passenger vehicle sales
-
వాహనాల విక్రయాలు అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా తయారీ కంపెనీల నుండి డీలర్‌షిప్‌లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య గతేడాదితో పోలిస్తే 2024 నవంబర్‌లో 4 శాతం పెరిగి 3,47,522 యూనిట్లకు చేరుకున్నాయి. భారత పీవీ రంగంలో నవంబర్ నెలలో ఇవే ఇప్పటి వరకు అత్యధికం.అక్టోబర్‌లో పండుగ తర్వాత డిమాండ్ ఊపందుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. సియామ్ గణాంకాల ప్రకారం.. గత ఏడాది నవంబర్‌లో మొత్తం ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 3,33,833 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా గత నెల హోల్‌సేల్ అమ్మకాలు 5 శాతం వృద్ధితో 1,41,312 యూనిట్లను తాకాయి.హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి డీలర్లకు చేరిన వాహనాల సంఖ్య 49,451 నుంచి 48,246 యూనిట్లకు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 46,222 యూనిట్లకు ఎగశాయి. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్స్ 2023 నవంబర్‌లో 16,23,399 యూనిట్లు నమోదు కాగా, గత నెలలో 1 శాతం తగ్గి 16,04,749 యూనిట్లకు చేరుకున్నాయి.స్కూటర్ల విక్రయాలు 12 శాతం పెరిగి 5,68,580 యూనిట్లకు చేరుకున్నాయి. మోటార్‌సైకిల్స్ 7.5 శాతం తగ్గి 9,90,246 యూనిట్లకు పడిపోయాయి. గత నెలలో మోపెడ్ హోల్‌సేల్స్ 6 శాతం పెరిగి 45,923 యూనిట్లు నమోదయ్యాయి. త్రీ–వీలర్స్ 1 శాతం క్షీణించి 59,350 యూనిట్లకు వచ్చి చేరాయి. దీపావళి కాని నవంబర్‌లో మొదటిసారిగా టూవీలర్స్ హోల్‌సేల్ విక్రయాలు 16 లక్షల యూనిట్ల మార్కును దాటింది. -
పేరుకుపోతున్న ప్యాసింజర్ కార్లు!
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్యాసింజర్ కార్ల విక్రయాలు తగ్గుతున్నాయి. దాంతో రిటైల్ డీలర్ల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు పేరుకుపోతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా డీలర్ల వద్ద పోగైన వాహనాలు ఏకంగా 7 లక్షల యూనిట్లు. వీటి విలువ సుమారు రూ.73,000 కోట్లు ఉంటుందని అంచనా. పండగల సీజన్ రాబోతుండడంతో వీటిలో కొంతమేర విక్రయాలు జరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయినా క్షేత్రస్థాయిలో ఈ కార్లకు భారీగా డిమాండ్ తగ్గినట్లు పేర్కొంది.ఫాడా తెలిపిన వివరాల ప్రకారం.. రిటైల్ డీలర్ల వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) ప్యాసింజర్ కార్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్వెంటరీను అమ్మే సమయం అధికమైంది. జులై 2024 ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న ఇన్వెంటరీ క్లియరెన్స్ సమయం, ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగింది. దాంతో అమ్ముడవని వాహనాల సంఖ్య అధికమవుతోంది. ఈ వ్యవహారం డీలర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇన్వెంటరీ నిర్వహణ భారంగా మారుతోంది. దాంతో కొన్ని కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు నెలల విక్రయాలకు సమానమైన సుమారు 7 లక్షల యూనిట్ల వాహనాలు పోగయ్యాయి. ఇదిలాఉండగా, రానున్న పండగల సీజన్‌ల్లో విక్రయాలు పెరిగి కొంత ఊరట లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పెరుగుతున్న వాహనాల ఇన్వెంటరీ నేపథ్యంలో మారుతీసుజుకీ కంపెనీ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే ఉత్పత్తిని తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కంపెనీ అంచనాలకు తగిన అమ్మకాలు నమోదు కావడంలేదు. దాంతో ఇన్వెంటరీ నిర్వహణ భారమవుతుందని ఊహించి ఉత్పత్తిని తగ్గించింది. జులై 2024లో మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏడాది ప్రాతిపదికన 9.65% క్షీణత నమోదైంది.రిటైల్ మార్కెట్లో కార్ల ధరలో రాయితీ ఇచ్చి ప్రముఖ కంపెనీలు వాటి ఇన్వెంటరీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే మునుపెన్నడూ లేనంతగా కార్ల ధర తగ్గిస్తున్నాయి. 2023 ఆగస్ట్‌తో పోలిస్తే ఈ సారి డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుందాయ్, టాటా మోటార్స్, స్కోడా, హోండా..వంటి ప్రముఖ కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానం.. కీలకాంశాలు..నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్టర్పై రూ.40,000, ఆల్కజార్‌పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్‌పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్‌పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి. -
భారీగా పెరిగిన ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్.. వాటికే ఎక్కువ డిమాండ్!
ప్యాసింజర్ వాహనాల విక్రయాల పరిమాణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5–7 శాతం వృద్ధి చెందుతుంని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడవ ఏడాది పరిశ్రమ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని తెలిపింది. దేశీయంగా కార్ల విక్రయాలు, వీటి ఎగుమతులకు డిమాండ్ స్తబ్దుగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం గరిష్ట వృద్ధిని అంచనా వేసిన నేపథ్యంలో.. 2024–25 అమ్మకాల్లో 5–7 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు క్రిసిల్ తెలిపింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్‌యూవీలకు డిమాండ్.. వినియోగదారుల ప్రాధాన్యతలో గణనీయ మార్పు ఎస్‌యూవీలకు డిమాండ్‌ను పెంచింది. మహమ్మారి కంటే ముందునాటి 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో ఎస్‌యూవీల వాటా 28 శాతం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రెండింతలై 60 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వేరియంట్లతో సహా వివిధ ధరల శ్రేణిలో కొత్త మోడళ్ల రాక, భవిష్యత్ మోడళ్లు, సెమీకండక్టర్ల సాధారణ లభ్యత కారణంగా ఎస్‌యూవీలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2024–25లో ఎస్‌యూవీల విక్రయాల్లో 12 శాతం వృద్ధి ఉండొచ్చు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల విభాగాల్లో పోటీ ధరలో ఫీచర్లతో కూడిన మోడళ్ల రాక ఈ జోరుకు ఆజ్యం పోస్తుంది. కార్ల ధరల్లో పెరుగుదల.. విడిభాగాలు, తయారీ వ్యయం పెరుగుతూ వస్తోంది. భద్రత, ఉద్గారాలపై మరింత కఠిన నిబంధనలను తయారీ సంస్థలు పాటించాల్సి రావడంతో వాహనాల ధర గత 3–4 సంవత్సరాలలో అధికం అయింది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల వాటా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14 శాతానికి పరిమితం అవుతుందని అంచనా. గత రెండేళ్లలో కీలక ఎగుమతి మార్కెట్లు లాటిన్ అమెరి కా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో ద్రవ్యోల్బణం ఎదు రుగాలులు, పరిమిత విదేశీ మారకపు లభ్యత దీనికి ప్రధాన కారణం. 2024–25లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుంది. అయితే స్థిర కమోడిటీ ధరలు, గత ఆర్థిక సంవత్సరంలో అమలైన ధరల పెంపు పూర్తి ప్రయోజనంతోపాటు ఎస్‌యూవీల వాటా పెరగడంతో తయారీదారుల నిర్వహణ లాభాలు సు మారు 2 శాతం ఎగసి ఈ ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి చేరుతుంది. ఎస్‌యూవీలకు డిమాండ్‌తో 2024–25లో ఇది 11.5–12.5 శాతంగా ఉండొచ్చు. రూ.44,000 కోట్ల పెట్టుబడి.. ఈ ఆర్థిక సంవత్సరంలో సామర్థ్య వినియోగం దాదాపు 85 శాతానికి చేరుకోవచ్చు. ఎస్‌యూవీల కు బలమైన డిమాండ్ కొనసాగుతున్నందున ప్యా సింజర్ వాహన తయారీ సంస్థలు 2023–25 మధ్య సుమారు రూ.44,000 కోట్ల పెట్టుబడి వ్యయం చేస్తున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పో లిస్తే ఇది దాదాపు రెండింతలు. అయితే ఆరోగ్యక రంగా నగదు చేరడం, మిగులు కారణంగా రుణా లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. తయారీదారుల క్రెడిట్ ప్రొఫైల్‌లను క్రిసిల్ స్థిరంగా ఉంచుతోంది. -
విపరీతంగా వాహన విక్రయాలు.. ఇంతలా కొనేశారేంటి?
న్యూఢిల్లీ: యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో జనవరిలో ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హోల్‌సేల్ స్థాయిలో గత ఏడాది జనవరితో పోలిస్తే 14 శాతం పెరిగి 3,93,074 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలలో పీవీల విక్రయాలకు సంబంధించి ఇవి అత్యుత్తమ గణాంకాలు. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం టూ–వీలర్ల హోల్‌సేల్ విక్రయాలు 26 శాతం పెరిగి 14,95,183 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో వీటి సంఖ్య 11,84,376 యూనిట్లుగా ఉంది. వినియోగదారుల సెంటిమెంట్లు సానుకూలంగా ఉండటంతో ప్యాసింజర్ వాహన అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కోలుకుంటూ ఉండటంతో టూ–వీలర్ల విభాగం కూడా జనవరిలో వృద్ధి నమోదు చేసిందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. వాణిజ్య వాహనాల విభాగం పనితీరు అంత మెరుగ్గా లేనప్పటికీ వచ్చే రెండు నెలల్లో అమ్మకాలు పుంజుకోగలవని ఆయన పేర్కొన్నారు. త్రిచక్ర వాహనాల టోకు విక్రయాలు 9 శాతం వృద్ధి చెందాయి. 48,903 యూనిట్ల నుంచి 53,537 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను పటిష్టం చేయడంపై, ముఖ్యంగా చార్జింగ్ మౌలిక సదుపాయాలు..ప్రజా రవాణాపై ప్రభుత్వం 2024 బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టడమనేది ఆటో రంగం వృద్ధి గతి కొనసాగేందుకు దోహదపడగలదని అగర్వాల్ పేర్కొన్నారు. జనవరిలో అమ్మకాలు ఇలా.. మార్కెట్ లీడరు మారుతీ సుజుకీ హోల్‌సేల్ అమ్మకాలు 1,47,348 యూనిట్ల నుంచి 1,66,802 యూనిట్లకు చేరాయి. పోటీ సంస్థ హ్యుందాయ్ మోటర్ ఇండియా విక్రయాలు 50,106 యూనిట్ల నుంచి 57,115కి పెరిగాయి. అటు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) హోల్‌సేల్ అమ్మకాలు 33,040 వాహనాల నుంచి 43,068కి చేరాయి. మోటర్‌సైకిల్ విభాగంలో హీరో మోటోకార్ప్ గతేడాది జనవరిలో 3,26,467 వాహనాలను విక్రయించగా ఈసారి 3,83,752 యూనిట్లు విక్రయించింది. అటు హోండా మోటర్‌సైకిల్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1,27,912 యూనిట్ల నుంచి 1,83,638 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో విక్రయాలు 1,38,860 యూనిట్ల నుంచి 1,78,056 యూనిట్లకు చేరాయి. టీవీఎస్ మోటర్ అమ్మకాలు 1,24,664 యూనిట్లుగా (గత జనవరిలో 1,00,354), సుజుకీ మోటర్‌సైకిల్ విక్రయాలు 78,477 యూనిట్లుగా (గత జనవరిలో 65,991) నమోదయ్యాయి. స్కూటర్లకు సంబంధించి హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు 1,50,243 యూనిట్ల నుంచి 1,98,874 యూనిట్లకు చేరాయి. -
ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు పెరుగుతాయ్..
ముంబై: ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు దేశవ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 18-20 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ తన నివేదికలో తెలిపింది. కొత్త మోడళ్లు, యుటిలిటీ వాహనాల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపడంతో 2024–25లోనూ ఇదే జోరు ఉంటుందని అంచనా వేస్తోంది. ‘మెరుగైన ఆర్డర్ బుక్, సరఫరా వ్యవస్థ ఈ వృద్ధికి కారణం. ప్రీమియం వేరియంట్లకు బలమైన డిమాండ్ కొనసాగుతుంది. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావంతో ఎంట్రీ లెవెల్ మోడళ్ల విక్రయాలు తగ్గుతున్నాయి. మార్కెట్లోకి మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయి. భారత ఆటోమొబైల్ రంగంలో ప్యాసింజర్ వెహికిల్స్ వాటా 18 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో పీవీ అమ్మకాలు దేశీయంగా 25 శాతం పెరిగాయి. ఎగుమతులు 3 శాతం అధికం అయ్యాయి. పీవీల్లో ఎలక్ట్రిక్ మోడళ్ల వాటా 2 శాతం లోపే ఉంది’ అని నివేదిక వివరించింది. -
రెండింట ఒకటి ఎలక్ట్రిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో ప్యాసింజర్, కార్గో విభాగంలో 1,04,712 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో 54 శాతం వాటాతో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు 56,818 యూనిట్లు నమోదయ్యాయి. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ–త్రీవీలర్ల విక్రయాలు గత నెలలో 58 శాతం పెరగడం విశేషం. 2023 జనవరిలో అమ్ముడైన 70,929 త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ వాటా 48 శాతం ఉంది. 2023 జనవరి–అక్టోబర్ మధ్య ఈ–త్రీవీలర్లు 4,71,154 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 అక్టోబర్‌తో ముగిసిన 10 నెలల్లో ఈ సంఖ్య 2,74,245 యూనిట్లు మాత్రమే. అంటే ఏడాదిలో ఈ–త్రీవీలర్ల విక్రయాలు 72 శాతం పెరిగాయన్న మాట. 2023 జనవరి–అక్టోబర్ కాలంలో దేశవ్యాప్తంగా 8,81,355 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి రోడ్డెక్కుతున్న త్రిచక్ర వాహనాల్లో రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ మోడల్ ఉంటోందంటే మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. పోటీలో 475 కంపెనీలు.. నిర్వహణ వ్యయం తక్కువ కావడంతో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు క్రమంగా భారత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఆటోరిక్షా డ్రైవర్లు, ఫ్లీట్ ఆపరేటర్ల నుంచి వీటికి డిమాండ్ ఊపందుకుంది. 2023 జనవరిలో 34,333 యూనిట్ల ఈ–త్రీవీలర్లు అమ్ముడయ్యాయి. జూలై నుంచి ప్రతి నెల 50 వేల పైచిలుకు యూనిట్ల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. భారత్‌లో 475 కంపెనీలు ఈ–త్రీవీలర్ల మార్కెట్లో పోటీ పడుతున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. అక్టోబర్‌లో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వైసీ ఎలక్ట్రిక్ వెహికిల్స్, సేయిరా ఎలక్ట్రిక్ ఆటో, పియాజియో వెహికిల్స్ నిలిచాయి. అక్టోబర్ అమ్మకాల్లో టాప్–12 కంపెనీల వాటా 43 శాతం నమోదైంది. ఇటీవలే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచి్చన బజాజ్ ఆటో అయిదు నెలల్లో 2,080 యూనిట్లను విక్రయించింది. 124 యూనిట్లతో మొదలై అక్టోబర్‌లో 866 యూనిట్ల స్థాయికి చేరుకుంది. త్రీవీలర్లు 40 శాతం.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్‌లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1,39,232 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఈ–త్రీవీలర్ల వాటా ఏకంగా 40 శాతానికి ఎగబాకింది. 2022లో 1,17,498 ఈవీలు రోడ్డెక్కాయి. ఇందులో 30 శాతం వాటాతో 35,906 యూనిట్ల ఈ–త్రీవీలర్లు ఉన్నాయి. 2023 జనవరి–అక్టోబర్ మధ్య అమ్ముడైన 12.3 లక్షల యూనిట్ల ఈవీల్లో ఈ–త్రీవీలర్లు 38 శాతం ఉన్నాయి. ఇక 2022లో 3,50,238 యూనిట్ల ఈ–త్రీవీలర్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే ఈ ఏడాది 57 శాతం వృద్ధితో 5,50,000 యూనిట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆగస్ట్‌లో ఆల్‌టైమ్ ‘రయ్’!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఆగస్టులో ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు డిమాండ్ కొనసాగడం, పండుగ సీజన్ మొదలవడంతో గిరాకీ పుంజుకుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. మొత్తం 1,89,082 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెల అమ్మకాలు 1,65,173 యూనిట్లతో పోలిస్తే 14% అధికం. హ్యుందాయ్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ ఆటో విక్రయాలు 15% తగ్గాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 6%, 4% పెరిగాయి. వాణిజ్య వాహనాలు, ట్రాకర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. -
వాహన విక్రయాల్లో 10 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూలైలో అన్ని వాహన విభాగాల్లో కలిపి రిటైల్‌లో 17,70,181 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘2022 జూలైతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 4 శాతం ఎగసి 2,84,064 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 8 శాతం ఎగసి 12,28,139 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాలు 2 శాతం అధికమై 73,065 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 74 శాతం, ట్రాక్టర్ల విక్రయాలు 21 శాతం అధికమయ్యాయి. టూ వీలర్ల రంగంలో ఎంట్రీ లెవల్ కేటగిరీ అమ్మకాలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో రిటైల్ వృద్ధి అవకాశాలపై పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లో వృద్ధి నిలకడగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 50 రోజుల మార్కును మించాయి. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో మందగమనం కొనసాగుతోంది. ఆగస్ట్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఇదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిపై ప్రభావం చూపవచ్చు’ అని ఫెడరేషన్ తెలిపింది. -
6 నెలల్లో 20 లక్షల వాహన విక్రయాలు
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధం వాహన పరిశ్రమకు అత్యుత్తమంగా నిలిచింది. ప్యాసింజర్ విభాగంలో మొత్తం 20 లక్షల వాహనాలు విక్రమయ్యాయి. ఇక నెలవారీగా జూన్ ఆటోమొబైల్ పరిశ్రమకు పెద్దగా కలిసిరాలేదు. మొత్తం 3.37 లక్ష వాహన అమ్మకాలు జరిగాయి. ఏడాది ఇదే నెలలో సరఫరా చేసిన 3.21 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 1.9% మాత్రమే అధికంగా ఉంది. కార్ల తయారీ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్.. అమ్మకాల్లో ఓ మోస్తరు వృద్ధి నమోదైంది. ► మారుతి సుజుకీ జూన్‌లో మొత్తం 1,33,027 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల విక్రయాలతో పోలి్చతే కేవలం ఎనిమిది శాతం (1,22,685 యూనిట్లు) వృద్ధి నమోదైంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న అంచనాలు విక్రయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ► హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాల్లో కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. కంపెనీ ఈ కాలంలో 50,001 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ► టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎంజీ మోటార్, టాటా మోటార్స్ విక్రయాలు వరుసగా 19%, 14%, ఒక శాతం పెరగగా కియా, హోండా కార్ల విక్రయాలు మాత్రం వరుసగా 19%, 35% మేరకు క్షీణించాయి. -
SIAM Report: కనీవినీ ఎరుగని రీతిలో కార్ల అమ్మకాలు
భారతదేశంలో కార్లను వినియోగించేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది, ఈ కారణంగా రోడ్డుపైన తిరిగే కార్ల సంఖ్య కూడా తారా స్థాయికి చేరుకుంటోంది. మునుపటితో పోలిస్తే సొంతంగా కార్లను కలిగి ఉన్న వారు ఇప్పుడు చాలానే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అందించిన నివేదికల ప్రకారం, 2023 ఫిబ్రవరిలో మాత్రం సుమారు 2.92 లక్షల ప్యాసింజర్ వాహనాలు విక్రయించారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్యాసింజర్ వాహనాలకున్న డిమాండ్ ఇట్టే అర్దమైపోతోంది. నిజానికి గత నెలలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,91,928 యూనిట్లు. 2022లో విక్రయించబడ్డ 2,62,984 యూనిట్లతో పోలిస్తే ఈ అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ఇందులో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) కూడా ఉన్నాయి. వ్యాన్ల అమ్మకాలు గత ఫిబ్రవరిలో 11,489 యూనిట్లు. మొత్తం అమ్మకాలలో మారుతి సుజుకి సేల్స్ 1,02,565 యూనిట్లు. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 99,398 యూనిట్లను విక్రయించి, 3 శాతం తగ్గుదలను నమోదు చేసింది. హ్యుందాయ్ కంపెనీ 24,493 యూనిట్లను విక్రయించి భారీ వృద్ధిని కైవసం చేసుకుంది. (ఇదీ చదవండి: టాటా కార్లు కొనేవారికి శుభవార్త.. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అంతకుమించిన బెనిఫీట్స్) ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2022లో 10,50,079 యూనిట్లు, కాగా 2023 ఫిబ్రవరిలో ఈ అమ్మకాలు 8 శాతం పెరిగి 11,29,661 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ వీలర్ సేల్స్ కూడా 86 శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. -
మారుతీ కుటుంబం 2.5 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో భారత్‌లో అగ్రశేణి కంపెనీ మారుతీ సుజుకీ.. 2023 జనవరి 9 నాటికి దేశీయంగా 2.5 కోట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అప్పటి మారుతీ ఉద్యోగ్ 1983 డిసెంబర్ నుంచి అమ్మకాలను ప్రారంభించింది. కంపెనీ 2012 ఫిబ్రవరి నాటికి 1 కోటి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. 2019 జూలై కల్లా 2 కోట్ల యూనిట్ల విక్రయాలను సాధించింది. జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుతం దేశీయంగా 17 మోడళ్లను తయారు చేసి విక్రయిస్తోంది. ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. క్రమంగా ఎస్యూవీ మోడళ్లను ప్రవేశపెడుతోంది. మరోవైపు హైబ్రిడ్, సీఎన్జీ విభాగంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ భారత్‌లో 21 లక్షల యూనిట్ల హైబ్రిడ్, సీఎన్జీ వాహనాలను విక్రయించింది. -
ఈసారి రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: డిమాండ్ గణనీయంగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయంగా ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కావచ్చని టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. 38 లక్షల పైచిలుకు యూనిట్లు అమ్ముడు కావచ్చని అంచనాలు ఉన్నట్లు వివరించారు. మూడో త్రైమాసికంలో కాస్త మందగించినా, నాలుగో త్రైమాసికంలో విక్రయాలు తిరిగి పుంజుకుంటాయని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 19 లక్షల విక్రయాలతో ప్యాసింజర్ వెహికల్స్ విభాగం పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు తెలిపారు. భారతీయ వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం 2021–22లో పీవీల అమ్మకాలు 30.69 లక్షలుగా నమోదయ్యాయి. అంతక్రితం 2018–19లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 33.77 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సెమీ–కండక్టర్లు వంటి కీలక భాగాల సరఫరా సమస్యలతో కొన్నాళ్లుగా డెలివరీలు నెమ్మదించి, డిమాండ్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు, 2023–24లో వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరం తరహాలో ఉండకపోవచ్చని చంద్ర చెప్పారు. ఇప్పటికే పేరుకుపోయిన డిమాండ్‌కు దాదాపు సరిపడేంత అమ్మకాలు జరిగాయని, ఇక నుండి కొత్తగా ఆవిష్కరించేవి మార్కెట్‌కు ఊతంగా ఉండగలవని పేర్కొన్నారు. ఉద్గార ప్రమాణాలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్ 6 రెండో దశ అమల్లోకి రానుండటంతో రేట్లు పెంచాల్సి వస్తే కొన్ని సెగ్మెంట్లు.. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి విభాగంపై కొంత ప్రతికూల ప్రభావం పడవచ్చని చంద్ర చెప్పారు. తమ ఎలక్ట్రికల్ వాహనాల విషయానికొస్తే.. సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధికంగా 12,000 యూనిట్లు విక్రయించినట్లు, 87 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నట్లు ఆయన వివరించారు. -
వాహనాలకు పండగొచ్చింది
న్యూఢిల్లీ: తయారీ సంస్థల నుంచి డీలర్లకు సరఫరా మెరుగుపడటంతో పండుగల సీజన్లో వాహన పరిశ్రమ కళకళ్లాడుతోంది. కస్టమర్లకు డెలివరీలూ పుంజుకుంటున్నాయి. దీంతో గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయి. 13,19,647 యూనిట్ల నుంచి 14,64,001 యూనిట్లకు పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో విక్రయాలు మరింత పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దశాబ్దకాలంలోనే ఈ పండుగ సీజన్ అత్యుత్తమమైనదిగా ఉండగలదని డీలర్లు అంచనా వేస్తున్నారు‘ అని పేర్కొంది. ట్రాక్టర్లు, కొన్ని రకాల త్రిచక్ర వాహనాలు మినహా మిగతా అన్ని ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు.. ద్విచక్ర వాహనాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదు చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2,37,502 యూనిట్ల నుంచి 10 శాతం వృద్ధి చెంది 2,60,556 యూనిట్లకు చేరాయి. ‘సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడి కార్ల లభ్యత పెరగడం, వినూత్న ఫీచర్లతో కొత్త వాహనాలను ఆవిష్కరించడం తదితర అంశాల కారణంగా కస్టమర్లు తమకు నచ్చిన వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. మరోవైపు, సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో అమ్మకాలకు ఊతం లభించేలా డిమాండ్‌కి అనుగుణంగా వాహనాలను అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు.. ► సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 9 శాతం పెరిగి 9,31,654 యూనిట్ల నుంచి 10,15,702 యూనిట్లకు చేరాయి. ఎంట్రీ స్థాయి బైక్‌ల అమ్మకాలు గణనీయంగా దెబ్బతినడంతో మొత్తం టూవీలర్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడింది. ► వాణిజ్య వాహనాల విక్రయాలు 59,927 యూనిట్ల నుంచి 19 శాతం వృద్ధితో 71,233 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 53,392 నుంచి 52,595 యూనిట్లకు తగ్గాయి. ► ప్యాసింజర్ వాహనాల విభాగంలో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 99,276 యూనిట్ల నుంచి 1,03,912 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ 39,118, టాటా మోటార్స్ 36,435 కార్లు విక్రయించాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అత్యధికంగా 2,84,160 యూనిట్లు విక్రయించింది. హీరో మోటోకార్ప్ 2,50,246 వాహనాల అమ్మకాలు నమోదు చేసింది. త్రిచక్ర వాహనాలకు సంబంధించి 19,474 యూనిట్లతో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిల్చింది. -
సెప్టెంబర్.. టాప్ గేర్
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్ల సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో ఉత్పత్తి పెరగడం, పండుగల డిమాండ్ తోడు కావడంతో దేశీయంగా కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో 3,55,946 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 91 శాతం అధికం. చిప్‌ల కొరత సమస్య తగ్గి ఉత్పత్తి మెరుగుపడటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ మొదలైన ఆటోమొబైల్ దిగ్గజాలు తమ డీలర్లకు మరిన్ని కార్లను సమకూర్చగలిగాయి. సెప్టెంబర్‌లో మారుతీ సుజుకీ అమ్మకాలు 63,111 యూనిట్ల నుంచి 1,48,380 యూనిట్లకు పెరిగాయి. గత 42 నెలల్లో అమ్మకాలపరంగా ఇది తమకు అత్యుత్తమమైన రెండో నెల అని సంస్థ సీనియర్ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. చివరిగా 2020 అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దేశీ మార్కెట్లో ఏకంగా 1,63,000 వాహనాలు విక్రయించింది. కంపెనీ మార్కెట్ వాటా తాజాగా సెప్టెంబర్‌లో దాదాపు 8 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల వాహనాల విక్రయాల మార్కును దాటిందని శ్రీవాస్తవ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్ అమ్మకాలు 50 శాతం పెరిగి 49,700గా నమోదయ్యాయి. టాటా మోటార్స్ 47,654 కార్లను, కియా ఇండియా 25,857, టయోటా కిర్లోస్కర్ మోటార్ 15,378, హోండా కార్స్ 8,714 వాహనాలను విక్రయించాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 5,07,690, టీవీఎస్ మోటర్ కంపెనీ 2,83,878 యూనిట్లను విక్రయించాయి. -
రయ్‌మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 18,77,072 యూనిట్లు నమోదయ్యాయి. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 18 శాతం పెరుగుదల. సెమికండక్టర్ల లభ్యత మెరుగవడం, పండుగల సీజన్ కోసం డీలర్లు సిద్ధమవడం కారణంగా ఈ స్థాయి వృద్ధి సాధ్యపడిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు 21 శాతం దూసుకెళ్లి 2,81,210 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 16 శాతం ఎగసి 15,57,429 యూనిట్లకు చేరాయి. ఇందులో మోటార్‌సైకిల్స్ 23 శాతం పెరిగి 10,16,794 యూనిట్లు, స్కూటర్స్ 10 శాతం అధికమై 5,04,146 యూనిట్లకు ఎగశాయి. త్రిచక్ర వాహనాలు 63 శాతం దూసుకెళ్లి 38,369 యూనిట్లకు పెరిగాయి. రుతుపవనాలు మెరుగ్గా ఉండడం, రాబోయే పండుగల సీజన్‌తో వాహనాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. పరిశ్రమకు సీఎన్జీ ధర సవాల్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. -
జోరుగా పరుగెడుతున్న వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 15,21,490 యూనిట్లు నమోదైంది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 8.31 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6.51 శాతం వృద్ధితో 2,74,448 యూనిట్లకు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు 8.52 శాతం దూసుకెళ్లి 10,74,266 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 83.14 శాతం ఎగసి 56,313 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 24.12 శాతం పెరిగి 67,158 యూనిట్లుగా ఉంది. 2019 ఆగస్ట్‌తో పోలిస్తే మొత్తం వాహన విక్రయాలు గత నెలలో 7 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్స్ 41 శాతం, వాణిజ్య వాహనాలు 6 శాతం అధికం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు 16 శాతం, త్రిచక్ర వాహనాలు 1 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 7 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికీ టూ వీలర్ దూరమే.. : ధరలు పెరిగిన కారణంగా ప్రారంభ స్థాయి కస్టమర్లకు ఇప్పటికీ టూ వీలర్ దూరమేనని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా వెల్లడించారు. ‘అస్థిర రుతుపవనాల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. వరదల వంటి పరిస్థితి కొనుగోళ్ల నుంచి వినియోగదారులను పరిమితం చేసింది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్‌లో ఎంట్రీ లెవెల్ మినహా ఇతర విభాగాలన్నీ బలమైన పనితీరు కనబరిచాయి. కొన్ని నెలలుగా ఫీచర్లతో కూడిన మోడల్స్ రాక ఇందుకు కారణం. సెమికండక్టర్ల లభ్యత క్రమంగా మెరుగవుతోంది. వాహనాల లభ్యత పెరిగింది. అయితే అధిక ఫీచర్లు కలిగిన మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో వేచి ఉండే కాలం పెరిగింది. ఈ దశాబ్దంలో అత్యధికంగా ఈ పండుగల సీజన్లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఉంటాయి. ధరలు స్థిరంగా ఉండి, ఆరోగ్యపరంగా ముప్పు లేకపోతే ద్విచక్ర వాహనాల జోరు ఉంటుంది’ అని అన్నారు. -
పెరిగిన వెహికల్స్ ఎక్స్పోర్ట్..అగ్రస్థానంలో మారుతీ సుజికీ!
న్యూఢిల్లీ: లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్ల ఊతంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 26 శాతం ఎగిశాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1,27,083 యూనిట్లతో పోలిస్తే 1,60,263 యూనిట్లకు పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 88 శాతం పెరిగి 1,04,400 యూనిట్లుగాను, యుటిలిటీ వాహనాలు 18 శాతం పెరిగి 55,547 యూనిట్లుగాను నమోదయ్యాయి. వ్యాన్ల ఎగుమతులు 588 యూనిట్ల నుంచి 316 యూనిట్లకు తగ్గాయి. ‘లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లు కోలుకుంటున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లో, మన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో భారతీయ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తుండటం, ఆయా దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మారుతీ టాప్.. తొలి త్రైమాసికంలో 68,987 ప్యాసింజర్ వాహనాలను (53 శాతం అధికం) ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిల్చింది. ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేసింది. బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెసో, బ్రెజా మోడల్స్ టాప్‌లో ఉన్నాయి. ఇక హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎగుమతులు 34,520 యూనిట్లుగా (15 శాతం వృద్ధి) నమోదయ్యాయి. కియా ఇండియా 21,459 వాహనాలను (గత క్యూ1లో 12,448) ఎగుమతి చేసింది. నిస్సాన్ మోటర్ ఇండియా 11,419 యూనిట్లు, ఫోక్స్‌వ్యాగన్ 7,146 యూనిట్లు, రెనో 6,658 వాహనాలు, హోండా కార్స్ 6,533 యూనిట్లను ఎగుమతి చేశాయి. వాహన రంగంలో కోటి ఉద్యోగాలు దేశీ ఆటోమొబైల్ రంగంలో వచ్చే 5–6 ఏళ్లలో యువతకు 1 కోటి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమకు సంబంధించి 40 శాతం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు దేశీయంగానే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగానికి భారత్ కీలక కేంద్రంగా మారనుంది. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మంత్రి -
రయ్‌మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు జూన్‌లో 19 శాతం దూసుకెళ్లి 2,75,788 యూనిట్లు నమోదయ్యాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగుపడడం ఈ వృద్ధికి కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 10.6 లక్షల నుంచి 13.08 లక్షల యూనిట్లకు చేరింది. త్రిచక్ర వాహనాలు సుమారు మూడురెట్లు ఎగసి 26,701 యూనిట్లుగా ఉంది. అన్ని విభాగాల్లో కలిపి 13.01 లక్షల నుంచి 16.11 లక్షల యూనిట్లకు పెరిగింది. ఏప్రిల్–జూన్‌లో ప్యాసింజర్ వాహనాలు 41 శాతం పెరిగి 9.1 లక్షల యూనిట్లకు ఎగసింది. వాణిజ్య వాహనాలు 1.05 లక్షల నుంచి 2.24 లక్షల యూనిట్లకు చేరింది. ద్విచక్ర వాహనాలు 24.13 లక్షల నుంచి 37.24 లక్షల యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 24,522 నుంచి 76,293 యూనిట్లకు చేరాయి. అన్ని విభాగాల్లో కలిపి జూన్ త్రైమాసికంలో 31.9 లక్షల నుంచి 49.3 లక్షల యూనిట్లకు పెరిగాయి. రెండింతలైన పోర్ష్ అమ్మకాలు లగ్జరీ కార్ల తయారీలో ఉన్న పోర్ష్ ఈ ఏడాది జనవరి–జూన్‌లో భారత్‌లో 378 యూనిట్లు విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా వృద్ధి. ఖరీదైన స్పోర్ట్స్ కార్ల డిమాండ్‌తో పరిశ్రమ కోలుకుంటోందని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనమని కంపెనీ తెలిపింది. 2021లో భారత్‌లో 474 పోర్ష్ కార్లు రోడ్డెక్కాయి. ఇప్పటి వరకు సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే. -
కార్లు.. కుయ్యో.. మొర్రో, తగ్గిపోతున్న కార్ల అమ్మకాలు!
ముంబై: ఆటో పరిశ్రమ సప్లై సమస్యలతో సతమతమవుతోంది. దీనితో ఉత్పత్తి తగ్గి, కార్ల తయారీ కంపెనీల ఏప్రిల్ అమ్మకాలు క్షీణించాయి. ముఖ్యం గా దిగ్గజ కంపెనీలు మారుతీ సుజుకి, హ్యూందాయ్ కార్ల హోల్‌సేల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. అయితే టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, స్కోడా ఆటో కంపెనీలు గత నెల మెరుగైన అమ్మకాల వృద్ధిని సాధించాయి. మారుతీ సుజుకి గతేడాది ఏప్రిల్ కంటే ఈసారి ఏడు శాతం తక్కువగా 1,32,248 యూనిట్లను విక్రయించింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. హ్యూందాయ్ సైతం సమీక్షించిన నెలలో పది శాతం క్షీణతతో 44,001 యూనిట్లను విక్రయించింది. హోండా కార్స్ కంపెనీ అమ్మకాలు ఏప్రిల్ 7,874 యూనిట్లతో 13 % పడిపోయా యి. ‘‘వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా సమస్య తీవ్రంగా ఉందని, అందుకే అమ్మకాలు నెమ్మదించాయి’’ అని హోండా మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ యుచి మురాటా అన్నారు. చదవండి👉 ట్విటర్ ఎఫెక్ట్: టెస్లాకు భారీ షాక్! -
హోల్‌సేల్‌లో తగ్గిన వాహన అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నెలలో 2,79,501 యూనిట్లు నమోదయ్యాయి. 2021 మార్చితో పోలిస్తే ఇది 4 శాతం తగ్గుదల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియమ్) చెబుతోంది. ‘2021 మార్చితో పోలిస్తే ద్విచక్ర వాహన అమ్మకాలు గత నెలలో 21 శాతం పడిపోయి 11,84,210 యూనిట్లుగా ఉంది. మోటార్‌సైకిల్స్ 21 శాతం తగ్గి 1,86,479 యూనిట్లు, స్కూటర్స్ 21 శాతం తక్కువై 3,60,082 యూనిట్లకు వచ్చి చేరాయి. ఇక 2020–21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 6 శాతం తగ్గి 1,86,20,233 నుంచి 1,75,13,596 యూనిట్లకు వచ్చి చేరింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 13 శాతం ఎగసి 30,69,499 యూనిట్లను నమోదు చేశాయి. ద్విచక్ర వాహనాలు 11 శాతం తగ్గి 1,34,66,412 యూనిట్లకు పడిపోయాయి. గడిచిన 10 ఏళ్లలో ఈ స్థాయి అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. త్రిచక్ర వాహనాలు 2,19,446 నుంచి 2,60,995 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 5,68,559 నుంచి 7,16,566 యూనిట్లను తాకాయి. ఎగుమతులు 41,34,047 నుంచి 56,17,246 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లోనూ ఎగుమతులు దూసుకెళ్లాయి. ప్రధానంగా ద్విచక్ర వాహన ఎగుమతులు రికార్డు స్థాయిలో 44,43,018 యూనిట్లు నమోదయ్యాయని సియామ్ నివేదిక వెల్లడించింది. చదవండి: మారుతి జోరులో టాటా పంచ్‌లు !? -
న్యూఇయర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలే, పడిపోయిన ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
కొత్త సంవత్సరం ఆటోమొబైల్ సంస్థలకు ఏమాత్రం కలిసిరాలేదంటూ కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. న్యూఇయర్ సెంటి మెంట్ కారణంగా ఆయా ప్రొడక్ట్ ల సేల్స్ భారీ ఎత్తున జరుగుతాయి. కానీ ఆటోమొబైల్ రంగంలో అందుకు భిన్నంగా సేల్స్ జరిగినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికల్లో పేర్కొన్నాయి. గతేడాదికంటే ఈఏడాది ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు పడిపోవడం అందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్యాసింజర్ వెహికల్స్ పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్‌డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది.ముఖ్యంగా సెమీ కండక్టర్ల కొరతతో పాటు కోవిడ్ కేసులు పెరిగిపోవడం, ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు జోరందుకోవడం వంటి అంశాలు కొనుగోలు దారులపై పడినట్లు ఎఫ్ఏడీఏ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 10.12 శాతం తగ్గాయి. 2021తో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రిటైల్ విక్రయాలు 2,87,424 నుంచి 2,58,329 యూనిట్లకు వచ్చి చేరాయి. సెమికండక్టర్ల కొరత ఇందుకు కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్‌డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహన విక్రయాలు 13.44 శాతం తగ్గి 10,17,785 యూనిట్లుగా ఉంది. -
అటు అమ్మకాల్లో దుమ్ము లేపుతుంటే..ఇటు ఈసురో మంటున్నాయి
అసలే ఇప్పుడు కరోనా కాలం..ఏ రంగం చూసినా ఈసురో మంటోంది. కానీ ఆటోమొబైల్ రంగం మాత్రం జోరును కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. 2020లో ఈవీ వెహికిల్స్ (టూ వీలర్స్) అమ్మకాలు 1,00,736 యూనిట్లు ఉండగా.. 2021లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) విక్రయాలు దేశీయంగా 2,33,971 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో దేశీయ ప్యాసింజర్ వాహన రిటైల్ విక్రయాలు గతేడాది డిసెంబర్లో నెమ్మదించాయి. ఆటో పరిశ్రమపై సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగడం ఇందుకు కారణమని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది(2021) డిసెంబర్లో 2,44,639 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోయినట్లు ఫాడా తెలిపింది. అంతకుముందు (2020) ఇదే డిసెంబర్లో అమ్ముడైన 2,74,605 యూనిట్లతో పోలిస్తే ఇవి 11 శాతమని తక్కువ. మొత్తంగా వాహనాల రిటైల్ విక్రయాలు గత నెల 16.05 శాతం తగ్గి 15,58,756 యూనిట్లుగా నమోదయ్యాయి.దేశంలో 1,590 వాహన రిజిస్ట్రేషన్ కేంద్రాలుండగా, 1,379 కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను ఫాడా విడుదల చేసింది. ‘‘ఆటో కంపెనీలు ఏడాది నిల్వలను తగ్గించుకునేందుకు డిసెంబర్లో వాహనాలపై భారీ రాయితీలను ప్రకటిస్తుంటాయి. కావున ప్రతి ఏటా డిసెంబర్లో విక్రయాలు భారీగా ఉంటాయి. అయితే ఈసారి అమ్మకాలు నిరాశపరిచాయి’’ అని ఫాడా చైర్మన్ వింకేశ్ గులాటి తెలిపారు. సెమికండెక్టర్ల కొరత కొనసాగడంతోఆటో కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తిని సాధించడంలో విఫలయ్యాయని పేర్కొన్నారు. అయితే, గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడిందని పేర్కొన్నారు. దీంతో డీలర్లకు సరఫరా పెరిగిందన్నారు. ద్విచక్ర వాహన విక్రయాలు అంతంతే... సమీక్షించిన నెలలో ద్వి చక్ర వాహన విక్రయాలు 20 మేర క్షీణించాయి. డిసెంబరు 2020లో 14,33,334 యూనిట్లు విక్రయించగా.. ఈసారి అవి 11,48,732 యూనిట్లకు పరిమితమయ్యాయి. వాహనాల ధరలు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోం పొడిగింపు, తాజాగా ఒమిక్రాన్ భయాలు వంటి కారణాలు విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. వాణిజ్య వాహన అమ్మకాలు జూమ్ వాణిజ్య వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. గతేడాది(2021) డిసెంబర్లో 58,847 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది డిసెంబర్లో అమ్ముడైన 51,749 యూనిట్లతో పోలిస్తే ఇవి 14శాతం అధికం. కేంద్రం మౌలిక వసతి కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, సరుకు రవాణా ఛార్జీలు పెరగడం, కొత్త ఏడాదిలో కంపెనీలు వాహన ధరల్ని పెంచడం, లో బేస్ తదితర కారణాలతో ఈ విభాగంలో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. -
దుమ్మురేపిన టాటా మోటార్స్..! కంపెనీకి కాసుల వర్షమే..!
ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో టాటామోటార్స్ దుమ్మురేపింది. వాహన కొనుగోలుదారులు కంపెనీకి కాసుల వర్షం కురిపించారు. 2021 నవంబర్ నెలల్లో 62,192 ప్యాసింజర్ వాహనాల విక్రయాలను టాటామోటార్స్ జరిపింది. ఈ సంఖ్య గత ఏడాది పోలిస్తే.. 38 శాతం అధికం. సుమారు 29,778 యూనిట్ల మేర అమ్మకాలను టాటా మోటార్స్ జరిపింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో టాటా జోరు..! ప్యాసింజర్ వెహికల్ విభాగంలో... నవంబర్ 2021లో పెట్రోల్, డిజిల్ వాహనాల్లో 28,027 యూనిట్ల అమ్మకాలను టాటా మోటార్స్ నమోదుచేసింది. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే 32 శాతం మేర వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా టాటామోటార్స్ అదరగొట్టింది. నవంబర్ 2020తో పోలిస్తే ఏకంగా 324 శాతం పెరిగి 1,751 యూనిట్లను నవంబర్ 2021లో విక్రయాలను జరిపింది. మొత్తంగా 62,192 యూనిట్ల విక్రయం..! దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఏడాది నవంబర్ నెలలో సుమారు 62,192 యూనిట్ల విక్రయాలను టాటామోటార్స్ జరిపింది. వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్ కొద్దిమేరనే వృద్ధిని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 15 శాతం మేర విక్రయించింది. చదవండి: ఢిల్లీలో లీటరు పెట్రోలుపై రూ.8 తగ్గింపు.. కారణం ఇదే -
చిప్ చిన్నదే.. కానీ దాని ఎఫెక్ట్ చాలా పెద్దది
ముంబై: పండుగ సీజన్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆటో కంపెనీలకు నిరాశ ఎదురైంది. పరిశ్రమను సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ చిప్‌ల కొరత వేధించడంతో సెప్టెంబర్ విక్రయాల్లో క్షీణత నమోదైంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రాతో సహా ఆటో పరిశ్రమలో పలు కంపెనీల విక్రయాలు తగ్గాయి. సమీక్షించిన నెలలో మారుతీ సుజుకీ 86,380 యూనిట్ల వాహనాలను అమ్మగా.. గతేడాది సెప్టెంబర్‌లో మొత్తం 1,60,442 యూనిట్లను విక్రయించింది. ‘‘ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగానే సెప్టెంబర్ అమ్మకాలు తగ్గాయి. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాము’’ అని మారుతీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు 23 శాతం క్షీణించి 45,791 వాహనాలకు చేరాయి. అయితే వార్షిక ప్రాతిపదికన టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్, నిస్సాన్ మోటార్స్ విక్రయాలు వరుసగా 26%, 28%, 100% చొప్పున వృద్ధిని సాధించాయి. చదవండి: జియోకు కొత్త చిక్కులు,పెరగనున్న 'జియో నెక్ట్స్' ఫోన్ ధరలు? -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల కొనుగోలుదారులకు ఇండస్ఇండ్ బ్యాంకు తరఫున రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇండస్ఇండ్ బ్యాంకు భాగస్వామ్యంతో స్టెపప్ పథకాన్ని అందిస్తున్నట్టు.. ఇందులో భాగంగా మొదటి 3-6 నెలల పాటు తక్కువ ఈఎంఐను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో ఏ వాహనానికైనా ఈ సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. ముఖ్యంగా టియాగో, నెక్సాన్ లేదా ఆల్ట్రోజ్ వంటి తక్కువ ఖరీదైన వాహనాల కొనుగోలులో ఎక్స్-షోరూమ్ ధరపై 90 శాతం దాకా ఎల్‌టివికి అందుబాటులో ఉంచింది. అలాగే హారియర్, సఫారి, టైగోర్ వంటి ఖరీదైన వాహనాల కొనుగోలులో 85 శాతం వరకు (ఎల్టివి) రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. కోవిడ్-19 సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేసేందుకు ఇండస్ ఇండ్ భాగస్వామ్యంతో ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను తీసుకురావడం సంతోషంగా ఉందని ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ హెడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్ రమేష్ డోరైరాజన్ అన్నారు. అలాగేఈ వినూత్న ఆర్థిక పథకాల ద్వారా కస్టమర్‌పై భారాన్ని తగ్గించడమే కాకుండా సురక్షితమైన, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ పథకాల నిమిత్తం టాటా మోటార్స్‌తో చేతులు కలపడం తమకు గర్వకారణమని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్యాసింజర్ వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టీఏ రాజగోప్పలన్ తెలిపారు.