రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అయిన ఈ సినిమా ఎక్కువ నిడివి కారణంగా మొదట డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సుమారు 20 నిమిషాల పాటు నిడివి తగ్గించడంతో సినిమాపై ప్రేక్షకులు అభిప్రాయం మారింది. దీంతో తెలుగులో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సరసన నుపూర్‌సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రేణుదేశాయ్, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఈ వీకెండ్‌లో మరోసారి తమ అభిమాన హీరో సినిమాను ఇంట్లో ఉండి మరోసారి చూడొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో అందుబాటలో ఉంది. టైగర్ నాగేశ్వరావు తర్వాత ఈగల్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.
Comments
Please login to add a commentAdd a comment