
సాక్షి, హైదరాబాద్: నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తనయుడు అకిరా నందన్ తన టాలెంట్‌తో మరో సారి వార్తల్లో నిలిచారు. మార్టల్ ఆర్ట్స్‌లో ఇప్పటికే తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అకీరా కర్రసాము చేస్తున్న వీడియోను రేణూ ఇన్‌స్టాలో షేర్ చేశారు. తండ్రి పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో లాగా కర్ర సాము ఇరగదీస్తున్నాడంటూ అభిమానులు కామెంట్ చేశారు. తండ్రికి తగ్గ తనయుడంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
అకీరా ఒడుపుగా కర్రసాము చేస్తున్న వీడియోకి రేణూ పాప్ స్టార్ మైకేల్ జాన్స్ బిల్లీ జీన్ సాంగ్‌ను యాడ్ చేశారు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు జానీ-2 పేరుతో అకీరాని పరిచయం చేయమంటూ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. కాగా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అకీరా ఎంట్రీపై ఇపుడు తానేమీ చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన రేణూ దేశాయ్ అకీరా తెరంగేట్రం ఊహాగానాలకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ లో అకీరా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే.
@PawanKalyan ❤️🙏 దేవర
— SHOBAN NAIDU (@pagadalapavan00) August 3, 2021
తండ్రికి తగ్గ 🔥
తనయుడు #AkiraNandan 😍🥰@ganeshbandla #PawanKalyan #HariHaraVeeraMallu #BheemlaNayak #PSPKRanaMovie #ProductionNo12 #PSPK28 pic.twitter.com/5IpG7bNDJV
Comments
Please login to add a commentAdd a comment