన్షన్ పడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
-
పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్
టైగర్ నాగేశ్వరరావు... 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ. జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో రవితేజ కథానాయకుడిగా వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత నటి రేణూదేశాయ్ ఈ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) రేణు దేశాయ్ పేరు వినిపించగానే పవన్ కల్యాణ్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు ఆపై కష్టాలు అని చెప్పుకుంటారు. ఇవన్నీ గత 20 ఏళ్లుగా ఆమె గురించి తెలిసినవే.. అయితే ఈ కష్టాలు తన జీవితంలోకి పవన్ కళ్యాణ్ రాక ముందు నుంచే ఉన్నాయని ఆమె తాజా ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'మా అమ్మ నాన్నలు అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు. కానీ నేను అమ్మాయిగా పుట్టాను. అలా నా ఇంట్లోనే లింగ వివక్షకు గురి కావడం జరిగింది. చాలా మందికి నేనంటే.. నా పెళ్లి ఆపై విడాకులు గురించే చర్చిస్తారు. కానీ చిన్నప్పటి నుంచే నేను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మా నాన్న కోరిక ప్రకారం అబ్బాయి పుట్టలేదని.. నేను పుట్టిన తరువాత మూడు రోజుల పాటు నా తండ్రి నా ముఖం కూడా చూడలేదు. నాకు ఊహ తెలిసొచ్చాక ఈ విషయం మా అమ్మ నాకు చెప్పేసరికి చాలా బాధ వేసింది. ఆ బాధ నాలో ఇప్పటికీ ఉండిపోయింది. తర్వాతి ఏడాదిలో మా తమ్ముడు పుట్టేశాడు. అప్పుడు వాడ్ని రాజాబాబులా పెంచారు. దాన్ని బట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు. నేను ఎలాంటి పరిస్థితుల్లో పెరిగానో.. ఎలా పెంచారో. ఆ వివక్ష అనేది కంటిన్యూ అవుతూనే ఉంది.' అని రేణు ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా తన కుటుంబంలో ఆడబిడ్డని ఒకలా.. మగ బిడ్డని మరోలా చూశారని ఆమె చెప్పుకొచ్చారు. తన జీవితంలో తల్లి ఉండి కూడా తల్లి ప్రేమను పొందలేకపోయానని ఎంతో బాధతో చెప్పారు. జీవితంలో తన విడాకుల ఇష్యూ కంటే అదే ఎక్కువ బాధపెట్టిందని రేణు దేశాయ్ చెప్పారు. ఇలాంటి పేరెంట్స్ చాలా రేర్‌గా ఉంటారని ఈ జన్మలో అది తన దురదృష్టం అని ఆమె తెలిపారు. అంతేకాకుండా తను 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంట్లో ఆ తేడా చూశానని చెప్పారు. తన బాగోగులు ఇంట్లోని పనివాళ్లే చూసుకున్నారని ఆమె వాపోయారు. తల్లిదండ్రుల ప్రేమను పొందాలని స్కూల్ల్లో బాగా చదివేదాన్ని.. అమ్మకు నచ్చేలా నడుచుకునేదానిని.. వారు నన్ను మెచ్చుకోవాలని కోరుకునేదానిని.. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లి ప్రేమ తనకు దొరకలేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు. 'ఆ బాధ పట్టలేక, నాకు 19 ఏళ్లు వచ్చిన తర్వాత ఒకరోజు అమ్మని అడిగాను. అమ్మా.. నీ ప్రేమ నాకు ఎందుకు ఇవ్వడం లేదు. నీ ప్రేమ నాకూ కావాలమ్మా.. ఆ ప్రేమా ఇవ్వు అమ్మా అని అడిగాను. వాటికి అమ్మ నుంచి సమాధానం లేదు. అందుకే నేను జీవితంలో ఏమైతే కోల్పోయానో నా బిడ్డలు అది కోల్పోకూడదు. అందుకే నా బిడ్డలకు రెట్టింపు ప్రేమను పంచుతున్నాను. శక్తికి మించి నా బిడ్డలకు ఎక్కువ ప్రేమను పంచాను. అకీరా,ఆద్యా ఇద్దరూ నాకు సమానమే. వారిలో ఎవరినీ ఎక్కువ, తక్కువగా చూడలేదు. వారిద్దరీ కోసం నేను ఎన్ని కష్టాలు అయినా భరిస్తాను.' అని రేణు దేశాయ్ కొంతమేరకు ఎమోషనల్ అయ్యారు. -
అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. అక్టోబర్ 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న నటి రేణు దేశాయ్.. తన గురించి, సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) హేమలత లవణం పాత్ర గురించి? హేమలత లవణం.. ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్ ఖండ్ వెళ్ళి అక్కడ బందీపోట్లని కలిశారు. జోగిని వ్యవస్థ, అంటరానితనంపై పోరాటం చేశారు. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం. రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఓ మంచి అనుభవం. హీరోయిన్, డిజైనర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఈ జర్నీ ఎలా ఉంది? నేను డిజైనర్ కాదు. ఒరిజినల్ స్టయిలిస్ట్‌ని. కలర్స్‌పై మంచి అవగాహన వుంది. ఏ కలర్‌కి ఏది మ్యాచ్ అవుతుందో నాకు తెలుసు. ఖుషి సినిమాకు అనుకోకుండా స్టైలిష్ట్‌గా మారాను. అలాగే సామాజిక కార్యక్రమాలు, కవిత్వం రాయడం.. వీటిలో ఏది ప్లాన్ చేసి చేసినవి కాదు. (ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు షూటింగ్లో ప్రమాదం.. రవితేజ మోకాలికి తీవ్ర గాయం..) అకీరా హీరోగా ఎప్పుడు? హీరోగా చేయాలనే ఆసక్తి అకీరాకి ఈ క్షణం వరకూ లేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా. నటన కొనసాగిస్తారా? నాకు నటన ఎప్పుడూ కొనసాగించాలనే వుంటుంది. నా వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. (ఇదీ చదవండి: 'వ్యూహం' ట్రైలర్: కల్యాణ్‌కు తెలివి లేదు.. ఎన్నికల తర్వాత గ్లాస్ పగిలిపోతుంది) -
ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు
టాలీవుడ్ దర్శకుడు కే రాఘవేంద్ర రావు ఒక ఫోటో షేర్ చేశారు. అందులో రేణుదేశాయ్- పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఉన్నారు. దీంతో ఆ ఫోటో ఒక్కసారిగా వైర్లా కావడం పలు కామెంట్లు వస్తుండటంతో కొంత సమయం తర్వాత రాఘవేంద్ర రావు తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించారు. ఫోటో సంగతేంటి .. రాఘవేంద్ర రావు, అతని అల్లుడు శోభు యార్లగడ్డ, దర్శకుడు రాజమౌళి అందరూ 'బాహుబలి' మ్యూజిక్ సింఫనీ ఉంటే నార్వే వెళ్లారు. అక్కడ శోభు కుమారుడు, రాఘవేంద్ర రావు మనవుడు అయిన కార్తికేయ , అకిరా నందన్‌తో ఫోటో దిగారు. ఆ ఫోటోను షేర్ చేస్తూ.. ఫోర్త్ జనరేషన్ అఫ్ బాయ్స్ అమెరికాలోని ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యారని క్యాప్షన్ పెట్టారు. ఇంకేముంది అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు నెట్టింట వైరల్ అయింది. ఫోటోపై స్పందించిన రేణుదేశాయ్ సోషల్ మీడియాలో అకిరా నందన్ ఫోటోను షేర్ చేస్తూ రేణు దేశాయ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు. ఈ రూమర్లకు ఆమె ఫుల్స్టాప్ పెట్టేసింది. అకిరా ఏ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదని క్లారటీ ఇచ్చింది. ప్రస్తుతం అకిరాకు యాక్టింగ్ మీద అంతగా ఆసక్తి లేదని తెలిపింది. ఇప్పట్లో అతనికి సినిమాల్లో నటించాలనే కోరిక లేదు. ఒక వేళ అకిరాకు సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి ఉండి నటించాలనే ఆసక్తి కలిగితే ఆ విషయాన్ని ముందుగా తానే చెప్తానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) (ఇదీ చదవండి: రాజకీయాల్లో చిరు ఓడిపోవచ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే') -
నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!
ఇపుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలకు ముప్పు వస్తుందన్న ఆందోళనకు తోడు చాలామంది ఔత్సాహిక ఆర్టిస్టులు ఏఐ పిక్స్‌తో సందడి చేస్తున్నారు. అద్భుతంగా ఉంటున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. (టొమాటో రైతుకు జాక్‌పాట్: నెల రోజుల్లో కోటిన్నర) దీనికితోడు ఏఐ వీడియోలు ప్రముఖంగా నిలస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ యాంకర్ లేటెస్ట్ సోషల్‌మీడియా సెన్సేషన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవలో నటి రేణూ దేశాయ్ నిలిచారు. అయితే ఇవి సొంతంగా తను సృష్టించు కున్నవి మాత్రం కాదు. రేణూ కుమారుడు అకీరానందన్ క్రియేట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఏఐ నిజంగానే భయపెడుతోంది అంటూ ఈ పిక్స్‌ను పోస్ట్ చేశారు. (Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం) దీంతో లేదు.. లేదు.. ఏఐ అద్భుతం..! మీరు చాలా అందంగా ఉన్నారు. సూపర్ రేణూగారు..నిజానికి థ్రో బ్యాక్ పిక్స్ అంటే సరిపోతుందేమో. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నాయంటూ కమెంట్స్ చేశారు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకిరా, గౌతమ్
-
అకీరా నందన్ సినిమాలు చేయడా? రేణు దేశాయ్ ఏమందంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ నేడు(ఏప్రిల్ 8న) 18వ వడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడి తల్లి, నటి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇందులో అకీరా బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. పంచ్ మీద పంచ్ కొడుతూ బాక్సింగ్ సాధన చేస్తున్నట్లు కనిపిస్తోంది. అభిమానులతో అకీరా వీడియో పంచుకున్న రేణు దేశాయ్ 'అకీరా నాకు మంచి తనయుడు మాత్రమే కాదు ఆద్యకు గొప్ప సోదరుడు కూడా! అలాగే అతడి ఫ్రెండ్స్‌కు మంచి మిత్రుడు కూడా! అతడు ఎంతో మంచి మనసున్న జెంటిల్మెన్. ఈరోజు 18వ పుట్టినరోజు జరుపుకుంటున్న అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అకీరాకు బర్త్‌డే విషెస్ పంపుతున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకీరాను ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు అకీరా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ ప్రచారం చేయగా దాన్ని రేణు దేశాయ్ తప్పుపట్టింది. అతడికి యాక్టర్ అవ్వాలని లేదని కుండ బద్ధలు కొట్టింది. అంతేకాకుండా అతడు ఇప్పటివరకు ఏ సినిమాకు సంతకం చేయలేదని, దయచేసి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. View this post on Instagram A post shared by renu (@renuudesai) చదవండి: శంకర్ ఆఫర్‌ను తిరస్కరించిన అగ్ర నటుడు, అసలేం జరిగిందంటే -
‘హరిహర వీరమల్లు’లో అకీరా?, తండ్రితో కలిసి పలు సీన్స్‌లో సందడి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి రాకముందే అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అకీరా బర్త్ డే రోజున మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుతారనే సంగతి తెలిసిందే. అయితే అకీరా టాలీవుడ్ ఎంట్రీ కొంతకాలంగా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మారాఠిలో ఓ చిత్రం చేసిన అకీరా వెంటనే తెలుగులో ఓ మూవీ చేయబోతున్నాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే అకీరా సినిమా, తెలుగు వెండితెర ఎంట్రీపై ఇప్పటికీ క్లారిటీ లేదు. చదవండి: విజయ్‌పై ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో మెగా అభిమానులంత పండగ చేసుకునే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. అదేంటంటే అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైందని, తన తండ్రి పవన్ సినిమాతోనే తెలుగు తెరపై సందడి చేయబోతున్నాండంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత ఏఎంరత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చదవండి: కూకట్పల్లి కోర్టులో సమంతకు ఊరట ఈ సినిమాలో అకీరా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడని టాక్. కాగా ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభమం కాబోతోంది. అయితే, ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం అకీరా నందన్‌ను తీసుకుంటున్నట్టుగా సమాచారం. తండ్రి పవన్‌తో పాటు అకీరా కలిసి పలు సీన్లలో అలరించనున్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో నిధీ అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ హీరోయిన్స్ కాగా.. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
అకీరా కర్రసాము వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్
-
అకీరా నందన్ అద్భుత విన్యాసం: నెటిజనుల సందడి, వైరల్
సాక్షి, హైదరాబాద్: నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తనయుడు అకిరా నందన్ తన టాలెంట్‌తో మరో సారి వార్తల్లో నిలిచారు. మార్టల్ ఆర్ట్స్‌లో ఇప్పటికే తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అకీరా కర్రసాము చేస్తున్న వీడియోను రేణూ ఇన్‌స్టాలో షేర్ చేశారు. తండ్రి పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో లాగా కర్ర సాము ఇరగదీస్తున్నాడంటూ అభిమానులు కామెంట్ చేశారు. తండ్రికి తగ్గ తనయుడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అకీరా ఒడుపుగా కర్రసాము చేస్తున్న వీడియోకి రేణూ పాప్ స్టార్ మైకేల్ జాన్స్ బిల్లీ జీన్ సాంగ్‌ను యాడ్ చేశారు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు జానీ-2 పేరుతో అకీరాని పరిచయం చేయమంటూ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. కాగా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అకీరా ఎంట్రీపై ఇపుడు తానేమీ చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన రేణూ దేశాయ్ అకీరా తెరంగేట్రం ఊహాగానాలకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ లో అకీరా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. @PawanKalyan ❤️🙏 దేవర తండ్రికి తగ్గ 🔥 తనయుడు #AkiraNandan 😍🥰@ganeshbandla #PawanKalyan #HariHaraVeeraMallu #BheemlaNayak #PSPKRanaMovie #ProductionNo12 #PSPK28 pic.twitter.com/5IpG7bNDJV — SHOBAN NAIDU (@pagadalapavan00) August 3, 2021 -
అకీరా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణూ దేశాయ్
నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్యకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పుకప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటికే పరిమితమైన రేణూ.. ఆపదకాలంలో ప్రజలకు తోడుగా తనవంతు సాయం చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ ధైర్యాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నెటిజన్లు అకీరా ఎంట్రీ గురించి పదేపదే అడుగుతున్నారు. నెటిజన్ల పోరు భరించలేక.. సింపుల్‌గా ఒక పోస్ట్పెట్టి తప్పించుకున్నారు రేణూ దేశాయ్. అకీరా ఎంట్రీ గురించి చెప్పే సమయం ఇది కాదని, కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కాకపోతే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని రేణు అన్నారు. దీంతో త్వరలోనే అకీరా ఎంట్రీ ఉంటుందిని అంతా భావిస్తున్నారు. మరోవైపు రేణూ దేశాయ్ అకీరాతో దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ ప్రపంచంలో నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగల ఒకే ఒక్కడు అకీరా. అతని జోకులు వింటుంటే నా జోకులే నన్ను నవ్విస్తున్నట్టు ఉంటుంది’అని రేణు చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by renu (@renuudesai) చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ అలాంటి మెసేజ్‌లు చేస్తే పోలీసులకు చెప్తా: రేణు దేశాయ్ -
నిహారిక మెహందీ ఫంక్షన్లో పవన్,అకిరానందన్
-
పవన్ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్
ముంబై: రేణు దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘బద్రి’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జోడిగా నటించిన ఆమె పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వార్దిదరూ విడిపోయి వేరుగా ఉంటున్నారు. వీరికి కుమారుడు అకిరా నందన్, కూతురు ఆధ్యలు ఉన్న విషయం తెలిసిందే. అయితే పవన్, రేణులు విడిపోయినప్పటికి తామీద్దరం స్నేహితులమేనని, తాము ఎప్పుటికి మంచి శ్రేయోభిలాషులుగా ఉంటామంటూ రేణు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేగాక పవన్ కూడా అప్పడప్పుడు వారి దగ్గరికి వెళుతుంటారని పిల్లలతో సరదాగా సమాయాన్ని గుడుపుతుంటారని ఆమె చెప్పేవారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కొడుకు అకిరా, కూతురు ఆధ్యలను ఒళ్లో కూర్చోపెట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను రేణు దేశాయ్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (చదవండి: లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్..) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) ఈ ఫొటోకు రేణు.. ‘కొన్ని మధురమైన జ్ఞాపకాలకు సంబంధించిన ఫొటోలను పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అరుదైన ఫొటోను నా కెమెరాలో బంధించాను. ఇలాంటి అందమైన ఫొటోలు కేవలం నా ఫోన్ గ్యాలరీకే పరిమితం కాకుడదని షేర్ చేశాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురు, కొడుకును ఇరువైపుల కూర్చొపెట్టుకుని వారిని ముద్దాడుతున్న పవన్ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే పవన్‌తో విడిపోయిన అనంతరం రేణు దేశాయ్ తన పిల్లలిద్దరితో కలిసి పుణేలో సెటిల్ అయిపోయారు. తల్లిగా పిల్లల బాధ్యతను ఆమె చూసుకుంటున్నారు. రేణు ప్రస్తుతం మరాఠి సినిమాలను నిర్మిస్తూ.. ఇటూ తెలుగు టీవీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. అంతేగాక సినిమాల్లో తిరిగి నటించనున్నట్లు ఇటీవల ఆమె వెల్లడించారు. (చదవండి: మళ్లీ వస్తున్నా, ఆశీర్వదించండి: రేణూ దేశాయ్) -
మహేష్ సినిమాలో నటించడంపై రేణు స్పందన
సాక్షి, హైదరాబాద్ : తన కుమారుడు అకీరా నందన్ సినీరంగ ప్రవేశంపై నటి, దర్శకురాలు రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం దర్శకురాలిగా బిజీగా ఉన్న రేణు.. ఆదివారం ‘జూమ్’ ద్వారా సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆద్య వయస్సు చాలా చిన్నది. తనకు మ్యూజిక్ అంటే ఇష్టం. అకీరా వయసు కూడా ఇప్పుడు 16 ఏళ్ల మాత్రమే. మనకు ఒకటే జీవితం ఉంది.. ఒక మంచి మనిషి ఉండటం చాలా ముఖ్యమని నేను అకీరాకు చెప్తాను. అకీరా ఏ వృత్తి ఎంచుకున్న నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. హీరో కావడం అనేది పూర్తిగా తన ఇష్టం. వాళ్ల నాన్న, పెద్దనాన్న, అన్న హీరోలు అనే ఆలోచనతో తాను కూడా హీరో అయిపోవాలనే ఒత్తిడి తీసుకోవద్దని చెప్తాను. తనకు ఇష్టమైనది చెయ్యమని చెప్పాను. హీరో కావాలని అనుకుంటే అందుకు నా సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సినీ ఫీల్డ్‌లో ఉందని కాకుండా.. అతని లోపలి నుంచి ఆ నిర్ణయం రావాలి’ అని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతిపై రేణు స్పందిస్తూ.. బంధుప్రీతి అనేది చాలా సున్నితమైన అంశమని తెలిపారు. ప్రతి చోట బంధుప్రీతి అనేది ఉందని.. అది లేదని చెబితే మనం అబద్ధం చెప్పినట్టేనని అన్నారు. తొలి ఒకటి రెండు చిత్రాల వరకే నెపోటిజమ్ పనిచేస్తుందని.. ఆ తర్వాత అంతా ట్యాలెంట్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మరోవైపు మహేష్‌బాబు సినిమాలో రేణుదేశాయ్ నటించబోతున్నారని వస్తున్న వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘నేను విన్న అతి పెద్ద బేస్‌లేస్ రుమార్ ఇది. రెండు మూడు రోజుల నుంచి చాలా మంది నాకు కాల్స్ చేసి విష్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసినవారికి హ్యాట్సాఫ్. కానీ ఈ సినిమాతో నాకు పూర్తిగా సంబంధం లేదు. ఇంత పెద్ద సినిమా ఒప్పకున్నప్పుడు తప్పనిసరిగా నేను ప్రకటన చేస్తాను. నాకు నటించాలనే ఉంది. గతంలో ఓ సందర్భంలో మదర్ రోల్ గురించి అడిగినప్పుడు.. హీరో చిన్నప్పటి క్యారెక్టర్లకు తల్లిగా చేసేందకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. దాన్ని బేస్ చేసుకుని ఎవరో ఇలాంటి వార్తలు సృష్టించారు’ అని రేణు వెల్లడించారు. -
అకీరా బర్త్‌డే.. చిరు ఆకాంక్ష అదే!
మెగాఫ్యామిలీ అభిమానులకు ఈ రోజు డబుల్ ధమాకా. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, లిటిల్ పవర్‌స్టార్ అకీరా నందన్ల పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో విషెస్‌ల మోత మోగిపోతుంది. వీర్దిదరికి ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలిపారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి బన్ని, అకీరాలకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ముఖ్యంగా అకీరాకు చిరు బర్త్‌డే విషెస్ తెలపడం పట్ల అటు మెగాస్టార్, ఇటు పవర్‌స్టార్ ఫ్యాన్స్ మురిపిపోతున్నారు. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి. విష్ యూ ఏ పవర్ ఫుల్ ప్యూచర్. హ్యాపీ బర్త్ డే అకీరా’అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాకుండా అకీరాను ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. చిరంజీవితో పాటు మెగా కుటుంబసభ్యులు, మెగా ఫ్యాన్స్ కూడా అకీరాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మొదటి సంతానమే అకీరా నందన్. పవన్ కల్యాణ్ తర్వాత వారసుడు అతడే అంటూ ఫ్యాన్స్ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. ఇక పవన్, రేణులు విడిపోయినప్పటికీ తన తండ్రిని చూడటానికి అకీరా అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తుంటాడు. అంతేకాకుండా పెద్దనాన చిరంజీవి ఫ్యామిలీతో కూడా ఈ లిటిల్ పవర్‌స్టార్‌కు మంచి బాండింగ్ ఉంది. 16ఏళ్ల అకీరా ఇప్పటికే మలయాళం చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.Wish you a "Power"ful future. Happy Birthday Akira! #8thApril pic.twitter.com/wDO7qSwxHx — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020 చదవండి: ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి పెద్దాయన సన్ గ్లాసెస్ వెతకండ్రా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_691245605.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘జూనియర్ పవర్ స్టార్ అనొద్దు’
నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్ తన పిల్లల గురించి సోషల్ మీడియాలో తరుచూ పోస్టింగ్స్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా రేణు తన కుమారుడు అకీరాను జూనియర్ పవర్‌స్టార్ అనకూడదని తెలిపారు. అలా పిలవడం అకీరాకు గానీ, తల్లినైనా నాకు గానీ, అతని నాన్నకు గానీ ఇష్టం లేదన్నారు. ఇకనైనా అలా పిలువడం ఆపాలని కోరారు. ఏవరైనా అలాంటి కామెంట్లు చేస్తే తన పీఆర్ టీమ్ వాటిని తొలగిస్తుందని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరా ల్యాప్ టాప్‌లో గేమ్ కోసం వెతుకుతున్న ఫొటోను ఉంచిన రేణు.. తను యూరోపియన్ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ని తలపిస్తున్నాడని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇకపై అకీరాను అలా అనవద్దని సూచన కూడా చేశారు. కాగా రేణు పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. -
చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం..
సాక్షి, హైదరాబాద్ : నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్ తన పిల్లల గురించి సోషల్‌మీడియా తరచూ పోస్టింగ్స్ చేస్తూ ఉంటారు. ఎప్పటిలానే సోమవారం కూడా ఆమె ఓ పోస్టు చేశారు. ‘ఒక హృదయం, ఒక ఆత్మ.. మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను, మీ కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను. ఓ తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత.. నిర్విరామంగా ఈ క్యూటీల ఫొటోలను తీస్తూనే ఉండగలను’ అంటూ అకీరా, ఆద్యలతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారామె. రేణు దర్శకురాలిగా ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాను తెరకెక్కించారు. 2014లో విడుదలైన ఈ సినిమాలో అకీరా కూడా తళుక్కుమని మెరిశాడు. -
నా కొడుకు జూనియర్ పవర్ స్టార్ కావొద్దు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్లో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. గతేడాది అకీరా పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో మూడు పండుగలంటూ ట్వీట్ చేసిన రేణు.. ఈ ఏడాది అందుకు భిన్నంగా స్పందించారు. ప్రపంచంలో తనకంటూ అకీరా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆపై తన కొడుకు ఎప్పటికీ జూనియర్ పవర్ స్టార్ గా ఉండకూడదని.. అకీరా నందన్ గా సొంతంగా పేరు తెచ్చుకుంటే బాగుంటుందని ఆకాంక్షించారు. తన కొడుకుపై ఆ నమ్మకం ఉందని, హ్యాపీ బర్త్ డే మై లిటిల్ స్వీట్ హార్ట్ అకీరా అని రాసుకొచ్చారు. 'అకీరాకు ఇప్పుడు 13 ఏళ్లు. అయితే ఈ వయసులోనే అకీరా ఆరడుగుల టీనేజర్ కావడంతో నమ్మలేకపోతున్నాను. అకీరా ఎప్పటికీ తల్లిదండ్రుల పేరుతో కాదు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా జూనియర్ పవర్ స్టార్ అనే ముద్ర కంటే అకీరా నందన్ పేరుతోనే పాపులర్ అవ్వాలి' అని తల్లిగా నటి రేణు దేశాయ్ కోరుకుంటున్నారు. 13!!!!! Still can't believe my little one is a 6foot tall teenager!!! I am truly at loss of… https://t.co/wkHwK6Xhkn — renu (@renuudesai) 8 April 2017 ❤️ pic.twitter.com/ICzFmmNdfl — renu (@renuudesai) 8 April 2017 -
అకీరా గురించి రేణు దేశాయ్ టెన్షన్..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్.. తల్లి రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇష్క్ వాలా లవ్'లో ఓ చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం మరాఠీలో రూపొందించిన ఈ సినిమాను ప్రస్తుతం తెలుగులో డబ్ చేశారు. త్వరలో ఈ చిత్రాన్ని టెలివిజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 'ఇష్క్ వాలా లవ్'తో అకీరా మినీ స్క్రీన్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. అకీరాను పవన్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని రేణు ఆందోళన పడుతోంది. 'అకీరా తొలి పరిచయం గురించి ఓ చిన్నమాట.. ఈ సినిమాలో నటించినప్పుడు మా అకీరాకి 9ఏళ్లు. ఈ చిన్న డెబ్యూ రోల్‌కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని నా విన్నపం' అంటూ అభిమానులను ఉద్దేశించి ట్విట్టర్లో ఇటీవలే ఓ చిన్న నోట్ పోస్ట్ చేసింది రేణు. కాగా మరాఠీలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న అకీరా.. ఇప్పుడు తెలుగులో కూడా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నాడట. అదే సంబరంగా చెప్పుకుంటుంది రేణు. తనయుడిని డైరెక్ట్ చేయడం అనేది తల్లిగా తనకు సెంటిమెంటల్ మొమెంట్ అంటోంది. Akira himself had dubbed both the Marathi and Telugu lines ☺️ https://t.co/PXqiqt3oq6 — renu (@renuudesai) 23 August 2016 -
ప్రమాదంలో గాయపడ్డ పవన్ కొడుకు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ ప్రమాదంలో గాయపడ్డాడు. అకీరా సైకిల్‌పై నుంచి పడటంతో గాయాలయ్యాయి. రేణు దేశాయ్ వెంటనే అకీరాను ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అది పేరున్న ఆస్పత్రి అయినా అకీరాకు చికిత్స చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చూపారు. అతనికి ఆలస్యంగా చికిత్స చేశారు. సోమవారం రేణు ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో తెలియజేసింది. వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అకీరా సైకిల్ ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడ్ని పేరున్న ఆస్పత్రికి తీసుకెళ్లాను. గాయపడిన చిన్న పిల్లాడికి వైద్యం చేయకుండా వైద్యులు ఆలస్యం చేశారు. బాధతో ఎదురు చూడాల్సివచ్చింది. చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం కంటే చనిపోవడం నయం. డాక్టర్ల నుంచి నర్సుల వరకు మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం మానవత్వాన్ని చంపేస్తోంది' అని రేణు ట్వీట్ చేసింది. కాగా అకీరాకు ప్రమాదం ఎప్పుడు జరిగింది, తీసుకెళ్లిన ఆస్పత్రి పేరు, ఊరు వంటి విషయాలను రేణు వెల్లడించలేదు. ప్రస్తుతం అకీరా కోలుకుంటున్నాడు. అకీరా చేతికి ఫ్రాక్చర్ అయినట్టు రేణు కాసేపటి తర్వాత మరో ట్వీట్ చేసింది. అకీరా ముఖం, భుజం, మోకాలు, మేచేతిపై గాయాలయినట్టు వెల్లడించింది. అకీరా ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడని, అతను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. సామాన్యులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళితే బిల్లు తడిసి మోపెడవుతుంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తాయి కానీ సర్వీసు ఆ స్థాయిలో ఉండదన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి సెలెబ్రెటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రేణు దేశాయ్ కూడా బాధితురాలే. పవన్‌తో విడిపోయాక రేణు తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలసి పుణెలో ఉంటోంది. Akira had bad cycle accident,got him to one of d best hospitals&inspite of seeing an injuredchild d delay in treatmnt&waiting&insensitivity — renu (@renuudesai) May 9, 2016 He has a hand fracture, lots of face, knee, shoulder and elbow wounds. But he is okay now. Thank you sincerely for all the wishes for him :) — renu (@renuudesai) May 9, 2016 -
జూనియర్ పవన్‌లు ఏం చేశారు?
వినాయకచవితి వచ్చిందంటే పిల్లలకు పండగే. గణపతిని రకరకాలుగా అలంకరించడానికి పొద్దున్నే లేచి.. స్నానం చేసి రెడీ అయిపోతారు. తమకు చేతనైన రీతిలో అందంగా గణేశుడికి అలంకారాలు చేసి మురిసిపోతారు, మురిపిస్తారు కూడా. ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని తయారు చేయడం ఇప్పుడు అందరికీ బాగా అలవాటైంది. ఎలాంటి ప్లాస్టిక్ పదార్థాలు, కృత్రిమ రంగులు ఉపయోగించకుండా.. మట్టితోను, అందుబాటులో ఉన్న రంగులతోను వినాయకుడి విగ్రహాలను చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, ఆద్య ఇద్దరూ కలిసి మంచి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. పుణెలో తల్లి రేణు దేశాయ్ వద్ద ఉంటున్న అకీరా, ఆద్య కలిసి ఎలాంటి థర్మోకోల్, ప్లాస్టిక్ డెకరేషన్లు ఉపయోగించకుండా గణపతిని తయారు చేశారు. కొబ్బరి కాయలు, పూలు, పళ్లతో పూజ చేసుకున్నారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్వీట్ చేశారు. తమ పిల్లల కళను అందరికీ పరిచయం చేశారు. Tiny ecofriendly Ganpati Bappa made by Akira & Aadya :) No thermocol or plastic decorations:) #GanpatiBappaMorya pic.twitter.com/ewSBbUBPlE — renu (@renuudesai) September 17, 2015 -
ఇప్పటికీ నాలోని ప్రేమ అలాగే ఉంది: రేణూ దేశాయ్
‘బద్రి’, ‘జానీ’ చిత్రాల్లో కథానాయికగా నటించిన రేణూదేశాయ్, ఇప్పుడు దర్శక నిర్మాతగా కొత్త అవతారమెత్తారు. మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ పేరుతో ఆమె ఓ సినిమా డెరైక్ట్ చేశారు. ఆ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించి ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ విచ్చేసిన ఆమెతో, ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఎలా ఉంది ఫీలింగ్? హైదరాబాద్ నా ఇల్లు. ఇంటికొస్తే ఎవరికైనా ఆనందమే కదా. ఏడాది పాటు మరాఠీ సినిమాల బిజీలో పడి, ఇక్కడకు రాలేకపోయాను. ‘ఇష్క్‌వాలా లవ్’ కారణంగా మళ్లీ ఇక్కడకొచ్చే అవకాశం వచ్చింది. మరాఠీలోనే ఎందుకు చేశారు. తెలుగులో సినిమా చేయొచ్చుగా? నేను పుణేలోనే పుట్టి పెరిగాను. మాతృభూమిపై మమకారం ఉంటుంది కదా. దర్శకత్వం అనేది చేస్తే ముందు మరాఠీ సినిమానే చేయాలనేది నా నిర్ణయం. అందుకే... ‘ఇష్క్‌వాలా లవ్’ చేశాను. త్వరలో హిందీ సినిమా చేయబోతున్నాను. తెలుగులో డబ్ చేయడానికి కారణం? ఈ కాన్సెప్ట్ తెలుగువారికి కూడా బాగా నచ్చుతుందనిపించింది. చాలా సింపుల్ మూవీ. అందుకే డబ్ చేశా. మరి తెలుగులో డెరైక్ట్‌గా సినిమా ఎప్పుడు చేస్తారు? మంచి ప్రొడక్షన్ దొరికితే... చేయడానికి సిద్ధమే. ఈ సినిమా మీరే స్వీయ దర్శకత్వంలో నిర్మించారు కదా. ఇక్కడ కూడా అలాగే చేయొచ్చుకదా? స్వీయ దర్శకత్వంలో నిర్మించడం అనేది ‘ఇష్క్‌వాలా లవ్’తోనే లాస్ట్. ఇంకెప్పుడూ ఇలా చేయను. ఎందుకంటే దర్శకురాలిగా, నిర్మాతగా ఈ సినిమా కోసం నేను పడ్డ సంఘర్షణ అంతాఇంతా కాదు. అంత టెన్షన్ ఇక అనుభవించలేను. వేరే వాళ్ల దర్శకత్వంలో నేను సినిమా నిర్మించడానికి రెడీ. అలాగే... వేరే వాళ్లు సినిమా నిర్మిస్తే, నేను దర్శకత్వం వహిస్తా. ఇక నుంచి ఏదైనా ఒక్క బాధ్యతే. ఈ సినిమా ట్రైలర్లో ‘పెళ్లి జరిగితే ప్రేమ తరిగిపోతుంది’ అనే డైలాగ్ ఉంది. అది స్వానుభవంతో రాసుకున్న డైలాగా? నా ప్రేమ తరిగిపోలేదే. నేనెందుకు అలా రాస్తాను. ఇప్పటికీ నాలోని ప్రేమ అలాగే ఉంది. నా జీవితం ఏంటో ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. నా ‘ఇష్క్‌వాలా లవ్’కి నా జీవితానికీ అస్సలు సంబంధం లేదు. అయినా ఇది నేను ఆరేళ్ల క్రితం రాసుకున్న కథ. అప్పుడు మా అమ్మాయి ఆద్యకు రెండున్నరేళ్లు. ‘ఇష్క్‌వాలా లవ్’కి ప్రేరణ ఏంటి? నేటి యువతరమే ప్రేరణ. ప్రేమ, పెళ్లి ఈ రెండు అంశాలపై యువతలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. నేటి యువత వీటి విషయంలో చాలా భిన్నంగా ఆలోచిస్తోంది. దీనిపై రీసెర్చ్ చేసి, ఎందరో యువతీయువకులను ఇంటర్వ్యూ చేసి ఈ కథ తయారు చేసుకున్నాను. సాధారణంగా ప్రేమలో ఉన్న అబ్బాయిలు... పెళ్లికి నో చెబుతూ ఉంటారు. కానీ మా సినిమాలో అమ్మాయి పెళ్లికి ‘నో’ చెబుతుంది. అదే ట్విస్ట్. దాన్ని తెరపై చూస్తేనే బావుంటుంది. ఈ నెల 24న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా విషయంలో పవన్‌కల్యాణ్ సహకారం ఏమైనా తీసుకున్నారా? మరాఠీలో నేను తొలుత ‘మంగళాష్టక్’ సినిమా నిర్మించాను. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘ఇష్క్‌వాలా లవ్’ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాను. ఈ సినిమాక్కూడా మంచి స్పందన లభిస్తోంది. తొలి సినిమాను 26 రోజుల్లో నిర్మించినప్పుడు పవన్‌కూడా ఆశ్చర్యపోయారు. ఇక సినిమాను కూడా అనుకున్న బడ్జెట్లో అనుకున్నట్టు తెరకెక్కించా. స్వతహాగా నాకేమైనా సమస్య వస్తే... ఆయన సహకారం తీసుకోవాలి. అసలు నాకు ఆ అవసరమే రాలేదు. ఇక సహకారం దేనికి? అకీరానందన్ని ఈ సినిమా ద్వారా నటునిగా పరిచయం చేయాలనే ఆలోచన మీదేనా? నాదే. ఇందులో ఓ పదేళ్ల బాబు కేరక్టర్ ఉంది. చాలామంది అబ్బాయిల్ని చూశాను. కానీ, ఎందుకో అకీరాను చూడగానే... వాడితో చేయిస్తే ఎలా ఉంటుంది? అనిపించింది. పైగా నా దర్శకత్వంలో రూపొందే సినిమా, నా కొడుకు పరిచయ చిత్రం కావడం తల్లిగా నాకు ఆనందమేగా. అందుకే వాణ్ణి అడిగా. చేస్తా అన్నాడు. వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. ‘ఏంటి... వాడితో చేయిస్తున్నావా! అంటూ ఆయన పెద్ద పెద్దగా నవ్వేశారు. ఇంతకూ పవన్‌కల్యాణ్ ఈ సినిమా చూశారా? లేదండీ... ప్రస్తుతం తెలుగు వెర్షన్ డబ్బింగ్ దశలో ఉందీ సినిమా. అయ్యాక చూపిస్తా. ట్రైలర్స్ అయితే చూశారు. ఆయనకు బాగా నచ్చాయి. అకీరా ఎలా చేశాడు? చాలా బాగా చేశాడండీ. అందరూ బాగా చేశాడని అంటుంటే అమ్మగా చాలా ఆనందం అనిపిస్తోంది. హీరోయిన్ కాంబినేషన్లో సీన్ అది. చెప్పింది చెప్పినట్లు చేసేశాడు. డబ్బింగ్ అప్పుడు మాత్రం నాకు కాస్త టెన్షన్ అనిపించింది. ఎలా చెబుతాడో ఏమో అని. కానీ... సీన్ పేపర్ తీసుకొని, సీరియస్‌గా స్క్రీన్‌ని చూస్తూ టకటకా డబ్బింగ్ చెప్పేశాడు. అప్పుడనిపించింది. వాడి రక్తంలోనే ఉంది కదా నటన అని. పవన్‌కల్యాణ్ తనయుని తొలి సినిమా అంటే... అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి కదా. మరీ దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకున్నారా? ఆ దిశగా అస్సలు ఆలోచించలేదండీ. ఎందుకంటే... ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం. పవర్‌స్టార్ తనయుడిగా కాకుండా, ఒక ఆర్టిస్ట్‌గా మాత్రమే వాణ్ణి చూపించా. ఎలాగూ దర్శకురాలయ్యారు. మరి పవర్‌స్టార్‌ని ఎప్పుడు డెరైక్ట్ చేస్తారు? ఆయనో పెద్ద సూపర్‌స్టార్. నేనేమో చిన్న దర్శకురాలిని. ఆయన్ను డెరైక్ట్ చేయాలంటే నా స్థాయి చాలదు. ముందు సక్సెస్‌లు రానీయండి. తర్వాత చూద్దాం. సమాజానికి మీరు చిన్న దర్శకురాలే కావచ్చు. కానీ... పవన్‌కల్యాణ్‌గారికి మీరు స్పెషల్ కదా? చూడండీ... కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని ఆయన కలిపి చూడరు. నేను కూడా ఆయన నుంచి నేర్చుకుంది అదే. మీరన్నట్లు ఆయన్ను డెరైక్ట్ చేసే స్థాయికి వస్తే అంతకంటే కావాల్సిందేముంది. నటనకు పుల్‌స్టాప్ పెట్టేసినట్లేనా? నా జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకొని చేసింది కాదు. అనుకోకుండానే నటిని అయ్యాను. అలాగే... మోడలింగ్ చేశాను. ఎడిటింగ్ చేశాను. మీకు తెలుసో తెలీదో... ‘ఖుషి’ సినిమాలో ‘హే మేరా జహా...’ పాట ఎడిట్ చేసింది నేనే. ఫ్యాషన్ డిజైనర్‌గా కూడా పనిచేశాను. నిర్మాతనయ్యాను. దర్శకురాలినయ్యాను. ముందు ముందు ఏం జరుగుతుందో. పవన్‌కల్యాణ్‌తో నటిస్తారా? ఆ సందర్భం రావాలిగా. ప్రేమ గురించి మీ అభిప్రాయం? దాన్ని ఓ ఛట్రంలో బంధించలేం. అది విశ్వవ్యాపితం. ప్రేమను ఎప్పుడూ గౌరవిస్తాన్నేను. మీకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి ఎవరు? నా జీవితానికి ప్రేరణగా మిగిలిన వ్యక్తి ఒకరే. ఆయన ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. - బుర్రా నరసింహా -
రేణూ దేశాయ్ 'ఇష్క్ వాలా లవ్' వర్కింగ్ స్టిల్స్
-
పవర్‌స్టార్ వారసుడు వచ్చేస్తున్నాడు!
పవర్‌స్టార్ తనయుడు అకిరా నందన్ త్వరలో వెండితెరపై కనిపించబోతున్నాడు. ఇది నిజంగా పవన్‌కల్యాణ్ అభిమానులకు శుభవార్తే. ఈ విషయాన్ని పవన్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ స్వయంగా ఫేస్బుక్ ద్వారా తెలిపారు. ఆమె మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలి సిందే. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాత్రలో అకిరానందన్ కనిపిస్తాడు. ‘‘అకిరా నందన్... నా ‘ఇష్క్ వాలా లవ్’లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా నా తనయుడు నటునిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్. ఈ సినిమా ప్రచార చిత్రాలను కూడా ఇటీవల విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాను అనువదించనున్నట్లు గతంలో రేణూ దేశాయ్ వెల్లడించిన విషయం తెలిసిందే. అంటే... త్వరలోనే పవర్ వారసుణ్ణి తెరపై చూడొచ్చన్నమాట.