మార్కెట్‌లో మరో బడ్జెట్‌ ఫోన్‌, ఫీచర్లు మాత్రం అదుర్స్‌ | Vivo Y20T has been launched in India | Sakshi
Sakshi News home page

Vivo Y20T: మార్కెట్‌లో మరో బడ్జెట్‌ ఫోన్‌, ఫీచర్లు మాత్రం అదుర్స్‌

Published Mon, Oct 11 2021 6:49 PM | Last Updated on Mon, Oct 11 2021 11:39 PM

Vivo Y20T has been launched in India  - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌సేల్‌ ముగియగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ కొనసాగుతుంది.అయితే ఈ సేల్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఆయా టెక్‌ సంస్థలు కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మోడళ్లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. తాజాగా భారత్‌ మార్కెట్‌లో చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో బడ్జెట్‌ ఫోన్‌ను లాంఛ్‌ చేసింది.


వివో వై20టీ ఫీచర్లు
'వివో వై20టీ' సిరీస్‌లో విడుదలైన ఈ ఫోన్‌లో సూపర్‌ ఫీచర్లు ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 6.51 అంగుళాల 720పీ హెచ్‌డీ క్వాలిటీతో పాటు సెక్యూర్‌ కోసం ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 662 చిప్‌ సెట్‌, 6జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌, ర్యామ్‌ను ఎక్స్‌టెండ్‌ చేసుకుందుకు ర్యామ్‌ 2.0 ఫీచర్‌, 1జీబీ వర్చువల్‌ మెమెరీ, గేమ్‌లతో పాటు ఇతర మల్టీ టాస్కింగ్‌ వర్క్‌ పర్పస్‌ కోసం 7జీబీ మెమెరీ అందుబాటులో ఉంది.

ట్రిపుల్‌ రేర్ కెమెరా సెటప్‌, 13ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 2ఎంపీ బొకేహ్  కెమెరా, కెమెరాకు అతి దగ్గరలో (4 సెంటీ మీటర్లు) ఉన్న ఫోటోలు తీసేందుకు సూపర్‌ మ్యాక్రో కెమెరా, Aura స్క్రీన్‌ లైట్‌ అండ్‌ పోట్రేట్‌ మోడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఫీచర్‌ మోడ్‌లో 8ఎంపీ సెల్ఫీ షూటర్‌ సదుపాయం ఉంది.  


వివో వై20 టీ ధర ఎంతంటే 
భారత్‌లో విడుదలైన వివో వై20 టీ ఫోన్‌ ప్యూరిస్ట్ బ్లూ,అబ్సిడియన్ బ్లాక్ కలర్స్‌లో లభ్యమవుతున్న 6జీబీ/ 128 జీబీ ర్యామ్‌ స్టోర్‌ వేరియంట్‌ ధర రూ.15,490 ఉంది. ఈ ఫోన్‌ ను బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌లో 12నెలలు పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సౌకర్యంతో సొంతం చేసుకోవచ్చు. వివో ఈ-స్టోర్‌లో కొనుగోలు దారులకు రూ.500 క్యాష్‌ బ్యాక్‌తో పాటు అమెజాన్‌, పేటీఎం, టాటా క్లిక్‌ స్టోర్‌లలో 6నెలల పాటు నో కాస్ట్‌ ఎక‍్ఛేంజ్‌ ఆఫర్‌ను అందిస్తున్నట్లు వివో అధికారికంగా ప్రకటించింది.

చదవండి: ఈ ల్యాప్‌ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement