ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ప్లస్‌పై పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. డిమాండ్ లేకపోవడంతో ఫోన్‌ల తయారీని నిలిపివేయాలని మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థలకు యాపిల్ ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14సిరీస్‌లోని ప్లస్‌తో పాటు గతంలో కొనుగోలు దారుల్ని అంతగా ఆకట్టుకోని ఫోన్‌లను సైతం ఇలాగే నిలిపి వేసింది.
సెప్టెంబర్ 16న అమెరికా క్యాలిఫోర్నియా యాపిల్ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో వేదికగా యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ను విడుదల చేసింది. గత నెలలో ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభించింది. అయితే ఈ సేల్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే, సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ రోజులు ఫోన్‌ను వినియోగించే సామర్ధ్యం ఉన్న ఈ ఫోన్ అమ్మకాలు ఊహించని విధంగా జరుగుతాయని యాపిల్ అంచనా వేసింది.
వాస్తవానికి నిపుణులు సైతం పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లకు డిమాండ్, తక్కువ ధర ($899) దానికి తోడు హాలిడేస్ రావడంతో ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ జరుగుతాయని అనుకున్నారు. కానీ యాపిల్, నిపుణుల అంచనాలు తారుమారయ్యాయి. పెద్ద స్క్రీన్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇంటస్ట్ర్ చూపించలేదు. దీంతో యాపిల్ తన ఐఫోన్ 14ప్లస్ ప్రొడక్షన్‌ను తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
యాపిల్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో 900 లక్షల యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లను తయారీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఊహించిన దానికంటే 30 లక్షల ఫోన్‌ల తయారీని తగ్గించాలని భావిస్తోంది. యాపిల్ సంస్థ, ఐఫోన్‌లను సప్లయి చేసే సంస్థలు ఇప్పుడు 870 లక్షల యూనిట్‌లు లేదా అంతకంటే తక్కువగా తయారు చేయాలని భావిస్తున్నారు.సేల్స్ లేకపోవడంతో ఐఫోన్ 14లోని ఐఫోన్ 14, 14 ప్లస్ మోడళ్ల ప్రొడక్షన్‌ను తగ్గించనుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
డిమాండ్ లేకపోవడంతో సేల్స్ తగ్గినప్పటికీ యాపిల్ గతంలోనే ఈ లేటెస్ట్ వెర్షన్ ఫోన్‌ల తయారీని భారీగా తగ్గించింది. గతంలో ఐఫోన్8, ఐఫోన్ 12 మినీ మోడల్ ఫోన్‌లు ఆకట్టుకోకపోవడంతో తయారీని తగ్గించేసింది.
చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్
Comments
Please login to add a commentAdd a comment