
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగం మందగమనంలో ప్రయాణిస్తోంది. ప్యాసింజర్ వాహన అమ్మకా లు నవంబర్‌లోనూ అంతంత మాత్రంగా నమోదైయ్యాయి. కొత్త మోడళ్లు విడుదలైనా ఆశించిన స్థాయిలో అమ్మకాలు పుంజుకోలేకపోయాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాల్లో భారీ క్షీణత కొనసాగగా.. మారుతీ సుజుకీ అమ్మకాల్లో స్వల్పంగా 1.6% తగ్గుదల నమోదైంది. హ్యుందాయ్ మాత్రం 2% వృద్ధిని నమోదుచేసింది. ఈ సారి కూడా క్షీణత ఉన్నప్పటికీ.. అంతక్రితం నెలలతో పోల్చితే ఆటో రంగం కాస్త గాడిన పడిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment