మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి 16% డౌన్‌ | Maruti Suzuki passenger car production down 16percent in October | Sakshi
Sakshi News home page

మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి 16% డౌన్‌

Published Tue, Nov 5 2024 5:58 AM | Last Updated on Tue, Nov 5 2024 7:59 AM

Maruti Suzuki passenger car production down 16percent in October

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం    మారుతీ సుజుకీ ఇండియా గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ప్యాసింజర్‌ కార్ల ఉత్పత్తిని 16 శాతం తగ్గించింది. అయితే, యుటిలిటీ వాహనాల ఉత్పత్తిని 33 శాతం పెంచింది. అక్టోబర్‌లో ప్యాసింజర్‌ కార్ల ఉత్పత్తి 1,06,190 యూనిట్ల నుంచి 89,174 యూనిట్లకు తగ్గినట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది.

 మరోవైపు, బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్‌ఎల్‌6 వంటి యుటిలిటీ వాహనాలతో పాటు టయోటా కిర్లోస్కర్‌ మోటర్స్‌కి సఫరా చేసే వాహనాల ఉత్పత్తిని 54,316 యూనిట్ల నుంచి 72,339 యూనిట్లకు పెంచినట్లు పేర్కొంది. మినీ కార్లు అయిన ఆల్టో, ఎస్‌–ప్రెసో మొదలైన వాటి ఉత్పత్తి 14,073 యూనిట్ల నుంచి 12,787 యూనిట్లకు తగ్గింది. అటు బాలెనో, సెలీరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వ్యాగన్‌ఆర్‌తో పాటు టయోటా కిర్లోస్కర్‌ మోటర్స్‌కి కూడా సరఫరా చేసే కాంపాక్ట్‌ కార్ల ఉత్పత్తి 90,783 నుంచి 75,007 యూనిట్లకు తగ్గింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement