sales down
-
మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తన ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది. దాంతోపాటు కాస్ట్ కటింగ్ ప్రణాళికలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని తొలగించనున్నట్లు కంపెనీ వర్క్స్ కౌన్సిల్ హెడ్ డానియెలా కావల్లో తెలిపారు. అంతర్జాతీయంగా కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.ఈ సందర్భంగా డానియెలా కావల్లో మాట్లాడుతూ..‘యూరప్‌లో వోక్స్వ్యాగన్ సంస్థ తన తయారీ యూనిట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిపోతోంది. దాంతో యూరప్‌లో మూడు ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఏ ప్లాంట్లను నిలిపేయాలో ఇంకా స్పష్టత రాలేదు. కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని కొలువుల నుంచి తొలగించనున్నాం. జర్మనీలోని వోక్స్వ్యాగన్ గ్రూప్‌లో దాదాపు 3,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!వోక్స్వ్యాగన్ కంపెనీ ఉత్పత్తులకు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్న చైనా, యూరప్ నుంచి డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. దానికితోడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ కరవైంది. దాంతో చేసేదేమిలేక చివరకు ఉద్యోగుల తగ్గింపునకు పూనుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
వ్యాపారం.. వెలగని భూచక్రం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి నెట్వర్క్: దీపావళి పర్వదినం సమీపిస్తోంది. ఈ పండుగ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది టపాసులే. కానీ.. ఈ ఏడాది బాణసంచా మార్కెట్లో పండుగ సందడి అసలు కనిపించడం లేదు. ఏటా ఈ సమయానికి హోల్‌సేల్ మార్కెట్లో 90 శాతం టపాసులు అమ్ముడయ్యేవి. దీపావళికి మూడు రోజులే సమయం ఉండగా.. కనీసం 25 శాతం బాణసంచా కూడా అమ్ముడుపోలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ నగరంలో ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు అనేక దశాబ్దాలుగా టపాసుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరినుంచి 150 మంది రిటైల్ వ్యాపారులు బాణసంచా కొనుగోలు చేస్తారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి మూడు, నాలుగు రోజులపాటు విక్రయాలు జరుపుతుంటారు. కానీ.. ఈ ఏడాది రిటైలర్లు హోల్సేలర్ల వద్ద బాణసంచా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.దీపావళిని కమ్మేసిన వరద, భారీ వర్షాలుసెప్టెంబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ జిల్లాను బుడమేరు వరద ముంచెత్తింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాల్లో వరద చేరింది. లక్షలాది మంది ముంపునకు గురై ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంట్లో రూ.లక్షల మేర నష్టం వాటిల్లింది. బాధితుల్లో అత్యధికులు ప్రభుత్వ సాయం అందక లబోదిబోమంటున్నారు. వరద ప్రభావం బాణాసంచా విక్రయాలపై తీవ్రంగా పడిందని, అందువల్లే హోల్‌సేల్ వ్యాపారానికి గండిపడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో..భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజల ఆర్థిక పరిస్థితులను దిగజార్చాయి. ఈ ప్రభావం బాణాసంచా విక్రయాలపై అధికంగా కనిపిస్తోంది. వంటనూనె, ఇతర నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకే ప్రజల దగ్గర డబ్బులు లేవని.. ఈ పరిస్థితుల్లో బాణసంచా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.సంక్షేమం లేదు.. సంక్షోభమేగత ప్రభుత్వ హయాంలో తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెన, రైతుభరోసా వంటి పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలకు సాయం అందేది. కూటమి ప్రభుత్వం రాకతో సంక్షేమ పథకాల సాయం అందటం లేదు. మరోవైపు ఖర్చులు భారీగా పెరిగిపోవడం పండుగపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ టపాసుల కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని, ఈ ఏడాది సరైన వ్యాపారమే జరగలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా దసరా నుంచి మొదలై.. ఈ సమయానికి 90%వ్యాపారం పూర్తయ్యేదని.. ఈ ఏడాది దానికి భిన్నమైన పరిస్థితులు వల్ల 75% అమ్మకాలు తగ్గాయని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.విక్రయాలు భారీగా తగ్గాయిఈ ఏడాది బాణాసంచా విక్రయాలు భారీగా తగ్గాయి. వర్షాలు, వరదలు దీపావళి సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఏటా దీపావళికి నెల ముందే బాణసంచా తీసుకెళ్లే రిటైల్ వ్యాపారులు ఈ ఏడాది కొనుగోళ్లకు ముందుకు రాలేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి. పండుగకు ముందు జరిగే వ్యాపారంలో 50 శాతం కూడా జరగలేదు. – గర్రె బాబూరావు, బాణసంచా వ్యాపారి, చిలకలూరిపేటఎక్కడా కనిపించట్లేదుఈసారి దీపావళికి టపాసులు పేలేలా కనిపించడం లేదు. టపాసుల విక్రయాలు ఎక్కడా జరగటం లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏటా ముందుగానే టపాసులు కొనేవారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. షాపులు నెలకొల్పేందుకు కూడా వ్యాపారులు ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. – ఎస్.రాజారావు, బైరివానిపేట, శ్రీకాకుళం జిల్లా -
ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..
దేశవ్యాప్తంగా 30 ద్వితీయ శ్రేణి ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. జులై–సెప్టెంబర్‌లో 41,871 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే విక్రయాలు 13 శాతం తగ్గాయని ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. గతేడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు కావడమే ఈ క్షీణతకు కారణం అని వివరించింది.నివేదికలోని వివరాల ప్రకారం..కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ 34 శాతం క్షీణించింది. మొత్తం విక్రయాల్లో అహ్మదాబాద్, వడోదర, గాందీనగర్, సూరత్, గోవా, నాసిక్, నాగ్‌పూర్‌తో కూడిన వెస్ట్ జోన్ వాటా 72 శాతం ఉంది. తక్కువ జీవన వ్యయం, నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యత, కంపెనీలకు అనుకూల కార్యాచరణ వ్యయంతో పాటు రాష్ట్ర రాజధానుల్లో మంచి కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు గృహాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు పడిపోయినప్పటికీ హౌసింగ్ మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. ప్రస్తుత పండుగ త్రైమాసికంలో బలమైన విక్రయాలు ఉంటాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం, వెండి ధరలు‘ద్వితీయ శ్రేణి నగరాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడికి పెద్దగా అనుకూలించవు. వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వృద్ధి ఉన్నప్పటికీ ఈ నగరాలు ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. పేలవమైన అద్దె ఆదాయం, మూలధన విలువలో అంతగా వృద్ధి ఉండకపోవడం, ఆస్తి నిర్వహణ ఖర్చు.. వెరసి ఈ నగరాల్లో పెట్టుబడిని అత్యంత ప్రమాదకరం చేస్తోంది’ అని నివేదిక వివరించింది. -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలోని గణాంకాలతో పోలి్చచూస్తే 14 శాతం తగ్గి రూ.12,296 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి–మార్చి కాలంలో 14,298 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో 6 శాతం తగ్గి 1,13,768 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ (ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్) వెల్లడించింది. జనవరి–మార్చి క్వార్టర్లో ఈ నగరాల్లో విక్రయాలు 1,20,642 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ పనితీరుపై ప్రాప్‌టైగర్ ఒక నివేదిక విడుదల చేసింది. ఇక ఈ ఎనిమిది పట్టణాల్లో అమ్మకాలు, క్రితం ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విక్రయాలు 80,245 యూనిట్లతో పోల్చి చూస్తే 42 శాతం పెరిగాయి. ‘‘రియల్ ఎస్టేట్ పట్ల వినియోగదారుల్లో సానుకూల ధోరణి నెలకొన్నప్పటికీ, ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్లకు డిమాండ్ మోస్తరుగా ఉండడానికి సాధారణ ఎన్నికలే కారణం. డెవలపర్లు సైతం కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితమే కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ సైతం తగ్గింది. కేంద్రంలో నూతన ప్రభుత్వం పెట్టుబడుల అనుకూల బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్న అంచనాల మధ్య రానున్న త్రైమాసికాల్లో, ముఖ్యంగా పండుగల రోజుల్లో ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాద్వాన్ పేర్కొన్నారు. పట్టణాల వారీగా విక్రయాలు→ అహ్మదాబాద్‌లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 26 శాతం తగ్గి 9,500 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో విక్రయాలు 12,915 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో 13,495 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసిక విక్రయాలు 10,381 యూనిట్లతో పోలిస్తే 30 శాతం పెరిగాయి. → చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 10 శాతం వృద్ధితో 3,984 యూనిట్లకు చేరాయి. మార్చి క్వార్టర్లో విక్రయాలు 4,427 యూనిట్లుగా ఉన్నాయి. → ఢిల్లీ ఎన్సీఆర్లో 11,065 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. మార్చి త్రైమాసికంతో పోల్చితే 10 శాతం పెరిగాయి. → కోల్‌కతా మార్కెట్లో 3,237 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. జనవరి–మార్చి క్వార్టర్లో విక్రయాలు 3,857 యూనిట్లుగా ఉన్నాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 8 శాతం క్షీణించి 38,266 యూనిట్లకు పరిమితమయ్యాయి. → పుణె మార్కెట్లోనూ 5 శాతం క్షీణతతో 21,925 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → కొత్త ఇళ్ల సరఫరా అంతక్రితం త్రైమాసికంతో పోలి్చతే జూన్ క్వార్టర్లో 1 శాతం తగ్గి 1,01,677 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది. -
మారుతీ, హ్యుండై వాటా తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన రంగంలో దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌లో రెండు ప్రధాన కంపెనీల మార్కెట్ వాటా తగ్గింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. మారుతీ సుజుకీ 2022–23లో 14,79,221 యూనిట్లతో 40.86 శాతం వాటాకు వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 12,39,688 యూనిట్లతో 42.13 శాతం వాటా నమోదు చేసింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఎదుర్కొంటున్నామని, 3.8 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ గతంలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో హ్యుండై మోటార్ ఇండియా 5,25,088 యూనిట్లతో 14.51 శాతం వాటాకు పరిమితమైంది. 2021–22లో కంపెనీ 4,79,027 యూనిట్లతో 16.28 శాతం వాటా పొందింది. ఇతర కంపెనీలు ఇలా.. టాటా మోటార్స్ మార్కెట్ వాటా 11.27 నుంచి 2022–23లో 13.39 శాతానికి ఎగబాకింది. విక్రయాలు 3,31,637 యూనిట్ల నుంచి 4,84,843 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటా 6.77 నుంచి 8.94 శాతానికి ఎగసింది. విక్రయాలు 1,99,125 నుంచి 3,23,691 యూనిట్లకు పెరిగాయి. కియా ఇండియా వాటా 5.3 నుంచి 6.42 శాతానికి, విక్రయాలు 1,56,021 నుంచి 2,32,570 యూనిట్లకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సైతం మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1,435 ఆర్టీవోలకుగాను 1,349 కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించినట్టు ఎఫ్ఏడీఏ తెలిపింది. -
ఏసీ అమ్మకాలపై అకాల వర్షాల దెబ్బ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తున్న అసాధారణ వర్షాలతో ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) అమ్మకాలు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫిబ్రవరి మధ్య నుంచి ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, ఏప్రిల్ నుంచి ఏసీల అమ్మకాలు పెరుగుతా యనే అంచనాలు కంపెనీల్లో నెలకొన్నాయి. వర్షాలతో మార్చి రెండో వారంలో ఏసీల అమ్మకా లు తగ్గాయి. ఇది కొన్ని రోజుల పరిణామమేనని, తిరిగి ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి పెరిగే ఉష్ణోగ్రతలతో డిమాండ్ గరిష్టానికి వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 2022లో మొత్తం మీద 82.5 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సీజన్లో అమ్మకాల పరంగా రెండంకెల వృద్ధి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వేసవి కాలం ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కావచ్చన్న అంచనాలు విక్రయాలకు మద్దతుగా నిలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంత తగ్గాయి.. అకాల వర్షాలకు తమ ఏసీల అమ్మకాలు కొంత తగ్గాయని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘అయినప్పటికీ అధిక వేసవి కాలం ముందుంది. ఈ తరహా వాతావరణ ప్రతికూలతలు మరిన్ని లేకపోతే మాత్రం మా అమ్మకాల లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకం ఉంది’’అని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ గౌరవ్ షా అన్నారు. అమ్మకాలు తగ్గితే అది 5–6 రోజులే ఉంటుందని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా తెలిపారు. దీని ప్రభావం పెద్దగా ఉండదన్నారు. పెంటప్ డిమాండ్ (గతంలో నిలిచిన) బలంగా ఉన్నందున బుల్లిష్‌గా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఏసీల మార్కెట్ 20 శాతం వృద్ధి చెందుతుందున్న అంచనాను వ్యక్తం చేశారు. అలాగే డైకిన్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరగొచ్చన్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో ఏసీల అమ్మకాలు పెరగడం గమనార్హం. దీంతో రిటైలర్లు నిల్వలను పెంచుకున్నారు. ప్రస్తుత వర్షాలు తమ వ్యూహాత్మక విధానాన్ని మార్చుకునేందుకు సరైన సమయం ఇచ్చినట్టు హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని వారాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణంగా మారతాయని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇండోర్, గృహ కూలింగ్ ఉత్పత్తులు తప్పనిసరిగా పేర్కొన్నా రు. మార్కెట్ ధోరణులు చూస్తుంటే 30–40 శాతం మేర అమ్మకాలు పెరగొచ్చని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో హయర్ ఈ మేర ప్రగతి సాధిస్తుందని చెప్పారు. విక్రయాలు తగ్గాయని, అయినా ఇది తాత్కాలికమేనని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయ న్సెస్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) పేర్కొంది. ఈ ఏడాది మేలో తీవ్రమైన వేసవి సీజన్‌ను చూస్తామని, నివేదికలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. మరో వారం రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలవుతాయని, అమ్మకాలు కూడా పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏప్రిల్‌లో తీవ్ర ప్రతికూలతలు ఎదురైతే తప్ప అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండబోదన్నారు. ‘‘మొత్తం మీద వేసవి అమ్మకాలపై ఇప్పుడే అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి విక్రయాలు జూన్, జూలై వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయి’’అని వోల్టాస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. చానల్ భాగస్వాములు కూలింగ్ ఉత్పత్తులను ముందుగా నిల్వ చేసి పెట్టుకోవాలని, అప్పుడు పెరిగే ఉష్ణోగ్రతలతో ఒక్కసారిగా డిమాండ్ వచ్చి నా, ఎదుర్కోవడానికి ఉంటుందన్నారు. -
Tech layoffs మరో టాప్ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్!
సాక్షి,ముంబై: టెక్ ఉద్యోగులకు మరో చేదు వార్త. గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయాల క్షీణత పలు టెక్ కంపెనీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో ఖర్చుల నియంత్రలో భాగంగావేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కంప్యూటర్ల సంస్థ డెల్ నిలిచింది. పీసీ అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,650 ఉద్యోగాలను తొలగించనుంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం మొత్తం సిబ్బందిలో 5 శాతం ఉద్యోగులను ఉద్వాసన పలుకుతోంది. కంపెనీ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందనీ ఈ అనిశ్చితి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ ఉద్యోగులకు తెలిపారు. కోవిడ్ సంక్షోభం తరువాత, కంప్యూటర్లు ఇతర హార్డ్‌వేర్ ఉత్పత్తుల డిమాండ్ పెరిగి నప్పటికీ 2022 నాల్గవ త్రైమాసికంలో వ్యక్తిగత కంప్యూటర్ షిప్మెంట్లు బాగా పడిపోయాయని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా డెల్ కంపెనీ అమ్మకాలు భారీ క్షీణించాయని ఐడీసీ పేర్కొంది. తొలగింపుల తర్వాత, డెల్ ఉద్యోగుల సంఖ్య కనీసం ఆరేళ్లలో కనిష్టంగా 1,26,300గా ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కాగా 2021లో ఇదే కాలంతో పోలిస్తే డెల్ తన పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లలో 37 శాతంతో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది. డెల్ ఆదాయం దాదాపు 55 శాతం పీసీల నుంచే వస్తుంది. -
ఆ ఐఫోన్‌ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ప్లస్‌పై పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. డిమాండ్ లేకపోవడంతో ఫోన్ల తయారీని నిలిపివేయాలని మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థలకు యాపిల్ ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14సిరీస్‌లోని ప్లస్‌తో పాటు గతంలో కొనుగోలు దారుల్ని అంతగా ఆకట్టుకోని ఫోన్లను సైతం ఇలాగే నిలిపి వేసింది. సెప్టెంబర్ 16న అమెరికా క్యాలిఫోర్నియా యాపిల్ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో వేదికగా యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ను విడుదల చేసింది. గత నెలలో ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభించింది. అయితే ఈ సేల్‌లో 6.7 అంగుళాల డిస్ప్లే, సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ రోజులు ఫోన్‌ను వినియోగించే సామర్ధ్యం ఉన్న ఈ ఫోన్ అమ్మకాలు ఊహించని విధంగా జరుగుతాయని యాపిల్ అంచనా వేసింది. వాస్తవానికి నిపుణులు సైతం పెద్ద డిస్ప్లే ఫోన్లకు డిమాండ్, తక్కువ ధర ($899) దానికి తోడు హాలిడేస్ రావడంతో ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ జరుగుతాయని అనుకున్నారు. కానీ యాపిల్, నిపుణుల అంచనాలు తారుమారయ్యాయి. పెద్ద స్క్రీన్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇంటస్ట్ర్ చూపించలేదు. దీంతో యాపిల్ తన ఐఫోన్ 14ప్లస్ ప్రొడక్షన్‌ను తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. యాపిల్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో 900 లక్షల యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను తయారీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఊహించిన దానికంటే 30 లక్షల ఫోన్ల తయారీని తగ్గించాలని భావిస్తోంది. యాపిల్ సంస్థ, ఐఫోన్లను సప్లయి చేసే సంస్థలు ఇప్పుడు 870 లక్షల యూనిట్లు లేదా అంతకంటే తక్కువగా తయారు చేయాలని భావిస్తున్నారు.సేల్స్ లేకపోవడంతో ఐఫోన్ 14లోని ఐఫోన్ 14, 14 ప్లస్ మోడళ్ల ప్రొడక్షన్‌ను తగ్గించనుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. డిమాండ్ లేకపోవడంతో సేల్స్ తగ్గినప్పటికీ యాపిల్ గతంలోనే ఈ లేటెస్ట్ వెర్షన్ ఫోన్ల తయారీని భారీగా తగ్గించింది. గతంలో ఐఫోన్8, ఐఫోన్ 12 మినీ మోడల్ ఫోన్లు ఆకట్టుకోకపోవడంతో తయారీని తగ్గించేసింది. చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
మరీఘోరంగా టూ వీలర్స్ అమ్మకాలు
November 2021 Record Lowest wholesales In automobile industry Due To Chip Shortage: ఆటోమొబైల్ రంగంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక నెలలో ద్విచక్ర వాహనాలు రికార్డు స్థాయిలో తక్కువగా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లోనూ ఇదే ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. 2021 నవంబర్ నెల ఆటోమొబైల్ రంగానికి అచ్చి రాలేదు. ఓవైపు పండుగ సీజన్ కొనసాగినా.. ఊహించినంత వాహన అమ్మకాలు లేకపోవడం విశేషం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చురర్స్ (SIAM) నివేదికల ప్రకారం నవంబర్ నెలలో.. ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల మొత్తం 18.6 శాతం పడిపోయింది. అదే విధంగా టూ వీలర్స్ ఏకంగా 34 శాతం తగ్గింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ డౌన్‌ఫాల్ దారుణంగా నమోదు అయ్యింది. ►ప్యాసింజర్ వెహికిల్స్ ఈ నవంబర్‌లో 2, 15, 626 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 2, 64, 898గా ఉంది. ఇక ఉత్పత్తి కూడా 9.5 శాతం పడిపోయింది (2,94,596 యూనిట్ల నుంచి 2,66,552కి). ►టూ వీలర్స్ ఈ నవంబర్‌లో 10, 50, 616 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. కిందటి ఏడాది నవంబర్‌లో ఈ సంఖ్య 16 లక్షల యూనిట్లకు పైనే ఉంది. ఇక ఉత్పత్తి కూడా 29 శాతం పడిపోయి.. పదకొండేళ్ల తర్వాత పతనం నమోదు చేసుకుంది. 19, 36, 793 యూనిట్లకు గానూ 13, 67, 701 యూనిట్లను ఉత్పత్తి పడిపోయింది. ►ఇక త్రీ వీలర్స్ విషయానికొస్తే.. ఈ నవంబర్‌లో 6.64 శాతం క్షీణత కనిపిస్తోంది. 22, 471 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 24, 071 యూనిట్లుగా ఉంది. ఉత్పత్తి మాత్రం 6 శాతం పడిపోయింది. 65, 460 యూనిట్ల నుంచి 61, 451 యూనిట్లకు పడిపోయింది. పెరిగిన ఎగుమతి.. అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీలు అస్సలు తగ్గట్లేదు. మొత్తంగా ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే.. ప్యాసింజర్ వెహికిల్స్‌లో 15.5 శాతం పెరుగుదల (44, 265 యూనిట్లు), టూ వీలర్స్‌లో 9 శాతం (3, 56, 659 యూనిట్లు), త్రీ వీలర్స్‌లో 14 శాతం (42, 431 యూనిట్లు) ఎగుమతి శాతం పెరిగింది. కారణం.. సెమీ కండక్టర్ల కొరత. కరోనా సమయంలో చిప్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు మూతపడి.. ఈ ప్రభావం ఏడాది తర్వాత కూడా వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అయితే నవంబర్‌లో అదీ పండుగ సీజన్లో ఈ రేంజ్ ప్రతికూల ప్రభావం చూడడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి అని సియామ్(SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్తున్నారు. ముఖ్యంగా త్రీ వీలర్స్ అమ్మకాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారాయన. చదవండి: గూగుల్, యాపిల్‌ను తలదన్నే రేంజ్ ప్లాన్.. 17 బిలియన్ డాలర్లతో చిప్ ఫ్యాక్టరీ -
చిప్ చిన్నదే.. కానీ దాని ఎఫెక్ట్ చాలా పెద్దది
ముంబై: పండుగ సీజన్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆటో కంపెనీలకు నిరాశ ఎదురైంది. పరిశ్రమను సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ చిప్‌ల కొరత వేధించడంతో సెప్టెంబర్ విక్రయాల్లో క్షీణత నమోదైంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రాతో సహా ఆటో పరిశ్రమలో పలు కంపెనీల విక్రయాలు తగ్గాయి. సమీక్షించిన నెలలో మారుతీ సుజుకీ 86,380 యూనిట్ల వాహనాలను అమ్మగా.. గతేడాది సెప్టెంబర్‌లో మొత్తం 1,60,442 యూనిట్లను విక్రయించింది. ‘‘ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగానే సెప్టెంబర్ అమ్మకాలు తగ్గాయి. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాము’’ అని మారుతీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు 23 శాతం క్షీణించి 45,791 వాహనాలకు చేరాయి. అయితే వార్షిక ప్రాతిపదికన టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్, నిస్సాన్ మోటార్స్ విక్రయాలు వరుసగా 26%, 28%, 100% చొప్పున వృద్ధిని సాధించాయి. చదవండి: జియోకు కొత్త చిక్కులు,పెరగనున్న 'జియో నెక్ట్స్' ఫోన్ ధరలు? -
బంగారం ధరలు: మరింత ప్రియం!
Gold Rates Increase: బంగారం ధర ఆకాశాన్నంటింది. దీంతో కొనుగోళ్లు లేక అమ్మకందారులు గత 6 నెలల నుంచి అందోళన చెందుతున్నారు. దీనికి తోడు వివిధ షాపింగ్ మాల్స్‌లో రెడిమెడ్ బంగారు అభరణాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. శ్రావణమాసంలో అనేక పెండ్లిళ్లు శుభకార్యాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయని ఊహించిన అమ్మకందారులు నిరాశ చెందుతున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా, లాక్డౌన్, ఆన్‌సీజన్ తదితర కారణాలతో బంగారు అమ్మకాలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో గత ఐదు రోజుల నుంచి జిల్లా బులియన్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 ఉంది. వెండి రూ. కిలో 64,100 నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడిరేటు పైకి చేరడంతో దేశీయ మార్కెట్లోను ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బులియన్‌మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకులు బంగారంపై తక్కువ రేటుకు రుణాలుస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు రూ. తులం 50వేలు చేరుకునే అవకాశం ఉందని అమ్మకందారులు చెబుతున్నారు. తగ్గిన అమ్మకాలు 2020 మార్చిలో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధి కోల్పొగా... కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు తనాఖ పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. మరికొంత మంది శుభకార్యాల కోసమని తక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశారు. దీంతో అమ్మకాలు ఆశించిన విధంగా జరుగక వ్యాపారులు అందోళన చెందుతున్నారు. పెరిగే అవకాశం ఉంది బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో రానున్న దసరా, దీపావళి పండుగకు 10గ్రాముల, 24 క్యారెట్ల బంగారం రూ. 50వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. పండుగలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ బాగా ఉంది. – చిలుక ప్రకాష్, బంగారం వ్యాపారి, కుమార్గల్లి అవసరానికే కొనుగోళ్లు కరోనా, ఈ మధ్య కాలంలో శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. షాపింగ్‌మాల్స్‌లలో రెడిమెడ్ బంగారు అభరణాలు లభిస్తుండటంతో అవసరానికి అక్కడ అభరణాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ వృత్తిని నమ్ముకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – శ్రీనివాస్, బంగారం అమ్మకందారుడు రెడీమేడ్ ఆర్నమెంట్స్‌పై మక్కువ బంగారాన్ని కొనుగోలు చేసి అభరణాలను తయారుచేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది ఆర్నమెంట్ బంగారం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరగడం అందోళన కలుగజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రిచాలి. పెరుగుతున్న ధరలను తగ్గించాలి. – శారద, గృహిణి, ప్రగతినగర్ చదవండి : యస్.. మేం ఆన్లైన్ బానిసలం -
ఫ్యాషన్ మార్కెట్ ఢమాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 సెకండ్ వేవ్ అన్ని రంగాలనూ దెబ్బ తీసింది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మొదటి వేవ్ నుంచి పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ఒక్కసారిగా ముంచెత్తడంతో విక్రయాలు ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దుస్తులు, పాదరక్షలు, సుగంధ పరిమళాలు, చేతి గడియారాలు, లెదర్ వస్తువులు, యాక్సెసరీస్.. వస్తువు ఏదైనా గతంలో వీటి కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసిన కస్టమర్లు ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విక్రయాలు తగ్గడంలో వర్క్ ఫ్రం హోమ్ ప్రభావమూ ఉంది. అత్యవసరాలకే ప్రాధాన్యత.. మహమ్మారి లక్షలాది కుటుంబాలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. దీంతో ప్రజలు అత్యవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఫ్యాషన్ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సెకండ్ వేవ్ దెబ్బకు దాదాపు 49 శాతం మంది ఆర్థిక కష్టాలతో సావాసం చేస్తున్నట్లు వే2న్యూస్ ఇటీవలి సర్వేలో తేలింది. విపరీతంగా పెరిగిన ఆస్పత్రి ఖర్చులు, ఉద్యోగాలు కోల్పోవడం, సరైన వేతనాలు లేక, జీతాల్లో కోత పడటంతో కొనుగోలు శక్తి తగ్గిందని కస్టమర్లు తెలిపారు. పౌష్టికాహారం, ఇంటి అవసరాలు, పరిశుభ్రత ఖర్చులు పెరిగినట్లు వారు చెప్పారు. ఫ్యాషన్ రంగంలోని రిటైలర్లకు కోవిడ్–19 ముందస్తు స్థాయి రికవరీకి రెండేళ్లు పడుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవలి తన నివేదికలో వెల్లడించింది. డిసెంబర్ త్రైమాసికంలో 70 శాతం అమ్మకాలు నమోదు చేసిన పరిశ్రమ.. మార్చి నుంచి ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో కుప్పకూలిందని తెలిపింది. రద్దు అవుతున్న ఆర్డర్లు.. సాధారణ విక్రయాలతో పోలిస్తే ఏప్రిల్‌లో అమ్మకాలు 25 శాతం లోపే నమోదయ్యాయని క్లాతింగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. 50 శాతంపైగా ఆర్డర్లు రద్దు అయ్యాయని, బాకీలు 25 శాతంలోపే వసూలు అవుతున్నాయని వెల్లడించింది. దీనినిబట్టి రిటైల్ మార్కెట్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లెనిన్ దుస్తులు, పర్ఫ్యూమ్స్, లెదర్ వస్తువులు, యాక్సెసరీస్ అమ్మకాలు దాదాపు లేనట్టేనని విక్రేతలు అంటున్నారు. దుస్తుల అమ్మకాలు 10–15 శాతం మించట్లేదని వారు అంటున్నారు. రెండేళ్ల వరకు పరిశ్రమకు ఇబ్బంది తప్పదని సీఎంఆర్ షాపింగ్ మాల్స్ చైర్మన్ మావూరి వెంకటరమణ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వ్యయాలను నియంత్రించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. చిన్న బ్రాండ్స్ కనుమరుగు.. దేశంలో ఫ్యాషన్ మార్కెట్లో తయారీతోపాటు విక్రయంలో 10 శాతం కంపెనీలు ఉన్నట్టు సమాచారం. 90 శాతం కంపెనీలు మార్కెటింగ్‌కే పరిమితమయ్యాయి. ఇక బ్రాండ్ ఔట్లెట్ల విషయంలో కంపెనీల నిర్వహణలో 35 శాతం దుకాణాలు ఉన్నాయి. మిగిలినవి ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు. బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఈక్విటీ, ప్రకటనల వాటా, ప్రమోషన్స్ పేరుతో లక్షలాది రూపాయలు ఫ్రాంచైజీలు చెల్లించుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేసి ఔట్లెట్లను తెరిచిన ఫ్రాంచైజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నగదు చెల్లించి కొనుగోలు చేసిన స్టాక్ అమ్ముడుపోకుండా పేరుకుపోయాయి. కస్టమర్లు ఆన్‌లైన్‌కు మళ్లడం, ఆఫ్‌లైన్ సేల్స్ లేకపోవడం, అద్దెల భారంతో వర్తకులు నష్టాలను మూటగట్టుకుంటున్నారని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. సెకండ్ వేవ్ ప్రభావంతో చిన్న బ్రాండ్స్ కనుమరుగు అవుతాయని అన్నారు. నష్టాలను భరించగలిగే విక్రేతలు మాత్రమే నిలదొక్కుకుంటారని చెప్పారు. -
Air Cooler Sales: ఏసీల విక్రయాలు ఢమాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్స్ (ఏసీ), రిఫ్రిజిరేటర్ల విక్రయాలపై కరోనా–19 ఎఫెక్ట్ పడింది. అమ్మకాలు పడిపోవడం వరుసగా ఇది రెండవ ఏడాది. వైరస్ వ్యాప్తి చెందడం, లాక్డౌన్స్ కారణంగా అత్యంత కీలకమైన వేసవి సీజన్లో సేల్స్ లేకపోవడం పరిశ్రమకు కోలుకోలేని దెబ్బపడింది. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో అమ్మకాలు 75 శాతం పడిపోయాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇక మే నెలలో విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వినియోగదార్లలో సెంటిమెంట్ పడిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కోవిడ్–19 తగ్గే వరకు ఖర్చులను నియంత్రించుకోవాలన్నది కస్టమర్ల భావనగా ఉందని చెబుతున్నాయి. భారత్‌లో గృహాల్లో వినియోగించే ఏసీల వార్షిక మార్కెట్ 70–75 లక్షల యూనిట్లు. 15కు పైగా కంపెనీలు పోటీపడుతున్నాయి. గతేడాది నుంచీ కష్టాలే.. భారత్‌లో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 2020 ఏప్రిల్‌లో పూర్తిగా నిలిచిపోయాయి. 2019తో పోలిస్తే గతేడాది మే నెలలో 10 శాతానికే అమ్మకాలు పరిమితమయ్యాయి. జూన్‌లో 25 శాతం జరిగాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో సేల్స్ 75 శాతం పడిపోయాయి. లాక్డౌన్స్, కర్ఫ్యూలతో మే నెల అమ్మకాలు పూర్తిగా కనుమరుగు అయినట్టేనని పరిశ్రమ చెబుతోంది. సంవత్సరం పొడవునా జరిగే ఏసీ, రిఫ్రిజిరేటర్ల విక్రయాల్లో ఏప్రిల్–జూన్ వాటా 35 శాతం దాకా ఉంటుంది. దేశంలో కేవలం 15 శాతం మార్కెట్ మాత్రమే తెరిచి ఉందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. స్టోర్లకు వచ్చే వినియోగదార్లు అతి తక్కువ అని వివరించారు. ముడి సరుకు భారం అవుతున్నందున ఏసీల ధరలు 8 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వీటి ధరలు 12 శాతం వరకు అధికమయ్యాయి. లాక్డౌన్స్ ముందు వరకు ఏసీల డిమాండ్ ఉన్నప్పటికీ చిప్ కొరతతో సరఫరా 10 శాతమే ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. అంచనాలు తారుమారయ్యాయి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి ఉంటుందని భావించినట్టు వోల్టాస్ తెలిపింది. సెకండ్ వేవ్, పరిమితుల కారణంగా లక్ష్యాలను పునర్ పరిశీలించుకోవాల్సి వస్తోందని వివరించింది. తొలి త్రైమాసికం అమ్మకాలు తుడిచిపెట్టుకు పోయినట్టేనని ఆందోళన వ్యక్తం చేసింది. 2019లో సాధించిన విక్రయాలు ఈ ఏడాది కూడా నమోదు చేస్తే అదే ఎక్కువ అని దైకిన్ అంటోంది. మార్చిలో ఏసీ సేల్స్ సానుకూలంగా ప్రారంభమయ్యాయని ప్యానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. ఒక్కసారిగా కోవిడ్ కేసులు అధికం కావడం, పాక్షిక లాక్డౌన్లతో వేసవి అమ్మకాలు క్షీణించాయని చెప్పారు. ఏప్రిల్–జూన్ కాలంలో 50% నష్టం అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. స్టాక్ సరిపడ ఉందని గుర్తు చేశారు. లాక్డౌన్స్, కర్ఫ్యూలు జూన్ వరకే ఉంటాయి. అయితే అప్పటికే సీజన్ పూర్తి అవుతుందని హాయర్ అభిప్రాయపడింది. కీలకమైన మే నెలలో సేల్స్ సాధించకపోతే తరువాత చేయలేమని వివరించింది. గతేడాది జూలై, ఆగస్టులో మార్కెట్ పుంజుకుంది. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేదు అని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. -
ప్రీ–కోవిడ్ స్థాయికి పెట్రోల్ డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో దారుణంగా పడిపోయిన పెట్రోల్ డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్య భద్రతల దృష్ట్యా ప్రయాణికులు ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాకే ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ సెప్టెంబర్ ప్రథమార్థంలో పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు ప్రీ–కోవిడ్ స్థాయిని అందుకున్నాయని ప్రిలిమినరీ ఇండస్ట్రీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అమ్మకాలు 9.45లక్షల టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 9లక్షల విక్రయాలతో పోలిస్తే ఇది 2.2శాతం అధికం. ఇక నెలవారీ పరిశీలిస్తే ఆగస్ట్ 1–15 మధ్య మొత్తం అమ్మకాలు 9లక్షల టన్నులుగా ఉన్నాయి. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు(మార్చి 25)తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. మరోవైపు డీజిల్‌కు డిమాండ్ పెరగడం లేదు. సమీక్షించిన కాలంలో వార్షిక ప్రాతిపదిక డీజిల్ అమ్మకాలు 6శాతం క్షీణత నమోదు చేశాయి. ఇక నెలవారీగా ఆగస్ట్‌తో పోలిస్తే అమ్మకాలు 19.3శాతం పెరిగాయి. అదే విధంగా వార్షిక ప్రాతిపదికన జెట్ ఫ్యూయల్ అమ్మకాలు 60శాతం క్షీణత చవిచూడగా, ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు 12.5శాతం వృద్ధిని సాధించాయి. కార్ల అమ్మకాలు 14శాతం పెరగ్గా, ద్విచక్ర వాహన అమ్మకాలు 3శాతం తగ్గాయి. లాక్డౌన్ సడలింపులతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతుంది. అయితే రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పరిమితులతో కూడిన లాక్డౌన్ విధింపులు డిమాండ్ పుంజుకునేందుకు ఆటంకాన్ని కల్గిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అన్‌లాక్ ప్రక్రియతో డిమాండ్ రికవరీ సంకేతాలు కన్పిస్తున్నాయని అయితే నెలవారీ వినియోగ వృద్ధిని అధిగమించేందుకు ఈ ఏడాది చివరి వరకు పట్టవచ్చని ఐఓసీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య అన్నారు. -
ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 25% క్షీణత
అటో పరిశ్రమను కరోనా సంక్షోభం వెంటాడుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు భారీగా క్షీణించాయి. ఈ జూలైలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 1,57,373 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది(2019)లో ఇదే జూన్‌లో అమ్ముడైన 2,10,377 యూనిట్లతో పోలిస్తే 25శాతం తక్కువని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. కరోనా ఎఫెక్ట్ జూలైలోనూ కొనసాగడం వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఎఫ్ఏడీఏ చెప్పుకొచ్చింది. ద్విచక్ర వాహన అమ్మకాలు జూలైలో 37.47శాతం క్షీణించి 8,74,638 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే జూలైలో మొత్తం అమ్మకాలు 13,98,702 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన అమ్మకాలు ఏకంగా 72.18శాతం పడిపోయి 19,293 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో త్రిచక్ర వాహనాల విక్రయాలు క్షీణతను చవిచూశాయి. గతేడాది జూలైలో పోలిస్తే అమ్మకాలు 74.33శాతం పతనమై 15,132 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాలు కలిపి మొత్తం అమ్మకాలు 11,42,633 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 17,92,879 యూనిట్లతో పోలిస్తే 36.27శాతం తగ్గదల చోటుచేసుకుంది. వాహన విక్రయాలపై ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ ‘‘జూన్‌తో పోలిస్తే జూలైలో రిటైల్ వాహన అమ్మకాలు ఊపందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే విక్రయాలు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు వాస్తవ డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. గతేడాది జూలైలో లోబేస్ ఉన్నప్పటికీ అమ్మకాలు డబుల్ డిజిట్ క్షీణతను చవిచూశాయి’’ అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారమైన వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్, చిన్న వాణిజ్య వాహనాలు, మోటర్ సైకిల్ విభాగాల్లో అమ్మకాల వృద్ధి కొనసాగిందని ఖేల్ తెలిపారు. డిమాండ్‌ను పెంచే విధివిధానాలను ప్రకటించాలని ఎఫ్ఏడీఏ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు. ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానం కోసం పరిశ్రమ ఆత్రంగా ఎదురుచూస్తోందని ఇది మధ్య, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలకు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అటో తయారీ హబ్స్‌లో లాక్డౌన్ విధింపు లేకపోతే అగస్ట్ అమ్మకాలు ఆశాజనకంగా ఉండొచ్చని కాలే అభిప్రాయపడ్డారు. -
67 శాతం పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 67 తగ్గినట్టు ప్రాప్‌ఈక్విటీ అనే సంస్థ తెలిపింది. ఈ కాలంలో 21,294 ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయినట్టు గణాంకాలను విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 64,378 యూనిట్లు (ఇళ్లు/ఫ్లాట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ‘‘నోయిడాను మినహాయిస్తే మిగిలిన ఎనిమిది ప్రధాన పట్టణాల్లో అమ్మకాలు పడిపోయాయి. గురుగ్రామ్‌లో అత్యధికంగా 79 శాతం క్షీణత నెలకొంది. కేవలం 361 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 74 శాతం తగ్గి 996 ఇళ్ల విక్రయాలు నమోదు కాగా, చెన్నైలోనూ ఇంతే స్థాయిలో అమ్మకాలు తగ్గాయి. బెంగళూరులో 73 శాతం, కోల్‌కతాలో 75 శాతం చొప్పున అమ్మకాలు క్షీణించాయి. ముంబైలో 63 శాతం తగ్గి కేవలం 2,818 యూనిట్లకే విక్రయాలు పరిమితమైనట్టు’’ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. నోయిడాలో మాత్రం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు 5 శాతం పెరిగి 1,177 యూనిట్లుగా నమోదైనట్టు పేర్కొంది. -
సిమెంటు కంపెనీల పల్లెబాట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 దేశవ్యాప్తంగా అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. ఇందులో సిమెంటు రంగం కూడా ఒకటి. కార్మికులు లేక నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో సిమెంటుకు డిమాండ్ లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతుండడం కంపెనీలకు కాస్త ఊరటనిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు రవాణా ఆగిపోవడంతో ఇప్పుడు కంపెనీలు గ్రామాలపై దృష్టిపెట్టాయి. అయితే కార్మికులు తిరిగి వస్తేనే నిర్మాణ రంగం గాడిన పడుతుందన్నది కంపెనీల మాట. జనవరి–మార్చి నాటికి మార్కెట్ సాధారణ స్థితికి వస్తుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది. గ్రామీణ ప్రాంతాలే ఆధారం... ప్రస్తుతం జరుగుతున్న సిమెంటు వినియోగంలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల నుంచే జరుగుతోందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పట్టణాల్లో నిర్మాణాలు చాలా మందకొడిగా సాగుతున్నాయని చెప్పారు. ఊహించినదానికంటే అధికంగా పట్టణేతర ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు. నిర్మాణ రంగంలో ఇప్పుడు 30% మాత్రమే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కార్మికులు తిరిగి వస్తేనే సిమెంటుకు మంచి రోజులని వ్యాఖ్యానించారు. ప్లాంట్లలో తయారీ 25–30 శాతానికి పడిపోయిందన్నారు. ఇది జూలై–సెప్టెంబరులో 40–50%కి చేరుతుందన్న విశ్వాసం ఉందని చెప్పారు. కార్మికుల ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక రంగ ప్రాజెక్టులపై పెట్టుబడులు చేస్తుందని తాము భావిస్తున్నామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి–మార్చికల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. పదేళ్లుగా ధర అక్కడే..: తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా సిమెంటు బస్తా ధర రూ.350 చుట్టూ తిరుగుతోందని రవీందర్ రెడ్డి అన్నారు. ‘ద్రవ్యోల్బణం ప్రకారం చూసుకున్నా ఆ స్థాయిలో ధర పెరగలేదు. ప్లాంట్లలో ఉత్పత్తి 60–65 శాతమైతే బస్తా ధర రూ.350 ఉన్నా సరిపోతుంది. తయారీ 10% తగ్గితే బస్తాపైన వ్యయం రూ.25–30 అధికం అవుతుంది. ఇప్పుడు ప్లాంట్ల సామర్థ్యం 25–30%కి పరిమితమైంది. ఉత్పత్తి లేకున్నా సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లించాం. ఇవన్నీ కంపెనీలకు భారమే. గతేడాది సగటుతో పోలిస్తే ధర 1% మాత్రమే పెరిగింది. జీఎస్టీ 28 శాతం ఉంది. దీనిని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం’ అని వివరించారు. ఇక రవాణా సమస్యలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు సరఫరాపై కంపెనీలు దృష్టిపెట్టాయి. కరోనా నియంత్రణలోకి వస్తేనే రవాణా సమస్యల నుంచి గట్టెక్కుతామనేది కంపెనీల మాట. సిమెంటు అమ్మకాలు ఇలా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జనవరిలో 23 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో 17, మార్చిలో 14 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. కోవిడ్–లాక్డౌన్ ప్రభావంతో ఏప్రిల్‌లో ఇది 3.65 లక్షల టన్నులకు దిగొచ్చింది. అమ్మకాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇదే తక్కువ పరిమాణం. మే నెలలో ఇరు రాష్ట్రాలు చెరి 7 లక్షల టన్నుల విక్రయాలు సాధించాయి. ఇందులో ఒక లక్ష టన్నుల మేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్డర్లే ఉంటాయి. ఇక 2019 మే నెలలో 22 లక్షల టన్నులు కాగా, అదే ఏడాది జనవరిలో అత్యధికంగా 31 లక్షల టన్నుల సిమెంటు విక్రయాలు నమోదయ్యాయి. గత నెలతో పోలిస్తే జూన్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ భావిస్తోంది. -
టాటా మోటార్స్ నష్టాలు 9,864 కోట్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.9,864 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) ఇదే క్వార్టర్లో రూ.1,109 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా మోటార్స్ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలంతో దేశీయ వ్యాపారమే కాకుండా లగ్జరీ కార్ల విభాగం, జేఎల్ఆర్ వ్యాపారం కూడా దెబ్బతినడంతో గత క్యూ4లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కార్యకలాపాల ఆదాయం రూ.86,422 కోట్ల నుంచి 28 శాతం క్షీణించి రూ.62,493 కోట్లకు తగ్గిందని పేర్కొంది. సాధారణ ఆర్థిక మందగమనం, లిక్విడిటీ ఒత్తిడి, బీఎస్–సిక్స్ నిబంధనల అమలు కారణంగా నిల్వలకు సంబంధించి సమస్యలకు తోడు లాక్డౌన్ కారణంగా అమ్మకాలు భారీగా పడిపోయాయని వెల్లడించింది. చైనాలో సేల్స్ పుంజుకుంటున్నాయని జేఎల్ఆర్ సీఈఓ రాల్ప్ స్పెత్ పేర్కొన్నారు. ► జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్)కు గత క్యూ4లో 50 కోట్ల పౌండ్ల (సుమారు రూ. 4,750 కోట్లు) నికర నష్టాలు, 540 కోట్ల పౌండ్ల (సుమారు రూ.51,300 కోట్లు) ఆదాయం వచ్చింది. ► స్డాండ్ అలోన్ పరంగా, 2018–19 క్యూ4లో రూ.106 కోట్ల నికర లాభం రాగా, గతేడాది క్యూ4లో రూ.4,871 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.28,724 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,975 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.2.61 లక్షల కోట్లకు తగ్గింది. ► మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 4.5% నష్టంతో రూ.100 వద్ద ముగిసింది. అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్సే ్చంజ్‌లో లిస్టైన టాటా మోటార్స్ ఏడీఆర్ మాత్రం 7% ఎగసి ఏడు డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మారుతీ లాభం 28 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 28 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.1,831 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,322 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ తెలిపింది. అమ్మకాలు తగ్గడం, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, తరుగుదల వ్యయాలు కూడా అధికం కావడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.21,473 కోట్ల నుంచి 15 శాతం క్షీణించి రూ.18,208 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 60 డివిడెండ్‌ను ప్రకటించింది. ► గత క్యూ4లో మొత్తం కార్ల అమ్మకాలు 16 శాతం తగ్గి 3.85 లక్షలకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.7,651 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం క్షీణించి రూ.5,678 కోట్లకు తగ్గింది. ► నికర అమ్మకాలు రూ.86,069 కోట్ల నుంచి రూ.75,661 కోట్లకు తగ్గాయి. ► ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మారుతీ షేర్ 1.8 శాతం లాభంతో రూ.5,035కు పెరిగింది. ఉద్యోగాలు, వేతనాల్లో కోత లేదు: గత ఏడాది నుంచి వాహన పరిశ్రమ సుదీర్ఘ సంక్షోభాన్ని ఎదుర్కొంటొందని, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో, వేతనాల్లో ఎలాంటి కోత విధించలేదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ వ్యాఖ్యానించారు. -
‘తీపి’ తగ్గింది!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నష్టాల ఊబిలో ఉన్న చక్కెర కంపెనీలకు లాక్డౌన్ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. డిమాండ్ లేకపోవడం, సరఫరా సమస్యలు పరిశ్రమకు కొత్తగా తోడయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 50 శాతం మేర అమ్మకాలు పడిపోయాయని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్యాక్టరీల వద్ద షుగర్ నిల్వలు పేరుకుపోయాయి. ఆదాయం తగ్గడం, కార్మికుల వేతనాలు, వడ్డీలు.. వెరసి చేతిలో ఉన్న మూలధనం కాస్తా ఆవిరైందని కంపెనీలు అంటున్నాయి. ఇప్పట్లో ఈ రంగం కోలుకోవడం కష్టమేనని కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకు సుమారు 22 లక్షల టన్నుల చక్కెర అమ్ముడవుతోంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం గత సీజన్లో భారత్‌లో 172 మిల్లులు చక్కెర ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత సీజన్లో ఈ సంఖ్య 139కి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నష్టాల్లోనే కంపెనీలు.. బస్తా (100 కిలోలు) చక్కెర ఉత్పత్తి వ్యయం ప్రస్తుతం రూ.4,000 పైమాటే. మిల్లుల వద్ద విక్రయ ధర రూ.3,400 ఉంది. అంటే ఒక్కో బస్తాపై కంపెనీలు రూ.600 నష్టం మూటగట్టుకుంటున్నాయి. చిన్న కంపెనీలకైతే∙రూ.700 వరకు నష్టం వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 100 కిలోల బస్తాకు మిల్లు వద్ద అమ్మకం ధర రూ.4,200 ఉంటేనే కంపెనీలు మనగలవని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వర రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒకట్రెండు కంపెనీలు మినహా మిగిలినవన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. శానిటైజర్ల తయారీని కొన్ని కంపెనీలు చేస్తున్నప్పటికీ, వీటి ద్వారా వచ్చే ఆదాయం తాత్కాలికమేన న్నారు. రికవరీ ఇప్పట్లో కష్టమే..: కౌలు ధర అధికంగా ఉండడం, కూలీ ఖర్చులు తడిసిమోపెడు అవడం, ఉత్పత్తికి ధర లేకపోవడంతో చెరకు పంట వేయడానికి రైతులు ముందుకు రావడం లేదని వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. దేశంలో అప్పులు లేని కంపెనీలు ఒకట్రెండు మాత్రమే ఉంటాయి. వైరస్ భయానికి ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కార్మికులు రావడం లేదు. లాక్డౌన్ తదనంతరం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలలకుపైగా సమయం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల కోత, వేతనాల కుదింపు తప్పదు. మిల్లు వద్ద విక్రయ ధర పెరిగితే తప్ప ఈ పరిశ్రమ రికవరీ ఇప్పట్లో కనపడడం లేదు’ అని చెప్పారు. అక్టోబర్ నాటికి..: దేశంలో 2019 అక్టోబరు 1 నాటికి 110 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉన్నాయి. 2019–20 (అక్టోబర్–సెప్టెంబర్) క్రషింగ్ కాలంలో దేశవ్యాప్తంగా 270 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని సమాచారం. ఈ ఏడాది 50–60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి కావచ్చని పరిశ్రమ భావించగా, ఇప్పటికి సుమారు 30 లక్షల టన్నులే ఎగుమతైంది. అంతర్జాతీయంగా తక్కువ ధర, సరఫరా సమస్యల కారణంగా 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఆగిపోనుందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి చక్కెర నిల్వలు దేశంలో సుమారు 75 లక్షల టన్నులు ఉంటాయని ఆయన చెప్పారు. -
యాపిల్‌కు కరోనా దెబ్బ
బెర్కిలీ, అమెరికా: కరోనా వైరస్ వ్యాప్తిపరమైన ప్రతికూల పరిణామాలతో టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు మందగించాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ఐఫోన్ విక్రయాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7 శాతం తగ్గాయి. సంస్థ లాబాలు 2 శాతం క్షీణించి 11.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సరఫరాపరమైన సమస్యలు, వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అమలవుతున్న లాక్డౌన్ కారణంగా స్టోర్స్ మూతబడటం తదితర అంశాలు ఇందుకు కారణం. అయితే, ఆదా యం స్వల్పంగా 1 శాతం పెరిగి 58.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2007– 2009 కాలంలో తలెత్తిన మాం ద్యం నాటి పరిస్థితి కన్నా ప్రస్తుత మందగమ నం మరింత తీవ్రంగా ఉండవచ్చని యాపిల్ సీఈవో టిమ్ పేర్కొన్నారు. అయితే, అనలిస్టుల అంచనాలకన్నా యాపిల్ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినట్లు పరిశ్రమవర్గాలు తెలిపా యి. జనవరి–మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదా యం 6% పడొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. -
రియల్టీకి లక్ష కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు దేశీయ రియల్టీ రంగానికి కరోనా వైరస్ కలిగించిన నష్టం అక్షరాలా లక్ష కోట్లు. రోజు రోజుకూ ఈ లాస్ మరింత పెరుగుతుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయపడ్డారు. దేశీయ రియల్టీ ఎదుర్కొంటున్న కరోనా ప్రభావాన్ని అధిగమించడానికి, నష్టాలను తగ్గించడానికి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని క్రెడాయ్, నరెడ్కో సంఘాలు కేంద్రాన్ని కోరాయి. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాల రంగం రియల్ ఎస్టేట్. లాక్డౌన్ నేపథ్యంలో నగదు కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ రంగంలోనూ ఉద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు వంటివి తప్పవని క్రెడాయ్ నేషనల్ చైర్మన్ జక్షయ్ షా తెలిపారు. లాక్డౌన్ కొనసాగే కాలాన్ని బట్టి తొలగింపు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. 25 శాతం తొలగింపులు.. అమ్మకాల క్షీణతతో కంపెనీలు చేసే మొదటి నిర్ణయం వేతనాల తగ్గింపే. లిక్విడిటీ కొరత కారణంగా డెవలపర్లు రుణాల చెల్లింపులు చేయడంలో డిఫాల్ట్ అవుతారు. ఫలితంగా కంపెనీలు దివాళ తీస్తాయి. దీంతో ఉద్యోగుల తొలగింపులు తప్పవని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హిర్‌నందానీ తెలిపారు. ప్రభుత్వం రియల్టీ రంగానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే.. కంపెనీలు దివాలా తీయడం, ఉద్యోగాలు కోల్పోవటం వంటివి జరగవని తెలిపారు. లాక్డౌన్ కంటే ముందు శ్రామిక శక్తిలో ఉద్యోగుల తొలగింపు 15 శాతంగా ఉంటే.. ప్రస్తుతమిది 25 శాతానికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. -
ఇంటి ఈఎంఐలు చెల్లించట్లేదు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కరోనా వైరస్ రూపంలో కొత్త కష్టాలొచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో గృహ కొనుగోలుదారులు 65% వాయిదా చెల్లింపులు చేయటం లేదని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) తెలిపింది. కొత్త ప్రాజెక్ట్‌లలో గృహ అమ్మకాలు క్షీణించడంతో పాటూ వాయిదా చెల్లింపుల్లేక నిర్మాణ సంస్థలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని ఐసీసీ డైరెక్టర్ రజనీష్ షా తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు కూడా లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు తమ చెల్లింపులను వాయిదా వేయాలని డెవలపర్లను కోరుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ తరహా అభ్యర్థనలు మరింత పెరిగే సూచనలున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశీ రియల్టీ రంగం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ రంగం వాటా 5%గా ఉంటుంది. రియల్టీకి పేమెంట్ యాక్ట్ తేవాలి.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు(ఎంఎస్ఎంఈ) మాదిరిగానే ఆలస్యం చెల్లింపు చట్టం (డిలేయిడ్ పేమెంట్ యాక్ట్) రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపజేయాలని.. ఈ మేరకు కొన్ని సిఫార్సులను ఐసీసీ కేంద్రానికి సూచించింది. ఈ చట్టంతో కస్టమర్ల డిఫాల్ట్ పేమెంట్స్‌ను నిరుత్సాహపరుస్తుందని.. ఒకవేళ డెవలపర్లు అంగీకరించిన కాలానికి వాయిదా చెల్లింపులు మించిపోతే గనక సంబంధిత ఆలస్య చెల్లింపులపై జరిమానా వడ్డీని వసూలు చేయడానికి వీలవుతుందని రజనీష్ తెలిపారు. రియల్టీకి అత్యవసర ప్రాతిపదికన సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. గడువును 6 నెలలు పొడిగించాలి.. కార్మికులు, ముడిసరుకుల కొరత కారణంగా నివాస ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం కష్టమవుతుంది. అందుకే సంబంధిత ప్రాజెక్ట్‌ల నిర్మాణ గడువు తేదీని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుంచి 6 నెలల కాలం పొడిగించాలని షా కోరారు. కనీస ఒక త్రైమాసికం పాటైనా మున్సిపల్ పన్నులను మాఫీ చేయాలని సూచించింది. పన్నులు, బిల్లులు చెల్లించలేని సంస్థలకు జరిమానాలు విధించరాదని, ఆయా సంస్థలు తిరిగి చెల్లించడానికి 3–6 నెలల సమయం ఇవ్వాలని సూచించారు. వడ్డీ లేని రుణ వాయిదాలను 6 నెలల పాటు అందించాలన్నారు. -
స్మార్ట్‌ఫోన్‌కు ‘కరోనా’ ముప్పు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కట్టడి కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేశీ స్మార్ట్‌ఫోన్స్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోనుంది. ఇది సుమారు 2 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్‌లో విక్రయాలు గణనీయంగా మందగించడం ఇందుకు కారణంగా ఉంటుందని పేర్కొంది. మార్చి మధ్య దాకా కరోనా మహమ్మారి ప్రభావం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత విజృంభిస్తుండటంతో లాక్డౌన్ అనివార్యమైందని వివరించింది. దీని ఫలితంగా 2020లో స్మార్ట్ఫోన్ల విక్రయం గతేడాది నమోదైన 15.8 కోట్లతో పోలిస్తే 3 శాతం తగ్గి 15.3 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మార్చిలో 27 శాతం తగ్గనుండగా, ఏప్రిల్ 14 దాకా లాక్డౌన్ కొనసాగితే ఈ నెలలో దాదాపు 60 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారికి మూలకేంద్రమైన చైనా నుంచి విడిభాగాల సరఫరా దెబ్బతినడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తీవ్రంగా ఇబ్బందిపడ్డాయి. లాక్డౌన్ పెంచితే మరింతగా నష్టాలు.. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగించిన పక్షంలో నష్టాలు మరింత పెరగవచ్చని పాఠక్ చెప్పారు. మొత్తం సరఫరా వ్యవస్థ, ఆదాయాలు, చెల్లింపులు మొదలైనవన్నీ దెబ్బతినడమే ఇందుకు కారణమన్నారు. పైపెచ్చు వినియోగదారులు ఎక్కువగా పొదుపునకు ప్రాధాన్యమిచ్చి, కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం వల్ల డిమాండ్ పడిపోవచ్చని పాఠక్ వివరించారు. భారత్‌ను ఎగుమతుల హబ్‌గా చేసుకున్న ఫ్యాక్టరీలపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే, పరిస్థితి మెరుగైతే ఉత్పత్తిని వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఫ్యాక్టరీలు.. ఉద్యోగాల్లో కోతలు విధించడానికి మొగ్గు చూపకపోవచ్చన్నారు. పండుగల సీజన్ దాకా ఇంతే.. ఈ ఏడాది ద్వితీయార్థానికి గానీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఉండకపోవచ్చని పాఠక్ చెప్పారు. ‘ఈ ఏడాది మధ్య నాటికి పరిస్థితి మెరుగుపడినా కూడా.. పండుగల సీజన్ దాకా వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి సాధారణ స్థాయికి తిరిగొస్తే .. ఆన్లైన్ విక్రయాలూ మెరుగుపడొచ్చన్నారు. ఆఫ్‌లైన్ విక్రేతలకు ఆకర్షణీయ ఆఫర్లివ్వడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ స్టాక్స్ సత్వరం అందుబాటులో ఉంచేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తాయని చెప్పారు. -
వాహన విక్రయాలు లాక్‘డౌన్’
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి నిర్దేశించిన లాక్డౌన్ మార్చి వాహన విక్రయాలపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. దీనికితోడు బీఎస్6 పర్యావరణ నిబంధనలు అమల్లోకి రానుండటంతో వాహన అమ్మకాలు భారీగానే తగ్గాయి.మారుతీ సుజుకీ, హ్యుందాయ్ అమ్మకాలు దాదాపు సగం వరకూ తగ్గగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ (టీకేఎమ్) కంపెనీల అమ్మకాలు 40–90% రేంజ్లో క్షీణించాయి. -
పౌల్ట్రీకి 1,750 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: చికెన్ వల్ల కరోనా వైరస్ (కోవిడ్–19) ప్రబలుతోందన్న వదంతుల మూలంగా పౌల్ట్రీ పరిశ్రమ గణనీయంగా దెబ్బతింది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 1,750 కోట్ల మేర నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో తక్షణం సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖకు పౌల్ట్రీ రంగం విజ్ఞప్తి చేసింది. చికెన్‌కు డిమాండ్ తగ్గిపోవడంతో కోళ్ల ధరలు కేజీకి రూ. 10–30 స్థాయికి (ఫాం గేట్) పడిపోయినట్లు అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (ఏఐపీబీఏ) వెల్లడించింది. మరోవైపు సగటు ఉత్పత్తి ధర కేజీకి రూ. 80గా ఉంటోందని వివరించింది. ‘సోషల్ మీడియాలో పదే పదే వదంతులు వ్యాప్తి కావడంతో.. చికెన్‌పై వినియోగదారుల నమ్మకం సడలింది. చికెన్ ఉత్పత్తుల డిమాండ్ పడిపోయింది’ అని ఏఐపీబీఏ చైర్మన్ బహదూర్ అలీ తెలిపారు. దీంతో జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి మూడో వారం మధ్య కాలంలో బ్రాయిలర్ రైతులు, బ్రీడింగ్ సంస్థల నష్టాలు దాదాపు రూ. 1,750 కోట్లకు చేరాయని ఆయన వివరించారు. ఈ భారీ సంక్షోభంతో పౌల్ట్రీ రంగం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగిన పక్షంలో ప్రతి నెలా రూ. 1,750 కోట్ల నష్టాల భారం పడుతుందన్నారు. దేశీ పౌల్ట్రీ లో 10 లక్షల మంది పైగా రైతులు ఉపాధి పొందుతున్నారు. దేశీయంగా జొన్న, సోయాబీన్ల వినియోగం ఎక్కువగా పౌల్ట్రీ రంగంలోనే ఉంటోందని.. ఇది గానీ దెబ్బతిందంటే ఆయా రైతులకూ కష్టం తప్పదని అలీ తెలిపారు. -
ఆటో రంగానికి వైరస్ కాటు...!
న్యూఢిల్లీ: దేశీ ఆటో పరిశ్రమకు కోవిడ్–19 (కరోనా) వైరస్ కుంగదీసింది. గతేడాదిలో భారీ పతనాన్ని నమోదుచేసి.. ఈ ఏడాది ప్రారంభంలో కాస్త పర్వాలేదు అనిపించిన ఈ రంగాన్ని తాజాగా కరోనా వైరస్ మళ్లీ పడేసింది. దిగ్గజ ఆటో సంస్థ మారుతి సుజుకీ దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.6 శాతం పడిపోయాయి. గత నెల్లో 1,36,849 యూనిట్లకు పరిమితమయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర (ఎం అండ్ ఎం) అమ్మకాలు ఏకంగా 42 శాతం క్షీణించాయి. కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి సప్లై తగ్గడం వల్ల ఈ స్థాయి పతనం నమోదైందని సంస్థ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా వెల్లడించారు. వైరస్ కారణంగానే తమ కంపెనీ ఫిబ్రవరి విక్రయాలు తగ్గాయని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. -
కోవిడ్ ఎఫెక్ట్... శాంసంగ్ దూకుడు!
న్యూఢిల్లీ: కోవిడ్–19(కరోనా) వైరస్ చైనా ఎలక్ట్రానిక్ కంపెనీలను కలవరపెడుతుంటే.. భారత మార్కెట్లో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ ఈ వైరస్ రూపంలో లాభపడనుంది.! చైనా మొబైల్ తయారీ కంపెనీలు, ఎలక్ట్రానిక్ సంస్థల ప్రణాళికలపై కోవిడ్ ప్రభావం చూపిస్తోంది. యాపిల్‌తోపాటు చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, వివో, రియల్మీ తదితర ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల విడుదల ప్రణాళికల ను సమీక్షించుకుంటున్నాయి. కానీ, శాంసంగ్ మాత్రం తన ప్రణాళికలను వాయిదా వేసుకోకుండా మరింత దూకుడుగా ఉత్పత్తులను విడుదల చేసే కార్యక్రమంలో ఉంది. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గణాంకాల ప్రకారం.. శాంసంగ్ ఇండియా 2020 ప్రారంభంలోనే 9 నూతన మొబైల్ ఫోన్లకు సంబంధించి బీఐఎస్ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. కానీ, ఇదే సమయంలో షావోమీకి చెందిన రెడ్మీ, దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎల్జీ రెండేసి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ కోరడం చూస్తుంటే.. శాంసంగ్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఇదే కాలంలో మోటరోలా, కూల్‌ప్యాడ్ సంస్థలు ఒక్కొక్క ఉత్పత్తి రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నాయి. దేశీయ కంపెనీలదీ దూకుడే..: ఈ సమయంలో దేశీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల విడుదలలో వేగాన్ని పెంచడాన్ని పరిశీలించాలి. ఢిల్లీకి చెందిన సెల్కార్ జనవరి 1 నుంచి ఇప్పటికే 15 మోడళ్లకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తీసుకుని చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. మరో స్థానిక బ్రాండ్ హైటెక్ కూడా మూడు మోడళ్లకు ఈ కాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. ‘‘పెద్ద తయారీ సంస్థలు (ఓఈఎంలు) తమ ఉత్పత్తుల విడుదలను జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా బీఐఎస్ రిజిస్ట్రేషన్ తర్వాత ఉత్పత్తుల విడుదలకు 4–6 వారాలు తీసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి శాంసంగ్‌కు అనుకూలం. ఎందుకంటే ప్రముఖ తయారీ కంపెనీగా కొరియా, ఇతర ప్రాంతాల నుంచి విడిభాగాలను సమీకరించుకుంటుంది. దీంతో కంపెనీ సరఫరా వ్యవస్థపై వైరస్ ప్రభావం ఉండదు’’ అని టెక్‌ఆర్క్‌కు చెందిన ముఖ్య అనలిస్ట్ ఫైసల్కవూసా తెలిపారు. చైనా కంపెనీలకు ఇబ్బందులు.. చైనాలో కోవిడ్ వైరస్ తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లో తయారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇది సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించనుంది. దీని తాలూకూ వేడి భారత్‌లో కార్యకలాపాలు కలిగి ఉన్న చైనా కంపెనీలకు ఇప్పటికే తాకింది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలకు భారత్‌లో తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ.. విడి భాగాల కోసం అవి మాతృదేశంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కానీ, వైరస్ ప్రభావం శాంసంగ్‌పై తక్కువే ఉండనుంది. ఎందుకంటే అధిక శాతం మొబైల్ ఫోన్లను ఈ సంస్థ నోయిడాలోని కేంద్రంలోనే తయారు చేస్తోంది. పైగా 2018లో తయారీ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 68 మిలియన్ యూనిట్లుగా ఉంటే, 120 మిలియన్ యూనిట్లకు విస్తరించింది. ఇక విడిభాగాలను కూడా స్థానికంగానే సమీకరించుకుంటోంది. అలాగే, వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా కలిగి ఉంది. ‘‘చైనా సంస్థలతో పోలిస్తే శాంసంగ్ కార్యకలాపాలు ఎన్నో ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. కనుక అతిపెద్ద నిల్వలను కలిగి ఉంటుంది. చైనా నుంచి సరఫరా పరంగా ఉన్న ఇబ్బందులు మొదటి త్రైమాసికంలో శాంసంగ్‌కు కలసి రానున్నాయి’’ అని రీసెర్చ్ సంస్థ ఐడీసీ డైరెక్టర్ నవకేందర్సింగ్ తెలిపారు. పెద్దగా ప్రభావం ఉండదు.. ‘‘చాలా వరకు విడిభాగాలను భారత్‌లోనే తయారు చేస్తున్నాం. అంతేకాదు వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా ఉంది. కరోనా వైరస్ సంక్షోభ ప్రభావం మా కార్యకలాపాలపై పెద్దగా ఉండదు’’ అని శాంసంగ్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఫ్లాగ్షిప్ మోడళ్లు అయిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్, ఎస్20 ప్లస్ మోడళ్లను మార్చి నాటికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఒకప్పుడు దేశీయ మార్కెట్లో టాప్‌లో ఉన్న శాంసంగ్ 2019 డిసెంబర్ నాటికి మూడో స్థానానికి పడిపోయింది. షావోమీ, వివో తొలి రెండు స్థానాలను ఆక్రమించేశాయి. 2019 జూన్ క్వార్టర్ నాటికి శాంసంగ్‌కు 25.3% మార్కెట్ వాటా కలిగి ఉండగా, డిసెంబర్ నాటికి అది 15.5%కి తగ్గింది. భారత మార్కెట్లో ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ ధర రూ.1.10 లక్షలు న్యూఢిల్లీ: శాంసంగ్.. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతవారంలోనే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తన ఆల్ట్రా–ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించిన కంపెనీ.. ఇక్కడ మార్కెట్లో దీన్ని గురువారం విడుదలచేసింది. ధర రూ. 1.10 లక్షలు కాగా, రెండు యాప్‌లను ఒకేసారి తెరవగలిగే సౌలభ్యం ఇందులో ఉందని, సాంకేతిక ఆవిష్కరణలో మైలురాయిగా నిలిచిపోయే హ్యాండ్‌సెట్‌గా జెడ్ ఫ్లిప్ నిలిచిపోనుందని ఈ సందర్భంగా కంపెనీ ఇండియా డైరెక్టర్(మొబైల్) ఆదిత్య బబ్బర్ వ్యాఖ్యానించారు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.7 అంగుళాల పూర్తి హెచ్డీ డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు, 10ఎంపీ సెల్పీ కెమెరా ఉన్నాయి. -
చైనాలో వాహన విక్రయాలు డౌన్
బీజింగ్: చైనాలో వాహన విక్రయాలకు కరోనా వైరస్ సెగ తగులుతోంది. జనవరిలో ఆటో అమ్మకాలు .. గతేడాది జనవరితో పోలిస్తే ఏకంగా 20.2 % పడిపోయాయి. 16 లక్షలకు పరిమితమైనట్లు చైనా వాహన తయారీ సంస్థల సమాఖ్య సీఏఏఎం ప్రకటించింది. అమ్మకాలు పడిపోవడంతో కంపెనీలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, వృద్ధి మందగమనం, ఉద్యోగాల కోత వంటి సమస్యలతో చైనా సతమతమవుతుండగా.. తాజాగా మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేసేందుకు నూతన సంవత్సర సెలవులను మరింతగా పొడిగించడం.. ఫలితంగా ఫ్యాక్టరీలు, డీలర్‌షిప్‌లు మూతబడటం మొదలైన పరిణామాలు ఆటోమొబైల్ పరిశ్రమను మరింతగా కుదేలు చేస్తున్నాయి. సాధారణంగా జనవరిలో సెలవుల సీజన్ తర్వాత ఫిబ్రవరిలో అమ్మకాలు భారీగా నమోదవుతాయి. అయితే, ప్రస్తుతం ఫిబ్రవరి సగం గడిచిపోయినా.. కంపెనీలు ఇంకా తయారీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. స్వల్పకాలికంగా వాహనాల ఉత్పత్తి, అమ్మకాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడుతోందని, పరికరాల సరఫరా వ్యవస్థకు సమస్యలు తప్పవని సీఏఏఎం తెలిపింది. -
వాహన అమ్మకాలు.. బే‘కార్’!
గ్రేటర్ నోయిడా: దేశీయంగా వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగుతోంది. కొత్త ఏడాదిలోనూ అమ్మకాలు పుంజుకోలేదు. జనవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.2 శాతం క్షీణించాయి. వాహనాల కొనుగోలు భారం పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాల రేట్లు అధిక స్థాయిలో ఉండటం, ముడివస్తువుల ధరల పెరగడంతో జనవరిలో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల రేట్లను పెంచడం కూడా అమ్మకాలపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. ‘జీడీపీ వృద్ధి మందగమనం, వాహన కొనుగోలు వ్యయాలు పెరగడం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలు వాహన విక్రయాలపై కొనసాగుతున్నాయి‘ అని అని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. ‘ఇన్ఫ్రా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఇటీవలచేసిన ప్రకటనలతో వాహనాల అమ్మకాలు మళ్లీ పుంజుకోగలవని ఆశిస్తున్నాం. ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ మెరుగుపడగలదని భావిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. త్రిచక్ర వాహనాలు కాస్త ఊరట.. జనవరి గణాంకాలను ప్రస్తావిస్తూ.. త్రిచక్ర వాహనాలు మినహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు పడిపోయాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. పరిశ్రమ ఇంకా నెగటివ్‌లోనే ఉన్నప్పటికీ.. పండుగల సీజన్ తర్వాత విక్రయాల క్షీణత తీవ్రత కాస్త తగ్గిందని ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల స్పందనను బట్టి చూస్తే.. వినియోగదారుల సెంటిమెంటు మరింత మెరుగుపడగలదని ఆశిస్తున్నాం. ఇందులో ఇప్పటిదాకా దాదాపు 70 వాహనాలను ఆవిష్కరించారు‘ అని ఆయన చెప్పారు. విక్రయాల తీరిదీ.. ► గతేడాది జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,80,091 యూనిట్లు. ఈ ఏడాది జనవరిలో 2,62,714 యూనిట్లకు తగ్గాయి. ► కార్ల అమ్మకాలు 8.1% క్షీణించి 1,79,324 యూ నిట్ల నుంచి 1,64,793కి పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. 15,97,528 యూనిట్ల నుంచి 13,41,005 యూనిట్లకు తగ్గాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 15 శాతం తగ్గి 10,27,766 నుంచి 8,71,886కి క్షీణించాయి. స్కూటర్లు 16 శాతం క్షీణించి 4,97,169 యూనిట్ల నుంచి 4,16,594కి పరిమితమయ్యాయి. ► వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. 87,591 యూనిట్ల నుంచి 75,289 యూనిట్లకు తగ్గాయి. ► వివిధ కేటగిరీల్లో అన్ని వాహనాల విక్రయాలు 13.83 శాతం తగ్గి.. 20,19,253 యూనిట్ల నుంచి 17,39,975 యూనిట్లకు క్షీణించాయి. ► కంపెనీలవారీగా చూస్తే కార్ల విభాగంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు మాత్రం 0.29% పెరిగి 1,39,844 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 8% క్షీణించి 42,002 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 14 శాతం పడిపోయాయి. -
సేల్స్ మరోసారి ఢమాల్ , ఆందోళనలో పరిశ్రమ
సాక్షి, ముంబై: దేశీయంగా ఆటో మొబైల్ పరిశ్రమకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే దశాబ్దం కనిష్టానికి పడిపోయిన వాహనాలు అమ్మకాలు కొత్త ఏడాదిలో కూడా అదే ధోరణిని కొనసాగించాయి. 2020 జనవరిలో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 6.2 శాతం క్షీణించాయి. వరుసగా మూడవ నెల క్షీణత. 2019 సెప్టెంబర్ అమ్మకాలు దాదాపు 24 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు క్రమేపీ క్షీణతను నమోదు చేయడం మరింత ఆందోళనకు రేపుతోంది. తాజా గణాంకాల ప్రకారం జనవరి నెలలో కారు సేల్స్ కూడా 8.1 శాతం తగ్గిపోయాయి. గత ఏడాది జనవరిలో ఈ సేల్స్ 1,79,324 యూనిట్లు కాగా, ఈ జనవరిలో 1,64,793 యూనిట్లకు పడిపోయాయి. వ్యాన్ల అమ్మకం 28 శాతం క్షీణించి 12,992 వద్ద ఉంది. వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం తగ్గి 75,289 యూనిట్లకు చేరుకోగా, గ్రామీణ వినియోగ ధోరణిని సూచించే ద్విచక్ర వాహనాలు 16 శాతం తగ్గి 13,41,005 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ నెలలో మొత్తం ఆటో మొబైల్స్ అమ్మకాలు 14 శాతం తగ్గి 17,39,975 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 14.04 శాతం మేర తగ్గి 87,591నుండి 75,289కు పడిపోయాయి. ఆటోఎక్స్‌పో కారణంగా వినియోగదారుల సెంటిమెంట్ బలపడుతుందని భావిస్తున్నామని, తద్వారా సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఓనర్షిప్ వ్యయం పెరగడంతో పాటు జీడీపీ వృద్ధి రేటు మందగింపు లాంటివి అమ్మకాలు పతనానికి కారణమని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ సియామ్ సోమవారం వెల్లడించింది. దీనికితోడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న బీఎస్-6 నిబంధనలకనుగుణంగా మారాల్సిన నేపథ్యం కూడా సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణమని సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా తెలిపారు. ఈ పరివర్తనం చెందడానికి పరిశ్రమకున్న సమయం చాలా తక్కువ అని పేర్కొన్నారు. ప్యాసెంజర్ వాహనా అమ్మకాల క్షీణత రేటు గతంలో ఉన్నదానికంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో ముదురుతున్న ఆర్థిక మందగమనానికి ఇది నిదర్శనమని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష మీనన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, ఇతరకారణాల రీత్యా ఉద్గార నిబంధనల అమలు గడువును మరింత కాలం పొడిగించాలని కూడా కోరుతున్నాయి. -
మిశ్రమంగా వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగం మందగమనంలో ప్రయాణిస్తోంది. ప్యాసింజర్ వాహన అమ్మకా లు నవంబర్లోనూ అంతంత మాత్రంగా నమోదైయ్యాయి. కొత్త మోడళ్లు విడుదలైనా ఆశించిన స్థాయిలో అమ్మకాలు పుంజుకోలేకపోయాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాల్లో భారీ క్షీణత కొనసాగగా.. మారుతీ సుజుకీ అమ్మకాల్లో స్వల్పంగా 1.6% తగ్గుదల నమోదైంది. హ్యుందాయ్ మాత్రం 2% వృద్ధిని నమోదుచేసింది. ఈ సారి కూడా క్షీణత ఉన్నప్పటికీ.. అంతక్రితం నెలలతో పోల్చితే ఆటో రంగం కాస్త గాడిన పడిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. -
మహీంద్రాకు మందగమనం సెగ
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో 78 శాతం తగ్గి రూ.368 కోట్లకు చేరింది. అమ్మకాలు బాగా పడిపోవడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఆదాయం 6 శాతం తగ్గి రూ.23,936 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మార్కెట్ అంచనాలకు అందని విధంగా ఉన్నందున అమ్మకాలు, ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని కంపెనీ ఎమ్డీ పవన్ గోయెంకా వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో మాత్రం అమ్మకాలు పుంజుకున్నాయని చెప్పారు. -
పసిడి ప్రియం.. సేల్స్ పేలవం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధంతేరాస్‌గా పిలిచే ధన త్రయోదశికి పసిడి మెరుపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 40% దాకా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.40 వేలకు అటూఇటుగా కదులుతుండటంతో పాటు.. కస్టమర్లు చేసే వ్యయాలు తగ్గడం కూడా ఇందుకు కారణమని వర్తకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నిజానికి ధన త్రయోదశికి బంగారం, వెండి, లేదా విలువైన వస్తువులు కొనడం శుభసూచకమని హిందువులు భావిస్తారు. 2018లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిగాయి కూడా. అయితే పసిడి ధర అప్పటితో పోలిస్తే 10 గ్రా. రూ.6000 వరకూ ప్రస్తుతం ఎక్కువ. శుక్రవారం హైదరాబాద్‌లోని నగల షాపుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. ధర రూ.39,900 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.36,850 పలికింది. కిలో వెండి రూ.50,600 ఉంది. రూ.2,500 కోట్ల విక్రయాలు... ఈ సంవత్సరం ధన త్రయోదశికి శుక్రవారం సాయంత్రం వరకు రూ.2,500 కోట్ల విలువైన సుమారు 6,000 కిలోల పుత్తడి అమ్ముడైనట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. గతేడాది ధనత్రయోదశికి మాత్రం రూ.5,500 కోట్ల విలువైన 17,000 కిలోల బంగారం విక్రయమైనట్లు సీఏఐటీ తెలియజేసింది. ‘‘వ్యాపారం 35–40% పడిపోయింది. గోల్డ్, సిల్వర్ ధరలు క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో అత్యధికంగా నిరాశపర్చిన ఏడాది ఇదే’’ అని సీఏఐటీ గోల్డ్, జ్యుయలరీ కమిటీ చైర్మన్ పంకజ్ అరోరా చెప్పారు. పరిమాణం పరంగా 2018తో పోలిస్తే అమ్మకాలు 20% తగ్గొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. మెరిసిన వెండి..: అధిక ధర కారణంగా ఈ సారి సెంటిమెంట్ పడిపోయిందని గోల్డ్ రిఫైనింగ్ సంస్థ ఎంఎంటీసీ– పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేశ్ ఖోస్లా చెప్పారు. ‘‘బంగారం ప్రస్తుత ధర వినియోగదార్ల దృష్టిలో చాలా ఎక్కువ. అందుకే కస్టమర్లు వెండి నాణేల వైపు మొగ్గు చూపారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సిల్వర్ కాయిన్స్ విక్రయాలు 2018తో పోలిస్తే 15% పెరిగాయని చెప్పారాయన. వివాహాల సీజన్ తోడవడంతో వెండి వస్తువుల అమ్మకాలు పెరిగాయని శ్రీ స్వర్ణ జ్యుయలర్స్ ఎండీ ప్రియ మాధవి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాలికి వేసుకునే కడియాలకు మళ్లీ డిమాండ్ పెరిగిందన్నారు. విదేశాల నుంచి సైతం వీటికి ఆర్డర్లు వచ్చాయని చెప్పారామె. చిన్న ఆభరణాలకే.. అన్ని షోరూంలలోనూ అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్ తెలిపారు. స్తబ్దుగా ఉన్న మార్కెట్లో ధంతేరాస్ రాకతో పరిస్థితిలో కొంత మార్పు కనపడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ చెప్పారు. ఈ సారి తక్కువ విలువ ఉన్న ఆభరణాల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపారని జీజేసీ అంటోంది. 60–70 శాతం చిన్న ఆభరణాల అమ్మకాలేనని శారీనికేతన్ గోల్డ్ విభాగం ఇన్చార్జ్ గుల్లపూడి నాగ కిరణ్ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్‌తో ముడిపడి 30% పైగా అమ్మకాలు నమోదయ్యాయని చెప్పారాయన. మొత్తంగా పుత్తడి అమ్మకాలు 40 శాతం పడిపోయాయన్నారు. -
ప్యాసింజర్ వాహన విక్రయాలు డౌన్
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల (పీవీ) హాల్‌సేల్ విక్రయాలు వరుసగా 11వ నెల్లోనూ గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) శుక్రవారం ప్రకటించింది. పండుగల సీజన్ వినియోగదారుల సెంట్మెంట్ను బలపరచలేకపోయిన కారణంగా సెప్టెంబర్ పీవీ 2,23,317 యూనిట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెల్లో నమోదైన 2,92,660 యూనిట్ల విక్రయాలతో పోల్చితే ఏకంగా 23.69 శాతం క్షీణత ఉన్నట్లు తెలియజేసింది. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 23.56% తగ్గుదల నమోదైంది. దేశీయంగా గత నెల కార్ల విక్రయాలు 1,31,281 యూనిట్లు(33.4% క్షీణత). -
టాటా ‘పులి’ స్వారీ ముగుస్తుందా?
కష్టకాలంలో టాటాలను కామధేనువుగా ఆదుకున్న జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్)... ఇప్పుడు నష్టాలతో ఎదురీదుతోంది. బ్రెగ్జిట్ గండానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ మందగమనం... జేఎల్ఆర్ అమ్మకాలకు గండికొడుతోంది. దీంతో మాతృసంస్థ టాటా మోటార్స్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒకపక్క దేశీయంగా డిమాండ్ పడిపోయి.. విక్రయాలు కుదేలవుతున్న తరుణంలో అక్కరకొస్తుందనుకున్న జేఎల్ఆర్ కూడా చతికిలపడటంతో టాటా మోటార్స్‌ను కష్టాల ఊబిలోకి నెడుతోంది. జేఎల్ఆర్లో పెట్టుబడుల విలువ తరిగిపోయే పరిస్థితికి దారితీస్తోంది. టాటా మోటార్స్ షేరు పతనం రూపంలో ఇన్వెస్టర్లకు ఇది కనిపిస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో జేఎల్ఆర్ను టాటాలు వదిలించుకోవడం మంచిదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ ఈ అంశాన్ని పేర్కొంది. జేఎల్ఆర్ విక్రయం టాటా మోటార్స్‌కు కనకవర్షం కురిపిస్తుందని లెక్కలేస్తోంది. మరి ఎవరికి విక్రయించాలంటారా? జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూకు అమ్మేస్తే ఇరు సంస్థలకు మేలు అనేది బెర్న్‌స్టీన్ వాదన. అంతేకాదు జేఎల్ఆర్కు 9 బిలియన్ పౌండ్ల (దాదాపు రూ.82 వేల కోట్లు)భారీ విలువను కూడా కట్టింది. బీఎండబ్ల్యూకు జేఎల్ఆర్ మంచి వ్యాపార అవకాశం అవుతుందని ఈ సంస్థ అభిప్రాయపడింది. తన క్లయింట్లకు బెర్న్‌స్టీన్ పంపిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. బీఎండబ్ల్యూకు కలిసొస్తుంది... బీఎండబ్ల్యూ దగ్గర నిధులు దండిగా ఉన్నాయని, అదే సమయంలో తన బ్రాండ్, ఉత్పత్తుల వృద్ధికి అవకాశాలు పరిమితంగానే ఉన్నట్టు బెర్న్‌స్టీన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో విస్తరణపై నిధులు ఖర్చు చేసినా, రాబడులు ప్రశ్నార్థకమేనని అభిప్రాయపడింది. సొంతంగా విలువను సృష్టించే అవకాశం ఈ స్థాయి నుంచి పరిమితమేనని పేర్కొంది. జేఎల్ఆర్ను దాని పుస్తక విలువ కంటే తక్కువకే సొంతం చేసుకోవాలని, బీఎండబ్ల్యూ సహకారంతో లాభదాయకంగా జేఎల్ఆర్ అవతరించగలదని ఈ నివేదికలో వివరించింది. గణనీయమైన విలువను సృష్టించుకోవచ్చని, బీఎండబ్ల్యూ ఎర్నింగ్స్ (ఆదాయాలు) 20 శాతం వరకు పెంచుకోవచ్చని సూచించింది. టాటాలకూ మేలు చేస్తుంది... జేఎల్ఆర్ వ్యాపారపరంగా ఉన్న సమస్యలు టాటా గ్రూపును ఇబ్బంది పెడుతున్నట్టు బెర్న్‌స్టీన్ పేర్కొంది. జేఎల్ఆర్కు వ్యూహాత్మక పరిష్కారాన్ని టాటా గ్రూపు గుర్తించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జేఎల్ఆర్ అమ్మకం రూపంలో వచ్చే 9 బిలియన్ పౌండ్ల(11.23 బిలియన్ డాలర్లు)తో, షేరు ధర మళ్లీ పైకి వెళ్లగలదని అంచనా వేసింది. అయితే, ఈ నిధులను కంపెనీ తిరిగి ఏ విధంగా వినియోగంలోకి తీసుకొస్తుందన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. 2008లో జేఎల్ఆర్ను టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అంటే 1.84 బిలియన్ పౌండ్లు (ప్రస్తుత మారకం విలువ ప్రకారం సుమారు రూ.16,376 కోట్లు). బెర్న్‌స్టీన్ లెక్కగట్టిన అంచనా ప్రకారం కొనుగోలు విలువకు ఐదు రెట్ల విలువ దక్కినట్లు లెక్క. అంటే ఇది ఒకరకంగా టాటా మోటార్స్ రుణ భారాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. జూన్ క్వార్టర్ నాటికి టాటా మోటార్స్ మొత్తం రుణ భారం రూ.46,500 కోట్లకు పేరుకుపోయింది. ఇదే తరుణంలో జూన్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్(జేఎల్ఆర్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపితే) నికర నష్టం రెట్టింపై రూ.3,679 కోట్లకు చేరడం కూడా కంపెనీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భాగస్వామ్యంతో ఊహాగానాలు... ఈ ఏడాది జూలైలో బీఎండబ్ల్యూతో టాటా మోటార్స్ చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు జట్టుకట్టింది. దీంతో నాటి నుంచి జేఎల్ఆర్ను బీఎండబ్ల్యూ కొనుగోలు చేయవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ దిశగా అడుగులు.. ఇరు కంపెనీలకు ప్రయోజనకరమని బెర్న్‌స్టీన్ నివేదిక విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. బీఎండబ్ల్యూ ఇప్పటికే ఎలక్ట్రిక్ డ్రైవ్ యూనిట్లు, ఇంజిన్లను జేఎల్ఆర్కు సరఫరా చేసేందుకు అంగీకరించిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. అయితే, జేఎల్ఆర్లో వాటాల విక్రయమై బీఎండబ్ల్యూతో చర్చల వార్తలను టాటా మోటార్స్ ఖండించింది. పాత యజమాని చెంతకే! జాగ్వార్, ల్యాండ్‌రోవర్ బ్రాండ్లు.. బ్రిటన్‌లోనే పురుడుపోసుకున్నాయి. ఇవి రెండూ 1968 వరకూ స్వతంత్ర కంపెనీలుగానే కొనసాగాయి. అయితే, 1968లో జాగ్వార్, ల్యాండ్రోవర్లు విలీనమాయ్యయి. వీటిని కొనుగోలు చేసిన బ్రిటిష్ లేలాండ్ 1984 వరకూ కొనసాగించింది. ఆ తర్వాత మళ్లీ రెండు కంపెనీలూ బ్రిటిష్ లేలాండ్ నుంచి విడిపోయాయి. జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూకి అనుబంధ సంస్థలుగా మారాయి. అమెరికా కార్ల దిగ్గజం ఫోర్డ్... 1989లో జాగ్వార్ కార్స్‌ను, 2000లో ల్యాండ్రోవర్ను చేజిక్కించుకుంది. దీంతో మళ్లీ ఫోర్డ్ నేతృత్వంలో జాగ్వార్ల్యాండ్రోవర్(జేఎల్ఆర్) ఒకే సంస్థగా ఆవిర్భవించాయి. అయితే, 2008లో ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడిన ఫోర్డ్ మోటార్స్... జేఎల్ఆర్ను అమ్మకానికి పెట్టింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న టాటా మోటార్స్ 2008లో 2.3 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ జేఎల్ఆర్ను పాత యజమాని బీఎండబ్ల్యూ కొనొచ్చన్న వార్తలు జోరందుకున్నాయి. -
కారు.. పల్లె‘టూరు’
అమ్మకాలు పడిపోయి... ఆపసోపాలు పడుతున్న వాహన కంపెనీలకు వరుణుడు కరుణచూపాడు. ఈ ఏడాది వానలు కాస్త లేటయినా... దండిగానే కురవడంతో ఇప్పుడు ఆటోమొబైల్ దిగ్గజాలు ‘వర్షా’తిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పల్లెకు పోదాం.. మందగమనాన్ని తట్టుకుందాం.. అమ్మకాలు పెంచుకుందాం అని పాట పాడుతున్నాయి. గ్రామీణులను ఆకర్షించడానికి గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు వాహన రుణాలిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాటపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ తగ్గి అమ్మకాలు కుదేలవడంతో వాహన కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాహన విక్రయాలు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయాయి. దీంతో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా తదితర వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు దాదాపు సగంగా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 3,000కు పైగా తాలుకాల్లో సేల్స్, సర్వీసింగ్ అవుట్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. అమ్మకాలు పెంచుకోవడానికి టీచర్లు, గ్రామాల్లో కుల వృత్తులు చేసే వ్యక్తులపై దృష్టి పెట్టింది. సమృద్ధిగా వర్షాలు.... గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులను ఆకర్షించడానికి వాహన కంపెనీలు గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆకర్షణీయమైన ఎక్సే్ఛంజ్ డీల్స్‌ను, తక్కువ వడ్డీరేట్ల ఫైనాన్స్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వర్షాలు పుష్కలంగా కురియడంతో పంటలు సమృద్ధిగా పండి ఆర్థిక వ్యవస్థ త్వరితంగా రికవరీ కాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పడుతున్నాయి. ఖరీఫ్‌లో పంటలు బాగా పండుతాయనే అంచనాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి బడ్జెట్ ప్రోత్సాహాన్నివ్వడం తదితర అంశాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలకు డిమాండ్ పెరగగలదని కంపెనీలు భావిస్తున్నాయి. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదే... కాగా మందగమనం కారణంగా వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పట్టాయనడం పూర్తిగా సరైనది కాదని కొందరు నిపుణలంటున్నారు. పెద్ద నగరాల్లో కాకుండా ఇతర మార్కెట్లలో భవిష్యత్తులో అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు కూడా దీనికి కారణమని వారంటున్నారు. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదేనని రెనో ఇండియా ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్ అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలే ముందుగా మందగమన పరిస్థితులను అధిగమిస్తాయని, ఆ తర్వాత పట్టణాలు పుంజుకుంటాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు రియల్టీ కుదేలైందని, ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోనే రియల్టీకి డిమాండ్ పెరిగిందని, ఆ తర్వాత పట్టణాల్లో రియల్టీ రంగం పుంజుకుందని ఆయన ఉదహరించారు. ఎంక్వైరీలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంత వినియోగదారుల నుంచి ఎంౖMð్వరీలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ కార్లకు సంబంధించి అధికంగా వివరాలు అడుగుతున్నారని, ఎంక్వైరీలు పెరగడం మార్కెట్ పునరుజ్జీవనం పొందుతుందనడానికి ఆరంభ సంకేతమని పేర్కొన్నారు. మొత్తం మారుతీ అమ్మకాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు 38 శాతంగా ఉంటాయి. మందగమనం కారణంగా మారుతీ సుజుకీ కంపెనీ పట్టణ అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్–జూలై కాలంలో భారీగా తగ్గగా, గ్రామీణ ప్రాంత అమ్మకాలు 16 శాతం తగ్గాయి. గ్రామీణ మార్కెటే మెరుగు మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల వ్యాపారంతో పోల్చితే గ్రామీణ వ్యాపారం ఒకింత మెరుగ్గా ఉందని హ్యుందాయ్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఈ కంపెనీ గ్రామీణ ప్రాంత అమ్మకాలు 5 శాతం మేర మాత్రమే తగ్గాయి. త్వరలోనే ఈ మార్కెట్లు పుంజుకుంటాయని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు సానుకూల వృద్ధిని సాధించగలవని ఈ కంపెనీ భావిస్తోంది. -
వాహన విక్రయాలు.. క్రాష్!
న్యూఢిల్లీ: ఆటో రంగంలో మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో దేశీ వాహన అమ్మకాలు చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సియామ్ 1997–98 నుంచి ఆటో అమ్మకాల డేటాను రికార్డు చేస్తుండగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయి పతనం నమోదుకాలేదు. ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), వాణిజ్య వాహనాలు (సీవీ), ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు 23.55% తగ్గాయి. గతనెల విక్రయాలు 18,21,490 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన మొత్తం వాహనాలు 23,82,436 యూనిట్లు. 10వ నెల్లోనూ పీవీ సేల్స్ డౌన్..: ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 31.57 శాతం క్షీణతను నమోదుచేశాయి. గతనెల అమ్మకాలు 1,96,524 యూనిట్లు కాగా, 2018 ఆగస్టు విక్రయాలు 2,87,198 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. వరుసగా 10 నెలల నుంచి పీవీ అమ్మకాలు దిగజారుతూనే ఉన్నాయి. మారుతి అమ్మకాల్లో 36.14 శాతం క్షీణత పీవీ విక్రయాల్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకీ ఆగస్టు నెల అమ్మకాల్లో 36.14 శాతం క్షీణతను నమోదుచేసింది. గతనెల విక్రయాలు 93,173 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. ఇక మహీంద్ర అండ్ మహీంద్ర అమ్మకాలు 31.58 శాతం, హ్యుందాయ్ సేల్స్ 16.58 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహనాల సేల్స్ 22 శాతం డౌన్ ఆగస్టులో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 22.24% తగ్గాయి. గతనెల విక్రయాలు 15,14,196 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన వాహనాలు 19,47,304. -
రివర్స్‌గేర్‌లోనే కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు మళ్లీ భారీ తగ్గుదలను నమోదుచేశాయి. ఆగస్టులో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, హోండా కార్స్ అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. మారుతీ విక్రయాలు 33 శాతం తగ్గాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్–6 ఉద్గార నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్ వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ (సేల్స్) రాజేష్ గోయెల్ అన్నారు. ఆగస్టులోనూ ఇవే ప్రతికూలతలు కొనసాగినందున ఈ స్థాయి క్షీణత నమోదైందని టీకేఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ రంగంలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ తమ కంపెనీ రిటైల్ అమ్మకాలపై దృష్టిసారిస్తుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. -
పార్లేలో 10 వేల ఉద్యోగాలకు ఎసరు
ముంబై: అమ్మకాలు పడిపోతుండటంతో వివిధ రంగాల సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే కూడా ఈ జాబితాలో చేరనుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో వచ్చే ఏడాది కాలంలో సుమారు 10,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి రావొచ్చని పార్లే ప్రోడక్ట్స్ విభాగం హెడ్ మయాంక్ షా తెలిపారు. సామాన్యుల కోసం ఉద్దేశించిన చౌక ఉత్పత్తులపై కూడా అధిక స్థాయిలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధింపు, డిమాండ్ మందగమనం వంటి అంశాలు ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పార్లేకు సొంతంగా 10 తయారీ యూనిట్లు ఉండగా, థర్డ్ పార్టీ తయారీ సంస్థలు 125 దాకా ఉన్నాయి. బిస్కెట్ తయారీతో పాటు ఇతర వ్యాపార విభాగాల్లో పార్లేలో ప్రస్తుతం లక్ష మంది పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ‘ఇప్పటికైతే ఉద్యోగులెవరినీ తొలగించలేదు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోతే ఈ చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు’ అని మయాంక్ షా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ విక్రయ పరిమాణం ఉండే చౌక ఉత్పత్తుల అమ్మకాలు 7–8 శాతం పడిపోగా, తక్కువ విక్రయ పరిమాణం.. అధిక ధర ఉండే ఉత్పత్తుల అమ్మకాలు 8–9 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. మొత్తం మీద బిస్కెట్ల విభాగం అమ్మకాల వృద్ధి గతంలో రెండంకెల స్థాయిలో ఉండేదని.. ప్రస్తుతం 2.5 శాతానికి పడిపోయిందని షా పేర్కొన్నారు. చౌక ఉత్పత్తుల విభాగం మొత్తం బిస్కెట్ల వ్యాపారంలో నాలుగో వంతే ఉన్నప్పటికీ.. అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయాల్సినందున ఇందులో ఎక్కువ మంది సిబ్బంది ఉంటారని షా చెప్పారు. గతంలో కేజీకి రూ. 100 లోపు ధర ఉండే బిస్కెట్లకు ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు ఉండేదని ఆయన తెలిపారు. అయితే, 2017లో బిస్కెట్లను కూడా 18 శాతం జీఎస్టీ శ్లాబులో చేర్చినప్పట్నుంచీ పరిశ్రమకు సమస్యలు ప్రారంభమయ్యాయని షా చెప్పారు. అధిక జీఎస్టీ కారణంగా చౌక ఉత్పత్తుల రేట్లను కూడా తాము పెంచాల్సి వచ్చిందని, దీంతో డిమాండ్ పడిపోయిందని ఆయన తెలిపారు. జీఎస్‌టీపరమైన సమస్యలు సరిదిద్దాలంటూ పరిశ్రమ కోరుతున్నప్పటికీ .. ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బండి కాదు..మొండి ఇది..!
సాక్షి, బిజినెస్ విభాగం: వాహన విక్రయాలు నానాటికి తగ్గిపోతుండటంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోతోంది. జూలైలో అమ్మకాలు దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్యలో దేశీ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13.18% తగ్గిపోయింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఫోర్డ్, టొయోటా, హోండా వంటి దిగ్గజాలన్నీ భారీగా ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మాత్రమే ఉత్పత్తిని కాస్త పెంచుకున్నాయి. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 87,13,476 యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది అదే వ్యవధిలో సుమారు 10% పడిపోయి 78,45,675గా నమోదైంది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13,97,404 యూనిట్ల నుంచి 13% క్షీణతతో 12,13,281 యూనిట్లకు పడిపోయింది. ఈ పరిణామాలతో ఏప్రిల్ నుంచి చూస్తే ఇప్పటిదాకా ఆటోమొబైల్ రంగంలో (వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీ సంస్థలు, డీలర్లు మొదలైన వర్గాలు) ఇప్పటిదాకా 3.5 లక్షల ఉద్యోగాల్లో కోత పడినట్లు అంచనా. తమ పరిధిలో 15,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, వందలకొద్దీ డీలర్‌షిప్‌లు మూతబడటంతో వేలమంది ఉపాధి కోల్పోయారని సియామ్ స్వయంగా వెల్లడించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇకపై తాత్కాలిక ఉద్యోగులు, సేల్స్.. మార్కెటింగ్ విభాగంలో సర్వీసులు అందించే వారు, పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాల్లో ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాలు మరింతగా ఉండనున్నాయని మానవ వనరుల (హెచ్ఆర్) సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇదే ధోరణి.. అంతర్జాతీయంగా కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమన ధోరణులే నెలకొన్నాయని, దీనికి భారత్ మినహాయింపేమీ కాదని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. దీంతో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడానికి తమ పరిధిలో తీసుకోగలిగిన చర్యలన్నీ తీసుకుంటున్నాయన్నారు. ఇందులో భాగంగానే ఉత్పత్తి తగ్గించుకోవడం, తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేయడం వంటివి చేస్తున్నాయని మిశ్రా చెప్పారు. మందగమనం ఇలాగే కొనసాగితే రోజువారీ కార్యకలాపాలకు అంతగా ముఖ్యం కాకపోయినా అధిక వేతనాలు అందుకునే వారిని తొలగించడంపై కూడా కంపెనీలు దృష్టి పెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘తయారీ విభాగంపైనే ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం వల్ల ముఖ్యంగా తాత్కాలిక సిబ్బందిపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల విభాగంలో మధ్య స్థాయి నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో కూడా కోత పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి‘ అని మిశ్రా చెప్పారు. పర్మనెంటు ఉద్యోగులను తొలగించడం అన్నది ఆఖర్న మాత్రమే జరగొచ్చని.. అయితే మందగమన ప్రభావాలు మరింత తీవ్రమైతే ఆయా ఉద్యోగుల బోనస్‌లు, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిల్లో కోత పడొచ్చని తెలిపారు. మరోవైపు, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోని సర్వీస్ సిబ్బందిపై ఎక్కువగా ప్రభావం పడుతుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ బిజినెస్ హెడ్ మునీరా లోలివాలా అభిప్రాయపడ్డారు. ‘వచ్చే కొద్ది నెలల్లో మందగమనానికి అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నాం. అయితే సేల్స్, ఆర్అండ్డీ విభాగాల్లోని ఉద్యోగాల్లో కొంత మేర కోత పడే అవకాశాలు ఉన్నాయి. ఇక డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొదలైన వారి స్థాయిల్లోనూ ఉద్యోగాల్లో కోత ఉంటుంది. పడిపోతున్న వాహన విక్రయాల కారణంగా పరికరాల తయారీ పరిశ్రమపైనా ప్రభావం తప్పదు‘ అని ఆమె చెప్పారు. మరో 10 లక్షలకు పైగా కొలువులకు గండం.. దేశీ ఆటోమొబైల్ రంగంలో దాదాపు 3.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ, గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు తదితర అంశాలపై కేంద్రం పలు నిర్ణయాలు ప్రకటిస్తుండటం వల్ల విధానాల్లో స్పష్టత లోపించడంతో ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక రుణాల లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉండటం, వాహనాలకు డిమాండ్ పడిపోవడం ఆటోమొబైల్ రంగాన్ని మరింతగా కుంగదీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటోమొబైల్ రంగంలో ఏకంగా 10 లక్షల దాకా ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందంటూ ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) గత నెలలోనే హెచ్చరించింది. ప్రభుత్వ మద్దతు కావాలి.. ఆటోరంగంలో పెను మా ర్పుల కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని మైఖేల్ పేజ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ మోహిత్ భారతి వ్యాఖ్యానించారు. ‘ఇదే ధోరణి మరికొంత కాలం సాగిందంటే ఆటో పరికరాల సంస్థలు, అనుబంధ సంస్థల్లోనూ ఉద్యోగాల్లో కోత తప్పకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గానీ తక్షణం జోక్యం చేసుకోకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగానికి పరిస్థితులు ఆశావహంగానైతే కనిపించడం లేదు‘ అని మోహిత్ పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించాలని, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేయడం ద్వారా పరిశ్రమ కోలుకునేందుకు కాస్త వెసులుబాటు కల్పించాంటూ ఆటో రంగ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కారు.. బైక్ రివర్స్ గేర్..! -
కారు.. బేజారు!
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తోంది. వరుసగా పదో నెలలోనూ కార్ల విక్రయాలు క్షీణతను నమోదుచేశాయి. ఈ విభాగంలోనే మార్కెట్ లీడరైన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) జూన్ దేశీ అమ్మకాలు ఏకంగా 15.3% తగ్గిపోయాయి. కంపెనీ మినీ సెగ్మెంట్ 36.2% క్షీణించింది. వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడిన నేపథ్యంలో దేశీ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో తగ్గుదల నమోదవుతూనే ఉందని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా అన్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, రుతుపవనాలపై అనిశ్చితి, అధిక వడ్డీ, ద్రవ్య లభ్యత సమస్య, బీఎస్–సిక్స్ అమలు వంటి ప్రతికూల అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపర్చాయన్నారు. మొత్తం ఆటో ఇండస్ట్రీ కంటే పీవీ అమ్మకాల పరంగా సెంటిమెంట్ మరింత బలహీనంగా ఉందని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వాధేరా అన్నారు. పరిశ్రమ ఇప్పటికీ ఒత్తిడిలోనే కొనసాగుతుండగా.. మార్కెట్ మాత్రం త్వరలోనే కోలుకోవచ్చని చెప్పారు. -
మేలోనూ కారు రివర్స్‌గేరు!
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం గతుకుల రోడ్డుపై ప్రయాణం కొనసాగిస్తోంది. అధిక ఫైనాన్స్ వ్యయం, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) తగ్గిపోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మే నెలలో కూడా అమ్మకాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రంగంలోని మార్కెట్ లీడర్లు విక్రయాలు సైతం 20 శాతానికి మించి దిగజారాయి. ఆయా కంపెనీలు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత నెలలో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం అమ్మకాలు ఏకంగా 22 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ విక్రయాలు 26 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 3 శాతం తగ్గిపోయాయి. ఈ అంశంపై మాట్లాడిన మహీంద్రా ఆటోమోటివ్ విభాగ ప్రెసిడెంట్ రాజన్ వాదేరా.. ‘సాధారణంగా ఎన్నికలకు ముందు ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గుతాయి. మరోవైపు హైబేస్ నంబర్, అధిక ఫైనాన్స్ వ్యయం ఉన్నందున గత నెలలో సేల్స్ భారీగానే తగ్గాయి’ అని వివరించారు. వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలి పరిశ్రమ డిమాండ్ న్యూఢిల్లీ: వాహన అమ్మకాల క్షీణతకు ముగింపు పలికేందుకు గాను అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఈ సూచన చేయడం గమనార్హం. అలాగే, కాలుష్య నిరోధానికి గాను పాత వాహనాలను తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా కోరింది. బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక శాఖ అధికారులకు సియామ్ ఈ మేరకు తమ డిమాండ్లను వినిపించింది. జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల వాహనాల ధరలు దిగొస్తాయని, దాంతో 11 నెలలుగా అమ్మకాలు మందగించిన పరిశ్రమలో డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొంది. దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునే వాణిజ్య వాహనాలపై కస్టమ్స్ డ్యూటీని ప్రస్తుత 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని కూడా సియామ్ కోరింది. -
మారుతి విక్రయాలకు వరదల దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) విక్రయాలను వర్షాలు, వరదల దెబ్బబాగా తాకింది. ఆగస్టునెలలో మారుతి వాహనాల విక్రయాలు భారీ క్షీణతను నమోదు చేసింది. 3.6 శాతం క్షీణతతో మారుతి విక్రయాలు 1,45,895 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 1,51,270 యూనిట్లు విక్రయించింది. కేరళలో తీవ్ర వరదలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల నెలవారీ అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగుమతులు కూడ 10శాతం క్షీణించి 10,489 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 11,701 యూనిట్లను ఎగుమతి చేసింది. గత నెలలో కాంపాక్ట్ సెగ్మెంట్లో 71,364 యూనిట్లు విక్రయించింది. అంటే సెలేరియో, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి కంపెనీల అమ్మకాలు 3.6 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 74,102 యూనిట్లు విక్రయించింది.యుటిలిటీ వాహనాలు ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా అమ్మకాలు 16 శాతం తగ్గాయి. గత ఏడాది ఆగస్టులో 21,442 యూనిట్లతో పోలిస్తే 17,971 యూనిట్లపే మాత్రమే విక్రయించింది. అయితే మిని సెగ్మెంట్ అల్టో, వాగన్ ఆర్ విక్రయాలను పాజిటివ్‌గా ఉన్నాయి. గత ఏడాది 35,428 యూనిట్ల తో పోలిస్తే ఈ ఏడాది 35,895 యూనిట్లు విక్రయించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా మిడ్ రేంజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా 8 శాతం పెరిగి 7,002 యూనిట్లకు చేరాయి. మొత్తంగా ఆగస్టు నెలలో దేశీయ మార్కెట్లో మారుతి సుజుకీ ఇండియా 2.8 శాతం క్షీనించి 1,47,700 వాహనాలను సేల్ చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,52,000 యూనిట్లు. -
తొలిసారి ఐఫోన్ ఢమాల్!
న్యూయార్క్: ప్రతిష్టాత్మక యాపిల్ సంస్థ తీవ్ర పరాభావాన్ని ఎదుర్కోంటోంది. ఐఫోన్ అమ్మకాల విషయంలో గత వైభవాన్ని తెచ్చుకునేందుకు ఆ సంస్థ ఎంత ప్రయత్నించినప్పటికీ చతికిల పడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా అనూహ్యంగా ఐఫోన్ అమ్మకాలు పడిపోయాయి. గత 13 ఏళ్లలో ఈ ఏడాదే అతి తక్కువ ఐఫోన్ అమ్మకాలు జరిపినట్లు సంస్థ ప్రకటించింది. ఆపిల్ సంస్థకు ప్రతిష్టాత్మక మార్కెట్లు అమెరికా, చైనా కాగా.. ప్రస్తుతం చైనాలో 25శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని, త్వరలో మరో 25శాతం కూడా తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత ఫిబ్రవరితో నుంచి ఇప్పటి వరకు ఆపిల్ షేర్లు కూడా 8శాతం తగ్గిపోయినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అల్ఫాబెట్, ట్విట్టర్ వంటి వాటితో పోల్చినప్పుడు త్రైమాషిక ఫలితాల్లో ఆపిల్ సంస్థవి తగ్గిపోయినట్లు సమాచారం. ఈ ఏడాది తొలి త్రైమాషికంలో 61.2 మిలియన్ల ఐఫోన్ల అమ్మకాలు జరపగా.. రెండో త్రైమాషికంలో వాటి అమ్మకాలు 51.2మిలియన్లకు పడిపోయాయని, అయితే, నిపుణులు మాత్రం 50 మిలియన్ల ఐఫోన్ అమ్మకాలు జరపొచ్చని అంచనావేశారు. 'ఆపిల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్ముందు రాని, ఇంతకుముందు లేని ఒక కొత్త ఆవిష్కరణతో, ఉత్పత్తితో తప్పక ముందు రావాలి. ఇప్పుడు సరిచేసుకుంటున్న చిన్నచిన్న మార్పులతో అమ్మకాలు పెంచలేరు. కొత్త ఉత్పత్తి మాత్రమే ఐఫోన్ అమ్మకాల జోరును పెంచడానికి సరైన మార్గం' అని కన్లుమినో అనే సంస్థకు చెందిన అధ్యయనకారుడు నెయిల్ సాండర్స్ తెలిపారు.