న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్స్ రంగంలో ఉన్న తైవాన్ కంపెనీ ఎంఎస్‌ఐ తాజాగా భారత్‌లో తయారీ కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. చెన్నైలో కంపెనీకి ప్లాంటు ఉంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఎంఎస్‌ఐ స్థానికంగా తయారైన రెండు ల్యాప్‌టాప్ మోడల్స్‌ను పరిచయం చేస్తోంది. వీటిలో మోడర్న్ 14, థిన్ 15 ఉన్నాయి. థిన్ 15 ధర రూ.73,990, మోడర్న్ 14 రూ.52,990 నుంచి ప్రారంభం.
‘సంస్థకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటిగా మారింది. బ్రాండ్ స్థిరంగా దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తరిస్తోంది. అధిక పనితీరు గల ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్థానికంగా తయారైన పరికరాలను అందించడం ద్వారా.. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు సహకరించడానికి కంపెనీ ఉత్సాహంగా ఉంది. భారత్‌లో ఉత్పత్తుల లభ్యతను మెరుగుపరచడానికి మరిన్ని ల్యాప్‌టాప్ బ్రాండ్ స్టోర్లు, క్రోమా, రిలయన్స్ రిటైల్ సహా టచ్‌పాయింట్స్ సంఖ్యను పెంచుతున్నాం’ అని ఎంఎస్‌ఐ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment