న్యూఢిల్లీ: 2024 సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు(Vehicle sales) రికార్డు స్థాయిలో 43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు 2023 ఏడాదిలో విక్రయించిన 41.09 లక్షల వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 4.64% అధికంగా ఉంది. ఎస్‌యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు అధిక గిరాకీ, గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండ్(Demand) బలంగా ఉండడం కలిసొచ్చింది. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ(Maruti Suzuki), హ్యుందాయ్, టాటా మోటార్స్(Tata Motors), టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియాలు గతంలో ఎన్నడూ చేయని అధిక స్థాయిలో వార్షిక విక్రయాలు నమోదు చేశాయి.
ఇదీ చదవండి: కంపెనీల విడదీత.. లాభాల మోత!
మారుతీ సుజుకీ 2024లో 17,90,977 వాహనాలు విక్రయించింది. అంతకు ముందు 2018లో అమ్ముడైన 17,51,919 యూనిట్ల అమ్మకాల రికార్డు బద్దలైంది. కాగా 2023లో కంపెనీ మొత్తం 17,26,661 వాహనాలను విక్రయించింది.
గత క్యాలెండర్ ఏడాదిలో హ్యుందాయ్ మోటార్ రికార్డు స్థాయిలో 6,05,433 యూనిట్లు విక్రయించింది. వీటిలో ఎస్‌యూవీ విభాగపు వాటా 60.6 శాతంగా ఉంది. కాగా 2023లో 6,02,111 విక్రయాలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment