Tiger Nageswara Rao Movie
-
ఓటీటీలో రవితేజ సినిమా అరుదైన ఘనత.. తొలిసారి దివ్యాంగుల కోసం
సినిమా చూడటం అంటే చాలామందికి సరదా. ఎందుకంటే ఏదో పనిచేసి అలసిపోయినా వాళ్లు.. కాసేపు అలా కూర్చొని మూవీ చూస్తుంటే వచ్చే కిక్ వేరు. కానీ దివ్యాంగులకు మాత్రం ఈ అవకాశం లేదు. కానీ ఇకపై పరిస్థితి మారింది. ఇప్పుడు వాళ్ల కోసం కూడా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఓ తెలుగు సినిమా ఇలా అరుదైన ఘనత సాధించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా గతేడాది దసరాకి థియేటర్లలో రిలీజైంది. గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. జనాల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమాని ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లోకి ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే సినిమా ప్లే అవుతుంటే మరోవైపు ఓ అమ్మాయి సైగలతో ఏం మాట్లాడుకుంటున్నారో చూపిస్తూ ఉంటుంది.దీని ద్వారా సినిమాలోని పాటలు, సౌండ్ లాంటివి వినలేకపోవచ్చు కానీ కథేంటి? డైలాగ్స్ ఏంటి అనేవి దివ్యాంగులకు కూడా తెలుస్తాయి. 'టైగర్ నాగేశ్వరరావు'తో మొదలైన ఈ ట్రెండ్.. రాబోయే రోజుల్లో మిగతా తెలుగు సినిమాల విషయంలోనూ పాటించొచ్చు.(ఇదీ చదవండి: 'జయ జయహే తెలంగాణ'.. కీరవాణి వద్దు!) A new chapter in inclusivity in Indian Cinema ✨#TigerNageswaraRao is the 𝐅𝐈𝐑𝐒𝐓 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐅𝐈𝐋𝐌 to have an OTT Release in the 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐒𝐈𝐆𝐍 𝐋𝐀𝐍𝐆𝐔𝐀𝐆𝐄 ❤️🔥Streaming now on @PrimeVideoIN 🔥https://t.co/rbR0n6vYU4 🥷Mass Maharaja @RaviTeja_offl… pic.twitter.com/koX2nFfFww— Abhishek Agarwal 🇮🇳( Modi Ka Parivar) (@AbhishekOfficl) May 27, 2024 -
నటిని పెళ్లాడిన టైగర్ నాగేశ్వరరావు విలన్.. వీడియో వైరల్!
ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తోంది. సమ్మర్ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో వచ్చే మూడు నెలలు పెళ్లిళ్లు జరగనున్నాయి. సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లి కళ మొదలైంది. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యారు. ప్రముఖ మలయాళ నటుడు సుదేవ్ నాయర్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు, నటి అమర్దీప్ కౌర్‌ను పెళ్లాడారు. గత కొంత కాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు.. తాజాగా కేరళ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేశారు. వీరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి అనంతరం స్థానిక గురువాయూర్ ఆలయంలో ఈ జంట పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు నూతన దంపతులకు అభినందనలు చెబుతున్నారు. కాగా..సుదేవ్ నాయర్ 2014లో గులాబ్ గ్యాంగ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతా దక్షిణాదిలో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నితన్ ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అయిన ఈ సినిమా ఎక్కువ నిడివి కారణంగా మొదట డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సుమారు 20 నిమిషాల పాటు నిడివి తగ్గించడంతో సినిమాపై ప్రేక్షకులు అభిప్రాయం మారింది. దీంతో తెలుగులో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సరసన నుపూర్‌సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రేణుదేశాయ్, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ వీకెండ్లో మరోసారి తమ అభిమాన హీరో సినిమాను ఇంట్లో ఉండి మరోసారి చూడొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో అందుబాటలో ఉంది. టైగర్ నాగేశ్వరావు తర్వాత ఈగల్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. -
ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్న టైమ్ కంటే ముందే?
మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. తొలుత చాలా లేటుగా ఓటీటీలోకి తీసుకొద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్ చేసేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడీ విషయం మూవీ లవర్స్‌ని ఎగ్జైట్ చేస్తోంది. సినిమా సంగతేంటి? స్టూవర్టుపురం గురించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు చాలామందికి తెలుసు. ఆ ఊరిలో నుంచి వచ్చిన గజదొంగగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి టైగర్ నాగేశ్వరావు. ఆయన జీవితం ఆధారంగా 'టైగర్ నాగేశ్వరరావు' అని సినిమా తీశారు. ఇందులో రవితేజ టైటిల్ రోల్ చేశాడు. దసరా కానుకగా అక్టోబరు 20న థియేటర్లలోకి వచ్చింది. కానీ కంటెంట్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. (ఇదీ చదవండి: అతను నా ప్రేమను రిజెక్ట్ చేశాడు.. నెలల తరబడి ఏడ్చాను: పాయల్ రాజ్‌పుత్) ఓటీటీలోకి అప్పుడేనా? ఇకపోతే రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ప్లాన్ ప్రకారం ఆరు వారాల తర్వాత అంటే డిసెంబరు మొదటి వారం చివర్లో ఓటీటీలోకి ఈ సినిమా తీసుకురావాలి. కానీ టాక్ తేడా కొట్టేయడంతో ప్లాన్ మారింది. అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. అంటే నవంబరు 24న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. రవితేజ సినిమానే కాదు విజయ్ 'లియో' కూడా నెల రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ మొన్నీ మధ్యే 'లియో' ఫుల్ హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీకైంది. దీంతో వీళ్లు కూడా ప్లాన్ మార్చుకున్నారు. అలా నవంబరు 24న ఓటీటీలోకి వస్తాదనుకున్న లియో.. నవంబరు 16నే రానుందని అంటున్నారు. ఇలా స్టార్ హీరోల సినిమాలు అనుకున్న సమయం కంటే ముందే రానున్నాయనే విషయం.. మూవీ లవర్స్‌కి కిక్ ఇస్తోంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్‌లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!) -
అది చూసే హీరోయిన్గా తీసుకుంటున్నారు.. టైగర్ నాగేశ్వరరావు భామ కామెంట్స్!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా జీవితంలో ఒక భాగం అయిందంటే అతిశయోక్తి కాదు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో సెల్‌ఫోన్ అనే పరికరంతో ప్రపంచమే అరచేతిలో గిరాగిరా తిరుగుతోంది. మనిషి దాని చుట్టూ తిరుగుతుండడంలో ఆశ్చర్యమేముంది. సామాజిక మాధ్యమాలను కొందరు తమ స్వప్రయోజనాలకు.. మరికొందరు నేరాలు, ఘోరాలకు యథేచ్ఛగా వాడుకుంటున్నారు. మరోపక్క అవకాశాలను, అభివృద్ధికి, ఆదాయానికి, కాలక్షేపానికి ఉపయోగిస్తున్నారు. ఇందుకు సినిమా వాళ్లు సైతం అతీతం కాదు. తాజాగా సామాజిక మాధ్యమాల గురించి నేటి అనుకీర్తీ వాస్ ఏమంటున్నారో ఓ లుక్కేద్దాం. అచ్చంగా తిరుచ్చి వాసి అయిన ఈ బ్యూటీకి మిస్ ఇండియా కిరీటం పెద్ద అలంకారం. అదే ఇప్పుడు అనుకీర్తీవాస్కు హీరోయిన్ అవకాశాలను తెచ్చిపెడుతోంది. విజయ్ సేతుపతికి జంటగా డీఎస్పీ అన చిత్రంలో కథానాయకిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా తెలుగులో రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించారు. ప్రస్తుతం వెట్ట్రి అనే మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ అమ్మడు చేసింది కొన్ని చిత్రాలే అయినా తరచూ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలను ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తన వైపునకు తిప్పుకుంటోంది. ఇటీవలే అనుకీర్తీ వాస్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల క్రితం తనకు సామాజిక మాధ్యమాలు అంటే ఏంటో తెలియదన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రాముఖ్యత గురించి అనుభవపూర్వకంగా గ్రహించినట్లు పేర్కొన్నారు. హీరోయిన్ అవకాశం వచ్చినప్పుడల్లా మీ ఇన్‌స్ట్రాగామ్ ఐడీనీ పంపమని చెబుతున్నారన్నారు. అలా దాన్ని చూసే నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దీంతో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తున్నట్లు నటి అనుకీర్తీవాస్ పేర్కొన్నారు. -
నాకు పుట్టుకతోనే సమస్య ఉంది.. కానీ తెలియలేదు: రేణు దేశాయ్
రేణు దేశాయ్ ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. హేమలత లవణం పాత్రలో సినీ ప్రేక్షకులను అలరించారు. చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. రవితేజ, నుపుర్ సనన్ జంటగా ఈ చిత్రాన్ని వంశీకృష్ణ నాయుడు తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 20న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాతో రీ ఎంట్రీ రేణు దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్, ఆరోగ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. (ఇది చదవండి: రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'లాక్ డౌన్ సమయంలో నాకు హెల్త్ సమస్యలు వచ్చాయి. నాకు గుండెకు సంబంధించి ప్రాబ్లమ్ ఉంది. ఈ సమస్య నాకు పుట్టినప్పటి నుంచే ఉంది. కాబట్టి దాన్ని మనం మార్చలేం. ఈ సమస్య ఉందని నాకు ముందే తెలియదు. కానీ చిన్న చిన్న టెస్టులు, సిటీ స్కాన్ చేశాక తెలిసింది. ఈ సమస్య మా నానమ్మకు ఉండేది. అందువల్లే 47 ఏళ్లకే ఆమె చనిపోయారు. నాకు డయాగ్నోసిస్ కూడా అయింది.' అని అన్నారు. తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. 'నేను ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటా. డైలీ యోగా చేస్తా. బైపాస్ సర్జరీ అలాంటిదేం జరగలేదు. నాకు హార్ట్ రేట్ కాస్తా ఎక్కువగానే ఉంటుంది. అందుకే మందులు వాడుతున్నా. వాటివల్లే కాస్తా లావు కూడా అయ్యా. రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకోవాల్సిందే తప్పనిసరి. రన్నింగ్ చేయడం, స్టెప్స్ ఎక్కడం లాంటివి చేయకూడదు. మా నానమ్మ 1974లో నాన్న పెళ్లికి ముందే చనిపోయారు. నాన్న కూడా చిన్న వయసులో హార్ట్ ఎటాక్తోనే చనిపోయారు. చాలా మందికి ఇలాంటి సమస్య ఉంటుంది. నాకైతే సీరియస్ సమస్య అయితే లేదు కానీ.. కొంత అయితే ఉంది.' అని చెప్పుకొచ్చింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. కాగా.. ఇటీవలే రెండేళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని తెలిపింది రేణు దేశాయ్. (ఇది చదవండి: కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్) -
రవి తేజ నా కోసం ఇంటి నుండి ఫుడ్ తీసుకొచ్చి...!
-
Actress Anukreethy Vas Images: టైగర్ నాగేశ్వరరావులో వేశ్యగా నటించిన అనుకృతి వాస్ (ఫోటోలు)
-
అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది: ‘టైగర్..’ బ్యూటీ
సాధారణంగా వర్ధమాన నటీమణు గ్లామరస్ పాత్రలను కోరుకుంటారు. అలాంటి పాత్రలతోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడవచ్చునని, ప్రేక్షకుల ఆదరణను పొందవచ్చు అనేది వారి అలోచనగా ఉంలుటుంది. అలాంటిది నటి అనుకృతి వాస్ మాత్రం ఛాలెంజింగ్ పాత్రలను కోరుకుంటున్నారు. ఈమె గురించి చెప్పాలంటే కళాశాల రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్నీ గెలుచుకున్నారు. తర్వాత సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. ఇంకేముందు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించిన డీఎస్పీ చిత్రం ద్వారా కథానాయకిగా తెరంగేట్రం చేశారు. అలా తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ బ్యూటీకి ఆ వెనువెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వరించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. దీని గురించి నటి అనుకృతి వాస్ మాట్లాడుతూ తన తొలి చిత్రం డీఎస్పీలో కంటే మంచి పాత్రను తెలుగు చిత్రం టైగర్ నాగేశ్వరరావులో నటించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఇంకా ఛాలెంజింగ్‌తో కూడిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు ఈ బ్యూటీ పేర్కొన్నారు. ఆదిలోనే తమిళం, తెలుగు భాషల్లో నటించే అవకాశాలను అందుకుంటున్న ఈ భామ అందంతో పాటు అభినయంతోనూ సత్తా చాటుకోవడం విశేషం. -
రవి తేజ ని చాలా లవ్ చేశాను కానీ
-
పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్
రవితేజ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఆ పాత్రలో ఎంతో హుందాగా ఆమె కనిపించారు. సినిమాలో ఆమె కొద్దిసేపు మాత్రమే కనిపించినా టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి ప్లస్ అయ్యారనే చెప్పవచ్చు. ఆ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారా..? అనే ప్రశ్నకు రేణు ఇలా చెప్పారు. 'ఆయన గురించి ఈ క్వశ్చనే వద్దు (నవ్వుతూ) అన్నారు. ఒక పొలిటీషియన్‌గా ఈ సొసైటికి అవసరం అని మాత్రమే గతంలో ఒక వీడియో ద్వారా నేను చెప్పాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆయన సీఎం అవుతారా లేదా అనేది నేను కోరుకోను.. దేవుడు ఉన్నాడు.. ఆ విషయం ఆయనే డిసైడ్ చేస్తాడు. కనీసం ఒక కామన్ వ్యక్తిగా కూడా ఆయనవైపు స్టాండ్ తీసుకోను. (ఇదీ చదవండి: ఓటీటీలో 'స్కంద' స్ట్రీమింగ్.. ఎందులో అంటే) పలాన వ్యక్తిని సపోర్ట్ చేయండి అని నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం కూడా చేయను. అది నాకు అవసరం లేని విషయం. పవన్ గురించి నేను ప్రతిసారి నిజాలే చెప్పాను. నా విడాకుల సమయంలో నేను ఏమైతే చెప్పానో అవన్నీ నిజాలే.. కొద్దిరోజుల క్రితం పవన్ గురించి చెప్పిన మాటల్లో కూడా నిజమే ఉంది. కావాలంటే లైవ్ డిటెక్టర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. అని రేణు చెప్పారు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటా కానీ.. జీవితంలో సింగిల్ మదర్‌గా కొనసాగడం చాలా కష్టం అంటూ రేణు దేశాయ్ ఇలా చెప్పారు. 'నాకు పెద్దవాళ్ల సపోర్టు కూడా లేదు. నేను సింగిల్‌గానే నా పిల్లలను పోషిస్తున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదు. త్వరలో నేను కచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటాను. అందులో ఎలాంటి సందేహం లేదు. అది వంద శాతం జరుగుతుంది. కానీ నేను ఎక్కువగా ఆధ్యా గురించే ఆలోచిస్తున్నాను. అందుకే ఆ విషయంలో కొంత టైమ్ తీసుకుంటున్నాను. ముందుగా నా బిడ్డలను సరైన క్రమంలో పెంచాలి.. ఆ విధంగానే వారిని తయారు చేస్తున్నాను. (ఇదీ చదవండి: వశిష్ట సినిమా విషయంలో షాకింగ్ న్యూస్ చెప్పిన చిరంజీవి) నా బిడ్డలు ఎప్పటికీ తప్పు చేయరు. ఒకవేళ వాళ్లు తప్పు చేస్తే నన్నే తప్పుపట్టండి. ఆ అవకాశం వాళ్లు కూడా ఎవరికీ ఇవ్వరు. ఒక అబ్బాయి సమాజంలో ఎలా ఉండాలో అకీరాకు నేర్పించాను. అలాగే ఆధ్యాకు కూడా పలు విషయాలు ఎప్పుడూ చెబుతూనే పెంచాను. భవిష్యత్‌లో ఆధ్యా ఒకరికి భార్య అవుతుంది, మరోకరికి తల్లి అవుతుంది. మరోక కుటుంబంలో కోడలిగా అడుగుపెడుతుంది. వారందరికీ మంచి పేరు తీసుకురావాలి. అలాంటి దారిలోనే నా పిల్లలను పెంచాను.' అని చెప్పారు. ఫ్యాన్స్ ఇస్తున్న వార్నింగ్స్ టైగర్ నాగేశ్వరరావు చిత్రం వల్ల నేను ఈ మధ్య పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. దీంతో పవన్ గారి ఫ్యాన్స్ నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. పవన్ గురించి మాట్లాడకండి అంటూ వార్న్ చేస్తున్నారు. కొంతమంది పనికట్టుకుని మరీ ఇలాంటి పనులు చేస్తున్నారు. నాకు నచ్చినట్లు ఉంటాను వాళ్లు ఎవరు నన్ను ప్రశ్నించడానికి. పవన్ గురించి నాకు ఇష్టం ఉంటేనే మాట్లాడుతాను లేదంటే లేదు. వాళ్లు ఎవరు నన్ను కమాండ్ చేయడానికి. అని పవన్ ఫ్యాన్స్‌పై ఆమె ఫైర్ అయ్యారు. గతంలో కూడా రేణు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో ఆయన ఫ్యాన్స్ చేసిన రచ్చ ఎలాంటిదో రేణూనే చెప్పింది. రెండో పెళ్లి ఎందుకని బూతులతో ఆమెపై తెగబడ్డారు. ఆమె పెళ్లి చేసుకుంటే పవన్ పరువు ఏం కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. -
రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రంలో కృతి సనన్ సోదరి నూపూర్ సనన్ హీరోయిన్గా నటించింది. విజయదశమి సందర్భంగా ఈనెల 20న థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంతో టైగర్ నాగేశ్వరరావు విఫలమైంది. (ఇది చదవండి: 20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్) ఈ మూవీ రన్‌టైమ్ తగ్గించినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పెద్దగా కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 5.50 కోట్ల షేర్.. దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో కలిపి రూ.8 కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వరకు షేర్‌ను వసూలు చేయగా... రెండో రోజు రూ.4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా షేర్‌ను అందుకుని పది కోట్ల మార్క్‌ను చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఓవరాల్‌గా చూస్తే రెండురోజుల్లో రూ.12.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని 1970 కాలంలోని స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ చిత్రాన్ని నిర్మించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) -
తప్పని పరిస్థితిలో నేడు మీడియా ముందుకు హీరో రవితేజ
టాలీవుడ్ హీరో రవితేజ నేడు మీడియా ముందుకు రానున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే ఒక విమర్శ ఉంది. సినిమా రన్‌టైమ్ 3గంటలు ఉండటం టైగర్ నాగేశ్వరరావుకు పెద్ద మైనస్ అయింది. కొన్ని అవసరం లేని సీన్లతో ప్రేక్షకులను బోర్ కొట్టించారని విమర్శలు రావడంతో మేకర్స్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3గంటల నిడివి కాస్త 2 గంటల 37 నిమిషాలకు కుదించారు. ఈ విషయాన్ని తాజాగా టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ ప్రకటించారు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) ఇదే విషయంపై నేడు హీరో రవితేజ మీడియా సమావేశం పెట్టనున్నారు. సినిమా విడుదల సమయంలో కూడా ఆయన తెలుగు మీడియాకు పెద్దగా ఇంటర్వ్యూలు ఏమీ ఇవ్వలేదు. టాలీవుడ్లో రవితేజను ఎలాగూ ఆదరిస్తారు కాబట్టి 'టైగర్ నాగేశ్వరరావు' మార్కెట్‌ను పెంచుకునేందుకు ఎక్కువగా బాలీవుడ్, కోలీవుడ్‌లోనే పలు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను కూడా ముంబైలోనే ఆయన లాంచ్ చేశారు. ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం రవితేజకు తెలుగు మీడియా మీద పెద్దగా ఆసక్తి లేదని సమాచారం. ప్రముఖ మీడియా సంస్థల నుంచి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించే వారు సరైన ప్రశ్నలు అడగరని ఆయనలో ఒక అపనమ్మకం ఉందట. దీంతో టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం టాలీవుడ్ మీడియాకు నో చెప్పి బాలీవుడ్ మీడియాకు ఎడా పెడా ఇంటర్వ్యూలు ఇచ్చారు రవితేజ. కానీ సినిమా విడుదలకు ముందు పరిస్థితి ఇలా ఉన్నా.. అనంతరం మూవీపై నెగటివిటీ రావడంతో టైగర్ నాగేశ్వరరావు టీమ్‌లో మార్పు వచ్చింది. ఎలాగైనా సినిమాను నిలబెట్టుకోవాలని యూనిట్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే తాజాగా సినిమా నిడివి తగ్గించారు. ఇదే విషయంపై హీరో రవితేజ టైగర్ నాగేశ్వరరావు గురించి పలు విషయాలను నేడు మీడియా ముందు తెలపనున్నారు. టాలీవుడ్లో తన సినిమాను మీడియా ద్వారా ప్రమోట్ చేయాలని రవితేజ ఆలోచించినట్లు సమాచారం. సినిమా రన్‌టైమ్ తగ్గించడంతో కొత్తగా చూసేవారు తప్పకుండా టైగర్ నాగేశ్వరరావును ఆదరిస్తారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. -
'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?
మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రాన్ని స్టూవర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీశారు. మొదటినుంచి ఈ చిత్రం ఎలా ఉంటుందా అని ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి చూపించారు. కానీ మొత్తం రివర్స్‌లో జరిగింది. దీంతో మూవీ టీమ్ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!) సినిమా అనేది ఎంటర్ టైన్మెంట్. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు సినిమా కరెక్ట్ లెంగ్త్‌లో ఉంటే పర్లేదు. ఏ మాత్రం వేరుగా ఉన్నా మొదటికే మోసం వచ్చే ఛాన్సు ఉంటుంది. 'టైగర్ నాగేశ్వరరావు' విషయంలో అదే జరిగినట్లు కనిపిస్తుంది. తొలుత ప్రకటించినప్పుడు 3 గంటల నిమిషం 39 సెకన్ల నిడివితో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇంత నిడివి ఓకేనా? అని పలువురు అనుకున్నారు. తీరా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ నిడివి ఇప్పుడు సమస్యగా మారింది. సెకండాఫ్‌లో ల్యాగ్ అవ్వడానికి ఇదే కారణమని ఒక్కరోజులోనే చిత్రబృందం గుర్తించింది. దీంతో దాదాపు 24 నిమిషాల సీన్లని కట్ చేసి పడేశారు. ఇకపై 2 గంటల 37 నిమిషాల నిడివితో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు తొలిరోజు రివ్యూలు అంతంత మాత్రంగానే వచ్చాయి. మరి నిడివిలో మార్పు ఏమైనా ఫలితాన్ని మారుస్తుందా అనేది చూడాలి? అయితే ఈ పని ముందే చేసుంటే బాగుండేదని సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) #TigerNageswaraRao - a racy tale of India's Biggest Thief with a cinematic experience of 2 Hours 37 Minutes 💥💥 Enjoy the ROARING DASARA WINNER in cinemas near you ❤️🔥 BOOK YOUR TICKETS NOW 🐅 - https://t.co/yOg5E0c9LP@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl… pic.twitter.com/GOHZOSAAnA — Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 21, 2023 -
కూతుర్ని బలిచ్చిన తండ్రి.. తల నరికిన కొడుకు. ‘దసరా’ సినిమా కథలివే!
దసరా పండుగ వచ్చిందంటే చాలు టాలీవుడ్లో ఆ సందడి, జోష్ వేరేలా ఉంటుంది. ఈ సీజన్ కోసం స్టార్ హీరోలందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ప్రతి దసరాకి కనీసం ఒకటి, రెండు బడా సినిమాలు అయినా బాక్సాఫీస్ బరిలోకి దిగుతాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు దసరా బరిలోకి దిగారు. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు రవితేజ, ఇంకొక వైపు దళపతి విజయ్ .. ఎవరికి వాళ్లు తమ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర ప్రారంభించారు. ఒక సినిమాలో తండ్రి కన్న కూతుర్ని నరబలి ఇస్తే.. మరో సినిమాలో తండ్రి తలను కన్న కొడుకు నరికేస్తాడు. ఇంకో సినిమాలో కూతుర్ని బలోపేతం చేస్తూనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పాఠాలు చెబుతాడు. ఆ సినిమాలేంటి? ఎలా ఉన్నాయో? చదివేయండి కూతర్ని నరబలి ఇచ్చిన తండ్రి దళపతి’విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రమిది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో సొంత కూతుర్నే నరబలి ఇస్తాడు విలన్ ఆంటోని దాస్(సంజయ్ దత్). దీంతో అతని కొడుకు లియో(విజయ్) తండ్రిని ఎదురించి.. అతను నెలకొల్పిన పొగాకు ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తాడు. లియో కూడా మరణిస్తాడు. కట్ చేస్తే.. 20 ఏళ్ల తర్వాత లియో పోలికలతో పార్తిబన్(విజయ్) కనిపిస్తాడు. అతని కోసం ఆంటోని హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తండ్రి తల నరికిన ‘టైగర్’ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్ట్పురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. ఎదిమిదేళ్ల వయసులోనే తండ్రి తలను నరికేస్తాడు టైగర్. అతను ఎందుకలా చేశాడు? నాగేశ్వరరావు దొంగలా ఎలా మారాడు? ఈ సినిమా కొత్తగా చూపించిందేంటి? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘బ్యాడ్ టచ్’ పాఠం చెప్పిన కేసరి నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఇందులో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఆడ పిల్లలను సింహంలా పెంచాలనే సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఓ సన్నివేశంలో బాలయ్యతో స్కూల్ పిల్లలకు ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ పాఠం చెప్పించాడు. ఆ సీన్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది?(పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే!
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషించారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. టైగర్ నాగేశ్వరరావు అనేది కల్పిత పాత్ర కాదు. రియల్ లైఫ్ స్టోరీ. స్టువర్టుపురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చి మరీ దొంగతనాలు చేసేవాడు. అతడి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దొంగతనంలో అతడు ఎక్స్పర్ట్.. కానీ అసలు అతడు దొంగగా ఎందుకు మారాడు? వచ్చిన డబ్బు ఏం చేశాడనేది సినిమాలో చూపించారు. ఈ గజదొంగ స్టోరీ అభిమానులకు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఏ ఓటీటీలోకి రానుందని అభిమానులు ఆరా తీస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి టైగర్ నాగేశ్వరరావు మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా దూకుడును బట్టి ఓటీటీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది. దీపావళి పండగ తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేట్లు కనిపిస్తోంది. చదవండి: హిట్ టాక్.. అయినా భోళా శంకర్‌ను బీట్ చేయలేకపోయిన భగవంత్ కేసరి.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే? -
Tiger Nageswara Rao Review: ‘టైగర్ నాగేశ్వరరావు’మూవీ రివ్యూ
టైటిల్: టైగర్ నాగేశ్వరరావు నటీనటులు: రవితేజ,నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నిర్మాణసంస్థ:అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత: అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: వంశీ సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: ఆర్ మదీ విడుదల తేది: అక్టోబర్ 20, 2023 ప్రముఖ రాజకీయ నాయకులు లేదా క్రీడ, సినీ రంగాలకు చెందిన వారి బయోపిక్‌ని తెరకెక్కించడం సాధారణం. కానీ ఓ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించడం ఇంతవరకు చూడలేదు. దర్శకుడు వంశీ ఆ పని చేశాడు. అదే ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా చేయడంతో ‘టైగర్ నాగేశ్వరరావు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. స్టువర్టుపురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు అలియాస్ నాగి(రవితేజ) ఓ గజదొంగ. పోలీసులకు ముందుగా సమాచారం అందించి దొంగతనం చేయడం అతని స్పెషాలిటి. తన గ్యాంగ్‌తో కలిసి బ్యాంకు దోపిడీలకు పాల్పడతుంటాడు. స్థానిక ఎమ్మెల్యే ఎలమంద(హరీష్ పేరడి), అతని తమ్ముడు కాశీ స్టువర్టుపురం దొంగలపై పెత్తనం చెలాయిస్తుంటారు. ఆ ప్రాంతం ఏం దొంగతనం జరిగినా.. ఎలమందకు కమీషన్ వెళ్లాల్సిందే. నాగి మాత్రం వారిని పట్టించుకోకుండా..తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఒకనొక దశలో ఏకంగా దేశ ప్రధానమంత్రి ఇంట్లో దోపిడికి ప్లాన్ చేస్తాడు. ఆ విషయాన్ని ముందే ప్రధాని భద్రతా సిబ్బంది తెలియజేస్తాడు. అసలు టైగర్ నాగేశ్వరరావు ప్రధాని ఇంట్లో దొంగతనం చేయడానికి గల కారణం ఏంటి? ప్రధాని ఇంటి నుంచి ఏం దొంగతనం చేశాడు? ఆ దొంగతనం తర్వాత నాగి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఎనిమిదేళ్ల వయసులోనే నాగేశ్వరరావు దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? దొంతగతం చేసి సంపాదించిన డబ్బంతా ఏం చేశాడు? నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు? సీఐ మౌళి(జిషు సేన్ గుప్తా)తో నాగికి ఉన్న వైర్యం ఏంటి? ఎమ్మెల్యే ఎలమంద, అతని తమ్ముడు కాశీ చేసే అరచకాలను నాగి ఎలా తిప్పికొట్టాడు. ప్రేమించిన అమ్మాయి సారా(నూపుర్ సనన్)ఎలా చనిపోయింది? నాగి జీవితంపై సంఘ సంస్కర్త హేమలతా లవణం ప్రభావం ఎలా ఉంది? చివరకు నాగేశ్వరరావు ఎలా చనిపోయాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కొన్ని చరిత్రలు నెత్తుటి సిరాతో రాస్తారు..మరికొన్ని చరిత్రలు కన్నీటి సిరాతో రాస్తారు.. నెత్తురు, కన్నీటి సిరాతో రాసిన చరిత్రే ‘టైగర్ నాగేశ్వరరావు’’అని సినిమా ప్రారంభానికి ముందు ఓ కార్డు వేశారు. సినిమా మొత్తం చూశాక మనకు అదే ఫిలింగ్ కలుగుతుంది. టైగర్ నాగేశ్వరరావు ఓ దొంగ అని.. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి దొంగతనం చేసేవాడు అని కొంతమంది తెలుసు. అసలు అతను దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? దోచిన డబ్బంతా ఏం చేశాడు? ఎలా చనిపోయాడు అనేది చాలా మందికి తెలియదు. ఈ చిత్రంలో అదే చూపించారు. వాస్తవానికి ఇది బయోపిక్ అయినా.. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీనీ తీసుకున్నాడు దర్శకుడు. అలాగే అందరిలాగే నాగేశ్వరరావులో కూడా చెడు, మంచి రెండూ ఉన్నాయి. కానీ దర్శకుడు వంశి మాత్రం రెండో కోణాన్నే తెరపై చూపించాడు. టైగర్ చేసే ప్రతీ దొంగతనం వెనుక ఓ మంచి కారణం ఉందనేది చూపించాడు. ఇది ఓ గజదొంగ బయోపిక్ కాబట్టి దొంగతనాలు తప్పా ఇంకేం చూసిస్తాడులే అనుకోవచ్చు. కానీ స్టువర్టుపురం ప్రజలు ఎందుకు దొంగలుగా మారాల్సి వచ్చింది? రాజకీయ నాయకులు,పోలీసులు అధికారుల చేతుల్లో వారి జీవితాలు ఎలా నలిగిపోయాయి అనేది చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్(అనుపమ్ ఖేర్)కు స్టువర్టుపురం ఏరియాలో పని చేసిన పోలీసు అధికారి విశ్వనాథ్ శాస్త్రీ(మురళీ శర్మ).. టైగర్ నాగేశ్వరరావు గురించి చెప్పే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. రాజమండ్రి బ్రిడ్జ్‌పై ట్రైన్ దోపిడీ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ దొంగతనం సీన్ అయితే అదిరిపోతుంది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరావు బాల్యం, స్టువర్ట్పురం దొంగల గురించి తెలుపుతూ సన్నివేశాలు అల్లారు. సారాతో ప్రేమాయణం ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు కానీ ఆమె చనిపోయే సన్నివేశం అయితే ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. హీరో జైలు నుంచి తప్పించుకొని వచ్చిన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్‌లో టైగర్ మరదలు మణితో వచ్చే సీన్స్ కూడా సాగదీతగా అనిపిస్తాయి. హేమలత లవణం ఎంట్రీ తర్వాత కథ ఫాస్ట్‌గా ముందుకు సాగుతుంది. క్లైమాక్స్‌కి ముందు రివీల్ చేసే కొన్ని ట్విస్టులు టైగర్‌పై మరింత ప్రేమను కలిగించేలా చేస్తాయి. ఈ విషయంలో స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు దర్శకుడు. కొన్ని సీన్లు పుష్ప సినిమాను గుర్తు చేస్తాయి. సినిమా నిడివి కూడా కొంచెం ఇబ్బందికి గురి చేస్తుంది. ఎవరెలా చేశారంటే... టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు.యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు. తెరపై కొత్త రవితేజను చూస్తాం. అయితే అతన్ని యంగ్‌గా చూపించేందుకు వాడిన గ్రాఫిక్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. టైగర్ ప్రేమించిన అమ్మాయి సారా పాత్రకి నూపుర్ సనన్, మరదలు మణి పాత్రకి గాయత్రి భరద్వాజ్ న్యాయం చేశారు. తెరపై వీరిద్దరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించారు. ఇక ఎమ్మెల్యే ఎలమంద పాత్రలో హరీష్ పేరడ ఒదిగిపోయాడు. ఒక సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రకి రేణూ దేశాయ్ న్యాయం చేసింది. ఆమె పాత్ర సెకండాఫ్‌లో వస్తుంది. నిడివి తక్కువే అయినా.. గుర్తిండిపోయే పాత్రలో నటించింది. స్టువర్ట్పురం గ్రామ వాసి, దొంగలకు కోచింగ్ ఇచ్చే వ్యక్తి గజ్జల ప్రసాద్‌గా నాజర్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్, సీఐ మౌళిగా జిషు సేన్ గుప్తాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. అయితే పాటలు మాత్రం సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రేణు దేశాయ్ కూతురు ఆధ్యాని చూశారా (ఫొటోలు)
-
‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. రవితేజ కెరీర్లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ‘టైగర్ నాగేశ్వరరావు’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దీనికి తోడు సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘టైగర్..’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 20)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్‌షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు కథేంటి? ఈ సినిమాకు ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్)వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘టైగర్ నాగేశ్వరరావు’కు ట్విటర్లో మంచి స్పందన లభిస్తోంది. డార్క్ క్యారెక్టర్లో రవితేజ యాక్షన్ హైలెట్ అని అంటున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయట. చాలా మంది ట్రైన్ సీక్వెన్స్ గురించి చర్చిస్తున్నారు. అదే సమయంలో రన్ టైమ్ ఇబ్బందికరంగా మారిందని కొంతమంది అంటున్నారు. లవ్‌ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదట. కానీ సినిమా మాత్రం బోరింగ్‌గా సాగదని చెబుతున్నారు. #TigerNageswaraRao An Action Drama that has a good start and engaging moments but feels dragged after awhile due to the tedious runtime. The setup of the characters and story is well done but after a point especially in the 2nd half it drags until the climax along with some… — Venky Reviews (@venkyreviews) October 20, 2023 ‘టైగర్ నాగేశ్వరరావు’ యాక్షన్ డ్రామా బాగుంది. అయితే రన్ టైమ్ ఎక్కువగా ఉండడం కారణంగా కొంత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ సాగదీసినట్లుగా అనిపించింది. కానీ సినిమాలోని క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం, యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయి. ఈ మధ్య కాలంలో రవితేజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Completed My Show 💥 Peak @RaviTeja_offl Ni Chustaru🔥 RT career Lo Best Intro🤯💥 2nd Half >>>1st Half💥💥 Interval and Climax 🙌💥 BGM @gvprakash🔥🔥 Action Sequences🔥🔥 Block Buster Movie 💥💥💥 My Rating - 4/5 #TigerNageswaraRao #RaviTeja #BlockBusterTigerNageswaraRao pic.twitter.com/D48NOVBqfA — Srinivas (@srinivasrtfan2) October 20, 2023 రవితేజ కెరీర్లో బెస్ట్ మూవీ ఇది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెండాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోయాయి. బీజీఎం బాగుంది. ఓవరాల్‌గా టైగర్ నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ మూవీ అంటూ ఓ నెటిజన్ 4 రేటింగ్ ఇచ్చాడు. I watched #TigerNageswaraRao @BiggBossTamil7_ Review ⭐⭐⭐ so far it’s an interesting and well narrated period action drama. Ravi Teja plays a Good character which is unique to watch. VFX Low Quality #RaviTeja Good Acting . Perfect entertainerpic.twitter.com/MOjI6vvqdB — BiggBossTamil 7 (@BiggBossTamil7_) October 20, 2023 1st Half Review: #TigerNageswaraRao#RaviTeja best in recent🔥@DirVamsee few portions well handled@gvprakash Music OK but didn't create any impact Started off well then derailed with love story & lags, picked up again for interval Good so far!#TNR #TigerNageswaraRaoReview pic.twitter.com/T58yaZci0h — World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) October 20, 2023 #TigerNageswaraRao Review : 👉Rating : 2.75/5 Positives: 👉#RaviTeja Performance 👉Good First Half 👉Fight Sequences 👉Production Values Negatives: 👉Bad Songs 👉Dragged Second Half 👉Lengthy Runtime#TNR #TNRReview #TigerNageswarRaoReview — PaniPuri (@THEPANIPURI) October 19, 2023 #TigerNageswaraRao good film to watch for festival ..#RaviTeja carried the dark character very well💥💥 …Rating 3/5 — CPR News Telugu (@cprnewstelugu) October 20, 2023 #TigerNageswaraRao - 3.25/5 SuperHit ❤️ Positives: 👉#RaviTeja Performance 👉Good First Half 👉Fight Sequences 👉Production Values 👉 @gvprakash BGM Back Bone Of The Movie 🔥 Negatives: 👉Lengthy Runtime@RaviTeja_offl@AbhishekOfficl #RenuDesai pic.twitter.com/EJO9ZdBdk5 — Gayle 333 (@RajeshGayle117) October 20, 2023 #TigerNageswaraRao Outstanding ⭐⭐⭐⭐ #RaviTeja is Mind Blowing & Madras Central Jail Scene Is Bomb Basic. Bgm & Dialogues are Fire Interval block 🔥 Screen play little to long but overall worthy movies for fans#TigerNageswaraRaoReview #TigerNageshwarRao pic.twitter.com/9bLXctmoBF — Taran Adarsh (@Mrjaat0007) October 20, 2023 #TigerNageswaraRaoReview: Positives: - Ravi Teja Performance 👌👌💥 - Madras Central Jail Scene 💥💥💥💥💥💥 - Action Episodes ❤️🔥❤️🔥 - BGM in Action Sequences ☺️☺️ - Interval 💯💯 - Murder Scene in 2nd Half 🤯🤯🤯👌👌👌 Negatives: - Too Lengthy 👎👎👎 - No Proper Flow In… pic.twitter.com/P6enbesWP9 — Movies4u Official (@Movies4u_Officl) October 20, 2023 -
మహేశ్ బాబు సినిమా వదులుకున్నా.. ఆ నిజం చెప్తే గొడవలే: రేణు దేశాయ్
మాస్ మహరాజా రవితేజ నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది. 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ అయన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుమారు 18 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఆమె పంచుకున్నారు. (ఇదీ చదవండి: ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్.. నటుడి కామెంట్లు) మహేశ్‌బాబు- పరుశురామ్ కాంబోలో వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమాలో తనకు నటించే ఛాన్స్ వచ్చిందని రేణు దేశాయ్ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని ఆమె తెలిపారు. కాంట్రవర్సీని దృష్టిలో ఉంచుకుని ఆ విషయాలను ఇప్పుడు చెప్పలేకపోతున్నానని ఆమె ఇలా తెలిపారు. 'మహేశ్ బాబు సూపర్ హిట్ సినిమా 'సర్కారు వారి పాట' సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో నదియా పోసించిన బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట నన్ను సంప్రదించారు. అందులో నటించాలని నాకు కూడా ఆసక్తి ఉంది. అందుకు నేను కూడా ఓకే చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఎందుకు సెట్ కాలేదో అనే కారణాలను మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు చెప్పడం వల్ల అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. నిజం ఏమిటో చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది.. కానీ మళ్లీ ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కామ్‌గా ఉండటమే బెటర్.' అని రేణు తెలిపారు. -
అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇందులో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో యిన్లుగా నటించారు. వంశీకృష్ణ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► మంచి కంటెంట్, కొత్త కథలను చెప్పడమే మా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే పవర్ఫుల్ కంటెంట్ ఉన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చేశాం. ఈ సినిమా చేయడానికి ముందే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను సంప్రదించి, ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నాం. టైగర్ నాగేశ్వరరావు దొంగగా మార డానికి దారి తీసిన కారణాలు, పరిస్థితులు ఏమై ఉంటాయి? ఆయన దొంగగా మారిన తర్వాత ఏం చేశారు? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ► రవితేజగారు హార్డ్‌వర్క్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఆయనే చేశారు. ఓ రోజు ఆయన చేతికి గాయమైంది. లొకేషన్లో ఐదారు వందలమంది ఉన్నారు. ్ర΄÷డక్షన్ కాస్ట్ వృథా కాకూడదని, ఆయనకు ఇబ్బందిగా ఉన్నా షూటింగ్లో ΄ాల్గొన్నారు. ఇక అనుపమ్ ఖేర్‌గారు నా లక్కీ చార్మ్ అనే చె΄్పాలి. ఫలానా ΄ాత్ర చేయాలని అనుపమ్గారిని కోరితే వెంటనే ఓకే అంటారు. నాపై ఆయనకు ఉన్న నమ్మకం అలాంటిది. హేమలతా లవణంగా రేణూ దేశాయ్ బాగా నటించారు. రేణూదేశాయ్ 2.ఓ చూస్తారు. ప్రత్యేక శ్రద్ధతో జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించాడు. అవినాష్ కొల్లా అద్భుతంగా ఆర్ట్ డైరెక్షన్ చేశాడు. దర్శకుడిగానే కాదు.. నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకుని పని చేశారు వంశీ. కథకు ఏది అవసరమైతే అది నేను వందశాతం ఇస్తాను. నిర్మాణంలో రాజీపడను. నా కెరీర్లో ఓ మంచి గుర్తుగా నిలిచి΄ోతుంది ‘టైగర్ నాగేశ్వరరావు’. ► పండగ అంటే రెండు, మూడు సినిమాలు రావడం సహజం. మా సినిమా కంటెంట్‌పై నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం కూడా ఉంది. నార్త్‌లోనూ మంచి ΄ాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ► తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా నేను అవుట్‌సైడర్‌ని. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వచ్చిన మూడేళ్ళలో నిర్మాతగా జాతీయ అవార్డు (‘కశ్మీరీ ఫైల్స్’ చిత్రం) అందుకోవడం మా సంస్థకు గౌరవాన్ని తెచ్చింది. అవార్డు అందుకుంటున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. మా బ్యానర్లో త్వరలో ఓ క్రేజీ బయోపిక్ ప్రకటిస్తా. -
రవితేజ మాట థ్రిల్లింగ్‌గా అనిపించింది: వంశీ కృష్ణ
‘టైగర్ నాగేశ్వరరావు’ కథని రవితేజగారు మొదట సగం విని, ‘షూటింగ్ ఉంది.. మిగతాది రేపు వింటాను’ అన్నారు. కథ ఆయనకు నచ్చలేదేమో? నాకు ఫోన్ రాదేమో? అనుకున్నాను. మరుసటి రోజు ఆయన ఫోన్ చేయడంతో వెళ్లి మిగిలిన సగం కథ చెప్పాను. క్లయిమాక్స్ చెబుతున్నప్పుడే... ‘జుట్టు పెద్దగా పెంచితే బాగుంటుందా? కళ్లకి లెన్స్‌పెట్టుకోనా?’ అని ఆయన అన్నారు. నాకు అదొక భావోద్వేగమైన సందర్భం’’ అన్నారు డైరెక్టర్ వంశీ కృష్ణ. రవితేజ హీరోగా, తెరకెక్కిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ– ‘‘టైగర్ నాగేశ్వరరావు ఒక దొంగ అని అందరికీ తెలుసు. మరో కోణంలో మంచి మనసున్న మనిషి. ఈ రెండు కోణాలను సినిమాలో చూపించాను. 1980 నేపథ్యంలో నడిచే కథ ఇది. నా కెరీర్లో బడ్జెట్, స్టార్స్ పరంగా ఇది చాలా భారీ సినిమా. ఈ సినిమాలో గోదావరి బ్రిడ్జ్‌ని రీ క్రియేట్ చేసి, ట్రైన్ సీక్వెన్స్ చేయడం సవాల్‌గా అనిపించింది. ఇక షారుక్ ఖాన్’’ అన్నారు. -
విజయ్ దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!
ఈసారి దసరా బరిలో మూడు పెద్ద సినిమాలు. వీటిలో ఏది హిట్ అయినాసరే బాక్సాఫీస్ కళకళాలాడిపోవడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఏ మూవీకి ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. తమ సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకు ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం తమిళ హీరో విజయ్ కంటే తెలుగు హీరో బాలయ్య వెనకబడిపోయారు. ఇంతకీ ఏంటా విషయం? (ఇదీ చదవండి: 'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?) ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమాలు 'లియో', 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ మూడింటిలో మీరు ఏ సినిమాక వెళ్తారని అడిగితే దాదాపుగా 'లియో' అనే చెప్తారు. ఇదేదో మేం కల్పించి చెబుతున్న మాట అయితే కాదు. ఎందుకంటే విజయ్, బాలయ్య సినిమా టికెట్ల బుకింగ్స్ ఆన్లైన్లో ఓపెన్ చేశారు. అయితే అనుహ్యాంగా 'భగవంత్ కేసరి' కంటే 'లియో' బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లో 'లియో', 'భగవంత్ కేసరి' సినిమాలకు సమంగా స్క్రీన్స్ లభించాయి. కానీ లోకేశ్ కనగరాజ్ క్రేజ్ దృష్ట్యా 'లియో' వైపు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో బాలయ్య సినిమా బుకింగ్స్ మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక 'టైగర్ నాగేశ్వరరావు' బుకింగ్స్ అయితే ఓకే అనిపిస్తుంది. మరి ఈ మూడింట్లో ఏది హిట్ అవుతుందో? ఏది ఫట్ అవుతుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
మీ అందరి అభిమానం వల్లే నేను మళ్ళీ సినిమాల్లోకి..!
-
మీ అబ్బాయిని హీరో చేయండి.. రేణు దేశాయ్‌కు రిక్వెస్ట్!
మాస్ మహారాజా రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. దసరా కానుకగా ఈ మూవీ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజతో పాటు రేణుదేశాయ్‌పై ప్రశంసలు కురిపించారు. (ఇది చదవండి: ఇంద్రజ హీరోయిన్గా కొత్త సినిమా.. ఆసక్తిగా టైటిల్!) విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ' టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూశా. మణిరత్నం తీసిన నాయకన్ సినిమా తెలుగులో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా. ఆ కోరిక పుష్ప చిత్రంతో తీరిపోయింది. టైగర్ నాగశ్వరరావు మూవీలో ఒక్కొక్క ఫ్రేమ్‌ను అద్బుతంగా తీశారు. ఈ చిత్ర డైరెక్టర్‌కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. దర్శకుడు వంశీ ఫోన్ నంబరు తీసుకుని ఆయనతో మాట్లాడేంత వరకు నా మనసు ఆగలేదు. రవితేజ చేసిన విక్రమార్కుడు సినిమా కన్నడ, తమిళం, హిందీలో చేశారు. నీకున్న టాలెంట్‌ను ఎవరూ అందుకోలేరు. మన తెలుగు కీర్తిని దేశమంతట విస్తరింపచేయండి. నాకు అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు.'అని అన్నారు. అనంతరం రేణు దేశాయ్ గురించి చెబుతూ.. ' మీరు సినిమా ఫీల్డ్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. మాకు ఎప్పటికీ దగ్గరే. మీ అబ్బాయిని త్వరలోనే హీరోను చేయాలి. అందులో మీరే తల్లిగా నటించాలి' అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆయన మాటలు విన్నా రేణు దేశాయ్ చాలా సంతోషంగా కనిపించింది. రేణు దేశాయ్ ఆనందం చూస్తుంటే తప్పకుండా చేస్తానంటూ చెబుతున్నట్లే కనిపించింది. కాగా.. పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్‌కి పెళ్లి కాగా.. అకీరా నందన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాలాంటి బాధ ఎవరికీ రాకూడదని కోరుకున్నా: నయని పావని) -
బద్రి సినిమా ఇప్పుడే రిలీజైనట్లు ఉంది: రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!
మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈవెంట్‌కు హాజరైన నటి రేణు దేశాయ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో రవితేజపై ప్రశంసల వర్షం కురిపించింది. (ఇది చదవండి: రిలీజ్‌కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?) రేణు దేశాయ్ మాట్లాడుతూ.. '23 ఏళ్లయినా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తుంటే బద్రి సినిమా ఇప్పుడే రిలీజ్ అయినట్లు అనిపిస్తోంది. మీ ప్రేమకు నా దగ్గర పదాలు లేవు. ఇన్నేళ్లు నేను సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చిత్రబృందానికి థ్యాంక్స్. రవితేజకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమా 2019లోనే మొదలైంది. రవితేజ హీరో అని చెప్పారు. నేను వంశీని ఒక్కటే అడిగా. నేను ఈ సినిమాలో ఉన్నానా? అని. ఎందుకంటే రవితేజ పెద్ద హీరో కదా. ఈ చిత్రంలో అవకాశం రావడం నా జీవితంలో ఎంత ముఖ్యమో మీకు తెలియదు. ఈ క్షణం కోసం చాలా రోజులుగా వెయిట్ చేశా. దయచేసి మీరంతా ఈ సినిమాకు థియేటర్‌కు వెళ్లి చూడండి అంటూ అభిమానులకు రెక్వెస్ట్' చేసింది. అనంతరం ఇకపైనా కేవలం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పాత్రలే చేస్తారని వార్తలొస్తున్నాయి నిజమేనా? కాదా? అని యాంకర్ ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని రేణు దేశాయ్ కొట్టిపారేసింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్!) -
పాన్ ఇండియా ట్రెండ్ కి...టైగర్ నాగేశ్వర్ రావు చెక్ పెడతాడా..
-
Tiger Nageswara Rao: రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ దసరా మీదే
‘‘మణిరత్నంగారి ‘నాయగన్’ తరహా సినిమాలు తెలుగులో ఎప్పుడు వస్తాయా? అనుకునేవాడిని. ‘పుష్ప’తో నెరవేరింది. ‘టైగర్ నాగేశ్వర రావు’ కూడా అలా అనిపించింది’’ అన్నారు రచయిత–దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. రవితేజ టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కె. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రవితేజగారు చేసిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని తమిళ, కన్నడ, హిందీలో రీమేక్ చేశారు. అయితే ఎవరూ ఆయన్ను మ్యాచ్ చేయలేకపోయారు. రవితేజగారు తెలుగు సినిమాలకే పరిమితమైపోకుండా ఇతర భాషల చిత్రాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ‘టైగర్ నాగేశ్వర రావు’ ట్రైలర్ చూడగానే ప్రతి ఫేమ్‌ను దర్శకుడు వంశీ అద్భుతంగా తీశారనిపించింది. అభిషేక్ అగర్వాల్గారికి మంచి టైమ్ నడుస్తోంది. దసరా పండగ వచ్చింది. దుర్గమ్మవారికి ఎవడూ ఎదురు నిలబడలేడు. ఆ దుర్గమ్మ తల్లి వాహనం టైగర్ ముందు కూడా ఎవడూ నిలబడలేడు. దసరా మీదే (టైగర్ నాగేశ్వరరావు టీమ్‌ను ఉద్దేశించి)’’ అన్నారు. మరో ముఖ్య అతిథి ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా మాట్లాడుతూ– ‘‘రవితేజగారికి ఉత్తరప్రదేశ్‌లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీ గర్వపడేలా నా మిత్రుడు అభిషేక్ అగర్వాల్ మరిన్ని సినిమాలు తీయాలి. ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా కథ విని, ఎగ్జయిట్ అయ్యాను. ఎమోషన్, థ్రిల్.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. సినిమాలో ఉన్నవన్నీ ఒరిజినల్ పాత్రలే. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన అభిషేక్‌గారు ‘టైగర్’తో హ్యాట్రిక్ హిట్ సాధించాలి’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక బెస్ట్ ఫిలిమ్‌గా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు వంశీ. ‘‘నాలుగేళ్ల ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ఈ వేడుకలో చిత్ర సహ–నిర్మాత మయాంఖ్, దర్శకులు గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, టీజీ విశ్వప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్
రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు సిద్ధమైపోయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే ఈ మూవీతో 'ఆదిపురుష్' ఫేమ్ కృతిసనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్గా పరిచయమవుతోంది. తాజాగా ప్రచారంలో భాగంగా తన ప్రేమ-బ్రేకప్ గురించి నుపుర్ బయటపెట్టింది. ఏడ్చిన సందర్భం గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Bigg Boss Elimination: ఆమె కోసం ఈమె బలి? వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!) ఎవరీ నుపుర్? కృతి సనన్ చెల్లి నుపుర్.. తొలుత 2005లో యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సింగర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. అక్షయ్ కుమర్‌తో రెండు ఆల్బమ్ సాంగ్స్‌లో యాక్ట్ చేసింది. అవి మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకోవడంతో నుపుర్ బాగా ఫేమస్ అయిపోయింది. అలా ఇప్పుడు రవితేజ సినిమాతో హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఏం జరిగింది? అయితే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రచారంలో భాగంగా తను అప్పట్లో ప్రేమలో మోసపోయిన విషయాన్ని నుపుర్ సనన్ బయటపెట్టింది. 'కాలేజీలో ఉన్నప్పుడు ఓ అబ్బాయిని గాఢంగా లవ్ చేశాను. కానీ తను మోసం చేస్తున్నాడని అర్థమయ్యేటప్పటికీ.. నేను అతడిని ఎంత గుడ్డిగా నమ్మేశానో అర్థమైంది. దీంతో ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఇంట్లో వాళ్లకు ఎక్కడ తెలిసిపోతుందో అని బాత్రూంలో కూర్చుని మరీ గట్టిగా ఏడ్చాను. ఈ బాధ నుంచి బయటపడటానికి నెలలు పట్టింది' అని నుపుర్ గతం గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షూటింగ్లో ప్రమాదం.. ఆయన మృతి!) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
నాకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి..
-
పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్
టైగర్ నాగేశ్వరరావు... 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ. జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో రవితేజ కథానాయకుడిగా వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత నటి రేణూదేశాయ్ ఈ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) రేణు దేశాయ్ పేరు వినిపించగానే పవన్ కల్యాణ్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు ఆపై కష్టాలు అని చెప్పుకుంటారు. ఇవన్నీ గత 20 ఏళ్లుగా ఆమె గురించి తెలిసినవే.. అయితే ఈ కష్టాలు తన జీవితంలోకి పవన్ కళ్యాణ్ రాక ముందు నుంచే ఉన్నాయని ఆమె తాజా ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'మా అమ్మ నాన్నలు అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు. కానీ నేను అమ్మాయిగా పుట్టాను. అలా నా ఇంట్లోనే లింగ వివక్షకు గురి కావడం జరిగింది. చాలా మందికి నేనంటే.. నా పెళ్లి ఆపై విడాకులు గురించే చర్చిస్తారు. కానీ చిన్నప్పటి నుంచే నేను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మా నాన్న కోరిక ప్రకారం అబ్బాయి పుట్టలేదని.. నేను పుట్టిన తరువాత మూడు రోజుల పాటు నా తండ్రి నా ముఖం కూడా చూడలేదు. నాకు ఊహ తెలిసొచ్చాక ఈ విషయం మా అమ్మ నాకు చెప్పేసరికి చాలా బాధ వేసింది. ఆ బాధ నాలో ఇప్పటికీ ఉండిపోయింది. తర్వాతి ఏడాదిలో మా తమ్ముడు పుట్టేశాడు. అప్పుడు వాడ్ని రాజాబాబులా పెంచారు. దాన్ని బట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు. నేను ఎలాంటి పరిస్థితుల్లో పెరిగానో.. ఎలా పెంచారో. ఆ వివక్ష అనేది కంటిన్యూ అవుతూనే ఉంది.' అని రేణు ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా తన కుటుంబంలో ఆడబిడ్డని ఒకలా.. మగ బిడ్డని మరోలా చూశారని ఆమె చెప్పుకొచ్చారు. తన జీవితంలో తల్లి ఉండి కూడా తల్లి ప్రేమను పొందలేకపోయానని ఎంతో బాధతో చెప్పారు. జీవితంలో తన విడాకుల ఇష్యూ కంటే అదే ఎక్కువ బాధపెట్టిందని రేణు దేశాయ్ చెప్పారు. ఇలాంటి పేరెంట్స్ చాలా రేర్‌గా ఉంటారని ఈ జన్మలో అది తన దురదృష్టం అని ఆమె తెలిపారు. అంతేకాకుండా తను 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంట్లో ఆ తేడా చూశానని చెప్పారు. తన బాగోగులు ఇంట్లోని పనివాళ్లే చూసుకున్నారని ఆమె వాపోయారు. తల్లిదండ్రుల ప్రేమను పొందాలని స్కూల్ల్లో బాగా చదివేదాన్ని.. అమ్మకు నచ్చేలా నడుచుకునేదానిని.. వారు నన్ను మెచ్చుకోవాలని కోరుకునేదానిని.. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లి ప్రేమ తనకు దొరకలేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు. 'ఆ బాధ పట్టలేక, నాకు 19 ఏళ్లు వచ్చిన తర్వాత ఒకరోజు అమ్మని అడిగాను. అమ్మా.. నీ ప్రేమ నాకు ఎందుకు ఇవ్వడం లేదు. నీ ప్రేమ నాకూ కావాలమ్మా.. ఆ ప్రేమా ఇవ్వు అమ్మా అని అడిగాను. వాటికి అమ్మ నుంచి సమాధానం లేదు. అందుకే నేను జీవితంలో ఏమైతే కోల్పోయానో నా బిడ్డలు అది కోల్పోకూడదు. అందుకే నా బిడ్డలకు రెట్టింపు ప్రేమను పంచుతున్నాను. శక్తికి మించి నా బిడ్డలకు ఎక్కువ ప్రేమను పంచాను. అకీరా,ఆద్యా ఇద్దరూ నాకు సమానమే. వారిలో ఎవరినీ ఎక్కువ, తక్కువగా చూడలేదు. వారిద్దరీ కోసం నేను ఎన్ని కష్టాలు అయినా భరిస్తాను.' అని రేణు దేశాయ్ కొంతమేరకు ఎమోషనల్ అయ్యారు. -
రవితేజ పాన్ ఇండియా కష్టాలు.. చేతిపై బాటిల్ పగలగొట్టి మరీ!
రవితేజ సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ గత కొన్నాళ్ల నుంచి ఒక్క హిట్ కొడితే నాలుగు ఫ్లాప్స్ అనేలా ఈ హీరో పరిస్థితి తయారైంది. గతేడాది 'ధమాకా'తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా ప్రస్తుతం తొలిసారి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా కుర్రహీరోలా రిస్కులు కూడా చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!) సినిమా సంగతేంటి? స్టువర్టుపురం అనే ఊరిలో గజదొంగగా పేరు తెచ్చుకున్న నాగేశ్వరరావు అనే వ్యక్తి బయోపిక్ 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమాలో రవితేజ హీరో కావడం, ట్రైలర్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే వారం దసరా కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే తెలుగు కంటే ఉత్తరాదిలో ప్రస్తుతం ప్రమోషన్స్‌తో రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాటిల్ పగిలింది తాజాగా ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోలో రవితేజ పాల్గొన్నాడు. అయితే డ్యాన్సులు చూసి, స్టెప్పులేసి వెళ్లిపోకుండా చిన్నపాటి రిస్క్ చేశాడు. సందర్భం కరెక్ట్‌గా తెలియనప్పటికీ బీర్ బాటిల్‌ని తన చేతిపై పగలగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. అలానే అదే షోకి జడ్జిగా ఉన్న శిల్పాశెట్టితో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్ ఫోన్స్!) Absolutely loved meeting you @TheShilpaShetty🤗 and dancing with you for #EkDumEkDumHookStep was Lol hahaha :))) https://t.co/IpjItitslN — Ravi Teja (@RaviTeja_offl) October 10, 2023 -
Renu Desai: గుండె సంబంధిత సమస్యలున్నాయి..
‘‘నటనకు కావాలని విరామం ఇవ్వలేదు. నాకు నటించాలనే ఉంది. అయితే ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ, అందులోని నా పాత్ర, ఆ చిత్ర దర్శక–నిర్మాతలు... ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాను. ఇలా ఈ మూడు అంశాలతో నేను ఏకీభవించి నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’’ అన్నారు నటి, దర్శక–నిర్మాత రేణూ దేశాయ్. రవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రేణూ దేశాయ్ చెప్పిన విశేషాలు. ► ‘టైగర్ నాగేశ్వర రావు’లో హేమలత లవణంగారి పాత్ర చేశాను. లవణంగారి మేనకోడలు కీర్తిగారిని కలిసి ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. 1970 కాలంలోనే జోగిని వ్యవస్థ, అంటరానితనంపై పోరాటాలు చేశారామె. దొంగలు, బందిపోట్లలో మంచి మార్పు కోసం కృషి చేశారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచిన హేమలతగారి పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆమె బాడీ లాంగ్వేజ్‌ను వెండితెరపై ప్రతిబింబించడం సవాల్‌గా అనిపించింది. నా కెరీర్లో ఇప్పటివరకూ నాకు ఏ పశ్చాత్తాపం లేదు. అయితే హేమలత లవణంగారి గురించి తెలుసుకుని, ఆమె పాత్రలో నటించిన తర్వాత ఆమెను కలవలేకపోయానని పశ్చాత్తాపపడుతున్నాను. హేమలతగారి స్ఫూర్తితో చిన్నారుల ఆకలి తీరేలా నా వంతుగా ఓ స్వచ్ఛంద సేవా సంస్థను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా ట్రైలర్ చూసి, నా వయసుకి తగ్గ పాత్రలో నటించినందుకు మా అమ్మాయి ఆద్య తనకు గర్వంగా ఉన్నట్లు చెప్పింది. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది. నా గురించి నా పిల్లలు ఏమనుకుంటున్నారన్నదే నాకు ముఖ్యం. భవిష్యత్‌లో నా వయసుకు తగ్గ పాత్రలే చేయాలనుకుంటున్నాను. ∙మా నాన్నమ్మ 47 ఏళ్లకే హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. మా నాన్నా హార్ట్ ఎటాక్తోనే చనిపోయారు. ఇలా జన్యుపరంగా నాకు గుండె సంబంధిత సమస్యలున్నాయి. అయితే ప్రమాదం లేదు. అలాగని అజాగ్రత్త వహించకూడదు. చికిత్స తీసుకుంటున్నాను. -
అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. అక్టోబర్ 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న నటి రేణు దేశాయ్.. తన గురించి, సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) హేమలత లవణం పాత్ర గురించి? హేమలత లవణం.. ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్ ఖండ్ వెళ్ళి అక్కడ బందీపోట్లని కలిశారు. జోగిని వ్యవస్థ, అంటరానితనంపై పోరాటం చేశారు. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం. రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఓ మంచి అనుభవం. హీరోయిన్, డిజైనర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఈ జర్నీ ఎలా ఉంది? నేను డిజైనర్ కాదు. ఒరిజినల్ స్టయిలిస్ట్‌ని. కలర్స్‌పై మంచి అవగాహన వుంది. ఏ కలర్‌కి ఏది మ్యాచ్ అవుతుందో నాకు తెలుసు. ఖుషి సినిమాకు అనుకోకుండా స్టైలిష్ట్‌గా మారాను. అలాగే సామాజిక కార్యక్రమాలు, కవిత్వం రాయడం.. వీటిలో ఏది ప్లాన్ చేసి చేసినవి కాదు. (ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు షూటింగ్లో ప్రమాదం.. రవితేజ మోకాలికి తీవ్ర గాయం..) అకీరా హీరోగా ఎప్పుడు? హీరోగా చేయాలనే ఆసక్తి అకీరాకి ఈ క్షణం వరకూ లేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా. నటన కొనసాగిస్తారా? నాకు నటన ఎప్పుడూ కొనసాగించాలనే వుంటుంది. నా వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. (ఇదీ చదవండి: 'వ్యూహం' ట్రైలర్: కల్యాణ్‌కు తెలివి లేదు.. ఎన్నికల తర్వాత గ్లాస్ పగిలిపోతుంది) -
5 భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పుకున్న: రవితేజ
-
టైగర్ నాగేశ్వరరావు షూటింగ్లో ప్రమాదం.. రవితేజ మోకాలికి తీవ్ర గాయం..
టైగర్ నాగేశ్వరరావు.. స్టూవర్ట్పురంలోనే కాదు దేశంలోనే పేరు మోసిన గజదొంగ.. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌గా పని చేసిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. చిత్రీకరణ సమయంలో రవితేజ గాయపడ్డాడని పేర్కొన్నాడు. ట్రైన్ దోపిడీ సీన్లో రైలు మీది నుంచి లోపలకు దూకే షాట్లో రవితేజ అదుపుతప్పి కిందపడ్డారని తెలిపాడు. ఆ సమయంలో మోకాలికి బాగా దెబ్బ తగలడంతో ఆస్పత్రికి తరలించగా 12 కుట్లు వేసినట్లు పేర్కొన్నాడు. ఆ షాట్లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులున్నారని, కావున షూటింగ్‌ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాత నష్టపోతాడని అర్థం చేసుకున్న హీరో రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయాడని వివరించాడు. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా తను పట్టించుకోలేదని, సినిమాపై ఆయనకున్న అంకితభావానికి ఇది నిదర్శనమని చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. రవితేజ ఎంతైనా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆ వెర్రిపుష్పాన్ని టాస్కులో మడతపెట్టేయాల్సింది.. ఒక్క టాస్క్ పడనీ, చెప్తా..! -
రవితేజ సినిమాకు ఇంత అన్యాయమా అంటూ ఫ్యాన్స్ ఫైర్
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు రెడీగా ఉంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా రన్‌టైమ్ 3.02 గంటలు ఉంది. నిడివి ఎక్కువగా ఉన్నా ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలతో విడుదల అవుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్ కష్టాలు ఏర్పడ్డాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కేవలం 30 లోపు థియేటర్లే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు అక్టోబర్ 19న విజయ్ 'లియో' థియేటర్లలోకి వస్తోంది. దీంతో తమిళనాడులోని అన్ని థియేటర్లు విజయ్ సినిమాకే ప్రథమ ప్రయారిటీ ఇచ్చాయి. దీంతో తమిళనాడులో రవితేజ చిత్రానికి కేవలం 30లోపు థియేటర్లు మాత్రమే మిగిలాయట. అవి కూడా అంత చెప్పుకోతగిన థియేటర్లు కాదని సమాచారం. ఇకపోతే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తెలుగులోనూ రవితేజకు ఎదురుదెబ్బే... 'లియో' సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ సినిమా సుమారు రూ.22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించారని టాక్ ఉంది. ఒక రకంగా విజయ్ కెరీర్లో ఇదే అత్యధిక తెలుగు బిజినెస్ అని సమాచారం. దీంతో తెలుగులో కూడా ‘లియో’కి అత్యధిక థియేటర్లు కేటాయింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'లియో' సినిమా వల్ల బాలకృష్ణ 'భగవంత్ కేసరి' థియేటర్లు తగ్గించమని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పారు. కానీ ఈ రెండు సినిమాలు విడుదలైన ఒక్కరోజు తర్వాత వస్తోన్న 'టైగర్ నాగేశ్వరరావు'కు మాత్రం భారీ దెబ్బే తగలబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినిమా కన్నా 'లియో'కే తెలుగులో ఎక్కువ థియేటర్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. తమిళనాడులో తెలుగు సినిమాకు థియేటర్లే ఇవ్వనప్పుడు అక్కడి సినిమాలకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు కేటాయించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రశ్నించాలని రవితేజ ఫ్యాన్స్ కోరుతున్నారు. -
నువ్వు నీలా ఉండు అని చెప్పింది
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నూపుర్ సనన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఎవర్నైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేయడానికి సాహసించే మార్వాడి అమ్మాయి సారా పాత్రను చేశాను. ఈ చిత్రంలో నా వేషధారణ మోడ్రన్‌గా ఉంటూనే ట్రెడిషనల్‌గా ఉంటుంది. తెలుగులో చేసిన తొలి సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’తోనే నాకు సారాలాంటి చాలెంజింగ్ రోల్ దొరకడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల మందిని ఆడిషన్ చేశాక, ‘సారా’ పాత్రకు నన్ను ఎంపిక చేశారు వంశీగారు. సెట్స్‌లో ఆయన చెప్పినట్లు నటించాను. ప్రస్తుతం నవాజుద్దిన్ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ‘నువ్వు నీలా ఉండు’ అని అక్క (హీరోయిన్ కృతీ సనన్) సలహా ఇచ్చింది. ‘మిమి’ సినిమాలో అక్క నటన నాకు కన్నీళ్లు తెప్పించింది. మా అక్క తెలుగులో మహేశ్‌బాబు, ప్రభాస్, నాగచైతన్య వంటి స్టార్లతో సినిమాలు చేసింది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది’’ అని చెప్పుకొచ్చారు. -
హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్!
తెలుగు హీరో రవితేజపై 'కేజీఎఫ్' ఫేమ్ యష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమ హీరోనే అలా అంటావా అని రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? రవితేజ కామెంట్స్ మాస్ మహారాజా రవితేజ అద్భుతమైన యాక్టర్. హిట్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో ఈ దసరాకు థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రం. దీంతో దేశమంతటా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా బాలీవుడ్ ఇంటర్వ్యూలో సౌత్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) యష్-'కేజీఎఫ్'పై కామెంట్స్ రామ్ చరణ్ డ్యాన్స్ అంటే ఇష్టమని, ప్రభాస్ డార్లింగ్ అని, రాజమౌళిలో విజన్ అంటే ఇష్టమని రవితేజ చెప్పాడు. కన్నడ హీరో యశ్ గురించి అడిగితే.. అతడు యాక్ట్ చేసిన 'కేజీఎఫ్' మాత్రమే చూశాను. ఆ సినిమా చేయడం అతడికి చాలా లక్కీ' అని అన్నాడు. దీన్ని తీసుకోలేకపోతున్న యష్ ఫ్యాన్స్.. రవితేజపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. 'కేజీఎఫ్' తప్పితే యష్ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. రవితేజ కూడా అదే ఉద్దేశంతో ఇలా అన్నాడు. యష్ అభిమానులు మాత్రం దీన్ని అపార్థం చేసుకుని గొడవ గొడవ చేస్తున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?) -
ప్రముఖ నిర్మాత కార్యాలయంలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఐటీ బృందం అభిషేక్ కార్యాలయంలో సోదాలు జరుపుతోంది. కాగా ఈ బ్యానర్లో మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల గడువు మాత్రమే ఉన్న తరుణంలో అభిషేక్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా అభిషేక్ అగర్వాల్ గతేడాది బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించాడు. ద కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ధమాకా చిత్రాలన్నీ ఈయన బ్యానర్ నుంచి వచ్చినవే! -
వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం హీరో రవితేజ.. సరికొత్త రికార్డ్
మాస్ మహారాజ్ రవితేజ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం కామెంట్రీ చేసిన ఇతడు.. సినిమా విశేషాలతో పాటు మ్యాచ్ గురించి మాట్లాడాడు. అలానే టీమిండియాలో కోహ్లీతో మరో క్రికెటర్ అంటే ఇష్టమని చెప్పాడు. ఈ క్రమంలోనే ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్ సాధించాడు. ఇంతకీ ఏంటి సంగతి? వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగింది. అయితే తెలుగు కామెంటరీ బాక్సులో కనిపించిన రవితేజ.. తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. కోహ్లీ, సిరాజ్ అంటే ఇష్టమని చెప్పాడు. ఇకపోతే కోహ్లీ యాటిట్యూడ్, అగ్రెషన్, లుక్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. అలానే ఈ మ్యాచ్‌లో క్యాచ్ పట్టిన స్టైల్ నచ్చిందని కామెంట్రీ చెప్పాడు. (ఇదీ చదవండి: ఫారెన్ టూర్లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?) అయితే గతంలో ఐపీఎల్ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇలా కామెంటరీ బాక్సులో కాదు గానీ స్టేడియంలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు రవితేజ మాత్రం ఏకంగా వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం కామెంటరీ చేశాడు. అయితే ఓ తెలుగు హీరో ఇలా ప్రపంచకప్ మ్యాచ్‌కి కామెంటరీ చేయడం ఇదే తొలిసారి. ఇలా ఎవరికీ సాధ్యపడని ఘనత సాధించాడు. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అక్టోబరు 20న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) Men In Blue slaying on the field and Mass Maharaja @RaviTeja_offl slaying it with a mic in hand 🔥🔥#INDvAUS the TIGER's way ❤🔥#TigerNageswaraRao in Cinemas Oct 20th 🥷@DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @Jisshusengupta @gvprakash… pic.twitter.com/zK12hPtbCe — Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 8, 2023 -
కథ విన్నప్పుడే కన్నీళ్లొచ్చాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో గాయత్రీ భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం ఢిల్లీ. పుణేలో చదువుకున్నాను. మా నాన్నగారు పైలెట్. అమ్మ సైకాలజిస్ట్. నాకు చిన్నప్పట్నుంచే ఫ్యాషన్ వరల్డ్‌లో ఫేమస్ కావాలని ఉండేది. నా ఏడో తరగతిలోనే ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేసి, విజేతగా నిలిచాను. ఆ తర్వాత భరత నాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను. హిందీలో అవకాశాలు రావడంతో ఓ సినిమా, మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ‘టైగర్ నాగేశ్వరరావు’ నా తొలి తెలుగు సినిమా. నన్ను ఎంపిక చేయడానికి ముందు దాదాపు 60 మందిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రంలో విలేజ్‌లో టామ్‌బాయ్‌లా కనిపించే మణి పాత్ర చేశాను. దర్శకులు వంశీగారు ఈ పాత్ర గురించి దాదాపు మూడు గంటలు వివరించారు. పాత్రలో మంచి ఎమోషన్ ఉంది. కథ వింటున్నప్పుడే కన్నీళ్లొచ్చాయి. ఈ సినిమా విషయంలో నాకు భాషాపరంగా ఏ ఇబ్బంది లేదు. నాకు తెలుగు టీచర్ ఉన్నారు. ఇక రవితేజగారు సెట్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నార్త్ ఇండస్ట్రీలో కాస్త హరీబరీగా ఉంటుంది. కానీ తెలుగు పరిశ్రమలో చాలా ఓర్పుతో వర్క్ చేస్తున్నారు. లభిస్తున్న గౌరవం కూడా ఎక్కువే. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతో ప్రేమిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. -
రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించారు. ఇటీవలే ముంబయిలో ఈవెంట్‌కు రవితేజ హాజరయ్యారు. అయితే ఈవెంట్లో అనుపమ్ ఖేర్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: బిగ్‌బాస్ 7: మళ్లీ గ్రాండ్ లాంచ్.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు.. కానీ..) ఈవెంట్‌కు హాజరైన అనుపమ్.. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి చిన్న వయసులో రవితేజ తన స్టూడియోకి వచ్చి నాతో ఫోటో దిగాలని అడిగాడు. కానీ నేను కుదరదని చెప్పా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాలోనే నటిస్తున్నా.. ఆ రోజు అలా అన్నందుకు రవితేజకు నవ్వుతూ సారీ అన్నారు. దీంతో వెంటనే రవితేజ.. సార్ అంటూ దండం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!) 1988 :- #AnupamKher rejected to click a photo with #RaviTeja 😢💔 2023 :- #AnupamKher is doing a key role in Mass Maharaja @RaviTeja_offl most anticipated Project #TigerNageswaraRao 🥵🔥 True definition of Success 💥💯 pic.twitter.com/z3GY4rPEc7 — Neeraj Kumar (@73forever_) October 4, 2023 -
రవితేజ పాన్ ఇండియా హీరో అవుతాడా?
-
దేవుడి పాట నాదే
‘గుంటూరు రైల్వే స్టేషన్.. దేవుడి పాట పాతికవేలు’ అంటూ వేలం పాటతో మొదలైంది ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా ట్రైలర్. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ‘టైగర్ నాగేశ్వర రావు’ ట్రైలర్‌ని విడుదల చేశారు. పోలీసులకు విజ్ఞప్తి.. కాకినాడ నుంచి మదరాసు వెళ్లు సర్కార్ ఎక్స్‌ప్రెస్ దారిలో దోపిడీకి గురి కాబోతోంది’, ‘కొట్టే ముందు.. కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు’, ‘రేపటి నుంచి స్టూవర్టుపురంలో దేవుడి పాట నాదే.. చెప్పు.. వాడికి’ అంటూ రవితేజ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి రావడం హ్యాపీగా ఉంది. హిందీలో నేనే డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో అభిషేక్ అగర్వాల్, వంశీ, నటీనటులు రేణూ దేశాయ్, గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ మాట్లాడారు. -
మాస్ మహారాజా మూవీ టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ లాంఛ్ (ఫొటోలు)
-
'కొట్టేముందు.. కొట్టేసేముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు'.. మాస్ మహారాజా ట్రైలర్ అదుర్స్!
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్ హీరోయిన్గా కనిపించనుంది. 1970-80ల కాలంలో స్టువర్టుపురంలోని గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని కథాంశంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలత పాత్ర పోషిస్తుండగా.. ఇప్పటికే ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూస్తే 'గుంటూరు రైల్వే స్టేషన్.. దేవుడి పాట.. పాతికవేలు' అంటూ వేలంపాటతో మొదలైంది. 'కొట్టేముందు.. కొట్టేసేముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు' అనే రవితేజ డైలాగ్ మాస్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచుతోంది. ట్రైలర్లో పోలీసులు, టైగర్ నాగేశ్వరరావు గ్యాంగ్ చుట్టే కథ తిరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో రవితేజ కనిపించనున్నారు. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్గా నటిస్తోంది. అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. -
టైగర్ యాక్షన్ ఊహాతీతంగా ఉంటుంది: రామ్ లక్ష్మణ్
‘‘రవితేజగారితో ఎన్నో చిత్రాలు చేశాం. కానీ ‘టైగర్ నాగేశ్వర రావు’ మాత్రం కొత్త అనుభూతినిచ్చింది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్‌ని ప్రేక్షకులు నిజంగా జరుగుతున్నట్లు భావిస్తారు’’ అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్. రవితేజ హీరోగా, నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్స్‌గా చేసిన రామ్–లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘మేం స్టూవర్ట్‌పురం ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. ‘టైగర్ నాగేశ్వరరావు’ గారి గురించి ఊహకు అందని విషయాలు విన్నాం. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని, దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తెవారని.. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు వినేవాళ్ళం. సవాల్ చేసి దొంగతనం చేయడం అంత ఈజీ కాదు. అందరికీ చెప్పి దొంగతనం చేసి అక్కడ నుంచి తప్పించుకునే ఒక పాత్రని చూస్తున్నపుడు రియల్ హీరోయిజం కనిపిస్తుంది. ఆయన చెన్నై జైలు నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆయనకి టైగర్ అనే బిరుదు పోలీసులు ఇచ్చారు. ఒక దొంగకి పోలీసులు బిరుదు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన అంశం. మేము ఒక ఫైట్ తీసినప్పుడు రోఫ్ కడతాం, బోలెడు ఏర్పాట్లు చేస్తాం. అలాంటిది టైగర్ నాగేశ్వరరావు ఏ సాయం లేకుండా అంత ఎత్తు జైలు గోడలు ఎలా ఎక్కగలిగారు, ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వచ్చి ఉంటుందనేది నిజంగా ఆశ్చర్యకరం. ఒక దొంగ ఇంత పాపులర్ అయ్యారంటే దాని వెనుక నేచర్ సపోర్ట్, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలు ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు ? అని ఒక ప్రధాన మంత్రి దగ్గర కూడా గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు. ఇంత పవర్ ఫుల్ బయోపిక్ తీసిన దర్శకుడు వంశీకి థాంక్స్ చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో రవితేజ గారి సినిమా వెళ్ళబోతుంది. తప్పకుండా ‘టైగర్ నాగేశ్వరరావు’ అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రానికి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాం’ అన్నారు. -
టైగర్ నాగేశ్వరరావులో రేణుదేశాయ్.. ఆ పాత్ర వెనక ఇంత కథ ఉందా?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. మాస్ మహారాజా మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో నటిస్తోంది. 1970లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంటూరులోని స్టువర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నటి రేణు దేశాయ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి భారీ క్రేజ్ వస్తోంది. ఈ మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్రను పోషిస్తోంది. హేమలత లవణం ఎవరంటే? ఈ చిత్రంలో రేణు దేశాయ్ పోషిస్తున్న పాత్ర పట్ల ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె క్యారెక్టర్ వెనక ఉన్న అసలు సంగతేంటో తెలుసుకుందాం. అసలు ఆ పేరు ఎవరిదీ? అంత ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ను రేణుదేశాయ్ పోషించడంతో అభిమానులు సైతం నెట్టంట ఆరా తీస్తున్నారు. ఈ చిత్రంలోని హేమలత లవణం ఎవరు? అసలు ఆమె ఎవరో వివరాలు తెలుసుకుందాం. హేమలత లవణం జీవితం హేమలత గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తెలుగు కవి గుర్రం జాషువా, మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న జన్మించింది. ఆమె తన విద్యనంతా గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బీఏ చదివి బంగారు పతకాన్ని పొందింది. ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమెకు వివాహం జరిగింది. అయితే అప్పట్లో వర్ణ వివక్షను ఎదురించి చేసుకున్న ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఆమె వినోబా భావే భూదాన యాత్రలో చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసికంగా పరివర్తన తెచ్చేందుకు కృషిచేసింది. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అనే సేవా సంస్థను స్థాపించి వెనుకబడిన, దిగువ కులాల చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. 1981లో కావలిలో నవవికాస్ అనే సంస్థను స్థాపించి అణగారినవర్గాలను ఆదుకుంది. (ఇది చదవండి: బెంగళూరులో విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన నటుడు!) జోగిని వ్యవస్థపై పోరాటం అప్పట్లో మహిళల జోగిని వ్యవస్థపై పోరాటం చేసింది. జోగినులను, వారి పిల్లలను కాపాడేందుకు 'సంస్కార్' చెల్లి నిలయం అనే సంస్థలు ఏర్పాటు చేసింది. 'బాణామతి' లాంటి గుడ్డి నమ్మకాలతో మహిళల జీవితాలను ధ్వంసం చేస్తోన్న వాటికి వ్యతిరేకంగా పోరాడింది. రెండు వేలకు పైగా జోగినులను సంస్కరించడమేకాక.. ప్రభుత్వం చేత వారికి పొలాలు ఇప్పించింది. అంతే కాకుండా జోగినులకు వివాహాలు కూడా చేసింది. సంస్కార్ సంస్థను స్థాపించి.. నిజామాబాదు జిల్లాలోని జోగినీ వ్యవస్థ నిర్మూలనకు హేమలత లవణం చేసిన కృషి ఫలితంగానే.. అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగినీ వ్యవస్థ నిర్మూలణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వర్ణ, మతాంతర వివాహాలను ప్రోత్సహించింది. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించింది. చైల్డ్ ఎట్ రిస్క్ పేరుతో వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించింది. ప్రస్తుతం తెరకెక్కుతోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణుదేశాయ్ ఆమె పాత్రనే పోషిస్తోంది. ఈ సినిమాలో జోగినిల సంక్షేమం కోసి కృషి చేసిన హేమలత లవణం చరిత్రనే తెరపై చూపించనున్నారు. కాగా.. రేణు దేశాయ్ నటిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 3న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతమందిస్తున్నారు. -
టైగర్ నాగేశ్వరరావు: హేమలతగా రేణు దేశాయ్, పోస్టర్ అవుట్
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. 1970లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంటూరులోని స్టువర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు చుట్టూ ఈ కథ సాగుతుంది. వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రవితేజ సిగరెట్ తాగుతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి నటి రేణు దేశాయ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్రను పోషిస్తోంది. చేతిలో చంటిబాబును ఎత్తుకుని అతడిని చూసి మురిసిపోతున్నట్లుగా ఉంది రేణు దేశాయ్ లుక్. క్షణాల్లో ఈ పోస్టర్ వైరల్‌గా మారగా.. ఇన్నాళ్ల తర్వాత రేణు దేశాయ్ వెండితెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన నిర్మలమైన నవ్వు, ప్రశాంతతను కురిపించే కళ్లు.. ఏవీ మారలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ నెల 3న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) చదవండి: హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు కంటెస్టెంట్లు.. ఎవరెవరంటే? -
రవితేజ టైగర్ నాగేశ్వరరావు.. మేకర్స్ క్రేజీ అప్డేట్!
మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. రవితేజ, నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇట్స్ టైమ్ టూ రోర్ అంటూ రవితేజ మాస్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో సిగరెట్ తాగుతూ పక్కా మాస్ లుక్‌లో కనిపించారు. కాగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. It’s time to roar!#TigerNageswaraRao Trailer on OCTOBER 3rd 🔥 pic.twitter.com/hSFe65Jich — Ravi Teja (@RaviTeja_offl) September 26, 2023 -
ఏక్ దమ్ స్టెప్పులు
ఏక్ దమ్ ఎనర్జీతో స్టెప్పులేశారు రవితేజ. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏక్ దమ్... ఏక్ దమ్’ అంటూ జోష్‌గా సాగేపాట లిరికల్ వీడియోను ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు వెల్లడించి,పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. నూపుర్ సనన్‌ను రవితేజ ఆటపట్టించే సందర్భంలో ఈపాట వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. TIGER's Super Entertaining and Energetic Avatar for a peppy number 🤩💫#TigerNageswaraRao First Single #EkDumEkDum out on September 5th 🥁🎷 A @gvprakash musical 🎶 In cinemas from October 20th 🥷@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher pic.twitter.com/PIKO52wezZ — Tiger Nageswara Rao (@TNRTheFilm) September 1, 2023 -
'టైగర్ నాగేశ్వరరావు' రియల్ స్టోరీ.. ఇంతకీ అతడెవరో తెలుసా?
'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని పేరు. మహా అయితే స్టువర్టుపురం గజదొంగ అని తెలిసి ఉంటుందేమో! ఇతడి జీవితం ఆధారంగా తెలుగులో ఓ సినిమా తీశారు. రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' పేరుతోనే దీన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఇంతకీ 'టైగర్ నాగేశ్వరరావు' ఎవరు? ఆయన మంచోడా? చెడ్డోడా? ఎవరీ నాగేశ్వరరావు? విజయవాడ-చెన్నై రూట్లో బాపట్లకు దగ్గర్లో స్టువర్టుపురం అనే ఊరు ఉంటుంది. అప్పట్లో అంటే 1874 టైంలో దొంగల్ని, ఇతర నేరాలు చేసే వాళ్లపై నిఘా పెట్టేందుకు.. వాళ్లందరినీ తీసుకొచ్చి ఈ ఊరిలో నివాసం కల్పించారు. అలా దొంగతనాలు చేసుకునే కుటుంబంలో 1953-56 మధ్యలో నాగేశ్వరరావు పుట్టాడు. ఇతడికి ఇద్దరు అన్నలు ప్రసాద్, ప్రభాకర్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రసాద్, ప్రభాకర్ దొంగతనాలు చేసేవారు. (ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు టీజర్‌పై హైకోర్టు అసహనం) అలా దొంగగా మారి అయితే ఓ సారి ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు.. నాగేశ్వరరావుని స్టేషన్‌కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. చేయని నేరానికి చిత్రవధ అనుభవించిన ఇతడు.. తండ్రి, అన్నల బాటలో అది కూడా 15 ఏళ్లకే దొంగగా మారాడు. 1970లో తమిళనాడుకు వెళ్లిపోయి మారుపేర్లతో దొంగతనాలు చేశాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి బయటకొచ్చాక, అతడి గ్యాంగ్‌లో చేరిపోయాడు. చెప్పి మరీ దొంగతనాలు ఓసారి ఈ అన్నదమ్ముల్ని తమిళనాడులో తిరువళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తనని చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని.. నాగేశ్వరరావు సవాలు విసిరాడు. అన్న చెప్పినా సరే వినకుండా అలానే రెండు రోజుల తర్వాత జైలులో పోలీసులని కొట్టి మరీ పరారయ్యాడు. 'వచ్చే నెల మద్రాసులో దొంగతనం చేస్తాను, దమ్ముంటే పట్టుకోండి' అని సవాలు విసిరి మరీ దొంగతనాలు చేశాడు. దీంతో నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావుగా మార్మోగిపోయాడు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు) 15 ఏళ్లపాటు దొంగతనాలు పోలీసుల తీరు వల్ల దొంగగా మారిన టైగర్ నాగేశ్వరరావు.. దాదాపు 15 ఏళ్లపాటు ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకలో దొంగతనాలు, దోపీడీలకు పాల్పడ్డాడు. పోలీసులని ముప్పతిప్పలు పెట్టాడు. 1974లో బనగానపల్లె బ్యాంకు దోపీడీ అయితే వేరే లెవల్. పోలీసు స్టేషన్ దగ్గరే ఉన్న ఆ బ్యాంక్‌ని నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది. మత్తు మందు ఇచ్చి అయితే నాగేశ్వరరావు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీసులు.. అతడిని ఎలా అయినాసరే మట్టుబెట్టాలని ఓ మహిళతో కలిసి అతడిని చంపడానికి ప్లాన్ చేశారు. అలా 1980 మార్చి 24న తెల్లవారుజామున.. ఆ మహిళ ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు మత్తుమందు కలిపిన పాలు తాగాడు. అలా నిద్రపోతుండగా పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తర్వాత దాన్ని ఎన్‌కౌంటర్‌గా మార్చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి రాఖీ సెలబ్రేషన్స్) దొంగనే కానీ మంచోడు అయితే స్టువర్టుపురం గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వరరావు.. పెద్దోళ్ల దోచుకున్నదంతా పేదలకు పంచిపెట్టేవాడు. చదువు, పెళ్లి, వైద్యం లాంటిది ఏదైనా సరే అవసరానికి మించిన సహాయం చేసేవాడు. అయితే ఎన్ని దొంగతనాలు, దోపీడీలు చేసినా సరే మహిళల పట్ల ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడి అన్నయ్య ప్రభాకర్.. ఓ సందర్భంలో చెప్పాడు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) -
టైగర్ నాగేశ్వరరావు టీజర్‌పై హైకోర్టు అసహనం
సాక్షి, అమరావతి: టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్లో వాడిన భాష ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అనుమతి లేకుండా టీజర్ విడుదల చేయడంపై అభ్యంతరం తెలిపింది. తగిన అనుమతులు తీసుకోకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి టీజర్ల ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీసింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాల నిర్మాణం ఉండకూడదని పేర్కొంది. ఈ మేరకు టైగర్ నాగేశ్వరరావు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్‌పర్సన్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. సినిమాపై అభ్యంతరాలన్నింటినీ సీబీఎఫ్సీ చైర్‌పర్సన్‌కు తెలియజేసుకునేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎరుకల సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ చుక్కా పాల్‌రాజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపి టీజర్‌లోని భాషపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: 99% పక్కా అన్నారు, ఏమైందో మరి.. చివరికి నన్ను తీసేశారు.. మై విలేజ్ షో అనిల్ -
టైగర్ ప్రియురాలు ఈమెనే..
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్ (నటి కృతీ సనన్ చెల్లెలు), గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి వరుస విజయాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సారా పాత్రలో నటిస్తున్నారు నూపుర్. ‘టైగర్ లవ్ సారా’ అంటూ సోమవారం నూపుర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘రవితేజ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. అక్టోబర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్. మది, సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. Nothing makes me feel more proud than to launch my sister’s first PAN INDIA film Poster!🥹🧿❤️ #TigerNageswaraRao Meet our TIGER'S LOVE ❤️ Introducing @NupurSanon as the lovely Sara from the GRAND WORLD of #TigerNageswaraRao 🥷 WORLDWIDE HUNT begins from October 20th 🐯🔥… pic.twitter.com/hlyGMVv9ly — Kriti Sanon (@kritisanon) August 28, 2023 -
'టైగర్ నాగేశ్వరరావు' టీజర్.. రవితేజ అలాంటి లుక్‌లో
మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమా చేస్తున్నాడు. 1970ల్లో మన దేశంలోనే పెద్ద దొంగగా అందరినీ భయపెట్టిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఈ మూవీ. దసరా సందర్భంగా అక్టోబరు 20న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేశారు. అలానే టైగర్ దండయాత్ర పేరుతో గురువారం ఓ టీజర్ ని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!) టీజర్ ఎలా ఉంది? 1970ల వాతావరణాన్ని ప్రతిబింబించేలా టీజర్‌లోని ప్రతి షాట్ కనిపిస్తుంది. స్టువర్ట్పురం దొంగగా రవితేజ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. అనుపమ్ ఖేర్, మురళీశర్మ.. పాత్రల్ని కూడా టీజర్ లో చూపించారు. 'పులి, సింహం కూడా ఓ వయసు వచ్చేదాక పాలే తాగుతాయి సర్. కానీ వీడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు' లాంటి డైలాగ్స్ ఆసక్తి రేపుతున్నాయి. కథేంటి? హైదరాబాద్, బాంబే, ఢిల్లీతో పాటు అనేక నగరాల్లో దారుణమైన దోపిడీలు చేసిన స్టువర్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు.. మద్రాసు సెంట్రల్ జైలులో ఉంటాడు. ఓ రోజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అతడిని పట్టుకునే బాధ్యతని డీసీపీ మురళీశర్మకు అప్పగిస్తారు. ఈ క్రమంలోనే చివరకు ఏమైంది? అనేది స్టోరీ అని తెలుస్తోంది. మొన్నటివరకు ఈ సినిమా డైరెక్టర్ పేరు చెప్పకుండా సస్పెన్స్ మెంటైన్ చేశారు కానీ ఇప్పుడు వంశీ దర్శకుడు అని టీజర్లో చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!) -
టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునేందకు ఎంట్రీ ఇచ్చిన అనుపమ్ ఖేర్
ఐబీ ఆఫీసర్ (ఇంటెలిజెన్స్ బ్యూరో) రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా చార్జ్ తీసుకున్నారు అనుపమ్ ఖేర్. టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునే మిషన్ విషయంలో రాఘవేంద్ర ఎలాంటి ప్లాన్స్ వేశారు? అనేది ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో చూడాల్సిందే. రవితేజ టైటిల్ రోల్లో వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ చేస్తున్న కీలక పాత్ర అయిన ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘టైగర్ నాగేశ్వరరావు’టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేయనున్నాం. అలాగే ఈ మూవీని అక్టోబర్ 20న రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
నో ఛేంజ్.. దసరాకి టైగర్ వేట కన్ఫర్మ్
రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించినట్లు దసరాకి అక్టోబర్ 20నే విడుదల చేస్తామనీ చిత్రబృందం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబర్ 20న విడుదల కావడం లేదంటూ కొన్ని శక్తులు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయి. ఆ వదంతులను నమ్మవద్దు. మీకు (ప్రేక్షకులు) అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాం. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ వద్ద టైగర్ వేట ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మయాంక్ సింఘానియా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్ మది. -
నాగేశ్వరరావు కోసం ఐదుగురు స్టార్స్
హీరో రవితేజ సినిమాకి రెండోసారి మాట ఇచ్చారు హీరో వెంకటేశ్. రవితేజ నటించిన ‘క్రాక్’ (2021)కి వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేశ్.. తాజాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రానికి ఇచ్చారు. వంశీ దర్శకత్వంలో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ఇది. ‘‘అది 70వ దశకం. బంగాళాఖాతం తీరప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. దడదడ మంటూ వెళ్లే రైలు ఆప్రాంతం పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనబడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని.. ‘స్టూవర్టుపురం’. ఆప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది.. ‘టైగర్ జోన్’. ద జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు..’ అంటూ టైగర్ నాగేశ్వరరావు చరిత్రని తన వాయిస్‌తో వెంకటేశ్ పరిచయం చేసిన తీరు సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోకు హిందీలో జాన్ అబ్రహాం, కన్నడలో శివ రాజ్‌కుమార్, తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగగా ముద్రపడిన నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వెండితెరపై ‘టైగర్ నాగేశ్వరరావు’
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు. పెద్దలను కొట్టి పేదలకు పంచిన రాబిన్‌హుడ్‌గా ఫ్యాన్ పాలోయింగ్ కలిగిన నేరస్తుడు. పోలీసు అధికారులకు ముందుగా చెప్పి జైలు నుంచి తప్పించుకున్న ‘టైగర్’. పట్టుకోలేరంటూ సవాల్ చేసి మరీ నేరాలు చేసిన తెంపరి. పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమాన జనంతో ఆయన అంతిమ యాత్రకు మూడు రోజులు పట్టింది. మృతి చెందిన 43 ఏళ్లకు నాగేశ్వరరావు జీవిత కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గజదొంగ హీరోయిజమే ఈ పాన్ఇండియా సినిమాకు ప్రేరణ. ‘మాస్ మహరాజ్’ రవితేజ ఈ చిత్ర హీరో. గుంటూరు డెస్క్ : విజయవాడ– చైన్నె రైలు మార్గంలో బాపట్ల సమీపంలో ఉంటుంది స్టువర్టుపురం. 1874 సెటిల్మెంట్ చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామం. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారిని, ఇతర నేరస్తులను గుర్తించి నిఘా ఉంచేందుకని ఇక్కడ నివాసం కల్పించారు. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ హోం సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్ పేరుతో గ్రామానికి నామకరణం చేశారు. నేరాల్లో ఆరితేరిన వారు ముఠాలుగా వివిధ రాష్ట్రాల్లో దోపిడీ, దొంగతనాలకు పాల్పడేవారు. స్టువర్టుపురం దొంగలంటేనే జనంలో ఒకరకమైన భీతి ఉండేది. టైగర్ నాగేశ్వరరావు తెర పైకి వచ్చాక ఆ గ్రామం పేరు మరింతగా కలకలం రేపింది. తోటి దొంగలకు హీరోగా, పేదలకు ఆపద్బాంధవుడిగా, పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. దొంగతనాలు వారసత్వంగా కలిగిన కుటుంబంలో ఇద్దరు అన్నల తర్వాత గరిక నాగేశ్వరరావు జన్మించాడు. జనన సంవత్సరం 1953–56 మధ్య. సోదరులు ప్రసాద్, ప్రభాకర్. వీరి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. మరికొన్నేళ్లకు తండ్రినీ కోల్పోయారు. తండ్రి బాటలోనే దొంగతనాలు చేస్తున్న ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు, సోదరుడైన నాగేశ్వరరావును తీసుకెళ్లి, తీవ్రంగా హింసించారు. ఏ నేరం చేయకుండానే పోలీసుల చిత్రహింసలు అనుభవించిన 15 ఏళ్ల నాగేశ్వరరావు తండ్రి, అన్న బాటలోనే నేరస్తుల జత కట్టాడు. 1970లో తమిళనాడు వెళ్లి మారుపేర్లతో నివాసముంటూ దొంగతనాలు ఆరంభించాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి విడుదలై వచ్చాక అతడి ముఠాలో పని చేయసాగాడు. ‘ఆంధ్రా టైగర్రా’... ఒక పర్యాయం తమిళనాడు పోలీసులు అన్నదమ్ములను అరెస్టు చేశారు. తిరువాళ్లూరు జైలులో ఉన్న నాగేశ్వరరావును అప్పటి ఐజీ అరుళ్ విచారించారు. తనను చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని నాగేశ్వరరావు ఐజీతో స్పష్టంగా చెప్పాడు. అన్న వద్దని చెప్పినా వినకుండా, సబ్‌జైలు నుంచి పోలీసులను కొట్టి మరీ పరారయ్యాడు. తనను వెతుక్కుంటూ స్టువర్టుపురం వచ్చిన పోలీసులనూ కొట్టాడు. ‘వచ్చే నెలలో మద్రాస్ సిటీలోనే నేరం చేస్తాను... దమ్ముంటే పట్టుకోమను’ అంటూ వారిని పంపేశాడు. అన్నట్టుగానే మద్రాస్ సిటీలో వరుసగా మూడు నెలలు దొంగతనాలు చేసి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. విసుగెత్తిపోయిన ఐజీ అరుళ్ నిజంగా వాడు ‘ఆంధ్రా టైగర్రా’ అన్నాడు. అప్పట్నుంచి నాగేశ్వరరావు ఇంటి పేరు టైగర్ అయింది. ఏపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 15 ఏళ్లపాటు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన టైగర్ నాగేశ్వరరావు పోలీసులకు సింహస్వప్నంగా మారాడు. 1974లో జరిగిన బనగానపల్లె బ్యాంకు దోపిడీ అందులో ఒకటి. పోలీస్‌స్టేషనుకు అత్యంత సమీపంలో ఉండే బ్యాంకును నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది. సేఫ్‌ను పగులగొట్టి వెంట తీసుకెళ్లారు. గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులకు ప్రభాకరరావు దొరికాడు మినహా నాగేశ్వరరావు ఆచూకీ దొరకలేదు. ఒక బిస్కట్ కంపెనీ అధినేత, అప్పటి హోంశాఖ సహాయమంత్రి వియ్యంకుడి కుటుంబాన్ని దారికాచి దోచారు. పట్టుకునేందుకు పోలీసుల వ్యూహం ... తలనొప్పిగా మారిన నాగేశ్వరరావును ఎలాగైనా మట్టుపెట్టాలని పోలీస్ శాఖలోని కొందరు అధికారులు సిద్ధమయ్యారు. మరొక దొంగ ఇచ్చిన సమాచారంతో నాగేశ్వరరావు తరచూ ఒక మహిళ ఇంటికి వచ్చి వెళుతుంటాడని తెలుసుకున్నారు. డబ్బాశ చూపారు. పాలల్లో మత్తుమందు కలిపి, తమకు సంకేతం ఇవ్వాలని, లేకుంటే తనను చంపేస్తామని బెదిరించారు. భయపడిపోయిన ఆ మహిళ తర్వాత నాలుగు రోజులకు 1980 మార్చి 24న తెల్లవారుజామున ఇంటికి వచ్చిన నాగేశ్వరరావుకు పోలీసులు చెప్పినట్టే మత్తుమందు కలిపిన పాలు తాగించింది. మత్తులో నిద్రపోతున్న అతడిపై పోలీసు అధికారి తుపాకీ కాల్పులు జరిపాడు. ఎన్‌కౌంటరులో హతమైనట్టు ప్రకటించారు. శవపరీక్ష నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి ఆరంభమైన అంతిమయాత్ర స్టువర్టుపురం కాలనీకి చేరేందుకు మూడురోజులు పట్టిందట! మూడు రాష్ట్రాల్నుంచి ఎందరో అభిమానులు ఆ యాత్రలో పాల్గొన్నారు. చదువులు, వైద్యం, పెళ్లిళ్లకు సాయం ... ఇన్ని దొంగతనాలు, దోపిడీలు చేసినా నాగేశ్వరరావు మిగుల్చుకుంది ఏమీ లేదంటారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు చీరాల, చుట్టుపక్కల పల్లెల్లోనే తలదాచుకునే వాడు. ఆశ్రయం ఇచ్చినవారికి, సహాయం కోరిన ఇతరులకు ఆర్థిక సహాయం చేసేవాడు. ముఖ్యంగా పిల్లల చదువులు, వైద్యం, పెళ్లిళ్లకు తప్పకుండా సాయం చేసేవాడు. పొగాకు కంపెనీ యజమాని అరాచకంపై మహిళల్ని పోరుబాటకు సిద్ధం చేయటమే కాదు... అతడికి వత్తాసుగా వచ్చిన ఎస్ఐపైనా మహిళలతో దాడి చేయించాడు. మహిళలంటే గౌరవం... మేం ఒకప్పుడు దొంగతనాలు చేసినా, మహిళలంటే మాకెంతో గౌరవం...ఒంటరిగా ఉన్నా బంగారం, డబ్బు దోచుకునేవాళ్లం మినహా ఎలాంటి అకృత్యాలకు పాల్పడేవాళ్లం కాదు... నేటికాలంలో ఆడవాళ్లపై జరుగుతున్న ఘోరాలు వింటుంటే బాధ కలుగుతోంది. నా సోదరుడు నాగేశ్వరరావు ఆర్థికసాయం కూడా చేసేవాడు. సినిమా తీస్తున్నారు. నన్ను కూడా వివరాలు అడిగారు. – గరిక ప్రభాకరరావు, నాగేశ్వరరావు సోదరుడు సుదీర్ఘ పరిశోధన చేశాం... ‘దొంగాట’ సినిమా చేసేటపుడు ఒక పెద్దాయన ద్వారా టైగర్ నాగేశ్వరరావు గురించి తెలిసింది. దొంగైనా అతడు రాబిన్‌హుడ్ అని చెప్పటంతో ఆసక్తి కలిగింది. వైవిధ్యమైన సినిమాలు, అందులోనూ ఏదైనా బయోపిక్ కూడా తీయాలనుకున్న నాకు, అతడి జీవితంలోని కమర్షియల్ ఎలిమెంట్ నచ్చింది. అప్పట్నుంచి పరిశోధన మొదలైంది. ఎన్నో ఆసక్తిదాయకమైన అంశాలతో సినిమా తీస్తున్నాం. – వంశీకృష్ణ, సినీదర్శకుడు -
దసరా బరిలో బాలయ్య, రవితేజ, రామ్.. బాక్సాఫీస్ బద్దలే!
పండగ సీజన్ అంటే సినీ ప్రేమికులకు సినిమా సందడి ఉండాల్సిందే. అందుకే పండగ టార్గెట్‌గా సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. పండగకి ఐదారు నెలల ముందే రిలీజ్ డేట్ ప్రకటించి, పండగ బెర్త్‌ని కన్ఫార్మ్ చేసేస్తుంటారు. అలా ఈ దసరా పండక్కి బాక్సాఫీస్ పోటీ ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పటికి అధికారికంగా విడుదల తేదీ ప్రకటించి, బాక్సాఫీస్ బరిలో నిలవనున్న సినిమాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ నేపథ్యంలో... రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలు చాలానే వచ్చాయి. అయితే తాజాగా పూర్తి స్థాయి తెలంగాణ యాసతో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓ గజదొంగ కథ రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. మాస్ ఎనర్జీ రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ హై ఓల్టేజ్ మాస్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానుంది. కాగా రామ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ఇదే అన్న సంగతి తెలిసిందే. మాఫియా డ్రామా ‘మాస్టర్’ (2021) చిత్రం తర్వాత హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబరు 18న విడుదల కానుంది. ప్రస్తుతానికైతే దసరా పండక్కి ఈ సినిమాలు కర్చీఫ్ వేశాయి. మరి.. పండగ రేస్‌లో ఫైనల్‌గా ఏ సినిమాలు ఉంటాయనే విషయం రానున్న రోజుల్లో తెలుస్తుంది. అప్పుడు సంక్రాంతి..ఇప్పుడు దసరా హీరోలు రవితేజ, రామ్, విజయ్‌లు నటించిన చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఇది తొలిసారి కాదు. 2021 సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, విజయ్ ‘మాస్టర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఇప్పుడు ఈ ముగ్గురి చిత్రాలు దసరా పోటీలో నిలి చాయి. ఈ మూడు సినిమాలతో పాటు ఇంకెన్ని సినిమాలు దసరా బరిలో నిలుస్తాయో చూడాలి. -
రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. నుపుర్ సనన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. 1970-80ల కాలంలో స్టువర్టుపురంలోని గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించననున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలారు. సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో రవితేజ ఈ చిత్రంలో కనిపించనున్నారు. నుపూర్ సనన్‌తో పాటు గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్గా నటించనుంది. -
ట్రైన్లో యాక్షన్ సీన్స్.. ఆ కిక్కే వేరప్పా!
తెరపై విలన్ని హీరో రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. అందుకే యాక్షన్ సీన్స్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని సినిమాల కోసం ట్రైన్లో ఫైట్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. ట్రైన్లో రిస్కీ యాక్షన్ సీన్స్ చూపించనున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ట్రైన్లో భారతీయుడు దర్శకుడిగా శంకర్ పరిచయమైన తొలి సినిమా ‘జెంటిల్‌మేన్’. ఈ సూపర్‌డూపర్ హిట్ ఫిల్మ్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే... శంకర్ దర్శకత్వం వహించిన ఆ తర్వాతి చిత్రాల్లో రజనీకాంత్ ‘రోబో’, విక్రమ్ ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) వంటి వాటిలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల తర్వాత కమల్, శంకర్ కాంబోలోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. అక్కడ దాదాపు రెండు వారాలపాటు షూటింగ్‌ని ΄్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లోనే ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట శంకర్. ఫారిన్ ఫైటర్స్, ఫారిన్ యాక్షన్ మాస్టర్స్ ఈ ఫైట్‌ను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’లో ఉన్న మేజర్ హైలైట్స్‌లో ఇదొకటనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. పది కోట్ల ఫైట్ ఒకవైపు కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తూనే మరోవైపు రామ్‌చరణ్‌తో ‘సీఈవో’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్‌ని యాక్షన్ సీన్‌తోనే ఆరంభించారు. భారీ స్థాయిలో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో వందమందికి పైగా ఫైటర్స్ పాల్గొన్నారని, ఈ ఫైట్ ఖర్చు రూ. పది కోట్లు పైనే అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ ఫైట్ ఏ విధంగా ఉంటుందనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్. నాగేశ్వరరావు దోపిడీ స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్‌లో రవితేజ రైలు పట్టాలపై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథ రీత్యా ట్రైన్లో నాగేశ్వరరావు దోపీడీ చేసే సీన్ అట అది. ట్రైన్లో చిన్నపాటి యాక్షన్ టచ్ కూడా ఉంటుందట. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. డెవిల్ పోరాటం స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1945లో బ్రిటిష్‌వాళ్ళు పరిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతున్న చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్టర్లో కల్యాణ్ రామ్ ఓ ట్రైన్‌పై ఉన్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీన్లో భాగంగా ఈ ట్రైన్ వస్తుందని తెలుస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బొగ్గు దొంగ తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల సమీపంలో గల ఓ కల్పిత గ్రామంలో జరిగే కథగా రూపొందిన చిత్రం ‘దసరా’. ఇందులో మద్యానికి బానిస అయి, బొగ్గు దొంగతనం చేసే ధరణి పాత్రలో కనిపిస్తారట నాని. ఇటీవల విడుదలైన ‘దసరా’ ట్రైలర్లో బొగ్గు ఉన్న గూడ్స్ ట్రైన్‌పై నాని ఉన్న సీన్ కనిపిస్తుంది. ఇది ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అని టాక్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. లోకల్ ట్రైన్లో ఏజెంట్ లోకల్ ట్రైన్లో ఫైట్స్ చేశారట అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. గత ఏడాది వేసవిలో ‘ఏజెంట్’ షూటింగ్ హైదరాబాద్ మెట్రో రైల్లో జరిగింది. ట్రైన్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా సురేందర్ రెడ్డి చిత్రీకరించారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఎనిమిది కోట్ల యాక్షన్ సూరి, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదలై’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘విడుదలై పార్ట్ 1’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఖర్చు దాదాపు రూ. 8 కోట్లు అని సమాచారం. కాగా ‘విడుదలై’ రెండో భాగం విడుదలపై కూడా త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. -
వైజాగ్‌లో టైగర్
హీరో రవితేజ నటిస్తున్న తొలి పా న్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చివరి షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభమైంది. వంశీ, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ–‘‘స్టూవర్టు పురంలోని టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. 1970ల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ పా త్ర కోసం రవితేజ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో అలరిస్తారు. వైజాగ్‌లో ప్రారంభమైన చివరి షెడ్యూల్లో కీలక తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. ఈ ఏడాది సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్. మధి. -
రవితేజ సినిమాతో రేణూ దేశాయ్ రీఎంట్రీ.. ఫస్ట్‌లుక్ రిలీజ్
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఆ చిత్రం ద్వారానే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడిపోయారు. వీరిద్దరూ ప్రేమలో ఉండగానే 2003లో పవన్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ చిత్రంలో హీరోయిన్గా నటించారు. అదే రేణూ దేశాయ్ చివరి చిత్రం. ఆ తర్వాత పెళ్లి.. పిల్లలు.. విడాకులు ఇలా రేణూ దేశాయ్ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. దీంతో ఆమె మళ్లీ తిరిగి సినిమాల వైపు చూడలేదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు రేణూ దేశాయ్. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రాలలో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. 1970లో స్టూవర్టుపురంలోని టైగర్ నాగేశ్వరరావు అనే ఒక దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వంశీ.ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను రేణు దేశాయ్ పోషిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రకి సంబంధించిన లుక్ ను .. వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె 'హేమలత లవణం' పాత్రలో కనిపిస్తారనీ .. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పారు. -
టైగర్ నాగేశ్వరరావు బయోపిక్: రవితేజ సినిమాలో అనుపమ్
ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. రవితేజ టైటిల్ రోల్లో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కశ్మీరీ ఫైల్స్’లో అనుపమ్ చేసిన పుష్కర్ నాథ్ పండిట్ పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మళ్లీ అభిషేక్ నిర్మాణంలో మరో సినిమా చేయనుండటం పట్ల అనుపమ్ ఆనందం వ్యక్తం చేశారు. స్టువర్ట్పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా 1970 నేపథ్యంలో రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే కాదు.. నిఖిల్ ‘కార్తికేయ 2’లోనూ అనుపమ్ కీలక పాత్ర చేస్తున్నారు. -
గాయపడ్డా నో రెస్ట్
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఇటీవల ఓ ఫైట్ చిత్రీకరిస్తున్న సమయంలో రవితేజ గాయపడ్డారు. ఆయన మోకాలికి గాయమై, పది కుట్లు పడ్డాయని తెలిసింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పినప్పటికీ రవితేజ ‘నో రెస్ట్’ అంటూ షూటింగ్లో పాల్గొంటున్నారు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్, ఇతర నటీనటుల డేట్స్‌ని దృష్టిలో పెట్టుకుని, తన కారణంగా షూటింగ్‌కి ఆటంకం కలగకూడదని రవితేజ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. -
నైట్ షూట్లో నాగేశ్వరరావు
దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు రవితేజ. ఈ మెళకువలన్నీ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాగేశ్వరరావు పాత్రను రవితేజ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నారు. అలాగే సంభాషణలు పలికే తీరు కూడా వినూత్నంగా ఉంటుంది. రవితేజ నటిస్తున్న ఈ తొలి పాన్ ఇండియా చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నైట్ షూట్ జరుగుతోంది. ఈ సెట్లో జరుగుతున్న సందడి తాలూకు వీడియోను రవితేజ షేర్ చేశారు. నాగేశ్వరరావు రాత్రిపూట చేసే దొంగతనానికి సంబంధించిన సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ నిర్మాత. -
నాకు సాధ్యపడలేదు.. రవితేజ చేయడం హ్యాపీ : చిరంజీవి
‘‘టైగర్ నాగేశ్వరరావు’ కథను ప్యాండమిక్ సమయంలో దర్శకుడు వంశీ చాలా అద్భుతంగా నాకు వినిపించారు. ఆ తర్వాత ఈ సినిమా చేసేందుకు నాకు సాధ్యపడలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి అన్నారు. స్టువర్టుపురం దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మయాంక్ సింఘానియా సహనిర్మాత. రేణు దేశాయ్, మురళీ శర్మ, షణ్ముఖి కీలక పాత్రధారులు. ఉగాది సందర్భంగా జరిగిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మా నాన్న (కొణిదెల వెంకటరావు) గారు చీరాల పేరాలలో ఉద్యోగం చేశారు. ఆ పక్కనే స్టువర్టుపురం ఉండేది. అక్కడి వారంతా నాగేశ్వరరావుని హీరోగా కొనియాడుతుండేవారు. ఆసక్తితో నాన్నగారిని అడిగి నాగేశ్వరరావు గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు నాగేశ్వరరావు గురించి వంశీ కమర్షియల్‌గా కథను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రవితేజ చేస్తుండటం శుభం. ఇందుకు నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ పూనుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. మరో ముఖ్య అతిథి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు వివేక్ ‘కశ్మీర్ ఫైల్స్’తో భారతీయులందరికీ పండిట్ల కథను తెలిసేలా చేశారు. దేశానికి ఉపయోగపడే సినిమా తీసిన అభిషేక్‌ను అభినందిస్తున్నాను. ఇప్పుడు అభిషేక్ తీస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘రవితేజ ఈ సినిమా ఒప్పుకోవడం నాతో పాటు, మా టీమ్‌కు కూడా మంచి ఎనర్జీని ఇచ్చింది. రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అందరి హీరోల ఫ్యాన్స్ మెచ్చే చిత్రంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ ఉంటుంది’’ అన్నారు వంశీ. ‘‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాగే ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
'టైగర్ నాగేశ్వరరావు' వేట మొదలైంది.. స్టన్నింగ్‌గా ప్రీ లుక్
Ravi Teja Tiger Nageswara Rao Pre Look Released By Chiranjeevi: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా డౌన్ టు ఎర్త్ వ్యక్తిగా పేరు సంపాందించుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి ప్రీ లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. 'శ్రీ శుభకృత్ నామ' తెలుగు సంవత్సరం కానుకగా ఉగాది పర్వదినాన ఈ ప్రీలుక్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో రవితేజ ఒక ట్రైన్ ముందు స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ ప్రీ లుక్ టీజర్లో బీజీఎం అద్భుతంగా ఉంది. వేట మొదలైంది అంటూ ఈ ప్రీ లుక్కు క్యాప్షన్ ఇచ్చారు. చదవండి: టైగర్ నాగేశ్వరరావు మూవీలో గాయత్రి భరద్వాజ్ రవితేజ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా మూవీగా వస్తోంది 'టైగర్ నాగేశ్వరరావు'. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ లాంచ్ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై ముహుర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. అలాగే సినిమా యూనిట్‌గా విషెస్ తెలియజేశారు. ఈ చిత్రం క్రైమ్ డ్రామాగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు'కు జోడిగా ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ అలరించనున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: గజదొంగ బయోపిక్‌లో రవితేజ..ఎవరీ టైగర్ నాగేశ్వరరావు? -
టైగర్ నాగేశ్వరరావు మూవీలో గాయత్రి భరద్వాజ్
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కృతీ సనన్ సోదరి నుపూర్ సనన్‌ను హీరోయిన్గా ఎంపిక చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో హీరోయిన్ను సైతం సెలక్ట్ చేసింది. ఇండియన్ మోడల్, నటి గాయత్రి భరద్వాజ్ కూడా ఇందులో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కాగా రవితేజ ప్రస్తుతం ధమాకా, రావణాసుర చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ మాస్ హీరో నటించిన రామారావు ఆన్ డ్యూటీ త్వరలోనే విడుదల కానుంది. Welcoming @gaya3bh to the Massive Hunt of @RaviTeja_offl’s #TigerNageswaraRao 🐅@DirVamsee @abhishekofficl @NupurSanon @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @AAArtsOfficial @CastingChhabra @UrsVamsiShekar pic.twitter.com/dOErfIQ4gW — Tiger Nageswara Rao (@TNRTheFilm) April 1, 2022 Happy to announce that @NupurSanon would be joining @RaviTeja_offl for the Massive Hunt in #TigerNageswaraRao 🔥@DirVamsee @abhishekofficl @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @AAArtsOfficial @UrsVamsiShekar pic.twitter.com/WJ81N9IU7n — Tiger Nageswara Rao (@TNRTheFilm) March 31, 2022 చదవండి: డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన నాగిని బ్యూటీ -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కృతి సనన్ చెల్లెలు
మహేశ్ బాబు ‘వన్ నేనొక్కడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. తొలి సినిమాతో టాలీవుడ్ బై చెప్పి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది వరస ఆఫర్స్ బిజీగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చెల్లి నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. రవీతేజ తదుపరి చిత్రం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నుపుర్ హీరోయిన్గా ఎంపికైనట్లు తాజాగా మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా దర్శకుడు కృష్ణవంశీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజతో నుపుర్ జోడి కట్టనుంది. చదవండి: తెలుగు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అంటున్నారు: తాప్సీ ఇదిలా ఉంటే మాస్ మహారాజ రవితేజ వరస హిట్స్, ప్లాప్స్తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ఖీలాడి మూవీ రిలీజై బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. ఇదిలా ఉంటే త్వరలోనే రామారావు ఆన్ డ్యూట్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు ధమాకా, రావణాసుర సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. ఇవి ఉండగానే రవితేజ పాన్ ఇండిచా చిత్రం టైగర్ నాగేశ్వరరావు పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ చేయనున్నట్టుగా ఇటీవల చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’పై కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు, ఆర్జీవీ కౌంటర్ Woohoo! The lovely @NupurSanon is now starring in @RaviTeja_offl 's first Pan India film, #TigerNageswaraRao... Directed by #Vamsee and produced by #AbhishekAgarwal. The movie launches on 2 April 2022 in #Hyderabad. Superb news #nupursanon #raviteja #siddharthkannan #sidk pic.twitter.com/Z6gQe5nFmG — Siddharth Kannan (@sidkannan) March 31, 2022 -
ఎంటర్‘ట్రైన్’మెంట్: ట్రైన్ సీన్లు కీలకంగా ఉన్న కొత్త సినిమాలివే!
ట్రైన్లో ప్రేమ.. ట్రైన్లో ఫైట్.. ట్రైన్లో కామెడీ.. ట్రైన్లో ఎమోషన్.. ట్రైన్ జర్నీలో ఎన్నో... వెండితెరపై ఎన్నో భావోద్వేగాలను ట్రైన్ చూపించింది. ఆడియన్స్‌ని ఎంటర్‘ట్రైన్’ చేసింది. ట్రైన్‌కి చాలా సీన్ ఉన్న సినిమాలు ఇప్పుడు ట్రాక్‌లో ఉన్నాయి. ఆ ఎంటర్‘ట్రైన్’మెంట్లోకి వెళదాం... Tollywood Movies With A Train Backdrop: ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, డాక్టర్ ప్రేరణగా పూజా హెగ్డే కనిపిస్తారు. 1970నాటి యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీలో ఓ ట్రైన్ ఎపిసోడ్ కీలకంగా నిలవనుంది. ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్లో ట్రైన్లో ప్రభాస్, పూజ కనిపిస్తారు. ప్రేరణగా పూజా హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ట్రైన్లో ఉన్న స్టిల్‌నే విడుదల చేశారు. ఓ ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగే ట్రైన్ యాక్సిడెంట్లో విడిపోయిన విక్రమాదిత్య, ప్రేరణ మళ్లీ ఎలా కలుసుకుని వారి ప్రేమకు శుభం కార్డు వేశారు? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని సమాచారం. ఈ చిత్రం మార్చి 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ‘రాధేశ్యామ్’ చిత్రంలోని హీరో పాత్ర పేరు విక్రమాదిత్యనే టైటిల్‌గా పెట్టి దర్శకుడు తేజ 1836 నేపథ్యంలో సాగే ఓ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో ట్రైన్ విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. సో.. ‘విక్రమాదిత్య’లో ట్రైన్ ఎపిసోడ్ కీలకంగా ఉండటమే కాకుండా, ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో మేజర్ కథ సాగుతుందని ఊహించవచ్చు. అలాగే ‘సర్ ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం’ బ్యారేజ్‌కు, ‘విక్రమాదిత్య’ చిత్రకథకు లింక్ ఉందని చిత్రం యూనిట్ హిట్ ఇచ్చింది. ఇక రవితేజ కెరీర్లో ఓ హిట్ మూవీగా నిలిచిన ‘వెంకీ’లోని ట్రైన్ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ ఎపిసోడే కథను ముందుకు నడిపిస్తుంటుంది. తాజాగా కథను ముందుకు నడిపే ట్రైన్ ఎపిసోడ్‌తో రవితేజ చేస్తోన్న చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. ఈ సినిమా కొత్త పోస్టర్ ఇటీవల రిలీజైంది. సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఉన్నట్లుగా ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. అయితే రవితేజ ‘వెంకీ’ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్ కామెడీతో ఉంటే, ‘రామారావు: ఆన్ డ్యూటీ’లోని ట్రైన్ ఎపిపోడ్స్ సీరియస్‌గా ఉంటాయని తెలుస్తోంది. ట్రైన్లో మంటలు చెలరేగడం, బాధితులకు న్యాయం చేసే ఓ ఎమ్మార్వోగా రవితేజ పోరాటం చేయడం అనే అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 25న విడుదల కానుంది. ఇక రవితేజ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ఇది. వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ట్రైన్లో దొంగతనాలు చేసే నాగేశ్వరరావుగా కొన్ని సీన్స్‌లో రవితేజ కనిపిస్తారట. ఇంకోవైపు ‘వి’ చిత్రం తర్వాత హీరో నాని కాస్త నెగటివ్ రోల్లో కనిపిస్తారని ప్రచారం అవుతోన్న చిత్రం ‘దసరా’. ‘నేను లోకల్’ చిత్రం తర్వాత నాని, కీర్తీ సురేష్ హీరోహీరోయిన్లుగా నటించనున్న ఈ పీరియాడికల్æఫిల్మ్‌కు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ స్టార్టింగ్‌లో పొగతో వచ్చే రైలు బండి కనబడుతుంది. ఇక ఈ సినిమాలో రైలు ఎపిసోడ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా? గోదావరి ఖనిలోని సింగరేణి కోల్‌మైన్స్ సమీపగ్రామంలో ‘దసరా’ స్టోరీ సాగుతుంది. మార్చిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. మరోవైపు కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో ట్రైన్లో నుంచి కల్యాణ్ రామ్ తుపాకీతో ప్రత్యర్థులపై గురి పెట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. దీన్నిబట్టి ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమాను మలుపు తిప్పుతుందని అనుకోవచ్చు. 1945లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ సారథ్యంలోని అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో అనుకోని çఘటనల వల్ల ఓ గూఢచారి జీవితం ఎలా ప్రభావితం అయింది? అనే అంశం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. ఈ సినిమాలే కాక మరికొన్ని తెలుగు చిత్రాల్లో ట్రైన్ సన్నివేశాలు సెట్స్‌లో ట్రాక్‌పై ఉన్నాయి. రైలు జర్నీ బాగుంటుంది. సినిమాలో రైలు ఎపిసోడ్లూ దాదాపు బాగుంటాయి కాబట్టి వెండితెరపై ట్రైన్ జర్నీ కొనసాగాలని కోరుకుందామా! -
అలా రూ.72 కోట్లు సొంతం చేసుకున్న రవితేజ!
మాస్ మహారాజా రవితేజ కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘క్రాక్’ తర్వాత ఏకంగా ఐదు సినిమాలు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఖిలాడి మూవీ ఫిబ్రవరి 11న విడుదల కాబోతుంది. ఈ మూవీతో మాస్ మహారాజా బాలీవుడ్‌కి కూడా పరిచయం కాబోతున్నాడు. ఇక శరత్ మండవ తెరకెక్కిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’సినిమా షూటింగ్ ఎండింగ్ దశకు చేరుకుంది. స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నారు. మరో హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’మూవీ చేయనున్నాడు. రవితేజ 70వ చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నాడు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వీటితో పాటు సెట్‌పైకి వెళ్లిన రవితేజ మరో చిత్రం ‘ధమాకా’.డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. మాస్ కథలకి, పాత్రలకు పెట్టింది పేరైన రవితేజ ఈ చిత్రాల్లోనూ అదే తరహాలో సందడి చేయనున్నట్లు ఇటీవల విడుదలైన పోస్టర్లను బట్టి తెలుస్తోంది. ఈ నాలుగు చిత్రాలు సెట్స్‌పై ఉండగానే.. తన 71వ చిత్రానికి ‘టైగర్ నాగేశ్వరరావు’టైటిల్ ప్రకటించాడు రవితేజ. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’బయోపిక్ ఇది. రవితేజ కెరీర్లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది. విటితో పాటు చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు రవితేజ. ఇలా వరుస సినిమాలతో ఈ ఏడాదంతా ఫుల్ బిజీగా ఉన్న రవితేజ.. దాదాపు రూ. 300 కోట్ల మేర బిజినెస్ చేయబోతున్నాడని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల చొప్పున.. ఆరు సినిమాలకు గాను ఏకంగా రూ. 72 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘క్రాక్’తర్వాత రవితేజ కెరీర్మూడు పూలు ఆరుకాయలు అనేంతలా మారిపోయింది. -
Raviteja 71 : పేరుమోసిన గజదొంగ బయోపిక్‌లో రవితేజ.. టైటిల్ ఇదే
Tiger Nageswara Rao Ravi Teja Movie Update: మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ‘క్రాక్’ తర్వాత ఏకంగా మూడు సినిమాలు ప్రకటించిన రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలతో పాటు రవితేజ మరో సినిమాను లైన్లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ తన 71వ సినిమాను కూడా ప్రకటించాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. రవితేజ కెరీర్లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుంది. ‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది. #TigerNageswaraRao pic.twitter.com/9EFYsS4OWw — Ravi Teja (@RaviTeja_offl) November 3, 2021