smartphone brands
-
రంగులు మార్చే రియల్‌మి ఫోన్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల బ్రాండ్ రియల్‌మి పరిశ్రమలోనే తొలిసారిగా ఉష్ణోగ్రతలను బట్టి రంగు మార్చే కోల్డ్ సెన్సిటివ్ రియల్‌మి 14 ప్రో 5జీ, 14 ప్రో ప్లస్ 5జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఉష్ణోగ్రత 16 డిగ్రీల కన్నా దిగువకు పడిపోతే ఇవి ఒక దాన్నుంచి మరో రంగులోకి, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పూర్వ రంగులోకి మారతాయి. ఆఫర్ కింద 14 ప్రో 5జీ ఫోన్ల ధర రూ. 22,999 నుంచి ప్రారంభమవుతుంది. 14 ప్రో ప్లస్ 5జీ ఫోన్లలో డీఎస్ఎల్ఆర్ స్థాయి సోనీ ఐఎంఎక్స్896 ఓఐఎస్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైనవి ఉంటాయి. వీటి ధర రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫోన్లపై నిర్దిష్ట డిస్కౌంట్లు లభిస్తాయి. 14 ప్రో సిరీస్ 5జీ ఫోన్ల విక్రయం జనవరి 23 నుంచి మొదలవుతుంది. అటు వైర్లెస్ ఇయర్‌బడ్స్ 5 ఏఎన్సీ ఉత్పత్తులను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధర రూ. 1,599గా ఉంటుంది. -
అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు
నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్డేట్ అవుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఫోన్ల వివరాలను కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళనఈ నివేదిక ప్రకారం టాప్ 10 మొబైళ్లు..యాపిల్ ఐఫోన్ 15యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్యాపిల్ ఐఫోన్ 15 ప్రోసామ్సంగ్ గెలాక్సీ ఏ15 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీసామ్సంగ్ గెలాక్సీ ఏ05రెడ్మీ 13సీ 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ35ఐఫోన్ 14సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 -
స్మార్ట్‌ఫోన్స్ జోరు.. టాప్ 10 బ్రాండ్స్ ఇవే..
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ సరఫరా వరుసగా అయిదో త్రైమాసికంలో కూడా పెరిగింది. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో సుమారు 6 శాతం వృద్ధి చెంది 4.6 కోట్లకు చేరింది. 72 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీల హవా కొనసాగింది.16 శాతం షేర్‌తో వివో అగ్రస్థానంలో ఉండగా, టాప్ 10 బ్రాండ్స్‌లో ఐకూ అత్యధిక వృద్ధి సాధించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా, శాంసంగ్ వాటా 12.3 శాతంగా ఉంది. వివో వాటా 13.9 శాతం నుంచి 15.8 శాతానికి పెరిగింది.అందుబాటు ధరలోని వై సిరీస్‌తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన టీ3, వీ40 సిరీస్‌ల దన్నుతో వరుసగా మూడో త్రైమాసికంలో కూడా వివో అగ్రస్థానంలో నిల్చింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఒప్పో 13.9 శాతం, రియల్మీ 11.5 శాతం, షావోమీ 11.4 శాతం, పోకో 5.8 శాతం, మోటరోలా 5.7 శాతం, ఐకూ 4.2 శాతం, వన్‌ప్లస్ 3.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. యాపిల్ అత్యధికంగా 40 లక్షల యూనిట్లు సరఫరా చేసింది. మిగతా విశేషాలు.. » రూ. 50,000 నుంచి రూ. 68,000 వరకు ధర శ్రేణి ఉండే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా 86 శాతం వృద్ధి చెందింది. మొత్తం సరఫరా 2 శాతం నుంచి సుమారు 4 శాతానికి పెరిగింది. ఐఫోన్ 15/13/14, గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 12 ప్రధాన మోడల్స్‌గా నిల్చాయి. ఈ విభాగంలో యాపిల్ వాటా 71 శాతానికి పెరగ్గా శాంసంగ్ వాటా 30 శాతం నుంచి 19 శాతానికి పడిపోయింది.» రూ. 16,000 నుంచి రూ. 35,000 ధర శ్రేణిలోని ఎంట్రీ–ప్రీమియం సెగ్మెంట్ 42 శాతం వృద్ధి సాధించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల సరఫరాలో 28%వాటాను దక్కించుకు ంది. ఒప్పో గణనీయంగా పెరగ్గా శాంసంగ్, వివోల మార్కెట్ వాటా తగ్గింది. ఈ విభాగంలో ఈ మూడింటి వాటా 53 %గా ఉంది. » 5జీ స్మార్ట్ఫోన్ల సరఫరా 57% నుంచి 83%కి పెరిగింది. అదే సమయంలో సగటు విక్రయ ధర (ఏఎస్పీ) 20% తగ్గింది. 5జీ సెగ్మెంట్లో మాస్ బడ్జెట్ విభాగం (రూ. 8,000–రూ. 16,000 వరకు ధర) దాదాపు రెట్టింపై 50 శాతానికి చేరింది. షావోమీ రెడ్మీ 13సీ, యాపిల్ ఐఫోన్ 15, ఒప్పో కే12ఎక్స్, వివో టీ3ఎక్స్.. వై28 మోడల్స్ మూడో త్రైమాసికంలో అత్యధికంగా సరఫరా అయ్యాయి. -
ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్‌తో 265 కిమీ రేంజ్!
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో కేవలం ఆటోమొబైల్ తయారీ సంస్థలు మాత్రమే కాకుండా ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం 'షావోమీ' (Xiaomi) కూడా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. SU7, SU7 ప్రో, SU7 మాక్స్ అనే మూడు వేరియంట్లలో విడుదలకానున్న కొత్త షావోమీ SU7 ఎలక్ట్రిక్ కారు రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) అనే రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభించనుంది. రియర్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్ కలిగిన షావోమీ ఎలక్ట్రిక్ కారు 295 Bhp పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. అయితే ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ 663 Bhp పవర్ అందిస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే రూ.10 కోట్ల కారు కొన్న చెన్నై వాసి - ఫోటోలు వైరల్ షావోమీ ఎలక్ట్రిక్ కారు LFP బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటడం వల్ల మంచి రేంజ్ అందిస్తాయి. బేస్ మోడల్స్ ఒక ఫుల్ చార్జ్‌తో 210 కిమీ/గం, హై ఎండ్ వేరియంట్స్ 265 కిమీ/గం రేంజ్ అందిస్తాయి. బేస్ మోడల్స్ బరువు 1980 కేజీలు కాగా, టాప్ ఎండ్ మోడల్స్ 2205 కేజీల వరకు ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తిని 2023 డిసెంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది. డెలివరీలు 2024 ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ బీజింగ్ ఫ్యాక్టరీలో ట్రయల్ ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్, ఇతర ఫీచర్స్, ధరలు వంటి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న అదిరిపోయే 5 స్మార్ట్ఫోన్లు ఇవే
టెక్నాలజీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సెప్టెంబర్ నెల వచ్చేసింది. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ సైతం ఇదే నెలలో విడుదల కానుంది. ఇందుకోసం యాపిల్ సంస్థ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ కానుందని తెలుస్తోంది. ఆ సిరీస్ ఫోన్లతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, హానర్ 90, షావోమీ 13 టీ ప్రోలు లాంఛ్ చేయనున్నాయి ఆయా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న యాపిల్ షెడ్యూల్ ప్రకారం.. ‘వండర్లస్ట్’ ఫాల్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లు ఉన్నాయి. యూఎస్బీ-సీ పోర్ట్, పవర్ఫుల్ ఏ17 బయోనిక్ చిప్సెట్, లైనప్‌లో వినూత్నమన డైనమిక్ ఐలాండ్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్‌కు పెరిస్కోపిక్ కెమెరా లెన్స్ డిజైన్ వంటి ఈ ప్రీమియం మోడల్‌కి ఉంటాయని అంచనా. హానర్ 90 సిరీస్ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు హానర్ సంస్థ సిద్దమైంది. చైనా తయారీ సంస్థ హానర్ 2020లో భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేసింది. అయితే ఈ తరుణంలో హానర్ టెక్ పేరిట పున ప్రారంభం కానుంది. హానర్ 90 సిరీస్‌ను లాంచ్ చేసి భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తాము సైతం పోటీలో ఉన్నామని చెప్పనుంది. హానర్ కొత్త సిరీస్ విడుదలపై అమెజాన్ ప్రచారం ప్రారంభించింది. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా భావిస్తున్నారు. హైఎండ్ ప్రీమియం స్మార్ట్ఫోన్లకి పెద్ద మొత్తంలో ఖర్చ చేయకూడదనుకునే వారికి ఈ ఫోన్ మంచిదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ విడుదల తేదీ అధికారంగా తెలియాల్సి ఉంది. షావోమీ 13టీ ప్రో ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 1న లాంచ్ అవుతుందని గతంలో పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతుంది. షోవోమీ 13టీ ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్ సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 120 వాల్ట్‌ల ఛార్జింగ్ సపోర్ట్, 144హెచ్డీ అమోలెడ్ డిస్ప్లేతో రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సుదీర్ఘ కాలం తర్వాత శాంసగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లోని బడ్జెట్ ఫోన్ త్వరలో విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ పేరుతో మార్కెట్‌కు పరిచయం కానుంది. ఈ ఫోన్లో 50 ఎంపీ కెమెరా,ఎక్స్నాయిస్ 2200 లేదంటే స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్, 120 హెచ్‌జెడ్ స్మూత్ డిస్ప్లేతో పాటు యూజర్లు ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి. వన్ ప్లస్ ఓపెన్ వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ల ప్రపంచంలోకి వన్‌ప్లస్ ఓపెన్ అడుగుపెట్టనుంది. లాంచ్ తేదీ వెల్లడించనప్పటికీ ఇది 7.8-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 6.3-అంగుళాల కవర్ డిస్ప్లే ఉండొచ్చనే అంచనాలు నెకొన్నాయి. అంతేకాదు ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండనుంది. -
విడుదల కానున్న ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ.. ఫోన్ ధర ఎంతంటే?
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లో ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నది. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన ఒప్పో ఎఫ్ 21 ప్రో 5జీ ఫోన్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్లో 6.4 అంగుళాల హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12-బేస్డ్ కలర్ ఓఎస్ 12 యూఐ వర్షన్‌తో పని చేస్తుంది. క్వాల్క్మ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్ఓఎస్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్స్‌తో మిడ్ రేంజ్లో ఉండనుంది. ధర ఎంతంటే పలు నివేదికల ప్రకారం.. ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ ఫోన్ మే 15న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ.25 వేల నుంచి రూ.26వేల మధ్యలో ఉండనుంది. హ్యాండ్సెట్ స్టోరేజీ, కలర్ వేరియంట్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ, 580 నిట్ల బ్రైట్నెస్, 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్‌ఓఎస్‌తో వచ్చిన చిప్సెట్తో రానుంది. ట్రిపుల్ రేర్ కెమెరా, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, రెండు 2 మెగా పిక్సెల్ సెన్సార్లు, 40 ఎక్స్ మైక్రోస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో రికార్డింగ్ కోసం ఫ్రంట్‌లో 32 మెగా పిక్సెల్ సెన్సార్‌తో రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ‘వావ్’ కొత్త ఫోన్ అదిరింది.. ధర ఎంతంటే? -
‘వావ్’ కొత్త ఫోన్ అదిరింది.. ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షోవోమీ ‘షావోమీ13 ఆల్ట్రా’ ఫోన్‌ను లాంఛ్ చేసింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2ఎస్వోసీ చిప్ సెట్, 12 బిట్ డిస్ప్లే, ఎల్టీపీవో సపోర్ట్, 90 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. షావోమీ13 ఆల్ట్రా ఫీచర్లు షావోమీ13 ఆల్ట్రా 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, Dolby Visionతో హెచ్డీఆర్ 10 ప్లస్ రెజెల్యూషన్, పీ3 కలర్ గమ్ముట్,1920 హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎం డిమ్నింగ్, 2600నిట్స్ పీక్ బ్రైట్ నెస్, హెడ్సెట్ కర్వడ్ ఎడ్జ్, ఫోన్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ప్రీమియం లెథర్ ఫినిష్ సౌకర్యం ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్, 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, సెల్ఫీ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 2 చిప్ సెట్, 16జీబీ 16జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ రామ్ అండ్ 1టిగా బైట్ ఆఫ్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ. వీటితో పాటు వెనక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ . 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ హైపర్-ఓఐఎస్, 8పీ లెన్స్ ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, వారియబుల్ అపెర్చర్ (ఎఫ్/1.9 టూ ఎఫ్/4.0 అండ్ ఎల్ఈడీ ఫ్లాష్. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 858 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఐఓఎస్‌తో 50 ఎంపీ సూపర్ టెలిఫొటో సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్లు ఉన్నాయి. షావోమీ13 ఆల్ట్రా ఫోన్ ధరలు షావోమీ13 ఆల్ట్రా బేస్ వేరియంట్ 12 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.71,600.16జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.77,600.16 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ వర్షన్ ఫోన్ ధర సుమారు రూ.87,200.గా ఉంది. చదవండి👉 షాకిచ్చిన మెటా.. ఊహించినట్టే భారీగా ఊడుతున్న ఉద్యోగాలు! -
ఆ ఐఫోన్‌ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ప్లస్‌పై పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. డిమాండ్ లేకపోవడంతో ఫోన్ల తయారీని నిలిపివేయాలని మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థలకు యాపిల్ ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14సిరీస్‌లోని ప్లస్‌తో పాటు గతంలో కొనుగోలు దారుల్ని అంతగా ఆకట్టుకోని ఫోన్లను సైతం ఇలాగే నిలిపి వేసింది. సెప్టెంబర్ 16న అమెరికా క్యాలిఫోర్నియా యాపిల్ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో వేదికగా యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ను విడుదల చేసింది. గత నెలలో ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభించింది. అయితే ఈ సేల్‌లో 6.7 అంగుళాల డిస్ప్లే, సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ రోజులు ఫోన్‌ను వినియోగించే సామర్ధ్యం ఉన్న ఈ ఫోన్ అమ్మకాలు ఊహించని విధంగా జరుగుతాయని యాపిల్ అంచనా వేసింది. వాస్తవానికి నిపుణులు సైతం పెద్ద డిస్ప్లే ఫోన్లకు డిమాండ్, తక్కువ ధర ($899) దానికి తోడు హాలిడేస్ రావడంతో ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ జరుగుతాయని అనుకున్నారు. కానీ యాపిల్, నిపుణుల అంచనాలు తారుమారయ్యాయి. పెద్ద స్క్రీన్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇంటస్ట్ర్ చూపించలేదు. దీంతో యాపిల్ తన ఐఫోన్ 14ప్లస్ ప్రొడక్షన్‌ను తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. యాపిల్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో 900 లక్షల యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను తయారీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఊహించిన దానికంటే 30 లక్షల ఫోన్ల తయారీని తగ్గించాలని భావిస్తోంది. యాపిల్ సంస్థ, ఐఫోన్లను సప్లయి చేసే సంస్థలు ఇప్పుడు 870 లక్షల యూనిట్లు లేదా అంతకంటే తక్కువగా తయారు చేయాలని భావిస్తున్నారు.సేల్స్ లేకపోవడంతో ఐఫోన్ 14లోని ఐఫోన్ 14, 14 ప్లస్ మోడళ్ల ప్రొడక్షన్‌ను తగ్గించనుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. డిమాండ్ లేకపోవడంతో సేల్స్ తగ్గినప్పటికీ యాపిల్ గతంలోనే ఈ లేటెస్ట్ వెర్షన్ ఫోన్ల తయారీని భారీగా తగ్గించింది. గతంలో ఐఫోన్8, ఐఫోన్ 12 మినీ మోడల్ ఫోన్లు ఆకట్టుకోకపోవడంతో తయారీని తగ్గించేసింది. చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: కస్టమర్లకు మరో గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్కు సంబంధించి కొత్త డేట్స్‌ను ప్రకటించింది. తొలి దశ ఆఫర్లు అక్టోబర్ 16తో ముగియడంతో వినియోగ దారుల కోసం తాజా తేదీలను వెల్లడించింది. తద్వారా తన కస్టమర్లలో దివాలీ జోష్ నింపింది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 19న తిరిగి ప్రారంభమై అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. తాజా సెకండ్ సేల్‌లో కూడా వివిధ స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తదితరాలపై భారీ డీల్స్ అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ అక్టోబర్ 18 అర్ధరాత్రి సేల్ అందుబాటులో ఉంటుంది. అలాగే స్మార్ట్ఫోన్లపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతోపాటు, ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఇంకా పేటీఎం వాలెట్, యూపీఐ లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్, రియల్మీ, పోకో, ఒప్పో, వివో, షావోమీ, మోటరోలా, గూగుల్, ఇన్ఫినిక్స్, మైక్రోమ్యాక్స్, లావా వంటిపై తగ్గింపు లభ్యం. ఇంకా గేమింగ్ ల్యాప్‌టాప్‌లు , పెన్ డ్రైవ్‌లు మరియు హార్డ్ డ్రైవ్‌లు వంటి డేటా స్టోరేజ్ పరికరాలపై కూడా తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కవర్లు, కేసులు, స్క్రీన్ గార్డ్లు వంటి ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 4K అల్ట్రా HD స్మార్ట్‌టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు సహా,టీవీలు, ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. -
'డబ్బులు ఎవరికీ ఊరికే రావు', 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే!
దేశంలో 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు టెలికాం కంపెనీలు పోటీపడుతున్నాయి. తొలుత నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరుణంలో చాలా మందికి వచ్చే సందేహం..ఏ ఫోన్ కొనాలి? అని. ఏ ఫోన్‌కి 5జీ నెట్ వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది అని. ఇప్పుడా అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఏ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందో తెలుసుకుందాం. 5జీకి సపోర్ట్ ఇవ్వాలంటే ఫోన్లో అందుకు సపోర్ట్ చేసే ప్రాసెసర్ ఉండాలి. అయితే దేశీయంగా 5జీ విప్లవం జోరందుకోవడంతో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తాము తయారు చేసిన ఫోన్లలో 5జీ సపోర్ట్ చేసేలా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయంటూ కొనుగోలు దారుల్ని నమ్మబలికిస్తుంటాయి. డబ్బులెవరికీ ఊరికే రావు. అలాంటి ప్రకటనల పట్ల కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 5జీ ప్రాసెసర్ మీరు కొనాలనుకున్న, లేదంటే ఇప్పటికే కొన్న ఫోన్లకు 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదా? అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే యూజర్లు వారి ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత అబౌట్ ఫోన్ ఆనే ఆప్షన్ పై ట్యాప్ చేసి ప్రాసెసర్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 865, స్నాప్‌డ్రాగన్ 865+, స్నాప్‌డ్రాగన్ 870, స్నాప్‌డ్రాగన్ 888, స్నాప్‌డ్రాగన్ 888+, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1, స్నాప్‌డ్రాగన్ 8+ జనరల్ 1, స్నాప్‌డ్రాగన్ 695, స్నాప్‌డ్రాగన్ 765/765జీ, స్నాప్‌డ్రాగన్ 750/750/జీ, స్నాప్‌డ్రాగన్ 768/768/జీ, స్నాప్‌డ్రాగన్ 778/778జీ/ 778ప్లస్ మీడియా టెక్ ప్రాసెసర్ : మీడియా టెక్ డైమన్సిటీ 700 నుండి డైమన్సిటీ 9000 ప్రాసెసర్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇవి కాకుండా మీడియా టెక్ హీలియా సిరీస్‌తో పాటు ఇతర సిరీస్ ప్రాసెసర్లు 5జీకి సపోర్ట్ చేయవు. శాంసంగ్ ప్రాసెసర్ : ఎక్సినోస్ 9820, ఎక్సినోస్ 9825,ఎక్సినోస్ 990,ఎక్సినోస్2100, ఎక్సినోస్ 2200లు 5జీకి సపోర్ట్ చేస్తాయి. 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ ఇచ్చే ఫోన్లు ఇవే యాపిల్ – ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ 2022 శాంసంగ్ – శాంసంగ్ ఎస్-సిరీస్ (ఎస్20 అంతకంటే ఎక్కువ), గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ 5జీ, గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ, ఏ-సిరీస్, ఎం-సిరీస్ మోడల్‌లు సపోర్ట్ చేస్తాయి. వన్ ప్లస్ - వన్ ప్లస్ 8 సిరీస్, వన్ ప్లస్ 9 సిరీస్, వన్ ప్లస్ 10సిరీస్, వన్ ప్లస్ నార్డ్ సిరీస్ షావోమీ- షావోమీ 12 సిరీస్,షావోమీ 11 సిరీస్, షావోమీ10సిరీస్, షావోమీ నోట్ 11 ప్రో ప్లస్, రెడ్ మీ నోట్ 11టీ, రెడ్మీ నోట్ 10 టీ పోకో- పోకో ఎఫ్4 5జీ, పోకో ఎం4 5జీ, పోకో ఎం4 ప్రో 5జీ ఒప్పో - రెనో 8 సిరీస్, రెనో 7 సిరీస్, రెనో 6 సిరీస్, ఒప్పో ఏ-సిరీస్, కె-సిరీస్, ఎఫ్-సిరీస్ ఫోన్లు వివో - వీ21, వీ21ఈ, వీ 23 సిరీస్, టీ1 సిరీస్,ఎక్స్ 60-సిరీస్, ఎక్స్ 70-సిరీస్, ఎక్స్ 80-సిరీస్ ఐక్యూ- ఐక్యూ009 సిరీస్,ఐక్యూ7 సిరీస్, ఐక్యూ జెడ్ 5, ఐక్యూ జెడ్ 6, ఐక్యూ జెడ్ 6 ప్రో రియల్ మీ - రియల్ మీ జీటీ సిరీస్, రియల్ మీ జీటీ 2 సిరీస్, రియల్ మీ ఎక్స్ 7, రియల్ మీ ఎక్స్ 7 మ్యాక్స్, రియల్ మీ ఎక్స్ 7 ప్రో, రియల్ మీ నార్జ్ 50 5జీ, రియల్ మీ నార్జో 30 5జీ, రియల్ మీ 8/8ఎస్/8 ప్రో 5G, రియల్ మీ 9/ 9 ప్రో 5జీ ఫోన్లు మాత్రమే 5జీ నెట్ వర్క్‌కి సపోర్ట్ చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి👉: What is 5G?: 5జీ అంటే ఏమిటి? ఈ నెట్ వర్క్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు -
సంచలనం..భారత్‌కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే భారత్‌కు గుడ్ బై చెప్పింది. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలపై కేంద్రం కఠిన వైఖరిని ప్రదర్శిస్తుంది. ఈ తరుణంలో హువావే సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ కార్యకాలాపాల్ని భారత్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..మా కంపెనీ అన్నీ నిబంధనలకు లోబడే స్థానిక భాగస్వాములతో కలిసి భారత్‌లో కార్యకాలాపాల్ని నిర్వహిస్తుంది. కానీ స్పష్టమైన కారణాల్ని హైలెట్ చేస్తూ భారత్‌లో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు హానర్ సీఈఓ ఝావో మింగ్ తెలిపారు. కానీ ఆ స్పష్టమైన కారణలు ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈడీ దెబ్బ.. హువావే అబ్బా ఇటీవల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో, ఒప్పో, షావోమీలపై దాడులు, దర్యాప్తులు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో హువావే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అమెరికాలో సైతం 2018లో హానర్ భారత్‌లో ౩ శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అదే సమయంలో హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తరువాత అక్కడ సైతం మార్కెట్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ అమెరికాలో వ్యాపారాన్ని నిర్వహించేందుకు కష్టంగా మారింది. అందుకే హువావే గతేడాది నవంబర్‌లో తన హానర్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన ఆస్తుల్ని చైనాకు చెందిన షెన్జెన్ జిక్సిన్ న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అమ్మేసింది. -
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త. జులై 23 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ►అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లైన 5జీ ఐక్యూఓఓ జెడ్6, 5జీ ఐక్యూఓఓ నియో6, ఐక్యూఓఓ జెడ్6 ప్రోలపై రూ.10వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ఫోన్ ధర రూ.14,999 ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై అదనంగా కూపన్ బెన్ఫిట్స్, ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు పలు స్మార్ట్ ఫోన్ మోడళ్లపై ఎక్ఛేంజ్ ఆఫర్లను దక్కించుకోవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ఫోన్ 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీ స్టోరేజ్ ఫోన్‌ను 19శాతం డిస్కౌంట్‌తో రూ.16,999కే పొందవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ప్రో లెజియన్ స్కై 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ పై 14శాతం డిస్కౌంట్‌తో ధర రూ.23999కే కొనుగోలు చేయోచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌పై రూ.3వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ►అదే విధంగా ఐక్యూఓఓ నియో6..6జీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌పై 14శాతం డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5వేల డిస్కౌంట్‌తో రూ.29,900కే పొందవచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్‌పై రూ.3000 డిస్కౌంట్, రూ.11,950 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఐక్యూఓఓతో పాటు ఇంకా ఐక్యూఓఓతో పాటు అదనంగా రెడ్మీ 9సిరీస్, రెడ్మీ నోట్ 10 సిరీస్‌లోని రెడ్మీ నోట్ 10టీ, నోట్ 10ప్రో, రెడ్మీ నోట్ 10ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్మీ నోట్ 10ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, శాంసంగ గెలాక్సీ ఎం52లపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. -
అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ (1).. ధర ఎంతంటే!
ఎట్టకేలకు నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్ ఎలా ఉంది. ఫోన్ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో శాంసంగ్, షావోమీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన నథింగ్ ఫోన్ (1) ధర రూ.32,999గా ఉంది. వన్ ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ నథింగ్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ ఫోన్ వన్ ప్లస్‌కు చెందిన 'వన్ ప్లస్ నార్డ్ 2టీ' కంటే నథింగ్ ఫోన్ (1) ఫోన్ బాగుంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) ఫోన్ 6.55 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15డబ్ల్యూ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్, హెచ్డీఆర్10 ప్లస్ సపోర్ట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్ జెడ్ టచ్ శాంప్లింగ్ సదుపాయం ఉంది. దీంతో పాటు ఈ ఫోన్లో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 12జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ (ఓఐఎస్ ప్లస్ ఈఐఎస్),50 ఎంపీ శాంసంగ్ జేఎన్1 ఆల్ట్రా వైడ్ సెన్సార్(ఈఐఎస్)16 ఎంపీ సోని ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వన్ ప్లస్ నార్డ్2 టీ వర్సెస్ నథింగ్ ఫోన్ (1) ధరలు మనదేశంలో నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ నార్డ్2 మధ్య వ్యత్యాసం ఎలా ఉందో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ ..128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 32,999, 8జీబీ ర్యామ్..256జీబీ ఫోన్ ధర రూ. 35,999, 12జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.38,999గా ఉంది. ఇక వన్ ప్లస్ నార్డ్2 టీలో కేవలం రెండు వేరియంట్ స్టోరేజ్ సదుపాయం ఉంది. 8జీబీ ర్యామ్ 128జీబీ (రూ. 28,999), 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఈ వేరియంట్ స్టోరేజ్ ఫోన్ ధర (రూ. 33,999).గా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విదేశీ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు బిగ్ షాక్, తగ్గిన మొబైల్ దిగుమతులు!
ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ద్వారా మొబైల్స్ తయారీకి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఫలితమిస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2021–22లో మొబైల్ ఫోన్ల దిగుమతులు 33 శాతం తగ్గాయి. అదే సమయంలో స్థానిక ఉత్పత్తి 26 శాతం పెరిగింది. ఈ వివరాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. 2016 నుంచి 2021 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ వార్షికంగా 33 శాతం మేర వృద్ధిని చూపించగా..2021–22లో ఇది 24–26 శాతమే ఉన్నట్టు వివరించింది. చిప్‌లకు కొరత ఏర్పడినప్పటికీ మూడు అంతర్జాతీయ తయారీ కంపెనీలు పీఎల్ఐ పథకం కింద లక్ష్యానికి అనుగుణంగా ఫోన్లను ఉత్పత్తి చేసినట్టు తెలిపింది. దానివల్లే మెరుగైన వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగుతుందని.. 2022– 2024 మధ్య ఏటా 22–26 శాతం మేర స్థానిక మొబైల్ ఫోన్ల తయారీ నమోదు కావచ్చని అంచనా వేసింది. విలువ పరంగా రూ.4–4.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. విడిభాగాల దిగుమతి దేశీ తయారీ విస్తరించడంతో మొబైల్ ఫోన్లు/విడిభాగాల కోసం చైనా మార్కెట్‌పై ఆధారపడడం 2020–21లో 64 శాతంగా ఉంటే, అది గత ఆర్థిక సంవత్సరంలో 60 శాతానికి తగ్గినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. మధ్య కాలానికి ఇది ఇంకా తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. దేశీయంగా ఫోన్ల తయారీ పెరగడం వల్ల విడిభాగాల దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో 27 శాతం పెరిగాయని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో దిగువన అంతర్జాతీయ మార్కెట్‌కు ఫోన్ల సరఫరాలో భారత్ ఒక శాతంలోపే వాటా కలిగి ఉన్నట్టు క్రిసిల్ నివేదిక వివరించింది. ఈ మార్కెట్‌ను 70 శాతం వాటాతో చైనా శాసిస్తుంటే, వియత్నాం 16 శాతం వాటా కలిగి ఉంది. జపాన్ డిమాండ్‌లో భారత్ ఎగుమతులు 1 శాతం, జర్మనీ దిగుమతుల్లో 3 శాతం, యూఏఈ దిగుమతుల్లో 9 శాతం మేర ఉండడం గమనార్హం. అమెరికా (20శాతం), హాంగ్‌కాంగ్ (15 శాతం), జపాన్ (6), జర్మనీ, యూఏఈ టాప్–5 ఫోన్ల దిగుమతి మార్కెట్లుగా ఉన్నాయి. ఈ డిమాండ్‌లో సింహ భాగాన్ని చైనా, వియత్నాం తీరుస్తున్నాయి. భారత్ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు 56 శాతం పెరిగాయి. 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో రూ.1.–1.2 లక్షల కోట్లకు ఎగుమతులు చేరుకోవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. మన దేశం నుంచి ఎక్కువగా రూ.10వేల లోపు విలువైన ఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. -
సముద్రంలో పడిన ఐఫోన్, 'బ్రాండ్' బాబుకు దొరికిందోచ్!
సోషల్ మీడియాతో ఎంత నష్టం ఉందో... అంతే లాభం ఉందనే ఘటనొకటి చోటు చేసుకుంది. ఇంగ్లాడ్‌లోని గ్లౌసెస్టర్షైర్ నివాసి ఓవైన్ డేవిస్ ఏడాది క్రితం దురదృష్టవ శాత్తు 'వై నది'లో ఐఫోన్‌ను పడేసుకున్నాడు. నదిలో ఫోన్ జారి పడితే దొరుకుతుందా? దొరకదు. అదే బాధతో ఇంటికి తిరిగి వెళ్లాడు. కానీ పదినెలల తర్వాత నదిలో పడిన ఫోన్ దొరికింది. సోషల్ మీడియాతో ఆ ఫోన్ యూజర్ డేవిస్‌కు చేరింది. గ్లౌసెస్టర్షైర్కు చెందిన మిగ్గీ పీఎస్ తన కుటుంబ సభ్యులతో వై రివర్‌లో ప్రయాణిస్తుండగా తనకు ఐఫోన్ దొరికిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సముద్రంలో దొరికి ఆఫోన్‌ను ఇంటికి వెళ్లి చెక్ చేయగా.. ఆఫోన్ పనితీరు చూసి ఆశ్చర్య పోయినట్లు ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. యూకేకు చెందిన లోకల్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. ఆ లోకల్ గ్రూప్‌లో ఓ వ్యక్తి ఆ ఫోన్ తన స్నేహితుడు ఓవైన్ డేవిస్దేనని గుర్తించారు. ఫోన్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌ను డేవిస్‌కు షేర్ చేశాడు. దీంతో డెవిస్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఆధారాలు మిగ్గీ పీఎస్ చూపించడంతో కథ సుఖాంతం అయ్యింది. మిగ్గీ పీఎస్..ఐఫోన్ యూజర్‌కు డేవిడ్‌కు చేరవేశాడు. ఈ సందర్భంగా డేవిడ్.. మిగ్గీ పీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. పోయిన తన ఫోన్‌ను తనకు చేరవేసిన నెటిజన్లకు థ్యాంక్యూ చెప్పాడు. అయితే సముద్రంలో పోయిన ఫోన్ దొరకడం..అది చివరకు డేవిడ్‌కు చేరడం ఒకెత్తైతే... 10నెలలు దాటినా ఐఫోన్ పనిచేయడంపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. అంతా బ్రాండ్ మహిమ. ఎలా అయితేనేం బ్రాండ్ బాబుకి ఫోన్ దొరికింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాల్లో దుమ్మురేపుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే!
ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ 'కౌంటర్ పాయింట్ రీసెర్చ్' ప్రతి నెల ప్రపంచ వ్యాప్తంగా ఏఏ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయనే విషయాల్ని వెల్లడిస్తుంది. అయితే తాజాగా ఏప్రిల్ నెలలో ఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్లు ఇవేనంటూ డేటా విడుదల చేయగా..అందులో కొనుగోలు దారుల్ని ఆకట్టుకునే విషయంలో యాపిల్ ఐఫోన్ ఉన్నట్లు తేలింది.ఇక మిగిలిన సంస్థల ఫోన్లు ఎక్కువగా అమ్ముడు పోయాయనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే... ♦కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం..ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు భారీగా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫోన్ అమ్మకాల్లో ప్రతి 10 మంది కొనుగోలు దారుల్లో ఒకరు ఐఫోన్‌ను కొనుగోలు చేశారు. ♦ఇక వరల్డ్ వైడ్‌గా అమ్ముడైన టాప్-10 ఫోన్ల జాబితాలో యాపిల్, శాంసంగ్ ఫోన్లు మార్కెట్‌ను శాసిస్తున్నట్లు తెలుస్తోంది. ♦యాపిల్ సంస్థకు చెందిన స్టాండడ్ ఐఫోన్లలో వనిల్లా ఐఫోన్ 13 అగ్రస్థానంలో నిలవగా.. ఏప్రిల్ నెలలో 5.5శాతంతో ఎక్కువగా అమ్ముడు పోయి టాప్‌లో నిలిచింది. ♦యాపిల్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అత్యధికంగా అమ్ముడు పోయి 3.4 మార్కెట్ షేర్‌ను నమోదు చేసింది. ♦యాపిల్ ఐఫోన్ 13 ప్రో 1.8శాతం మార్కెట్ షేర్‌తో ఎక్కువగా అమ్ముడు పోయిన ఐఫోన్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ♦ఐఫోన్ 12 సైతం మార్కెట్ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది. ఏప్రిల్ నెలలో 1.6శాతం ఫోన్లు అమ్ముడుపోయి 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ♦యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2022 1.4శాతం మార్కెట్‌తో ఎక్కువగా అమ్ముడు పోయిన ఐఫోన్ల జాబితాలో 5వస్థానం దక్కించుకుంది. ♦ఇక యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లను మినహాయించి మిగిలిన స్మార్ట్ సంస్థలకు చెందిన ఏఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడు పోయాయో ఒక్కసారి పరిశీలిస్తే.. 1.5శాతం మార్కెట్ షేర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఆల్ట్రా ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ♦మోస్ట్ అఫార్డబుల్ ఫోన్ల అమ్మకాలతో శాంసంగ్ గెలాక్సీ ఏ13..1.4శాతం మార్కెట్‌ను దక్కించుకుంది. ♦అఫార్డబుల్ గో ఎడిషన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ ఎక్కువగా అమ్ముడు పోయి 1.4శాతం మార్కెట్ షేర్‌ను కైవసం చేసుకుంది. ♦మిడ్ రేంజ్ డివైజ్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్ ఫోన్ నిలిచింది. 1.3శాతం మార్కెట్‌తో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంది. ♦యాపిల్, శాంసంగ్ సంస్థ మినహాయిస్తే రెడ్ మీ నోట్ 11 ఎల్టీఈ ఫోన్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడు పోయింది. 1.3 మార్కెట్ షేర్‌తో యాపిల్, శాంసంగ్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చింది. కాగా, ఈ ఏడాది జనవరి 26న విడుదలైన సమయంలో రెడ్ మీ నోట్ 11 ఎల్టీఈ ఫోన్ ధర రూ.12,929గా ఉంది. ♦చివరిగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడవుతున్న జాబితాలో 5జీ ఫోన్ల సంఖ్య పెరుగుతున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడైంది. గతేడాది 5జీ ఫోన్లు 4మోడళ్లు అమ్ముడుపోతే..ఈ ఏడాది అనూహ్యంగా వాటి సంఖ్య 7కి చేరింది. ♦ఒక్క 5జీ ఫోన్ల విషయానికొస్తే అమ్మకాల్లో 5జీ ఫోన్లు 3 వస్థానంలో నిలిచాయి. కొనుగోలు దారుడి ఆర్ధిక స్థితి గతులకు (లోయర్ ప్రైస్ బ్యాండ్స్) అనుగుణంగా తక్కువ ధరకే లెటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లో విడుదలవుతున్న ఫ్లాగ్షిప్ ఫోన్లను కొనుగులో చేసేందుకు ఆసక్తి చూపే యూజర్ల సంఖ్య పెరుగుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన డేటాలో హైలెట్ చేసింది. చదవండి👉గతేడాది హాట్‌కేకుల్లా అమ్ముడైన ఫోన్లు ఇవే! ఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయంటే? -
బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ధర ఎంతంటే!
స్మార్ట్ ఫోన్ యూజర్లను పెంచుకునేందుకు ఇటీవల ప్రముఖ సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఫీచర్ ఫోన్ల తయారీని నిలిపివేసింది. వాటి స్థానంలో బడ్జెట్ ధరల్లో కొనుగోలు దారులకు స్మార్ట్ఫోన్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో రీజనబుల్ ప్రైస్‌తో రోజు దేశీయ మార్కెట్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫోన్ స్పెసిఫికేషన్లు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 జున్ 22 (ఈరోజు మధ్యాహ్నం) భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఫోన్ విడుదలతో గెలాక్సీ ఎఫ్13 ఫీచర్లు సైతం రివిల్ అయ్యాయి.6000 ఏఎంహెచ్ బ్యాటరీ, 5000ఏఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో విడుదలైన ఈ ఫోన్ రెడ్ మీ10 ప్రైమ్, రియల్ మీ నార్జ్ 50ఏ ప్రైమ్, పోకో ఎంపీ3 5జీ ఫోన్లకు కాంపిటీటర్‌గా మారనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోన్ 1080*2,408 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే,4జీబీ ర్యామ్‌తో ఎక్సినోస్ 850 ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5మెగా పిక్సెల్ అల్ట్రావైడ్‌తో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,128జీబీ నుంచి 1టెరా బైట్ వరకు ఇంట్రనల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 ఫోన్ ధర 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టాంగ్ వేరియంట్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫోన్ విడుదలైంది. ఇక ఈ ఫోన్ 4జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ మోడల్ ధర రూ.12,999 ఉండగా నైట్ స్కై గ్రీన్, సన్‌రైజ్ కూపర్, వాటర్ ఫాల్ బ్లూ కలర్లలో లభ్యం కానుండగా.. జూన్ 29నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్‌తో పాటు పలు రిటైల్ స్టోర్లలో లభ్యం కానుంది. గంటలో ఫోన్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కేలా 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. దీంతో పాటు 8జీబీ ర్యామ్‌ను అందిస్తుండగా..దాని కెపాసిటీని పెంచేందుకు ర్యామ్ ప్లస్ టెక్నాలజీని అందిస్తుంది. తద్వారా ఎక్కువ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా ఫోన్ డెడ్ అవ్వకుండా ఈజీగా హ్యాండిల్ చేసుకునే సదుపాయం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 పై ఆఫర్లు బుధవారం విడుదలైన ఈ ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు గూగుల్ నెస్ట్ మినీ, నెస్ట్ హబ్‌లను తక్కువ ధరకే పొంద వచ్చు. చదవండి👉శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే! -
ఐఫోన్-13 పై బంపరాఫర్!
ఐఫోన్-13ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్. అమెరికాలోని టెలికమ్యునికేషన్స్ హోల్డింగ్ కంపెనీ ఏటీ అండ్‌టీ ఐఫోన్-13పై భారీ ఆఫర్ అందిస్తోంది. నెలకు కేవలం 2.78 డాలర్ల ఈఎంఐతో ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్‌లో ఆపిల్ సంస్థ ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫోన్ అమ్మకాలు నిర్విరామంగా కొనసాగుతుండగా.. అమెరికాకు చెందిన ఏటీ అండ్ టీ సంస్థ 128జీబీ ఐఫోన్-13 వేరియంట్ ఫోన్లపై ఆఫర్‌ను అందిస్తుంది. ఐఫోన్-13 స్పెసిఫికేషన్లు ♦ట్రిపుల్ కెమెరా విత్ లేజర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ♦లైడార్ సెన్సార్ ♦5 జీ కనెక్టవిటీ సపోర్ట్ ♦వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ♦పవర్ ఎఫిసియంట్ ఎల్‌టీవో డిస్ప్లే ♦ఏ15 బయోనిక్ చిప్సెట్ అండ్ అల్వేస్ ఆన్ డిస్ప్లే ♦ఐఫోన్ 13 మినీ- 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ ♦ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో-3,095 ఎంఏహెచ్ బ్యాటరీ ♦ఐఫోన్ 13 ప్రో మాక్స్ -4352 ఎంఏహెచ్ బ్యాటరీ -
బడ్జెట్ ధరలో రియల్మీ.. విడుదల ఎప్పుడంటే!
దేశీయ స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు రియల్మీ శుభవార్త చెప్పింది. బడ్జెట్ ధరలో రియల్మీ సీ30ఫోన్‌ను ఈనెల 20న కొత్త ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ ఫోన్ స్పెసిఫికేషన్‌తో పాటు ధర ఎంతో తెలుసుకుందాం. రియల్మీ సీ30 పేరుతో మార్కెట్‌కు పరిచయం కానున్న ఈ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, వైఫై, బ్లూటూత్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, చార్జింగ్ కోసం మైక్రో యూఎస్బీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. రియల్మీ సీ30 ధర బడ్జెట్ ధరలో రియల్మీ సీ30 లభ్యం కానుంది. లైట్ వెయిట్, స్టెలిష్ లుక్ రానున్న ఈ ఫోన్ ధర 7వేలు ఉండొచ్చని అంచనా. -
శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే!
శాంసంగ్ సంస్థకు చెందిన గెలాక్సీ ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్లు కనుమరుగు కాన్నాయి. ఇప్పటికే గెలాక్సీ ఎస్ ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిషన్) పేరుతో పలు ఫోన్లను విడుదల చేసింది. కానీ ఈ ఏడాది మాత్రం ఈ తరహా సిరీస్ ఫోన్లను శాంసంగ్ తయారు చేయబోదని, వాటిని ప్రొడక్షన్‌ను నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే గెలాక్సీ ఎస్22 ఎఫ్ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం..శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎస్ఎఫ్ పేరుతో 12 రకాలైన ఫోన్లను మార్కెట్‌కి పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో గెలాక్సీ ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. టోన్ డౌన్ ఫ్లాగ్ షిప్ మోడల్ ఫోన్లపై రూ.60వేల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తోంది. వాటి స్థానంలో మంచి ఫీచర్లతో బడ్జెట్ ఫోన్లను కొనుగోలు దారులకు అందించాలని చూస్తుంది. చిప్ దెబ్బ శాంసంగ్ ఎఫ్ఈ మోడళ్లు నిలిపివేడయానికి ప్రధాన కారణం చిప్ కొరత, పెరిగిపోతున్న ప్రొడక్షన్ ఖర్చేనని తెలుస్తోంది. అందుకే తయారీ తగ్గించి వినియోగదారులకు నచ్చే బడ్జెట్ స్మార్ట్ఫోన్ల తయారీపై శాంసంగ్ దృష్టిపెట్టనుంది. బాబోయ్ ఖర్చుల భారం పెరిగిపోతున్న ప్రొడక్షన్ ఖర్చుతో పాటు ఇతర కారణాలు శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌పై మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే శాంసంగ్ భారత్‌లో ఫీచర్ ఫోన్లు అమ్మకాల్ని నిలిపివేసింది. ఇప్పుడు గెలాక్సీ ఎఫ్ఇ సిరీస్‌ను నిలిపి వేయనుందని వార్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చక్కెర్లు కొడుతుండగా.. ఫోన్ నిలిపివేతపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆగస్ట్‌లో మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ , జెడ్ ఫ్లిప్ 4 స్మార్ట్ ఫోన్లను త్వరలో నిర్వహించే ఈవెంట్లో పరిచయం చేయనుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్‌లో జరగనున్న శాంసంగ్ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చదవండి👉 భారత్‌కు శాంసంగ్ భారీ షాక్! ఇకపై ఆ ప్రొడక్ట్‌లు ఉండవట! -
రెడ్మీ, షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్!
మీరు రెడ్మీ, షావీమీ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారా? కానీ, ఆ ఫోన్ బ్యాటరీలు డెడ్ అయ్యాయ్యా? ఛార్జింగ్ సరిగ్గా ఎక్కడం లేదా? లేదంటే ఛార్జింగ్ ఎక్కినా నిలవడం లేదా? అయితే మీకో శుభవార్త. షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త. యూజర్లు వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సమస్యల్ని పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు మందగించిన ఫోన్ల బ్యాటరీను మార్చి వాటి స్థానంలో కొత్త బ్యాటరీలను అమర్చుతున్నట్లు ప్రకటించింది. షావోమీ తన యూజర్లకు రూ.499కే పాత ఫోన్ల బ్యాటరీల స్థానంలో కొత్త బ్యాటరీలను అందిస్తున్నట్లు ట్విట్ చేసింది. మీ షావోమీ, రెడ్ మీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయినట్లు అనిపించినా, లేదంటే ఛార్జింగ్ ఎక్కకపోయినా మీ సర్వీస్ సెంటర్‌ని ఆశ్రయిస్తే తక్కువ ధరకే కంపెనీ బ్యాటరీలను అందిస్తామని ట్వీట్లో పేర్కొంది. బ్యాటరీ ఎప్పుడు రిప్లెస్ చేయాలి షావోమీ, రెడ్మీ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ ఛార్జింగ్ లైఫ్ టైమ్ ఉదాహరణకు 10 గంటల ఉంటుంది. కానీ ప్రతిరోజు పలు మార్లు ఛార్జింగ్ తగ్గిపోతుంటే బ్యాటరీ మార్చుకోవాలి. లేదంటే ఫోన్ ఛార్జింగ్ 100శాతం ఉండి నిమిషాల వ్యవధిలో 80-90కి పడిపోతే అప్పుడు మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చదవండి👉 జూన్‌లో విడుదల కానున్న 9 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ప్రపంచంలోనే తొలి మెటావర్స్ 5జీ స్మార్ట్ ఫోన్, విడుదల ఎప్పుడంటే!
మనిషి తనకున్న కొద్ది పాటి జీవితాన్ని సుసంపన్నం చేసుకునేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాడు. అందుకే తాను అనుకున్న ఊహా ప్రపంచంలో విహరించేందుకు మెటావర్స్ పేరుతో రెండో ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాడు. ఇప్పుడీ మెటావర్స్ టెక్నాలజీ పేరుతో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ప్రపంచంలోనే తొలి మెటావర్స్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆ ఫోన్ విశేషాలేంటో తెలుసుకుందాం. 2008లో తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం హెచ్‌టీసీ సంస్థ ప్రపంచంలోనే తొలిసారి ఆండ్రాయిడ్ ఫోన్‌ను పరిచయం చేసింది. ఆ ఫోన్ సేల్స్ విభాగంలో యాపిల్, శాంసంగ్‌లకు గట్టి పోటి ఇచ్చింది. కానీ టెక్నాలజీ అప్డేట్ చేయడంలో అలసత్వం, మార్కెటింగ్ వ్యూహాలు, తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ఫోన్లు సేల్ చేయాలన్న చైనా కంపెనీల మార్కెట్ సూత్రం ముందుకు హెచ్‌టీసీ నిలవలేకపోయింది. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలైన షావోమీ, వివో, ఒప్పోతో పాటు శాంసంగ్, యాపిల్ కంపెనీల ఆధిపత్యంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పింది. కొత్త స్ట్రాటజీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌పై పాగే వేసేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇతర దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల కంటే విభిన్నంగా ఫోన్లలో మెటావర్స్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నట్లు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2022 వేదికగా ప్రకటించింది. 5జీ ప్రీమియం సెగ్మెంట్లో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు హెచ్‌టీసీ ఆసియా పసిఫిక్ జనరల్ మేనేజర్ చార్లెస్ హుయాంగ్ తెలిపారు. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ ఫోన్లో అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్),వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీలు అందుబాటులో ఉండనున్నాయి. మెటావర్స్ ఫోన్ ఫీచర్లు ఫోన్లో ఏఆర్, వీఆర్ టెక్నాలజీ ఇంటిగ్రీట్ చేస్తూ 'వైవర్స్' పేరుతో మెటావర్స్‌ను పరిచయం చేయనుంది. 6 అంగుళాలు, 3500ఏఎంహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ ప్లస్ 16ఎంపీ రేర్ కెమెరా, 8ఎంపీ ప్లస్ 8ఎంపీ సెల్ఫీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 వంటి ఫీచర్లు ఉండగా.. ఈ మెటావర్స్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారని హెచ్‌టీసీ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న హెచ్‌టీసీ మెటావర్స్ ఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్లను అట్రాక్ట్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంది. -
అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ విడుదల, ధర మరీ ఇంత తక్కువా!
ఈ పెళ్లిళ్ల సీజన్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీరు కొనాలనుకుంటున్న ఫోన్లో అదిరిపోయే ఫీచర్లతో మీ బడ్జెట్లో ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ను రేపు (జూన్2న) విడుదల చేయనుంది. మోటో ఈ32ఎస్ ఫీచర్లు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నా, లేదంటే విడుదలకు సిద్ధంగా ఉన్న స్మార్ట్ఫోన్లు సేమ్ డిజైన్లే ఉంటాయి. కానీ ఈ మోటో ఈ32ఎస్ మాత్రం పంచ్ హోల్ డిస్ప్లే, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరాను డిజైన్ చేసింది. స్లేట్ గ్రే, మిస్టీ సిల్వర్ కలర్స్‌లో లభ్యం కానుంది. ఐపీ52 రేటింగ్ అంటే కింద పడినా, వాటర్‌లో పడినా తిరిగి వినియోగించుకోవచ్చు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, కింది భాగంలో ఒకే స్పీకర్, బయోమెట్రిక్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే మోటో ఈఎస్32ఎస్ 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 15డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్ప్లే, ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే లేనప్పటికీ స్క్రీన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ పనితీరు, సామర్ధ్యం బాగుండేందుకు మీడియా టెక్ హీలియా జీ 37 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను అందిస్తుంది. 3జీబీ ర్యామ్ ప్లస్ 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టోరేజ్ ఉండే రెండు కాన్ఫిగరేషన్లను అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా, వెనుక కెమెరా సెటప్‌లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మోటో ఈ32ఎస్ ధర మోటరోలా సంస్థ మోటో ఈ32ఎస్ పేరుతో రూ.10వేల బడ్జెట్ ఫోన్‌ను జూన్2న విడుదలకు సిద్ధమైంది. ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాత్రం అదే ఫోన్ 3జీబీ ర్యామ్ ప్లస్ 32జీబీ స్టోరేజ్ ఫోన్ ను రూ.9,222గా ఉందని తెలిపింది. ఇక 4జీబీ ప్లస్ 64జీబీ ర్యామ్ ఫోన్ ధర ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. -
తక్కువ ధరకే, అదిరిపోయే రెడ్ మీ 5జీ స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ సబ్ బ్రాండ రెడ్మీ తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. రెడ్మీ 11 5జీతో రానున్న ఈ ఫోన్ భారత్ మార్కెట్లో జూన్ నెలలో విడుదల కానుండగా..ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉండగా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రెడ్మీ డిజైన్ చేసింది భారత్ మార్కెట్లో జూన్ నెలలో విడుదల కానున్న ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టోరేజ్ ఉండే వేరియంట్ ధర రూ.13,999 ధరగా ఉండనుంది. అయితే షావోమీ త్వరలోనే ఈ మొబైల్ గురించి మరిన్ని విషయాల్ని వెలడించనుంది. టీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
వాట్సాప్ డేటాను ఎలా బ్యాకప్ తీసుకోవాలో మీకు తెలుసా!
ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ నుంచి మీకు కావాల్సిన ఫోటోస్‌ని, చాట్స్ సింపుల్ టెక్నిక్స్‌తో బ్యాకప్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆ బ్యాకప్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వాట్సాప్ చాట్ హిస్టరీ, వాయిస్ మెసేజ్,ఫోటోల్ని,వీడియోల్ని గూగుల్ డ్రైవ్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ పూర్తయితే రీస్టోర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. వాట్సాప్ డేటా బ్యాకప్ ఎలా అంటే! స్టెప్1: ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి డ్యాష్ బోర్డ్‌లో త్రీ డాట్స్ మీద క్లిక్ చేయాలి. స్టెప్2: అనంతరం సెట్టింగ్ ఆప్షన్‌లోకి వెళ్లాలి స్టెప్3: సెట్టింగ్‌లో చాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి స్టెప్4: చాట్‌లో చాట్ బ్యాకప్ ఆప్షన్ కనిపిస్తుంది స్టెప్5: చాట్ బ్యాక్ ఆప్షన్లో మీకు గూగుల్ డ్రైవ్ సెట్టింగ్ తో పాటు వీడియో ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్యాకప్ తీసుకోవచ్చు. దీంతో మీ వాట్సాప్ డేటా అంతా మీ మొబైల్‌కు లింకై ఉన్న గూగుల్ అకౌంట్ డ్రైవ్‌లో స్టోర్ అవుతుంది. -
అమెజాన్ సమ్మర్ సేల్ వచ్చేసింది! అస్సలు మిస్సవ్వద్దు! 75శాతం భారీ డిస్కౌంట్లు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే ఆఫర్లతో ముందుకు వచ్చింది. 'అమెజాన్ సమ్మర్ సేల్-2022' పేరిట మే4 నుంచి మే7వరకు నిర్వహించే సేల్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌పై 75శాతం, డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పలు బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్‌లను వినియోగించడం ద్వారా అదనంగా మరికొన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది నేటి నుంచి అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ సందర్భంగా కొనుగోలు దారులు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్, గృహోపకరణాలు, దుస్తులు, హెడ్‌ఫోన్స్,ఇయర్ ఫోన్స్ బ్రాండ్స్ బోట్, సోనీ, స్కల్ క్యాండీ,జేబీఎల్, రియల్మీ, నాయిస్, వన్ ప్లస్‌తో పాటు ఉత్పత్తులను భారీ డిస్కౌంట్‌కే అందిస్తుంది. కార్డ్‌లపై ఆఫర్లు ఎలా ఉన్నాయ్ అమెజాన్ సంస్థ ఈసేల్ సందర్భంగా పలు బ్యాంక్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొనుగోలు దారులు ఈ సేల్‌లో ఐసీఐసీఐ, కొటాక్, ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లను వినియోగిస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్, జీరో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కొత్త యూజర్లు తొలిసారి కొనుగోళ్లపై 10శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తుంది. 60ప్రొడక్ట్‌లు అందులో.. ఈ సేల్‌లో అమెజాన్ 60రకాల ప్రొడక్ట్‌లను అందుబాటులో ఉంచింది. దుస్తులు, షూస్, బ్యాగ్స్, కిచెన్ అప్లయెన్సెస్, హోమ్ అప్లయెన్సెస్ తో పాటు ఇటీవల విడులైన 5జీ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10ఆర్ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ బెన్ఫిట్స్ అమెజాన్ ప్రైమ్ యూజర్లకు అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్లు 1000 ఆఫర్లు ఉన్నాయని, ఎక్స్ క్లూజివ్గా ఈ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ మెంబర్లు వినియోగించుకోవచ్చని, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్స్‌పై రివార్డ్‌లను దక్కించుకోవచ్చని ఈకామర్స్ దిగ్గజం ప్రకటించింది. అమెజాన్ సమ్మర్ సేల్ ఆఫర్స్ ఎక్స్‌క్లూజీవ్‌గా అమెజాన్ నిర్వహిస్తున్న ఈ అమ్మకాల్లో స్మార్ట్ ఫోన్లు,యాక్ససరీస్, ల్యాప్ ట్యాప్స్ పై 40శాతం భారీ డిస్కౌంట్‌తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు. ఫ్యాషన్ యాక్ససరీస్,దుస్తులు,గృహోపకరణాలపై మరిన్ని అఫర్లు ఉన్నాయి. ఇక హెడ్‌ఫోన్స్,ఇయర్ ఫోన్స్‌పై 70శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. చదవండి👉భావన.. పక్కా పల్లెటూరి పిల్ల జీతం రూ.40 లక్షలు -
షావోమి నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్
ఇంత కాలం ఎంట్రీ, మిడ్ లెవల్ సెగ్మెంట్లోనే ప్రభావం చూపించిన షావోమి సంస్థ తాజాగా హైఎండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఫోకస్ చేసింది. అందులో భాగంగా హై ఎండ్‌పై కేటగిరిలో షావోమి 12 ప్రో 5జీ మోడల్ని రిలీజ్ చేసింది. 2022 మే 3 నుంచి ఎంఐ డాట్ కామ్, అమెజాన్‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. షావోమి సంస్థ ముందు నుంచి బట్జెట్ ఫోన్ల తయారీపై దృష్టి పెట్టింది. రూ. 15 వేల లోపు ఫోన్లలో షావోమిదే ఆధితప్యం. ప్రీమియం కేటగిరిలో కొన్ని మోడళ్లు తెచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. పోకో పేరుతో రిలీజ్ చేసిన హై ఎండ్ ఫోన్లు కూడా మార్కెట్లో ఎక్కువ కాలం నిలవలేక పోయాయి. దీంతో ఎలాగైనా ఈ కేటగిరీలో సక్సెస్ కొట్టే లక్ష్యంతో 12 ప్రో 5జీ మోడల్ని తెచ్చింది. ఫీచర్స్ - 4600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం - 120 వాట్స్ హైపర్ ఛార్జర్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ - ఇండస్ట్రీ లీడింగ్ ప్రాసెసరైన స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 - వెనుక వైపు ఉన్న మూడు కెమెరాలు 50 మెగా పిక్సెల్స్ - ఆల్ట్రా ఫోకస్ నైట్ మోడ్ - 4 హార్మాన్ కార్దాన్ స్పీకర్లు (2 వూఫర్స్, 2 ట్వీటర్స్) - 6.73 ఇంచ్ , 120 హెర్జ్, 10 బిట్ 2కే ప్లస్ అమోల్డ్ డిస్ప్లే - కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ - నాయర్ బ్లాక్, కౌషర్ బ్లూ, ఓపెరా మావే కలర్స్ - 8కే, 4కే వీడియో రికార్డింగ్ - 2022 మే 2 మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లభ్యం - ధర రూ.62,999 (8 జీబీ/ 256 జీబీ), ధర రూ.66,999 (12 జీబీ/ 256 జీబీ) చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే? -
ఐఫోన్13 పై ఆఫర్ మామూలుగా లేదుగా,నెలకు రూ.760కే..అస్సలు మిస్ చేసుకోవద్దు!
ఐఫోన్ కొనడం కొందరికి అందని ద్రాక్షనే. ఎందుకంటే ఆ ఫోన్ ఖరీదు ఎక్కువ. కాకపోతే ఇతర ఫోన్లతో పోలిస్తే లుకింగ్‌తో పాటు, టెక్నాలజీ పరంగా ఐఫోన్లు చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. అందుకే ఖరీదైనా సరే ఆ ఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్13 పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన వైర్లెస్ నెట్ వర్క్ ఆపరేటర్ (జియో టైప్) వెరిజోన్ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.నెలకు ఈఎంఐ రూ.760 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. యాపిల్‌కు చెందిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్-13 వరల్డ్ వైడ్‌గా హాట్ కేకుల్లా అమ్ముడవతున్న ఫోన్. తాజాగా ఈ ఫోన్లో యాపిల్ సంస్థ ఏ15 బయోనిక్ చిప్, గ్రీన్ గ్రీన్ ఫినిషెస్ తో డిజైన్ చేసిన ఐఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఆ ఫోన్‌ను వెరిజోన్ సంస్థ నెలకు 10డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.760) చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. నెలకు 10 డాలర్లు, 36 నెలలు వెరిజోన్ సంస్థ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అమెరికన్లు నెలకు 10 డాలర్లను సుమారు 36నెలలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ ఫోన్ ధర ప్రస్తుత మార్కెట్లో 699డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.53,355.79) ఉండగా, ఈ ఆఫర్ దక్కించుకున్న యూజర్లకు 360 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.27,479.38) కే పొందవచ్చు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
రూ.549లకే స్మార్ట్ ఫోన్..! అదిరిపోయే ఫీచర్లతో..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ నేటి నుంచి సేల్స్ ప్రారంభించింది. అయితే ఈ సేల్ సందర్భంగా కొనుగోలు దారులు అతి తక్కువ ధర అంటే కేవలం రూ.549కే స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మోటో జీ22 ఫీచర్లు బుధవారం నుంచి మోటరోలా కొత్త ఫోన్ మోటో జీ22ను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.13,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ద్వారా రూ. 549 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ డిస్ ప్లే 6.5 అంగుళాల హెచ్‌డీపీ ప్లస్ ఐపీఎల్ ఎల్సీడీ, 5,000ఎంఏహెచ్, 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. దీంతో పాటు మెయిన్ కెమెరా 50 ఎంపీ సెన్సార్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియా టెక్ హీలియా జీ37 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌పై స్పెషల్ ఆఫర్లు ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.13,999 ఉండగా..ఈ ఫోన్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ అందించే 21 శాతం డిస్కౌంట్‌తో రూ.10,999కే కొనుగోలు చేయోచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై వెయ్యి తగ్గింపుతో రూ. 9,999 వద్దకు చేరుతుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లో పాత ఫోన్ ఎక్స్ఛేంజ్తో రూ. 549 ధరకే కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ కొనుగోలుపై బ్యాంకు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో ఏదో ఒకటి మాత్రమే పొందవచ్చు. చదవండి: స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌లు! -
టపా టప్: మాట్లాడుతుండగా టపాసుల్లా పేలిన స్మార్ట్‌ఫోన్.! యువకుడికి గాయాలు!
Oneplus Nord 2 Blast: స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్. ఇటీవల కాలంలో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్ పేలుతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా న్యూఢిల్లీకి చెందిన ఓ వినియోగదారుడు చైనా స్మార్ట్ తయారీ సంస్థకు చెందిన 5జీ వన్‌ప్లస్ నార్డ్2 మాట్లాడుతుండగా పేలింది. ఫోన్ పేలడంతో బాధితుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు స్మార్ట్ ఫోన్ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. న్యూఢిల్లీ చెల్లి చెందిన 'లక్ష్య వర్మ' అనే ట్విట్టర్ మార్చి31,2022న యూజర్ వన్‌ప్లస్ నార్డ్2 విషయంలో తన తమ్ముడికి జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నా తమ్ముడు వన్‌ప్లస్ నార్డ్2 స్మార్ట్‌ఫోన్'లో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆఫోన్ పేలింది. తమ్ముడిని వెంటనే ఆస్పత్రికి తరలించాం. న్యాయం కోసం వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్ ప్రతినిధుల్ని ఆశ్రయించాను. 2,3 రోజుల తర్వాత సర్వీస్ సెంటర్ ప్రతినిధులు పేలిన స్మార్ట్‌ఫోన్‌ను కలెక్ట్ చేసుకున్నారే తప్పా ఏం చేయలేదు. @OnePlus_IN Is that your NEVER SETTLE?? This is not a joke! He could have got serious injuries too but luckily he is alive! We just asked for a healthy solution for this, not any compensation or anything else.All I get from you is NO NO NO NO, we can’t do anything pic.twitter.com/RTVUaDln67 — Lakshay Verma (@lakshayvrm) March 31, 2022 @OnePlus_IN హ్యాష్ ట్యాగ్‌కు వన్‌ప్లస్ మోటివేషనల్ కోట్ NEVER SETTLE?? ను యాడ్ చేస్తూ.. ఇది జోక్ కాదు. నా తమ్ముడు ఫోన్ మాట్లాడుతుండగా వన్‌ప్లస్ నార్డ్2 ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టం కొద్ది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నష్టపరిహారమో, ఇంకేదో కావాలని మేం అడగం లేదు. ఒకటే అడిగేది మాకు న్యాయం చేయమని. కానీ ఇప్పటి వరకు మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంకేం చేయలేం' అంటూ విచారం వ్యక్తం చేశాడు. @OnePlus_IN Stop promoting/introducing new phones and start working on your existing products. My brother’s phone One Plus Nord 2 burst out suddenly while he was talking on phone. Portions of melted metal got clinged on his palm and face. We will get this reported shortly. pic.twitter.com/x1pVoDosZM — Lakshay Verma (@lakshayvrm) March 26, 2022 ఫోన్ మెటల్ మొహంపై గుచ్చుకున్నాయి ఫోన్ మెటల్ మొహంపై గుచ్చుకున్నాయంటూ వర్మ ఓ వీడియోను ట్వీట్ చేశాడు. మాట్లాడుతుండగా వన్‌ప్లస్ నార్డ్2 పేలడంతో..ఆఫోన్ మెటల్ నా తమ్ముడి మొహంపై, చేతిలో గుచ్చుకున్నాయి. తీవ్రంగా గాయపడ్డాడు అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. అంటే వర్మ పోస్ట్ చేసిన వీడియోలో వన్ ప్లస్ నార్డ్2 ఫోన్ పేలి పొగలు వస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Hi Lakshay! Thank you for bringing this to our notice. We hope your brother is alright! Please connect with us over DM so we can look into your claim. https://t.co/Y6rHuMx1Yh — OnePlus Support (@OnePlus_Support) March 26, 2022 అయితే వర్మ వరుస ట్వీట్లతో వన్‌ప్లస్ యాజమాన్యం స్పందించింది. మీ తమ్ముడి క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాం. దీన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మీరు మాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామంటూ రిప్లయి ఇచ్చింది. చదవండి: అన్నా.. మొబైల్ డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది! ఏం చేయను.. -
బడ్జెట్ ధరలో.. అదిరే ఫీచర్లతో రెడ్మీ కొత్త ఫోన్!
కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని మహమ్మారిని ఏం చేయలేకపోయింది. దీంతో గతేడాది దేశీయ మార్కెట్లో సుమారు 2లక్షల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 24శాతం వాటాతో భారత్‌లో టాప్ బ్రాండ్‌గా ఉన్న షావోమీ వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. తాజాగా షావోమీ రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. హోలీ సందర్భంగా మర్చి 17న దేశీయ మార్కెట్లో రూ.15వేల బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కొత్త ఫోన్ అమ్మకాలు ప్రారంభిస్తామని షావోమీ ప్రతినిధులు ప్రకటించారు. రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ►18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ►స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓఎస్ ప్రాసెసర్ ►18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ►ఫోన్ ముందు పై భాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ►50ఎంపీ మెయిన్ కెమరా సెన్సార్లు ►మ్యాక్రో ఫోటో గ్రఫీ కోసం 2ఎంపీ సెన్సార్లు చదవండి: ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్, అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్ ఫోన్!! -
ప్రీ బుకింగ్స్ బీభత్సం!! 12గంటల్లో 70వేల ఫోన్ల బుకింగ్స్!
సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తుంది. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ 2022 ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సిరీస్ ఫోన్ ప్రీ బుకింగ్స్ శాంసంగ్ ఇండియా ప్రతినిధుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి 23నుంచి శాంసంగ్ ప్రీ బుకింగ్స్ ను ప్రారంభించింది. కేవలం 12గంటల్లో 70వేల ఫోన్లు ప్రీ బుకింగ్ అయ్యాయి. ధర ఎంతంటే..? దేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 8జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ ఫోన్ ప్రారంభ ధర రూ.72,999, 8జీబీ ప్లస్ 256 జీబీ మోడల్ ధర రూ.76,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ 8జీబీ ప్లస్ 128జీబీ ధర రూ. 84,999 నుండి ప్రారంభం కానుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.88,999గా ఉంది. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ ఆల్ట్రా ఎస్22 12జీబీ ప్లస్ 256జీబీ ధర రూ.1,09,999 ఉండగా 12జీబీ ప్లస్ 512జీబీ మోడల్ ధర రూ.1,18,999గా ఉంది. ఫోన్ బుక్ చేసుకుంటే ఆఫర్ ఎంతంటే? కంపెనీ ప్రకారం..శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా ఫోన్‌ని బుక్ చేసిన కస్టమర్లు రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్4ని రూ.2999కే సొంతం చేసుకోనున్నారు. అలాగే గెలాక్సీ ఎస్ 22ప్లస్, గెలాక్సీ ఎస్ 22ని ప్రీ బుకింగ్ చేసే కస్టమర్లు రూ.11,999 విలువైన గెలాక్సీ బడ్స్2 ని రూ.999కే పొందనున్నారు. అదనంగా, గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్ సిరీస్ కస్టమర్లు రూ.8000 అప్‌గ్రేడ్ బోనస్, డివైజ్ హోల్డర్లు రూ. 5000 అప్‌గ్రేడ్ బోనస్, ప్రత్యామ్నాయంగా శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా ఫోన్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు అదనంగా రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. . ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఆధిత్య బబ్బర్ మాట్లాడుతూ.. దేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఫోన్ ప్రీ బుక్కింగ్స్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారం. వీలైనంత త్వరగా ఆ ఫోన్లను కస్టమర్లకు అందిస్తున్నట్లు చెప్పారు. -
5జీ ఎఫెక్ట్.. కొత్త ఫోన్లకు సూపర్ క్రేజ్
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు గ్రామీణ ప్రాంతాలు దన్నుగా నిలుస్తున్నాయి. దీనితో వచ్చే అయిదేళ్లలో స్మార్ట్ఫోన్ల యూజర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లకు చేరనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2021 గణాంకాల ప్రకారం దేశీయంగా 120 కోట్ల మొబైల్ యూజర్లు ఉండగా.. వీరిలో 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వచ్చే అయిదేళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ఫోన్లు తయారు చేసే రెండో దేశంగా నిలవనుంది. ఈ నేపథ్యంలోనే డెలాయిట్ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ 2026 నాటికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 1 బిలియన్ (100 కోట్లు) యూజర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది‘ అని 2022 గ్లోబల్ టీఎంటీ (టెక్నాలజీ, మీడియా.. వినోదం, టెలికం) అంచనాల పేరిట రూపొందించిన నివేదికలో డెలాయిట్ తెలిపింది. దీని ప్రకారం 2021–26 మధ్య కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం వార్షిక వృద్ధి రేటు పట్టణ ప్రాంతాల్లో 2.5 శాతంగా ఉండనుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 6 శాతం స్థాయిలో నమోదు కానుంది. ‘ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ స్మార్ట్ఫోన్లకు కూడా డిమాండ్ పెరగవచ్చు. ఫిన్‌టెక్, ఈ–హెల్త్, ఈ–లెరి్నంగ్ మొదలైన అవసరాల రీత్యా ఈ మేరకు డిమాండ్ నెలకొనవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. భారత్‌నెట్ ప్రోగ్రాం కింద 2025 నాటికల్లా అన్ని గ్రామాలకు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ ప్రణాళిక కూడా గ్రామీణ మార్కెట్లో ఇంటర్నెట్ ఆధారిత డివైజ్‌ల డిమాండ్‌కు దోహదపడగలదని వివరించింది. కొత్త ఫోన్లకే మొగ్గు.. 2026 నాటికి పట్టణ ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనే వారి సంఖ్య 5 శాతానికే పరిమితం కావచ్చని 95 శాతం మంది తమ పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ఫోన్లను కొనుక్కునేందుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని డెలాయిట్ నివేదికలో తెలిపింది. 2021లో ఇలా తమ పాత ఫోన్ల స్థానంలో ప్రీ–ఓన్డ్ స్మార్ట్ఫోన్లను కొనేవారు 25 శాతంగా ఉండగా.. కొత్త వాటిని ఎంచుకునే వారి సంఖ్య 75 శాతంగా నమోదైంది. ఫోన్ సగటు జీవితకాలం దాదాపు నాలుగేళ్లుగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధోరణి కనిపించనుంది. 2026లో ఆయా ప్రాంతాల్లో రీప్లేస్మెంట్లకు సంబంధించి 80 శాతం వాటా కొత్త ఫోన్లది ఉండనుండగా.. మిగతా 20 శాతం వాటా సెకండ్ హ్యాండ్ ఫోన్లది ఉండనుంది. ఇక స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య పెరిగే కొద్దీ ఫీచర్ ఫోన్ల స్థానంలో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయడం కూడా తగ్గనుంది. 2021లో ఫీచర్ ఫోన్ రీప్లేస్మెంట్ .. పట్టణ ప్రాంతాల్లో 7.2 కోట్లుగా ఉండగా 2026లో ఇది 6 కోట్లకు తగ్గనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో 7.1 కోట్ల నుంచి 6 కోట్లకు దిగి రానుంది. 5జీతో పెరగనున్న డిమాండ్ .. డెలాయిట్ అధ్యయనం ప్రకారం భారత్‌లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ 6 శాతం మేర వార్షిక వృద్ధితో 2026 నాటికి 40 కోట్లకు చేరనుంది. 2021లో ఇది 30 కోట్లుగా ఉంది. 5జీ సర్వీసుల కారణంగా స్మార్ట్ఫోన్లకు ప్రధానంగా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. దాదాపు 80 శాతం అమ్మకాలకు (సుమారు 31 కోట్ల యూనిట్లు) ఇదే ఊతంగా నిలవనుంది. హై–స్పీడ్ గేమింగ్, మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించడం వంటి వివిధ రకాల అవసరాలకు ఉపయోగపడే 5జీ టెక్నాలజీ.. మిగతా మొబైల్ సాంకేతికలతో పోలిస్తే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉందని డెలాయిట్ తెలిపింది. ఒక్కసారి 5జీ సర్వీసులను ఆవిష్కరిస్తే .. 2026 నాటికి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు మొత్తం మీద అదనంగా 13.5 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. ‘2022–26 మధ్య కాలంలో మొత్తం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనితో ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు చేరనుంది. అయిదేళ్ల వ్యవధిలో 84 కోట్ల పైచిలుకు 5జీ పరికరాలు అమ్ముడు కానున్నాయి‘ అని డెలాయిట్ వివరించింది. మరోవైపు, మీడియా విషయానికొస్తే.. కొరియన్, స్పానిష్ వంటి అంతర్జాతీయ కంటెంట్‌కు భారత్‌లో ప్రాచుర్యం పెరుగుతోందని తెలిపింది. దీంతో పలు స్ట్రీమింగ్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని పేర్కొంది. తమ కస్టమర్లను కాపాడుకునే క్రమంలో స్ట్రీమింగ్ సర్వీసుల కంపెనీలు.. రేట్ల విషయంలో పోటీపడే అవకాశం ఉంటుందని తెలిపింది. తగ్గనున్న చిప్‌ల కొరత.. సెమీకండక్టర్ చిప్‌ల కొరతతో ప్రపంచవ్యాప్తంగా తయారీ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని డెలాయిట్ తెలిపింది. సమీప కాలంలో డిమాండ్ పెరిగే కొద్దీ సరఫరాపరమైన పరిమితులు కొనసాగవచ్చని.. 2023లో క్రమంగా పరిస్థితి మెరుగుపడవచ్చని పేర్కొంది. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్ తయారీలో భారత్ ప్రాంతీయంగా పటిష్టమైన హబ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ పీఎన్ సుదర్శన్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం .. ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. -
అదిరిపోయే ఫీచర్లతో 5జీ స్మార్ట్ ఫోన్..రేపటి నుంచే సేల్!!
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 21 నుంచి ఆన్లైన్ సేల్‌కి సిద్ధమైంది. ఫిబ్రవరి21 మధ్యాహ్నం 12:00 గంటల నుండి రియల్ మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నట్లు రియల్ మీ ప్రతినిధులు తెలిపారు. రేపు విడుదల కానున్న రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ ఫోన్ 6ప్లస్ 128జీబీ ధర రూ.24,999, 8ప్లస్ 128 జీబీ ధర రూ.26,999, 8ప్లస్ 256జీబీ ధర రూ.28,999గా ఉండనున్నాయి. కొనుగోలు దారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చని రియల్ మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ ఫోన్ ఫీచర్లు రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రియల్ మీ యూఐ 3.0తో అందిస్తుంది. ఇందులో సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్, మీడియా టెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, ఫోన్ 60డబ్ల్యూ ఛార్జర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది. రియల్ మీ 9 ప్రో ప్లస్‌లో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో షూటర్ ఉన్నాయి. ఇందులో 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. -
రూపాయికే బ్లూటూత్..!! దేశీయ మార్కెట్లో అదిరిపోయే ఫీచర్లతో మరో 5జీ ఫోన్!
న్యూఢిల్లీ: ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇన్ఫినిక్స్ తొలి 5జీ ఫోన్‌ను ‘జీరో 5జీ’ పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫీచర్లు, ధరలు ►మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుంది. ►13 5జీ బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది. ►అత్యధిక 5జీ బ్యాండ్లు కలిగిన ఫోన్ ఇదే ►8జీబీ ర్యామ్ (5జీ ర్యామ్ ఎక్స్‌పాండబుల్), 128జీబీతో వచ్చే దీని ధర రూ.19,999. ►ఫ్లిప్‌కార్ట్‌పై ఈ నెల 18 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి. ►ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.999 విలువ చేసే ఇన్ఫినిక్స్ స్నాకర్ (ఐరాకర్)ను కేవలం రూ.1కే అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ►ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 11పై పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో ఉంటుంది. -
ఫ్లిప్‌కార్ట్ కొత్త ఆఫర్: మీ పాత ఫోన్ అమ్మండి..కొత్త ఫోన్ కొనుగోలు చేయండి!!
దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు సువార్ణావకాశం కల్పించింది. సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ ద్వారా పాత ఫోన్ అమ్మి కొత్త ఫోన్‌ను కొనుగోలు లేదా ఇతర కొత్త ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది. వాలంటైన్స్ డే సందర్భంగా సేల్ బ్యాక్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ యంత్ర అనే రీకామర్స్ సంస్థను కొనుగోలు చేసింది.ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఆ సంస్థ సాయంతో యూజర్లనుంచి పాత ఫోన్లను కలెక్ట్ చేస్తుంది. ఇందులో యూజర్లు చేయాల్సిందల్లా ఒక్కటే పాత ఫోన్ అమ్మాలనుకుంటే యంత్ర వెబ్ సైట్లోకి వెళ్లి ఫోన్లకు సంబంధించిన పలు ప్రశ్నలు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానాల అనంతరం 48గంటల్లో ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి ఫోన్‌ను కలెక్ట్ చేసుకుంటారు. ఫోన్‌ను ఎగ్జిక్యూటివ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కస్టమర్‌కు ఫ్లిప్‌కార్ట్ ఈవోచర్ను పంపిస్తుంది. ఆ ఈవోచర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఫోన్ తీసుకోవచ్చు. లేదా ఇతర ప్రొడక్ట్స్ ఏవైనా కొనుగోలు చేయొచ్చు. దేశవ్యాప్తంగా 1700 పిన్‌కోడ్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి స్మార్ట్ఫోన్లను ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ అయినా సరే.. దేశంలో ఎక్కడున్నా సరే.. తమ ఫోన్‌ను అమ్ముకునే చాన్స్‌ను ఫ్లిప్‌కార్ట్ లో అమ్మే అవకాశం కల్పిస్తుంది. త్వరలోనే ఇతర వస్తువులను కూడా కస్టమర్లు అమ్ముకునే సౌకర్యాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించనుంది. -
రూ.190కే అదిరిపోయే 5జీ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్!! ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రత్యేక తగ్గింపులతో రూ.16,990ఫోన్‌ను కేవలం రూ.190కే అందిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దేశీయ ఈకామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్స్ పేరుతో ఆఫర్లలో తక్కువ ధరకే 4జీ, 5జీ స్మార్ట్ ఫోన్స్‌ను అందిందిస్తుంది. ఇక ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ సేల్ లో ఒప్పో 5జీ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ53ఎస్పై భారీ తగ్గింపులతో పాటు తక్షణ క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి రూ. 16,990 విలువైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.190లకే అందుబాటులోకి తెచ్చింది. ఒప్పో ఏ53ఎస్ 5జీ పై ఆఫర్లు ఏప్రిల్ 27,2021లో విడుదలైన ఒప్పో ఏ53ఎస్ 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.16,900 ఉండగా..ప్రస్తుతం ఈ ఫోన్ ధర ఆన్ లైన్ లో రూ.15,990కే కొనుగోలు చేయోచ్చు. యాక్సిస్ బ్యాంకు క్రెడిడ్ కార్డుతో రూ.800 క్యాష్ బ్యాక్, స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ కింద రూ.15,000 వరకు ఆఫర్ పొందవచ్చు. తద్వారా 5జీ ఫోన్‌ను రూ.190కే సొంతం చేసుకోవచ్చు. ఒప్పో ఏ53ఎస్ ఫీచర్లు ►90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ►వెనుక 13ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ►8ఎంపీ సెల్ఫీ కెమెరా ►మీడియా టెక్ డైమన్సిటీ 700 5జీ ప్రాసెసర్ ►5,000 ఏంఎంహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ►6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో పాటు 8 జీబీ 128జీబీ చదవండి: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇకపై మరింత సులువుగా..! -
ఐఫోన్‌కు షాక్, సేల్స్ పెరిగిన భారత్‌లో తొలిస్థానం ఆ ఫోన్‌దే!!
భారత్‌లో యాపిల్ ఐఫోన్ సేల్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా గతేడాది క్యూ4 ఫలితాల్లో ఒక్క ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఐఫోన్ 34 శాతం సేల్స్ నమోదయ్యాయి. అయితే ఊహించని విధంగా ఐఫోన్ సేల్స్ జరిగినప్పటకీ.. దేశీయ మార్కెట్లో తొలి ఐదుస్థానాల్లో ఉన్న మిగిలిన స్మార్ట్ ఫోన్లకు సరైన పోటీ ఇవ్వకపోవడం ఆసక్తి కరంగా మారింది కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం..క్యూ4 ఫలితాల్లో భారత్‌లో ఐఫోన్ సేల్స్ షావోమీ, శాంసంగ్, రియల్మీ, వివో, ఒప్పోల స్థానాల్ని అధిగమించలేకపోయింది. అందుకు కారణం ఐఫోన్ ఖరీదు ఎక్కువగా ఉండడటమేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర ఫోన్ తయారీదారులతో పోలిస్తే మార్కెట్ వాటా పరంగా ఐఫోన్ వెనుకబడి ఉండగా.. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, వాటిలో కొన్ని స్మార్ట్ ఫోన్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించినట్లు కొన్ని గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ లో ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ 2021,4వ త్రైమాసికంలో యాపిల్ సుమారు 2.3 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. శాంసంగ్ 7.2 మిలియన్ ఫోన్లను,షావోమీ మొత్తం 9.3 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్‌తో ఆగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇతర ప్రధాన బ్రాండ్లతో పోల్చితే తక్కువ అమ్మకాలు జరిపినప్పటికీ దేశీయంగా క్యూ4 2021లో 2.09 బిలియన్ల ఆదాయాన్ని గడించి ఉండొచ్చని, శాంసంగ్ దాదాపు 2 బిలియన్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పండుగ సీజన్లో కస్టమర్లు ఐఫోన్ 12, ఐఫోన్ 13 సేల్స్ దూకుడు పెంచాయి. గతేడాది డిసెంబర్ నెలలో ఐఫోన్ 12ను రూ.50వేలకు అమ్మడంతో పాటు ఐఫోన్ 13పై క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులు ఐఫోన్లను సొంతం చేసేందుకు ఇంటస్ట్ర్ చూపించారు. ఈ సందర్భంగా.. గత త్రైమాసికంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ సేల్స్‌పై కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ హెడ్ నీల్ షా మాట్లాడుతూ..ఈ సేల్స్ తో భారత్ లో ఐఫోన్ మరో మలుపు తిరిగింది. కోవిడ్‌లోనూ భారతీయులు ప్రీమియం ఫోన్లపై డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టెక్నాలజీతో ముడిపడి ఉన్న ఫోన్లను సొంతం చేసేందుకు కొనుగోలు దారులు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. -
ఇండియన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్, అదిరిపోయే ఫీచర్లతో!
స్మార్ట్ ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ఆయా టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే గడిచిన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో 25శాతం ఉన్న రియల్ మీ ప్రత్యర్ధి కంపెనీల కంటే దూకుడుగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు సాధించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ 'రియల్ మీ 9ఐ'ని మార్కెట్‌కి పరిచయం చేయనుంది. జనవరి 18న రియల్ మీ' ఇండియాలో నిర్వహిస్తున్న ఈవెంట్లో రియల్ మీ 9ఐ ఫోన్ తో పాటు స్పెసిఫికేషన్ల గురించి ప్రకటన చేయనుంది. ఈ వారం వియాత్నంలో జరిగిన ఈవెంట్లో రియల్ మీ సంస్థ 'రియల్ మీ 9ఐ' విడుదల చేసింది. ఈ సందర్భంగా ఫోన్ ధరతో పాటు ఫీచర్లు లీకయ్యాయి. అయితే ఇప్పుడు మనం లీకైన ఆ ఫోన్ స్పెసిఫికేషన్లతో పాటు దాని ధరెంతో తెలుసుకుందాం. రియల్ మీ 9ఐ స్పెసిఫికేషన్స్ రియల్ మీ 9ఐ 90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఎల్సీడీ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ పంచ్హోల్తో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ,పీక్ బ్రైట్ నెస్ 480 నిట్స్, పిక్సెల్ డెన్సిటీ 401పీపీఐ, పంచ్ హోల్‌తో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680, మోడెస్ట్ 4జీ ప్రాసెసర్. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంట్నల్ స్టోరేజ్‌తో పాటు గరిష్టంగా 1టీబీ మైక్రో ఎస్ కార్డ్‌తో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. మెమరీ కార్డ్ కోసం ప్రత్యేక స్లాట్‌ను అందిస్తుంది. రియల్ మీ 9ఐ ఫోన్ వెనుక 50 మెగా ఫిక్సెల్తో మూడు కెమెరాలు, 2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 గాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం యూఎస్బీ-సీ పోర్ట్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లు ఉన్నాయి. భారతదేశంలో రియల్ 9ఐ ఫోన్ ధర వియాత్నంలో రియల్ 9ఐ ఫోన్ ధర రూ.20,500 ఉండగా, భారత్‌లో ఈ వేరియంట్ ఫోన్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫోన్ ధర భారత్‌లో ఎంతుందో తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: డీఎస్ఎల్ఆర్ కెమెరా కాస్ట్ ఎంతైనా..ఫోన్లోని ఈ ఫీచర్ ముందు దిగదుడుపే! -
వైరల్: మరో ఫోన్ పేలింది..నా ఫ్రెండ్ ఫోన్‌కి ఇలా జరిగిందేంటి సార్ అంటూ ట్వీట్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ రియల్ మీకి చెందిన రియల్ మీ ఎక్స్‌టీ ఫోన్ పేలింది. ట్విట్టర్ యూజర్ తన స్నేహితుడి ఫోన్ పేలిందని ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌పై రియల్ మీ యాజమాన్యం స్పందించింది. My friend's phone Realme XT blast in the evening today....@MadhavSheth1 please do something 🙏 pic.twitter.com/CrCnaOKnIK — Sandip Kundu (@SandipK75709658) December 28, 2021 డిసెంబర్ 28న ట్విట్టర్ యూజర్ సందీప్ కుండు తన స్నేహితుడు వారం రోజుల క్రితం కొన్న రియల్ మీ ఫోన్ పేలిందంటూ ట్వీట్ చేశాడు. రియల్ మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ ట్వీట్ కు ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేయడంతో పేలుడు ఘటనపై రియల్‌మి ఇండియా ట్విట్టర్ అఫీషియల్ సపోర్టు అకౌంట్ బాధితుడికి క్షమాపణలు తెలిపింది. అంతేకాదు బాధిత యూజర్ కాంటాక్ట్ వివరాలను పంపాల్సిందిగా కోరింది. కొన్ని గంటల తర్వాత కంపెనీ స్పందిస్తూ.. పేలిన ఫొన్ భాగాలను తీసుకుని దగ్గరలోని అధికారిక రియల్ మి సర్వీసు సెంటర్ కు తీసుకెళ్లాల్సిందిగా సూచించింది. అయితే ఆ ఫోన్ ఎందుకు పేలింది. ఆ ఫోన్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. చదవండి: చిక్కుల్లో యాపిల్..విచారణకు ఆదేశాలు -
స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్..కొత్త ఏడాది ప్రారంభంలోనే లాంచింగ్..అదిరిపోయే డిజైన్లతో!
న్యూ ఇయర్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లు సందడి చేయనున్నాయి. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో న్యూఇయర్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను సరికొత్త హంగులతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. తాగాజా స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ 'వన్ ప్లస్ 10ప్రో' పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవ్వగా..ఆఫోన్కు సంబంధించి ఫీచర్లు లీకయ్యాయి. అంతేకాదు కొత్త ఏడాదిలో ఎప్పుడు మార్కెట్‌కి పరిచయం చేస్తున్నారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు వన్ ప్లస్ ప్రతినిధులు. OnePlus 10 Pro from all angles launching on January 11, 2022 in China.#OnePlus #Oppo pic.twitter.com/FFFWq97ZQ9 — Abhishek Yadav (@yabhishekhd) December 30, 2021 అఫీషియల్‌గా చైనా సోషల్ మీడియా 'వైబో' కథనం ప్రకారం.. వన్‌ప్లస్ అఫీషియల్‌గా జనవరి 11,2022న చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. తొలుత అక్కడ విడుదల చేసిన తరువాత వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనుంది. 'వన్ ప్లస్ 10ప్రో' స్పెసిఫికేషన్లు చైనాలో విడుదలైన వన్ ప్లస్ 10ప్రో వీడియో ప్రకారం.. స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్సెట్ 50ఎంపీ మెయిర్ రేర్ కెమెరా 6.7 కర్వుడ్ ఎల్టీపీఓ 2.0 అమోలెడ్ డిస్ప్లే 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ బ్యాటరీ కెపాసిటీ 5,000ఎంఏహెచ్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ చదవండి: కొత్త ఏడాదిలో ‘స్మార్ట్’గా ఫోన్ల అమ్మకాలు -
ఆండ్రాయిడ్‌కు శాంసంగ్ గుడ్‌బై!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఆండ్రాయిడ్‌కు గుడ్‌బై చెప్పనుందా?. వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌తో మొబైల్స్ తీసుకురానుందా?. అవునని చెబుతూ పలు టెక్ బ్లాగులు కథనాలు వెలువరుస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ తీసేసి ‘ఫుచ్సియా’ (Fuchsia) అని పిలిచే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మొబైల్స్ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఫుచ్సియా కూడా గూగుల్ డెవలప్ చేసిన ఆపరేటింగ్ సిస్టమే కావడం. ఇది ఓపెన్ సోర్స్ ఓఎస్.. అంటే గూగుల్, యాపిల్ ప్లేస్టోర్లాగా మొబైల్ తయారీదారుల నుంచి ఛార్జ్‌లు వసూలు చేయదు. రాబోయే రోజుల్లో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు, ఐఓటీ టెక్నాలజీ ఉపయోగించే విధంగా ఆండ్రాయిడ్ ఓఎస్ ప్లేస్‌లో ఫుచ్చియా వెర్షన్ ను అప్డేట్ చేయనుందని పలు టెక్ బ్లాగ్లు కథనాలు ఇస్తున్నాయి. అయితే.. ఇదంతా సులభం కాదని, అలా కొత్త ఓఎస్ అప్డేట్ చేయాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని మరికొన్ని రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. టెక్ మార్కెట్లో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమెషిన్, ఎడ్జ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, అగుమెంటడ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ వంటి కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఆయా టెక్నాలజీలకు కనెక్ట్ అయ్యే విధంగా ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ యూజర్లు వినియోగిస్తున్న ఆండ్రాయిడ్ ఓఎస్ నుండి ఫుచ్సియా వైపు అడుగులు వేస్తోంది. కానీ, ఇది శాంసంగ్ ఆలోచన కాదని, దీని వెనుక మాస్టర్ మైండ్ గూగుల్ అనేది మరో ప్రచారం నడుస్తోంది. అయితే మార్కెట్లో కాంపిటీటర్ల కంటే ముందుగా ఈ వెర్షన్ అప్డేట్ చేయడం వల్ల శాంసంగ్ పైచేయి సాధించొచ్చు.. లేకపోవచ్చు!. కానీ, కొత్త ఓఎస్ వల్ల యూజర్లు ఇబ్బంది పడితే శాంసంగ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అందుకే ఆండ్రాయిడ్ వెర్షన్‌ను అప్డేట్ చేసే విషయంలో శాంసంగ్ ఆచితూచి అడుగులు వేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: వెబ్ 3.0 అంటే ఏమిటి? వాళ్లకు ఎందుకంత కళ్లమంట? -
నా తమ్ముడి ఫోన్ పేలింది సార్..! ట్వీట్ చేసిన అన్న
China Poco M3 battery explodes in india : చైనాకు చెందిన మరో కంపెనీ స్మార్ట్ ఫోన్ పేలింది. నవంబర్ 3న చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ కు చెందిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ పేలిందంటూ ట్విట్టర్ యూజర్ సుహిత్ శర్మ ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి చెందిన మరో స్మార్ట్ ఫోన్ సంస్థ 'పోకో' కు చెందిన 5జీ ఫోన్ పేలింది. ట్వీట్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 'పోకో' ఈ ఏడాది మనదేశంలో 'పోకో ఎం3' అనే 5జీ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంఛ్ చేసింది. లాంఛ్ సందర్భంగా మహబూబ్‌నగర్ కు చెందిన ఓ యువకుడు ఆఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే తాజాగా (నవంబర్ 27న) ఆ ఫోన్ పేలింది. దీంతో ఫోన్ పేలుడు ఘటనపై బాధితుడి అన్న మహేష్ ట్వీట్ చేశాడు. తన తమ్ముడు వినియోగిస్తున్న ఈ 5జీ ఫోన్ పేలిదంటూ మహేష్ ట్విట్లో పేర్కొన్నాడు. కానీ ఎందుకు పేలింది అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. Hey @geekyranjit look at this. Another blast. This time it's Poco M3.https://t.co/BxdtZcUaj6 pic.twitter.com/DdAP25ZTrf — 𝕊𝕠𝕦𝕣𝕒𝕧 ℍ𝕒𝕥𝕚 (@Souravhati1999) November 27, 2021 మరి కొద్ది సేపటికి మహేష్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే పోకో ఫోన్ పేలింది అంటూ సౌరబ్ హతి అనే ట్విట్టర్ యూజర్ మహేష్ ట్వీట్‌ను షేర్ చేశారు. సౌరబ్ హతి ట్వీట్‌పై పోకో ప్రతినిధులు స్పందించారు. యూజర్ల భద్రతే తమకు ముఖ్యం అంటూ, ఫోన్ పేలడాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటాం' అంటూ రిప్లయి ఇచ్చారు. Hello Sourav, we are sorry to hear this and hope that you are safe. Your safety is our number one priority and we strive to make the highest quality products. Please share the details below and we will look into this on priority. Please refrain from sharing any personal (1/2) — POCO India Support (@POCOSupport) November 27, 2021 మహేష్ షేర్ చేసిన ట్వీట్లో బాధితుడి అన్న చేసిన ట్వీట్ ఆధారంగా పోకో 5జీ ఫోన్ కింది సగభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. కెమెరా మాడ్యుల్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్ పేలడంపై పలు నేషనల్ మీడియా పోకో సంస్థను సంప్రదించింది. దీంతో ఫోన్ పేలుడుకు సంబంధించి పోకో బృందం దర్యాప్తు చేస్తుంది. సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అంతేకాదు పోకో' కి ఇండియన్ యూజర్ల భద్రత చాలాముఖ్యం. ఇలాంటి విషయాల్ని చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటాం. సమస్యను పరిశీలించి కస్టమర్‌కు అండగా నిలుస్తాం అంటూ వివరణ ఇచ్చింది. చదవండి : యువకుడి జీన్స్ ఫ్యాంట్లో స్మార్ట్ ఫోన్ పేలింది..! -
5జీ నెట్వర్క్ అదుర్స్, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న యూజర్లు
న్యూఢిల్లీ: మొబైల్ చందాదార్ల విషయంలో 5జీ టెక్నాలజీ చరిత్ర సృష్టించనుంది. భారత్‌లో 5జీ సబ్స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం మొబైల్ చందాదార్లలో ఇది 39 శాతం వాటా అని టెలికం గేర్ మేకర్ ఎరిక్సన్ వెల్లడించింది. ‘స్మార్ట్‌ఫోన్ వినియోగదార్ల సంఖ్య ఈ ఏడాది డిసెంబర్‌కల్లా 81 కోట్లుగా ఉంటుంది. ఆరేళ్లలో ఇది 120 కోట్లకు ఎగుస్తుందని అంచనా. 4జీ యూజర్లు 79 కోట్ల నుంచి 71 కోట్లకు వచ్చి చేరుతుంది. 4జీ చందాదార్ల వాటా ప్రస్తుతం ఉన్న 68 నుంచి 55 శాతానికి పడిపోతుంది. అంతర్జాతీయంగా మొత్తం చందాదార్లలో 5జీ యూజర్ల సంఖ్య సుమారు 50 శాతానికి చేరుతుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 62 శాతం వాటా వీరిదే. చైనా, ఉత్తర అమెరికా నుంచి అంచనాలను మించి డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2011 నుంచి మొబైల్ డేటా ట్రాఫిక్ 300 రెట్లు అధికమైంది. 2021 చివరినాటికి 200 కోట్లకుపైగా ప్రజలకు 5జీ నెట్వర్క్ చేరువ అవుతుంది. మొత్తం మొబైల్ నెట్వర్క్ డేటా ట్రాఫిక్ 2027 చివరికి 370 ఎక్సాబైట్స్ నమోదు కానుంది’ అని ఎరిక్సన్ తెలిపింది. చదవండి: భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..! -
ఈ ఫీచర్‌తో మీ ఫోన్లో డేటా ఎవరి చేతుల్లోకి వెళుతుందో తెలుసుకోవచ్చు
స్మార్ట్ ఫోన్.. కొందరికి అవసరం.. మరికొందరి వ్యసనం. ఆ వ్యసనాన్ని క్యాష్ చేసుకునేందుకు యాప్స్ వెలుగులోకి వస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని యాప్స్ యూజర్ల అవసరాల్ని తీర్చేలా ఉన్నా..మరికొన్ని మాత్రం అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నాయి. వివిధ మార్గాల ద్వారా యూజర్ల ఫోన్లలో చొరబడుతున్నాయి. ఫ్రీగిఫ్ట్‌లు, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ పేరుతో యూజర్ల ఆశలకు గాలం వేస్తున్నాయి. దీంతో టెక్నాలజీపై అవగాహన లేని యూజర్లు యాప్స్ వలలో చిక్కుకుంటున్నారు. వ్యక్తిగత వివరాల్ని అందిస్తున్నారు. ఆ వివరాల్ని ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి..అలాంటి డేంజర్ యాప్స్‌కు చెక్ పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సూపర్ ఫీచర్‌ను వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆ ఫీచర్ బీటా వెర్షన్లో ఉండగా.. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. 96శాతం యాక్యురేట్ రిజల్ట్ సెర్చ్ ఇంజిన్ "డక్ డక్ గో" త్వరలో ఫీచర్‌ను విడుదల చేయనుంది. ' యాప్ ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఫర్ ఆండ్రాయిడ్' పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ మీ స్మార్ట్ ఫోన్లో మీకు తెలియకుండా ఏమైనా యాప్స్, సోషల్ మీడియా నెట్ వర్క్‌లు ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర్ సెర్చ్ ఇంజిన్ సంస్థలు ఏం చేస్తున్నాయో ఇట్టే కనిపెట్టేస్తుంది. మీ ఫోన్లో ఆ యాప్స్‌ను వినియోగించకపోయినా నిరంతరం ట్రాక్ చేస్తుంది. ఇటీవల డక్ డక్ గో' కొన్ని యాప్స్‌ను ట్రాకింగ్ చేసింది. ట్రాకింగ్‌లో థర్డ్ యాప్స్ నిర్వాహకులు 87 శాతం డేటాను గూగుల్‌కి , 68శాతం డేటా ఫేస్‌బుక్‌కు పంపించినట్లు గుర్తించింది. యాపిల్ సైతం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ యాప్స్ మన డేటా కలెక్ట్ చేస్తున్నాయా? లేదా అనే విషయాల్ని వెలుగులోకి తెచ్చేందుకు ఎలాంటి యాప్స్ అందుబాటులోకి రాలేదు. అదే సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు సంబంధించిన గాడ్జెట్స్‌ను థర్డ్ పార్టీ యాప్స్ ట్రాక్ చేయొచ్చా' అనే అంశంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్లు ఒప్పుకుంటేనే థర్డ్ పార్టీ యాప్స్ ట్రాక్ చేస్తాయి. అయితే యాపిల్ ఫీచర్‌పై యూజర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది థర్డ్ పార్టీ యాప్స్ వద్దు' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. చదవండి: పాపం జుకర్ బెర్గ్: వేల కోట్ల నష్టం..పేరు మార్చినా..! జాతకం మారలేదు..! -
అదిరే ఫీచర్లతో 5జీ ఫోన్, చేతులు కలిపిన జియో - షావోమీ
Xiaomi partnership with Jio for 5G phone: ఇండియన్ మార్కెట్లో సత్తా చాటుతున్న చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్ కోసం రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల విడుదలైన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో షావోమీ సంస్థ 22 శాతం షిప్‌మెంట్‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఆ స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వరుసగా 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. నవంబర్ 30న షావోమీ రెడ్ మీ నోట్ 11 సిరీస్‌ను రీబ్రాండ్ చేస్తూ..భారత్‌లో రెడ్ మీ నోట్ 11 టీ 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫోన్ విడుదల నేపథ్యంలో..ఆ ఫోన్ పనితీరును గుర్తించేందుకు షావోమీ..,జియోతో చేతులు కలిపింది. రెడ్ మీ నోట్ 11టీ 5తో పాటు భవిష్యత్‌లో విడుదల కానున్న రెడ్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ల పనితీరు, యూజర్ ఫ్రెండ్లీగా ఉందా' అనే విషయాల్ని గుర్తించేందుకు రిలయన్స్ జియో ఆధ్వర్యంలో 5జీ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. వివిధ సెన్సార్ల ద్వారా ట్రయల్స్ నిర్వహించి 5జీ యూజర్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే అంశాన్ని గుర్తిస్తారు. రెడ్మీ నోట్ 11టీ ఫీచర్లు రెడ్ మీ నోట్ 11తరహాలో రెడ్ మీ నోట్ 11టీ మీడియా టెక్ డైమెన్సిటీ 810తో అందుబాటులో ఉంది. రియల్ మీ 8ఎస్ కాన్ఫిగరేషన్ల లాగే 6జీబీ ర్యామ్ 128జీబీ, 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఎంట్రీ లెవల్ కాన్ఫిగరేషన్ లలో వస్తున్న ఫోన్ ధర రూ. 17,999 ఉండగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్లపై షావోమీ సంస్థ స్పందిస్తూ.. రెడ్మీ నోట్ 11 రీ బాండ్రే ఈ రెడ్మీ నోట్ 11టీ స్మార్ట్ ఫోన్ అని తెలిపింది. కానీ ఇది స్విఫ్ట్డిస్ప్లే, స్పీడ్ ఛార్జింగ్, ర్యామ్ బూస్టర్ వంటి ఫీచర్లు ఉన్న నెక్ట్స్ జెనరేషన్ రేసర్ ఫోన్ అని తెలిపింది. చదవండి: షావోమీ మరో సంచలనం, మాట్లాడేందుకు కళ్ల జోడు తెస్తోంది -
ప్రపంచంలోనే ఇదే తొలి స్మార్ట్ ఫోన్.. 18 జీబీ ర్యామ్.. వన్ టెరాబైట్ స్టోరేజీ
Axon 30. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్ 18జీబీ ర్యామ్ 1టెరాబైట్ ఇంటర్నల్ స్టోరేజ్ విడుదల కానుంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ జెడ్‌టీఈ సంస్థ జెడ్‌టీఈ ఆక్సాన్ 30 సిరీస్ ఫోన్ లను నవంబర్ 25న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ విడుదల కోసం వినియోగదారులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఈ ఫోన్ ఐ అండ్ ఫీచర్లతో విడుదల కావడమే. జెడ్‌టీఈ ఆక్సాన్ 30 సిరీస్ ఫీచర్లు చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వైబో(Weibo) కథనం ప్రకారం..ప్రపంచంలోనే తొలిసారి జెడ్‌టీఈ సంస్థ 18జీబీ ర్యామ్, 1టెరా బైట్ ఇంటర్నల్ స్టోరేజ్ తో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ ఫోన్‌ను 2జీబీ నుంచి 18జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీంతో పాటు టాప్ నాచ్ కాన్ఫిగరేషన్ ఫీచర్ల ఉన్నాయని వైబో తన పోస్ట్‌లో పేర్కొంది. ఆక్సాన్ 30 అల్ట్రా స్పేస్ ఎడిషన్ తక్కువ పరిమాణంతో (quantity) అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఫోన్ ధర ఇంకా వెల్లడించలేదు, లాంచ్ సమయంలో మాత్రమే తెలుస్తుంది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే,1080 x 2400 హెచ్డీ పిక్సెల్స్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ని కలిగి ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888,ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎస్ఎస్ 3.1 స్టోరేజ్, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు,వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ స్నాపర్‌ను ప్యాక్, 66డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 4,600ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 120-డిగ్రీల ఎఫ్ఓవీతో 64 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ వంటి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్ ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా.. ధర ఎంత అనేది జెడ్‌టీఈ సంస్థ స్పష్టం చేయలేదు. -
మీ ఫోన్లో ఈ కీబోర్డ్ వాడుతున్నారా? వెంటనే డిలీట్ చేయండి..లేదంటే
మీ ఫోన్లో ఈ కీబోర్డ్ వాడుతున్నారా? అయితే వెంటనే ఆ కీబోర్డ్ యాప్‌ను తొలగించండి. లేదంటే జేబుకు చిల్లు పడినట్లేనని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ కీబోర్డ్ యాప్‌తో పాటు 'ట్రోజన్' జోకర్ అనే మాల్వేర్తో సైబర్ దాడులు చేస్తున్న మరికొన్ని యాప్స్‌ను గూగుల్ బ్యాన్ చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎవరైనా ఆ యాప్స్‌ను వినియోగిస్తుంటే వెంటనే డిలీట్ చేయాలని కోరింది. ప్రముఖ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై కథనం ప్రకారం.. ఇటీవల గూగుల్' ప్లే స్టోర్‌లో ఉన్న ఏడు యాప్‌లలో మాల్వేర్ ఉన్నట్లు గుర్తించింది. వెంటనే వాటిని తొలగించింది. ఈ సందర్భంగా క్యాస్పర్ స్కై అనలిస్ట్ టట్యానా షిష్కోవా మాట్లాడుతూ..ఆ ఏడు యాప్స్‌లలో జోకర్ మాల్వేర్ ఉన్నట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. ఇటీవల, సైబర్ నేరస్తులు స్క్విడ్ గేమ్ యూజర్లను యాప్‌ల సాయంతో దాడులకు పాల్పడుతున్నారు. దీంతో గూగుల్..ప్లే స్టోర్‌లో ఉన్న ఆ యాప్‌లను తొలగించింది. అయినా మిలియన్ల మంది ఆ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో .. గూగుల్' ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్‌పై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో కింది పేర్కొన్న యాప్స్‌ను గూగుల్ డిలీట్ చేసింది. 1. Now QRcode Scan (Over 10,000 installs) 2. EmojiOne Keyboard (Over 50,000 installs) 3. Battery Charging Animations Battery Wallpaper (Over 1,000 installs) 4. Dazzling Keyboard (Over 10 installs) 5. Volume Booster Louder Sound Equalizer (Over 100 installs) 6. Super Hero-Effect (Over 5,000 installs) 7. Classic Emoji Keyboard (Over 5,000 installs) దాడులు పెరిగిపోతున్నాయ్ కరోనా కారణంగా సైబర్ నేరస్తులు అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆఫర్ల పేరుతో ఫేక్ యాప్‌లను క్రియేట్ చేస్తున్నారు. వాటి సాయంతో మాల్వేర్ను ఫోన్లలోకి పంపి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నారు. ఆ డేటాను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అదీ చాలదన్నట్లు ఇటీవల స్క్వీడ్ గేమ్ హవా కొనసాగుతుండడంతో సైబర్ నేరస్తులు కొత్త పంథాని అనుసరిస్తున్నారు. స్క్వీడ్ గేమ్ వెబ్ సిరీస్ యాప్స్‌తో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తున్నారు. అయితే ఇలాంటి యాప్స్ పట్లు యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డిలీట్ చేయాలని క్యాస్పర్కై అనలిస్ట్ టట్యానా షిష్కోవా సూచించారు. -
మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు సూపర్, ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ఆయా టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో 25శాతం ఉన్న రియల్ మీ ప్రత్యర్ధి కంపెనీల కంటే దూకుడుగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు సాధించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ 'రియల్ మీ క్యూ3టీ'ని మార్కెట్‌కి పరిచయం చేసింది. త్వరలో ఇండియాలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రియల్ మీ క్యూ3టీ ఫీచర్లు మార్కెట్లో విడుదలైన రియల్ మీ క్యూ3టీ సిరీస్ ఫోన్లు హ్యాండ్సెట్ నెబ్యులా, నైట్ స్కై బ్లూ కలర్స్‌తో అందుబాటులోకి రానుంది. 6.6 అంగుళాల పొడవు, పూర్తి హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ,(1,080x2,412 పిక్సెల్‌లు) 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. ఆండ్రాయి11 వెర్షన్ కు సపోర్ట్ చేస్తున్న ఈఫోన్లోతాజా క్యూ3 సిరీస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు, వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను అందిస్తుంది. 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదలైంది. రియల్ మీ క్యూ3టీ ధర 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ ధర చైనాలో సీఎన్‌వై2,099 (భారత కరెన్సీలో దాదాపూ రూ. 24,300)గా నిర్ణయించబడింది. నైట్ బ్లూ,నైట్ స్కై బ్లూ కలర్స్‌తో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. కాగా, ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో విడుదల చేయాలని రియల్ మీ ప్రతినిధులు భావిస్తున్నారు. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..! -
అమ్మకాల్లో దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..!
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ స్మార్ట్‌ఫోన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2021 మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో వీటి వాటా 22 శాతంగా నమోదైంది. కన్సల్టెన్సీ సంస్థ సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) రూపొందించిన ఇండియా మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ సమీక్ష నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మూడో త్రైమాసికంలో 20 పైగా 5జీ సామర్థ్యాలున్న స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీలు ఆవిష్కరించాయి. అందుబాటు ధర, లభ్యత తదితర అంశాలు 5జీ విక్రయాలకు దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. వన్‌ప్లస్, ఒప్పో, రియల్మీ, శాంసంగ్, వివో వంటి దిగ్గజ బ్రాండ్లు 5జీ స్మార్ట్ఫోన్లకు ప్రాధాన్యమిస్తుండటం, వినియోగదారులు కూడా భవిష్యత్ అవసరాల కోసం వీటి వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త తరం ఫోన్లకు డిమాండ్ పెరుగుతోందని సీఎంఆర్ అనలిస్ట్ శిప్రా సిన్హా తెలిపారు. ఈ అయిదు బ్రాండ్లు కలిసి 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో 3 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే స్మార్ట్ఫోన్లను విక్రయించినట్లు వివరించారు. వివో టాప్.. 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో 18 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్రస్థానంలో ఉండగా, 16 శాతం వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. సరఫరాపరమైన సమస్యలు, విడిభాగాలు.. లాజిస్టిక్స్ వ్యయాల భారం మొదలైన సవాళ్లు నాలుగో త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉందని సీఎంఆర్ తెలిపింది. ఏడాది మొత్తం మీద చూస్తే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 5–8 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు డిజిటల్‌కు మారే క్రమంలో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ కొనసాగుతుందని వివరించింది. మరిన్ని ముఖ్యాంశాలు .. సరఫరాపరమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో మూడో త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 47 శాతం పెరిగాయి. సుమారు 5 కోట్ల పైగా అమ్ముడయ్యాయి. షావోమీ 23 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్ (18 శాతం), వివో (15 శాతం), రియల్‌మి (15 శాతం), ఒప్పో (9 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వన్‌ప్లస్ విక్రయాలు 68 శాతం, యాపిల్ అమ్మకాలు 32 శాతం పెరిగాయి. సూపర్ ప్రీమియం (రూ. 50,000–1,00,000) సెగ్మెంట్లో యాపిల్ 84 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ట్రాన్సిషన్ గ్రూప్ బ్రాండ్ల (ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో) మొత్తం అమ్మకాలు 18 శాతం, స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 36 శాతం పెరిగాయి. ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ విక్రయాలు 21 శాతం క్షీణించి 2.4 కోట్లకు పరిమితమయ్యాయి. చదవండి: అదిరిపోయే ఫీచర్స్, 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇంత తక్కువ..! -
యువకుడి జీన్స్ ఫ్యాంట్లో స్మార్ట్ ఫోన్.. టపాసుల్లా పేలింది..!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం 'వన్‌ప్లస్' కు చెందిన ఛార్జర్లు, ఫోన్లు టపాసుల్లా పేలుతున్నాయి. ఇప్పటికే పలువురు వన్ ప్లస్‌కు చెందిన తమ ఫోన్లు బ్లాస్ట్ అయ్యాయని, తగిన న్యాయం చేయాలని కోరుతూ కోర్ట్ మెట్లెక్కిన విషయం తెలిసిందే. తాజాగా మరో వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుడి జీన్స్ ఫ్యాంట్ జేబులో ఉన్న వన్ ప్లస్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Hi Suhit. Please connect with us over DM so we can look into your claim. https://t.co/Y6rHuMwu8J — OnePlus Support (@OnePlus_Support) November 3, 2021 నవంబర్ 3న ట్విట్టర్ యూజర్ సుహిత్ శర్మ(suhit sharama) అనే యూజర్ వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ నార్డ్ 2 బ్లాస్ట్ అయ్యిందంటూ తీవ్రంగా గాయపడ్డ కొన్ని ఫోటోల్ని ట్వీట్ చేశారు. అంతేకాదు @OnePlus_IN మీ నుండి ఇది ఎప్పుడూ ఊహించలేదు. #OnePlusNord2Blast మీ ఫోన్ ఏం చేసిందో చూడండి అంటూ జీన్స్ ఫ్యాంట్లో ఫోన్ పేలిన ఇమేజెస్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈఘటనలో వన్ ప్లస్ యాజమాన్యం తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మానేయండి. త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. సుహిత్ శర్మ ట్వీట్లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంత మంది యూజర్లు ఇప్పుడే తాము వన్ ప్లస్‌కు చెందిన ఫోన్లను బుక్ చేసుకున్నాం. వాటిని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తామని రీట్వీట్లు పెడుతున్నారు. Just order today now going to cancel Shame @OnePlus_IN pic.twitter.com/JDvdVVuAdK — KJ (@KJ_P00) November 8, 2021 అయితే ఆ ట్వీట్లపై ఇండియా వన్ ప్లస్ యాజమాన్యం స్పందించింది. ఇలాంటి సమస్య ఎదుర్కొన్నందుకు క్షమించండి. బాధితుడికి అండగా ఉంటాం.డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. పరిశీలించి, తగిన సాయం చేస్తాం' అంటూ ట్వీట్ చేసింది. Hi Akshay! We are sorry you had such an issue. We strive to provide the best experience for you, please initiate a direct message so that we can check and assist you further. https://t.co/Y6rHuMwu8J — OnePlus Support (@OnePlus_Support) November 8, 2021 చదవండి: బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్ -
జియో ఫోన్ అమ్మకాలు ప్రారంభం, ఎలా కొనాలో తెలుసా..?
జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఫోన్ కొనుగోలు కోసం స్టోర్ కు వెళ్లేముందే వాట్సాప్, లేదంటే కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనే సౌకర్యం లేదని జియో ప్రతినిధులు తెలిపారు. రిజిస్ట్రేషన్ పక్కా జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు కోసం ముందుగా 70182 70182కు హాయ్ మెసేజ్ పెట్టాలి. అనంతరం అదే నెంబర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా వినియోగదారులు తమ లొకేషన్ ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత స్టోర్‌కు వెళ్లి జియో ఫోన్ నెక్ట్స్ కొనుక్కోవచ్చంటూ వినియోగదారులకు మెసేజ్ వెళుతుంది. అలా మెసేజ్ వస్తే స్టోర్‌లో జియో ఫోన్నెక్ట్స్ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే ఫోన్ ధర రూ.6,499 ఉండగా.. ఫోన్ కొనుగోలు కోసం ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ కింద రూ.1,999, రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 30వేల ఔట్లెట్లు జియో ఫోన్ కొనుగోలు కోసం రిలయన్స్ దేశ వ్యాప్తంగా 30,000కు పైగా రిటైల్ అవుట్ లెట్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా కొనుగోలు దారులు ఈ ఫోన్‌ను ఔట్లెట్లలో సొంతం చేసుకోవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు ♦ డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) ♦ స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ♦ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ♦ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు ♦ బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ♦ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ ♦ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ ♦ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) ♦ సిమ్ పరిమాణం: నానో ♦ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం ♦ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ చదవండి: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..! ఫోన్ ధర ఎంతంటే..! -
'జియో ఫోన్ నెక్ట్స్' కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్ ఇదే..!
బడ్జెట్ ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్'పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే దివాళీ సందర్భంగా విడుదల కానున్న జియో ఫోన్ ధర, ఫీచర్ల గురించి జియో సంస్థ స్పష్టత ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. అందుకు కారణం..దేశంలోనే అతితక్కువ ధరకే ఫోన్ అందిస్తామన్న జియో.. ఆ ఫోన్ ధరను రూ.6,499గా నిర్ణయించింది. ఈ ఫోన్ కంటే గతంలో విడుదలైన బడ్జెట్ ఫోన్లలో ఫీచర్లు ఎక్కువగా ఉండటమే కాదు ధర సైతం రూ.1500 తక్కువగా ఉందని చర్చించుకుంటున్నారు. చిప్సెట్ ఎఫెక్ట్ పెరుగుతున్న తయారీ, కాంపోనెంట్ ఖర్చుల కారణంగా జియో ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.6,4999 ఉండగా.. ఈ ఫోన్ కంటే ధర తక్కువగా మనదేశంలో మరో ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం 01 ఉందని గుర్తు చేస్తున్నారు. జియో ఫోన్ నెక్ట్స్ కంటే తక్కువ ధర ఉన్న ఫోన్ ఇదే రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్‌కార్ట్ లలో జియో ఫోన్ నెక్ట్స్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎం 01 కంటే తక్కువకే అమ్ముతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ, జియో ఫోన్ నెక్ట్స్ లో ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే శాంసంగ్ ఫోన్ ధర తక్కువ ప్రారంభ ధర రూ.4,999కే విక్రయిస్తుంది. జియో ఫోన్ కంటే రూ.1,500 తక్కువకే వస్తుంది. జియో ఫోన్ నెక్ట్స్ వర్సెస్ శాంసంగ్ గెలాక్సీ గెలాక్సీ ఎం 01 రెండు వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎం 01 బేసిక్ వెర్షన్ 1జీబీ ర్యామ్ ప్లస్ 16జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇక దీని ధర ఫ్లిప్ కార్ట్‌లో రూ. 4,999, రిలయన్స్ డిజిటల్లో రూ.5,199కి అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఫోన్ ధర రిలయన్స్ డిజిటల్లో రూ. 6,199 గా ఉంది. ఈ రెండు వేరియంట్లు జియో ఫోన్ కంటే తక్కువగా ఉండటం గమనార్హం. చదవండి: ఆనందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉక్కిరి బిక్కిరి..ఎందుకంటే -
ఏపీలో తయారవుతున్న జియో నెక్ట్స్ ఫోన్లు.. ఎక్కడంటే?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నుంచి జియో నెక్ట్స్ ఫోన్ ప్రకటన వెలువడినప్పటి నుంచి దేశమంతటా ఆసక్తి నెలకొంది. ఈ చౌకైన అధునాతన ఫోన్ చేజిక్కించుకునేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫోన్‌ను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో తయారు చేస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన నియోలింక్ ప్లాంట్లలో ఇవి తయారుకానున్నాయి. సూపర్ ఫీచర్స్ మన దేశ అవసరాలు, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఈ ఫోన్లో ఫీచర్లు పొందు పరిచారు. ముఖ్యంగా పది భాషలను అనువదించే ఫీచర్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులోని రీడ్ అలౌడ్ ఫంక్షన్ స్క్రీన్‌పై తెరిచిన యాప్‌లో ఉన్న కంటెంట్‌ను బిగ్గరగా చదువుతుంది. వాయిస్ అసిస్టెంట్‌తో ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇంటర్నెట్ నుంచి కావాల్సిన సమాచారం పొందవచ్చు. సాఫ్ట్వేర్ దానంతట అదే అప్డేట్ అవుతుందని కంపెనీ తెలిపింది. హై క్వాలిటీ ధర తక్కువైనా క్వాలిటీ విషయంలో రిలయన్స్ కాంప్రమైజ్ కావడం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ ప్రాసెసర్‌ను పొందుపరిచారు. జియోఫోన్ నెక్ట్స్ కోసం ఆన్‌డ్రాయిడ్ ఆధారిత అత్యాధునిక ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్‌తో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ దీపావళి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. -
వారెవ్వా జియో..! అదిరిపోయే ఫీచర్లతో పాటు మరో సూపర్ అప్డేట్..!
దీపావళికి విడుల కానున్న ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ కోసం దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌పై మరో సూపర్ అప్ డేట్ వచ్చింది. జియో ఫోన్లో భారతీయత ఉట్టిపడేలా 'ఆపరేటింగ్ సిస్టం'కు ట్రెడిషనల్ పేరు పెట్టి జియో అధినేత ముఖేష్ అంబానీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఫోన్లో ఫీచర్లు, ఓఎస్ గురించి జియో అధికారికంగా ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్‌కి ఎదురే లేదు. యాపిల్ నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానం చెక్కు చెదరడం లేదు. ఆండ్రాయిడ్‌కి పోటీగా హువావే, శామ్సంగ్, వన్‌ప్లస్‌లు కొత్త ఓఎస్‌లు అభివృద్ధి చేసినా ఆండ్రాయిడ్ ముందు నిలవలేకపోయాయి. తాజాగా గూగుల్ అక్టోబర్ 4 సరికొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 12 రిలీజ్ చేసింది. దివాళీకి విడుదల కానున్న జియోలో ఈ లేటెస్ట్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు తొలిసారి ఆండ్రాయిడ్ 1.0 వెర్షన్ సెప్టెంబర్ 23,2008 లో విడుదలైంది. అలా నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లకు 31 రకాల పేర్లు ఉన్నాయి. వాటిలో స్నో కోన్, రెడ్ వెల్వెట్ కేక్,క్విన్స్ టార్ట్, ఓట్ మీల్ కుకీ ఇలా వెస్ట్రన్ పేర్లున్నాయి. కానీ మనదేశ సాంప్రదాయానికి అనుగుణంగా ఏ ఒక్క ఆండ్రాయి వెర్షన్లకు పేర్లు పెట్టలేదు. కానీ తొలిసారి జియో ఫోన్ నెక్ట్స్‌లో తొలిసారి ఓఎస్‌కు 'ప్రగతి ఓఎస్'గా నామకరణం చేశారు. జియో ఫోన్‌ను అందరూ వినియోగించి,ప్రగతి (ప్రొగ్రెస్) సాధించాలని ఉద్దేశంతో ప్రగతి పేరు పెట్టినట్లు జియో తెలిపింది. ఈ ఫోన్ కనెక్టివిటీ సమస్య లేకుండా ఉండేందుకు క్వాల్కమ్ ప్రాసెసర్, వాయిస్ అసిస్టెంట్స్, టాన్స్ లేట్, ఈజీ అండ్ స్మార్ట్ కెమెరా, ఆటోమెటిక్ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్, జియో - గూగుల్ యాప్స్ ప్రీలోడెడ్ ఫీచర్లు ఉన్నాయి. చదవండి: జియో ఫోన్ సేల్స్ కోసం అదిరిపోయే బిజినెస్ మోడల్ -
స్మార్ట్‌ఫోన్..ఇండియన్స్ వాడకం మామూలుగా లేదుగా..!
కరోనా కారణంగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సెల్‌భూతం యువతను పట్టిపీడిస్తోంది. చేతిలో పెద్ద అణుబాంబుగా తయారైంది. అవసరం లేకపోయినా సెల్ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడటం..గంటల తరబడి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్‌లో చాటింగ్స్ చేయడం...రాత్రంతా ఫోన్‌ను పక్కన పెట్టుకుని యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నారు. దీంతో ఎక్కువ సేపు మొబైల్‌తో పాటు యాప్స్‌ను వినియోగిస్తున్న ప్రపంచ దేశాల సరసన భారత్ చేరింది. ఇటీవల మొబైల్ రీసెర్చ్ సంస్థ 'అన్నీ యాప్' (Annie app)ఇంటర్నెట్లో ప్రపంచ దేశాల ప్రజలతో పాటు భారతీయులు ఎంత సేపు యాప్స్‌పై గడుపుతున్నారనే అంశంపై స్టడీ చేసింది. ఈ స్టడీలో భారతీయులు యాప్స్‌లలో ప్రతీరోజూ 4.8గంటలు గడిపేస్తున్నట్లు తేలింది. ఏఏ దేశాలున్నాయి సంస్థ అన్నీ యాప్ నిర్వహించిన స్టడీలో..యాప్స్ ఎక్కువ వినియోగిస్తున్న దేశాల్లో ఇండోనేషియా(5.5గంటలు), బ్రెజిల్ (5.4గంటలు),సౌత్ కొరియా(5.0గంటలు), ఇండియన్స్ (4.8గంటలు) తొలి స్థానాల్లో ఉండగా.. జపాన్, కెనడా,యూఎస్,రష్యా,టర్కీ, యూకే దేశాల్లో ఉన్నాయి. ఏ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు వరల్డ్ వైడ్‌గా ఎక్కువగా టిక్ టాక్‌ను వినియోగిస్తున్నట్లు తేలింది. ఒక్క సెప్టెంబర్ నెలలో వన్ బిలియన్ మంది యూజర్లు టిక్ టాక్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్ టాక్ తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, జూమ్ యాప్స్ వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి జూన్ వరకు పై యాప్స్‌ను వినియోగించగా.. జులై నుంచి ఎక్కువ మంది సోషల్ మీడియాలో గడుపుతున్నట్లు తేలింది. సెల్ ఫోన్లు మోగుతున్నాయి... టీవీలు మూగబోతున్నాయి ఇక సర్వేలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే దశాబ్ధం క్రితం ప్రజలు ప్రతిరోజు 3 గంటల పాటు టీవీలకు అతుక్కుపోతుంటే ఇప్పుడు ఆ సమయం తగ్గి 2.5గంటలకు చేరింది. ఇక ఫోన్ యూజర్ల కోసం ఊబర్, ఓలా,స్విగ్గీ,జొమోటా, అర్బన్ కంపెనీలు రీజీనల్ కంటెంట్‌తో అట్రాక్ట్ చేస్తున్నాయి. అర్బన్ ఏరియాల్లో సైతం ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం తప్పని సరైంది. మహమ్మారి కారణంగా టెక్నాలజీ వినియోగం పెరిగిరింది. ముఖ్యంగా లాక్ డౌన్ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్,హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫాంల అవసరం ఎలా ఉందో తెలిసొచ్చింది. దీంతో యాప్స్ వినియోగం భారీగా పెరిగిపోతున్నట్లు అన్నీ యాప్ అభిప్రాయం వ్యక్తం చేసింది. లెక్కలు ఏం చెబుతున్నాయి స్టాటిస్టా లెక్కల ప్రకారం.. 2020లో మనదేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 749 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. అందులో 744మిలియన్ల మంది ఇంటర్నెట్ను సెల్‌ఫోన్ నుంచి వినియోగిస్తున్నారు. 2040 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 1.5 బిలియన్లకు చేరనున్నట్లు స్టాటిస్టా తన రిపోర్ట్‌లో వెల్లడించింది. -
మార్కెట్లో అదిరిపోయే ఫీచర్స్‌తో బడ్జెట్ ఫోన్..ఓ లుక్కేయండి!
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో 'వై3ఎస్' పేరుతో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ మిగిలిన బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వివో వై3ఎస్ ఫీచర్లు, ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.10వేలు, అంతకాన్న ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్ల లో వివో వై3ఎస్ నిలిచింది. రూ.9,490 ఉన్న ఈ ఫోన్లో 6.51 అంగుళాల హెచ్డీ 1600*720 పిక్సెల్స్‌తో ఎల్సీడీ డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 గ్రో ఎడిషన్ + ఫన్‌టచ్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటే, సెల్ఫీ కెమెరాకు వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ కూడా ఉంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉన్న ఈ ఫోన్ 19 గంటల పాటు ఆన్లైన్ హెచ్డీ మూవీ చూడొచ్చని, 8 గంటలు గేమ్స్ ఆడొచ్చని కంపెనీ చెబుతోంది. వీటితో పాటు ఫేస్ అన్‌లాక్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ 2.0 పోర్ట్, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్ స్టారీ బ్లూ, మింట్ గ్రీన్, పెరల్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉందని వివో ప్రతినిధులు తెలిపారు. ఒక్కవేరియంట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో 2జీబీ ర్యామ్ అండ్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, పేటీఎం, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్, ఇతర రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. మూడు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. చదవండి: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్: సొంత చిప్‌తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే.. -
జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి
కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన గణాంకాల ప్రకారం..కోవిడ్-19 వల్ల 600 శాతం సైబర్ క్రైమ్ పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మాల్వేర్ల సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా హైబ్రిడ్ దాడులకు పాల్పడేందుకు ప్రత్యేకంగా మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. అందులోనూ మనం తరుచూ వినియోగించే స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడులు పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. వైరస్ దాడుల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి? సైబర్ నేరస్తులు స్మార్ట్ ఫోన్లు, లేదంటే ఐఫోన్లపై ప్రత్యేకంగా తయారు చేసిన వైరస్‌లను మెయిల్స్ సాయంతో లేదంటే ఆఫర్లు ఇస్తామంటూ పాప్ ఆప్ యాడ్స్‌ను ఫోన్‌కి సెండ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఫోన్ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏదైనా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిదా? లేదంటే దాడులకు పాల్పడే అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. అందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో సంబంధిత యాప్ వివరాలు, రివ్యూలు చెక్ చేయాలి. వైరస్ దాడి చేసినట్లు ఎలా గుర్తించాలి? ♦మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌లను గుర్తించే సులభమైన మార్గం ఇదే. మీరు ఒకవేళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే..వెంటనే కట్ అవ్వడం, మీ స్మార్ట్‌ఫోన్‌కు గుర్తు తెలియని టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రావడం, మీ అనుమతి లేకుండా యాప్స్‌ను కొనుగోలు చేయడం. ♦ కంటిన్యూగా మీ ఫోన్ కు యాడ్స్ వస్తున్నా యాడ్ వేర్ మీ ఫోన్‌ను అటాక్ చేసినట్లు గుర్తించాలి. ♦ మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించి స్పామ్ టెక్స్ట్ మెసేజ్‌లను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి సెండ్ చేస్తుంటాయి. దీని అర్ధం మీ కాంటాక్ట్ ఫోల్డర్లోకి గుర్తు తెలియని వైరస్ దాడి చేసినట్లు గుర్తించాలి. ♦ మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ♦వైరస్లు, మాల్వేర్లు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త యాప్‌లను కూడా డౌన్లోడ్ చేస్తుంటాయి. ♦ ఈ యాప్‌లు, మెసేజ్‌ల వల్ల మీ డేటా అంతా అయిపోయింది. ♦ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంటాయి. పై తరహా ఇబ్బందులు ఎదురవుతుంటే మీ ఫోన్లో వైరస్ దాడి చేసినట్లేనని గుర్తించాలి. ఒకవేళ అదే జరిగితే మీ ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా కాపీ చేసుకొని..వైరస్ తొలగించే ప్రయత్నం చేయండి. ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండండి. చదవండి: మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్ -
మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌సేల్ ముగియగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతుంది.అయితే ఈ సేల్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆయా టెక్ సంస్థలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా భారత్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో బడ్జెట్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. వివో వై20టీ ఫీచర్లు 'వివో వై20టీ' సిరీస్‌లో విడుదలైన ఈ ఫోన్లో సూపర్ ఫీచర్లు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 6.51 అంగుళాల 720పీ హెచ్డీ క్వాలిటీతో పాటు సెక్యూర్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 చిప్ సెట్, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, ర్యామ్‌ను ఎక్స్టెండ్ చేసుకుందుకు ర్యామ్ 2.0 ఫీచర్, 1జీబీ వర్చువల్ మెమెరీ, గేమ్‌లతో పాటు ఇతర మల్టీ టాస్కింగ్ వర్క్ పర్పస్ కోసం 7జీబీ మెమెరీ అందుబాటులో ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 13ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ బొకేహ్ కెమెరా, కెమెరాకు అతి దగ్గరలో (4 సెంటీ మీటర్లు) ఉన్న ఫోటోలు తీసేందుకు సూపర్ మ్యాక్రో కెమెరా, Aura స్క్రీన్ లైట్ అండ్ పోట్రేట్ మోడ్ సాఫ్ట్వేర్ ఫీచర్ మోడ్‌లో 8ఎంపీ సెల్ఫీ షూటర్ సదుపాయం ఉంది. వివో వై20 టీ ధర ఎంతంటే భారత్‌లో విడుదలైన వివో వై20 టీ ఫోన్ ప్యూరిస్ట్ బ్లూ,అబ్సిడియన్ బ్లాక్ కలర్స్‌లో లభ్యమవుతున్న 6జీబీ/ 128 జీబీ ర్యామ్ స్టోర్ వేరియంట్ ధర రూ.15,490 ఉంది. ఈ ఫోన్ ను బజాజ్ ఫిన్ సర్వ్‌లో 12నెలలు పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో సొంతం చేసుకోవచ్చు. వివో ఈ-స్టోర్‌లో కొనుగోలు దారులకు రూ.500 క్యాష్ బ్యాక్‌తో పాటు అమెజాన్, పేటీఎం, టాటా క్లిక్ స్టోర్లలో 6నెలల పాటు నో కాస్ట్ ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు వివో అధికారికంగా ప్రకటించింది. చదవండి: ఈ ల్యాప్ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా.. -
మరో 5జీ ఫోన్ సూపర్ ఫీచర్లు లీక్, ధర ఎంతంటే?
ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల కానున్న మరో అఫార్డ్బుల్ 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం లీకైన ఈ ఫోన్ ఫీచర్స్, ధరలు ఇలా ఉన్నాయి. లీకైన ఫీచర్లు ప్రస్తుతం లీకైన శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్ స్మార్ట్‌ఫోన్ 6.48 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీతో విడుదల కానుంది. ట్రిపుల్ కెమెరా సెటప్, 50ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, 5ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, వాటర్-డ్రాప్ నాచ్ ను కలిగి ఉంది. ఆన్‌లీక్స్ ప్రకారం.. లీకైన ఫోన్ 83.4 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నట్లు తెలుస్తోంది. ధర ఎంతంటే? వీటితో పాటు ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. గెలాక్సీ ఏ13 5జీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ బాక్స్ లోపల 15W ఛార్జింగ్ ఫ్యాక్‌తో రానుంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇక ఈ ఫోన్ ధర యూఎస్, కెనడాలలో 18,800ఉండగా ఇండియాలో రూ .16,000కే అందుబాటులోకి రానుండగా..బ్లాక్, రెడ్, వైట్,బ్లూ కలర్ ఆప్షన్ వేరియంట్లలో విడుదల కానుంది. -
ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు
ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వరుస బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ప్రముఖ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్ కార్ట్లు నాలుగు రోజుల్లో రూ.20250 కోట్ల బిజినెస్ నిర్వహించినట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ నాలుగు రోజుల వ్యవధిలో 50శాతం గాడ్జెట్స్, గృహోపకరణాల్ని కొనుగులు చేసినట్లు తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా అమెజాన్ పలు ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. యాపిల్ మాక్‌బుక్ ఎయిర్ గతేడాది యాపిల్ సంస్థ ఎం1 ఎస్‌ఓఎస్‌తో యాపిల్ మాక్ బుక్ ఎయిర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.92,000 వేలు ఉండగా..ఫెస్టివల్ సేల్‌లో రూ.79,900కే సొంతం చేసుకోవచ్చు.ఇక పీ3 వైడ్ కలర్లో 13.3 అంగుళాల రెటీనా డిస్ప్లే, 8కోర్ సీపీయూ, 8కోర్ జీపీయూ, 16కోర్ న్యూరాల్ ఇంజిన్ ఫీచర్లు ఉన్నాయి. 8జీబీ మెమరీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఏసర్ నైట్రో 5 15.6 అంగుళా 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్డీ క్వాలిటీ డిస్ ప్లే 11జనరేషన్ మోడల్ ఇంటెల్ కోర్ ఐ5 - 11400 హెచ్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్..32 ఎక్స్‌పాండబుల్, 4జీబీ జీడీడీఆర్6 వీ ర్యామ్‌తో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 3050, 256జీబీ పీసీఐఆ జెన్3 ఎన్వీఎంఈ ఎస్ఎస్డీ, 1 టెరాబైట్ 2.5 అంగుళాల ఆర్పీఎం హెచ్‌డీడీతో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో దీని ధర రూ.లక్ష ఉండగా సేల్ లో రూ.69,990కే లభిస్తుంది. విక్టస్ బై హెచ్‌పీ 16.1 అంగుళా ఫుల్ హెచ్డీ క్వాలిటీతో మైక్రో ఎడ్జ్ స్క్రీన్ బ్రైట్ 250నిట్స్‌తో వస్తుంది. 5జనరేషన్ ఏఎండీ రైజెన్ 55600హెచ్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, నివిడియా జీఈఫోర్స్ జీటీఎక్స్ 1650 గ్రాఫిక్స్ కార్డ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌తో మార్కెట్లో లభ్యం అవుతుండగా..ఈ ధర రూ.76,020 ఉంది.ఈ ఫెస్టివల్ సేల్‌లో రూ.61,990కే సొంతం చేసుకోవచ్చు. ఆసుస్ వివోబుక్ 14(2021) అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఆసుస్ వివోబుక్ 14 (2021 మోడల్) రూ.41,990కే లభిస్తుంది. 11జనరేషన్‌తో ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4 ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్‌తో..256జీబీ ఎం.2 ఎన్వీఎంఈ పీసీఐఈ ఎస్ఎస్డీ ఫీచర్లు ఉన్నాయి. 2.5 అంగుళాలున్న ఈ వివోబుక్ ప్రస్తుతానికి విండోస్10లో పనిచేస్తుంది.విండోస్ 11కి అప్ గ్రేడ్ చేసుకునే సౌకర్యం ఉందని ఆసుస్ వివోబుక్ ప్రతినిధులు తెలిపారు. లెనోవో ఐడియాపా స్లిమ్5 300నిట్స్ బ్రైట్ నెస్‌తో 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్యానల్‌ను అందిస్తుంది. 11జెనరేషన్ ఇంటెల్ టైగర్ లేక్ కోర్ ఐ5-1135జీ7 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ ఫీచర్లు ఉండగా...విండోస్10కి సపోర్ట్ చేస్తుంది. ఉచితంగా విండోస్11కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ఉన్న ఈ లెనోవో ఐడియాపాడ్ స్లిమ్5 ధర రూ.62,990గా ఉంది. -
స్క్రీన్ లేని స్మార్ట్‌ఫోన్,నెక్ట్స్ జనరేషన్ ఫోన్లన్నీ ఇలానే ఉంటాయ్?
స్క్రీన్‌లెస్ సెల్‌ఫోనా? స్క్రీన్‌లేని సెల్‌ఫోన్‌ను ఏం చేసుకుంటారు? ఏడ్చినట్లే ఉంటుందనుకుంటున్నారా? ఫొటోలో కనిపిస్తున్న ఈ సెల్‌ఫోన్‌కు బొత్తిగా స్క్రీన్ లేకపోవడమేమీ కాదుగాని, స్క్రీన్ మీద కేవలం బ్యాటరీ మాత్రమే కనిపిస్తుంది. నంబర్లు, పేర్లు వగైరా సమాచారమేమీ కనిపించదు. ఇది పాకెట్ ట్రాన్సిస్టర్లు, క్యాలికులేటర్లు వంటి వాటిలో వాడే ‘ఏఏ’ సైజ్ బ్యాటరీతో పనిచేస్తుంది. సింగపూర్‌లోని టెక్ కన్సల్టెన్సీ సంస్థ ‘నెక్ట్స్ ఆఫ్ కిన్ క్రియేటివ్స్’ రూపొందించిన ఈ స్క్రీన్‌లెస్ సెల్‌ఫోన్‌కు ‘స్పేర్‌వన్ ఫోన్’ అని పేరు పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది భేషుగ్గా ఉపయోగపడుతుందని దీని తయారీదారులు చెబుతున్నారు. ఫోన్ నంబర్లను సేవ్ చేసుకునేందుకు మెమొరీ, బేసిక్ సెల్‌ఫోన్ మాదిరి బటన్ కీబోర్డ్‌తో పాటు రాత్రివేళల్లో ఉపయోగపడేలా శక్తిమంతమైన ఎల్ఈడీ టార్చ్‌లైట్ మాత్రమే దీనిలో ఉండే ప్రత్యేక సౌకర్యాలు. చదవండి: రేసిజం ఎఫెక్ట్..వరల్డ్ ఫేమస్ టిక్ టాకర్‌కు షాక్ -
ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్‌బ్యాక్!
ముంబై: ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతి ఎయిర్టెల్ కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ₹12,000 వరకు ధర కలిగిన కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు భారతి ఎయిర్టెల్ ₹6,000 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎయిర్టెల్ ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలనుకునే వినియోగదారులు కంపెనీ ఎంపిక చేసిన 150కి పైగా స్మార్ట్ ఫోన్లు ఏదైనా ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.అలాగే, క్యాష్ బ్యాక్ బెనిఫిట్ పొందడం కోసం కస్టమర్ 36 నెలల పాటు నిరంతరం(ప్యాక్ వాలిడిటీ ప్రకారం) ₹249 లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.(చదవండి: అద్దె రూపంలో భారీగా సంపాదిస్తున్న బచ్చన్ కుటుంబం) కస్టమర్ రెండు దశలలో క్యాష్ బ్యాక్ అందుకొనున్నారు. మొబైల్ కొన్న 18 నెలల తరువాత మొదటి విడత కింద ₹2000, మిగతా 4 వేల రూపాయలను 36 నెలల తర్వాత అందుకుంటారు. ఈ ప్రోగ్రామ్ కింద మొబైల్ కొనే కస్టమర్ల స్మార్ట్‌ఫోన్‌కు ఏదైనా డ్యామేజీ జరిగినట్లయితే సెర్విఫై ద్వారా ఒక్కసారి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ కు అర్హులు. దీనివల్ల మీకు అదనంగా ₹4800 వరకు ప్రయోజనం కలుగుతుంది. “స్మార్ట్ఫోన్లు ఇప్పుడు ప్రాథమిక అవసరం, ప్రత్యేకించి కరోనా మహమ్మారి అనంతర కాలంలో వినియోగదారులు డిజిటల్‌గా అనేక రకాల సేవలను యాక్సెస్ చేయాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది కస్టమర్లు మంచి ఆన్లైన్ అనుభవం కోసం నాణ్యమైన స్మార్ట్‌ఫోన్ కోసం ఆకాంక్షిస్తుండగా, వారికి నచ్చిన పరికరాన్ని సులభంగా కలిగి ఉండాలనేది మా ఆశయం” అని మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ అన్నారు. -
తస్మాత్ జాగ్రత్త..ఈ స్మార్ట్ ఫోన్లు వారిని కనిపెట్టేస్తాయ్
స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారా? అయితే వాటితో తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే ఫోన్లలో ఉన్న సెన్సార్లు గంజాయిని సేవించిన వారిని గుర్తిస్తాయని సైంటిస్ట్‌లు నిర్ధారించారు. మనం వినియోగించే స్మార్ట్ ఫోన్లలో ఉన్న సెన్సార్లు అనేక రకాలైన పనులు చేస్తాయి.వాటిలో మోషన్ సెన్సార్స్, ఎన్విరాన్ మెంటల్ సెన్సార్, పొజీషన్ సెన్సార్, ఆంబీనెట్ లైట్ సెన్సార్లు ఉంటాయి. కానీ అవి ఎందుకు ఉన్నాయి?ఎలా పనిచేస్తాయనే విషయం గురించి పట్టించుకోం.కానీ ఇదే సెన్సార్లపై 'అమెరికన్ రట్జర్స్ యూనివర్సిటీ' సైంటిస్ట్‌లు 'జనరల్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ డిపెండెన్సీ' పేరుతో రిసెర్చ్ చేశారు. రిసెర్చ్‌లో భాగంగా..వారానికి రెండు సార్లు గంజాయి సేవించిన యువకుల నుంచి సంబంధిత డేటాను సేకరించారు.ఆ డేటా సాయంతో ఫోన్ సెన్సార్ల ద్వారా గంజాయి సేవించిన సదరు యువకుల్ని పరీక్షించారు.ఆ టెస్ట్‌ల్లో యువకులు గంజాయి ఎప్పుడు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు. తీసుకున్న తరువాత వారి శరీరం తీరు ఎలా ఉందని గుర్తించారు.అంతేకాదు స్మార్ట్ ఫోన్ సెన్సార్ల సాయంతో యువకులు ఎంత మొత్తంలో గంజాయి తీసుకున్నారో 90శాతం పాజిటీవ్ రిజల్ట్ వచ్చిందని సైంటిస్ట్ టామీ చుంగ్ తెలిపారు. చదవండి : ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!! -
యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు..
ఐఫోన్ లవర్స్‌కు టెక్ దిగ్గజం యాపిల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ కొనుగోలుదారులకు రూ.46 వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే ఐఫోన్ 13 లవర్స్ 'ట్రేడ్ ఇన్ ఆఫర్'లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్సేంజ్ ఆఫర్లు ఎలా ఉన్నాయి ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఐఫోన్ 12ప్రో మ్యాక్స్ ఎక్ఛేంజ్‌లో రూ.46,120 వరకు, ఐఫోన్ 12 ప్రో పై రూ.43,255, బేసిక్ ఐఫోన్ 12పై రూ.31,120, ఐఫోన్ 12 మినీ పై రూ.25,565, ఆండ్రాయిడ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫోన్ పై రూ.13,085వరకు సొంతం చేసుకోవచ్చు. ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఎలా పాల్గొనాలి యాపిల్ ఆన్లైన్ షాప్ ద్వారా ఐఫోన్13 ఫోన్ బుక్ చేసుకునే ముందు.. కొనుగోలు దారులు ట్రేడ్ ఇన్ ఆఫర్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో జరిగే ట్రేడ్ ఇన్ ఆఫర్లో యాపిల్ సంస్థ మీ పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాధానాల ఆధారంగా మీకు ఐఫోన్ 13 ఫోన్‌కు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటిస్తుంది. మీరు కరెక్ట్‌గా సమాధానం చెప్పి ఐఫోన్ 13 ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు. అనంతరం ఆన్లైన్లో మీకు ఐఫోన్ 13ఫోన్ డెలివరీ టైం, డేట్ చూపిస్తుంది. ఆ టైం కు ఐఫోన్ ప్రతినిధులు ఐఫోన్ 13 ఫోన్‌ను మీరు ఇచ్చిన అడ్రస్‌కు డెలివరీ చేస్తారు. ఎక్ఛేంజ్ ఆఫర్లో ఐఫోన్ 13ను తీసుకోవాలి ఐఫోన్ 13 డెలివరీ టైంకు ట్రేడ్ ఇన్ ఆప్షన్లో ఇచ్చిన అడ్రస్‌కు ఆపిల్ ప్రతినిధులు వస్తారు. వచ్చే ముందు మీరు ఏ ఫోన్ పై ట్రేడ్ ఇన్ ఆప్షన్ నిర్వహించారో ఆ ఫోన్లను సిద్ధం చేసుకోవాలి. ప్రతినిధులు మీ అడ్రస్‌కు వచ్చిన వెంటనే మీ పాత ఐఫోన్ 12 సిరీస్ ఫోన్, ఆండ్రాయిండ్ ఫోన్లను వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు మీరు ట్రేడ్ ఇన్ ఆప్షన్ లో మీరు మీఫోన్ గురించి చెప్పినట్లుగా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అనంతరం మీరు చెప్పింది నిజమే అయితే ఆన్లైన్ లో అప్రూవల్ ఇస్తారు. ఐఫోన్ 13ను మీకు ఆఫర్ ప్రైస్‌కే అందిస్తారు. చదవండి: ఐఫోన్-14 ఫీచర్స్ లీక్.. మాములుగా లేవుగా! -
ఇండియన్ మార్కెట్లో మూడు బడ్జెట్ ఫోన్లు, ప్రారంభం కానున్న అమ్మకాలు
స్టార్ట్ఫోన తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ హాట్ 11 పేరుతో ఈ రోజు కొత్త మోడల్ని మార్కెట్లో రిలీజ్ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ మొదలవుతుంది. మూడు కలర్లలో లభించే ఈ ఫోను ధర రూ. 10,999గా ఉంది. బడ్జెట్ ధరలో 50000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ ఉపయోగించారు. -
ఫీచర్లు లీక్ : ఐఫోన్13 కంటే చిన్నది, అరచేతిలో ఇమిడిపోతుంది
స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ విడుదల చేయనున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. అయితే ఈ ఫీచర్లు అచ్చం ఐఫోన్ 13తరహాలో ఉండడంతో యూజర్లు ఈ ఫోన్ గురించి తెలుసుకునేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. యూజర్లను ఆకట్టుకున్న శాంసంగ్ కు చెందిన 'టిప్‌స్టర్, ఐసీఆ యూనివర్స్' ఫోన్ తరహాలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఆకట్టుకోనుందని ప్రముఖ టెక్ రివ్యూవర్ (టిప్‌స్టార్) యోగేష్ బ్రార్ తెలిపారు. ఈ ఫోన్ ఫీచర్లు..ఐఫోన్ 13 ఫీచర్ల మాదిరిగా లెగ్త్, విడ్త్,థిక్ నెస్‌లు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 3,700ఎంఏహెచ్ బ్యాటరీ, టిన్నీ స్టాండర్డ్‌లో ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్, పవర్ కన్జ్యూమింగ్ కు ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 సైజ్ ఐఫోన్ 13 కంటే చాలా చిన్నగా ఉంటుందని.. అరచేతిలో ఇమిడిపోతుందని తెలిపారు. ఐఫోన్ 13 కంటే గెలాక్సీ ఎస్ 22 పొడవు, వెడల్పు చిన్నగా ఉంటుందని చెప్పిన యోగేష్.. ఫోన్ సైజ్ 146.7 x 71.5 x 7.7 మిల్లీ మీటర్లుగా ఉందని కాబట్టే ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్22.. ఐఫోన్ 13కంటే చిన్నగా ఉందన్నారు. 6.06-అంగుళాల డిస్ప్లేతో గెలాక్సీ ఎస్ 22 ఆండ్రాయిడ్ మార్కెట్లో అత్యంత కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటిగా నిలవగా.. చివరిసారిగా శాంసంగ్ 5.8-అంగుళాల స్క్రీన్ సైజు గెలాక్సీ ఎస్10 ఈ'ని విడుదల చేసింది. కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, ఇది 5.8-అంగుళాల స్క్రీన్ సైజు కలిగిన గెలాక్సీ ఎస్ 10 ఇ. అయితే గెలాక్సీ ఎస్ 22 6.06-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. గెలాక్సీ ఎస్ 22+,గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా అందించే ఛార్జింగ్ స్పీడ్లతో పోలిస్తే 25వాల్డ్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో గెలాక్సీ ఎస్ 22 నెమ్మదిగా ఉంది. ఫోన్ వీడియో క్వాలిటీకోసం శామ్సంగ్ జీఎన్1,జీఎన్2 కెమెరా సెన్సార్లపై స్కిప్పింగ్ ను తో పాటు ఐఎస్ఓసెల్ జీఎన్5 కెమెరా సెన్సార్‌ని వినియోగించుకోవచ్చని టెక్ రివ్యూవర్ యోగేష్ బ్రార్ తెలిపారు చదవండి : ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్ ఫోన్
ఇండియన్ మొబైల్ ఫోన్ మార్కెట్లో బేసిక్, ఫీచర్ మోడళ్లతో ఓ వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు జియోకు షాకిస్తూ 'నోకియా సీ01'పేరుతో 4జీ ఎంట్రీలెవల్ బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. చిప్ కొరత కారణంగా వినాయక చవితికి విడుదల కావాల్సిన జియో 4జీ స్మార్ట్‌ఫోన్ 'జియో నెక్ట్స్'ను దీపావళికి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో జియోకి పోటీగా నోకియా బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. 'నోకియా సీ01' ఫీచర్స్ దివాళీ ఫెస్టివల్ సందర్భంగా విడుదల కానున్న ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్ నోకియా సీ01లో ఆండ్రాయిడ్11(గో ఎడిషన్) వెర్షన్‌తో అందుబాటులోకి రానుంది. తక్కువ ర్యామ్, యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ వంటి లైట్ వెయిట్ యాప్స్‌ను వినియోగించేందుకు ఉపయోగపడుతుంది. ఇకఘీ ఫోన్ 5.45 అంగుళాల హెచ్డీస్క్రీన్, హై డైనమిక్ రేంజ్లో ఎల్ఈడీ ఫ్లాష్ వచ్చేలా రెండు 5 మెగా ఫిక్సెల్ కెమెరాలు, ఆక్టాకోర్ 1.6జీహెచ్‌జెడ్ యునిసోక్ SC9863A ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుండగా, మైక్రో ఎస్డీ కార్డ్ తో స్టోరేజీని పెంచుకోవచ్చు. ఫుల్ ఛార్జింగ్ పెడితే 3000 ఎంఏహెచ్ సామర్ధ్యం ఉన్న బ్యాటరీతో ఒక రోజు వినియోగించుకోవచ్చు. 'నోకియా సీ01' ధర, కలర్స్ జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా సీ01 ధర ఇండియాలో రూ.5,999 ఉండగా.. 10శాతం డిస్కౌంట్‌తో మై జియో యాప్‌లో ఈ ఫోన్‌ను రూ.5,399 సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ బ్లూ,పర్పుల్ కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది. -
మార్కెట్లో విడుదల కానున్న బడ్జెట్ ఫోన్
హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే (సెప్టెంబర్) నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 11ను విడుదల చేయనున్నట్లు స్మార్ట్ ఫోన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఇన్ఫినిక్స్ నోట్ 7, ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ బడ్జెట్ ఫోన్లతో రూరల్ ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇన్ఫినిక్స్ సంస్థ తాజాగా ఇన్ఫినిక్స్ హాట్ 11 విడుదల ప్రకటనతో ఆఫోన్ ఫీచర్లు, ధర ఎంత? అనే విషయంపై స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.ప్రస్తుతం ఆన్ లైన్లో విడుదలైన ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 11 ఫీచర్లు రెండు మెమరీల వేరియంట్ తో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్,6జీబీ ర్యామ్, 64జీబీ స్టోర్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 11 ధర రూ.9,999గా ఉండగా నుంది. మీడియాటెక్ హెలియో G88 సిస్టమ్-ఆన్-చిప్ తో అందుబాటులోకి రానుండగా.. పూర్తి స్థాయిలో ఫీచర్లను ఇన్ఫినిక్స్ సంస్థ విడుదల చేయలేదు. -
పాపులర్ స్మార్ట్ ఫోన్, ధర ఐదోసారి పెరిగింది
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి రెడ్మీ నోట్ 10ను ధరను పెంచింది. రెడ్మీ నోట్ సిరీస్ అంటే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సిరీస్ విడుదలైన ప్రతీసారి ఆ ఫోన్ కొనుగోలు కోసం యూజర్లు ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 16న రెడ్మీ నోట్ 10ను విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ ఫోన ధరను షావోమి పెంచింది. మొత్తంగా ఐదు నెలల కాలంలో ఈ ఫోన్ ధర రెండు వేల రూపాయలు పెరిగింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్‌ల తయారీ తగ్గిపోయింది. దీంతో స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై చిప్‌ల కొరత ప్రభావం పడుతోంది. ఫలితంగా ఫోన్ల ధరలు పెంచేందుకు స్మార్ట్ తయారీ కంపెనీలు వెనుకాడటం లేదు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్, ఫీచర్లు లీకయ్యాయి అప్పుడు రూ. 11,999లకే రెడ్మీ నోట్ 10 మార్కెట్లోకి వచ్చినప్పుడు 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఇప్పుడు ధర పెరిగిన అనంతరం ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గానూ ఉంది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.500 మేర పెరిగింది. రెడ్మీ నోట్ 10 ఫీచర్స్ నెట్వర్క్ టెక్నాలజీ : జీఎస్ఎం / హెచ్ఎస్పీఏ లాంచ్ డేట్ : మార్చి 4 డైమన్షన్ : 160.5 x 74.5 x 8.3 మిల్లీమీటర్ (6.32 x 2.93 x 0.33 అంగుళాలు) వెయిట్ : 178.8 గ్రాములు బిల్డ్ : ఫ్రంట్ గ్లాస్ (గొరిల్లా గ్లాస్ 3), ప్లాస్టిక్ బ్యాక్, ప్లాస్టిక్ ఫ్రేమ్ సిమ్ : సిమ్ డ్యూయల్ సిమ్ (నానో-సిమ్, డ్యూయల్ స్టాండ్-బై) డిస్ ప్లే : సూపర్ ఆమ్లోడ్, 450 నిట్స్ (టైప్), 1100 నిట్స్ (పీక్) సైజ్ : 6.43 అంగుళాలు, 99.8 cm2 (83.5% స్క్రీన్-టు-బాడీ రేషియో ) రిజల్యూషన్ :1080 x 2400 పిక్సల్స్, 20: 9 రేషియో ప్రొటెక్షన్ : కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఓఎస్ : ఆండ్రాయిడ్ 11, MIUI 12.5 చిప్సెట్ : క్వాల్కామ్ SDM678 స్నాప్‌డ్రాగన్ 678 (11 nm) సీపీయూ : ఆక్టా కోర్ (2x2.2 GHz క్రియో 460 గోల్డ్ అండ్ 6x1.7 GHz క్రియో 460 సిల్వర్) జీపీయూ : అడ్రినో 612 మెమరీ కార్డ్ స్లాట్ : మైక్రో ఎస్డీఎక్స్సీ ఇంటర్నల్ : 64జీబీ 4జీబీ RAM, 128జీబీ 4జీబీ ర్యామ్, 128జీబీ 6జీబీ ర్యామ్ క్వాడ్ : కెమెరా 48 ఎంపీ,ఎఫ్ /1.8, 26ఎంఎం సెల్ఫీ : కెమెరా సింగిల్ 13 ఎంపీ, ఎఫ్/2.5 -
అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా వై33ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. ధర రూ.17,990 ఉంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్సెల్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఫన్‌టచ్ ఓఎస్ 11.1, బిల్ట్ ఇన్ బ్లూలైట్ ఫిల్టర్, 8 జీబీ ర్యామ్, 4 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సూపర్ నైట్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. చదవండి : ఈ టెక్నాలజీని ఒకేసారి ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా ఉంటాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అంచనా వేస్తోంది. విక్రయాలు 14 శాతం అధికమై 17.3 కోట్ల యూనిట్లకు చేరతాయని వెల్లడించింది. జూలై–డిసెంబరు కాలంలోనే 10 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. కోవిడ్–19 పరిమితులు ఎత్తివేసిన తర్వాత జూన్ మొదలుకుని కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంది. ఆగస్ట్–నవంబర్ మధ్య అమ్మకాల హవా ఉంటుంది. చైనా తర్వాత స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి వినియోగదార్లు అప్‌గ్రేడ్ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. ఇక కొన్నేళ్లలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 20 కోట్ల మార్కును దాటనుంది. 2019లో దేశంలో 15.8 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. గతేడాది స్వల్పంగా 4 శాతం తగ్గి 15.2 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంచనాలను మించి..: సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ అంచనాలను మించి మార్కెట్ వేగంగా పుంజుకుంది. 2021 జనవరి–జూన్ కాలంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. కోవిడ్ కేసులు నియంత్రణలో ఉండి, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కస్టమర్లలో సెంటిమెంట్ బలపడుతుందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. కాగా, 2020లో 5జీ మోడళ్ల వాటా కేవలం 3 శాతమే. ఈ ఏడాది ఇది 19 శాతం వాటాతో 3.2 కోట్ల యూనిట్లను తాకనుంది. 5జీ చిప్సెట్ చవక కావడం, స్మార్ట్ఫోన్ల ధర తగ్గడంతో ఈ విభాగంలో అమ్మకాలు దూసుకెళ్లనున్నాయి. ఎంట్రీ లెవెల్లో సగటు ధర ఏడాదిలో 40 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ.15,000లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' -
మనదేశంలో ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ కాలంలో 3.4 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 86 శాతం వృద్ధి నమోదైంది. షావొమీ 29.2 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలిచింది. శామ్సంగ్, వివో, రియల్మీ, ఒప్పో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర క్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతం అధికమై రూ.13,700లకు చేరింది. ధరల పెరుగుదల, 5జీ మోడళ్ల రాకతో సగటు విక్రయ ధర రానున్న త్రైమాసికాల్లో దూసుకెళ్లనుంది. 2020తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో వృద్ధి 9 శాతంలోపే ఉంటుందని ఐడీసీ అంచనా వేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు, సరఫరా అడ్డంకులు, పెరుగుతున్న విడిభాగాల ధరలు, ద్రవ్యోల్బణం ఇందుకు కారణమని వెల్లడించింది. వినియోగదార్లు ఫీచర్ ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవడం, తక్కువ, మధ్యస్థాయి ఫోన్లు వాడుతున్నవారు మెరుగైన స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు, 5జీ మోడళ్ల వెల్లువతో 2022లో మార్కెట్ తిరిగి పుంజుకుంటుందని వివరించింది. ఇక 5జీ మోడళ్ల అమ్మకం విషయంలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. చైనా, యూఎస్, జపాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో 50 లక్షల 5జీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 5జీ మోడల్ సగటు విక్రయ ధర రూ.30,500 నమోదైంది. ఈ ఏడాది చివరినాటికి రూ.15,000లోపు ధర గల మోడళ్లు వెల్లువెత్తుతాయని ఐడీసీ అంచనా వేస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే, అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా. -
నోకియా వినియోగదారులకు బంపర్ ఆఫర్, ఎక్సేంజ్‌తో పాటు
హ్యాండ్సెట్ల రంగంలో తనదైన ముద్రవేసిన నోకియా.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. సామాన్యుల కోసం తక్కువ ధర, వన్ ఇయర్ రిప్లెస్ మెంట్ గ్యారెంటీతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా నోకియా సి20 పేరుతో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇటీవల బండకేసి బాదినా పగలని నోకియా ఎక్స్ఆర్20ని విడుదల చేసి అందర్ని ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు నోకియా సి20తో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. వాస్తవానికి ఈ ఫోన్ రెండునెలల క్రితమే విడుదల కావాల్సి ఉండగా..అప్ గ్రేడ్ తో పాటు ఇతర కారణాల వల్ల భారత్‌లో విడుదలవ్వడం ఆలస్యమైంది. అయితే తాజాగా ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ రెగ్యులర్ అప్డేట్లతో పాటు సాఫ్ట్వేర్లను క్లీన్ చేసున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు నోకియా సి 20 ప్లస్‌పై ఒక సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారెంటీని కూడా ఇస్తుంది. అంటే మీరు కొన్న నోకియా ఫోన్ సంవత్సరంలోపు ఉపయోగంలో లేకపోతే కొత్త ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ సందర్భంగా సీ20 ప్లస్‌లో నోకియా సి 1 ప్లస్,నోకియా సి30, తో పాటు 5జీ స్మార్ట్ ఫోన్ నోకియా ఎక్స్ ఆర్ 20ను త్వరలో విడుదల చేయనుంది. నోకియా సి20 ప్లస్ ధర నోకియా సి20 ప్లస్ 2జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ రూ. 8,999కే అందిస్తుండగా..3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ రూ. 9,999కే దక్కించుకోవచ్చు.జియో ఎక్స్ క్లూజీవ్ ప్రోగ్రాంలో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. కాకపోతే జియో సిమ్ కార్ట్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో ఆఫర్‌తో ఫస్ట్ వేరియంట్ ధర రూ .8,099, సెకండ్ వేరియంట్ రూ. 8,999 సొంతం చేసుకోవచ్చు. జియోఎక్స్‌క్లూజివ్ ప్రోగ్రామ్ కింద రూ .4,000 విలువైన ఆఫర్లు అందుబాటులోకి ఉండనున్నాయి. నోకియా సి 20 ప్లస్ స్పెసిఫికేషన్లు నోకియా సి 20 ప్లస్ 6.5-అంగుళాల హెచ్డి+ డిస్ప్లే,నాచ్ టాప్ 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 3జీబీ ర్యామ్‌తో ఆక్టా కోర్ యునిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్, 32జీబీ ఆన్‌బోర్డ్ మెమరీతో పాటు స్టోరేజీని పెంచుకుంనేందుకు ఎస్డీ మైక్రో కార్డ్‌లను యాడ్ చేసుకోవచ్చు.ఫోన్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)ను రన్ చేస్తుంది. మీరు గూగుల్ నుండి జిమెయిల్, యూట్యూబ్,మ్యాప్స్ ను ఉపయోగించుకోచ్చు. ఫోన్ వెనుక భాగంగా 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను డిజైన్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం, నాచ్ లోపల 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫోన్ రెండు సిమ్ కార్డ్ స్లాట్స్, ఎఫ్ఎం రేడియో, 4జీ VoLTE, వైఫై, బ్లూటూత్,3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌కు సపోర్ట్ చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వినియోగించుకునేలా 4950ఏఎంచ్ బ్యాటరీని అందిస్తున్నట్లు నోకియా ప్రతినిధులు తెలిపారు. -
తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు పైగా డిస్కౌంట్స్ కూడా
భారత్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీపై హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కన్నేశాయి.మార్కెట్ లో పోటీని తట్టుకునేలా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లతో హాంకాంగ్‌కు చెందిన 'టెక్నో' సంస్థ భారత్ లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది.టెక్నో కేమన్ 17, టెక్నో కేమన్ 17 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. లాంచ్ చేసిన ఈ ఫోన్ జులై 26 నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు టెక్నో ప్రతినిథులు తెలిపారు. టెక్నో కేమన్ 17 ఫీచర్స్ 6.8 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ హెలియో జీ805 ఎస్ఓసీ ప్రాసెసర్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ తో పాటు 256 ఎక్స్‌టెండెబుల్ మెమొరీని అందిచనుంది. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సౌలభ్యంతో అందుబాటులోకి రానుండగా దీని ప్రారంభ ధర రూ. 12,999గా ఉంది టెక్నో కేమన్ 17 ప్రో 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ హెలియో G95 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుండగా, 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 48 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 16,999 ఉండగా..రూ. 1,999 డిస్కౌంట్ లభిస్తుంది. -
Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడో తెలుసా ?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తయారీ సంస్థ రియల్ మీ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి ఫెస్టివల్ సందర్భంగా 5జీ స్మార్ట్ ఫోన్లను కేవలం రూ.7 వేలకే అందిస్తామని రియల్మీ ఇండియా సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. ఒకటో రెండో కాదని ఏకంగా 60 లక్షల ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే రియల్ మీ నార్జో5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999 ఉండగా.. రాబోయే 5జీ స్మార్ట్ ఫోన్ రూ.7వేలకే అందిస్తామని ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ 5జీ సమ్మిట్ వేదికగా మాధవ్ సేథ్ మాట్లాడుతూ " రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో 90 శాతం మంది 5జీ టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారు. అందరికి కంటే ముందుగా తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తెచ్చి సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తాం. ఇతర 5జీ స్మార్ట్‌ఫోన్ సంస్థల కంటే ముందుగా 5జీ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరలో అందించాలనే లక్ష్యంతో రియల్ మీ పని చేస్తుందని" రియల్ మీ సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ చెప్పారు. 5 ప్రాడక్ట్లు + 1 స్మార్ట్ ఫోన్ దీపావళి ఫెస్టివల్ సందర్భంగా సేల్స్ కోసం రియల్ మీ 1 + 5 + టి స్ట్రాటజీని అప్లయ్ చేయనుంది. ఈ స్ట్రాటజీలో భాగంగా ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్లెస్ హెడ్ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసేందుకు రియల్ మీ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. ఆ ఐదు వస్తువుల్నికొంటే ఒక స్మార్ట్ ఫోన్‌ను ఆఫర్ ప్రకటించనుంది. వీటితో పాటు రియల్‌మీకి చెందిన స్మార్ట్ హోమ్ పరికరాలైన గేమ్ కన్సోల్స్, కంప్యూటర్ మౌస్‌లు, వాక్యూమ్ క్లీనర్స్, స్కేల్స్, టూత్ బ్రష్‌లు, సాకెట్లు, బల్బులు, కెమెరాలను విడుదల చేయనుండగా.. ఈ ఏడాది నవంబర్ లో జరిగే దిపావళి పండుగ సందర్భంగా కష్టమర్లను ఆకట్టుకునేందుకు రియల్ మీ మరిన్ని ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.! -
షాకింగ్ సేల్స్ : కేవలం నిమిషంలోనే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు
స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ విడుదల చేసిన హానర్ 50, హానర్ 50 సిరీస్ స్మార్ట్ఫోన్లు కేవలం నిమిషంలోనే అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాల్ని హానర్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2జీ, 4జీ, ఇప్పుడు 5జీ విప్లవం మొదలైంది. దీంతో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీ పై దృష్టిసారించాయి. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేయగా తాజాగా హువాయే సబ్ బ్రాండ్ గా పేరొందిన హానర్ కంపెనీ చైనా కేంద్రంగా హానర్ 50, హానర్ 50ప్రో, హానర్ 50ఎస్ఈ ఫోన్లపై శుక్రవారం రోజు ఫ్రీ ఆర్డర్‌ను ప్రకటించింది. అలా ఆర్డర్ ప్రకటించింది లేదో కేవలం నిమిషం వ్యవధిలోనే హానర్ 50 సిరీస్ ఫోన్లు అమ్ముడయ్యాయి. చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్ హానర్ 50ప్రో ఫీచర్స్ విషయానికొస్తే 6.72అంగుళాలు 120 హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 12జీబీ ర్యామ్ తో 778జీ ప్రాసెసర్ 108 ఎంపీ - 8ఎంపీ-2ఎంపీ-2ఎంపీతో కెమెరా సెటప్ 32 ఎంపీ + 12ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా 4,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది 50ప్రో ధర : ఇండియన్ కరెన్సీలో రూ. 42,380గా ఉంది. హానర్ 50 ఫీచర్స్ అండ్ ప్రైస్ హానర్ 50 సైతం 120 హెచ్ రిఫ్రెష్ రేట్ తో 6.57 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 778జీ ఎస్ఓసీ 12జీబీ ర్యామ్ వేరియంట్ తో వస్తుంది క్వాడ్ రేర్ కెమెరా సెటప్ తో పాటు 108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీ సెన్సార్‌ను అందిస్తుంది 32ఎంపీ తో సింగిల్ సెల్ఫీ కెమెరా 4,300ఎంఏహెచ్ బ్యాటరీ తో రూ. 30,922కే అందిస్తుంది. హానర్ 50ఎస్ఈ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ హానర్ 50ఎస్ఈ 6.78 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ మీడియా టెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ నుంచి 128జీబీ వరకు స్టోరేజ్ 16 ఎంపీల సెల్ఫీ కెమెరా 108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీల రేర్ కెమెరా సెటప్ 4,300ఎంఏహెచ్ బ్యాటరీ తో రూ. 27,480కే అందిస్తుంది. -
భారీ కెమెరాతో : మోటరోలా మరో అద్భుత స్మార్ట్‌ఫోన్
సాక్షి,వెబ్‌డెస్క్: చైనా టెక్ దిగ్గజం లెనోవాకు చెందిన మోటరోలా భారీ కెమెరాతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే 108 ఎంపీ బిగ్ కెమెరా ప్రధాన ఫీచర్‌గా ‘మోటోజీ 60’ ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా మరో డివైస్‌ను ఆవిష్కరించనుంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఏ52కి పోటీగా మిడ్ రేంజ్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మోటరోలా మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లు ఒకటి అంతకంటే ఎక్కువ ఫోన్లను మార్కెట్లోకి తేవాలని లెనోవా భావిస్తోంది. టెక్నిక్ సంస్థ న్యూస్ ప్రకారం.. మోటరోలా ఎడ్జ్ బెర్లిన్, మోటరోలా ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎ, మోటరోలా ఎడ్జ్ క్యోటో, మోటరోలా ఎడ్జ్ పిస్టార్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో లాంచ్ కానున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసిన మోటో ఎడ్జ్, మోటో ఎడ్జ్ + ఫోన్ల తరహాలో ఈ స్మార్ట్ఫోన్లు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. మోటో ఎడ్జ్ బెర్లిన్: స్పెసిఫికేషన్స్ టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం యూరోపియన్ మోడల్, నార్త్-అమెరికన్ మోడల్‌తో మోటో ఎడ్జ్ బెర్లిన్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778 g soc తో పాటు 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, 8 జీబీ, 265 జీబీ వేరియంట్లతో రావచ్చు. మోటో ఎడ్జ్ బెర్లిన్, ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎలలో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్రధానంగా 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. యూరోపియన్ వేరియంట్లో 16 మెగాపిక్సెల్, సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్, మూడు కెమెరా సెన్సార్లు ఉంటాయని అంచనా. నార్త్ అమెరికన్ మోడల్లో 8 ఎంపీ సెకండరీ సెన్సార్, 2 ఎంపీ మూడు సెన్సార్లతో రానుంది. 32 ఎంపీ సెల్ఫీకెమెరాను జోడించినట్టు సమాచారం. మోటరోలా ఎడ్జ్ పిస్టార్: ఫీచర్స్ మోటరోలా ఎడ్జ్ పిస్టార్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ లేదంటే స్నాప్ డ్రాగన్ 870 సాక్ తో అందుబాటులోకి రానుంది. అంతేకాదు 6GB + 128 GB, 8 GB + 265 GB తో సహా రెండు ర్యామ్ వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. మోటో ఎడ్జ్ బెర్లిన్ మాదిరిగానే వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్, ప్రైమరీ సెన్సార్‌తో పాటు 16 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ 2 కెమెరా సెన్సాలతో భారత్ లో విడుదల కానుంది. చదవండి: పిల్లలు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారంటే.. -
Amazon Mobile Saving Days : ఈ స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్స్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్ ద్వారా ఆఫర్లను ప్రకటించింది. జూన్ 12వరకు ఆయా ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఆ వివరాలేంటో తెలుసుకుందాం. రియల్‌మి, శాంసంగ్ , వివో, షియోమి స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు ఆఫర్లతో పాటు డిస్కౌంట్లను ప్రకటించింది అమెజాన్. ఉచిత ఈఎంఐ సౌకర్యంతో పాటు డిస్కౌంట్లను, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు.హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1,000 తగ్గింపు ఉంది. రియల్ మి ఎక్స్ 7ను కొనుగోలు చేసిన కష్టమర్లకు రూ.750 డిస్కౌంట్ తో పాటు అదనంగా రూ.1,000 అమెజాన్ కూపన్ అందిస్తుంది. రియల్ మీ నార్జో 30ఏ పై రూ. 8,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఇ 5జి శాంసంగ్ ను అమెజాన్ కూపన్ ద్వారా రూ. 6,000 డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వినియోగదారులకు మరో 10 శాతం తగ్గింపుతో ఫోన్ లభిస్తుంది. గెలాక్సీ ఎస్ 21 + 5జీని జీరో పర్సెంట్ ఇంట్రస్ట్ పై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. రూ.12,999 శాంసంగ్ గెలాక్సీ ఎ 12 ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లావాదేవీలపై ₹ 750 డిస్కౌంట్ తో లభిస్తోంది. దీంతో పాటు కొన్ని షియోమి ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. రూ. 10,990గల రెడ్మి నోట్ 9 రూ.500 అమెజాన్ కూపన్‌తో పాటు రూ.750 డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. రెడ్ మి 10 ఐ 5జి ఫోన్ పై రూ. 2,000 డిస్కౌంట్, రూ.13,100 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో సొంతం చేసుకోవచ్చు. రెడ్మి 9 హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుపై రూ.750 డిస్కౌంట్‌తో లభిస్తుంది. చదవండి : Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ! ఒప్పో ఎఫ్ 17 పై రూ. 1,750 డిస్కౌంట్‌తో పాటు కూపన్‌పై అదనంగా రూ. 1,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. రూ.25,990విలువైన ఒప్పో ఎఫ్ 19 ప్రో + 5 జిపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై రూ. 3,000 తగ్గింపుతో లభిస్తుంది. ఒప్పో ఏ74 5జీపై రూ.2వేల డిస్కౌంట్ లభించనుంది. -
Facebook smartwatch ఆ దిగ్గజాలకు గట్టి పోటీ!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన తొలి స్మార్ట్‌వాచ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. స్మార్ట్‌ఫోన్ ను ఎలా వినియోగిస్తామో..స్మార్ట్‌వాచ్‌ను కూడా అలాగే ఉపయోగించుకునేలా స్మార్ట్‌వాచ్‌ను వచ్చే ఏడాది వేసవికి అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్బుక్ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. పల్స్రేట్ తెలుసుకోవడంతోపాటు, రెండు కెమెరాలుతో పాటు, ఫిట్నెస్ కంపెనీల సేవలు లేదా హార్డ్‌వేర్‌లకు కూడా కనెక్ట్ కావచ్చు. అంతేకాదు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఈ స్మార్ట్‌వాచ్‌ను కూడా ఆపరేట్ చేయగలగడం మరో ఆకర్షణ. అమెరికా టెక్నాలజీ సైట్ ది వెర్జ్ కథనం ప్రకారం. సెకండ్, థర్డ్ జెనరేషన్ వాచ్‌లను కూడా లాంచ్ చేయనుంది. దీని సుమారు 400 డాలర్లు (సుమారు రూ .29,000) గా ఉంటుందట. ఇంకా పేరు పెట్టని ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్, వైట్, గోల్డ్‌న్ రంగులలో లభించనుంది. స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ ఈ స్మార్ట్‌వాచ్ సాయంతో మెసేజెస్ను పంపడంతో పాటు హెల్త్, ఫిట్నెస్ గురించి తెలుసుకోవచ్చు. స్మార్ట్‌వాచ్‌లో రెండు కెమెరాల డిస్ప్లే ఉంటుంది. దీని సాయంతో యూజర్లు ఫోటోల్ని, వీడియోల్ని క్యాప్చర్ చేయవచ్చు. అలా క్యాప్చర్ చేసిన వీడియోల్ని ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా షేర్ చేసే సదుపాయం ఉంది. స్మార్ట్‌వాచ్ ముందు భాగంలో ఉండే కెమెరా సాయంతో వీడియో కాలింగ్ చేసుకోవచ్చని వెర్జ్ తన కథనంలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. స్మార్ట్ వాచ్ వెనుక భాగంలో పూర్తి హెచ్ డీతో డీజికామ్ ఉంటుంది. ఈ డిజికామ్ ద్వారా యూజర్లు తీసుకున్న ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకునేలా బ్యాక్‌ప్యాక్‌ల వంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఫేస్ బుక్ ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌కు స్మార్ట్ వాచ్ అటాచ్ చేసే పనిలేకుండా ఎల్‌టిఇ కనెక్టివిటీని జోడించాలని ఫేస్బుక్ యోచిస్తోంది. ఇందు కోసం యుఎస్ వైర్లెస్ క్యారియర్లతో కలిసి పనిచేస్తోంది. స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లో వినియోగదారును ఆకట్టుకుని, ఆపిల్, హువావే, గూగుల్‌లకు గట్టి పోటీనిచ్చే వ్యూహంలో భాగంగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ స్మార్ట్‌వాచ్‌ను తీసుకువస్తున్నారని ది వెర్జ్ నివేదించింది. చదవండి : Facebook షాక్: ట్రంప్ కౌంటర్