స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్‌లో ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నది. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన ఒప్పో ఎఫ్ 21 ప్రో 5జీ ఫోన్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ ఫోన్‌లో 6.4 అంగుళాల హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12-బేస్డ్ కలర్ ఓఎస్ 12 యూఐ వర్షన్‌తో పని చేస్తుంది. క్వాల్క్‌మ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్‌ఓఎస్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్స్‌తో మిడ్ రేంజ్‌లో ఉండనుంది.
ధర ఎంతంటే
పలు నివేదికల ప్రకారం.. ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ ఫోన్ మే 15న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ.25 వేల నుంచి రూ.26వేల మధ్యలో ఉండనుంది. హ్యాండ్‌సెట్ స్టోరేజీ, కలర్ వేరియంట్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ, 580 నిట్‌ల బ్రైట్‌నెస్, 6.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్‌ఓఎస్‌తో వచ్చిన చిప్‌సెట్‌తో రానుంది. ట్రిపుల్ రేర్ కెమెరా, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, రెండు 2 మెగా పిక్సెల్ సెన్సార్లు, 40 ఎక్స్ మైక్రోస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో రికార్డింగ్ కోసం ఫ్రంట్‌లో 32 మెగా పిక్సెల్ సెన్సార్‌తో రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment