manufacturing units
-
సుజుకీ యాక్సెస్ 125 రికార్డు
ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే. దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది. 5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
భారత్‌లో ఎంఎస్ఐ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: ల్యాప్టాప్స్ రంగంలో ఉన్న తైవాన్ కంపెనీ ఎంఎస్ఐ తాజాగా భారత్‌లో తయారీ కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. చెన్నైలో కంపెనీకి ప్లాంటు ఉంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఎంఎస్ఐ స్థానికంగా తయారైన రెండు ల్యాప్‌టాప్ మోడల్స్‌ను పరిచయం చేస్తోంది. వీటిలో మోడర్న్ 14, థిన్ 15 ఉన్నాయి. థిన్ 15 ధర రూ.73,990, మోడర్న్ 14 రూ.52,990 నుంచి ప్రారంభం. ‘సంస్థకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటిగా మారింది. బ్రాండ్ స్థిరంగా దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తరిస్తోంది. అధిక పనితీరు గల ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్థానికంగా తయారైన పరికరాలను అందించడం ద్వారా.. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు సహకరించడానికి కంపెనీ ఉత్సాహంగా ఉంది. భారత్‌లో ఉత్పత్తుల లభ్యతను మెరుగుపరచడానికి మరిన్ని ల్యాప్‌టాప్ బ్రాండ్ స్టోర్లు, క్రోమా, రిలయన్స్ రిటైల్ సహా టచ్‌పాయింట్స్ సంఖ్యను పెంచుతున్నాం’ అని ఎంఎస్ఐ వివరించింది. -
మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి 16% డౌన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిని 16 శాతం తగ్గించింది. అయితే, యుటిలిటీ వాహనాల ఉత్పత్తిని 33 శాతం పెంచింది. అక్టోబర్‌లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 1,06,190 యూనిట్ల నుంచి 89,174 యూనిట్లకు తగ్గినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. మరోవైపు, బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలతో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్‌కి సఫరా చేసే వాహనాల ఉత్పత్తిని 54,316 యూనిట్ల నుంచి 72,339 యూనిట్లకు పెంచినట్లు పేర్కొంది. మినీ కార్లు అయిన ఆల్టో, ఎస్–ప్రెసో మొదలైన వాటి ఉత్పత్తి 14,073 యూనిట్ల నుంచి 12,787 యూనిట్లకు తగ్గింది. అటు బాలెనో, సెలీరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్తో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్‌కి కూడా సరఫరా చేసే కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి 90,783 నుంచి 75,007 యూనిట్లకు తగ్గింది. -
సెమీ కండక్టర్ల రంగంలో గ్లోబల్ పవర్‌గా ఇండియా
గాందీనగర్: సెమీ కండక్టర్ల రంగంలో మన దేశం కీలక పాత్ర పోషించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగంలో భారత్ గ్లోబల్ పవర్‌గా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఇండియాలో రూ.1.25 లక్షల కోట్లతో స్థాపించనున్న మూడు సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్లకు ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో రెండు గుజరాత్లో, ఒకటి అస్సాంలో రాబోతున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీని పట్టించుకోలేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అభివృద్ధి పట్ల అంకితభావం లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. దేశ శక్తి సామర్థ్యాలను, ప్రాధాన్యతలను, భవిష్యత్తు అవసరాలను గుర్తించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యా యని ఆక్షేపించారు. మన దే శాన్ని సెమీ కండక్టర్ల తయారీ హబ్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. దేశీయంగా చిప్‌ల తయారీతో యువతకు ఎన్నెన్నో ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఈ రంగం దోహదపడుతుందని వివరించారు. సెమీ కండక్టర్ మిషన్‌ను రెండేళ్ల క్రితం ప్రకటించామని, తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఈరోజు మూడు పరిశ్రమలకు శంకుస్థాపన చేశామని వ్యాఖ్యానించారు. అనుకున్నది సాధించే శక్తి భారత్‌కు, ప్రజాస్వామ్యానికి ఉందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పీఎం–సూరజ్ నేషనల్ పోర్టల్ ప్రారంభం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయని ఆరోపించారు. దేశాభివృద్ధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదని విమర్శించారు. దళిత, గిరిజన వర్గాలకు చెందిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపదీ ముర్మును తాము రాష్ట్రపతులను చేశామని అన్నారు. అణగారిన వర్గాలను అత్యున్నత పదవుల్లో నియమిస్తున్నామని, ఇది ఇకపైనా కొనసాగుతుందని వివరించారు. ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్, రోజ్‌గార్ ఆధారిత్ జన్‌కల్యాణ్(పీఎం–సూరజ్) నేషనల్ పోర్టల్‌ను మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఎస్టీలు, ఎస్సీలు, వెనుకబడిన తరగతులతోపాటు పారిశుధ్య కార్మికులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
చిప్‌ల తయారీలో అంతర్జాతీయ స్థాయికి భారత్
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో సెమీ కండక్టర్ల తయారీలో భారత్ అంతర్జాతీయ స్థాయికి చేరగలదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిప్‌ల విభాగంలో తైవాన్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా దేశీయంగా కొత్త ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ప్లాంట్లు పెట్టేందుకు, సంబంధిత రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు తయారీ సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాలు ఆకర్షిస్తున్నాయని మంత్రి చెప్పారు. చైనాకి ప్రత్యామ్నాయంగా, ప్రజాస్వామ్య టెక్నాలజీ హబ్‌గా భారత్ నిలుస్తోందని ఆయన తెలిపారు. ‘భారత్‌కి ఎప్పుడు వెళ్లాలి.. అసలు వెళ్లొచ్చా అని గతంలో అంతా అలోచించే వారు. కానీ ఇప్పుడు వీలైనంత ముందుగా వెళ్లాలి అనుకుంటున్నారు. అటువంటి మార్పు కనిపిస్తోంది. ప్రతి పెద్ద సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఆలోచనల్లో ఉంది‘ అని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవలే దాదాపు రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో టాటా గ్రూప్ తలపెట్టిన మెగా ఫ్యాబ్ కూడా ఉంది. -
మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. నానక్‌రాంగూడలో నూతనంగా విస్తరించిన మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను గురువారం ఆయన అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఎంఈఐసీ ఉండటం మెడ్‌టెక్ ఆవిష్కరణలకు హాట్‌స్పాట్‌గా ఎదుగుతుందనడానికి నిదర్శనమన్నారు. ఈ ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధికి ఆదర్శవంతమైన గమ్య స్థానంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడ్‌ట్రానిక్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంస్థ పురోభివృద్ధికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సి ద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ, అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్లను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నా రు. మెడ్‌ట్రానిక్ చైర్మన్, సీఈఓ జెఫ్‌మార్తా మాట్లా డుతూ ఆర్అండ్డీ సౌకర్యాన్ని విస్తరించడానికి, భవిష్యత్తులో 1,500 మందికి ఉపాధి కల్పించడానికి మెడ్‌ట్రానిక్ ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఈఐసీ ఉపాధ్యక్షుడు, సైట్ లీడర్ దివ్యప్రకాశ్ జోషి మాట్లాడారు. అనంతరం మంత్రి మెడ్‌ట్రానిక్ సంస్థ ద్వారా ఉత్పత్తి చేసిన యంత్ర పరికరాలు వాటి పనితీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫోర్సిస్ ఇంక్ నూతన కార్యాలయం ప్రారంభం తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు పూర్తిగా అనుకూలంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఫోర్సిస్ ఇంక్‌నూతన కార్యాలయాన్ని శ్రీధర్‌బాబు, అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సా మాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ భారతదేశం, అమెరికా భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా బలమైన ద్వైపాక్షిక స్నేహంగా ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఫోర్సిస్ సంస్థ వ్యవస్థాపకులు జేపీ వేజెండ్ల, ఐల్యా బ్స్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడారు. -
జీఎస్టీ దెబ్బ: కనుమరుగవుతున్న హవాయి చెప్పులు..
పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ధరించే హవాయి చెప్పులు జీఎస్టీ దెబ్బకు కనుమరుగవుతున్నాయి. పెరిగిన జీఎస్టీతో వందలాది తయారీ కేంద్రాలు మూతపడుతున్నాయి. జీఎస్టీ పెంపు కారణంగా దాదాపు 325 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు మూతపడ్డాయని జలంధర్ రబ్బర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తాజాగా తెలిపింది. ఏడేళ్ల క్రితం ఒక్క జలంధర్‌లోనే 400 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు ఎంఎస్ఎంఈ పరిశ్రమలుగా ఉండేవి. జీఎస్టీని పెంచడం, అదే సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో వీటిలో దాదాపు 325 యూనిట్లు మూతపడ్డాయని అసోసియేషన్ పేర్కొంటోంది. జీఎస్టీ పెంపే కారణం హవాయి చెప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడమే యూనిట్ల మూసివేతకు కారణమని ఆయా పారిశ్రమల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. జలంధర్ రబ్బర్ గూడ్స్ తయారీదారుల సంఘం కార్యదర్శి రాకేష్ బెహల్ మాట్లాడుతూ.. ‘2017 జూలై 1న జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న పాదరక్షలు, వస్త్రాలను 5 శాతం జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచాలని నిర్ణయించారు. ఆ తరువాత జీఎస్టీ 7 శాతం పెంచి 12 శాతం శ్లాబ్ కిందకు చేర్చారు. దీని ప్రభావం దేశవ్యాప్తంగా హవాయి చప్పల డిమాండ్, సరఫరాపై తీవ్రంగా పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఈ ఉత్పత్తులపై వ్యాట్ రేటు చాలా రాష్ట్రాల్లో సున్నా లేదా కొన్ని రాష్ట్రాల్లో 0.5 శాతం ఉండేది. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ధరించే తక్కువ ధర హవాయి చప్పలపై 12 శాతం జీఎస్టీ అస్సలు సమర్థనీయం కాదని, వెంటిలేటర్‌పై ఉన్న హవాయి చెప్పుల పరిశ్రమను బతికించాలని పరిశ్రమల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదీ చదవండి: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! -
టాటా మాస్టర్ ప్లాన్.. ప్రపంచ దేశాల్లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ!
దేశీయ ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి అడుగుపెట్టింది. గుజరాత్ ప్రభుత్వ అంగీకారంతో ఆ రాష్ట్రంలో రూ.13,000 కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయనుంది. ఈ మేరకు టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అగరాటాస్ ఎనర్జీ స్టోరేజ్ గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గంటకు 20 గిగావాట్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంట్‌ను విస్తరించనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 13,000 మంది ఉపాధి పొందనున్నారు. ఇక, టాటా గ్రూప్ లిథియం బ్యాటరీ మ్యానిఫ్యాక్చరింగ్ సంబంధించిన ప్రొడక్షన్ ఈకో సిస్టంలో తోడ్పాటునందించేందుకు సిద్ధంగా ఉన్నామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. భారత్‌తో పాటు మరిన్ని దేశాల్లో టాటా గ్రూప్ మరో అనుబంధ ఆటోమొబైల్ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవడర్ బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్ నిర్మించేందుకు సిద్ధమైంది. బ్రిటన్‌తో పాటు ఇంగ్లాండ్, స్పెయిన్ దేశాలు సైతం ఈవీ బ్యాటరీ తయారీలో టాటా గ్రూప్‌కు తగిన ప్రోత్సాహకాల్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. లిథియం అయాన్ నిల్వలు.. వెలిగిపోనున్న భారత్ 2021 సంవత్సరంలో కర్నాటకలోని మండ్యా జిల్లాలో 1,600 టన్నులు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్ హైమన గ్రామం వద్ద 59 లక్షల టన్నులు, రాజస్థాన్‌లోని డేగనా ప్రాంతంలో ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించింది.ఉప్పగా ఉండే రిజర్వాయర్లు, భూమి లోపల ఉండే రాళ్లలో దొరికే లిథియంతో ఎలక్ట్రిక్ విభాగంలో భారత్ వెలిగిపోనుంది. జీరో కార్బన్ ఉద్గారిణిగా ప్రధాని నరేంద్ర మోదీ 2027నాటికి భారత్‌ను నాటికి జీరో కార్బన్ ఉద్గారిణిగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా చైనా, అమెరికాతో పోటీపడ్తూ ఎలక్ట్రిక్ వెహికల్ రవాణాను ప్రోత్సహిస్తున్నారు. చదవండి : ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
క్యూ1లో హైరింగ్ అప్
ముంబై: అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సర్వీసులు, తయారీ రంగాల కంపెనీలు మాత్రం నియామకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023–24 క్యూ1లో ఇది 10 శాతం అధికంగా ఉండగలదని అంచనాలు నెలకొన్నాయి. అయితే, 2022–23 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 4 శాతం తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌లీజ్ సర్వీసెస్‌కి చెందిన ఉపాధి అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 14 రంగాలకు చెందిన 809 చిన్న, మధ్య తరహా, భారీ సంస్థలపై చేసిన సర్వే ఆధారంగా టీమ్‌లీజ్ దీన్ని రూపొందించింది. ఇందులో పాల్గొన్న 64 శాతం మంది యజమానులు తమ సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. నివేదిక ప్రకారం సర్వీస్, తయారీ రంగాల్లో క్యూ1లో ప్రధానంగా ఎంట్రీ, జూనియర్ స్థాయి నియామకాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీసుల్లో ఇవి వరుసగా 73 శాతం, 71 శాతంగా ఉండగా .. తయారీలో 49 శాతం, 55 శాతంగా ఉన్నాయి. మధ్య స్థాయి ఉద్యోగాలకు సంబంధించి సర్వీసుల్లో 54 శాతంగాను, తయారీలో 32 శాతంగాను ఉన్నాయి. అత్యధికంగా సర్వీస్ రంగంలో.. తయారీ విభాగంతో పోలిస్తే సర్వీసుల రంగంలో హైరింగ్‌కు ఎక్కువగా ఆస్కారం ఉంది. సేవా రంగం విషయానికొస్తే ఇది టెలికమ్యూనికేషన్స్‌లో 96%, ఆర్థిక సర్వీసులు (93%), ఈ–కామర్స్.. అనుబంధ స్టార్టప్‌లు (89%), రిటైల్ (87%), విద్యా సర్వీసుల్లో 83%గా ఉంది. తయారీ రంగంలో హెల్త్‌కేర్ .. ఫార్మాలో 91 శాతంగా, ఎఫ్ఎంసీజీలో 89 శాతంగా, ఎలక్ట్రిక్ వాహనాలు.. మౌలిక సదుపాయాల కల్పనలో 73 శాతంగా ఉంది. -
భారత్‌లో ఐఫోన్ల తయారీ.. యాపిల్ అంచనాలు తలకిందులవుతున్నాయా?
భారత్‌లో ఐఫోన్ల iPhone తయారీ పెంచాలని భావిస్తున్న యాపిల్ కంపెనీ ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. కోవిడ్-19 ఆంక్షలతో సప్లయ్ చైన్ సమస్యలు, అమెరికా- చైనాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఫోన్ల తయారీని డ్రాగన్ కంట్రీ నుంచి భారత్‌కు తరలించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా దేశీయ సంస్థ టాటా సంస్థతో యాపిల్ APPLE ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఐఫోన్ల విడిబాగాలను టాటా సంస్థ సగం (50%) తయారు చేసి యాపిల్‌కి ఐఫోన్లను సప్లయి చేసే ఫాక్స్‌కాన్‌కు అందిస్తుంది. అయితే 50 శాతం దిగుబడితో యాపిల్ తాను అనుకున్న లక్ష్యాల్ని చేరుకోలేదంటూ ఫైనాన్సియల్ టైమ్స్ నివేదించింది. అందుకు స్థానికంగా లాజిస్టిక్స్, టారిఫ్‌లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సవాళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ కారణంగా భారతదేశంలో కంపెనీ విస్తరణ ప్రక్రియ నెమ్మదించినట్లు ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ వార్తలపై టాటా గ్రూపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు, అలాగే ఖండన కూడా రాలేదు 2017 నుంచి విస్ట్రాన్ ఆధ్వర్యంలో యాపిల్ సంస్థ భారత్‌లో ఐఫోన్లను తయారు చేస్తోంది. చైనాలో పరిస్థితులు, దేశీయంగా తయారీ రంగంలో వృద్ది సాధించేలా కేంద్రం లక్ష్యాలను పెట్టుకున్న నేపథ్యంలో ఐఫోన్ల తయారీ భారత్ కు కలిసివస్తుందని అంచనా వేశారు నిపుణులు. అందుకే యాపిల్ కంపెనీ చైనానుంచి రావాలనుకున్నప్పుడు కేంద్రం భారీ ప్రోత్సహకాలు ప్రకటించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు యాపిల్ సంస్థ అంచనాలకు అనుగుణంగా లేవంటూ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. చదవండి👉 ప్రాణం లేని ఉద్యోగి .. ఏడాదికి రూ. 11లక్షల ప్యాకేజీ!! -
భారీ డీల్: ఫోర్డ్‌ను కొనేసిన టాటా! ఎన్ని వందల కోట్లంటే!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్..ఫోర్డ్ మోటార్ మ్యాని ఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లకు సంబంధించి అగ్రిమెంట్ నిన్ననే పూర్తయినట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్ధిక సమస్యలు, మార్కెట్లో దేశీయ ఆటోమొబైల్ కంపెనీల సత్తా చాటడంతో అమెరికన్ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. 2021 సెప్టెంబర్‌లో ఫోర్డ్ ఆ ప్రకటన చేసే సమాయానికి ఆ సంస్థకు గుజరాత్, తమిళనాడులో రెండు పెద్ద కార్ల తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. ఆ యూనిట్లను ఫోర్డ్ అమ్మకానికి పెట్టగా..వాటిని కొనుగోలు చేసేందుకు టాటా కంపెనీ సిద్ధమైంది. ఈ తరుణంలో గుజరాత్‌లోని ఫోర్డ్‌కు చెందిన సనంద్ వెహికల్ ప్లాంట్ స్థలాలు,ఇతర ఆస్తులు,అలాగే అర్హులైన ఉద్యోగుల్ని కొనసాగించేలా ఒప్పందం జరిగింది. ఆ ఎంఓయూ ప్రకారం..గుజరాత్ ఫోర్డ్ కార్ల తయారీ ఫ్యాక్టరీని 91.5 మిలియన్ డాలర్లకు (రూ.726 కోట్లు) టాటా సంస్థ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా మా మ్యానిఫ్యాక్చరింగ్ సామర్థ్యం సంతృప్తి పరిచే స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోళ్లు సమయానుకూలమైనది. ఇది వాటాదారుల విజయం అంటూ' టాటా మోటార్స్ తెలిపింది. కాగా, సనంద్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడం వల్ల టాటా మోటార్స్ ఏడాదికి 300,000 యూనిట్ల కార్ల తయారీ సామర్థ్యం 420,000కి పెరగవచ్చని భావిస్తుంది. గత ఏడాది ఫోర్డ్ భారత్‌లో తమ కార్ల తయారీ ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని ప్రకటించింది. అప్పటి వరకు దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఫోర్డ్ మార్కెట్ షేర్ 2శాతం మాత్రమే ఉంది. లాభాల్ని ఆర్జించడానికి రెండు దశాబ్దాలకు పైగా కష్టపడింది. చదవండి👉: భారత్‌లో ఫోర్డ్, అమ్మో ఇన్ని వేల కోట్లు నష్టపోయిందా! -
మచిలీపట్నంలో ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే లక్ష కోట్లకు పైచిలుకు పెట్టుబడులు వచ్చాయి. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ స్వయంగా వివరిస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుపై ఏంఓయూ కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, కంపెనీ తరఫున అనిల్ చలమలశెట్టిలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుపై ఏంఓయూ. రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, కంపెనీ తరఫున అనిల్ చలమలశెట్టి సంతకాలు.#CMYSJaganInDavos #APatWEF22 pic.twitter.com/udMl4MhSQH — ITE&C Department Government of Andhra Pradesh (@apit_ec) May 25, 2022 చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు -
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల పరికరాలు, పవర్‌ట్రెయిన్ విడిభాగాలు మొదలైన వాటిని దేశీయంగా తయారు చేయడంపై టయోటా గ్రూప్ సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందుకోసం రూ. 4,800 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఇందులో టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం), టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ (టీకేఏపీ) కలిసి రూ. 4,100 కోట్లు, మరో అనుబంధ సంస్థ టయోటా ఇండస్ట్రీస్ ఇంజిన్ ఇండియా (టీఐఈఐ) రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. దీని కోసం కర్ణాటక ప్రభుత్వంతో టీకేఎం, టీకేఏపీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. స్థానికత, పర్యావరణ హిత ఉత్పత్తులకు పెద్ద పీట వేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీకేఎం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గులాటీ తెలిపారు. గ్రూప్ కంపెనీలు (టీకేఎం, టీకేఏపీ) ద్వారా ప్రత్యక్షంగా 3,500 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగగలదని ఆయన పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులోనే ఉత్పత్తి ప్రారంభించగలమని గులాటీ వివరించారు. టయోటా గ్రూప్ కంపెనీలు ఇప్పటికే రూ. 11,812 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేశాయని, తమ సంస్థల్లో 8,000 మంది పైగా సిబ్బంది ఉన్నారని టీకేఎం వైస్–చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ తెలిపారు. భారత్‌లో టయోటా కార్యకలాపాలు ప్రారంభించి పాతికేళ్లయింది. -
నోట్ల తయారీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ముంబై: నోట్ల తయారీలో సమీప కాలంలో భారత్ 100 శాతం స్వయం సమృద్ధిని సాధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. మైసూరులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్బీఎన్ఎంపీఎల్) ఏర్పాటు చేసిన ఇంక్ తయారీ యూనిట్– ‘వర్ణిక’ను జాతికి అంకితం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఈ యూనిట్‌తో నోట్ల తయారీ వ్యవస్థలో భారత్ గణనీయమైన పురోగతి సాధించినట్లైందన్నారు. దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి గణనీయంగా తగ్గనుందని తెలిపారు. సమీప భవిష్యత్తులో నోట్ల తయారీలో 100 శాతం స్వయం సమృద్ధిని సాధించేందుకు నిరంతర (సుశిక్షత మానవ వనరులు, ప్రక్రియ, సాంకేతికత, సామర్థ్యం పరంగా) పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు. ఎల్డీసీకి శంకుస్థాపన... కాగా, బీఆర్బీఎన్ఎంపీఎల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఎల్డీసీ)కు కూడా గవర్నర్ శక్తికాంత దాస్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, దేశంలోని కరెన్సీ ఉత్పత్తి, ఈ విభాగంలో మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎల్డీసీ ఏర్పాటు ఎంతో కీలకమవుతుందని అన్నారు. ఈ కేంద్రం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఆవిర్భవించనుందని కూడా తెలిపారు. వర్ణిక ప్రత్యేకతలు... ఆర్బీఐ నియంత్రణలోని బీఆర్బీఎన్ఎంపీఎల్ నోట్ల భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించి వర్ణికాను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ వార్షిక ఇంక్ తయారీ సామర్థ్యం 1,500 మెట్రిక్ టన్నులు. కలర్ షిఫ్ట్ ఇంటాగ్లియో ఇంక్ (సీఎస్ఐఐ)ని కూడా వర్ణిక తయారు చేస్తుంది. భారతదేశంలోని బ్యాంక్ నోట్ ప్రింటింగ్ ప్రెస్‌ల పూర్తి అవసరాలను తీరుస్తుంది. దీని ఫలితంగా బ్యాంక్ నోట్ ఇంక్ ఉత్పత్తిలో వ్యయాలు తగ్గుతాయి. సామర్థ్యం మెరుగుపడుతుంది. తద్వారా ఈ విషయంలో దేశం ఎంతో స్వయం సమృద్ధి సాధించినట్లయ్యింది. ఈ యూనిట్ ఏర్పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు ఊతమిస్తోందని, నోట్ల ప్రింటింగ్ ఇంక్‌ను అవసరమైన పరిమాణంలో దేశీయంగానే ఉత్పత్తి చేయడానికి ఈ యూనిట్ ఊతం ఇస్తుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
Telangana: మాస్క్ ధరలు.. తగ్గేదే లే!
ఆస్పత్రుల్లో సర్జికల్ మాస్కులుగా మాత్రమే పరిచయం ఉన్నవి కాస్త.. కరోనా టైం నుంచి మన జీవితాల్లో భాగం అయ్యాయి. వేవ్‌లు విరుచుకుపడుతున్నప్పుడల్లా మూతులకు అతుక్కుపోతున్నాయి. ఆంక్షలు, అభ్యంతరాల నేపథ్యంలో అవసరంకొద్దీ అప్పటికప్పుడు ఎంతైనా సరే చెల్లించి కొనేస్తున్నారు జనాలు. అయితే మాస్క్‌ల ఉత్పత్తి పెరుగుతున్నా.. వాటి ధరలు మాత్రం ఇంకా దిగిరాకపోవడంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్ సహా ఇతర పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మూడు పొరల సర్జికల్ మాస్క్ ధర ఒకటి రూ.10 నుంచి 15 రూ. మధ్య ఉంటోంది(డిజైన్లు, ఇతర కంపెనీలవి మినహాయించి). సాధారణ మెడికల్ షాపు ఓనర్ల నుంచి బిజీ ఏరియాల దగ్గర చిరువ్యాపారుల దాకా ఈ ధరకి ఫిక్సయిపోయారు. ఇక మండలాలు, రూరల్ ఏరియాల్లో ఇంతకంటే ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. సాధారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల నుంచి సర్జికల్ బయటకు వచ్చేది రూపాయిలోపు(ఒక్కోటి) ధరకే!. మరి అన్నేసి రేట్ల రేటుకు అమ్మడం ఎందుకు?. ప్రతీకాత్మక చిత్రం మధ్యవర్తులే కారణం.. హైదరాబాద్ శివారులో దాదాపు పది యూనిట్ల నుంచి నిత్యం మాస్క్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ రోజులో లక్ష నుంచి 4 లక్షల దాకా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అంటే ఒక్క హైదరాబాద్ నుంచే రోజుకి 30 లక్షల సర్జికల్ మాస్కుల ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. ఇవిగాక మరో పది లక్షల మాస్క్‌లను ఢిల్లీ నుంచి దిగుమతి చేస్తున్నారు. మొత్తంగా 40 లక్షల మాస్క్‌లతో భారీ సప్లయి నడుస్తోంది. అయినప్పటికీ ధరలు మాత్రం దిగి రావట్లేదు. అయితే దళారులు, మధ్యవర్తుల కారణంగానే వీటి ధరలు అధికంగా ఉంటున్నాయని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు.. రిటైలర్స్‌కు 90పై. నుంచి 1.రూ.మధ్య అమ్ముతున్నారు. మొదటి వేవ్ నుంచి ఇదే ధర కొనసాగుతోంది కూడా. కానీ, రిటైలర్స్ నుంచి కొందరు దళారులు వీటిని కొనుగోలు చేసి.. మూడు నుంచి ఐదు రూపాయల కమిషన్‌తో కిందిస్థాయికి అమ్మకాలు చేస్తున్నారు. అందుకే తామూ అధిక ధరలకు అమ్ముతున్నామని మెడికల్ షాప్ ఓనర్లు, వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇక మాస్క్ ధరించకపోతే ఫైన్లు విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు వీళ్ల వ్యాపారానికి మరింత కలిసొస్తోంది. ప్రతీకాత్మక చిత్రం మాదేం లేదు కరోనా మొదటి, రెండో వేవ్‌ల టైంలో తెలంగాణలో మాస్క్‌ల కొరత నడిచింది. ఉత్పత్తి అస్థిరత వల్ల ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు డిమాండ్‌కు మించి సప్లయ్ ఉంటున్నా.. అధిక ధరలకు అమ్ముతుండడం విశేషం. ఫస్ట్ వేవ్ కోనా టైంలో ఒక్కో మాస్క్‌ను 8రూ నుంచి 9రూ. గరిష్ట ధరకు అమ్మేవాళ్లు. అయితే తయారీదారులు ఇప్పుడూ పాత రేట్లకే అమ్ముతున్నా.. కస్టమర్‌కి మాత్రం ఐదు నుంచి పది రేట్లకు చిల్లు పడుతోంది. పైగా ఈ ఏడాది వేసవి తర్వాత ఉత్పత్తి గణనీయంగా పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. తెలంగాణలో సరిపడా యూనిట్లు ఉన్నాయని, ధరల విషయంలో మాదేం లేదంటున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. పైగా మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి దందాలను, ధరల నియంత్రణను ప్రభుత్వాలే చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్లు. ప్రస్తుతం స్టాక్ వివరాలు ఎన్ 95 మాస్కులు.. 41 లక్షల కుపైనే 3 పొరల మాస్క్‌లు, కోటి 50 లక్షలకు పైనే పీపీఈ కిట్స్.. 8 లక్షలకుపైనే హోం ట్రీట్మెంట్ కిట్స్.. 8.71 లక్షలు కొసమెరుపు.. బల్క్‌గా త్రీ లేయర్స్ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్న కొందరు.. షాపులు, మెడికల్ స్టోర్లు కాకుండా రోడ్ల మీద, ఫుట్‌పాత్‌లపై రూ. 2 నుంచి 7రూ. మధ్య అమ్మేస్తున్నారు కొందరు. కానీ, వాటి క్వాలిటీపై నమ్మకం లేక చాలామంది దూరంగా ఉంటూ వస్తున్నారు. మాస్క్ మస్ట్.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందే వేరియెంట్. గాలి ద్వారా శరవేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేప్పుడు, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్‌లకు వెళ్లినప్పుడు మాస్క్‌లు(మూడు పొరలున్న ఎలాంటి మాస్క్‌లైనా సరే వాడడం మరీ మంచిది) ధరించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై ఫైనల్ వర్డ్ ఇదే: ఆర్బీఐ -
టీవీఎస్ ప్లాంటులో లక్ష బీఎండబ్ల్యూ బైక్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్.. తమిళనాడులోని హొసూర్ ప్లాంటులో ఒక లక్ష బీఎండబ్ల్యూ మోటరాడ్ 310 సీసీ బైక్స్‌ను ఉత్పత్తి చేసింది. అయిదేళ్లలోనే ఈ మైలురాయిని అధిగమించినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ మోటరాడ్స్ బైక్స్ ఉత్పత్తిలో హొసూర్ ప్లాంటు వాటా 10 శాతం ఉంది. 2013లో ఇరు సంస్థల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మార్కెట్ కోసం 500 సీసీ లోపు సామర్థ్యంగల బైక్స్ అభివృద్ధి, తయారీని టీవీఎస్ చేపట్టింది. ఈ క్రమంలో బీఎండబ్ల్యూ జి310 ఆర్, 310 జీఎస్, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్స్‌ను ఇరు సంస్థలు పరిచయం చేశాయి. ఈ మూడు బైక్స్ కూడా హొసూర్‌లో తయారవుతున్నాయి. బీఎండబ్లు్య జి310 ఆర్, 310 జీఎస్ మోడళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో లభ్యమవుతున్నాయి. -
అయ్యో మారుతి ! ఆటోమొబైల్ సెక్టార్‌పై ‘చిప్’ ఎఫెక్ట్
దేశంలోనే నంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కార్ల తయారీలో కీలకమైన సెమికండర్లు (చిప్)ల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సమస్యను అధిగమించేందుకు మారుతి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. చిప్సెట్ల ఎఫెక్ట్ దసరా, దీపావళి పండుగలకి మన దగ్గర కార్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. మారుతి సైతం ఇదే లక్ష్యంతో భారీగా సేల్స్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన చిప్సెట్ల కొరత కారణంగా ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. మారుతికి చిప్సెట్లు తయారు చేసే కంపెనీలు ఇప్పుడప్పుడే డిమాండ్‌కు తగ్గట్టు చిప్‌లు సరఫరా చేయలేమంటూ తేల్చిచెప్పాయి. దీంతో పండగ సీజన్ అమ్మకాల మాట అటుంచి చివరకు నెలవారీ తయారీ యూనిట్లలోనూ కోత పెట్టేందుకు మారుతి సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. టార్గెట్ కుదింపు ? దసరా, దీపావళీలను లక్ష్యంగా చేసుకుని మారుతి సెప్టెంబరు నెల తయారీ టార్గెట్ 60,000 నుంచి 90,000 యూనిట్లుగా ఆగస్టులో నిర్ధేశించుకుంది. అయితే చిప్సెట్ల కొరత కారణంగా ఈ టార్గెట్‌ను 50,000 నుంచి 70,000లకు కుదించినట్టు ఎకనామిక్ టైమ్స్ లో కథనాలు ప్రచురితం అయ్యాయి. సాధారణంగా పండగ సీజన్లో లక్షకు పైగా యూనిట్లను మారుతి తయారు చేస్తుంది. కానీ చిప్ సెట్ల కొరతతో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. 2014 తర్వాత కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్లు విధించినప్పుడు కూడా మారుతి కార్ల తయారీ ఈ స్థాయిలో దిగువకు చేరుకోలేదు. చివరి సారిగా 2014లో యాభై వేల యూనిట్లు తయారు చేశారు. ఆ తర్వాత ప్రతీ ఏడు 70వేలకు పైగానే కార్లు తయారు అయ్యేవి. చిప్సెట్లు, సెమికండక్టర్ల కొరతతో మారుతి ప్రణాళిక అమలు కష్టంగా మారింది. ఓపెన్ మార్కెట్ నుంచి చిప్సెట్లు కొనుగోలు చేసే దిశగా కూడా మారుతి ప్రయత్నాలు చేస్తోంది. షేర్ ధర తగ్గలేదు చిప్ సెట్ల కొరతతో ఇబ్బందుల్లో మారుతి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నా ఆ కంపెనీ షేర్ వ్యాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం రోజు మారుతి షేర్ ధర రూ.6605 నుంచి 6,675కి చేరుకోవడం ఈ కంపెనీపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. చదవండి: ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ? -
టెస్లాకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్
ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గిస్తే టెస్లా ఎస్ ప్లెయిడ్ కార్లను భారత్‌కు తీసుకువస్తామంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై చెలరేగిన దుమారం ఇంకా చల్లారలేదు. భారత ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఎలన్ మస్క్ ట్వీట్‌పై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వంలో ఉన్నతాధికారి చేసిన చేసిన ప్రకటన ఎలన్‌మస్క్‌ని ఇరుకున పడేలా చేసింది. దీనికి ఓకేనా తమ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లగ్జరీ కారుగా పరిగణించ వద్దని, కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ కారుగా గుర్తించి దిగుమతి పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని టెస్లా కంపెనీ గతంలో కోరింది. టెస్లా కోరినట్టుగా దిగుమతి పన్ను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని అయితే ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ను దేశంలో నెలకొల్పుతామని ప్రకటిస్తే అది సాధ్యం’ అంటూ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఉన్నతాధికారి చెప్పారంటూ ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. అంతేకాదు ఈ రాయితీ ఒక్క టెస్లా కంపెనీకే వర్తించదని.. ఆ రంగం మొత్తానికి వర్తిస్తుందని ఆ అధికారి చెప్పినట్టు ఈటీ వివరించింది. టెస్లా బేరాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లకు సంబంధించి 40 వేల డాలర్లు లోపు ధర ఉంటే 60 శాతం పన్నుని ప్రభుత్వం దిగుమతి సుంకంగా విధిస్తోంది. అంతకు మించి కారు ధర ఉంటే వంద శాతం పన్నుని విధిస్తోంది. ప్రస్తుతం టెస్లా ఎస్ ప్లెయిడ్ కారు ధర మన కరెన్సీలో కోటి రూపాయలలకు పైగానేగా ఉంది. దిగుమతి సుంకం కలిపితే ఈ కారు ధర రెండు కోట్లు దాటుతుంది. దీంతో పన్ను మినహాయింపు కోరుతోంది టెస్లా కంపెనీ. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ అమెరికాకు వెలుపల జర్మనీ, చైనాలో కార్ల తయారీ యూనిట్‌ని ప్రారంభించింది. ఆ యూనిట్లలో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసి అమ్మకాలు సాగించాలనే వ్యూహంతో ఉంది. అందుకే పన్ను రాయితీలు అంటూ బేరాలకు దిగింది. ఇండియాలో కార్ల తయారీ పరిశ్రమ పెడతామంటే పన్ను మినహాయింపు అంశం పరిశీలిస్తామంటూ టెస్లా ఓనర్ ఎలన్ మస్క్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇండియా ఇచ్చింది. దీంతో బాల్ ఎలన్ మస్క్ కోర్టులో పడినట్టయ్యింది. భారత ప్రభుత్వం వదిలిన ఫీలర్కి ఎలన్‌మస్క్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. -
కరోనా వ్యాక్సిన్: స్పుత్నిక్–వి భేష్.. సామర్థ్యం ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్‌లో ఇంకో టీకా అందుబాటులోకి వచ్చేసింది. రష్యాలోని గమలేయా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఇకపై భారత్‌లోనూ తయారుకానుంది. ప్రస్తుతానికి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న టీకాలనే భారత్‌లో వినియోగిస్తున్నాం. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో పోలిస్తే స్పుత్నిక్–వి కొంచెం భిన్నమైన టీకా. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌తో కోవాగ్జిన్ టీకా తయారైతే.. కోవిషీల్డ్‌లో కరోనా వైరస్ కొమ్ములను పోలిన వాటిని వినియోగించారు. ఈ రెండు పద్ధతుల కంటే భిన్నంగా స్పుత్నిక్–వి తయారైంది. రెండు డోసుల ఈ టీకాలో రెండు వేర్వేరు అడినోవైరస్‌లను ఉపయోగించారు. సాధారణ జలుబుకు కారణమైన ఏడీ26, ఏడీ5 వైరస్‌లతో రెండు డోసులు సిద్ధమవుతాయి. తొలిడోసులో ఏడీ26 వైరస్ ఉంటే.. రెండో డోసులో ఏడీ5 వైరస్ ఉంటుంది. ఈ మిశ్రమం వల్ల శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోవాగ్జిన్ విషయంలో రెండు డోసుల మధ్య అంతరం 4 నుంచి 6 వారాలైతే.. కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలు. బ్రిటన్‌లో 8 వారాల గడువు తర్వాతే రెండో డోస్ ఇస్తున్నారు. స్పుత్నిక్–వి విషయానికి వచ్చేసరికి మూడు వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇచ్చేయొచ్చని చెబుతున్నారు. కోవాగ్జిన్ టీకా సామర్థ్యం 83 శాతం ఉంటే.. కోవిషీల్డ్ సామర్థ్యం 70 నుంచి 90 శాతమని అందుబాటులో ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. స్పుత్నిక్–వి సామర్థ్యం 91.6 శాతం అని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. దుష్ప్రభావాలు ఉంటాయా? కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచంలో తొలిసారిగా తయారైన వ్యాక్సిన్‌గా స్పుత్నిక్–వి రికార్డు సృష్టించింది. గతేడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెలు ఇద్దరూ ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని, వారికి తేలికపాటి జ్వరం తప్ప ఎలాంటి దుష్ప్రభావాలు కన్పించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని కచ్చితంగా చెప్పలేం. మానవ ప్రయోగాల సందర్భంగా నమోదు చేసిన వివరాల ప్రకారం స్పుత్నిక్–వి తీసుకున్న వారిలో కొందరికి తలనొప్పి, నిస్సత్తువ, జలుబు టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి లాంటి లక్షణాలు కన్పించాయి. అయితే ఇవన్నీ కొంత కాలంలోనే సర్దుకున్నాయని తెలుస్తోంది. ఇంతకు మించిన తీవ్రమైన దుష్ప్రభావాలేవీ ఇప్పటివరకు నమోదు కాలేదు. -
డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ దాడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ సైబర్ దాడికి గురైంది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిందని కంపెనీ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన కంపెనీ బృందం రంగంలోకి దిగింది. అన్ని డేటా సెంటర్ సర్వీసులను వేరుచేసింది. అలాగే అంతర్జాతీయంగా కొన్ని తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం. ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ఐటీ నెట్వర్క్ సిస్టమ్‌ను సంస్థ సమీక్షిస్తోంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, బ్రెజిల్, రష్యాతోపాటు భారత్‌లోని ప్లాంట్లపై ఈ సైబర్ దాడి ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో రష్యా తయారీ కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్–వి రెండు, మూడవ దశ మానవ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ ఇటీవలే అనుమతి పొందిన నేపథ్యంలో కంపెనీ సర్వర్లపై ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి ప్రభావం లేదు.. సైబర్ అటాక్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని డేటా సెంటర్ సర్వీసులను ఐసోలేట్ చేశామని బీఎస్ఈకి సంస్థ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముకేశ్ రాథి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై పెద్దగా ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఔషధ రంగంలో మార్కెట్ విలువ పరంగా భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ రెండవ స్థానంలో ఉంది. సంస్థ దేశంలో 17 తయారీ ప్లాంట్లు, ఆరు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. విదేశాల్లో ఆరు తయారీ ప్లాంట్లు, మూడు ఆర్అండ్డీ సెంటర్లు ఉన్నాయి. కాగా, గురువారం డాక్టర్ రెడ్డీస్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.46 శాతం (రూ.23.30) తగ్గి రూ.5,023.60 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.4,832.40కి చేరి తిరిగి పుంజుకుంది. సైబర్ సెక్యూరిటీకి కంపెనీల ప్రాధాన్యం: సిస్కో బెంగళూరు: కరోనా వైరస్ పరిణామాలతో వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మళ్లుతున్న నేపథ్యంలో కంపెనీలకు సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సిస్కో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి సమస్యలు ప్రారంభమైనప్పట్నుంచీ సైబర్ దాడులు జరగడం లేదా హెచ్చరికలు వచ్చిన ఉదంతాలు 25 శాతం పైగా పెరిగాయని సుమారు 73 శాతం దేశీ సంస్థలు వెల్లడించాయి. సుమారు మూడింట రెండొంతుల సంస్థలు (65 శాతం) రిమోట్ వర్కింగ్‌కు వీలుగా పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు తీసుకున్నాయి. ఐటీ రంగంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే 3,000 పైచిలుకు సంస్థలపై సిస్కో ఈ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రిమోట్ వర్కింగ్ విధానం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పటిష్టమైన సైబర్‌సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయని, క్లౌడ్ సెక్యూరిటీపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని సిస్కో ఇండియా డైరెక్టర్ రామన్ తెలిపారు. -
పరిశ్రమలు మైనస్‌లోనే..
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలోనూ క్షీణతలోనే కొనసాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ప్రకారం జూలైలో మైనస్ 10.4 క్షీణత నమోదయ్యింది. అంటే 2019 జూలైతో పోల్చితే వృద్ధిలేకపోగా, భారీ క్షీణత నమోదయ్యిందన్నమాట. అయితే జూన్‌తో పోల్చితే ( మైనస్ 15.77 శాతం క్షీణత) జూన్ నెలలో క్షీణ రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కీలక విభాగాలూ నేలచూపే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగం మైనస్ 11.1 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. మైనింగ్: భారీగా 13 శాతం క్షీణతను చవిచూసింది. విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి మైనస్ 2.5 శాతం పడిపోయింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, పెట్టుబడులకు సంబంధించిన ఈ విభాగం భారీగా మైనస్ 22.8 శాతం క్షీణించింది. ► డ్యూరబుల్స్ గూడ్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ల వంటి దీర్ఘకాలం వినియోగ వస్తువులకు సంబంధించి ఈ విభాగంలో క్షీణ రేటు 23.6 శాతంగా నమోదయ్యింది. ► నాన్–డ్యూరబుల్స్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించి ఈ విభాగంలో మాత్రం 6.7 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్ ఉత్పత్తిలో క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా సూచీ గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్‌లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్‌లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది. తాజా సమీక్షా నెల– జూలైలో 118.1కి చేరింది. నాలుగు నెలల్లో... కాగా పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో చూస్తే, 29.2 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి నమోదయ్యింది. పోల్చిచూడ్డం సరికాదు: గణాంకాల శాఖ సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కోవిడ్–19 ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికీ పలు విభాగాలు సరిగా పనిచేయని పరిస్థితులు, గణాంకాలు తగిన విధంగా అందని వాతావరణం ఉందని శుక్రవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా తెలిపింది. మౌలిక రంగం 9.6 శాతం క్షీణత ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం– మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న మౌలిక పరిశ్రమల గ్రూప్ వరుసగా ఐదవ నెల– జూలైలోనూ అసలు వృద్ధిలేకపోగా 9.6 శాతం క్షీణతనే నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎరువులు (6.9 శాతం వృద్ధి రేటు) మినహా మిగిలిన ఏడు రంగాలు– స్టీల్ (–16.5 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–13.9 శాతం), సిమెంట్ (–13.5 శాతం), సహజ వాయువు (–10.2 శాతం), బొగ్గు (–5.7 శాతం), క్రూడ్ ఆయిల్ (–4.9 శాతం), విద్యుత్ (–2.3 శాతం) క్షీణరేటును నమోదుచేసుకున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలాన్ని చూస్తే, ఎనిమిది రంగాల ఉత్పత్తి మైనస్ 20.5 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో ఈ విభాగంలో వృద్ధి రేటు 3.2 శాతం. -
మొబైల్ ఫోన్లు ఇక లోకల్
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ ఫోన్లు, విడిభాగాల తయారీకి దేశ, విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. భారత్‌తోపాటు తైవాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి 22 కంపెనీలు తమ ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిలో శాంసంగ్, లావా, డిక్సన్, మైక్రో మ్యాక్స్, పెడ్జెట్ ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఆపిల్ ఫోన్లను తయారు చేసే కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఫాక్స్‌కాన్, విస్ట్రన్, పెగాట్రాన్ ఉన్నాయి. రూ.11,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను కంపెనీలు సమర్పించాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ తెలిపింది. వచ్చే అయిదేళ్లలో రూ.11 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఈ కంపెనీలు తయారు చేస్తాయని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
శాంసంగ్ గెలాక్సీ సరికొత్త స్మార్ట్ వాచ్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ త్వరలో సరికొత్త స్మార్ట్ వాచ్‌ల(గడియారాలు)తో అలరించనుంది. మేకిన్ ఇండియా స్పూర్తితో నోయిడాలో స్మార్ట్ వాచ్‌ల తయారీని ప్రారంభించింది. ఇటీవలే అత్యాధునిక టెక్నాలజీ(4జీ మోడల్)తో స్మార్ట్‌వాచ్‌ను సామ్సంగ్ విడుదల చేసింది. ఈ వాచ్ ధరను రూ. 28,490 రూపాయలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా జులై 11న మార్కెట్లోకి విడుదలయ్యే స్మార్ట్ వాచ్ (గ్యాలెక్సీ వాచ్ యాక్టివ్2) 4జీ పేరుతో అత్యాధునిక స్మార్ట్ వాచ్ వినియోగదారులను అలరించనుంది. కాగా మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా దేశంలో 18 స్మార్ట్ వాచ్‌ల తయారీని ప్రారంభించినట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌సింగ్ తెలిపారు. అయితే శాంసంగ్ కంపెనీ గాలెక్సీ స్మార్ట్ వాచ్‌లను మూడు రకాలైన సైజులు(42ఎమ్ఎం, 44ఎమ్ఎం, 46ఎమ్‌ఎంలతో కస్టమర్లకు అందించనుంది). మరోవైపు దేశంలో తయారు కానున్న 18స్మార్ట్ వాచ్‌ల ధర(రూ.19, 990 నుంచి రూ. 35,990)గా శాంసంగ్ నిర్ణయించింది. అయితే జులై 11న విడుదల కానున్న శాంసంగ్ సరికొత్త స్మార్ట్ వాచ్‌లో ఇ సిమ్ కనెక్టివిటీతో వినియోగదారులకు కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ తదితర అత్యాధునిక సేవలను స్మార్ట్ వాచ్ అందించనుంది. (చదవండి: గెలాక్సీ నోట్ 10 లైట్ ధర తగ్గింది : క్యాష్‌బ్యాక్ కూడా) -
వాహనాల తయారీకి వైరస్ బ్రేక్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) గురుగ్రామ్, మానెసర్‌లోని (హరియాణా) తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి. అటు రోహ్తక్లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. షట్‌డౌన్ ఎన్నాళ్ల పాటు ఉంటుందనేది ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుందని వివరించింది. అటు హోండా కార్స్ ఈ నెలాఖరు దాకా తమ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తప్పనిసరి సర్వీసుల విభాగాల సిబ్బంది మినహా మిగతా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని హెచ్‌సీఐఎల్ ప్రెసిడెంట్ గకు నకానిషి తెలిపారు. మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మహారాష్ట్రలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాగ్‌పూర్ ప్లాంట్‌లో ఇప్పటికే ఆపివేశామని, చకన్ (పుణే), కాండివిలి (ముంబై) ప్లాంట్లలో సోమవారం నుంచి నిలిపివేస్తామని పేర్కొంది. అటు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సైతం తమ ప్లాంట్‌లో ఈ నెలాఖరుదాకా ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎంజీ మోటార్ ఇండియా సంస్థ గుజరాత్‌లోని హలోల్ ప్లాంటును మార్చి 25 దాకా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇతర దేశాల్లోనూ..: హీరో మోటోకార్ప్ ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌తో పాటు కొలంబియా, బంగ్లాదేశ్ తదితర విదేశీ ప్లాంట్లలో కూడా కార్యకలాపాలు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ వెల్లడించింది. మార్చి 31 దాకా ఇది అమలవుతుందని పేర్కొంది. జైపూర్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సహా ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు నివాసాల నుంచే విధులు నిర్వర్తిస్తారని వివరించింది. అత్యవసర సర్వీసుల సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు హాజరవుతారని పేర్కొంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత్‌లోని మొత్తం నాలుగు ప్లాంట్లలోనూ కార్యకలాపాలు తక్షణమే నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా ఫండ్... మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొద్ది వారాల పాటు లాక్డౌన్ చేయాలంటూ ప్రతిపాదించారు. పెద్ద ఎత్తున తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఆర్మీకి తమ గ్రూప్ ప్రాజెక్ట్ టీమ్ పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమని చెప్పారు. ‘మా మహీంద్రా హాలిడేస్ సంస్థ తరఫున రిసార్ట్‌లను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చి, సేవలు అందించేందుకు కూడా సిద్ధం‘ అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్నందున.. తమ ప్లాంట్లలో వాటి తయారీపై తక్షణం కసరత్తు ప్రారంభించామని తెలిపారు. అత్యంత ప్రతికూల ప్రభావాలెదుర్కొనే చిన్న వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి పొందేవారికి తోడ్పాటు అందించేందుకు మహీంద్రా ఫౌండేషన్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుందని మహీంద్రా చెప్పారు. తన పూర్తి వేతనాన్ని ఫండ్‌కు విరాళమిస్తున్నట్లు.. ఇతర ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళమివ్వొచ్చన్నారు. -
తయారీ యూనిట్లపై జీసీసీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వ్యాపార వృద్ధిలో భాగంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) తయారీ యూనిట్ల ఏర్పాటువైపు దృష్టి సారించింది. గిరి తేనె, సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూల తయారీతో బహిరంగ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన జీసీసీ.. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తుల వైపు దృష్టి పెట్టింది. జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలతో తయారుచేసిన సహజసిద్ధమైన స్వీట్లు, స్నాక్స్, వంటకాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ దిగుబడులకు ధరలు సైతం అధికంగా ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ యంత్రాంగం ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన రైతాంగాన్ని వీటి సాగుకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన పంట దిగుబడులను ప్రాసెసింగ్ చేసి వాటి ద్వారా ఆహార పదార్థాల తయారీకి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 25 యూనిట్ల ఏర్పాటు.. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో జీసీసీకి తేనె పరిశ్రమలు ఉన్నాయి. ఏటూరు నాగారం పరిధిలో సబ్బులు, షాంపూల తయారీ యూనిట్లున్నాయి. వీటితోపాటు నగరంలోని కొన్ని పరిశ్రమలను లీజు రూపంలో తీసుకుని అక్కడ వివిధ రకాల సబ్బులు, షాంపూలు తయారు చేసి మార్కెట్లోకి తెస్తున్నారు. ప్రస్తుత ప్రొడక్షన్ బహిరంగ మార్కెట్లో కంటే సం క్షేమ వసతి గృహాలు, గురుకులాలకే సరిపోతోంది. డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయాలనే ఉద్దేశంతో జీసీసీ కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక్కో యూనిట్‌ను గరిష్టంగా రూ.40 లక్షలతో ప్రారంభించాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మూడు ఐటీడీఏల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో వీటిని ఏర్పాటు చేస్తారు. పంట దిగుబడులను బట్టి యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు రూ.10 కోట్లతో తయారీ యూనిట్లను నెలకొల్పాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును సమర్పిస్తే కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి 60 శాతం గ్రాంటు రానుం దని అధికారులు భావిస్తున్నారు. మిగతా 30 శాతం బ్యాంకు రుణం ద్వారా, మరో పది శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే ఈ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.