టైగర్ నాగేశ్వరరావు... 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ. జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో రవితేజ కథానాయకుడిగా వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత నటి రేణూదేశాయ్ ఈ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి)
రేణు దేశాయ్ పేరు వినిపించగానే పవన్ కల్యాణ్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు ఆపై కష్టాలు అని చెప్పుకుంటారు. ఇవన్నీ గత 20 ఏళ్లుగా ఆమె గురించి తెలిసినవే.. అయితే ఈ కష్టాలు తన జీవితంలోకి పవన్ కళ్యాణ్ రాక ముందు నుంచే ఉన్నాయని ఆమె తాజా ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'మా అమ్మ నాన్నలు అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు. కానీ నేను అమ్మాయిగా పుట్టాను. అలా నా ఇంట్లోనే లింగ వివక్షకు గురి కావడం జరిగింది. చాలా మందికి నేనంటే.. నా పెళ్లి ఆపై విడాకులు గురించే చర్చిస్తారు. కానీ చిన్నప్పటి నుంచే నేను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
మా నాన్న కోరిక ప్రకారం అబ్బాయి పుట్టలేదని.. నేను పుట్టిన తరువాత మూడు రోజుల పాటు నా తండ్రి నా ముఖం కూడా చూడలేదు. నాకు ఊహ తెలిసొచ్చాక ఈ విషయం మా అమ్మ నాకు చెప్పేసరికి చాలా బాధ వేసింది. ఆ బాధ నాలో ఇప్పటికీ ఉండిపోయింది. తర్వాతి ఏడాదిలో మా తమ్ముడు పుట్టేశాడు. అప్పుడు వాడ్ని రాజాబాబులా పెంచారు. దాన్ని బట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు. నేను ఎలాంటి పరిస్థితుల్లో పెరిగానో.. ఎలా పెంచారో. ఆ వివక్ష అనేది కంటిన్యూ అవుతూనే ఉంది.' అని రేణు ఎమోషనల్ అయ్యారు.
అంతేకాకుండా తన కుటుంబంలో ఆడబిడ్డని ఒకలా.. మగ బిడ్డని మరోలా చూశారని ఆమె చెప్పుకొచ్చారు. తన జీవితంలో తల్లి ఉండి కూడా తల్లి ప్రేమను పొందలేకపోయానని ఎంతో బాధతో చెప్పారు. జీవితంలో తన విడాకుల ఇష్యూ కంటే అదే ఎక్కువ బాధపెట్టిందని రేణు దేశాయ్ చెప్పారు. ఇలాంటి పేరెంట్స్ చాలా రేర్‌గా ఉంటారని ఈ జన్మలో అది తన దురదృష్టం అని ఆమె తెలిపారు. అంతేకాకుండా తను 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంట్లో ఆ తేడా చూశానని చెప్పారు. తన బాగోగులు ఇంట్లోని పనివాళ్లే చూసుకున్నారని ఆమె వాపోయారు. తల్లిదండ్రుల ప్రేమను పొందాలని స్కూల్‌ల్లో బాగా చదివేదాన్ని.. అమ్మకు నచ్చేలా నడుచుకునేదానిని.. వారు నన్ను మెచ్చుకోవాలని కోరుకునేదానిని.. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లి ప్రేమ తనకు దొరకలేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు.
'ఆ బాధ పట్టలేక, నాకు 19 ఏళ్లు వచ్చిన తర్వాత ఒకరోజు అమ్మని అడిగాను. అమ్మా.. నీ ప్రేమ నాకు ఎందుకు ఇవ్వడం లేదు. నీ ప్రేమ నాకూ కావాలమ్మా.. ఆ ప్రేమా ఇవ్వు అమ్మా అని అడిగాను. వాటికి అమ్మ నుంచి సమాధానం లేదు. అందుకే నేను జీవితంలో ఏమైతే కోల్పోయానో నా బిడ్డలు అది కోల్పోకూడదు. అందుకే నా బిడ్డలకు రెట్టింపు ప్రేమను పంచుతున్నాను. శక్తికి మించి నా బిడ్డలకు ఎక్కువ ప్రేమను పంచాను. అకీరా,ఆద్యా ఇద్దరూ నాకు సమానమే. వారిలో ఎవరినీ ఎక్కువ, తక్కువగా చూడలేదు. వారిద్దరీ కోసం నేను ఎన్ని కష్టాలు అయినా భరిస్తాను.' అని రేణు దేశాయ్ కొంతమేరకు ఎమోషనల్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment