Actress Renu Desai Looks Adorable In AI Pics Viral - Sakshi
Sakshi News home page

నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్‌ అద్భుతమైన పిక్స్‌ వైరల్‌!

Published Sat, Jul 15 2023 7:21 PM | Last Updated on Sat, Jul 15 2023 9:27 PM

Actress Renu Desai son akira created ai pic goes viral - Sakshi

ఇపుడు ఎక్కడ  చూసినా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) హవా నడుస్తోంది. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలకు ముప్పు వస్తుందన్న ఆందోళనకు తోడు చాలామంది ఔత్సాహిక ఆర్టిస్టులు ఏఐ పిక్స్‌తో  సందడి చేస్తున్నారు. అద్భుతంగా ఉంటున్న ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. (టొమాటో రైతుకు జాక్‌పాట్‌: నెల రోజుల్లో కోటిన్నర)

దీనికితోడు ఏఐ  వీడియోలు ప్రముఖంగా నిలస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ యాంకర్‌ లేటెస్ట్‌ సోషల్‌మీడియా సెన్సేషన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ  కోవలో  నటి రేణూ దేశాయ్‌  నిలిచారు. అయితే  ఇవి సొంతంగా తను సృష్టించు కున్నవి మాత్రం కాదు. రేణూ కుమారుడు అకీరానందన్‌ క్రియేట్‌ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.  ఏఐ నిజంగానే భయపెడుతోంది అంటూ ఈ పిక్స్‌ను పోస్ట్‌ చేశారు.  (Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం)

దీంతో లేదు.. లేదు.. ఏఐ అద్భుతం..! మీరు చాలా అందంగా ఉన్నారు.  సూపర్‌ రేణూగారు..నిజానికి థ్రో బ్యాక్‌ పిక్స్‌ అంటే సరిపోతుందేమో. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నాయంటూ  కమెంట్స్‌  చేశారు. (వెకేషన్‌లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్‌ ఖరీదు ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement