Amazon India
-
అమెజాన్ రూ.8.3 కోట్లు విరాళం
కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి అమెజాన్ ఒక మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. తన ప్రైమ్ వీడియో సర్వీస్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనుందని కంపెనీ ప్రతినిధి ఇప్పటికే ధ్రువీకరించారు. ఇందుకోసం అమెజాన్ మరో రూ.8.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో బెజోస్ ట్రంప్‌ను కలవబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.ఇప్పటికే మెటా ఛైర్మన్ మార్క్ జూకర్బర్గ్ ఇటీవల ట్రంప్ నివాసంలో కలిసి తన ప్రమాణ స్వీకార నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాబోయే అధ్యక్షుడితో తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రధాన టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తుంది. కాగా, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అమెజాన్‌ను విమర్శించారు. గతంలో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాజకీయ కవరేజీపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో ట్రంప్ మొదటి హయాంలో పెంటగాన్ కాంట్రాక్ట్‌కు సంబంధించి అమెజాన్‌కు విరుద్ధంగా వ్యవహరించారనే వాదనలున్నాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెజోస్ న్యూయార్క్‌లో జరిగిన డీల్ బుక్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న ప్రణాళికలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. 2023 ప్రారంభంలో కంపెనీ తన ఖాతాను పునరుద్ధరించింది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..ఎలాన్‌మస్క్ ఇప్పటికే ట్రంప్‌నకు పూర్తి మద్దతినిచ్చారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్, వివేక్రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే. -
అమెజాన్ బెంగళూరు హెడ్‌క్వార్టర్స్ తరలింపు
ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా బెంగళూరులోని తన కార్పోరేట్ ప్రధాన కార్యాలయాన్ని వేరొక చేటుకు తరలిస్తోంది. చాలా కాలంగా ఉంటున్న బెంగళూరు వాయువ్య ప్రాంతం నుండి నగరంలోని విమానాశ్రయానికి సమీపంలోకి మారుస్తోది. నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో భాగంగా హెడ్‌క్వార్టర్స్ తరలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.అమెజాన్ ఇండియా తన కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్‌ను ప్రస్తుతం మల్లేశ్వరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలోని 30-అంతస్తుల భవనంలో 18 అంతస్తులలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. ఇప్పుడు అమెజాన్ ఖాళీ చేస్తుండటంతో అంత భారీ విస్తీర్ణాన్ని కొత్తగా అద్దెకు తీసుకునే సంస్థ దొరకడం కష్టమే.అమెజాన్ ఇండియా కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ కోసం డబ్ల్యూటీసీలో చదరపు అడుగుకు రూ.250 చొప్పున చెల్లిస్తుండగా కొత్త భవనంలో అద్దె ఇందులో మూడింట ఒక వంతు కంటే తక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఆదా అవుతుందని అంచనా. తరలింపు ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమై 2026 ఏప్రిల్‌లో ముగుస్తుంది.🚨 Amazon India is moving its headquarters from WTC building in Bengaluru near to the city's airport to save costs. pic.twitter.com/WItCV9suYP— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2024 -
ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ ఇకపై పూర్తిగా ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి, 2025 నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సీఈఓ మాట్ గార్మాన్ స్పష్టం చేశారు. కంపెనీ వృద్ధి కోసం విభిన్న ఆలోచనలు పంచుకునేందుకు ఉద్యోగుల వ్యక్తిగత సహకారం అవసరమని తెలిపారు.పదిలో తొమ్మిది మంది ఓకేఈ సందర్భంగా గార్మాన్ మాట్లాడుతూ..‘కంపెనీ వృద్ధికి ఉద్యోగులు సహకరించాలి. ఇప్పటి వరకు చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇకపై ఈ విధానం మారనుంది. 2025, జనవరి నుంచి ఉద్యోగులు పూర్తిగా కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ చర్య సంస్థ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నాం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడని వారు ఇతర సంస్థల్లో చేరవచ్చు. పూర్తి సమయం పని చేసేందుకు ఇష్టపడని ఉద్యోగుల కోసం ఇతర కంపెనీలు వారి అవసరాలకు బాగా సరిపోయే పని వాతావరణాన్ని అందించవచ్చు. చాలా మంది ఉద్యోగులు మార్పుకు మద్దతు ఇస్తున్నారు. నేను మాట్లాడిన పది మంది ఉద్యోగుల్లో తొమ్మిది మంది కంపెనీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు’ అని గార్మాన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు: ఆయనో మేధావి అంటూ..ఉత్పాదకత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవుఇదిలాఉండగా, చాలా మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులు కార్యాలయంలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఆఫీస్‌లో పని చేయడం ద్వారా ఉత్పాదకత మెరుగవుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. కార్యాలయానికి వెళితే అనవసరమైన ప్రయాణ సమయం, ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అమెజాన్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేయాలని కోరింది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయడానికి అనుమతించింది. ఈ విధానాన్ని కాదని అమెజాన్ ఐదు రోజులు ఆఫీస్‌కు రమ్మనడం తగదని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్సీఎస్ పోర్టల్‌లో అమెజాన్ జాబ్స్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగావకాశాల వివరాలు ఇక నుంచి నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌లో దర్శనమీయనున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో అమెజాన్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదైన అభ్యర్థులు అమెజాన్ చేపడుతున్న నియామకాల వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవచ్చు.మోడల్ కెరీర్ సెంటర్స్ వద్ద జాబ్ ఫెయిర్స్ సైతం కంపెనీ నిర్వహించనుంది. ఇందుకు మంత్రిత్వ శాఖ సాయం చేయనుంది. ఇలా ఒప్పందం చేసుకున్న తొలి ఈ–కామర్స్ కంపెనీ తామేనని అమెజాన్ తెలిపింది. ఎస్సీఎస్ పోర్టల్‌లో ప్రస్తుతం 60 లక్షల పైచిలుకు ఉద్యోగార్థులు, 33.5 లక్షల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రతిభను పెంపొందించడంలో అమెజాన్ నిబద్ధత దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తుందని విశ్వసిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మండావియా అన్నారు. -
ఈ–కామర్స్ పండుగ సేల్ 26 నుంచి షురూ..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా సెప్టెంబర్ 26 నుంచి వార్షిక పండుగ సేల్ ప్రారంభించనున్నాయి. 27 నుంచి అందరికీ సేల్ అందుబాటులోకి వస్తుందని, అంతకన్నా 24 గంటల ముందు తమ పెయిడ్ సబ్స్క్రయిబర్స్కు యాక్సెస్ లభిస్తుందని ఇరు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ది బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 పేరిట ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) పేరుతో అమెజాన్ ఇండియా వీటిని నిర్వహించనున్నాయి. 20 నగరాలవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ప్రోడక్టు కేటగిరీల్లో ఉత్పత్తులను అదే రోజున అందించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈసారి విక్రేతలకు 20 శాతం అధికంగా రివార్డులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు, ఏజీఐఎఫ్లో భాగంగా 14 లక్షల మంది పైగా విక్రేతలు, ప్రోడక్టులను విక్రయించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
దేశవ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ సమయంలో తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో.. ఈ కామర్స్ సంస్థలు భారీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో మీషో చేరింది. ఇప్పుడు తాగాజా అమెజాన్ అడుగుపెట్టింది.అమెజాన్ ఇండియా 1.1 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇందులో మహిళలు, వికలాంగుల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.దేశంలోని అన్ని ప్రాంతాల కస్టమర్ల అవసరాలను సకాలంలో తీర్చడానికి అమెజాన్ ఈ ఉద్యోగాలను సృష్టించింది. పండుగ సీజన్లో.. భారతదేశం అంతటా 1 లక్షకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న అమెజాన్ చర్య ప్రశంసనీయమైన కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి 'మన్సుఖ్ మాండవియా' పేర్కొన్నారు.ప్రాజెక్ట్ ఆశ్రయ్అమెజాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశ్రయ్ వంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా నగరాల్లో డెలివరీ అసోసియేట్ల కోసం ప్రత్యేక విశ్రాంతి పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. ఇవి ఢిల్లీ NCR, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంఅమెజాన్ సుశ్రుత అనే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా ట్రక్ డ్రైవర్లకు ముందస్తుగా గుర్తించడం, రోగనిర్ధారణ చేయడం, ఎంచుకున్న ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ఆన్సైట్ వైద్య సదుపాయాల వంటి వివిధ సౌకర్యాలను అందజేస్తుంది. -
ఈ ఏడాది చివరి నాటికి రూ.1.08 లక్షల కోట్లు!.. అమెజాన్ డైరెక్టర్
న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ (అమెజాన్ ఇండియా ఎగుమతుల కార్యక్రమం) ఎగుమతులు ఈ ఏడాది చివరికి మొత్తంగా 13 బిలియన్ డాలర్లకు (రూ.1.08 లక్షల కోట్లు) చేరుకుంటాయని సంస్థ డైరెక్టర్ భూపేన్ వకంకర్ తెలిపారు. 2025 నాటికి 20 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునే మార్గంలోనే ఉన్నట్టు చెప్పారు. 2015లో అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి భారత్‌లో తయారైన 40 కోట్లకుపైగా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అందించినట్టు వకంకర్ తెలిపారు. 2015 నుంచి 2023 మధ్య అమెజాన్ 8 బిలియన్ డాలర్ల ఎగుమతులే నమోదు చేయగా, కేవలం ఏడాది వ్యవధిలోనే (2023–24) 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వివరించారు. గడిచిన 12 నెలల్లో 50వేల కొత్త విక్రేతలను ఇందులో చేర్చుకున్నట్టు తెలిపారు. దీంతో మొత్తం విక్రేతల సంఖ్య 1.5 లక్షలకు చేరుకున్నట్టు వెల్లడించారు. దేశీ విక్రేతలు అంతర్జాతీయ బ్రాండ్ల సృష్టికి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ వీలు కల్పిస్తోంది. సౌందర్య ఉత్పత్తుల ఎగుమతులు 2023లో 40 శాతం వృద్ధిని చూడగా, వస్త్రాలు, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యధిక వృద్ధితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యూఎస్, యూకే, కెనడా, జర్మనీ భారత విక్రేతలకు ప్రధాన ఎగుమతి మార్కెట్లుగా ఉన్నట్టు అమెజాన్ విడుదల చేసిన ‘ది ఎక్స్‌పోర్ట్స్ డైజెస్ట్ 2024’ నివేదిక వెల్లడించింది. -
ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్లకు డెలివరీ
ఏదైనా వస్తువులను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్ చేస్తే రెండు.. మూడు రోజులు లేదా వారం రోజులలోపు ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఓ వ్యక్తికి ఏకంగా రెండేళ్ల తరువాత ఆర్డర్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.జయ్ అనే యూజర్ 2022 అక్టోబర్ 1న అమెజాన్ వెబ్సైట్లో ప్రెజర్ కుక్కర్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసాడు. దానికి డబ్బు కూడా రీఫండ్ అయిపోయింది. అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్ల తరువాత డెలివరీ అయింది. ఇది చూసిన యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రెండు సంవత్సరాల తరువాత డెలివరీ చేసినందుకు థాంక్యూ అమెజాన్ అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు నాకు కూడా క్యాన్సిల్ చేసిన తరువాత డెలివరీ వచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు. మరొకరు ఇది ప్రెస్టీజియస్ కుక్కర్ అని అన్నారు.Thank you Amazon for delivering my order after 2 years. The cook is elated after the prolonged wait, must be a very special pressure cooker! 🙏 pic.twitter.com/TA8fszlvKK— Jay (@thetrickytrade) August 29, 2024 -
రోజుకు అరగంట రెస్ట్.. అమెజాన్ ఏర్పాట్లు!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డెలివరీ పార్ట్నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. తాగు నీరు, ఫోన్ చార్జింగ్ స్టేషన్స్, వాష్‌రూమ్స్, విశ్రాంతి ప్రదేశం ఈ కేంద్రాల్లో ఉంటాయని వివరించింది.ఉద్యాస ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, ముంబైలో ముందుగా ఇవి రానున్నాయి. తాము కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 1,800 డెలివరీ స్టేషన్స్ ఉన్నాయని చెప్పారు.ఇతర కంపెనీలకు చెందిన డెలివరీ ప్రతినిధులు సైతం ఈ కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకేసారి 15 మంది వరకు విశ్రాంతి పొందవచ్చు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో డెలివరీ ప్రతినిధి రోజులో 30 నిముషాలు మాత్రమే ఇక్కడ గడపవచ్చు. ప్రాజెక్ట్ ఆశ్రయ్‌లో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో సైతం విశ్రాంతి కేంద్రాలను నెలకొల్పాలని అమెజాన్ భావిస్తోంది. -
టార్గెట్ ఫినిష్ చేస్తేనే వాష్‌రూమ్, వాటర్ బ్రేక్.. ప్రతిజ్ఞ చేయించారు
హర్యానాలోని మనేసర్‌లో ఉన్న అమెజాన్ ఇండియా ఐదు గిడ్డంగులలో వారానికి ఐదు రోజులు, రోజుకు 10 గంటలు పని చేసి నెలకు రూ.10088 సంపాదిస్తున్నట్లు ఓ యువకుడు వెల్లడించారు. షిఫ్ట్ సమయంలో సమయం వృధా చేయకూడదని, సీనియర్లు వాష్‌రూమ్‌లను కూడా చెక్ చేస్తుంటారని పేర్కొన్నారు.లంచ్ లేదా టీ బ్రేక్ సమయంలో కూడా కనీసం 30 నిముషాలు విరామం లేకుండా పనిచేయాలని. రోజుకు నాలుగు ట్రక్కులకంటే ఎక్కువ దించలేము. అయినా పనిని మరింత పెంచాలని సీనియర్లు ఒత్తిడి తీసుకువస్తుంటారు. అనుకున్న టార్గెట్ (పని) పూర్తి చేసేవరకు నీరు తాగడానికి లేదా వాష్‌రూమ్ వంటి వాటికి కూడా వెళ్ళమని మా చేత ప్రతిజ్ఞ చేయించారని చెప్పారు.పనిచేసే మహిళలు అనారోగ్యంతో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ప్రత్యేకమైన రూమ్ లేదని, ఒకవేలా వాష్‌రూమ్ లేదా లాకర్ రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. ప్రతి రోజు తొమ్మిది గంటలు నిలబడే ఉండాలి. పనిచేసే కార్మికులకు కనీస సదుపాయాలు లేవని వాపోయారు.దీనిపైన అమెజాన్ ఇండియా అధికారులు స్పందిస్తూ.. ఈ రకమైన రూల్స్ ఎప్పుడూ పెట్టలేదని, ఒకవేలా మాకు తెలియకుండా ఇలాంటివి జరుగుతున్నాయా అని ఆరాతీస్తామని చెప్పారు. కార్మికులు చెప్పింది నిజమైతే అలాంటి రూల్స్ పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. మా సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. -
రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్..
అమెజాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ 1.2 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించారు. వీటి విలువ దాదాపు 2.04 బిలియన్ డాలర్లు(సుమారు రూ.17వేలకోట్లు)గా అంచనా వేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. ఈ మేరకు 7, 8 తేదీల్లోనే 1.19 కోట్ల షేర్లను బెజోస్ విక్రయించారు. 10 లక్షల నుంచి 32 లక్షల షేర్ల బ్లాకులుగా వీటిని అమ్మినట్లు తెలిసింది. ఇంతటితో బెజోస్ షేర్ల అమ్మకాలు అయిపోయినట్లు కాదని సమాచారం. మొత్తంగా 8.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.70,000 కోట్ల)కు పైగా విలువైన 5 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించాలన్నది బెజోస్ ప్రతిపాదనగా తెలిసింది. 2021లో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత షేర్లను అమ్మడం ఇదే తొలిసారి. 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు గత ఏడాది నవంబర్లోనే వెల్లడించారు. తాజా 1.2 కోట్ల షేర్లను బుధ, గురువారాల్లో విక్రయించినట్లు బెజోస్ వెల్లడించారు. 169.71 - 171.02 డాలర్ల మధ్య వివిధ ధరల వద్ద వీటిని అమ్మినట్లు తెలిపారు. శుక్రవారం అమెజాన్ షేరు 174.45 దగ్గర స్థిరపడింది. గత 12 నెలల్లో దీని విలువ 78 శాతం పుంజుకుంది. 2023 ఫిబ్రవరి నాటికి బెజోస్‌కు కంపెనీలో 12.3 శాతం వాటా ఉంది. ప్రణాళికలో భాగంగా ఐదు కోట్ల స్టాక్స్‌ను విక్రయించినా.. ఇంకా ఆయన 11.8 శాతం వాటా కలిగి ఉంటారని అంచనా. తన నివాసాన్ని సియాటెల్ నుంచి మియామీకి మారుస్తున్నట్లు గత నవంబర్‌లో బెజోస్ వెల్లడించారు. షేర్లు, బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు 2,50,000 డాలర్లు దాటితే సియాటెల్‌లో ఏడు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా మియామీకి మారడం వల్ల ఐదు కోట్ల షేర్ల విక్రయంపై ఆయనకు 600 మిలియన్ డాలర్ల పన్ను ఆదా అవుతుందని అంచనా. పర్యావరణ సమస్యలపై పోరాటానికి 2020లో 10 బిలియన్ డాలర్లతో ‘బెజోస్ ఎర్త్ ఫండ్’ను ఆయన ప్రారంభించారు. ఇళ్లులేని కుటుంబాలు, ప్రాథమిక పాఠశాలల కోసం 2018లో రెండు బిలియన్ డాలర్ల ‘బెజోస్ డే వన్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా జెఫ్ బెజోస్ మాజీ భార్య మకెంజీ స్కాట్ సైతం గతేడాది అమెజాన్‌లో తన 25శాతం షేర్లను (6.53 కోట్ల షేర్లు) విక్రయించారు. అమెజాన్‌లో ఆమె వాటా 1.9 శాతానికి తగ్గింది. జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ 25 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం 2019లో విడాకులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఉద్యోగుల నిర్ణయం ఆ సమయంలో మెకెంజీ స్కాట్‌కి అమెజాన్‌లో 4శాతం వాటా దక్కగా.. దాని విలువ 36 బిలియన్ డాలర్లు(రూ.2.9లక్షల కోట్లు). దాంతో ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో చేరారు. అయితే, 2019 సంవత్సరంలో ఆమె తన సంపదలో సగభాగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. -
20వేల ఉత్పత్తులతో అమెజాన్ స్వచ్ఛతా స్టోర్.. ఎక్కడో తెలుసా..
దిల్లీలో అమెజాన్ స్వచ్ఛతా స్టోర్‌ను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. అవసరమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయడంతోపాటు వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తూ వారికి అవగాహన కల్పించడమే ఈ స్టోర్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ స్వచ్ఛత స్టోర్‌లో వాక్యూమ్ క్లీనర్లు, శానిటరీ వేర్, వాటర్ ప్యూరిఫైయర్లు, మాప్లు, చీపుర్లతో సహా దాదాపు 20,000 క్లీనింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఇదీ చదవండి: ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్.. ఇంకెన్నో ప్రత్యేకతలు అమెజాన్ ఇండియా కన్జూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ.. ‘క్లీన్ ఇండియా’ అనే ప్రభుత్వ విజన్‌కు మద్దతివ్వడంపట్ల ఆనందంగా ఉందన్నారు. అమెజాన్ ఎప్పుడూ ‘స్మార్ట్ క్లీనింగ్, అందరికీ పారిశుధ్యం అందించడం, పూర్తి పరిశుభ్రత, పర్యావరణ రక్షణ’కు కట్టుబడి ఉందని తెలిపారు. దేశ పారిశుధ్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. -
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందుకు తగిన సూచనలు చేయాలని కోరారు. అన్ని దేశాలతో సత్సంబంధాలకి తమ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి రేవంత్‌రెడ్డి స్వాగతం పలుకుతూ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాం«దీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరాగాం«దీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ రాష్ట్రంగా ఆవిర్భావం తాము ప్రకటించి అమలు చేస్తోన్న ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చెప్పారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు సీఎంతో అమెజాన్ బృందం భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమైంది. రాష్ట్రంలో అమెజాన్ సంస్థ పెట్టిన పెట్టుబడులు, భవిష్యత్తు వ్యాపార విస్తరణ ప్రణాళికల వంటి అంశాలను ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. -
అమెజాన్ 'ద బ్యూటీ సేల్' - 60 శాతం డిస్కౌంట్స్.. కేవలం మూడు రోజులు మాత్రమే!
ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యూటీ షాపింగ్ మొదలపోతోంది. నవంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ అమెజాన్ బ్యూటీ సేల్ 26 వరకు ఉంటుంది. ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద 50 నుంచి 60 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కే-బ్యూటీ నుంచి బార్బీకోర్ లుక్స్ వరకు ట్రెండింగ్ జెన్ జడ్ ప్రాధాన్యత గల ఉత్పత్తులు, బ్యూటీ బ్రాండ్ల వంటి ఉత్పత్తులు, సౌందర్య పరికరాల నుండి ఎంచుకోవచ్చు. అసలే శీతాకాలం పైగా వివాహాల సీజన్.. కొందరు చర్మ రక్షణ కోసం మరి కొందరు ఫంక్షన్స్‌లో ప్రత్యేకంగా కనిపించడం కోసం అనేక సౌదర్య ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి అమెజాన్ ద బ్యూటీ సేల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కస్టమర్స్ ప్రతి లగ్జరీ బ్యూటీ కొనుగోలుతో మీద మంచి డీల్స్, ఫ్రీ గిఫ్ట్ వంటి వాటిని ఆస్వాదించవచ్చు. బై మోర్, సేవ్ ఆఫర్స్ కింద కావలసిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 8 PM డీల్స్, సబ్‌స్క్రైబ్ అండ్ సేవ్‌తో 10% వరకు ఆదా చేసుకోవచ్చు. కస్టమర్ షాపింగ్, ఉత్పత్తి వినియోగ అనుభవాన్ని మెరుగుపరచడం నుంచి ఉత్పత్తి అనుకూలత వంటి వాటికి కంపెనీ అందిస్తుంది. మేబిలైన్, లోరియల్ ప్రొఫెషనల్, బయోటిక్, కామా ఆయుర్వేద, స్విస్ బ్యూటీ, లాక్మే, రినీ కాస్మెటిక్స్, మైగ్లామ్, కలర్ బార్ కాస్మటిక్స్, పౌలాస్ ఛాయిస్.. ఇంకా ఎన్నో 300 కంటే ఎక్కువ బ్రాండ్స్‌పై ఉత్తేజభరితమైన 8000 కంటే ఎక్కువ డీల్స్ పొందవచ్చు. అమెజాన్ ద బ్యూటీ సేల్ సందర్భంగా.. అమెజాన్ ఇండియా, బ్యూటీ, పర్సనల్ కేర్ & లగ్జరీ బ్యూటీ డైరెక్టర్ 'జెబా ఖాన్' మాట్లాడుతూ.. ఇప్పటికే ది బ్యూటీ సేల్ మొదటి రెండు ఎడిషన్లకు కస్టమర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మూడవ ఎడిషన్ ప్రారంభించడం జరిగింది. చర్మ సంరక్షణ, మేకప్ వంటి లగ్జరీ ఉత్పత్తులతో అందాన్ని మరింత పెంచుకోవడంలో మీ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. అందం మీద ద్రుష్టి పెట్టే ప్రతి ఒకరికి ఇది సరైన చోటు అని వెల్లడించారు. -
Amazon: వందల ఉద్యోగులపై వేటు.. ఇప్పటికే 27వేల మంది ఔట్.. కారణం ఇదేనా
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల కారణంగా ప్రముఖ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దానికితోడు పెరుగుతున్న సాంకేతికతతో మరిన్ని ఉద్యోగాలపై వేటు పడుతోంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ శుక్రవారం ప్రకటించింది. లేఆఫ్స్‌కు సంబంధించి ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపింది. వాణిజ్య ప్రాధాన్యాలు మారుతున్న తరుణంలో జనరేటివ్ ఏఐపై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దాంతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే కచ్చితంగా ఎంతమందికి ఉద్వాసన పలికారో వెల్లడించేందుకు ఆయన నిరాకరించినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. లేఆఫ్స్‌పై అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రౌష్ మాట్లాడుతూ.. ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అలెక్సా వాయిస్ విభాగంలో కొత్త మార్పులు తీసుకురావడానికి ఖర్చు తగ్గింపుతో పాటు, వ్యాపార ప్రాధాన్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: 127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు పంపిన సుబ్రతా రాయ్ కంపెనీలు ప్రస్తుతం ఏఐ టూల్స్‌పై ఆధారపడడం పెరుగుతోంది. ఏఐ ద్వారా తమ ఉత్పాదకత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెజాన్ సైతం కొన్ని నెలలుగా ఏఐని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అలెక్సాలో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమెజాన్ సంస్థ గతేడాది చివర్లో, ఈ ఏడాది మొదట్లో దాదాపు 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అయిన ఈ సినిమా ఎక్కువ నిడివి కారణంగా మొదట డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సుమారు 20 నిమిషాల పాటు నిడివి తగ్గించడంతో సినిమాపై ప్రేక్షకులు అభిప్రాయం మారింది. దీంతో తెలుగులో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సరసన నుపూర్‌సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రేణుదేశాయ్, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ వీకెండ్లో మరోసారి తమ అభిమాన హీరో సినిమాను ఇంట్లో ఉండి మరోసారి చూడొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో అందుబాటలో ఉంది. టైగర్ నాగేశ్వరావు తర్వాత ఈగల్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. -
పండుగ సీజన్లో అమెజాన్ జోష్.. 13 ఏళ్లలో ఇదే బెస్ట్!
కోల్‌కత: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పండుగల సీజన్‌తో జోష్ మీద ఉంది. దేశంలో తన 13 సంవత్సరాల కార్యకలాపాలలో ప్రస్తుత సీజన్ అత్యుత్తమంగా ఉందని కంపెనీ వెల్లడించింది. ప్రతి విభాగంలోనూ ఇదే అత్యుత్తమ సంవత్సరమని అమెజాన్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటింగ్, లార్జ్ అప్లయాన్సెస్ డైరెక్టర్ నిశాంత్ సర్దానా తెలిపారు. ‘కోవిడ్ తర్వాత గ్రామీణ ప్రాంతాలు మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే డిమాండ్‌లో పునరుద్ధరణను సూచించే గ్రామీణ కొనుగోళ్లలో అమెజాన్ ఎలాంటి మందగమనాన్ని చూడలేదు. 80 శాతం ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి, నాల్గవ తరగతి మార్కెట్ల నుంచి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు బలమైన వృద్ధిని కనబరిచాయి. పండుగల సీజన్ కోసం దేశవ్యాప్తంగా 1,00,000 పైచిలుకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు కల్పించాం’ అని వివరించారు. ప్రస్తుత పండుగల సీజన్లో ఈ–కామర్స్ కంపెనీల వ్యాపారం 18–20 శాతం వృద్ధితో రూ.90,000 కోట్లు నమోదు చేయవచ్చని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనా వేస్తోంది. -
‘రహస్య అల్గారిథమ్’ ద్వారా రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్.. ఎలాగంటే..
దిగ్గజ ఆన్లైన్ ఈకార్ట్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ రిటైల్ పరిశ్రమలో లాభాలు పెంచుకోవడానికి రహస్య అల్గారిథమ్‌లు వినియోగించిందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలా రహస్య అల్గారిథమ్‌ల ద్వారా ఏకంగా రూ.100 కోట్లు సంపాదించినట్లు పేర్కొంది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్..అమెజాన్ సంస్థకు సంబంధించిన కొన్ని అంశాలను పేర్కొంటూ సెప్టెంబర్‌లోనే కోర్టులో దావా వేసింది. కానీ గురువారం వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా యూస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిటిషన్‌లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి. అమెజాన్ ఆన్లైన్ సూపర్స్టోర్ల్లో దాదాపు ఒక బిలియన్ వస్తువులు ఉన్నాయి. వినియోగదారుడికి తెలియకుండానే కొన్ని వస్తువుల ధరలు త్వరలో పెరుగనున్నట్లు ముందుగానే అంచనా వేసే అంతర్గత రహస్య అల్గారిథమ్(ప్రాజెక్ట్ నెస్సీ)ను సంస్థ ఉపయోగిస్తుంది. దాంతో సదరు వస్తువులను ఎక్కడ అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందేమోనని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కస్టమర్లలో ఆందోళన సృష్టించి అమెజాన్ అమెరికాలో ఏకంగా రూ.100 కోట్లు సంపాదించింది. కొనుగోలు చేయాలనుకునే వస్తువు ధరను వినియోగదారులు బయటి రిటైలర్లతో పోల్చిచూస్తారు. ఆ వివరాలు నమోదు చేసుకుని తర్వాత అమెజాన్‌లో వాస్తవ ధరను మార్చి సదరు వినియోగదారుడికి విక్రయించినట్లు ఎఫ్‌టీసీ తెలిపింది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్లు, హాలిడే షాపింగ్ సీజన్లో కస్టమర్లు ధరల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో నెస్సీ అల్గారిథమ్‌ను నిలిపివేస్తున్నారని వివరించింది. అమెజాన్ ఏప్రిల్ 2018లో కస్టమర్లు కొనుగోలు చేసిన 80 లక్షలకు పైగా వస్తువుల ధరలను నిర్ణయించడానికి నెస్సీను ఉపయోగించింది. ఈ వస్తువుల ధర ఏకంగా దాదాపు రూ.1600కోట్లు అని ఫిర్యాదులో పేర్కొంది. ఇదీ చదవండి: వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే.. అమెజాన్ ప్రతినిధి టిమ్ డోయల్ మాట్లాడుతూ..ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పిటిషన్లో తెలిపిన సమాచారం అవాస్తవం అన్నారు. నెస్సీ చేస్తున్న ధరల పోలికలు తప్పుగా వస్తుడడంతో చాలా ఏళ్ల క్రితం కంపెనీ ఆ అల్గారిథమ్‌ను వాడడం నిలిపివేసిందన్నారు. కేవలం వినియోగదారులు సదరు ప్రోడక్ట్ ధరను వేరే ఏదైనా ప్లాట్ఫామ్లో పోల్చి చూసారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే నెస్సీని 2010లో పరీక్షించినట్లు చెప్పారు. -
48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్‌ను సందర్శించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్లు, టీవీలు) రంజిత్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్ కనిపించగా, 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, పెద్ద స్క్రీన్ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరీనా (ఏఎక్స్ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్ బాబు వివరించారు. -
శాట్‌కామ్ సేవలకు ఇన్-స్పేస్ అనుమతి కోరిన అమెజాన్
Amazon IN Space: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. స్పేస్ నుంచి వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనుమతి కోరింది. వన్‌వెబ్, జియో శాటిలైట్, ఎలాన్‌మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టార్‌లింక్ వంటి ప్రాజెక్ట్లకోవలోకి అమెజాన్ అడుగులేయనుంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అమెజాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో భాగంగా ఉన్న గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం కూడా దరఖాస్తు చేసుకోనుందని తెలుస్తుంది. అయితే స్టార్‌లింక్ జీఎంపీసీఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే జియో శాటిలైట్, వన్‌వెబ్ ఈ జీఎంపీసీఎస్ లైసెన్స్‌ను పొందాయి. భారతదేశ అంతరిక్ష విధానం 2023 ప్రకారం.. లోఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ ద్వారా శాటిలైట్ కాన్స్టెలేషన్ ఆపరేటర్లకు వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ అందించేలా నిబంధనలు ఉన్నాయి. దాంతో పాటు విదేశీ కంపెనీలు దేశంలో స్పేస్ నుంచి బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేలా వీలు కల్పిస్తున్నారు. అయితే కంపెనీలు ఇన్‌స్పేస్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. శాట్‌కామ్ స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం అమెజాన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో సంప్రదింపులు జరిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి కొత్త సర్వీసును ప్రారంభించనున్నట్లు కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. -
అమెజాన్ శుభవార్త! అలాంటి వారికి ట్రైనింగ్‌తోపాటు జాబ్స్..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా (Amazon) దివ్యాంగులకు (PwDs) శుభవార్త చెప్పింది. వీరికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..) దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి వారిని ప్రధాన శ్రామిక స్రవంతిలోకి తీసుకురావడానికి 2026 వరకు ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ అమలులో ఉంటుందని, ఈ ఐదు రాష్ట్రాల్లోని పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. (Airbus jobs: గుడ్ న్యూస్.. ఎయిర్‌బస్‌లో భారీగా ఉద్యోగాలు) అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ (PXT) డైరెక్టర్ లిజు థామస్ మాట్లాడుతూ.. "అమెజాన్ ఇండియాలో వృద్ధికి అనుకూలమైన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతిఒక్కరూ తమ సామర్థ్యాలను నిరూపించుకునేలా సమాన అవకాశాలను కల్పిస్తున్నాం" అన్నారు. ఈ చొరవ కింద అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లో మూడు సంవత్సరాల వ్యవధిలో దివ్యాంగులకు నైపుణ్యం, జీవనోపాధి కల్పించడంపై అమెజాన్ దృష్టి పెట్టింది. అమెజాన్ ఆపరేషన్స్ నెట్వర్క్ పరిధిలోని ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లలో దివ్యాంగులకు స్టోవింగ్, పికింగ్, ప్యాకింగ్, సార్టింగ్ వంటి ఉద్యోగాలను కల్పించనున్నారు. -
ఈ-కామర్స్‌కు భారత్ ‘అమెజాన్’:ఇక్కడి మార్కెట్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. డిజిటైజేషన్, ఆర్థిక వృద్ధి, మొబైల్, ఇంటర్నెట్ విస్తృతి, యువత కారణంగా ఊపందుకున్న భారత ఈ-కామర్స్ ఆకర్షణీయంగా ఉందని అమెజాన్ ఇండియా కంజ్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ తెలిపారు. ఇక్కడ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి కాలపరిమితి అంశంలో చాలా స్పష్టత ఉందన్నారు. కంపెనీ తన 2025 లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉందని చెప్పారు. అమెజాన్ ఇటీవలే భారత్‌లో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. సంస్థకు ఇక్కడి మార్కెట్లో 10 కోట్ల పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు. ఈ–కామర్స్ విస్తృతి ఇప్పటికీ పరిమితమని, దేశంలో ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరో పదేళ్ల వరకు ఈ-కామర్స్ రంగంలో విస్తరణకు ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. ఉత్తేజకర మార్కెట్‌గా..: ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చాలా ఉత్తేజకర మార్కెట్‌గా భారత్ కొనసాగుతోందని మనీష్ తెలిపారు. కాబట్టి అంతర్జాతీయంగా ఇక్కడి విపణిపై అమెజాన్ దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. ‘భారత మార్కెట్ చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇంతటి వ్యాపార అవకాశాలున్న మార్కెట్లు ఎక్కువగా లేవు. ఈ-కామర్స్ విస్తృతి తక్కువగా ఉండడంతో పోటీ విషయంలో ఎటువంటి ఆందోళన లేదు. విస్తృతి 90 శాతానికి చేరినప్పుడు పోటీ గురించి ఆందోళన చెందాలి. కస్టమర్ అంచనాలను ఎలా అందుకోవాలో తొలి 10 ఏళ్లు మాకు నేర్పించాయి. మార్కెట్ చాలా నూతనంగా ఉంది. మరిన్ని ఆవిష్కరణలు, మరిన్ని కంపెనీలు రంగ ప్రవేశం చేస్తాయి. దీర్ఘకాలంలో మా అమ్మకందారులకు, కస్టమర్లకు ఇది మంచిదని భావిస్తున్నాను’ అని అన్నారు. భారత ఈ-కామర్స్ మార్కెట్ 2022లో 83 బిలియన్ డాలర్లు నమోదైంది. 2026 నాటికి ఇది 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఎఫ్ఐఎస్ 2023 గ్లోబల్ పేమెంట్స్ నివేదిక వెల్లడించింది. -
అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది..ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
Amazon Great Freedom Festival sale 2023 ఆన్లైన్ దిగ్గజం మరోసారి ఫెస్టివల్ సేల్‌ను షురూచేసింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5వ తేదీన ప్రారంభం కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా అద్భుతమైన సేల్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, తదితర పలు విభాగాల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. దీనికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతీ ఆగస్ట్ నెలలో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ప్రకటించే అమెజాన్ ఈ ఏడాది గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ తేదీలను శుక్రవారం ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందే ఈ సేల్ ప్రారంభమవుతుంది అనేది తెలిసిన సంగతే. కొనుగోళ్లపై స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్‌తోపాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్, వీటన్నింటికి తోడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందుబాటులోఉంటాయి. ముఖ్యంగా ఈ సేల్ లో శాంసంగ్ వన్ ప్లస్, రియల్ మి, ఎంఐ తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతానికి మించి డిస్కౌంట్ లభించనుంది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలు కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరల లభ్యం. సోనీ ప్లేస్టేషన్ 5 ఇతర గేమింగ్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు. గేమ్‌లు కూడా గరిష్టంగా 80 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. ల్యాప్‌టాప్‌లు , వైర్లెస్ ఇయర్‌బడ్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. టీజర్ పేజీ ల్యాప్‌టాప్‌లు, ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా యాపిల్, తదితర కంపెనీల టాబ్లెట్లు గరిష్టంగా 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. -
సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట!
మీ వద్ద రూ.2000 నోట్లున్నాయా? వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకో శుభవార్త. రూ.2000 నోట్ల సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. మీరు ఎక్కడి నుంచైనా సరే అమెజాన్ పే క్యాష్‌లో నెలకు రూ.50,000 వరకు రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కస్టమర్లు అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్‌ను ఉపయోగించి ఆన్లైన్లో కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చని తెలిపింది. రూ.2,000 నోట్లను ఎలా డిపాజిట్ చేయాలి? ఈ సందర్భంగా అమెజాన్ పే’లో క్యాష్ ఎలా డిపాజిట్ చేయాలో అమెజాన్ తెలిపింది. ఆర్డర్ పెట్టుకున్న వస్తువు డెలివరీ అయ్యే సమయంలో నగదు చెల్లిస్తుంటాం. ఆ సమయంలో డెలివరీ అసోసియేట్‌కు మన వద్ద ఉన్న రూ.2000 నోట్లను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అసోసియేట్లు మనం ఎంత విలువైన రూ.2,000 నోట్లను ఇచ్చామో.. ఆ మొత్తాన్ని మన బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రూ.2,000 నోటు ఉపసంహరణ మేలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ప్రజలు సెప్టెంబర్ 30లోపు కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అత్యధిక విలువ కలిగిన కరెన్సీని ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఉండవని హామీ ఇచ్చారు. ప్రతికూల అంశాలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆర్బీఐ తక్షణమే పరిష్కరిస్తుందని పునరుద్ఘాటించారు. చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే? -
బంపరాఫర్ : రూ.23వేల ఫోన్ రూ.10వేలకే సొంతం చేసుకోండిలా!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో సరికొత్త సేల్‌తో ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు జరిగే ఈ సేల్‌లో వైడ్ రేజ్ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫోన్లపై 40 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్‌లో ఇటీవలే విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ23పై బంపరాఫర్ ప్రకటించింది. రూ.10వేల కంటే ధరకే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) తగ్గిన 5జీ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6జీబీ ర్యామ్ అండ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర రూ.23,990కే ఉండగా సేల్‌లో 27 శాతం డిస్కౌంట్‌తో రూ.17499కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కలుపుకుంటే రూ.16499కే సొంతం చేసుకోవచ్చు. చదవండి👉 అమెజాన్‌లో ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్! శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఎక్ఛేంజ్ ఆఫర్ పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద రూ.16300 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న ఫోన్ పనితీరు బాగుంటే శాంసంగ్ గెలాక్సీ ఏ23ని ఎక్ఛేంజ్ ఆఫర్, ఇతర బ్యాంక్ ఆఫర్లతో రూ.10వేలకే కొనుగోలు చేసే వెసలు బాటు కల్పించింది అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఏ23లో 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్- వీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 16జీబీ ర్యామ్, ఫోటోగ్రఫీ కోసం అల్ట్రా వైడ్, డెప్త్, మ్యాక్రోలెన్సెస్లతో 50 ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో