passenger vehicles
-
హ్యుండై ఎగుమతులు 37 లక్షల యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుండై మోటార్ ఇండియా 37 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను భారత్ నుంచి ఎగుమతి చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశం నుంచి 1999లో కంపెనీ ఎగుమతులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం 60 దేశాలకు వివిధ మోడళ్ల కార్లను సరఫరా చేస్తోంది. 2024లో సంస్థకు సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతిపెద్ద ఎగుమతి మార్కెట్లుగా అవతరించాయి. గత ఏడాది హ్యుండై 1,58,686 యూనిట్లు ఎగుమతి చేసి భారత్‌లో ప్యాసింజర్ వెహికిల్స్‌కు అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. ఇక మన దేశం నుంచి హ్యుండై కార్లకు అతిపెద్ద దిగుమతిదారుగా ఆఫ్రికా తొలి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు మొత్తం 10 లక్షలకుపైగా వాహనాలను ఆఫ్రికా అందుకుంది. తొలి స్థానంలో ఐ10..గడిచిన 25 ఏళ్లలో భారత్ నుంచి 150కిపైగా దేశాలకు వాహనాలను సరఫరా చేసినట్టు హ్యుండై తెలిపింది. తమిళనాడులో కంపెనీకి తయారీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఐ10 మోడల్ ఫ్యామిలీ 15 లక్షల యూనిట్లను దాటి టాప్–1లో నిలిచింది. వెర్నా సిరీస్‌లో 5,00,000 యూనిట్లు నమోదయ్యాయి. దక్షిణ కొరియా వెలుపల హ్యుండై అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా భారత్‌ను నిలపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని హ్యుండై మోటార్ ఇండియా ఎండీ ఉన్సూ కిమ్ వెల్లడించారు. ఇటీవల దక్షిణాఫ్రికాకు ఎక్స్టర్ మోడల్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించామని, అక్కడి మార్కెట్లో భారత్‌లో తయారు చేసిన ఎనిమిదవ వాహనంగా ఈ మోడల్ గుర్తింపు పొందిందని చెప్పారు. -
వాహన రిటైల్ విక్రయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2024లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 2,61,07,679 యూనిట్లు నమోదైంది. 2023తో పోలిస్తే విక్రయాలు గతేడాది 9 శాతం పెరిగాయని డీలర్ల సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం తెలిపింది. సవాళ్లతో కూడిన వ్యాపార వాతావరణం మధ్య ద్విచక్ర, ప్యాసింజర్ వాహనాలకు బలమైన డిమాండ్ నేపథ్యంలో ఈ వృద్ధి నమోదైందని ఫెడరేషన్ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు 2023తో పోలిస్తే 5 శాతం వృద్ధితో గతేడాది 40,73,843 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 శాతం దూసుకెళ్లి 1,89,12,959 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్స్ రిజిస్ట్రేషన్లు 11 శాతం ఎగసి 12,21,909 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 3 శాతం వృద్ధితో 8,94,112 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 10,04,856 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. నిలకడగా పరిశ్రమ.. వేడిగాలులు, కేంద్రం, రాష్ట్ర స్థాయిలలో ఎన్నికలు, అసమాన రుతుపవనాలతో సహా పలు ఎదురుగాలులు ఉన్నప్పటికీ వాహన రిటైల్ పరిశ్రమ 2024లో నిలకడగా ఉందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. ‘మెరుగైన సరఫరా, తాజా మోడళ్లు, బలమైన గ్రామీణ డిమాండ్ ద్విచక్ర వాహన విభాగంలో వృద్ధిని పెంచాయి. అయినప్పటికీ ఆర్థిక పరిమితులు, ఎలక్ట్రిక్ విభాగం నుంచి పెరుగుతున్న పోటీ సవాళ్లను కలిగిస్తూనే ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ (పీవీ) విభాగం బలమైన నెట్వర్క్ విస్తరణ, ఉత్పత్తి లాంచ్‌ల నుండి ప్రయోజనం పొందింది. అధిక ఇన్వెంటరీ కారణంగా లాభాలపై ఒత్తిళ్లు ఏర్పడి ద్వితీయార్థంలో డిస్కౌంట్ల యుద్ధానికి దారితీసింది. ఎన్నికల ఆధారిత అనిశ్చితి, తగ్గిన మౌలిక సదుపాయాల మధ్య వాణిజ్య వాహనాల విభాగం పనితీరు స్తబ్ధుగా ఉంది’ అని వివరించారు. -
2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: 2024 సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు(Vehicle sales) రికార్డు స్థాయిలో 43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు 2023 ఏడాదిలో విక్రయించిన 41.09 లక్షల వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 4.64% అధికంగా ఉంది. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు అధిక గిరాకీ, గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండ్(Demand) బలంగా ఉండడం కలిసొచ్చింది. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ(Maruti Suzuki), హ్యుందాయ్, టాటా మోటార్స్(Tata Motors), టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియాలు గతంలో ఎన్నడూ చేయని అధిక స్థాయిలో వార్షిక విక్రయాలు నమోదు చేశాయి. ఇదీ చదవండి: కంపెనీల విడదీత.. లాభాల మోత!మారుతీ సుజుకీ 2024లో 17,90,977 వాహనాలు విక్రయించింది. అంతకు ముందు 2018లో అమ్ముడైన 17,51,919 యూనిట్ల అమ్మకాల రికార్డు బద్దలైంది. కాగా 2023లో కంపెనీ మొత్తం 17,26,661 వాహనాలను విక్రయించింది.గత క్యాలెండర్ ఏడాదిలో హ్యుందాయ్ మోటార్ రికార్డు స్థాయిలో 6,05,433 యూనిట్లు విక్రయించింది. వీటిలో ఎస్యూవీ విభాగపు వాటా 60.6 శాతంగా ఉంది. కాగా 2023లో 6,02,111 విక్రయాలు నమోదయ్యాయి. -
వర్గపోరాటంలో అమాయకులు బలి
పెషావర్: షియా, సున్నీ గిరిజన వర్గాల మధ్య ఏడాదికాలంగా జరుగుతున్న పోరులో తాజాగా అమాయక ప్రజలు బలయ్యారు. గురువారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని కుర్రం జిల్లాలో పర్వతమయ ప్రాంతాల గుండా వెళ్తున్న సాధారణ ప్రయాణికుల వాహన శ్రేణిపై సాయుధ మిలిటెంట్లు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. ప్రాణభయంతో కొందరు వాహనాల సీట్ల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. మృతులంతా మైనారిటీ షియా వర్గానికి చెందిన వాళ్లేనని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో షియా, సున్నీ గిరిజన సాయుధ ముఠాల మధ్య పరస్పర దాడులు, ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా గిరిజన మండలి ఒకటి కాల్పుల విరమణకు పిలుపునిచ్చాక ఈ మార్గంలో ఇటీవల పౌరుల రాకపోకలు మొదలయ్యాయి. పౌర వాహనాలకు రక్షణగా పోలీసు వాహనం ముందుగా ఎస్కార్ట్‌గా బయల్దేరగా దానిపై తొలుత మిలిటెంట్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపింది తామేనని ఇంతవరకు ఏ ముఠా ప్రకటించుకోలేదు. అయితే తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రసంస్థే ఈ కాల్పులకు పాల్పడి ఉంటుందని స్థానిక పాత్రికేయులు చెబుతున్నారు. పరాచినార్ నుంచి పెషావర్‌కు కాన్వాయ్‌గా వెళ్తున్న 50 వాహనాలపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఒకే దాడిలో ఇంతమంది మరణించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. At least 39 killed on Thursday (Nov 21) after gunmen opened fire on passenger vehicles in the #Kurram district of #Pakistan's Khyber Pakhtun.The convoy of vehicles was travelling from Parachinar to #Peshawar when unidentified gunmen attacked in the Uchat area of Kurram pic.twitter.com/U1SnQbOUzi— Ravi Pratap Dubey 🇮🇳 (@ravipratapdubey) November 21, 2024 -
మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి 16% డౌన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిని 16 శాతం తగ్గించింది. అయితే, యుటిలిటీ వాహనాల ఉత్పత్తిని 33 శాతం పెంచింది. అక్టోబర్‌లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 1,06,190 యూనిట్ల నుంచి 89,174 యూనిట్లకు తగ్గినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. మరోవైపు, బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలతో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్‌కి సఫరా చేసే వాహనాల ఉత్పత్తిని 54,316 యూనిట్ల నుంచి 72,339 యూనిట్లకు పెంచినట్లు పేర్కొంది. మినీ కార్లు అయిన ఆల్టో, ఎస్–ప్రెసో మొదలైన వాటి ఉత్పత్తి 14,073 యూనిట్ల నుంచి 12,787 యూనిట్లకు తగ్గింది. అటు బాలెనో, సెలీరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్తో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్‌కి కూడా సరఫరా చేసే కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి 90,783 నుంచి 75,007 యూనిట్లకు తగ్గింది. -
ఈ–టూ వీలర్స్‌లో బజాజ్ టాప్–2
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 88,156 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 40 శాతం అధికం. 2024 జనవరి–సెప్టెంబర్‌లో 31 శాతం వృద్ధితో 7,99,103 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది ఒక మిలియన్ యూనిట్ల మైలురాయిని పరిశ్రమ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఒక ఏడాదిలో ఈ స్థాయి విక్రయాలు నమోదుకావడం ఇదే తొలిసారి అవుతుంది. 2023లో దేశవ్యాప్తంగా 8,48,003 యూనిట్ల ఈ–టూవీలర్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2024 మార్చిలో అత్యధికంగా 1,37,741 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత ఆగస్ట్‌లో 87,256 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,48,539 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఇందులో ఈ–టూ వీలర్ల వాటా ఏకంగా 59 శాతం ఉంది. ఏడాదిలో 166 శాతం వృద్ధి.. ఇప్పటి వరకు ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ 11 నెలల కనిష్టానికి 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెపె్టంబర్లో ఇది 27 శాతానికి పడిపోవడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో గత నెలలో 17,865 యూనిట్ల అమ్మకాలను సాధించి 20.26 శాతం వాటాతో మూడో స్థానానికి పరిమితం అయింది. ఏథర్, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. 19 నెలల కనిష్టానికి.. ఎలక్ట్రిక్ కార్లు, ఎస్‌యూవీల అమ్మకాలు సెప్టెంబర్‌లో 19 నెలల కనిష్టానికి పడిపోయాయి. గత నెలలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 5,733 యూనిట్లు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 9 శాతం తగ్గుదల. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 9,661 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2024 జనవరి–సెప్టెంబర్‌లో 15 శాతం వృద్ధితో 68,642 యూనిట్లు రోడ్డెక్కాయి. తొలి స్థానంలో ఉన్న టాటా మోటార్స్ గత నెలలో 3,530 ఈవీలను విక్రయించింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికి వచ్చి చేరింది. 2023 సెప్టెంబర్‌లో ఇది 68 శాతం నమోదైంది. ఎంజీ మోటార్ ఇండియా 955 యూనిట్ల అమ్మకాలతో 16.65 శాతం వాటాతో రెండవ స్థానంలో పోటీపడుతోంది. 443 యూనిట్లతో మూడవ స్థానంలో నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా 7.72 శాతం వాటా కైవసం చేసుకుంది. బీవైడీ ఇండియా, సిట్రన్, బీఎండబ్లు్య ఇండియా, మెర్సిడెస్ బెంజ్, హ్యుండై మోటార్ ఇండియా, వోల్వో ఆటో ఇండియా, కియా ఇండియా, ఆడి, పోర్ష, రోల్స్ రాయిస్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
ఆగస్టులో నెమ్మదించిన ప్యాసింజర్ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 2% తగ్గినట్లు వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్ల డించింది. మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, కంపెనీలు డీలర్లకు తమ డిస్పాచ్‌లను తగ్గించ డం ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఆగస్టులో కంపెనీల నుంచి డీలర్లకు 3,52,921 ప్యాసింజర్ వాహనాలు చేరాయి. గతేడాది (2023) ఆగస్టులో ఇవి 3,59,228గా నమోదయ్యాయి. → ద్వి చక్ర వాహన టోకు అమ్మకాలు 9% పెరిగి 15,66,594 యూనిట్ల నుంచి 17,11,662 యూనిట్లకు చేరాయి. స్కూటర్ల విక్రయాలు 6,06,250 యూనిట్ల నుంచి 5,49,290 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిల్ డెలివరీలు 9,80,809 యూనిట్ల నుండి 8% పెరిగి 10,60,866 యూనిట్లకు చేరుకున్నాయి. → త్రి చక్ర వాహనాల అమ్మకాలు 64,944 యూనిట్ల నుంచి 69,962 యూనిట్లకు పెరిగాయి. ‘‘ఈ పండుగ సీజన్లో వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం ఈ–బస్ సేవా పథకాలతో వాహన వినియోగం మరింత పుంజుకుంటుంది’’ అని సియామ్ డైరక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
60 లక్షల ప్యాసింజర్ వాహనాలు
ముంబై: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వెహికిల్స్ మార్కెట్ 6 శాతం వార్షిక వృద్ధితో 2029–30 నాటికి 60 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. ఆ సమయానికి 18–20 శాతం వాటా చేజిక్కించుకోవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం సంప్రదాయ ఇంజన్‌తోపాటు ఎలక్ట్రిక్ విభాగంలో నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. కఠినమైన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్ఈ–3) నిబంధనలు 2027 నుండి ప్రారంభం కానుండడంతో ఈవీలు, సీఎన్జీ వాహనాల వాటా పెరుగుతుంది. మరోవైపు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల ధరలు అధికం అవుతాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 2029–30 నాటికి ఈవీల వాటా 20 శాతం, సీఎన్జీ విభాగం 25 శాతం వాటా కైవసం చేసుకుంటాయని అంచనాగా చెప్పారు. కొన్నేళ్లుగా కొత్త ట్రెండ్.. వినియోగదార్లకు ఖర్చు చేయతగిన ఆదాయం పెరగడం, తక్కువ కాలంలో వాహనాన్ని మార్చడం వంటి అంశాలు పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని శైలేష్ చంద్ర అన్నారు. పైస్థాయి మోడల్‌కు మళ్లడం, అదనపు కార్లను కొనుగోలు చేసేవారి వాటా పెరుగుతోందని చెప్పారు. కొన్నేళ్లుగా ఇది ట్రెండ్‌గా ఉందని అన్నారు. నూతనంగా కారు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య తగ్గుతోందని వివరించారు. ఎస్‌యూవీల కోసం ప్రాధాన్యత పెరుగుతోంది. పెద్ద ఎత్తున కొత్త మోడళ్ల రాకతో ఈ సెగ్మెంట్ వాటా ఎక్కువ కానుందని శైలేష్ తెలిపారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్లకయ్యే ఖర్చుతో ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీ ఫీచర్లు, అప్గ్రేడ్లు కొన్నేళ్లుగా ట్రెండ్‌గా ఉన్నాయని, ఇది సహజమైన పురోగతి అని ఆయన అన్నారు. అత్యంత విఘాతం..సీఏఎఫ్ఈ–3 కఠిన నిబంధనలు రాబోయే ఐదారు సంవత్సరాలలో పరిశ్రమకు అత్యంత విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. సీఏఎఫ్ఈ–3 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, ఇదే జరిగితే బ్రాండ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు. 2023–24లో దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో కంపెనీకి 13.9 శాతం వాటా ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఏడు మోడళ్లతో 53 శాతం మార్కెట్లో పోటీపడుతోందని వివరించారు. కొత్త మోడళ్లతో పోటీపడే మార్కెట్‌ను పెంచుకుంటామని వెల్లడించారు. కర్వ్, సియెర్రా మోడళ్లను రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కొత్త మోడళ్ల కోసం ఆదాయంలో 6–8 శాతం వెచ్చిస్తామని వెల్లడించారు. అయిదారేళ్లలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపారం కోసం రూ.16–18 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. -
ప్యాసింజర్ వాహనాలు.. స్లో
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెల(మే)లో మందగించాయి. కంపెనీల నుంచి డీలర్లకు సగటున వాహన పంపిణీ(హోల్‌సేల్) 4 శాతమే పుంజుకుంది. మొత్తం 3,50,257 యూనిట్లకు చేరాయి. ఏడాది క్రితం(2023) ఇదే నెలలో హోల్‌సేల్ అమ్మకాలు 3,35,436 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ నీరసించడం, అంతక్రితం అధిక వృద్ధి నమోదుకావడం(బేస్ ఎఫెక్ట్) కారణమయ్యాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీ అమ్మకాలు నామమాత్రంగా పెరిగి 1,44,002 యూనిట్లను తాకాయి. గతేడాది మే నెలలో 1,43,708 వాహనాలు విక్రయించింది. ఎంట్రీలెవల్(చిన్న కార్లు), కాంపాక్ట్ కార్ల అమ్మకాలు వెనకడుగు వేశాయి. వీటి అమ్మకాలు 12,236 యూనిట్ల నుంచి 9,902కు తగ్గాయి. అయితే యుటిలిటీ వాహనాలు బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎరి్టగా, ఎస్‌క్రాస్, ఎక్స్ఎల్6 విక్రయాలు 46,243 యూనిట్ల నుంచి 54,204కు ఎగశాయి. చిన్నకార్ల విభాగానికి దన్నునిచ్చేందుకు ఆల్టో కే10, ఎస్ప్రెస్సో, సెలెరియో మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్ధో బెనర్జీ పేర్కొన్నారు. ఇతర దిగ్గజాల తీరిలా..⇥ హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 49,151 వాహనాలకు చేరింది. 2023 మే నెలలో 48,601 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల మందగమనం కొనసాగవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ అంచనా వేశారు. ⇥ ఎలక్ట్రిక్ వాహనాలుసహా ఇతర ప్యాసిజంర్ వాహన అమ్మకాలు దేశీయంగా 2 శాతం బలపడి 47,705కు చేరినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. గతంలో 45,984 యూనిట్లు విక్రయించింది. ⇥ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు 31 శాతం జంప్‌చేశాయి. 43,218 యూ నిట్లను తాకాయి. 2023 మే నెలలో 32,886 వాహనాలు మాత్రమే డీలర్లకు పంపిణీ చేసింది. ⇥ టయోటా కిర్లోస్కర్ సైతం గత నెలలో హోల్‌సేల్‌గా 24 శాతం వృద్ధితో మొత్తం 25,273 వాహన విక్రయాలను సాధించింది. ⇥ కియా ఇండియా 4 శాతం అధికంగా 19,500 యూనిట్లను డీలర్లకు పంపిణీ చేసింది. గతేడాది మే నెలలో 18,766 వాహనాలు విక్రయించింది. ఈ ఏడాది పోటీకి అనుగుణంగా పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ సీనియర్ వీపీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. ⇥ ఎంజీ మోటార్ ఇండియా వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెలలో 5 శాతం క్షీణించి 4,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2023 మే నెలలో డీలర్లకు 5,006 వాహనాలు పంపిణీ చేసింది. -
కార్ల కంపెనీల పల్లె‘టూర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో 38,90,114 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. 2024–25లో ఈ విభాగం 3–5% వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. అయితే మొ త్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పీవీ సేల్స్‌లో గ్రామీణ ప్రాంతాల వాటా 33% గా ఉంది. మహమ్మారి కాలంలో పట్టణ ప్రాంతాల్లో పీవీ విక్రయాల్లో తిరోగమన వృద్ధి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు దూసుకుపోవడం గమనార్హం. కలిసి వ చ్చే అంశం ఏమంటే రూరల్ ఏరియాల్లో రోడ్ నెట్ వర్క్ చాలా మెరుగైంది. వృద్ధి పరంగా పట్టణ ప్రాంతా లను కొన్నేళ్లుగా గ్రామీణ మార్కెట్లు వెనక్కి నెట్టాయి. ఈ అంశమే ఇప్పుడు తయారీ కంపెనీలకు రిటైల్ విషయంలో వ్యూహం మార్చుకోక తప్పడం లేదు. వృద్ధిలోనూ రూరల్ మార్కెట్లే.. అమ్మకాల వృద్ధిరేటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 11.7, పట్టణ ప్రాంతాల్లో 8% ఉండొచ్చని అంచనా. 2022–23లో గ్రామీణ భారతం 20 % దూసుకెళితే, పట్టణ మార్కెట్లు 16 శాతం వృద్ధి సాధించాయి. 2021–22లో అర్బన్ మార్కెట్లు 9% తిరోగమన వృద్ధి చెందితే, రూరల్ మార్కెట్లు 1.5% ఎగశాయి. 2018–19 నుంచి 2023–24 వరకు చూస్తే ఒక్క 2019–20లో మాత్రమే గ్రామీణ భారతం తిరోగమన వృద్ధి చెందింది. అర్బన్ మార్కెట్లు మాత్రం 2021–22 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు తిరోగమన బాట పట్టాయి. విస్మరించలేని గ్రామీణం.. గ్రామీణ ప్రాంతాలు విస్మరించలేని మార్కెట్లుగా అభివృద్ధి చెందాయని మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ సంస్థకు 2018–19లో గ్రామీణ ప్రాంతాల వాటా 38 శాతం. ఇప్పుడు ఇది 45 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 6,50,000 గ్రామాలు ఉన్నాయని, ఇందులో 4,10,000 గ్రామాల్లో కనీసం ఒక్క మారుతీ సుజుకీ కారైనా పరుగు తీస్తోందని కంపెనీ ధీమాగా చెబుతోంది. మిగిలిన గ్రామాలు వ్యాపార అవకాశాలు ఉన్నవేనని కంపెనీ అంటోంది. 2019–20తో పోలిస్తే టాటా మోటార్స్ గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు అయిదు రెట్లు అధికం అయ్యాయి. మొత్తం విక్రయాల్లో రూరల్ వాటా ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు చేరువ అయ్యేందుకు సేల్స్, సరీ్వస్ వర్క్‌షాప్స్‌ను విస్తరించినట్టు తెలిపింది. పట్టణాలకు సమీపంలో 800 ఔట్లెట్లు నెలకొన్నాయని, ప్రత్యేకంగా ఇవి గ్రామీణ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా 135 అనుభవ్ వ్యాన్స్ (మొబైల్ షోరూమ్స్) పరిచయం చేశామని తెలిపింది. గ్రామాల్లో చిన్న కార్లు.. హ్యాచ్‌బ్యాక్స్‌కు గ్రామీణ మార్కెట్లలో విపరీత డిమాండ్ ఉంది. తొలిసారిగా కారు కొనే కస్టమర్లు ఇక్కడ అత్యధికం కూడా. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ విక్రయాల్లో రూరల్ ఏరియాల వాటాయే అధికం. ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ అధికంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నాయి. సెడాన్స్ విషయంలో ఇరు మార్కెట్లు చెరి సగం పంచుకున్నాయి. ఎస్‌యూవీల్లో అయితే అర్బన్దే హవా. ఇక గ్రామీణ మార్కెట్లకు విక్రయశాలలు, సర్వీసింగ్ కేంద్రాలను విస్తరించే విషయంలో కంపెనీలు డీలర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. మానవ వనరుల సంఖ్య పెంచేందుకు సాయం చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కోసం వాహనాలను సమకూరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ మెరుగుపడింది. దీంతో వినియోగదార్లకు చేరువ కావడంలో భాగంగా సేల్స్ నెట్వర్క్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మహీంద్రా తెలిపింది. రూరల్ మార్కెట్లలోనూ తమ ఎస్‌యూవీలకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలను ప్రభావితం చేసే సర్పంచ్ల వంటి ముఖ్యులతో కలిసి కంపెనీలు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి. -
కొత్త ఈవీ పాలసీ
న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు.. ► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్‌లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి. ► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది. ► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది. ► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
రెండు కంపెనీలుగా టాటా మోటార్స్
టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. వాణిజ్య వాహనాలు ఒక సంస్థగా, ప్రయాణికుల వాహనాలు మరో కంపెనీగా ఏర్పాటుకానుంది. తద్వారా వృద్ధి అవకాశాలను మరింత బలంగా అందిపుచ్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంటోంది. న్యూఢిల్లీ: ఆటో రంగ లిస్టెడ్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోయేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు టాటా మోటా ర్స్ వెల్లడించింది. వీటి ప్రకారం సంబంధిత పెట్టుబడులతో కలిపి వాణిజ్య వాహన విభాగం ఒక సంస్థగా ఏర్పాటుకానుంది. విలాసవంత కార్ల యూనిట్ జాగ్వార్ ల్యాండ్రోవర్సహా ప్యాసింజర్ వాహనాల(పీవీ) బిజినెస్ మరో కంపెనీగా ఆవిర్భవించనుంది. దీనిలో సంబంధిత పెట్టుబడులతోపాటు ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విభాగంసైతం కలసి ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు టాటా మోటార్స్ తెలియజేసింది. ఎన్సీఎల్టీ నిబంధనలకు అనుగుణంగా విడదీతను చేపట్టనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ వాటాదారులు 2 లిస్టెడ్ సంస్థలలోనూ యథాతథంగా వాటాలను పొందుతారని స్పష్టం చేసింది. టర్న్ అరౌండ్ గత కొన్నేళ్లలో కంపెనీ బలమైన టర్న్‌అరౌండ్‌ను సాధించింది. మూడు ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్లూ స్వతంత్ర నిర్వహణలో కొనసాగుతూ నిలకడైన పనితీరును చూపుతున్నాయి. తాజా విడదీతతో మార్కెట్ కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోనున్నాయ్. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా మోటార్స్ 12–15 నెలలు కంపెనీ విడదీతతో కస్టమర్లకు సేవలు విస్తృతమవుతాయని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని, వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. విడదీత ప్రణాళికకు రానున్న నెలల్లో బోర్డుసహా.. వాటాదారులు, రుణదాతలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందనున్నట్లు తెలియజేశారు. విడదీత పూర్తికి 12–15 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు. కంపెనీ విడదీత ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్నీ చూపబోదని స్పష్టం చేశారు. కాగా.. వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల మధ్య పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు 88 అనుబంధ సంస్థలు, మూడు సంయుక్త కంపెనీలు, రెండు సంయుక్త కార్యకలాపాలు తదితరాలతో విస్తరించాయి. తాజా వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు రూ. 996 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టం. చివరికి నామమాత్ర నష్టంతో రూ. 987 వద్ద ముగిసింది. -
ఫిబ్రవరిలోనూ ‘రయ్ రయ్’
ముంబై: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు ఆదరణ పెరగడంతో ఫిబ్రవరిలోనూ రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. మొత్తం 3.73 లక్షల ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు జరిగాయి. తద్వారా పరిశ్రమ చరిత్రలో అత్యధిక పీవీలు అమ్ముడైన మూడో నెలగా ఫిబ్రవరి ఆవిర్భవించింది. ద్విచక్ర వాహనాలకూ డిమాండ్ కొనసాగింది. కాగా ట్రాక్టర్స్ అమ్మకాల వృద్ధిలో క్షీణత జరిగింది. -
వడ్డీ రేట్ల పెంపుతో వాహన విక్రయాలపై ప్రభావం
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలతో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును మార్చినప్పుడు గృహ రుణాల్లో సత్వరం అది ప్రతిఫలిస్తుందని, కానీ ఆటో లోన్స్ విషయంలో కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెంచితే 130 పాయింట్లు మాత్రమే రిటైల్ ఆటో రుణాల వడ్డీ రేట్ల విషయంలో ప్రతిఫలించిందని మరో 120 బేసిస్ పాయింట్ల బదిలీ జరగాల్సి ఉందని శ్రీవాస్తవ వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) గానీ తగ్గించకపోతే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అధిక వడ్డీ రేట్లతో పాటు పేరుకుపోయిన డిమాండ్ తగ్గిపోవడం, తయారీ సంస్థలు చేపట్టిన స్టాక్ కరెక్షన్ వంటి అంశాల వల్ల కూడా పీవీల అమ్మకాల వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు. అమ్మకాల వృద్ధిపరంగా 2021లో అత్యధిక బేస్ నమోదు చేసిందని, ప్రతి సంవత్సరం దానికి మించి విక్రయాలు సాధించడం కష్టసాధ్యమవుతుందని శ్రీవాస్తవ చెప్పారు. 2021లో ఏకంగా 27 శాతంగా నమోదైన వృద్ధి క్రమంగా 2023లో 8.3 శాతానికి దిగి వచి్చందని, వచ్చే ఏడాది సింగిల్ డిజిట్ స్థాయికే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు. -
పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్.. క్షీణించిన ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 జూలై–సెప్టెంబర్‌లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ 10,74,189 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 4.7 శాతం అధికం. భారత్‌లో ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఇందుకు కారణం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (ఏప్రిల్–సెప్టెంబర్) దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ టోకు విక్రయాలు 20 లక్షల మార్కును దాటడం కూడా ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే పీవీ హోల్‌సేల్స్ 19,36,804 యూనిట్ల నుంచి ఈ ఏడాది 20,70,163 యూనిట్లకు దూసుకెళ్లాయి. ద్విచక్ర వాహనాలు మినహా.. 2023–24 రెండవ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాలు, త్రీ–వీలర్లు, వాణిజ్య వాహనాల విభాగాలు వృద్ధిని సాధించాయి. ద్విచక్ర వాహనాల టోకు అమ్మకాలు స్వల్పంగా తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. 2023 జూలై–సెప్టెంబర్‌లో డీలర్లకు చేరిన మొత్తం ద్విచక్ర వాహనాలు 46,73,931 యూనిట్ల నుంచి 45,98,442 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాల హోల్‌సేల్ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 2,31,991 యూనిట్ల నుంచి 2,47,929 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహనాలు 1,20,319 నుంచి 1,95,215 యూనిట్లకు చేరాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 60,52,739 యూనిట్ల నుండి 61,16,091 యూనిట్లకు ఎగశాయి. పండుగ సీజన్లోకి ప్రవేశించడంతో అన్ని వాహన విభాగాలు ఆశాజనకంగా ఉన్నాయి. మూడవ త్రైమాసికంలో కూడా మెరుగ్గా ఉంటుందని సియామ్ అంచనా వేస్తోంది. ఎంట్రీ లెవెల్ బేజారు.. యుటిలిటీ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ కారణంగా పీవీ విభాగంలో అమ్మకాల వృద్ధికి ఆజ్యం పోసింది. మొత్తం అమ్మకాలలో యుటిలిటీ, ఎస్యూవీ విభాగం 60 శాతం వాటాను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. 2018–19 జూలై–సెప్టెంబర్‌లో నమోదైన 1.38 లక్షల యూనిట్ల గరిష్ట స్థాయితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎంట్రీ లెవల్ కార్ల హోల్‌సేల్స్ 35,000 యూనిట్లకు పడిపోయాయి. ఎంట్రీ లెవల్ టూ వీలర్ సెగ్మెంట్లోనూ ఇదే ట్రెండ్ ఉంది. గ్రామీణ డిమాండ్ ఇంకా పూర్తిగా పుంజుకోకపోవడం ఇందుకు కారణం. కాగా, సెప్టెంబర్ నెలలో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ గతేడాదితో పోలిస్తే 3,55,043 నుంచి 2 శాతం పెరిగి 3,61,717 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 17,35,199 నుంచి 17,49,794 యూనిట్లకు, త్రీవీలర్లు 50,626 నుంచి 74,418 యూనిట్లను తాకాయి. అన్ని విభాగాల్లో కలిపి సెప్టెంబర్‌లో హోల్‌సేల్ అమ్మకాలు 20,93,286 నుంచి 21,41,208 యూనిట్లకు పెరిగాయి. క్షీణించిన ఎగుమతులు భారత్ నుంచి వాహన ఎగుమతులు ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 22,11,457 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం తగ్గుదల. వివిధ దేశాలలో భౌగోళిక రాజకీయ, ద్రవ్య సంక్షోభాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం అర్థ భాగంలో ఎగుమతులు క్షీణించాయని వాహన పరిశ్రమల సంఘం సియామ్ సోమవారం తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్స్ ఎగుమతులు 5 శాతం వృద్ధితో 3,36,754 యూనిట్లకు పెరిగాయి. టూ వీలర్లు 20 శాతం తగ్గి 16,85,907 యూనిట్లు, త్రీవీలర్లు 2,12,126 నుంచి 1,55,154 యూనిట్లకు, వాణిజ్య వాహనాలు 25 శాతం పడిపోయి 31,864 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్రధానంగా రెండు కారణాల వల్ల ఎగుమతులు ఒత్తిడికి గురవుతున్నాయని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. మొదటిది కొన్ని ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ సమస్యలు, రెండవది పలు భౌగోళిక ప్రాంతాలలో ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి ఉందని చెప్పారు. రూపాయి పరంగా వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో సహా చాలా పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎగుమతులు మున్ముందు మెరుగుపడతాయని. భావిస్తున్నామని ఆయన వివరించారు. -
కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి కాదు: గడ్కరీ
న్యూఢిల్లీ: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధనపై కేంద్ర ఉపరితల రవాణా, జాతీయరహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టతనిచ్చారు. ఈ నిబంధనను తప్పనిసరి చేసే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని ఆటోమొబైల్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎయిట్ సీటర్ వాహనాల్లో తయారీ సంస్థలు తప్పనిసరిగా ఆరు ఎయిర్‌బ్యాగులు ఏర్పాటు చేసే నిబంధనను 2022 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని భావించింది. అయితే, అంతర్జాతీయంగా సరఫరాపరమైన సమస్యలు నెలకొన్న నేపథ్యంలో దానిని 2023 అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
మార్కెట్లో పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 3,59,228 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9% వృద్ధి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన త్రిచక్ర వాహనాల సంఖ్య 2022 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో 38,369 నుంచి 64,763 యూనిట్లకు ఎగశాయి. టూ–వీలర్లు 15,57,429 నుంచి 15,66,594 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వాహన విభాగంలో 16% వృద్ధితో మారుతీ సుజుకీ 1,56,114 యూనిట్ల విక్రయాలను సాధించింది. హుందాయ్ అమ్మకాలు 49,510 నుంచి 53,830 యూనిట్లకు చేరాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) ప్రకారం గత నెల రిటైల్‌లో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 7 శాతం దూసుకెళ్లి 3,15,153 యూనిట్లు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాల సేల్స్ 11,80,230 నుంచి 12,54,444 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 66% ఎగసి 99,907 యూనిట్లుగా ఉన్నాయి. -
పీవీ విక్రయాలు స్వల్పంగా పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.2 శాతం పెరిగాయి. ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఈ పెరుగుదలకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. కస్టమర్లు ఎస్‌యూవీలకు మళ్లడంతో హ్యాచ్బ్యాక్స్ విక్రయాలు తగ్గాయని వెల్లడించింది. 2023 జనవరి–జూన్‌లో పీవీల అమ్మకాలు తొలిసారిగా అత్యధికంగా 20 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్íÙప్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 1.7 శాతం అధికమై 13.30 లక్షల యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 53,019 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల పరంగా ఎటువంటి ఆందోళన లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం కలిసి వచ్చే అంశం అని అన్నారు. రానున్న రోజుల్లో పీవీ విభాగం సానుకూలంగా ఉంటుందని చెప్పారు. -
2030 నాటికి 50 శాతం ఈవీలు
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2030 నాటికి ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాల్లో 50 శాతం వాటా ఈవీల నుంచే ఉంటుందని అంచనా వేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. 2040 నాటికి ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకు రావాలన్నది సంస్థ లక్ష్యం. అయిదేళ్లలో ఈవీల వాటా ప్యాసింజర్ కార్స్ విక్రయాల్లో 25 శాతానికి చేరుతుంది. (ఆధార్-ఫ్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) ప్రస్తుతం సంస్థ నెక్సన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, ఎక్స్‌ప్రెస్–టి ఈవీలను విక్రయిస్తోంది. 2022-23లో టాటా మోటార్స్ 5,40,965 యూనిట్ల ప్యాసింజర్ కార్ల అమ్మకాలను సాధించింది. ఇందులో 50,043 యూనిట్ల ఈవీలు ఉన్నాయి. 2022– 23లో అడుగుపెట్టిన టియాగో ఈవీ తమ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విక్రయాల జోరు పెంచిందని తెలిపింది. తొలి రోజే సుమారు 10,000 బుకింగ్స్‌ను నమోదు చేసిందని వివరించింది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) హ్యారియర్ ఈవీ, సియర్రా ఈవీ, అవిన్యా కాన్సెప్ట్ మోడళ్లను కంపెనీ ఇప్పటికే ఆవిష్కరించింది. ఈ మోడళ్లు ఈవీల పట్ల మరింత ఆసక్తిని పెంచుతాయని కంపెనీ భావిస్తోంది. (మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
భారీగా పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్.. గత నెలలో అమ్మకాలు ఇలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 మే నెలలో హోల్‌సేల్‌లో ప్యాసింజర్ వెహికిల్స్ 3,34,247 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 13.54 శాతం అధికమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. టాటా మినహా యుటిలిటీ వెహికిల్స్ 33.5 శాతం పెరిగి 1,55,184 యూనిట్లు నమోదయ్యాయి. టాటా మోటార్స్ మూడు నెలలకోసారి అమ్మకాల వివరాలను వెల్లడిస్తోంది. ద్విచక్ర వాహనాలు 17.42 శాతం అధికమై 14,71,550 యూనిట్లు విక్రయం అయ్యాయి. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఇందులో మోటార్‌సైకిల్స్ 20.63 శాతం పెరిగి 9,89,120 యూనిట్లు, స్కూటర్స్ 12.18 శాతం దూసుకెళ్లి 4,46,593 యూనిట్లకు చేరాయి. త్రీవీలర్లు 28,595 నుంచి 48,732 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లో కలిపి తయారీ కంపెనీల నుంచి డీలర్‌షిప్‌లకు చేరిన వాహనాల సంఖ్య టాటా మోటార్స్ మినహా 15,32,861 నుంచి 18,08,686 యూనిట్లకు చేరింది. 2022 మే నెలతో పోలిస్తే గత నెలలో అన్ని వాహన విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) మరిన్ని ఇంట్రస్టింగ్ కథనాలు, బిజినెస్ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
కార్ల అమ్మకాల వృద్ధి 7 శాతానికి పరిమితం
న్యూఢిల్లీ: డిమాండ్ మందగించిన కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగం విక్రయాల వృద్ధి 5–7 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికల్స్) శైలేష్ చంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కంపెనీపరంగా సీఎన్జీ, ఎలక్ట్రిక్ మోడల్స్‌తో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్న వాహనాలను సరికొత్తగా తీర్చిదిద్దడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. కోవిడ్‌పరమైన పరిణామాలతో డిమాండ్ భారీగా పేరుకుపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో పీవీల అమ్మకాలు 27 శాతం వృద్ధి నమోదు చేశాయి. కానీ ప్రస్తుతం కొన్ని స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు తప్ప మిగతావాటికి డిమాండ్ తగ్గిందని చంద్ర పేర్కొన్నారు. కొత్త ఉద్గార ప్రమాణాలకు మారే క్రమంలో వాహనాల రేట్ల పెరుగుదల కూడా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన చెప్పారు. అయితే, రాబోయే రోజుల్లో వృద్ధి తిరిగి రెండంకెల స్థాయికి చేరగలదని ఆయన వివరించారు. తమ సంస్థ విషయానికొస్తే పంచ్‌లో సీఎన్జీ వేరియంట్‌ను తేబోతున్నామని .. కర్వ్, సియెరా వంటి వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని చంద్ర చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరగబోతున్నాయని పేర్కొన్నారు. టాటా మోటర్స్ ఈ మధ్యే తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో సీఎన్జీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.55 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో డీలర్లకు రికార్డు స్థాయిలో 5.4 లక్షల వాహనాలను సరఫరా చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే హోల్‌సేల్ అమ్మకాలు 45 శాతం పెరిగాయి. -
ఎస్‌యూవీలకే డిమాండ్
న్యూఢిల్లీ: ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్‌తో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో మే నెలలో విక్రయాల జోరు సాగింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ బలమైన హోల్‌సేల్ అమ్మకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, కియా, ఎంజీ మోటార్ ఇండియా వంటి ఇతర తయారీ సంస్థలు సైతం విక్రయాల్లో వృద్ధి సాధించాయి. అగ్రశ్రేణి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగి 1,43,708 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, ఎస్–ప్రెస్సోతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 30 శాతం తగ్గి 12,236 యూనిట్లకు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల విక్రయాలు 5 శాతం పెరిగి 71,419 యూనిట్లకు చేరాయి. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల సేల్స్ 65 శాతం అధికమై 46,243 యూనిట్లకు చేరాయి. గత నెలలో కంపెనీ రెండంకెల అమ్మకాల వృద్ధికి ఎస్‌యూవీలు క్రెటా, వెన్యూ ఆజ్యం పోశాయని హ్యుందాయ్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. టాటా మోటార్స్ అంతర్జాతీయ వ్యాపారంతో సహా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 66% వృద్ధితో 5,805 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 3,505 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది. -
ప్యాసింజర్ వాహనాలు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 ఏప్రిల్‌లో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 3,31,278 యూనిట్లు నమోదైంది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 13 శాతం పెరుగుదల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ‘మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో 1,37,320 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 1,21,995 యూనిట్లు నమోదైంది. హ్యుండై మోటార్ ఇండియా హోల్‌సేల్ విక్రయాలు 44,001 నుంచి 49,701 యూనిట్లకు చేరాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో డీలర్లకు 13,38,588 యూనిట్ల ద్విచక్ర వాహనాలు సరఫరా అయ్యాయి. 2022 ఏప్రిల్‌లో ఈ సంఖ్య 11,62,582 యూనిట్లు. మోటార్‌సైకిళ్లు 7,35,360 నుంచి 8,39,274 యూనిట్లు, స్కూటర్లు 3,88,442 నుంచి 4,64,389 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు రెండింతలై కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువలో 42,885 యూనిట్లకు ఎగశాయి. ‘ఏప్రిల్ 2022తో పోలిస్తే అన్ని వాహన విభాగాలు గత నెలలో వృద్ధిని నమోదు చేశాయి. 2023 ఏప్రిల్ 1 నుండి పరిశ్రమ బీఎస్–6 ఫేజ్–2 ఉద్గార నిబంధనలకు చాలా సాఫీగా మారిందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. పరిశ్రమ క్రమంగా రుతుపవనాల సీజన్లోకి ప్రవేశిస్తున్నందున మంచి వర్షపాతం కూడా ఈ రంగం వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
విదేశాలకు 6.62 లక్షల కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 6,62,891 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. ప్యాసింజర్ కార్లు 10 శాతం వృద్ధితో 4,13,787 యూనిట్లు, యుటిలిటీ వాహనాలు 23 శాతం ఎగసి 2,47,493 యూనిట్లకు చేరుకున్నాయి. వ్యాన్ల ఎగుమతులు 1,853 నుంచి 1,611 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతీ సుజుకీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే ఈ కంపెనీ 8 శాతం అధికంగా 2,55,439 యూనిట్లను విదేశాలకు సరఫరా చేసింది. హ్యుండై మోటార్ ఇండియా నుంచి 18 శాతం ఎక్కువగా 1,53,019 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కియా ఎగుమతులు 50,864 నుంచి 85,756 యూనిట్లకు ఎగశాయి. నిస్సాన్ మోటార్ ఇండియా 60,637 యూనిట్లు, రెనో ఇండియా 34,956, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 27,137, హోండా కార్స్ ఇండియా 22,710, మహీంద్రా అండ్ మహీంద్రా 10,622 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహన ఎగుమతులు 2022–23లో 47,61,487 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం తగ్గుదల. -
టాటా కార్లు మరింత ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కాస్త ప్రియం కానున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ధర సగటున 0.6 శాతం పెరగనుంది. మే 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 2023 ఫిబ్రవరి తర్వాత ధరలు పెంచడం ఇది రెండవసారి. నియంత్రణపర మార్పులు, ముడిసరుకు వ్యయం అధికం కావడం తాజా నిర్ణయానికి దారి తీసిందని టాటా మోటార్స్ తెలిపింది. -
మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు..
టాటా కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. పెరుగుతున్న తయారీ ఖర్చులు, బీఎస్ నిబంధనల మార్పు కారణంగా పెరిగిన ఆర్థిక భారంతో టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2023లో కార్ల ధరలను పెంచడం ఇది రెండోసారి. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) తమ ప్యాసింజర్ వాహనాల ధరల సగటు పెరుగుదల 0.6 శాతం ఉంటుందని టాటా మోటర్స్ పేర్కొంది. పెరిగే ధర కార్ మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ధరల పెంపు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 సంవత్సరంలో టాటా మోటార్స్ ధరలను పెంచడం ఇది రెండవ సారి. అంతకుముందు జనవరిలో ధరలను 1.2 శాతం పెంచింది. బీఎస్ 6 నిబంధనలను అమలు చేయడం వల్ల ఈ నెల ప్రారంభంలో దేశంలోని అన్ని కంపెనీల్లో అన్ని విభాగాలలో వాహనాల ధరలు పెరిగాయి. ఉద్గారాలను పర్యవేక్షించడానికి వాహన తయారీదారులు వాహనాలకు ప్రత్యేక పరికరాన్ని తప్పనిసరిగా అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా తయారీ ఖర్చు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పలుమార్లు ధరలు పెరిగినప్పటికీ భారతదేశంలో అత్యధిక ప్యాసింజర్ కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. పెద్ద కార్లు, ఖరీదైన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు అధిక డిమాండ్ కారణంగా అమ్మకాలు పెరిగాయి. టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్, పంచ్ ఎస్‌యూవీలు 2022లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచాయి. -
2,21,50,222 వాహనాలు రోడ్డెక్కాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో రిటైల్‌లో అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 2,21,50,222 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహనాలు 19 శాతం వృద్ధితో 1,59,95,968 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే పరిమాణం పరంగా ఈ విభాగం ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాణిజ్య వాహనాలు 33 శాతం, త్రిచక్ర వాహనాలు 84 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం ఎగశాయి. అత్యధిక స్థాయిలో.. ప్యాసింజర్ వాహనాలు రికార్డు స్థాయిలో 23 శాతం అధికమై 36,20,039 యూనిట్లు రోడ్డెక్కడం విశేషం. 2021–22లో 29,42,273 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పటి వరకు దేశంలో 2018–19లో నమోదైన 32 లక్షల యూనిట్లే అత్యధికం. సెమీకండక్టర్ లభ్యత కాస్త మెరుగు పడడంతో అనేక కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయడం, వాహనాల లభ్యత కారణంగా ఈ విభాగం ప్రయోజనం పొందింది. హై–ఎండ్ వేరియంట్లకు డిమాండ్ ఉండడం అమ్మకాలను కొనసాగించడంలో సహాయపడింది. అయితే ఎంట్రీ లెవెల్ విభాగంలోని కస్టమర్లు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణంతో ప్రభావితం అవుతున్నందున ఈ సెగ్మెంట్ ఒత్తిడిలో ఉందని ఫెడరేషన్ తెలిపింది. వృద్ధి సింగిల్ డిజిట్లో.. ఇప్పుడు అధిక–వృద్ధి కాలం గడిచినందున అధిక బేస్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాధారణ ధరల పెంపుదల, ప్రభుత్వ నియంత్రణ పరంగా మార్పుల కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 9 శాతం లోపే వృద్ధిరేటును చూసే అవకాశం ఉందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ఏడాది కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంపై కోవిడ్–19 మహమ్మారి 2020–21, 2021–22లో తీవ్ర ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రభావం లేదు. -
ఏటీఎస్‌లలో ఫిట్నెస్ పరీక్షల గడువు పెంపు
న్యూఢిల్లీ: భారీ సరుకు వాహనాలు, ప్రయాణికుల కోసం ఉపయోగించే భారీ వాహనాలకు నమోదిత ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ద్వారా తప్పనిసరి ఫిట్నెస్ పరీక్ష తేదీని ప్రభుత్వం 18 నెలల పాటు పొడిగించింది. ఈ నిబంధన 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుందని రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ మినిస్ట్రీ వెల్లడించింది. వాస్తవానికి ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. మధ్యస్థాయి, తేలికపాటి సరుకు రవాణా వాహనాలు, మధ్యస్థాయి ప్యాసింజర్ వెహికిల్స్‌కు 2024 జూన్ 1 నుంచి తప్పనిసరి చేయాలని గతంలో నిర్ణయించారు. తాజా ప్రకటన ప్రకారం ఈ వాహనాలకు అన్నిటికీ సామర్థ్య పరీక్షలు 2024 అక్టోబర్ 1 నుంచి ఏటీఎస్ ద్వారా తప్పనిసరిగా జరపాల్సి ఉంటుంది. రవాణాయేతర వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో (వాహనం కొన్న 15 ఏళ్లకు) ఫిట్నెస్ పరీక్షలు చేపడతారు. -
టాటా ప్యాసింజర్ వాహనాలు @ 50 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో కొత్త మైలురాయిని అధిగమించింది. మొత్తం 50 లక్షల యూనిట్ల విక్రయాలతో రికార్డు సాధించింది. 10 లక్షల యూనిట్ల మార్కును కంపెనీ 2004లో చేరుకుంది. ఆ తర్వాత ఆరేళ్లలోనే 20 లక్షల యూనిట్ల స్థాయిని తాకింది. 2015లో 30 లక్షల యూనిట్లు, 2020లో 40 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2020 తర్వాత అతి తక్కువ కాలంలోనే 50 లక్షల మార్కును చేరుకోవడం విశేషం. కోవిడ్–19, సెమికండక్టర్ల కొరత ఉన్నప్పటికీ నూతన రికార్డును అందుకున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రతి మైలురాయి వెనుక ఒడిదుడుకుల ప్రయాణం ఉందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర వ్యాఖ్యానించారు. -
ఫిబ్రవరిలో 3.35 లక్షల వాహన అమ్మకాలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత రవాణాకు బలమైన డిమాండ్ కొనసాగడంతో ఫిబ్రవరిలో 3.35 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆటో మొబైల్ రంగంలో ఇప్పటి వరకు ఫిబ్రవరిలో నమోదైన అత్యధిక టోకు అమ్మకాలు రికార్డు ఇవే కావడం విశేషం. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ ఎంఅండ్ఎం, కియా మోటార్స్, టయోటో కిర్లోస్కర్ కంపెనీలు చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు పెరిగాయి. బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) టీవీఎస్ మోటార్ అమ్మకాలు నిరాశపరిచాయి. వాణిజ్య వాహనాలకు గిరాకీ లభించింది. -
టాటా కార్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన దిగ్గజం టాటా మోటార్స్ కంబషన్ ఇంజిన్ ఆధారిత మోడళ్ల ధరలను 1.2% మేర పెంచుతోంది. ఫిబ్రవరి 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాల మార్పు లు, ముడిసరుకు వ్యయాలు పెరగడంతో ధరలను సవరిస్తున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. -
రోడ్డెక్కిన 2,11,20,441 వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2,11,20,441 యూనిట్లు. భారత రోడ్లపైకి 2022 సంవత్సరంలో కొత్తగా దూసుకొచ్చిన వాహనాల సంఖ్య ఇది. 2021లో అమ్ముడైన 1,83,21,760 యూనిట్లతో పోలిస్తే ఇది 15.28 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 17 శాతం అధికం. కోవిడ్ ముందస్తు సంవత్సరం 2019తో పోలిస్తే 10 శాతం తగ్గుదల నమోదైంది. ఇక 2022లో ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం కొత్త శిఖరాలను తాకిందని ఎఫ్ఏడీఏ వివరించింది. ఆశించిన స్థాయిలో వృద్ధి లేదు.. ‘అక్టోబర్, నవంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదైనప్పటికీ డిసెంబర్లో తగ్గుముఖం పట్టడంతో ద్విచక్ర వాహన విభాగం మరోసారి ఆకట్టుకోవడంలో విఫలమైంది. ద్రవ్యోల్బణం, యాజమాన్య ఖర్చు అధికం కావడం, గ్రామీణ మార్కెట్ ఇంకా పూర్తిగా పుంజుకోకపోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు పెరగడం వంటి కారణాలతో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కలిగిన ద్విచక్ర వాహన విభాగంలో ఇంకా ఆశించిన స్థాయిలో వృద్ధి కనిపించలేదు’ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈవీలు మూడంకెల వృద్ధి.. గతేడాది దేశవ్యాప్తంగా రిటైల్‌లో ద్విచక్ర వాహనాలు 1,53,88,062 యూనిట్లు విక్రయం అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.37 శాతం వృద్ధి నమోదైంది. ప్యాసింజర్ వెహికిల్స్ 16.35 శాతం అధికమై 34,31,497 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం అమ్మకాల్లో దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కోవిడ్ కారణంగా తిరోగమనం చెందిన త్రిచక్ర వాహన విభాగం రికవరీ అయింది. 2019తో పోలిస్తే అంతరం తగ్గింది. 2021తో పోలిస్తే త్రీ–వీలర్లు విక్రయాలు 71.47 శాతం ఎగసి 6,40,559 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన అమ్మకాలు మూడంకెల వృద్ధి సాధించాయి. దీంతో ఈ విభాగంలో ఈవీల వాటా 50 శాతం మించింది. ట్రాక్టర్లు.. జీవిత కాల రికార్డు.. ట్రాక్టర్ల విక్రయాలు వరుసగా మూడేళ్లను మించి 2022లో 7.94 లక్షల యూనిట్లతో జీవిత కాల రికార్డు నమోదు చేశాయి. మెరుగైన రుతుపవణాలు, రైతుల వద్ద నగదు లభ్యత, వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర, ప్రభుత్వం పెద్ద ఎత్తున పంటల కొనుగోళ్లు ఇందుకు కారణం. వాణిజ్య వాహనాలు 6,55,696 నుంచి 31.97 శాతం దూసుకెళ్లి 8,65,344 యూనిట్లకు ఎగశాయి. కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్ మొత్తం 2022లో వృద్ధి చెందుతూనే ఉంది. 2019 స్థాయిలో అమ్మకాలు ఉన్నాయి. తేలికపాటి వాణిజ్య వాహనాలు (ఎల్సీవీ), భారీ వాణిజ్య వాహనాలు (హెచ్‌సీవీ), బస్‌లు, నిర్మాణ రంగ యంత్రాల్లో డిమాండ్‌కు తోడు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ విభాగాన్ని వృద్ధి బాటలో కొనసాగించాయి. ప్రత్యేక స్కీమ్‌లు ప్రకటించాలి.. ‘వాహన తయారీ సంస్థలు డిసెంబరులో సాధారణ ధరలను పెంచాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ ధరలను సవరించాయి. ఇది కాకుండా బీఎస్–6 రెండవ దశ నిబంధనలు వస్తున్నాయి. దీని ప్రభావంతో అన్ని వాహన విభాగాల్లో ధరల పెంపుదల ఉంటుంది. దీనిని ఎదుర్కోవడానికి తయారీ కంపెనీలు ప్రత్యేక పథకాలను ప్రకటించాలి. తద్వారా రిటైల్ అమ్మ కాలు ఊపందుకుంటాయి’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. -
మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని భావిస్తోంది. ముడి సరుకు వ్యయాలు భారం కావడంతోపాటు 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: vivo Y02: ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే! బ్యాటరీ ధరలూ ప్రియం అవుతున్నాయని, వీటి భారం కస్టమర్లపై ఇంకా వేయలేదని కంపెనీ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర వెల్లడించారు. బ్యాటరీ ధరలు, నూతన నిబంధనలు ఎలక్ట్రిక్ వాహన విభాగంపై ప్రభా వం చూపుతున్నాయని చెప్పారు. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరికరం ఏర్పాటు చేయాలన్న నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. పరిమిత స్థాయి మించి కాలుష్యం వెదజల్లితే ఈ పరికరం హెచ్చరిస్తుంది. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
ఆటో రంగంలో రూ.65,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్యాసింజర్ వాహన రంగంలో 2024–25 నాటికి భారీ పెట్టుబడులు రానున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం తెలిపింది. అధికం అవుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధితో సహా కొత్త ఉత్పత్తుల రూపకల్పనకై తయారీ కంపెనీలు సుమారు రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని వెల్లడించింది. ‘ఇప్పటికే కొన్ని సంస్థలు రూ.25,000 కోట్ల విలువైన విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. 2022 ప్రారంభం నుండి ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఆరోగ్యంగా ఉంది. బలమైన అంతర్లీన డిమాండ్‌కుతోడు సెమీకండక్టర్ కొరత సమస్య తగ్గుముఖం పట్టడం ఇందుకు సహాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికిల్ పరిశ్రమ హోల్‌సేల్ పరిమాణం 21–24 శాతం వృద్ధితో 37–38 లక్షల యూనిట్లను తాకవచ్చు. సరఫరా వ్యవస్థ మెరుగుపడడంతో వాహన కంపెనీల సామర్థ్య వినియోగం గత కొన్ని త్రైమాసికాలుగా పటిష్ట స్థాయికి చేరింది. బలమైన డిమాండ్ సెంటిమెంట్ కొనసాగుతుండడంతో కంపెనీలు ఇప్పుడు తమ సామర్థ్య విస్తరణ ప్రణాళికలను పునరుద్ధరించాయి. కొత్త సామర్థ్యాలను జోడించడం వల్ల రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్లాంట్ల వినియోగ స్థాయిలు స్వల్పంగా తగ్గుతాయి. పటిష్ట డిమాండ్‌తో వినియోగం దాదాపు 70 శాతం వద్ద సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే అవకాశం ఉంది’ అని ఇక్రా వెల్లడించింది. -
పండుగ జోష్: టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు
ముంబై: పండుగ సీజన్ కలిసిరావడంతో అక్టోబర్‌లో ఆటో అమ్మకాలు పెరిగాయి. ఎస్యూవీ, మిడ్ సిగ్మెంట్, ఎంట్రీ లెవల్ కార్లకు భారీగా డిమాండ్ పెరగడంతో పాసింజర్ వాహన విక్రయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా-మహీంద్రా, కియా మోటార్స్, హోండా కార్స్ ఇండియా చెప్పుకొదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. అయితే ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్ విక్రయాలు నిరాశపరిచాయి. ♦ మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విక్రయాలు అక్టోబర్‌లో 1,67,520కు చేరాయి. గతేడాది అక్టోబర్ అమ్మకాలు 1,38,335తో పోలిస్తే 21 శాతం పెరిగాయి. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 43,556 నుంచి 33% వృద్ధితో 58,006 యూనిట్లకు చేరాయి. ♦ టాటా మోటార్స్ అమ్మకాలు 15 శాతం వృద్దిని సాధించి 78,335 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే ఆగస్టులో 67,829 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
చిన్న కార్ల అమ్మకాలు పెరుగుతాయి..
న్యూఢిల్లీ: మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా తగ్గుతున్నప్పటికీ .. పరిమాణంపరంగా చూస్తే మాత్రం విక్రయాలు పెరుగుతాయని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో చిన్న కార్ల వాటా 45–46 శాతం వరకూ ఉండేదని, గతేడాది 38 శాతానికి పడిపోయిందని వివరించారు. ఎస్‌యూవీలు 40 శాతం వాటాను దక్కించుకున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. అయితే సంఖ్యాపరంగా చూస్తే చిన్న కార్ల విభాగం ఇప్పటికీ భారీ స్థాయిలోనే ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 30.7 లక్షల కార్లు అమ్ముడు కాగా వాటిలో దాదాపు 40 శాతం వాటా హ్యాచ్బ్యాక్లదేనని (దాదాపు 12 లక్షలు), మరో 12.3 లక్షల ఎస్‌యూవీలు (సుమారు 40 శాతం) అమ్ముడయ్యాయని శ్రీవాస్తవ వివరించారు. ఆ రకంగా చుస్తే పరిమాణంపరంగా రెండింటికీ మధ్య భారీ వ్యత్యాసమేమీ లేదని పేర్కొన్నారు. యువ జనాభా, కొత్తగా ఉద్యోగంలోకి చేరే యువత తొలిసారిగా కొనుగోలు చేసేందుకు చిన్న కార్లనే ఎంచుకునే అవకాశాలు ఉండటం ఈ విభాగానికి దన్నుగా ఉండగలదని ఆశిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. అయితే, ఈ విభాగం కొనుగోలుదారులు ఎక్కువగా అందుబాటు ధరకు ప్రాధాన్యమిస్తారని, అదే అంశం చిన్న కార్లకు కొంత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కొత్త ప్రమాణాలను పాటించాల్సి వస్తుండటం, కమోడిటీ ధరలు పెరుగుతుండటం, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాల్సి వస్తుండటం తదితర అంశాల కారణంగా.. చిన్న కార్లు అందుబాటు రేటులో లభించడం తగ్గుతోందని ఆయన వివరించారు. ‘గత రెండు మూడేళ్లలో ఆదాయం కన్నా ఎక్కువగా వాహనాల ధరలు పెరిగిపోయాయి. దీంతో అందుబాటులో లభ్యతనేది తగ్గిపోయింది. అందుకే ఎస్‌యూవీలతో పోలిస్తే ఈ విభాగం వాటా తగ్గిందని భావిస్తున్నాం‘ అని శ్రీవాస్తవ వివరించారు. చదవండి: బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు! -
ప్యాసింజర్ వెహికిల్స్ దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, సెమికండక్టర్ల సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం భారత వాహన పరిశ్రమకు కలిసి వచ్చింది. ప్యాసింజర్ వెహికిల్స్ తయారీ, విక్రయాలు వేగం పుంజుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఆగస్ట్‌లో కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు నమోదైంది. ఎస్‌యూవీల జోరుతో టాప్–7 కంపెనీల మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఏకంగా 30.2 శాతం వృద్ధితో 3,05,744 యూనిట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక వృద్ధి. ఆగస్ట్ నుంచి పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. జోరు మొదలైందని.. రాబోయే నెలల్లో ఇది కొనసాగుతుందని వాహన పరిశ్రమ ధీమాగా ఉంది. ఏడాది పొడవునా జరిగే మొత్తం విక్రయాల్లో పండుగల సీజన్ వాటా ఏకంగా 40 శాతం దాకా ఉంటోంది. 2018–19ని మించిన విక్రయాలు.. దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 30,69,499 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2018–19లో అత్యధికంగా 33,77,389 యూనిట్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2018–19ని మించిన విక్రయాలు నమోదు కానున్నాయని భారత్‌లో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చెబుతోంది. 37 లక్షల యూనిట్లతో పరిశ్రమ నూతన రికార్డు సాధిస్తుందన్న అంచనా ఉందని మారుతీ సుజుకీ సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని అన్నారు. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో మారుతీ సుజుకీ 30 శాతం, హ్యుండై 5.6, టాటా మోటార్స్ 68.3, మహీంద్రా అండ్ మహీంద్రా 87, కియా ఇండియా 33.3, టయోటా కిర్లోస్కర్ 17.12 శాతం వృద్ధి సాధించాయి. హోండా కార్స్ 30.5 శాతం తిరోగమన వృద్ధి చవిచూసింది. ద్విచక్ర వాహనాలు ఇలా.. : అంత క్రితం ఏడాది ఇదే కాలం, అలాగే ఈ ఏడాది జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో అన్ని ద్విచక్ర వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగవడం డిమాండ్‌కు తగ్గట్టుగా కస్టమర్లకు వాహనాలను అందించేందుకు వీలైందని కంపెనీలు అంటున్నాయి. జీడీపీ వృద్ధి, రెండేళ్ల తర్వాత సాధారణ పండుగల సీజన్, మెరుగైన రుతుపవనాలతో అధిక దిగుబడి, కస్టమర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడం.. వెరిశి రాబోయే నెలల్లో టూ వీలర్ల అమ్మకాలు మరింత జోరుగా ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో హీరో మోటోకార్ప్ 4.6 శాతం, హోండా 5.1, టీవీఎస్ 56.2, బజాజ్ 42.2, సుజుకీ 6.2, రాయల్ ఎన్ఫీల్డ్ 33.8 శాతం అధికంగా విక్రయాలను సాధించాయి. -
భద్రతా లోపాలతో 13 లక్షల వాహనాలు వెనక్కి
న్యూఢిల్లీ: భద్రతా పరమైన లోపాల కారణంగా 13 లక్షల ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లను గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) కంపెనీలు వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభకు తెలిపారు. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం.. 8,64,557 ద్విచక్ర వాహనాలు, 4,67,311 ప్యాసింజర్ కార్లు వెనక్కి పిలిచిన వాటిల్లో ఉన్నట్టు చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 1,60,025 ద్విచక్ర వాహనాలు, 25,142 ప్యాసింజర్ కార్లను వెనక్కి తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. తయారీ అనంతరం లోపాలు బయటపడినప్పుడు ఆయా బ్యాచ్‌ల వారీగా మొత్తం వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు వెనక్కి పిలిపించి, అన్నింటినీ సరిచేసిన తర్వాత అప్పగిస్తుంటాయి. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇలా మొత్తం 3.39 లక్షల వాహనాలు, 2019–20లో 2.14 లక్షల వాహనాలను కంపెనీలు వెనక్కి పిలిపించుకున్నాయి. ‘‘ఓ మోటారు వాహనంలో లోపం వల్ల పర్యావరణానికి లేదా నడిపే వారికి లేదా ఆ వాహనంలో ప్రయాణించే వారికి, లేదంటే రహదారులను వినియోగించుకునే ఇతరులకు ప్రమాదం అని భావిస్తే.. వాటిని వెనక్కి తీసుకోవాలని కంపెనీలను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంది’’అని మంత్రి చెప్పారు. -
వాహన విక్రయాల జోష్
ముంబై: సెమీకండక్టర్ల కొరత ప్రభావం తగ్గుముఖం పట్టడంతో దేశీయ వాహన విక్రయాలు జూన్‌లో వృద్ధి బాటపట్టాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మారుతీ సుజుకీతో సహా హ్యుందాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, ఎంజీ మోటార్స్ కంపెనీలు సమీక్షించిన నెలలో సానుకూల అమ్మకాలను సాధించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా వాణిజ్య వాహన విక్రయా ల్లో వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఊపందుకోవడంతో బజాజ్ ఆటో మినహా మిగిలిన అన్ని ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. -
ఏటీఎస్‌లలోనే వాహనాల ఫిట్ నెస్ పరీక్షలు
న్యూఢిల్లీ: వాహనాల ఫిట్నెస్ పరీక్షలను ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్‌లోనే (ఏటీఎస్) నిర్వహించడం తప్పనిసరి కానుంది. దశల వారీగా 2023 ఏప్రిల్ నుంచి ఈ నిబంధన అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. సరుకు రవాణా, ప్యాసింజర్ విభాగంలో భారీ వాహనాలకు 2023 ఏప్రిల్ 1, మధ్యస్థాయి, తేలికపాటి వాహనాలకు 2024 జూన్ 1 నుంచి ఇది తప్పనిసరి కానుంది. ఈ మేరకు ప్రజల అభిప్రాయాల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వ్యక్తిగత వాహనాలకు సైతం రానున్న రోజుల్లో ఈ నిబంధన అమలు చేస్తారు. -
టాటా మోటార్స్: వాహనాల ధరల పెంపు
పండుగ సందడి ముగిసిన వెంటనే.. స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వాహనదారులకు షాకిచ్చింది. ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరల అమలు జనవరి 19 (బుధవారం నుంచి) వర్తిస్తుందని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాహనాలపై సగటున 0.9 శాతం పెంపుదల బుధవారం నుంచి వర్తిస్తుందని పేర్కొంది. వేరియెంట్, మోడల్‌ను బట్టి ధరల నిర్ధారణ ఉంటుందని తెలిపింది. జనవరి 18(ఇవాళ), అంతకంటే ముందు బుక్ చేసుకున్న కార్ల ధరలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కంపెనీ స్పష్టం చేసింది. ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతోందని, ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో కస్టమర్ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి.. ప్రత్యేకించి కొన్ని వేరియెంట్ల మీద పది వేల రూ. దాకా తగ్గింపు కొనసాగుతుందని ప్రకటించి ఊరట ఇచ్చింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఆటోమేకర్.. టియాగో, పంచ్, హర్రియర్ లాంటి మోడల్స్‌తో దేశీయ మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే కిందటి నెలలోనే కమర్షియల్ వాహనాలపై రేట్లు పెంచిన టాటా మోటార్స్.. జనవరి 1 నుంచి ప్యాసింజర్ వెహికల్స్ పైనా రేట్లు పెంచింది. ఇప్పుడు పదిహేను రోజుల వ్యవధి తర్వాత మళ్లీ ప్రకటన చేసింది. రీసెంట్గా మరో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఏకంగా 4.3 శాతం దాకా వాహన ధరలు పెంచిన విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో.. వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని ఆటోమొబైల్ కంపెనీలు ప్రకటించుకుంటున్నాయి. చదవండి: వారెవ్వా టాటా ! ‘డార్క్’ దద్దరిల్లిపోతుందిగా !! -
ఐడీ కార్డులు చూపించాలంటూ టీడీపీ మాజీ మంత్రి దాదాగిరి
సాక్షి, చిత్తూరు: రామకుప్పం మండలంలో టీడీపీ నాయకులు బరితెగించారు. కుప్పంలో సోమవారం మున్సిపల్ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ఓటర్లను బెదిరిస్తూ ప్రలోభపెడుతున్నారు. సల్దిగానిపల్లె వద్ద వాహనాలను ఆపి ప్రయాణికుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారందరినీ ఐడీ కార్డులు చూపించాలంటూ దాదాగిరి చేశారు. రోడ్డుపై బైఠాయించి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. వీరిని అడ్డుకున్న పోలీసులపై కూడా ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చదవండి: (కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు) -
జీప్ స్పీడ్‌కు ఫియట్ క్రిస్లర్ సై
న్యూఢిల్లీ, సాక్షి: దేశీయంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పట్టు సాధించేందుకు 25 కోట్ల డాలర్లను(సుమారు రూ. 1,850 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్లోబల్ ఆటో దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా రానున్న రెండేళ్లలో నాలుగు కొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను(ఎస్‌యూవీలు) ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. పెట్టుబడులను స్థానిక తయారీ కోసం వెచ్చించనున్నట్లు తెలియజేసింది. తద్వారా ఎస్‌యూవీలలో మధ్యస్థాయి, మూడు వరుసల వాహనాలను రూపొందించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు జీప్ ర్యాంగ్యులర్, జీప్ చెరొకీ వాహనాల అసెంబ్లింగ్‌ను చేపట్టనున్నట్లు వివరించింది. ఈ బాటలో జీప్ కంపాస్ ఎస్యూవీ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. (కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ల సందడి) 1 శాతమే ప్రస్తుతం దేశీ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్సీఏ) వాటా 1 శాతానికంటే తక్కువగానే ఉన్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. పోర్ట్‌ఫోలియోలో కొత్త వాహనాలను జత చేసుకోవడం ద్వారా వాటాను పెంచుకునే ప్రణాళికల్లో కంపెనీ ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా స్థానికంగా విడిభాగాలను సమకూర్చుకోవడం ద్వారా ఆర్థికంగానూ పటిష్టపడే యోచనలో ఉన్నట్లు వివరించారు. వెరసి వ్యయాలు తగ్గించుకుంటూ అమ్మకాలు పెంచుకునే బాటలో కంపెనీ సాగనున్నట్లు తెలియజేశారు. 25 కోట్ల డాలర్ల కొత్త పెట్టుబడుల కారణంగా పలు విభాగాలలో బలాన్ని పెంచుకోనున్నట్లు ఎఫ్సీఏ ఇండియా ఎండీ పార్ధ దత్తా చెప్పారు. తమ వాహనాలకు విడిభాగాలను స్థానికంగానే సమకూర్చుకునేందుకు సంసిద్ధమై ఉన్నట్లు వెల్లడించారు. (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) టాప్ గేర్‌లో నిజానికి కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆటో రంగ దిగ్గజాలు పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నట్లు పరిశ్రమ విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ 2019 నుంచీ ఆటో రంగం నెమ్మదించినట్లు ప్రస్తావించారు. దీంతో జపనీస్ దిగ్గజం హోండా మోటార్ రెండు ప్లాంట్లలో ఒకదానిని మూసివేసేందుకు నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇదేవిధంగా 2017లోనే దేశీయంగా కార్ల విక్రయాలను నిలిపివేసిన జనరల్ మోటార్స్ ఎగుమతుల కోసం చేపడుతున్న కార్ల ఉత్పత్తికి సైతం మంగళం పాడుతున్నట్లు గత నెలలో వెల్లడించింది. అయితే మరోవైపు గత రెండేళ్లలో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటార్స్, చైనా దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ కార్ప్ దేశీ మార్కెట్లలో ప్రవేశించిన విషయం విదితమే. తయారీ ఇలా పశ్చిమ భారతంలో దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌తో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్లాంటులో కొత్త ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు ఎఫ్సీఏ వెల్లడించింది. కంపెనీ విడుదల చేయనున్న మూడు వరుసల ఎస్యూవీ ప్రధానంగా ఫోర్డ్ మోటార్ తయారీ ఎండీవర్, టయోటా తయారీ ఫార్చూనర్లతో పోటీ పడే వీలున్నట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. తాజా పెట్టుబడులతో దేశీయంగా ఎఫ్సీఏ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ 70 కోట్ల డాలర్లకు(దాదాపు రూ. 5,200 కోట్లు) చేరనున్నట్లు తెలియజేశారు. వీటిలో గ్లోబల్ టెక్ సెంటర్‌కు కేటాయించిన15 కోట్ల డాలర్లు కలసి ఉన్నట్లు చెప్పారు. -
అక్టోబర్‌లో తగ్గిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు
ముంబై: సప్లై సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు మందగించడంతో అక్టోబర్‌లో ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు 9 శాతం క్షీణించినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ తెలిపింది. మొత్తం 1,464 రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లో(ఆర్టీఓ)1,257 ఆఫీసుల నుంచి సేకరించిన వెహకిల్ రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ఎఫ్ఏడీఏ రిటైల్ వాహన అమ్మకాల డేటాను విడుదల చేసింది. సమీకరించిన గణాంకాల ప్రకారం ఈ అక్టోబర్‌లో మొత్తం 2,49,860 పాసింజర్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 2,73,980 యూనిట్లతో పోలిస్తే ఇవి 9 శాతం తక్కువ. ఇదే అక్టోబర్‌లో టూ–వీలర్స్ అమ్మకాలు 27 శాతం క్షీణించి 10,41,682 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఈ విక్రయాలు 14,23,394 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన విక్రయాలు 30 శాతం పతనమై 44,480 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 64.5 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 55శాతం క్షీణించాయి. మొత్తం అన్ని విభాగపు అమ్మకాలు 24శాతం క్షీణించి 14,13,549 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 18,59,709గా ఉన్నాయి. పండుగ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నప్పటికీ., వార్షిక ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు తక్కువగానే నమోదయ్యాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి తెలిపారు. ‘‘కరోనా ప్రభావంతో డీలర్లు డిమాండ్‌కు తగ్గట్లు కొత్త వేరియంట్ల కొనుగోళ్లకు, అధిక నిల్వలను పెంచుకునేందుకు ఆసక్తి చూపలేకపోయారు. అలాగే గత సీజన్‌తో పోలిస్తే ఈసారి తక్కువ డిస్కౌంట్ల ప్రకటన అమ్మకాలపై ప్రభావాన్ని చూపింది’’ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి తెలిపారు. -
ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 25% క్షీణత
అటో పరిశ్రమను కరోనా సంక్షోభం వెంటాడుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు భారీగా క్షీణించాయి. ఈ జూలైలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 1,57,373 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది(2019)లో ఇదే జూన్‌లో అమ్ముడైన 2,10,377 యూనిట్లతో పోలిస్తే 25శాతం తక్కువని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. కరోనా ఎఫెక్ట్ జూలైలోనూ కొనసాగడం వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఎఫ్ఏడీఏ చెప్పుకొచ్చింది. ద్విచక్ర వాహన అమ్మకాలు జూలైలో 37.47శాతం క్షీణించి 8,74,638 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే జూలైలో మొత్తం అమ్మకాలు 13,98,702 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన అమ్మకాలు ఏకంగా 72.18శాతం పడిపోయి 19,293 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో త్రిచక్ర వాహనాల విక్రయాలు క్షీణతను చవిచూశాయి. గతేడాది జూలైలో పోలిస్తే అమ్మకాలు 74.33శాతం పతనమై 15,132 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాలు కలిపి మొత్తం అమ్మకాలు 11,42,633 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 17,92,879 యూనిట్లతో పోలిస్తే 36.27శాతం తగ్గదల చోటుచేసుకుంది. వాహన విక్రయాలపై ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ ‘‘జూన్‌తో పోలిస్తే జూలైలో రిటైల్ వాహన అమ్మకాలు ఊపందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే విక్రయాలు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు వాస్తవ డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. గతేడాది జూలైలో లోబేస్ ఉన్నప్పటికీ అమ్మకాలు డబుల్ డిజిట్ క్షీణతను చవిచూశాయి’’ అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారమైన వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్, చిన్న వాణిజ్య వాహనాలు, మోటర్ సైకిల్ విభాగాల్లో అమ్మకాల వృద్ధి కొనసాగిందని ఖేల్ తెలిపారు. డిమాండ్‌ను పెంచే విధివిధానాలను ప్రకటించాలని ఎఫ్ఏడీఏ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు. ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానం కోసం పరిశ్రమ ఆత్రంగా ఎదురుచూస్తోందని ఇది మధ్య, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలకు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అటో తయారీ హబ్స్‌లో లాక్డౌన్ విధింపు లేకపోతే అగస్ట్ అమ్మకాలు ఆశాజనకంగా ఉండొచ్చని కాలే అభిప్రాయపడ్డారు. -
టాటా మోటార్స్ కార్ల ధరలు పెంపు..
జైసల్మేర్/రాజస్తాన్: దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహన ధరలను పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను విడుదల చేయాల్సి వస్తుండడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుం దని, ఎంత మేర పెంచాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. హ్యాచ్‌బ్యాక్ టియాగో నుంచి ఎస్యూవీ హ్యారియర్ వరకు పలు మోడళ్లను ఈ సంస్థ భారత మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధర రూ.4.39 లక్షలు–16.85 లక్షల వరకు ఉంది. -
ప్యాసింజర్ వాహన విక్రయాలు డౌన్
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల (పీవీ) హాల్‌సేల్ విక్రయాలు వరుసగా 11వ నెల్లోనూ గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) శుక్రవారం ప్రకటించింది. పండుగల సీజన్ వినియోగదారుల సెంట్మెంట్ను బలపరచలేకపోయిన కారణంగా సెప్టెంబర్ పీవీ 2,23,317 యూనిట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెల్లో నమోదైన 2,92,660 యూనిట్ల విక్రయాలతో పోల్చితే ఏకంగా 23.69 శాతం క్షీణత ఉన్నట్లు తెలియజేసింది. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 23.56% తగ్గుదల నమోదైంది. దేశీయంగా గత నెల కార్ల విక్రయాలు 1,31,281 యూనిట్లు(33.4% క్షీణత). -
టాటా మోటార్స్ కార్ల ధరలు పెంపు
సాక్షి, ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కార్ల ధరలు పెరగనున్నాయి. వచ్చే నెల ఏప్రిల్ నుంచి వివిధ మోడళ్ల ప్యాసెంజర్ కార్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం కంపెనీ ప్రకటించింది. ఈ పెంపు 25 వేల రూపాయల దాకా ఉంటుందని తెలిపింది. ఆర్థిక పరిస్థితులు, ఇన్పుట్ వ్యయాల కారణం ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా టయోటా, జాగ్వర్ ల్యాండ్ రోవర్ ధరలు పెరుగుతాయని పేర్కొంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాలు, వివిధ బాహ్య ఆర్థిక కారకాల కారణంగా ధరలను పెంచుతున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. -
కార్లపై ధరలు పెంచిన టాటా మోటార్స్
న్యూఢిల్లీ : దేశంలో ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్, తన ప్యాసెంజర్ వాహనాల ధరలు పెంచింది. తన అన్ని మోడల్స్‌పై 2.2 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఆగస్టు నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఏప్రిల్‌లో కూడా కంపెనీ 3 శాతం మేర కార్ల ధరలు పెంచింది. ‘ వ్యయాల కోతకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్పుట్ ఖర్చులు పెరుగుతూనే పోతున్నాయి. దీంతో ఆగస్టు నుంచి మా ప్యాసెంజర్ వాహనాలపై ధరలు పెంచాలని నిర్ణయించాం’ అని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ చెప్పారు. సుమారు 2 శాతం నుంచి 2.2 శాతం మధ్యలో కంపెనీ ధరలను పెంచుతున్నట్టు పరీక్ తెలిపారు. ఏప్రిల్‌లో కూడా ఇన్పుట్ ఖర్చులు పెరగడంతోనే ధరలను పెంచింది. ఏప్రిల్‌లో ధరలు పెంపు 3 శాతంగా ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఎంట్రీ-లెవల్ చిన్న కారు నానో నుంచి ప్రీమియం ఎస్యూవీ హెక్సా వరకు మోడల్స్‌ను విక్రయిస్తోంది. వీటి ధరలు ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.2.36 లక్షల నుంచి రూ.17.89 లక్షల మధ్యలో ఉన్నాయి. అయితే ధరల పెంపు, విక్రయాలపై పడుతుందా? అనే ప్రశ్నను పరీక్ కొట్టిపారేశారు. ఏప్రిల్‌లో ధరలు పెంచినప్పటికీ తమ మోడల్స్‌ను బాగానే విక్రయించామని, ఇదే మాదిరి విక్రయాలను తాము కొనసాగిస్తామని చెప్పారు. గత 28 నెలల నుంచి తాము విక్రయాల్లో మంచి ప్రదర్శనను కనబరుస్తున్నామని, ఈ క్వార్టర్లో ఇండస్ట్రీ 13.1 శాతం వృద్ధి చెందితే, తాము 52 శాతం వృద్ధి సాధించినట్టు పరీక్ పేర్కొన్నారు. -
ప్యాసింజర్ వాహన విక్రయాల రికార్డ్
న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్ వాహనాలు 2017లో రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. తొలిసారి 30 లక్షల మార్క్‌ను అధిగమించాయి. వృద్ధిలో ఇది ఐదేళ్ల గరిష్ట స్థాయి. యుటిలిటీ వాహనాలకు అధిక డిమాండ్ ఉండటమే దీనికి ప్రధాన కారణం. సియామ్ గణాంకాల ప్రకారం.. ♦ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు 2017లో 32,29,109 యూనిట్లు. ఇవి 2016లో 29,66,603 యూనిట్లు. 8.85 శాతం వృద్ధి కనిపించింది. పీవీ విక్రయాల్లో 2012 తర్వాత మళ్లీ ఇంతటి వృద్ధి ఇప్పుడే. 2012లో వృద్ధి 9.77 శాతంగా ఉంది. ♦ కార్ల విక్రయాలు 5.13 శాతం వృద్ధితో 20,62,357 యూనిట్ల నుంచి 21,68,151 యూనిట్లకు ఎగశాయి. యుటిలిటీ వాహన అమ్మకాలు 20.09 శాతం వృద్ధితో 7,24,522 యూనిట్ల నుంచి 8,70,060 యూనిట్లకు పెరిగాయి. ♦ టూవీలర్ విక్రయాలు 8.43% వృద్ధితో 1,91,76,905 యూనిట్లకు ఎగశాయి. ♦ ఇక 2016–17 ఆర్థిక సంవత్సరంలో పీవీ విక్రయాలు 9.23%, సీవీ అమ్మకాలు 4.16 శాతం, టూవీలర్ల విక్రయాలు 6.89 శాతం పెరిగాయి. డిసెంబర్లో చూస్తే: డిసెంబర్లో పీవీ విక్రయాలు 5.22% వృద్ధితో 2,27,823 యూనిట్ల నుంచి 2,39,712 యూనిట్లకు ఎగశాయి. దేశీ కార్ల విక్రయాలు మాత్రం 1,58,617 యూనిట్ల నుంచి 1,58,326 యూనిట్లకు తగ్గాయి. మారుతీ సుజుకీ ఇండియా విక్రయాలు 11.44% వృద్ధితో 1,18,560 యూనిట్లకు, హ్యుందాయ్ విక్రయాలు స్వల్ప వృద్ధితో 40,158 యూనిట్లుకు ఎగశాయి. మహీంద్రా అమ్మకాలు 6.99% క్షీణతతో 15,531 యూనిట్లకు తగ్గాయి. టాటా మోటార్స్ విక్రయాలు 33.94% వృద్ధితో 16,089 యూనిట్లకు పెరిగాయి. ఇక మొత్తం టూవీలర్ విక్రయాలు 41.45% వృద్ధితో 12,87,592 యూనిట్లకు ఎగశాయి. మోటార్‌సైకిల్ అమ్మకాలు 40.31% వృద్ధితో 7,88,156 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్ దేశీ అమ్మకాలు 42.71% వృద్ధి చెందాయి. 3,98,816 యూనిట్లుగా నమోదయ్యాయి. స్కూటర్ల అమ్మకాలు 52.05% వృద్ధితో 4,32,429 యూనిట్లకు చేరాయి. హెచ్ఎంఎస్ఐ విక్రయాలు 57.36% వృద్ధితో 2,38,820 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహన (సీవీ) విక్రయాలు 52.62% వృద్ధితో 82,362 యూనిట్లకు పెరిగాయి. వృద్ధి అంచనాలు పెంపు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో అమ్మకాలు సానుకూలముగా ఉండటంతో.. సియామ్ 2017–18కి సంబంధించి ప్యాసింజర్ వాహన విభాగపు వృద్ధి అంచనాలను 7–9% నుంచి 9%కి పెంచింది. ఇక వాణిజ్య వాహన విభాగపు వృద్ధి అంచనాలను 4–6 % నుంచి 13%కి, టూవీలర్ల వృద్ధి అంచనాలను 9–11% నుంచి 12%కి సవరించింది. ఎగుమతులు స్థిరం దేశీ ప్యాసింజర్ వాహన ఎగుమతులు 2017లో స్థిరంగానే నమోదయ్యాయని సియామ్ తెలిపింది. ఇవి 7,38,894 యూనిట్లుగా ఉన్నాయని పేర్కొంది. 2016లో పీవీ ఎగుమతులు 7,38,137 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపింది. జీఎస్టీ రిఫండ్ అంశం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. ‘డిసెంబర్లో ఐదారుగురు టాప్ ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించాం. ఇందులో దాదాపు రూ.2,000 కోట్ల రిఫండ్ అమౌంట్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది’ అని సియామ్ వెల్లడించింది. -
డిసెంబర్లో వాహన విక్రయాలు డౌన్
న్యూఢిల్లీ : డిసెంబర్ నెలలో వాహన విక్రయాలు డౌన్ అయ్యాయి. 2015 డిసెంబర్ కంటే 2016 డిసెంబర్ నెలలో దేశీయంగా ప్యాసెంజర్ వెహికిల్ విక్రయాలు 1.36 శాతం పడిపోయి 2,27,824 యూనిట్లుగా నమోదయ్యాయి. గత కాలంలో ఇవి 2,30,959 యూనిట్లగా ఉన్నాయి. అదేవిధంగా దేశీయ కార్ల విక్రయాలు కూడా 8.14 శాతం పడిపోయి డిసెంబర్ నెలలో 1,58,617 యూనిట్లు అమ్ముడుపోయినట్టు దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. మోటార్ సైకిల్ విక్రయాలు 22.5 శాతం క్షీణించి 5,61,690 యూనిట్లగా నమోదైనట్టు, టూవీలర్ వాహన అమ్మకాలు 22.04 శాతం పడిపోయి 9,10,235 యూనిట్లని పేర్కొంది. 2015 డిసెంబర్ నెలలో మోటార్ సైకిల్ విక్రయాలు 7,24,795 యూనిట్లగా, టూవీలర్ విక్రయాలు 11,67,621 యూనిట్లగా ఉన్నట్టు సియామ్ వెల్లడించింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా పడిపోయినట్టు సియామ్ తెలిపింది. -
మహీంద్రా.. రెక్స్టన్ ఆర్ఎక్స్6
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారమిక్కడ భారత మార్కెట్లో సాంగ్యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్6 మోడల్‌ను ఆవిష్కరించింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో విలాసవంతమైన ఫీచర్లతో ఈ ఖరీదైన వాహనాన్ని రూపొందించింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.20.11 లక్షలు. ముందువైపు, ఇరు పక్కల కూడా ఎయిర్‌బ్యాగ్స్‌ను ఉంచారు. మలుపుల్లో, అలాగే కొండ ప్రాంతాల్లో వాహనం జారకుండా స్థిరంగా ఉండేలా వ్యవస్థ ఉంది. ప్రీమియం లెదర్‌తో ఇంటీరియన్‌ను తీర్చిదిద్దారు. టిల్ట్, ఓపెన్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్‌ను అమర్చారు. నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇప్పటికే రెక్స్టన్ నుంచి ఆటో ట్రాన్స్‌మిషన్‌తో ఆర్ఎక్స్7 (రూ.21.28 లక్షలు), మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఆర్ఎక్స్5 (రూ.19 లక్షలు) మోడళ్లున్నాయి. ఈ రెండు మోడళ్లలో లేని 17 రకాల ఫీచర్లను ఆర్ఎక్స్6లో పొందుపరిచారు. మరో ఆరు ఇంజిన్లపై.. సాంగ్యాంగ్తో కలిసి ఆరు ఇంజిన్ల తయారీలో నిమగ్నమైనట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సేల్స్ చీఫ్ అరుణ్ మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. వీటిని రెండు కంపెనీలూ వినియోగిస్తాయని, మూడేళ్లలో సిద్ధమవుతాయని చెప్పారు. హై ఎండ్, లగ్జరీ ఫీచర్లతో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్‌ను వినియోగదారులు కోరుతున్నందునే ఆర్ఎక్స్6ను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. హై స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల పరిమాణం దేశంలో 2013-14లో 23,665 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 26,208 యూనిట్లు. ఈ విభాగంలో మహీంద్రా రెండో స్థానంలో ఉంది. -
ధరల పెంపుబాటలో కార్ల కంపెనీలు..!
న్యూఢిల్లీ: టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కార్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని యోచిస్తున్నాయి. ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరుగుపోతున్న కారణంగా ఈ కంపెనీలు ధరలను పెంచాలనుకుంటున్నాయని సమాచారం. వచ్చే నెల నుంచి ధరలు పెంచే విషయమై తీవ్రంగానే కసరత్తు చేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. అయితే ఎంత వరకూ పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదని వివరించారు. ధరల పెంపు విషయమై చర్చలు జరుగుతున్నాయని, పెంచే అవకాశాలున్నాయని హోండా కార్స్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల ధరలను 1-2 శాతం పెంచనున్నది. హోండా కార్స్ కంపెనీ కార్ల ధరలు రూ. 3.99 లక్షల నుంచి రూ.24.36 లక్షలు, మహీంద్రా ప్రయాణికుల వాహనాల ధరలు రూ.5.43 లక్షల నుంచి రూ.14.48 లక్షల రేంజ్లో ఉన్నాయి. కాగా గత నెలలో మహీంద్రా కంపెనీ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.13,000 నుంచి రూ.49,000 రేంజ్లో హోండా కార్స్ కంపెనీ రూ.44,741 వరకూ తగ్గించాయి. ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడంతో ఈ కంపెనీలే కాకుండా పలు కంపెనీలు వాహనాల ధరలను తగ్గించాయి.