laptop
-
‘సెల్’.. కిల్ యూ
సాక్షి, అమరావతి: ఇది డిజిటల్ యుగం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ సెల్ ఫోన్, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తోనే పని. చదువులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వస్తువులు కొనడానికైనా అన్నిటికీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లే ముఖ్య సాధనాలైపోయాయి. అయితే వీటి వినియోగం మితిమీరి వాటికి బానిసలుగా మారిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటి అతి వినియోగం మనిషి మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అతి వినియోగాన్ని నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలి.. సంతోషంగా జీవించాలి.. అని దేవుడిని ప్రార్థిస్తూ చాలా మంది ఉపవాసం పాటిస్తుంటారు. అదేవిధంగా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగాన్ని కొన్ని గంటలు, రోజులు వదిలేసి డిజిటల్ డిటాక్స్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. డిజిటల్ డిటాక్స్ విధానంతో మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడుతుందని, శారీరక ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కెనడాలోని ఆల్బెర్టా విశ్వవిద్యాలయం డిజిటల్ డిటాక్స్పై అధ్యయనం చేయగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ను అతిగా వినియోగించే 467 మందిని ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరికి రెండు వారాల పాటు సెల్‌ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా చేశారు. డిజిటల్ డిటాక్స్‌కు ముందు, ఆ తర్వాత వారి మానసిక ఆరోగ్యం, శ్రద్ధ, సామర్థ్యాలను అంచనా వేశారు. 91 శాతం మందిలో డిటాక్స్ అనంతరం మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు తగ్గినట్టు వెల్లడైంది. మొబైల్, ఇంటర్నెట్ యాక్సెస్ లేని వ్యక్తులు ముఖాముఖి సంభాషణలు, వ్యాయామం, చదవడం వంటి బహిరంగ కార్యకలాపాలను ఆస్వాదించడంలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియలు మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.మెదడుకు రీచార్జ్భారతీయులు సగటున రోజుకు 7.3 గంటలు స్క్రీన్ చూడటానికి కేటాయిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గంటల తరబడి స్క్రీన్కు సమయాన్ని కేటాయించడంతో నిద్ర లేమి, ఒత్తిడి, ఆందోళన, నిరాశ తలెత్తడంతో పాటు, ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ చక్రాన్ని డిజిటల్ డిటాక్స్ విచ్ఛిన్నం చేస్తుంది. మెదడుకు విశ్రాంతి లభించి, రీఛార్జ్ అవుతుంది. స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతి (బ్లూ లైట్) దుష్ప్రభావాలు తగ్గిపోయి కంటికి మంచి నిద్ర దొరుకుతుంది. ఇంట్లో భార్యాభర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతో ముఖాముఖి చర్చించుకొనే అవకాశం లభిస్తుంది. తద్వారా మనుషుల మధ్య బంధాలు బలపడి, మనస్పర్థలు తగ్గుతాయని మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు.డీటాక్స్ సమయంలో రన్నింగ్, జాగింగ్, జిమ్‌లో వ్యాయామాలు చేయడం, ఇంటి, తోట పనులు వంటి శ్రమకు కేటాయించడంతో బీపీ, షుగర్ వంటి జీవన శైలి జబ్బుల ప్రమాదం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. -
హెచ్‌పీ సీఈఎస్‌లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు
టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. టెక్ యుగంలో ల్యాప్‌టాప్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో సేవలందిస్తున్న హెచ్‌పీ(HP) కంపెనీ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)-2025లో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇవి కృత్రిమమేధ సాయంతో పని చేస్తాయని కంపెనీ తెలిపింది. దాంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది. 2025వ సంవత్సరానికిగాను సీఈఎస్ లాస్‌వెగాస్‌లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది.హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా జీ1ఐ: ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్‌తో 48 టాప్స్ ఎన్పీయూ టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేసే ఏఐ బిజినెస్ నోట్ బుక్ అని కంపెనీ తెలిపింది.హెచ్‌పీ జెడ్ బుక్ అల్ట్రా జీ 1ఎ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 14 అంగుళాల ల్యాప్‌టాప్ ఇది. ఏంఎడీ ప్రాసెసర్‌తో వచ్చే ఈ డివైజ్‌తో హై-పెర్ఫార్మెన్స్ వర్క్ ఫ్లోలకు ఎంతో సమర్థంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది.హెచ్‌పీ జెడ్2 మినీ జీ1ఏ: ఏఎండీ రైజెన్ ఏఐ మ్యాక్స్ ప్రో ప్రాసెసర్లు, 6-కోర్/12-థ్రెడ్ నుంచి 16-కోర్/32-థ్రెడ్ కాన్ఫిగరేషన్లతో దీన్ని ఆవిష్కరించారు. ఏఎండీ రేడియన్ 8060ఎస్, 8050ఎస్, 8040ఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయం ఉండేలా దీన్ని తయారు చేశారు.ఇదీ చదవండి: మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!హెచ్‌పీ జెడ్ క్యాప్టిస్: మెటీరియల్స్ డిజిటలైజ్ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి దీన్ని రూపొందించారు. ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మెటీరియల్ క్యాప్చర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇది ఎన్వీడియోకు చెందిన జెట్సన్ ఏజీఎక్స్ జేవియర్ మాడ్యూల్, ఫోటోమెట్రిక్ కంప్యూటర్ విజన్ సిస్టమ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.హెచ్‌పీ థండర్ బోల్ట్ 4 అల్ట్రా జీ6 డాక్: ఇది డాకింగ్ స్టేషన్‌గా పని చేస్తుంది. రెండు వెర్షన్లలో ఒకటి 180 వాట్లు, మరొకటి 280 వాట్ల శక్తిని అందిస్తుంది. -
భారత్‌లో ఎంఎస్ఐ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: ల్యాప్టాప్స్ రంగంలో ఉన్న తైవాన్ కంపెనీ ఎంఎస్ఐ తాజాగా భారత్‌లో తయారీ కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. చెన్నైలో కంపెనీకి ప్లాంటు ఉంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఎంఎస్ఐ స్థానికంగా తయారైన రెండు ల్యాప్‌టాప్ మోడల్స్‌ను పరిచయం చేస్తోంది. వీటిలో మోడర్న్ 14, థిన్ 15 ఉన్నాయి. థిన్ 15 ధర రూ.73,990, మోడర్న్ 14 రూ.52,990 నుంచి ప్రారంభం. ‘సంస్థకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటిగా మారింది. బ్రాండ్ స్థిరంగా దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తరిస్తోంది. అధిక పనితీరు గల ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్థానికంగా తయారైన పరికరాలను అందించడం ద్వారా.. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు సహకరించడానికి కంపెనీ ఉత్సాహంగా ఉంది. భారత్‌లో ఉత్పత్తుల లభ్యతను మెరుగుపరచడానికి మరిన్ని ల్యాప్‌టాప్ బ్రాండ్ స్టోర్లు, క్రోమా, రిలయన్స్ రిటైల్ సహా టచ్‌పాయింట్స్ సంఖ్యను పెంచుతున్నాం’ అని ఎంఎస్ఐ వివరించింది. -
భారత్‌లో హెచ్‌పీ ఏఐ ల్యాప్‌టాప్ లాంచ్: ఇదిగో వివరాలు
హెచ్‌పీ భారతదేశంలో తన మొదటి 2 ఇన్ 1 ఏఐ బేస్డ్ 'ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్' అనే కొత్త ల్యాప్‌టాప్ లాంచ్ చేసింది. ఇది ఇంటెల్ లూనార్ లేక ప్రాసెసర్ కోర్ అల్ట్రా సిరీస్ 2 పొందుతుంది. ఈ ప్రాసెసర్లు ఆన్-డివైస్ ఏఐ వర్క్‌లోడ్‌ల కోసం డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని కలిగి ఉంటాయి. క్వాలిటీ వీడియోలను ఆస్వాదించడానికి అనుమతించే.. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది.హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 7 ప్రారంభ ధర రూ.1,81,999. ఇది ఎక్లిప్స్ గ్రే, అట్మాస్ఫియరిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది భారతదేశంలో కంపెనీ ఆఫ్‌లైన్ స్టోర్లలో మాత్రమే కాకుండా.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 9 కూడా రూ.1,91,999 వద్ద అందుబాటులో ఉంది. ఇది అట్మాస్ఫియరిక్ బ్లూ కలర్లో మాత్రమే లభిస్తుంది.హెచ్‌పీ లాంచ్ చేసిన ఈ కొత్త ల్యాప్‌టాప్‌లను ఈ నెల చివరి (అక్టోబర్ 31) లోపల కొనుగోలు చేస్తే రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్, ప్రైమరీ ఎలిమెంట్స్ వంటి వాటిని ఉచితంగా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు బజాజ్ ఫైనాన్స్‌తో నో కాస్ట్ ఈఎమ్ఐ కింద కూడా కొనుగోలు చేయవచ్చు.హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 ఇంచెస్ 2.8కే ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. మెరుగైన వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం హాప్టిక్ టచ్‌ప్యాడ్, 9 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 32 జీబీ ర్యామ్, 64 వాట్స్ బ్యాటరీ (21 గంటలు) పొందుతుంది. ఇది వైఫై, బ్లూటూత్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది.కొత్త హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ ల్యాప్‌టాప్‌లో డేటా రక్షణ, సైబర్ సెక్యూరిటీ వంటి వాటి కోసం ఫిజికల్ సెక్యూరిటీ చిప్ ఉన్నాయి. డీప్‌ఫేక్ డిటెక్టర్ కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ డేటాను రక్షించడానికి, ఇతరులు హ్యాక్ చేయకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. -
జత్వానీ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపండి
సాక్షి, అమరావతి: తన ఫిర్యాదు ఆధారంగా సినీ నటి జత్వానీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె నుంచి స్వాదీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఐపాడ్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపి పూర్తి స్థాయిలో విశ్లేíÙంచి, సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో మంగళవారం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఇప్పుడు అంత సమయం లేనందున విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. అప్పటివరకు జత్వానీ ఫోన్లు, ఉపకరణాల్లో డేటా భద్రపరచాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం ఉత్తర్వులిచ్చారు. విద్యాసాగర్ తరఫున టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జత్వానీ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకిచ్చేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారని తెలిపారు. వాటిలో చాలా కీలక సమాచారం ఉన్నందున ఎఫ్ఎస్ఎల్కు పంపి పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయించి, ఆ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి ఈ అనుబంధ పిటిషన్‌ను వ్యతిరేకించారు. వాటిలోని డేటాను భద్రపరచాలని హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిందన్నారు. అనుబంధ పిటిషన్ ద్వారా ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతున్నారని తెలిపారు.రిమాండ్‌పై పిటిషన్ విచారణ కూడా 16కి వాయిదా జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనను రిమాండ్‌కు పంపుతూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తదుపరి విచారణను జస్టిస్ జ్యోతిర్మయి ఈ నెల 16కి వాయిదా వేశారు. విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని కోర్టును పట్టుపట్టవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను 16 వరకు పొడిగించారు. కాంతిరాణా, గున్నీ పిటిషన్లపై విచారణ వాయిదా సినీ నటి కాదంబరీ జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పోలీసు అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ, హనుమంతరావు, సత్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 3కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లుకు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఆయనపై ఈ నెల 3వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
భారీగా పెరిగిన ల్యాప్‌టాప్‌ల దిగుమతి
న్యూఢిల్లీ: దిగుమతి నిర్వహణ వ్యవస్థను అనుసరించి అనుమతి పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 4 బిలియన్ డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, ఇతర ఐటీ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 2023–24లో ఈ దిగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు. వీటిలో అత్యధికం చైనా నుంచి భారత్‌కు వస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.2023 అక్టోబర్‌లో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల కోసం ప్రభుత్వం దిగుమతి నిర్వహణ/అధికారీకరణను రూపొందించింది. మార్కెట్ సరఫరా దెబ్బతినకుండా దేశంలోకి ఈ వస్తువుల రాకను పర్యవేక్షించడం ఈ వ్యవస్థ లక్ష్యం. దీని ప్రకారం దరఖాస్తు చేసుకుని పొందిన అనుమతులు 2024 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి.10 బిలియన్ డాలర్లకుపైగా.. నూతన వ్యవస్థ అమలులోకి వచ్చిన తొలిరోజు 2023 నవంబర్ 1న 100కుపైగా దరఖాస్తులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో యాపిల్, డెల్, లెనోవో వంటి సంస్థలు ఉన్నాయి. 10 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఉత్పత్తుల కోసం ఇవి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.ఈ ఏడాది సెప్టెంబర్ 30 తర్వాత తదుపరి ఉత్తర్వుల కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలను పాటిస్తుందని అధికారి తెలిపారు. 2022–23లో భారత్‌కు 5.33 బిలియన్ డాలర్ల విలువైన పర్సనల్ కంప్యూటర్లు దిగుమతి అయ్యాయి. ఇందులో చైనా వాటా ఏకంగా 5.11 బిలియన్ డాలర్లు ఉంది. సింగపూర్, హాంగ్‌కాంగ్, యూఎస్, మలేషియా, తైవాన్, నెదర్లాండ్స్, వియత్నాం సైతం ఐటీ ఉత్పత్తులను భారత్‌కు సరఫరా చేస్తున్నాయి. -
యాపిల్ కంప్యూటర్ దశాబ్దాల చరిత్ర - విస్తుపోయే ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
ల్యాప్‌టాప్ అనుకుంటే బండరాయి వచ్చింది!
అనంతపురం ఎడ్యుకేషన్: కొరియర్లో ల్యాప్‌టాప్ వచ్చిందనుకుంటే బండరాయి కనిపించిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల సమగ్ర శిక్ష డీపీసీ, ఏపీసీలకు హెచ్‌పీ కంపెనీ 12 జనరేషన్, 16 జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీ, స్క్రీన్ విండోస్ 11 ప్రో, ఎంఎస్ ఆఫీస్ అడాప్టర్ క్యారీ కేస్ సామర్థ్యం కల్గిన ల్యాప్టాప్స్ కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన కంప్యూటర్ ఇండియా అనే సంస్థ ఈ ల్యాప్‌టాప్స్‌ను సరఫరా చేసింది. మే 31న జిల్లాకు వచ్చాయి. డీపీసీగా ఉన్న డీఈఓ తనకు అందిన ప్యాకింగ్ ఓపెన్ చేయగా, ల్యాప్‌టాప్ ఉంది. ఈ క్రమంలోనే జిల్లాకు పంపిన రెండు ల్యాప్‌టాప్‌ల్లో ఒకదానిని అందుకున్నట్లు సమాచారం పంపారని, రెండో దాని వివరాలు పంపాలంటూ బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సమగ్ర శిక్ష ఏపీసీకి వచ్చిన పార్శిల్‌ను ఓపెన్ చేయగా.. అందులో బండరాయి దర్శనం ఇచ్చింది. ఆ రాయికే కవర్లు కప్పి ఉంది. అందులోనూ దాదాపు ల్యాప్‌టాప్ బరువు ఏ మేర ఉంటుందో అంతేస్థాయి బరువున్న రాయి ఉంచారు. అయితే, ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర కార్యాలయ అధికారుల దృష్టికి స్థానిక సిబ్బంది తీసుకెళ్లారు. ల్యాప్‌టాప్ పార్శిల్ కవరుపై ఉన్న కంప్యూటర్ ఇండియా సంస్థ ఫోన్ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
‘తప్పు చేశాం.. మళ్లీ చేస్తాం..10వేల డాలర్లు ఇస్తాం..’
భారత కస్టమర్ పేరును వక్రీకరిస్తూ కెనడాకు చెందిన ‘డీబ్రాండ్’ కంపెనీ చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో చేసేదేమిలేక కంపెనీ క్షమాపణలు చెబుతూ గుడ్‌విల్ కింద 10వేల డాలర్లను ఆఫర్ చేసింది. ఇకనుంచి కస్టమర్లపై జోకులు వేసేముందు మరింత జాగ్రత్తగా ఉంటామని చెప్పడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. భువన్ చిత్రాంశ్ అనే భారత వ్యక్తి ఇటీవల కెనడాకు చెందిన డీబ్రాండ్ అనే ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ కంపెనీ నుంచి యాపిల్ మ్యాక్‌బుక్ స్క్రీన్‌పై భాగంలో ఉండే కవర్‌ను కొనుగోలు చేశారు. రెండు నెలలు అవ్వకముందే ఆ కవర్ రంగు వెలిసిపోయింది. దాంతో ‘ఎక్స్’ వేదికగా కంపెనీ అధికారిక అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ తన సమస్య తెలిసేలా ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై డీబ్రాండ్ విచిత్రంగా స్పందించింది. అతడి పేరు చిత్రాంశ్.. అయితే ‘షిట్ రాష్’ అని విపరీతార్థం వచ్చేలా రాసింది. అతడి పేరులోని అక్షరాలను అలా మార్చి రాయడంపట్ల నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. భారతీయుడి పేరుపై వెటకారపు వ్యాఖ్యలు చేయడం తగదంటూ తీవ్రంగా స్పందించారు. చిత్రాంశ్ కంపెనీ ట్వీట్‌కు ప్రతిస్పందనగా భారత్ కస్టమర్లపై కొన్ని రాసిస్ట్ కంపెనీల దృక్పథం ఎలా ఉందో తెలిసిపోయిందని తెలియజేస్తూ పీఎం మోదీ, కామర్స్ మినిస్టర్ పీయుష్గోయల్ అకౌంట్‌ను ట్యాగ్ చేశాడు. ఇదీ చదవండి: కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా.. దాంతో కంపెనీ స్పందించి కస్టమర్ పేరును వక్రీకరించామని అంగీకరించింది. దీన్ని అతిపెద్ద తప్పిదంగా భావిస్తూ క్షమాపణ కోరింది. గుడ్‌విల్ కింద 10,000 డాలర్లు చిత్రాంశ్కు ఆఫర్ చేసింది. అయితే, ఇలా కస్టమర్లతో సరదాగా జోకులు వేయడం దాదాపు దశాబ్దకాలంగా చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇలా యూజర్లపై సరదాగా జోకులు వేయడం మాత్రం ఆపబోమని చెప్పింది. అంతటితో ఆగకుండా తర్వాత 10,000 డాలర్లను అందుకోబోయేది మీలో ఒకరు కావచ్చంటూ ట్వీట్ చేసింది. Well that escalated quickly. 1. Yes - we made fun of a guy's name. It was a huge fumble. 2. We apologized to him directly and offered him $10,000 as a gesture of goodwill. 3. We've been poking fun at customers on social media for over a decade now. We're not going to stop, but… — dbrand (@dbrand) April 10, 2024 -
కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చాలామార్పులు వస్తున్నాయి. ప్రధానంగా యూత్ ఎక్కువగా వినియోగించే ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం పెంచేందుకు కంపెనీలు చాలా మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా పనిచేయడం అనివార్యమైంది. దాంతో ఉద్యోగస్థులు, స్టూడెంట్లు ఇలాంటి వాటిపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి అవసరాలు దృష్టిలో ఉంచుకొని ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలు వాటి వేగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ల్యాప్‌టాప్‌లు మరింత వేగంగా, సమర్థంగా పనిచేయడానికి వాటిలో కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లనూ జోడిస్తున్నారు. అయితే అలా ఇంప్లిమెంట్ చేస్తున్న ఏఐల వర్క్‌లోడ్ ఒక్కోసారి అధికమై ప్రాసెసర్లపై భారం పడుతుంది. దాన్ని తగ్గించేందుకు కంపెనీలు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. ల్యాప్‌టాప్‌ల్లో ఏఐ వర్క్‌లోడ్స్ సాఫీగా, అంతరాయం లేకుండా పనిచేయటానికి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్పీయూ) అమర్చుతున్నారు. సీపీయూ, జీపీయూతోపాటు ఎన్పీయూ సైతం వీటిలో వాడుతున్నారు. దాంతో ఎన్పీయూ ఉన్న ల్యాప్‌టాప్‌లు హైబ్రిడ్ వర్క్‌కల్చర్‌కు తగ్గట్టుగా వేగంగా, సమర్థంగా పనిచేస్తాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ హెచ్‌పీ ఎన్పీయూ ఫీచర్ ఉన్న ఏఐ ఆధారిత గేమింగ్ ల్యాప్‌టాప్ ఒమెన్ ట్రాన్సెండ్ 14, ఎన్వీఎక్స్ 360 14 మోడల్‌ను విడుదల చేసింది. ఇవి వేగంగా, సమర్థంగా పనిచేస్తూ వినియోగదారుల అవసరాలను తీరుస్తాయని హెచ్‌పీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఇప్సితా దాస్‌గుప్తా చెప్పారు. హెచ్పీతోపాటు మరిన్ని కంపెనీలు ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేశాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ ఇంటెల్ కోర్ ఆల్ట్రా 9 ప్రాసెసర్ 14 అంగుళాల డిస్ప్లే 11.5 గంటల బ్యాటరీ బ్యాకప్ 1.637 కేజీల బరువు ఎన్వీడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 4060 గ్రాఫిక్కార్డు ప్రారంభ ధర అంచనా: రూ.1,74,999 హెచ్‌పీ ఎన్వీఎక్స్ 360 14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్6 గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 4 జీబీ ప్రాసెసర్: ఇంటెల్ i7 ప్రాసెసర్ జనరేషన్: 13వ తరం ఎస్ఎస్డీ: 1 టీబీ ర్యామ్: 16 జీబీ గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 3050 ప్రారంభ ధర అంచనా: రూ.99,999 ఎంఎస్ఐ ప్రెస్టీజ్ 16 ఏఐ ఈవో బీ1ఎం ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ స్క్రీన్: 16 అంగుళాలు ప్రాసెసర్: ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ఇందులో ఎన్పీయూ, ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయాలు ఉన్నాయి. బరువు: 1.5 కిలోలు. ధర సుమారు: 1,19,990 ఆసుస్ ఆర్ఓజీ జెఫిరస్ G14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్6 గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 12 GB ప్రాసెసర్: AMD రైజెన్ 9 ఆక్టా కోర్ ఎస్ఎస్డీ: 1 టీబీ ర్యామ్: 32 GB DDR5 గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 4080 ధర సుమారు: 2,49,990 ఇదీ చదవండి: ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు ఆసుస్ జెన్‌బుక్ 14 ఓలెడ్ ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i7 ఎస్ఎస్డీ: 512 GB ర్యామ్: 16 జీబీ LPDDR5 గ్రాఫిక్ ప్రాసెసర్: ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరిస్ X గ్రాఫిక్స్ ధర సుమారు: రూ.99,990 -
ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ప్రముఖ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్ తయారీదారు హెచ్‌పీ క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో ఇండియన్ యూజర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ గేమింగ్ లవర్స్ కోసం చవకైన గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకురావడంపై దృష్టి సారించింది. తక్కువ ధరలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ల్యాప్టాప్స్ దొరకడం లేదు. దీనివల్ల బడ్జెట్ గేమింగ్ లవర్స్ నిరాశ పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హెచ్‌పీ భారీ డిస్కౌంట్లతో గేమింగ్ ల్యాప్‌టాప్స్‌తోపాటు ఇతర ఉపకరణాలను ఇండియన్ మార్కెట్‌కి తీసుకొస్తుంది. ‘లూట్ డ్రాప్ సేల్’ పేరుతో హెచ్‌పీ కంపెనీ ఒమెన్, విక్టస్ ల్యాప్‌టాప్‌లు, హెడ్సెట్లు, మైక్రోఫోన్లు, కీబోర్డ్, మౌస్, మౌస్ ప్యాడ్ వంటి గేమింగ్ ఉపకరణాలపై తగ్గింపులను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు అన్ని హెచ్‌పీ స్టోర్లు, హెచ్‌పీ ఆన్లైన్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో మార్చి 3 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. హెచ్‌పీ ఒమెన్ 16 ల్యాప్‌టాప్‌లపై గరిష్టంగా 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ.1,75,930 విలువైన 14వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్‌టాప్ ఇప్పుడు రూ. 1,49,999కే లభిస్తుంది. 13వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్‌టాప్ రూ.1,32,645 బదులుగా రూ.1,12,999 వస్తుంది. ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు ఊడనున్నాయా..? ఒమెన్ 16 ల్యాప్‌టాప్ కొనుగోలుపై ప్రముఖ బ్యాంకులతో రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందే సౌకర్యం కూడా ఉంది. హెచ్‌పీ మౌస్, మౌస్ ప్యాడ్, హెడ్‌సెట్‌తో సహా హైపర్ ఎక్స్ కొనుగోలుపై రూ.2,999 తగ్గిస్తున్నారు. హైపర్ ఎక్స్ క్లచ్ గేమ్ కంట్రోలర్‌పై రూ.999 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
పేద విద్యార్థులు, దాతల మధ్య వారధిగా రాజ్‌భవన్
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్ లను బహూకరించేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ‘డొనేట్ ఏ డివైస్’కార్యక్రమంలో భాగంగా అక్షయవిద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్‌భవన్‌లో వంద మంది పేద విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లను గవర్నర్ బహూక రించారు. పేద విద్యార్థులు, దాతల మధ్య వారధి గా రాజ్‌భవన్ పనిచేస్తుందని గవర్నర్ అన్నారు. అయోధ్య రామాలయ పాదుకలకు పూజలు అయోధ్య రామాలయం కోసం చల్లా శ్రీనివాసశాస్త్రి రూపొందించిన స్వర్ణ పాదుకలకు గవర్నర్ తమి ళిసై మంగళవారం రాజ్‌భవన్‌లో పూజలు నిర్వహించారు. గర్భగుడిలో ఈ పాదుకలు నిత్యం కోట్లాది మంది భక్తుల పూజలను అందుకోనున్నాయని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసశాస్త్రిని ప్రత్యేకంగా అభినందించారు. నరసింహన్ భేటీ: రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం రాజ్‌భవన్‌లో గవ ర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. -
110 సంస్థలకు అనుమతులు..
-
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక!
క్యాలెండర్లో పేజీ ఎప్పుడు మారుతుందా? ఆశగా ఎదురుచూస్తాడు మధ్యతరగతి వ్యక్తి. నెలంతా కష్టపడి పనిచేసినందుకు గానూ ప్రతిఫలం దక్కేది ఆరోజే కాబట్టి. తీరా జీతం వచ్చాక ఖర్చైపోయిందంటూ నిట్టూరుస్తూ యథావిధిగా తన పనిలో నిమగ్నమైపోతాడు. అయితే, ప్రతి నెలా చోటుచేసుకునే కొన్ని మార్పులు మన జేబుపై ప్రభావం చూపేవి అయితే.. మరికొన్ని ఊరట కల్పిస్తాయి. అలా నవంబర్ 1 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. దీపావళికి ముందే వచ్చే కొన్ని మార్పులు సామాన్యుడికి తీపిని పంచేనా..? చేదు గుళికను అందిస్తాయా? చూసేయండి. గ్యాస్ ధరలు : చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) ధరల పెంపు, తగ్గుదలపై ప్రకటన చేస్తాయి. ఈ-చలాన్ : నేషనల్ ఇన్ఫ్రమెటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ప్రకారం.. వ్యాపార లావాదేవీల విలువ రూ.100 కోట్లుంటే తప్పని సరిగా ఈ-పోర్టల్‌లో రానున్న 30 రోజుల్లోపు జీఎస్టీ చలాన్‌ను అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ల్యాప్‌ట్యాప్‌లపై ఆంక్షలు : ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఆయా సంస్థలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే 7 రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆంక్షలు విధించింది. హెచ్ఎస్ఎన్ 8741 విభాగం కింద ల్యాప్‌ట్యాప్, పర్సనల్ కంప్యూటర్, ట్యాబ్లెట్స్లు ఉన్నాయి. కేంద్రం విధించిన ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పైన పేర్కొన్న 7 రకాల ఉత్పత్తులపై వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నవారికే పరిమిత సంఖ్యలో దిగుమతులు ఉంటాయని పేర్కొంది ల్యాప్స్డ్ ఎల్ఐసీ పాలసీలు : ఎల్ఐసీ 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి విలువైన పాలసీదార్ల కోసం నిలిచిపోయిన (ల్యాప్స్డ్) పాలసీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎవరైతే ఏళ్ల కేళ్లు ప్రీమియం చెల్లించకుండా వదిలేస్తారో.. వాళ్లు ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాన్ని అక్టోబర్ 31వరకు కల్పిచ్చింది. ఆ గడువు నేటితో ముగియనున్న తరుణంలో ఖాతా దారులు తమ పాలసీలను పునరుద్ధరించుకోవాలని ఎల్ఐసీ అధికారులు చెబుతున్నారు. లావాదేవీలపై అదనపు ఛార్జీలు: అక్టోబర్ 20న బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది.స్టాక్ మార్కెట్లోని ఈక్విటీ డెరివేటివ్‌లపై నిర్వహించే లావాదేవీలపై విధించే ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. -
గాదె ఇన్నయ్య అరెస్టు
జఫర్‌గఢ్: టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదె ఇన్నయ్య అరెస్టు కలకలం రేపింది. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామానికి చెందిన ‘మా ఇల్లు ప్రజాదరణ అనాథాశ్రమం’వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్యను బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, అనాథాశ్రమ పిల్లలు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల నుంచి గాదె ఇన్నయ్య ‘భారత్ బచావో’కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్టు కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇన్నయ్యను అరెస్టు చేసింది రాష్ట్ర పోలీసులా? కేంద్ర దర్యాప్తు సంస్థలా అన్నది తెలియాల్సి ఉంది. ఇన్నయ్య విద్యార్థి దశలోనే రాడికల్ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో కలిసి హైదరాబాద్‌లోని జలదృశ్యం కార్యాలయంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ను స్థాపించారు. ఆ తరువాత కేసీఆర్‌తో ఏర్పడిన విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇన్నయ్య.. తెలంగాణ రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమం కొనసాగించారు. ఈ క్రమంలో మళ్లీ జైలుకు వెళ్లారు. విడుదలైన అనంతరం జఫర్‌గఢ్ మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద 2006 మే 28న ‘మా ఇల్లు అనాథ అశ్రమం’నెలకొల్పారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘భారత్ బచావో’కార్యక్రమాన్ని చేపడుతున్న ఇన్నయ్యను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నివాసముంటున్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. -
ఆంటీ ల్యాప్‌టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి!
ఆంటీ తనకు ల్యాప్‌టాప్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక చిట్టి తల్లి తానే స్వయంగా ల్యాప్‌టాప్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఉదంతాన్ని నేహా అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిన్నారి కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన ‘హ్యాండ్‌మేడ్’ ల్యాప్‌టాప్ ఫొటోను నేహా షేర్ చేశారు. నేహా క్యాప్షన్‌లో ఇలా రాశారు ‘నా మేనకోడలు నన్ను ల్యాప్‌టాప్ కావాలని అడిగింది. నేను నిరాకరించడంతో, మూడు గంటల పాటు శ్రమపడి, ల్యాప్‌టాప్ తయారు చేసుకుంది’ నేహా షేర్ చేసిన ఫోటోలో ల్యాప్‌టాప్ ఆకారంలో కత్తిరించిన కార్డ్బోర్డ్ కటౌట్ కనిపిస్తుంది. దానిపై స్కెచ్ పెన్‌తో గీసిన కీబోర్టు చిహ్నాలు కనిపిస్తాయి. కాగా ఈ హోమ్మేడ్ ల్యాప్‌టాప్‌లో ‘గేమ్స్’, ‘జూమ్’, ‘లైక్’, ‘రైట్’, ‘సెలెక్ట్’ మొదలైన ఆప్షన్ బటన్లు కనిపిస్తాయి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారింది. 2,52,000కు పైగా వీక్షణలను దక్కించుకుంది. సోషల్ మీడియా యూజర్స్ ఆ చిన్నారి సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. ఒక యూజర్ ‘ఈ ల్యాప్‌టాప్ ఉత్తమమైనది. విండోస్ ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి’ అని రాశారు. మరొకరు ‘ఈ ల్యాప్ టాప్ కీబోర్డ్‌లో చాలా ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మరింత మెరుగ్గా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు! My niece asked for my laptop and i said no so she spent 3 hours making her own laptop😭 pic.twitter.com/Bb7EK7BN97 — Neha (@LadyPeraltaa) October 1, 2023 -
టెక్నో మెగాబుక్ టీ1 ల్యాప్టాప్స్ - వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం చైనాకు చెందిన ట్రాన్సన్ గ్రూప్ బ్రాండ్ టెక్నో తాజాగా మెగాబుక్ టీ1 సిరీస్ ల్యాప్‌టాప్స్‌ను ప్రవేశపెట్టింది. 11వ తరం ఇంటెల్ ప్రాసెసర్స్‌తో ప్రీమియం అల్యూమినియం మెటల్ కేసింగ్‌తో రూపొందాయి. వేరియంట్‌నుబట్టి 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ స్పేస్‌తో వీటిని విడుదల చేసింది. ధర రూ.37,999 నుంచి మొదలై రూ.59,999 వరకు ఉంది. 17.5 గంటల బ్యాటరీ లైఫ్, 14.8 మిల్లీ మీటర్ల మందం, 1.48 కిలోల బరువు, 2 ఎంపీ ఫిజికల్ ప్రైవసీ కెమెరా, ఫింగర్ ప్రింట్ పవర్ బటన్, 180 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 9 పోర్ట్స్ వంటి హంగులు ఉన్నాయి. అమెజాన్ స్పెషల్ ఉత్పాదనగా విడుదల చేశారు. -
రూ. 76000 మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే.. ఏమొచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు!
ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో ఏమి కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుని, ఉన్న చోటే కావలసిన వస్తువులను పొందుతున్నారు. ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో బట్టల దగ్గర నుంచి ల్యాప్టాప్స్ వరకు అన్ని బుక్ చేసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 'అథర్వ ఖండేల్వాల్' ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ మ్యాక్ బుక్ కోసం ఆర్డర్ చేసాడు. అయితే అతనికి డెలివరీ విషయంలో కొంత ఆలస్యం జరిగింది, కావున అతడే నేరుగా ఫ్లిప్‌కార్ట్ హబ్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకున్నాడు. అయితే పార్సిల్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. ఎందుకంటే అందులో మ్యాక్ బుక్ బదులు 'బోట్ స్పీకర్స్' ఉన్నాయి. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? 🆘 Unbelievable experience with @Flipkart! Ordered a Macbook M1 worth 76,000 INR, but received cheap speakers instead 😡🎧 Despite solid evidence of their own delivery executive mishandling the situation, they're denying refund under 'no returns' policy. All Proves Attached 👇 — atharva khandelwal (@atharva_1913) August 21, 2023 నిజానికి అతడు బుక్ చేసుకున్న యాపిల్ మ్యాక్ బుక్ ధర రూ. 76000. అయితే అతనికి కేవలం రూ. 3000 విలువైన బోట్ స్పీకర్స్ రావడంతో ఒక్కసారిగా నిర్గాంతపోయాడు. అతనికి జరిగిన నష్టాన్ని రీఫండ్ చేయాలనీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి అడిగితే వారు ఓపెన్ బాక్స్‌కు వర్తించే నో రీఫండ్ పాలసీ ప్రకారం, రీఫండ్ ఇవ్వడం కుదరదని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబందించిన సమాచారం అతడు ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్లిప్‌కార్ట్ ల్యాప్‌టాప్ అమౌంట్ రీఫండ్ చేస్తుందా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. pic.twitter.com/FVjTm1rKkj — atharva khandelwal (@atharva_1913) August 21, 2023 -
అసంతృప్తిలో గూగుల్, యాపిల్.. భారత్ నిర్ణయంపై ఉత్కంఠ
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై టెక్నాలజీ ఇండస్ట్రీలో కూటమిగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మ్యానిఫ్యాక్చరింగ్లో అగ్రగామిగా నిలవాలనుకుంటున్న భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అంటున్నాయి. దేశ ఆశయాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిది టెక్నాలజీ వ్యాపార భాగస్వాముల కూటమి అమెరికా ప్రభుత్వానికి లేఖ రాశాయి. భారత్ నిబంధనల అమలుపై పునరాలోచించేలా చర్చలు జరపాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి. మరి ఈ లేఖతో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని టెక్నాలజీ పరిశ్రమ వర్గాలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు కేంద్రం ఇటీవల దిగుమతి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్, పీసీలు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులు చేసేందుకు లేదంటూ కొత్త నిబంధనలు తెచ్చింది. ఈ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) తెలిపింది. ఈ చర్య వ్యాపారాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా స్లపయ్ చైన్ విభాగంలో ఎదగాలని చూస్తున్న భారత్ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందంటూ బ్లూమ్ బెర్గ్ నివేదించింది. అభ్యంతాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్, సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సహా యూఎస్ వ్యాపార సంఘాలు కొత్త లైసెన్స్ నిబంధనలపై అనేక అభ్యంతరాలను లేవనెత్తాయి. భారత్‌లో యూఎస్ తయారు చేసిన కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువల రవాణాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల దేశంలో అమెరికా సంస్థలు వ్యాపారాలు చేసుకోవడం మరింత కష్టతరం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
పాడైపోయిన మొబైల్ ఫోన్లు,ల్యాప్‌ట్యాప్‌లు ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ భారత్‌లో తొలిసారిగా ‘మిషన్ ఈ–వేస్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ–వేస్ట్‌ను సేకరించి, రీసైక్లింగ్ చేపడతారు. ఇందుకోసం కంపెనీ స్టోర్లలో బిన్స్‌ను ఏర్పాటు చేస్తామని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు. పాడైన, వినియోగించని మొబైల్ ఫోన్లు, చార్జర్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ను సెలెక్ట్ స్టోర్లకు తీసుకువస్తే చాలు. రూ.10,000 వరకు డిస్కౌంట్ కూపన్ అందుకోవచ్చు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ–వేస్ట్ పోగవుతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో ఈ–వేస్ట్ నిర్వహణను తమ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. మొత్తం పరిశ్రమకు మిషన్ ఈ–వేస్ట్ ప్రేరణగా నిలుస్తుందని సెలెక్ట్ ఈడీ మురళి రేతినేని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
ల్యాప్‌టాప్ దిగుమతి నిబంధనలకు సమయం ఉంది - ఇదిగో క్లారిటీ!
Laptop Import Norms: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ కంప్యూటర్ల దిగుమతిపై విధించిన ఆంక్షలు వెంటనే అమలులోకి రావని, వీటిని అమలు చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్.. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం, రవాణాలో ఉన్న లేదా ఇప్పటికే ఆర్డర్ చేసిన షిప్మెంట్లను దృష్టిలో ఉంచుకుని, ఈ పరివర్తన వ్యవధి ఎంత వరకు ఉంటుందనేది ఖచ్చితంగా త్వరలోనే వెల్లడవుతుంది కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' ఒక ట్వీట్లో తెలిపారు. ఐటి హార్డ్‌వేర్ కోసం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) స్కీమ్ కింద దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగానే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి ప్రభుత్వం గురువారం లైసెన్సింగ్ అవసరమని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. వీరికి తిరుగులేదండోయ్! Q: Why has the @GoI_MeitY finalized new norms for import of IT hardware like Laptops, Servers etc? Ans: There will be a transition period for this to be put into effect which will be notified soon. Pls read 👇 https://t.co/u5436EA0IG — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) August 4, 2023 చైనా, కొరియా నుంచి ఈ వస్తువుల దిగుమతులను తగ్గించడానికి కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే మన దేశంలో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను అమ్మకానికి తీసుకురావాలని యోచిస్తున్న కంపెనీలు తమ ఇన్‌బౌండ్ షిప్మెంట్ల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందటం తప్పనిసరి. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ ప్రకారం, ఏడు రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై HSN కోడ్ 8471 కింద పరిమితులు విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆంక్షలు విధించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని, ప్రాథమికంగా మన పౌరుల భద్రత పూర్తిగా రక్షించబడటానికని ఒక అధికారి వెల్లడించారు. -
ల్యాప్‌టాప్ ధరలు పెరగనున్నాయా? కేంద్రం ఏం చెప్పిందంటే
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
అదిరే ఫీచర్లతో జియో కొత్త ల్యాప్ టాప్..ధర ఇంత తక్కువా!
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త చెప్పింది. అతి తక్కువ ధరకే జులై 31న జియోబుక్ పేరుతో ల్యాప్ టాప్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. జియో తొలిసారి 2022 అక్టోబర్‌లో తొలి జియో బుక్ ల్యాప్ టాప్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ల్యాప్‌ట్యాప్ బరువు 990 గ్రాములు ఉండగా.. త్వరలో విడుదల చేయనున్న జియో బుక్ బరువు 1.2 కేజీలు ఉండడం గమనార్హం. పలు నివేదికల ప్రకారం.. కొత్త జియో బుక్ ల్యాప్ టాప్ ఆక్టోబర్ ప్రాసెరస్తో పనిచేయనుంది. 4జీ కనెక్టివిటీతో బ్యాటరీ లైమ్ టైమ్ 24 గంటలు పనిచేయనుంది. జియోఓస్తో పనిచేసే ఈ బడ్జెట్ ల్యాప్ టాప్‌లో జియోమార్ట్, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి యాప్స్ ప్రీలోడ్‌తో రానున్నాయి. ఇక కల్సర్ విషయానికొస్తే జియోబుక్ బ్లూ, గ్రే రెండు కలర్లలో లభ్యం కానుంది. దీని ధర రూ.20,000గా ఉంది. గత ఏడాది విడుదల చేసిన జియోబుక్ ఫస్ట్ జనరేషన్ ల్యాప్ టాప్ ధర రూ.15,777గా ఉంది. -
తార్‌మార్ తక్కెడ మార్
‘రోడ్డుపై నడుస్తుంటే రోడ్డు పైనే–ఫుడ్డు తింటుంటే ఫుడ్డు పైనే దృష్టి పెట్టాలి’ అని చెప్పడానికి ఏ తత్వవేత్త అక్కర్లేదు. అదొక సహజ విషయం. అయితే ఈ బిజీబిజీ గజిబిజీ లైఫ్‌లో అన్నీ తార్‌మార్ తక్కెడ మార్ అవుతున్నాయి. బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిపై ఎన్నో జోక్స్ ఉన్నాయి. వాటి సంగతి ఎలా ఉన్నా ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ఫొటో మాత్రం తెగ వైరల్ అయింది. 7.32 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణ బెంగళూరులో టూ–వీలర్ ర్యాపిడో(బైక్ ట్యాక్సీ సర్వీస్)పై వెళుతున్న యువతి ఒకరు లాప్‌టాప్‌పై పనిచేస్తుంది. ఈ వైరల్ ఫొటో నేపథ్యంలో అంతర్జాల వాసులు పని ఒత్తిడి, సాధ్యం కాని డెడ్లైన్లు, హసిల్ కల్చర్ గురించి చర్చించారు. ఒక యూజర్ గత నెల వైరల్ అయిన వీడియో పోస్ట్ చేశాడు. సదరు ఈ వీడియోలో సినిమా హాల్లో యువ ఉద్యోగి ఒకరు ఒకవైపు సినిమా చూస్తూనే మధ్యమధ్యలో లాప్‌టాప్‌పై వర్క్ చేస్తూ కనిపిస్తాడు!! -
యాపిల్ డేస్ సేల్: ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ ఎలక్ట్రానిక్స్ స్టోర్ విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు విజయ్ సేల్స్ స్టోర్స్, ఆన్లైన్ వెబ్సైట్ ఆపిల్ డేస్ సేల్ కొనసాగనుంది. ఈసేల్‌లో యాపిల్ ఐఫోన్13, 14, ఎంఐ మ్యాక్బుక్ఎయిర్ (M1 MacBook Air) తదితర యాపిల్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ ,డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ కారర్డ్స్కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు , ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా పొందవచ్చు. అలాగే నో కాస్ట్ EMI స్కీమ్ కూడాఉంది. దీంతోపాటు మొత్తం కొనుగోలుపై 0.75శాతం MyVS లాయల్టీ రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తుందిజ వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలలో విస్తరించి ఉన్న కంపెనీకి చెందిన 125+ స్టోర్లలోఈ సేల్ యాక్టివ్‌గా ఉంటుంది. కంపెనీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆఫర్లను పొందవచ్చు. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!) రూ. 69,900విలువైన ఐఫోన్ 13 ప్రత్యేక డీల్ ధర రూ. 61,490. హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా రూ. 2వేలు తగ్గింపు. మొత్తంగా రూ. 59,490కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ చూశారా? బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ) ఐఫోన్ 14 ప్లస్ ఆఫర్ ధర రూ. 80,490 కాగా, వెనిలా ఐఫోన్ 14 రూ. 70,990కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్‌లు వరుసగా రూ. 1,20,990 , రూ. 1,31,490కి అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ , డెబిట్ కార్డ్‌ల ద్వారా ఐఫోన్ 14 సిరీస్‌పై రూ. 4వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం. (ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!) యాపిల్ ఎంఐ మ్యాక్ బుక్ ఎయిర్ రూ. 82,900కి అందుబాటులో ఉంటుంది. మిగిలిన ల్యాప్‌టాప్‌లపై కస్టమర్లు రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఇంకా ఐప్యాడ్స్ , ఎయిర్‌పాడ్స్, వాచెస్‌పై తగ్గింపుధరలను ప్రకటించింది. -
వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చేసింది: ధర చూస్తే ఇపుడే కావాలంటారు!
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ టాబ్లెట్ విభాగంలో తన అరంగేట్రం చేసింది. తన తొలి ఫ్లాగ్షిప్ టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. MediaTek Dimensity 9000 చిప్సెట్, కార్టెక్స్-X2 కోర్ 3.05GHz తదితర ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ప్యాడ్ 35శాతం పనితీరు ప్రయోజనాన్ని, 35 శాతం పవర్ ఎఫిషియెన్సీ అందజేస్తుందని కంపెనీ వెల్లడించింది. (ఇదీ చదవండి: బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) వన్‌ప్లస్ ప్యాడ్: ధర, ఆఫర్లు వన్‌ప్లస్ ప్యాడ్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 37,999, రూ. 39,999. వన్‌ప్లస్ యాప్, ఎక్స్పీరియన్స్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈకామర్స్ సైట్లలోనూ, రిలయన్స్ క్రోమా స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వారు రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. OnePlus Xchange కింద వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్ల మార్పిడిపై అదనంగా రూ. 5000 లేదా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ల మార్పిడిపై రూ. 3000 ఆఫర్ లభిస్తుంది. ఏప్రిల్ 28 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓపెన్ సేల్ మే 2, 2023 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. (ఏఐపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో) It's almost D-Day. The all-new #OnePlusPad will be open for pre-orders starting April 28, at ₹37,999. Mark your calendars! Stay tuned: https://t.co/PSbe5gA0aF pic.twitter.com/aaO7ak9yNG — OnePlus India (@OnePlus_IN) April 25, 2023 వన్‌ప్లస్ ప్యాడ్ ఫీచర్లు భారీ 11.61-అంగుళాల 144 Hz రీడ్-ఫిట్ డిస్ప్లే 7:5 స్క్రీన్ నిష్పత్తి, మెటల్ బాడీ 2.5D రౌండ్ ఎడ్జ్ .కాంబెర్డ్ ఫ్రేమ్ డిజైన్ 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ సపోర్ట్ 9510mAh బ్యాటరీ 67w ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా -
Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్‌ట్యాప్, ఎట్రాక్టివ్ ఫీచర్స్!
సాక్షి, ముంబై: బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు,స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులతో ఆకట్టుకున్నఇన్ఫినిక్స్ ఇపుడిక ల్యాప్‌టాప్ విభాగంలో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ లాంటి సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో పేరుతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. అల్యామినియమ్ అలాయ్ మెటల్ బాడీ, 15.6 ఇంచుల ఫుల్హెచ్డీ డిస్ప్లే, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 (Intel Celeron N5100) క్వాడ్‌కోర్ ప్రాసెసర్ లాంటి ఫీచర్లను ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియోలో అందించింది. ఈ ల్యాప్‌టాప్ ఫస్ట్ సేల్‌లో లాంచింగ్ ధరను ఆఫర్ చేస్తోంది. (బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?) ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో స్పెసిఫికేషన్లు 15.6 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 క్వాడ్‌కోర్ బడ్జెట్ ప్రాసెసర్, 260 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఇంటెల్ యూహెచ్డీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు, ఓ హెచ్డీఎంఐ పోర్టు, రెండు యూఎస్బీ టైప్-సీ పోర్టులు, ఓ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్,బ్యాక్లిట్ కీబోర్డ్ ,యాంటీ-గ్లేర్ గ్లాస్ టచ్‌ప్యాడ్ లాంటి ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.76 కేజీలుగా ఉంది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డీ వెబ్‌క్యామ్ , 2 వాట్ల సౌండ్ ఔట్పుట్ ఇచ్చే స్పీకర్లు, 40Wh బ్యాటరీ45 వాట్ల పీడీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 75 శాతం చార్జ్ అవుతుందని ఇన్ఫినిక్స్ వెల్లడించింది. ఇక ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ ల్యాప్‌టాప్ 7 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ధర, సేల్ 8 జీబీ ర్యామ్, 256 జీబీఎస్ఎస్డీ స్టోరేజ్ వేరియంట్ ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ల్యాప్‌టాప్ ధర రూ.20,990గా ఉంది.అలాగే 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.22,990లు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈనెల 26వ తేదీ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సిల్వర్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో లభ్యం. -
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ, మార్కెట్లో హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్ విడుదల!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌పీ అతి తక్కువ ధరకే క్రోమ్‌బుక్ ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేసింది.హెచ్‌పీ క్రోమ్ బుక్ 15.6 అని పిలిచే క్రోమ్‌బుక్‌లో సెలెరాన్ N4500 ఆధారిత ప్రాసెసర్ ఉండగా.. మార్కెట్లో లభ్యమవుతున్న ఈ ల్యాప్‌టాప్‌ను స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు హెచ్‌పీ వెల్లడించింది. ఈ ల్యాప్‌ట్యాప్‌లో పెద్ద డిస్ప్లే, వైఫై 6 సపోర్ట్‌తో బలమైన కనెక్టివిటీ (stronger connectivity),11.5 గంటల బ్యాటరీ ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా హెచ్‌పీ క్రోమ్‌బుక్‌పై హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడీ మాట్లాడుతూ.. హైబ్రిడ్ లెర్నింగ్ విధానం అందుబాటులోకి రావడంతో పర్సనల్ కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువుగా మారింది. అందుకే స్టైలిష్, శక్తివంతంగా ఉన్న ఈ క్రోమ్ బుక్ విద్యార్ధులకోసం ప్రత్యేకంగా ఈ క్రోమ్ బుక్ 15.6 ల్యాప్‌ట్యాప్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇంట్లో లేదా క్లాస్ రూమ్‌లో చదువుతున్నా కనెక్టివిటీ, ప్రొడక్టీవ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. HP Chromebook 15.6 ధర HP Chromebook 15.6 ప్రారంభ ధర రూ. 28,999కే లభిస్తుంది. ఫారెస్ట్ టీల్, మినరల్ సిల్వర్‌తో సహా రెండు వేరియంట్ కలర్స్‌తో అందుబాటులో ఉంది. HP Chromebook 15.6 స్పెసిఫికేషన్లు HP Chromebook మైక్రో-ఎడ్జ్ బెజెల్స్‌తో 15.6 ఇమ్మర్సివ్ డిస్ప్లేను కలిగి ఉంది. మైక్రో ఎడ్జ్ బెజెల్స్, 250 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, ముందు భాగంలో వీడియో కాల్స్ మాట్లాడేందుకు వీలుగా వైడ్ విజన్ హెచ్డీ కెమెరా ఉంది. వీటితో పాటు స్పీకర్ ఎన్‌క్లోజర్ డిజైన్‌తో పెద్ద డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. దీంతో పాటు గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్లాస్‌రూమ్‌తో పాటు ఫైల్స్, ఫొటోలను తొందరగా పంపిచటానికి హెచ్‌పీ క్విక్ డ్రాప్ సదుపాయం ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో నియర్‌బై షేర్ మాదిరిగానే పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365కు ఈ ల్యాప్‌టాప్ లో వినియోగించుకోవచ్చు. ఇక ఈ హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ను 15.6ను నదులు, తీర ప్రాంతాల నుంచే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలిసే ప్లాస్టిక్‌తో, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. -
Amazon Mega Electronics Day sale: అద్భుతమైన ఆఫర్లు, డోంట్ మిస్!
సాక్షి,ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్‌పై మరో సేల్‌ను ప్రకటించింది. మెగా ఎలక్ట్రానిక్స్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు హెడ్ఫోన్లు తదితర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. మార్చి 14 వరకు కొనసాగనున్న ఈ స్పెషల్ సేల్ ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ ‘రిథమ్’ సన్‌గ్లాసెస్: భారీ తగ్గింపుతో) మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఈవెంట్లో శాంసంగ్, యాపిల్, బోట్, పైర్ బాల్ట్, లెనోవో, ఆసుస్, కెనాన్, సోనీ లాంటి ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులు తగ్గింపు ధరల్లో అందించనుంది. హెడ్ఫోన్లు, టాబ్లెట్లు,పీసీ యాక్సెసరీలు, కెమెరాలతో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డీల్స్ , ఆఫర్లను అందిస్తుంది. దీంతోపాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. మెగా సేల్‌లో కొన్ని ప్రత్యేక ఆఫర్లు ♦ ఆసుస్ వివో బుక్ 14 ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 35,990కి అందుబాటులో ఉంది ♦ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 33,490కే కొనుగోలు చేయవచ్చు ♦ ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ స్మార్ట్ వాచ్ రూ. 1,699కే లభ్యం. ♦ రూ. 34,990కే యాపిల్ వాచ్ ఎస్ఈ లభిస్తుంది. బ్యాంకు కార్డ్ కొనుగోళ్లగా రూ. 1500 తగ్గింపు అదనం ♦ ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో రూ. 1,599కి, నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ రూ. 1,199కి అందుబాటులో ఉంది. ♦ సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1 రూ. 69,490కి లభిస్తోంది. -
Primebook 4G Laptop: రూ.20 వేలకంటే తక్కువ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?
ఆధునిక కాలంలో టెక్నాలజీ భారీగా పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్ వంటివి ఉపయోగించడం సర్వ సాధారణమయిపోయింది. అయితే ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉండాలని తక్కువ ధరకే 'ప్రైమ్బుక్ 4జీ ఆండ్రాయిడ్' మార్కెట్లో విడుదలైంది. మార్కెట్లో విడుదలైన ప్రైమ్బుక్ 4జీ ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్ బేస్ వేరియంట్ ధర కేవలం రూ.16,990 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.18,990. ఇది 4జీ సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆన్లైన్ క్లాసులు, ఈ-లెర్నింగ్ వంటి వాటికోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ప్రైమ్బుక్ రన్ అవుతుంది, అయితే విండోస్ అప్లికేషన్లు ఈ ల్యాప్‌టాప్‌లో సపోర్ట్ చేయవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ల్యాప్‌టాప్ రూపంలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్. కావున 10వేలకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ చేస్తాయి. (ఇదీ చదవండి: మహిళల కోసం స్పెషల్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ: ఎక్కడో తెలుసా?) ప్రైమ్బుక్ 4జీ ల్యాప్‌టాప్ హెచ్డీ రెజల్యూషన్ 11.6 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, కలిగి మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 200జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బరువు 1.2 కేజీలు. ఇందులో వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు, 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్, మినీ హెచ్డీఎంఐ పోర్టు కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. కొత్త ప్రైమ్బుక్ 4జీ ల్యాప్‌టాప్ 4,000mAh బ్యాటరీ ప్యాక్ కలిగి, వీడియో కాల్స్ కోసం 2 మెగాపిక్సెల్ వెబ్‌క్యామ్ పొందుతుంది. ఇది ఈ నెల 11నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది. క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్తో ఈ ల్యాప్‌టాప్‌ను కొంటే రూ.2,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. -
లెనోవో డ్యూయెల్ స్క్రీన్ ల్యాప్‌టాప్.. ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో ఇప్పటివరకు ఒకే స్క్రీన్ కలిగిన ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండు స్క్రీన్స్ కలిగిన ల్యాప్‌టాప్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ డ్యూయెల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ని 'లెనోవో' కంపెనీ లాంచ్ చేసింది. దీనిని కంపెనీ వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. గతేడాది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో థింక్‌బుక్ ప్లస్ జెన్ 3 లాంచ్ చేసిన లెనోవో ఎట్టకేలకు ఇప్పుడు భారతీయ విఫణిలో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ హై-ఎండ్ ల్యాప్‌టాప్ ధర రూ. 1,94,990. కంపెనీ లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ 21:10 అల్ట్రా-వైడ్ రేషియోతో 17.3 ఇంచెస్ డిస్ప్లే కలిగిన మొదటి ల్యాప్‌టాప్. థింక్‌బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ 8 ఇంచెస్ సెకండరీ టచ్-ఎనేబుల్డ్ డిస్ప్లే కూడా పొందుతుంది. ఇది బండిల్ చేయబడిన డిజిటల్ పెన్‌తో లభిస్తుంది. ఇది ల్యాప్‌టాప్‌లో పొందుపరిచిన టాబ్లెట్ మాదిరిగా కనిపిస్తుంది. డ్యూయెల్ స్క్రీన్ కలిగిన ఈ ల్యాప్‌టాప్ బరువు 2 కేజీలు. లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ 12వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ ఐరిస్ గ్రాఫిక్స్ ఆన్‌బోర్డ్‌తో 16జిబి ర్యామ్ కలిగి, 1టిబి ఎస్ఎస్డి స్టోరేజీ కెపాసిటీ పొందుతుంది. వీటిని 32జిబి, 2టిబి వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కొత్త లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ యుఎస్బి-సి థండర్ బోల్ట్ 4 పోర్ట్, యుఎస్బి-సి పోర్ట్, యుఎస్బి-ఏ పోర్ట్, హెచ్డిఎమ్ఐ పోర్ట్, 3.5 మిమీ జాక్, వైఫై 6ఈ, బ్లూటూత్ వెర్షన్ 5.2 కనెక్టివిటీ వంటి ఆప్షన్లతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 11 గంటల వరకు బ్యాటరీ ఉంటుందని లెనోవా పేర్కొంది. -
సూపర్ ఫీచర్లతో హెచ్‌పీ పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్‌ట్యాప్: షాకింగ్ ప్రైస్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌పీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఒమెన్ 17 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ,Nvidia GeForce RTX 4080 ను జోడించింది. హెచ్‌పీ ఒమన్ ధర రూ.2,69,990గా నిర్ణయించింది. ఇండియాలో ఒమెన్ ప్లేగ్రౌండ్ స్టోర్స్, HP వరల్డ్ స్టోర్స్ , HP ఆన్లైన్ స్టోర్ వంటి వివిధ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ టెక్నాలజీతో ఒమెన్ 17 ఒమెన్ గేమింగ్ హబ్‌గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. గేమింగ్ ల్యాప్‌టాప్ హెచ్‌పీ ఒమెన్ 17 ఫీచర్లు 17.3-అంగుళాల IPS డిస్ప్లే క్వాడ్ HD (2560 × 1440 పిక్సెల్‌లు) రిజల్యూషన్ 24 కోర్ 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ప్యానెల్ 240Hz రిఫ్రెష్ రేట్ 32 జీబీ DDR5 ర్యామ్, 1TB PCIe NVMe SSD నిల్వ Nvidia RTX 4080 ల్యాప్‌టాప్ GPUతో వస్తుంది. ఇంకా ఒమెన్ 17 బ్యాంగ్ & ఒలుఫ్సెన్ డ్యూయల్ స్పీకర్స్, 720p HD వెబ్‌క్యామ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అర్రే డిజిటల్ మైక్రోఫోన్ల Wi-Fi 6E కనెక్టివిటీ, థండర్‌బోల్ట్ 4 టైప్-C పోర్ట్, మూడు USB టైప్-A పోర్ట్స్, HDMI పోర్ట్, మినీ డిస్ప్లే పోర్ట్, RJ-45 పోర్ట్ , RTX 40 సిరీస్ ల్యాప్‌టాప్ 330W ఛార్జింగ్‌కు మద్దతుతో 83 Wh Li-ion పాలిమర్ బ్యాటరీ మొదలైనవి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
హాట్ టాపిక్‌గా స్యాంట్రో రవి..రెండో భార్య వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో ఏముంది?
సాక్షి, శివాజీనగర: ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో స్యాంట్రో రవి చర్చనీయాంశమయ్యాడు. అతనికి అనేక నేరాలతోను, అలాగే రాజకీయ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయని ప్రచారం. ఇక కొత్తగా మరో కేసు బయటకు వచ్చింది. గత నవంబర్ 23న బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ క్రిమినల్ కేసుతో అతనికి సంబంధమున్నట్లు తెలిసింది. స్యాంట్రో రవి రెండవ భార్య, బంధువులు తనపై దాడి చేశారని రవి స్నేహితుడు కేసు పెట్టాడు. రవినే ఈ కేసు పెట్టించాడని, ఆమె వద్ద ఉన్న లాప్టాప్ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆమె అతన్నుంచి విడిగా ఉంటోంది. ఫిర్యాదు మేరకు పోలీసులు రవి రెండో భార్య, ఆమె సోదరి, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన తరువాత రెండో భార్య మైసూరులో రవిపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఆ లాప్టాప్లో పలు సంచలన వీడియోలు, ఆడియోలు ఉన్నాయని, అవి బహిరంగమైతే కలకలం ఏర్పడుతుందని తెలిసింది. ఈ రెండు ఫిర్యాదుల్లో వాస్తవాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య ) -
వర్క్ ఫ్రం హోమ్ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా
వర్క్ ఫ్రం హోమ్ మనుషులను ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకువచ్చిందంటే వాళ్ల వ్యక్తిగత విషయాలకు కూడా టైం కేటాయించలేని స్థితికి తీసుకు వచ్చింది. ఈ కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి చాలా వరకు కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులబాటు ఇచ్చినట్లు ఇచ్చి గొడ్డు చాకిరీ చేయించుకోవడం ప్రారంభించాయి. ఆఖరికి ఇంటి వద్దనే కదా ఉండేదని వారాంతపు సెలవులను కూడా తగ్గించేశాయి కొన్ని కంపెనీలు. ఆ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక కూడా చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకి వచ్చేయమని చెప్పాయి. అయినప్పటికీ చాలామంది ఉద్యోగులు దీనికి అలవాటుపడిపోయి ఆఫీసుకు రండి బాబు అని కంపెనీలు బతుమాలుకోవాల్సి వచ్చింది. కానీ కొన్ని కంపెనీలు ఇదే బెటర్ అంటూ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది దీనికే అలవాటు పడిపోయి తమ వ్యక్తిగత పనులకు కూడా సమయం కేటాయించకుండా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక పెళ్లి కొడుకు తన పెళ్లి సమయంలో కూడా ల్యాప్‌టాప్‌పై ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. అక్కడ కళ్యాణ మండపంలో ఇద్దరు పూజారులు మంత్రాలు చదువుతుండగా సదరు పెళ్లికొడుకు పెళ్లీపీటలపై కూడా ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అతను ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నాడనేది క్లారిటీ లేకపోయినప్పటికీ ఏదో ఎమర్జెన్సీ వర్కే చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట హల్చల్ చేసింది. దీంతో నెటిజన్లు మండిపడుతూ..ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు. ఏ కంపెనీ కూడా ఆఖరికి పెళ్లి సమయంలో కూడా పనిచేయమని అడగరు. ఇతని జీవితాన్ని, కెరియర్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలియడం లేదు అంటూ ఫైర్ అయ్యారు. మరికొందరు అతడికి వచ్చే భార్య ఎవరో ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పండి అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Calcutta Instagrammers (@ig_calcutta) (చదవండి: తన జుట్టును తానే తింటున్న బాలిక.. చివరికి ఆహారం....) -
మల్లారెడ్డి వర్సెస్ ఐటీ శాఖ.. కంచికి చేరని ల్యాప్‌టాప్ కథ!
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వర్సెస్ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఎపిసోడ్లో బోయిన్పల్లి ఠాణాకు చేరిన ల్యాప్‌టాప్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గురువారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య పోలీసుస్టేషన్ వద్ద లభించిన ల్యాప్‌టాప్‌ను పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అది రత్నాకర్దన్న ఉద్దేశంతో ఐటీ అధికారులకు చూపించినా వారు నోరు మెదపకపోవడంతో కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపాలని యోచిస్తున్నారు. మల్లారెడ్డి సహా ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పంచనామాపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డితో అధికారులు సంతకం చేయించుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై మల్లారెడ్డి గురువారం రాత్రి బోయిన్పల్లి ఠాణాలో రత్నాకర్‌పై ఫిర్యాదు చేశారు. రెండు గంటల తర్వాత రత్నాకర్ కూడా అదే పీఎస్‌లో మరో ఫిర్యాదు ఇచ్చారు. ఆస్ప త్రి వద్ద తనను అడ్డుకున్న మల్లారెడ్డి తదితరులు ల్యాప్‌టాప్ లాక్కున్నారని అందులో పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్కు పంపే యోచనలో పోలీసులు మల్లారెడ్డి, రత్నాకర్ ఫిర్యాదులతో నమోదైన కేసులను దుండిగల్ ఠాణాకు బదిలీ చేసినా ల్యాప్‌టాప్ మాత్రం బోయిన్పల్లి ఠాణాలోనే ఉండిపోయింది. అది ఐటీ అధికారి రత్నాకర్ వ్యక్తిగత ల్యాప్‌టాప్‌గా భావిస్తున్నప్పటికీ ఆయన సహా ఎవరూ ధ్రువీకరించట్లేదు. తొలుత అది ఎక్కడ నుంచి? ఎలా వచ్చిందో తేలిస్తేనే మిగతా విషయాలు చెప్తామంటూ ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తామే ఆ ల్యాప్‌టాప్ ఆన్ చేసి ఎవరిదో చూద్దామని పోలీసులు మొదట భావించినా.. అలా చేస్తే డేటాకు సంబంధించిన వివాదం తలెత్తే ప్రమాదం ఉందని మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో సదరు ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపి తెరిపించాలని యోచిస్తున్నారు. సమీప సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలిస్తున్నామని, కానీ ల్యాప్‌టాప్‌ను అక్కడ ఎవరు పెట్టారనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని బోయిన్పల్లి పోలీసులు చెప్పారు. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్ ఫిర్యాదులకు సంబంధించిన రెండు కేసులు దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ కేసులు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రంతా నాటకీయ పరిణామాలు రెండు ఫిర్యాదులు పోలీసుల వద్ద ఉండగానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే బోయిన్పల్లి ఠాణా కేంద్ర బలగాల అ«దీనంలోకి వెళ్లిపోయింది. ఆ సందర్భంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఓల్యాప్టాప్ను ఠాణాలో అప్పగించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మరో యువకుడు ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చాడు. అప్పటికే ఠాణా గేట్లకు తాళాలు పడ్డాయి. సదరు యువకుడు ల్యాప్‌టాప్‌ను పోలీసులకు ఇవ్వాలని ప్రయత్నించాడు. వారు విముఖత చూపడంతో గేటు వద్ద పెట్టేసి వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తం ఐటీ అధికారులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. రోడ్డుపై వదిలేసిన ల్యాప్‌టాప్‌ను ఠాణాలోకి తీసుకువెళ్లిన పోలీసులు దాన్ని ఐటీ అధికారులకు చూపించారు. అది ఎవరిదన్న విష యం పక్కన పెట్టాలని, అసలు ఠాణాకు ఎలా వచి్చందో తేల్చాలని ఐటీ అధికారులు పట్టుబట్టారు. దీంతో పంచనామా నిర్వహించిన పోలీ సులు ల్యాప్‌టాప్‌ను ఠాణాలో భద్రపరిచారు. ఇదీ చదవండి: ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి -
లాజిటెక్ నుండి డాకింగ్ స్టేషన్
న్యూఢిల్లీ: లాజిటెక్ కొత్తగా లాజి డాక్ పేరిట ఆల్ ఇన్ వన్ డాకింగ్ స్టేషన్‌ను ఆవిష్కరించింది. వివిధ డెస్క్‌టాప్ డివైజ్‌లకు ఒకే కనెక్షన్ పాయింట్‌గా ఇది ఉపయోగపడుతుంది. అయిదు వరకు యూఎస్బీ పెరిఫరల్స్, రెండు వరకూ మానిటర్లతో పాటు ఒక ల్యాప్‌టాప్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. గ్రాఫైట్, తెలుపు రంగుల్లో ఇది లభిస్తుంది. దీని ధర రూ. 55,000 (పన్నులు కాకుండా). ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి నుండి భారత మార్కెట్లో ఇది అందుబాటులోకి వస్తుంది. -
ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్..!
బెంగళూరు: కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి దివాళీ సేల్ సందర్భంగా అక్టోబర్ 15న ఫ్లిప్‌కార్ట్‌లో 'ఏసస్ టఫ్' గేమింగ్ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 20న ఇంటికి పార్సిల్ వచ్చింది. అయితే అది ఓపెన్ చేసిన అతనికి షాక్ తగిలింది. పార్సిల్ బాక్స్‌లో ల్యాప్‌టాప్‌కు బదులు పెద్ద రాయి, ఈ-వేస్ట్ వచ్చింది. దీంతో అతడు ఫ్లిప్‌కార్డ్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. దాన్ని రిటర్న్ తీసుకునేందుకు వారు నిరాకరించారు. ల్యాప్ ఆర్డర్ చేసిన వ్యక్తి చిన్మయ రమణ ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. తనకు వచ్చిన పార్సిల్లో ల్యాప్‌టాప్ బాక్స్‌పై ప్రోడక్ట్ డీటేయిల్స్‌ను చింపేశారని, అది ఓపెన్ చేసి చూస్తే రాయి, కంప్యూటర్ వేస్టేజ్ ఉందని వాపోయాడు. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్‌ను సంప్రదించినా సరైన స్పందన లేదని, ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు. తాను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసినా.. మూడు రోజుల తర్వాత వారు స్పందించారని రమణ వాపోయాడు. రీఫండ్ ఇచ్చేందుకు సెల్లర్ నిరాకరించాడని, పార్సిల్ డెలీవరీ సమయంలో ఎలాంటి డ్యామేజీ కూడా జరగలేదని చెప్పారని తెలిపాడు. ఫ్లిప్‌కార్ట్ సర్వీసు అస్సలు బాగాలేదని రమణ ఆరోపించాడు. తన ఫిర్యాదు అనంతరం మళ్లీ అప్డేట్ ఇస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు ఈమెయిల్ పంపినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నాడు. తాను చెప్పేది అబద్దమని ఎవరికైనా అన్పిస్తే, తన ఖాతా పాత ఆర్డర్లు చెక్‌చేసుకోవచ్చని చెప్పాడు. 2015 నుంచి తాను ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌గా ఉన్నానని, చాలా ఆర్డర్లు పెట్టానని వివరించాడు. Ordered for laptop and recived a big stone and E-waste ! During Diwali sale on Flipkart!@VicPranav @geekyranjit @ChinmayDhumal @GyanTherapy @Dhananjay_Tech @technolobeYT @AmreliaRuhez @munchyzmunch @naman_nan @C4ETech @r3dash @gizmoddict @KaroulSahil @yabhishekhd @C4EAsh pic.twitter.com/XKZVMVd4HK — Chinmaya Ramana (@Chinmaya_ramana) October 23, 2022 చదవండి: ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్ -
రూ.15వేలకే ల్యాప్‌ట్యాప్,‘రిలయన్స్ జియో సరికొత్త సంచలనం!’
ల్యాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త సంచలనం సృష్టించనుంది. రూ.15వేల బడ్జెట్ ధరలో ల్యాప్ ట్యాప్‌ను విడుదల చేయనుంది. 4జీ సిమ్ కనెక్ట్ చేస్తూ లో బడ్జెట్ ల్యాప్ ట్యాప్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జియో అధినేత ముఖేష్ అంబానీ ఇప్పటికే జియో బుక్ కోసం టెక్ దిగ్గజం క్వాల్కామ్, మైక్రోసాఫ్ఠ్‌తో చేతులు కలిపారు. ఇప్పుడు ఈ లోబడ్జెట్ ల్యాప్ ట్యాప్ చిప్ కోసం యూకేకి చెందిన ఏఆర్ఎం కంపెనీతో జతకట్టినట్లు..ఈ సంస్థ తయారు చేసిన చిప్‌తో విండోస్ ఓఎస్ తో పాటు మరికొన్ని యాప్స్ వినియోగించుకునే సౌలభ్యం కలగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ల్యాప్ ట్యాప్‌పై జియో ప్రతినిధులు ఇప్పుటి వరకు స్పందించలేదు. ఈ నెలలో విడుదల జియో సంస్థ ఈ సెప్టెంబర్ నెలలో ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జియోఫోన్ మాదిరిగానే, 5జి ఎనేబుల్డ్ వెర్షన్‌ను సైతం ఈ ల్యాప్ ట్యాప్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని తెలుస్తోంది. జియో ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్లు ఈ ల్యాప్ ట్యాప్‌లో జియో సొంత ఆపరేటింగ్ సిస్టం ‘జియో ఓఎస్’ ఉండనుంది. కావాల్సిన యాప్స్‌ను జియోస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కార్పొరేట్ ఉద్యోగులు వినియోగించే ట్యాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా జియో ల్యాప్‌ట్యాప్ పనిచేస్తుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 5జీ, ఏమిటో వింత పరిణామం! -
ఎప్పుడూ ల్యాప్‌టాపేనా?.. స్కూటర్‌పైన వెళ్తూ కూడా అవసరమా!!
కర్ణాటక: బెంగళూరు ఫ్లై ఓవర్ మీద స్కూటర్లో వెళ్తూ ల్యాప్‌టాప్ చూస్తున్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. హర్షమిత్సింగ్ అనే వ్యక్తి ఫోటో తీసి పోస్ట్ చేయడంతో నెటిజన్లు తలోరకంగా స్పందించారు. పని లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే తప్పదని కొందరు, నగరరోడ్లపై ఇలాంటి రిస్క్ చేయడం శ్రేయస్కరం కాదని మరికొందరు పేర్కొన్నారు. -
ల్యాప్‌టాప్ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం
సాక్షి, చెన్నై: తమిళనాడు విమానాశ్రంయలో ల్యాప్‌టాప్‌లో దాచిన సుమారు 1.3 కోట్ల విలువైన బంగారం దొరికింది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు చెందిన ల్యాప్‌టాప్‌లో దాదాపు ₹ 1.3 కోట్ల విలువైన బంగారాన్ని దాచి ఉంచారని పోలీసులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికులు నుంచి సుమారు రూ. 1.98 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ల్యాప్‌టాప్ కీబోర్డు కింద ఉండే ప్రాంతంలో బంగారాన్ని దాచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు మే 11న షార్జా మీదుగా భారత్‌కు చేరుకున్న ఆ ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్ విభాగం అరెస్టు చేసింది. (చదవండి: పెళ్లి ఊరేగింపులో విషాదం...వధువు తల్లిని కత్తితో పొడిచి...) -
ల్యాప్‌ట్యాప్ పేలుడు: సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుమలత మృతి
సాక్షి, వైఎస్ఆర్: బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లెలో ల్యాప్‌టాప్ పేలి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుమలత (22) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుమలత శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం ఇలా జరిగింది.. సుమలత సోమవారం ఉదయం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బెడ్‌పైన కూర్చొని వర్క్ చేస్తున్న సుమలత విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బెడ్‌కు సైతం మంటలు అంటుకున్నాయి. గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అప్పడికే తీవ్రంగా గాయపడిన సుమలతను చికిత్స నిమిత్తం కడప సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 80 శాతం కాలిన గాయాలవ్వడంతో యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, సుమలత బెంగుళూరుకు చెందిన మ్యాజిక్ టెక్ సొల్యూషన్‌లో పనిచేస్తోంది. ఇది చదవండి: కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం -
ల్యాప్‌టాప్ పేలి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలు
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లెలో ల్యాప్‌టాప్ పేలి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సుమలత (22) అనే టెక్కీ సోమవారం ఉదయం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బెడ్‌పైన కూర్చొని వర్క్ చేస్తున్న సుమలత విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బెడ్‌కు సైతం మంటలు అంటుకున్నాయి. గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అప్పడికే తీవ్రంగా గాయపడిన సుమలతను చికిత్స నిమిత్తం కడప సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 80 శాతం కాలిన గాయాలవ్వడంతో యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సుమలత బెంగుళూరుకు చెందిన మ్యాజిక్ టెక్ సొల్యూషన్‌లో పనిచేస్తోంది. చదవండి: ‘మీకు పెన్ ఉంటే, మాకు గన్ ఉంది’.. జర్నలిస్టుపై పోలీస్ దురుసు ప్రవర్తన -
అనాథ వసతి గృహ విద్యార్థికి ల్యాప్‌టాప్ విరాళం
దిల్సుఖ్నగర్: దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గిరిధర్ స్వామి బుధవారం ఆర్కేపురం డివిజన్లో చిత్రలేవుట్ కాలనీలో ఉన్న అనాథ వసతి గృహ విద్యార్థి రాజానాయక్‌కు రూ.52,000 విలువైన ల్యాప్‌టాప్ విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిధర్ స్వామి మాట్లాడుతూ అనాథ అయిన రాజా నాయక్‌ను చేరదీయడమేగాక భువనేశ్వర్ ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ సీటు సాధించడంలో వసతి గృహం నిర్వాహకులు చేసిన కృషి ఎనలేనిదన్నారు. అతడి విద్యాభ్యాసం కోసం స్నేహితుల సహకారంతో ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమములో వసతి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్, స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. -
సుప్రీంలో వాదిస్తున్నారు.. కంప్యూటర్ కొనుక్కోలేరా!
న్యూఢిల్లీ: కేసుల ఆన్లైన్ విచారణ సందర్భంగా లాయర్ల మొబైల్ ఫోన్లతో తరచూ అంతరాయాలు కలగడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే మొబైల్ ఫోనుతో కేసుల విచారణలో పాల్గొనడంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ హెచ్చరించింది. లాయర్ల మొబైల్ ఫోన్లలో ఆడియో, వీడియో లేదా రెండూ సరిగా లేకపోవడంతో సోమవారం లిస్టయిన కేసుల్లోని పది కేసుల విచారణను బెంచ్ వాయిదావేయాల్సి వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘న్యాయవాది గారు, మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. వాదనల కోసం కనీసం ఒక డెస్క్టాప్ను భరించలేరా!’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. మరోకేసులో ఒక లాయర్ మొబైల్‌కు ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంపై స్పందిస్తూ ‘ఇలాంటి కేసులను వినే శక్తి ఇక మాకు లేదు. మాకు సరిగా వినపడే డివైజ్‌ను తెచ్చుకోండి. ఇప్పటికే పది కేసుల్లో ఇలాగే మేం గట్టిగా అరవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించింది. (చదవండి: ఖద్దరు చొక్కాకై ఖాకీ తహతహ!) -
మీ పాత ల్యాప్‌టాప్‌ను పగలకొట్టండి.. ప్రచారంలో కొత్త పంథా..!
కోవిడ్-19 మహమ్మారి రాకతో ల్యాప్‌టాప్‌ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రజలు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమవ్వడంతో ల్యాప్‌టాప్ సేల్స్ భారీగా పెరిగాయి. ఆసుస్, డెల్, హెచ్‌పి, లెనోవో వంటి ల్యాప్‌టాప్ కంపెనీల కొనుగోళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్‌టాప్‌ల తయారీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ కూడా ల్యాప్‌టాప్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. రియల్మీ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 18 (బుధవారం) రోజున లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్మీ ల్యాప్‌టాప్ స్లిమెస్ట్ ల్యాప్‌టాప్‌గా నిలుస్తోందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ల్యాప్‌టాప్ ఫుల్‌గా మెటల్ బాడీతో ఉండనున్నట్లు తెలుస్తోంది. రియల్మీ ల్యాప్‌టాప్ లాంచ్‌లో భాగంగా పలువురు టెక్నికల్ నిపుణులకు కంపెనీ ఆహ్వానం పలికింది. రియల్మీ ఆహ్వానం పలికిన విధానం చూస్తే మీరు ఔరా..! అనాల్సిందే. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్నికల్ ఎక్సపర్ట్ రంజిత్‌కు రియల్మీ ల్యాప్‌టాప్ లాంచింగ్ ఈవెంట్‌కు ఆహ్వానాన్ని పంపింది. ఆహ్వానంలో భాగంగా రంజిత్‌కు కంపెనీ భాష్ టూల్‌కిట్‌ను పంపింది. టూల్కిట్లో మీకు నచ్చిన టూల్‌తో ల్యాప్‌టాప్‌ను టెస్ట్ చేసుకోవచ్చునని రియల్మీ వెల్లడించింది. రంజిత్ ఈ విషయాన్ని ట్విటర్లో పేర్కొన్నారు. ఒక ప్రొడక్ట్ ఈ విధంగా లాంచ్ చేయడం ఎప్పుడు చూడలేదని రంజిత్ తెలిపారు. రియల్మీ ల్యాప్‌టాప్ ప్రచారంలో సరికొత్త పంథాను పాటిస్తుందని టెక్నికల్ నిపుణులు భావిస్తున్నారు. This has got to be the most crazy media invite I have got for a product! Got a Bosh toolkit box lol :) aka it's about the new upcomming Realme laptop. pic.twitter.com/KtBdmD8uQC — Ranjit (@geekyranjit) August 14, 2021 -
త్వరలోనే రెడ్‌మీబుక్-15 లాంచ్..! ధర ఎంతంటే...!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రాకతో పాఠశాలలు, ఆఫీసులు పూర్తిగా క్లోజ్ అవ్వడంతో పిల్లలకు ఆన్లైన్ క్లాస్‌లు, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమయ్యారు. దీంతో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ కొనుగోళ్లలో భారీగా వృద్ధి చెందింది. ల్యాప్టాప్స్ కొనుగోలు గణనీయంగా పెరగడంతో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ల్యాప్‌టాప్‌లపై దృష్టి సారించాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్లల తయారీదారు షావోమీ కూడా ల్యాప్‌టాప్ ఉత్పత్తి రేసులో ముందు నిలుస్తోంది. తాజాగా షావోమీ రెడ్‌మీబుక్ 15 పేరిట మరో ల్యాప్‌టాప్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 3 న భారత మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. రెడ్‌మీబుక్ 11th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది. రెడ్‌మీబుక్ 15 ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌లు ఏసర్ స్విఫ్ట్ 3, ఆసుస్ వివోబుక్ తో పోటీ పడనున్నట్లుగా తెలుస్తోంది. రెడ్‌మీబుక్ ధర రూ. 50 వేల దిగువ ఉండొచ్చునని టెక్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రెడ్‌మీబుక్ 15 ఫీచర్లు 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 11th జనరేషన్ ఇంటెల్ కోర్ i3 అండ్ i5 ప్రొసెసర్ 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నట్ స్టోరేజ్, 516 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ విత్ విండోస్ 10. డ్యూయల్ బ్యాడ్ వైఫై, బ్లూటూత్ వర్షన్ 5.0 యూఎస్బీ 3.1 టైప్ సీ, యూఎస్బీ టైప్-ఏ, యూఎస్బీ 2.0, హెచ్డీఏమ్ఐ, ఆడియోజాక్ పోర్ట్. 65w ఛార్జర్. -
వర్క్ ఫ్రం.. వెడ్డింగ్!
వర్క్ ఫ్రం హోం మనకు తెలిసిందే.. ఇక్కడ జరుగుతోంది.. వర్క్ ఫ్రం వెడ్డింగ్.. ఇది ఏదో సరదాకు చేసిన వీడియో కాదు.. నిజమే.. ఇన్‌స్టాగ్రాంలో దుల్హనియా అనే వెడ్డింగ్ పేజీ నిర్వాహకులు దీన్ని పోస్ట్ చేశారు. జీవితంలో చాలా అమూల్యమైన క్షణం వివాహం.. అలాంటిది ఆ టైంలో అర్జెంట్ మీటింగ్ అని అంటే.. ఎంత కష్టమో ఆలోచించండి.. తప్పనిసరి పరిస్థితుల్లో వరుడు ఇలా ల్యాప్‌టాప్ ముందేసుకుని.. సమావేశానికి హాజరయ్యాడు.. ఇటు వరుడు సీరియస్‌గా మీటింగ్‌లో ఉంటే.. అటు వధువు దీన్ని చూస్తూ.. గట్టిగా నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోను చూసినోళ్లంతా తెగ ఎంజాయ్ చేసున్నారు. -
నెట్టింట వైరల్: మండపంపై పెళ్లి కొడుకు వర్క్ ఫ్రమ్ హోమ్
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచమంతా కొన్నాళ్లు ఇంటి నుంచి పని చేసే విధానం (వర్క్ ఫ్రమ్ హోమ్) అమల్లో ఉంది. ప్రస్తుతం కరోనా కొంత అదుపులోకి రావడంతో పలు రంగాల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తున్నారు. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ విధానంలోనే విధులు నిర్వహిస్తున్నారు. పైగా కరోనా మూడో దశ వ్యాప్తి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరికొన్నాళ్లు ఇంట్లో నుంచే పని చేయనున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఎన్ని లాభాలు ఉన్నా అన్నేసి కష్టనష్టాలు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈ వీడియో. చివరకు పెళ్లి చేసుకునేందుకు కూడా కంపెనీ వాళ్లు అవకాశం ఇవ్వకపోవడంతో మండపంలో పెళ్లి పీటలపై కూర్చొని వర్క్ ఫ్రమ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడు ల్యాప్‌టాప్‌లో పని చేస్తుండగా బంధుమిత్రులు అది చూసి నవ్వుకుంటున్నారు. ఇక వధువు అయితే పగలబడి నవ్వుతోంది. ఈ వీడియో దుల్హానియా అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో దర్శనమిచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మామూలు కాదని ఆ కష్టం తెలిసిన వారు కామెంట్లు చేస్తున్నారు. వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేయ్ అని సలహా ఇస్తున్నారు. అయితే అతడు తన పెళ్లిని వర్చువల్‌గా బంధువులు చూసేందుకు కెమెరాలు సెట్ చేస్తున్నాడని తెలిపారు. ఏది ఏం చేస్తున్నా అతడు చేసిన పని తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. -
ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూల్, కాలేజీ వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం క్లాస్ లు అన్నీ ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్దులకు ల్యాప్‌టాప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు కొత్తగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని చూస్తుంటే, కొనే ముందు ఒకసారి ఈ విషయాలను గుర్తుంచుకోండి. బడ్జెట్ రూ.50,000 లోపు ఉండాలి కేవలం స్కూల్ లేదా కాలేజీ విద్యార్దుల కోసం విండోస్ ల్యాప్‌టాప్ తీసుకోవాలని అనుకుంటే దానిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హెచ్ పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు రూ.30,000-రూ.50,000 ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ లు తీసుకొస్తున్నాయి. ఫుల్హెచ్డీ డిస్ప్లే సరిపోతుంది ల్యాప్‌టాప్ అధిక రిజల్యూషన్ డిస్ ప్లే ప్యానెల్ వల్ల భారీగా ధర పెరుగుతుంది కనుక అలాంటి డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ అవసరం లేదు. ఫుల్ హెచ్ డీ(1920 8 1080 పీక్సెల్స్) డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ తీసుకున్న సరిపోతుంది. ఇంకా తక్కువ ధరకు ల్యాప్‌టాప్ తీసుకోవాలి అనుకుంటే 1366 * 768 పీక్సెల్స్ ల్యాపీ తీసుకోవచ్చు. ప్రాసెసర్ ముఖ్యమే ఇంటెల్ కోర్ ఐ3 వంటి ల్యాప్‌టాప్ లు ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని సంవత్సరాల పాటు మీరు వాడుతారు కాబట్టి కోర్ ఐ5 ప్రాసెసర్ గల ల్యాప్‌టాప్ తీసుకుంటే మంచిది. ర్యామ్ ఎంత అవసరం మీ ల్యాప్‌టాప్ లో కనీసం 8జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు మీకు ఇది మంచిగా సరిపోతుంది. 4 జీబీ ర్యామ్ మాత్రం తీసుకోకండి. హార్డ్ డ్రైవ్ ఎంత ఉండాలి మీ అవసరాల కోసం 512జీబీ హెచ్ డీడీ లేదా 256జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ సరిపోతుంది. మీ దగ్గర కనుక కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే 512జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్ మీ ల్యాప్‌టాప్ లో ఒరిజినల్ విండోస్ 10 ఓఎస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చాలా కంపెనీ ఉచితంగా విండోస్ 10 ఓఎస్ ను అందిస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం మంచిది. దీని వల్ల మీరు సైబర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 ఉంటే మంచిది. చదవండి: సైబర్ పవర్లో ఇజ్రాయిల్ కంటే వెనుకనే భారత్! -
పడేయకుండా.. ల్యాప్‌టాప్‌కు అంత్యక్రియలు
ఇన్నాళ్లు తాను వినియోగించిన ల్యాప్‌టాప్ ఇక పనికి రాకుండా పోయింది. దాంతో విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో ఆ ల్యాప్‌టాప్‌కు అంత్యక్రియలు చేయాలని ఓ యువకుడు ప్రయత్నాలు చేశాడు. అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు వెళ్లగా అక్కడి సిబ్బంది వింతగా చూశారు. అనంతరం అతడి విజ్ఞప్తికి ససేమిరా అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. టిక్‌టాక్ స్టార్ జెన్ అకా@కింగ్జెన్ తన ల్యాప్‌టాప్‌ను తీస్కోని శ్మశాన వాటిక (ఫ్యూనరల్ హోం)కు వెళ్లాడు. అక్కడ ఉన్న రిసెప్షనిస్టును కలిసి ‘అంత్యక్రియలు చేయాలి’ అని అడగా ‘మృతదేహం ఎక్కడ? అని ఆమె అడిగింది. ‘ఇక్కడే ఉంది. అది నా ల్యాప్టాపే’ అని ఆ యువకుడు తన ల్యాప్‌టాప్‌ను చూపించాడు. అది చూసి ఆమె నోరెళ్లబెట్టింది. ‘ఓ మీ ల్యాప్‌టాప్ చచ్చిపోయిందా?’ అని రిసెప్షనిస్టు అడిగింది. అవును! మీరేమైనా ఏర్పాట్లు (అంత్యక్రియలు) చేయగలరా? అని అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో టిక్‌టాక్‌లో తెగ వ్యూస్ వచ్చేశాయి. ఏకగా 2 మిలియన్ల మందికి పైగా చూశారు. గ్యాడ్జెట్స్‌తో మనకు ఉన్న ప్రేమను.. అనుబంధం చూపించేందుకు ఈ వీడియో రూపొందించినట్లు టిక్‌టాక్ స్టార్ జెన్ తెలిపాడు. కరక్టే కదా! మన శరీరంలో గ్యాడ్జెట్లు ఒక అవయంగా మారాయి. అవి లేనిది మనకు పనులు జరగవు. ఇది తెలిపేందుకు అతడు ఈ వీడియో చేశాడు. ఈ వీడియోకు విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. అయితే అతడు ఏ దేశస్తుడో వివరాలు తెలియరాలేదు. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ల్యాప్‌టాప్‌లు అద్దెకు తీసుకుని..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ఐటీ సంస్థపై బెంగళూరులోని కోరమంగళ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ వద్ద 274 ల్యాప్టాప్స్ అద్దెకు తీసుకుని మోసం చేశారంటూ ఆ ప్రాంతానికి చెందిన కఠాన్ షా ఫిర్యాదు మేరకు అధికారులు దీన్ని రిజిస్ట్రర్ చేశారు. కఠాన్ షా కోరమంగళ ప్రాంతంలోని స్ఫుర్జ్ ఐటీ సరీ్వసెస్ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థ అనేక మంది వ్యక్తులతో పాటు సంస్థలకు ల్యాప్‌టాప్‌లు అద్దెకు ఇస్తుంటుంది. కరోనా ప్రభావంతో అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తమ సేవల్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. వీరికి గత ఏడాది హైదరాబాద్‌కు చెందిన ఫెబ్‌ట్రాక్స్ సంస్థ నుంచి ఓ ఈ–మెయిల్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు విస్తరణ కోసం తమకు 274 అత్యాధునిక ల్యాప్‌టాప్‌లు కావాలంటూ కోరారు. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులుగా చెప్పుకొన్న రాజేష్, రవి పలుమార్లు బెంగళూరుకు వెళ్లి కఠాన్ షాతో సంప్రదింపులు జరిపారు. అద్దెలు ఖరారు చేసుకున్న తర్వాత ఒప్పందాలు రాసుకున్నారు. వీటి ప్రకారం స్ఫుర్జ్ సంస్థ నుంచి ఫెబ్‌ట్రాక్స్‌కు 274 ల్యాప్టాప్స్ అందాయి. తొలుత కొన్ని నెలల పాటు అద్దెను సక్రమంగా చెల్లించిన హైదరాబాద్ సంస్థ ఆ తర్వాత ఆపేసింది. దీనికి సంబంధించి కఠాన్ పలుమార్లు ప్రశ్నించిన సిటీ సంస్థ నుంచి సరైన స్పందన లేదు. దీంతో తమ ల్యాప్‌టాప్‌లు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరినా ఫెబ్‌ట్రాక్స్ పట్టించుకోలేదు. ఈ పరిణామాలతో అనుమానం వచ్చిన కఠాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న హైదరాబాద్‌కు వచ్చి ఫెబ్‌ట్రాక్స్ సంస్థ తమ చిరునామాగా చెప్పిన ప్రాంతానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రాజేష్ ఆ సంస్థ వేరే వారికి విక్రయించినట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన కఠాన్ షా గత వారం కోరమంగళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసంతో తాను రూ.70 లక్షలకు పైగా నష్టపోయినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కోరమంగళ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో భాగంగా ప్రత్యేక టీమ్‌ను త్వరలో సిటీకి పంపనున్నారు. -
మంచి గవర్నర్... భోజనం పెట్టి; ల్యాప్‌టాప్ ఇచ్చి
నందిగామ: ఓ పేద విద్యార్థికి గవర్నర్ తమిళిసై చేయూతనిచ్చారు. అతడి ఆర్థిక దుస్థితికి చలించి కడుపునిండా భోజనం పెట్టి ఓ ల్యాప్‌టాప్ అందజేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బియ్యని ప్రమోద్ మొయినాబాద్ సమీపంలోని జోగినపల్లి బీఆర్ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్ డి తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిం చే ‘మై గవర్నమెంట్ యాప్’లో క్విజ్ పోటీలలో పాల్గొంటుంటాడు. అతడికి ల్యాప్‌టాప్ కొనే ఆరి్థక స్థోమత లేకపోవడంతో తన సమస్యను వివరిస్తూ రాజ్‌భవన్‌కు మెయిల్ చేశాడు. దీంతో ఆదివారం గవర్నర్ కార్యాలయం నుంచి అతడికి పిలుపు వచ్చింది. సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ చేతుల మీదుగా ల్యాప్‌ట్యాప్‌ను అందుకున్నాడు. చదవండి: విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయి: గవర్నర్ -
జియో ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి!
భారత్ టెలికాం రంగంలో తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించి రిలయన్స్ జియో రికార్డు సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే త్వరలో 5జీ మొబైల్స్ కూడా తీసుకొస్తున్నట్లు గతంలో జియో ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రోడక్ట్ ను ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి తీసుకొనిరాబోతుంది. జియో త్వరలో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దానికి సంబందించిన పనులు కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. ‘జియో బుక్’ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌లను ఈ ఏడాది మే నాటికి తీసుకోని రావొచ్చు. రిలయన్స్ జియో బడ్జెట్ ల్యాప్‌టాప్ “జియోబుక్”లో కొత్త జియో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనుంది. జియోబుక్ 4జీ ఎల్‌టీఈకు కూడా సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. సెల్యులార్ కనెక్షన్‌తో పనిచేసే ల్యాప్‌టాప్‌ల తయారీపై జియో ఆసక్తిగా ఉన్నట్లు అమెరికాకు చెందిన క్వాల్‌కోమ్ టెక్నాలజీస్ సీనియర్ ప్రొడక్ట్ డైరక్టర్ మిగ్యుల్ న్యూన్స్ 2018లో తెలిపిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఈ అంశం తెరమీదకు వచ్చింది. జియోబుక్ ల్యాప్‌టాప్ తయారీ కోసం జియో చైనా తయారీదారు బ్లూ బ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సంస్థ ఇప్పటికే తన కర్మాగారంలో 5జీ జియోఫోన్ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు కనిపిస్తోంది. జియోబుక్ స్పెసిఫికేషన్లు(అంచనా) స్పెసిఫికేషన్ల పరంగా.. జియోబుక్ 1,366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్టీఈ మోడెమ్ మోడెమ్‌తో డిస్ప్లేని కలిగి ఉంది. ల్యాప్‌టాప్ తయారీ ఖర్చు తగ్గించడం కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. ఇది 11 నానో మీటర్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఒక మోడల్లో 2జీబీ ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్ తో పాటు 32జీబీ ఇఎంఎంసి స్టోరేజ్ ఉంది. మరో మోడల్లో 4జీబీ ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, 64జీబీ ఇఎంఎంసి 5.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్డీఎంఐ, 5గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్‌కోమ్ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. జియో ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! అమెజాన్.. వెనక్కి తగ్గాలి -
ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్‌ను చూశారా!
బ్రిటన్‌కు చెందిన ఎక్స్‌పాన్ స్కేప్ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్ అరోరా7ను తయారు చేసింది. ‘అరోరా 7’ అనే పేరుతో పిలిచే ల్యాప్‌టాప్ బరువు 11 కేజీలు. ఒకేసారి ఎక్కువ స్క్రీన్లపై పనిచేసే డాటా సైంటిస్ట్‌లు, కంటెంట్ క్రియేటర్స్, సైబర్ నిపుణులకు మొదలైన వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏడు స్క్రీన్లలో నాలుగు 17.3 అంగుళాల 4కే రిజల్యూషన్ స్క్రీన్లు, మిగిలిన మూడు 7 అంగుళాల 1200పీ ఫుల్ హెచ్డీ స్క్రీన్లు కలిగి ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ ఐ9 9900కే ప్రాసెసర్ ఉపయోగించారు. 64 జీబీ ర్యామ్, 2టీబీ స్టోరేజ్ ఇస్తున్నారు. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు. చూసేందుకు బాక్స్ తరహాలో ఉండే ఈ ల్యాప్‌టాప్‌లో స్క్రీన్లు తెరుచుకునేందుకు మొత్తం 13 దశల అన్‌ఫోల్డింగ్ వ్యవస్ధ ఉంది. దీని సహాయంతో అవసరమైన స్క్రీన్లను మాత్రమే తెరిచి పనిచేసుకోవచ్చు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్లలో పనిచేయాలనుకునేవారు ఈ ల్యాప్‌టాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే పలువురు ఈ ల్యాప్‌టాప్ కోసం ముందస్తు ఆర్డర్ చేశారట. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను త్వరలోనే పూర్తిస్థాయిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారట. చదవండి: క్వాల్‌కామ్‌తో ఎయిర్టెల్ జట్టు భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్ -
గ్రామాలకు నిరంతరాయంగా ఇంటర్నెట్
అమ్మఒడి, వసతి దీవెన లబ్ధిదారుల్లో 9 నుంచి 12వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థుల్లో ఆప్షన్‌గా కోరుకున్న వారికి ల్యాప్‌టాప్ అందించడంపై దృష్టి సారించాలి. ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యలను అభ్యసిస్తున్న వారి అవసరాలు తీర్చేలా మరిన్ని స్పెసిఫికేషన్లతో కూడిన ల్యాప్‌టాప్‌లు ఇచ్చేలా ఆలోచించాలి. పంచాయతీ నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి సరైన వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలి. గ్రామాల్లో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి. తద్వారా సొంత గ్రామాల్లోనే ఉంటూ ఇంటి నుంచే పని చేసే (వర్క్ ఫ్రం హోం) అవకాశం ఉంటుంది. ల్యాప్‌టాప్ చెడిపోతే.. దాన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇస్తే, వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలి. లేదా రీప్లేస్ చేయాలి. ఇందుకోసం కంపెనీ నిర్వహణను ఏడాది కాకుండా మూడేళ్లు పెట్టాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని గ్రామాలకు అంతరాయం లేని అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా నెట్వర్క్ వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామంలో నెట్వర్క్ పాయింట్ నుంచి ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని, వినియోగదారులు ఏ సామర్థ్యం కనెక్షన్ కావాలన్నా ఇచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ‘అమ్మ ఒడి’ చెల్లింపుల నాటికి కోరుకున్న వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రతి గ్రామానికీ అన్ లిమిటెడ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయి.. అవాంతరాలు వచ్చే పరిస్థితి ఉండకూడదని, అలాంటి సమస్యలను అధిగమించేలా ఆ వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ‘వైఎస్సార్ జగనన్న కాలనీల్లోకి కూడా ఇంటర్నెట్ నెట్వర్క్ తీసుకు రావాలి. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి. హెచ్‌టి లైన్ నుంచి సబ్‌స్టేషన్ వరకు, సబ్‌స్టేషన్ నుంచి పంచాయతీల వరకు అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకెళ్లే ఆలోచనతో ముందుకు సాగాలి. గ్రామ పంచాయతీ వరకు అన్ లిమిటెడ్ నెట్‌వర్క్‌ను తీసుకెళ్లాలి’ అని చెప్పారు. ఈ సమీక్షలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ పి.గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కస్టమర్ కు రూ.45వేలు చెల్లించిన అమెజాన్
ఒడిశా: ఆన్లైన్లో సహజంగానే ఈ-కామర్స్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. కొన్ని సార్లు ఈ ఆఫర్లు నిజమేనా అని మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. ఈ-కామర్స్ సైట్ల నిర్వాహకులు సాధారణ సమయాలలో కూడా పలు సేల్స్ పేరిట వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సైట్లో తలెత్తిన సాంకేతిక కారణంగా ఒక వినియోగదారుడికి నష్టపరిహారంగా రూ.45వేలు చెల్లించాల్సి వచ్చింది.(చదవండి: పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త) వివరాల్లోకి వెళ్లితే.. ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్ మహాపాత్ర అనే న్యాయ విద్యార్థి 2014లో అమెజాన్‌లో ఒక ల్యాప్‌టాప్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్ రూ.190 ఆఫర్ కింద లభించడంతో దాన్నీ ఆర్డర్ చేసుకున్నాడు. అతను ఆర్డర్ చేసిన రెండు గంటల తర్వాత ఆ ఆర్డర్ రద్దు కావడంతో అమెజాన్ కస్టమర్‌ను సంప్రదించాడు. అమెజాన్ కస్టమర్ కేర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సాంకేతిక సమస్య కారణంగా తక్కువ ధర చూపించిందని తెలపడంతో పాటు ఆ ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతను ఈ విషయాన్నీ విడిచిపెట్టకుండా ఒడిశా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అత్యవసరంగా ల్యాప్‌టాప్ అవసరం ఉన్నందున తాను రూ.190కి ల్యాప్‌టాప్ అని చూసి దాన్ని ఆర్డర్ చేస్తే అమెజాన్ దాన్ని రద్దు చేసిందని, కనుక తనకు న్యాయం చేయాలని అతను కోరాడు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ విచారణ తాజాగా ముగిసింది. ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆర్డర్ రద్దు చేసినందుకు బాధితుడికి నష్ట పరిహారం కింద రూ.40వేలు, ఖర్చుల కింద మరో రూ.5వేలను అమెజాన్ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ వార్త చదివిన చాలా మంది నిజమే వినియోగదారుడిని మోసం చేసినందుకు అమెజాన్ కు కమిషన్ సరైన శిక్ష విధించిందని పేర్కొన్నారు. -
బిగ్‌బాస్: అఖిల్‌కు ఊహించని బహుమతి
'నువ్వు గెలిస్తే నాకు ల్యాప్‌టాప్, బైక్ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా' ఇది ఎక్కడో విన్నట్లుంది కదూ.. అవును ఈ మధ్యే విజయవంతంగా పూర్తైన బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అఖిల్, సోహైల్ కుదుర్చుకున్న డీల్ ఇది. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా! వీరి విషయంలో కూడా అంతే... 25 లక్షల రూపాయలకు టెంప్ట్ అయి సోహైల్ ట్రోఫీ రేసు నుంచి తప్పుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ఎలాగైనా టాప్ 2లో ఉండాలన్న కోరికతో అడుగుపెట్టి గ్రాండ్ ఫినాలే వరకు వచ్చిన అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. ఇద్దరినీ వెనక్కు నెట్టి అభిజిత్ విజేతగా అవతరించాడు. అలా వీరి డీల్ మధ్యలోనే ఆగిపోయింది. ల్యాప్‌ట్యాప్‌తో అభిమానం చాటుకుంది ఎవరికీ బైక్, ల్యాప్‌ట్యాప్ రాకుండా పోయింది అనుకుంటున్న తరుణంలో అఖిల్‌కు మాత్రం ఓ మంచి ల్యాప్‌ట్యాప్ వచ్చింది. జయలక్క్క్ష్మి అనే మహిళా అభిమాని విజయవాడ నుంచి వచ్చి మరీ అతడికి ల్యాప్‌ట్యాప్‌ను బహుమతిగా ఇచ్చింది. రెప్పకాలంపాటు ఇది నిజమా? కలా? అనుకున్న అఖిల్ కళ్లముందు అభిమాని ల్యాప్‌ట్యాప్ బ్యాగు పట్టుకుని కూర్చుండటం చూసి నమ్మక తప్పలేదు. తనకు అంత ఖరీదైన బహుమతినిచ్చినందుకు అఖిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఆమెకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీక మాటలు వెతుక్కున్నాడు. ఎలాగైతేనేం ల్యాప్‌ట్యాప్ కావాలన్న తన స్నేహితుడి కోరిక నెరవేరినందుకు అతడి జిగిరీ దోస్త్ సోహైల్ కంగ్రాట్స్ తెలిపాడు. పలువురు అభిమానులు కూడా అఖిలే నంబర్ 1 అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) 'సిటీమార్'లో అఖిల్ కాగా ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ దాదాపు ఏదో ఒక పనిలో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా దివి, సోహైల్, మెహబూబ్, మోనాల్, అభిజిత్‌కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే అఖిల్‌కు కూడా ఏదో మంచి అవకాశం వచ్చిందట. కానీ దాన్ని సంక్రాంతికి చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే గోపీచంద్ సిటీమార్ సినిమాలో సెకండాఫ్ కోసం అఖిల్‌ను తీసుకున్నారన్న టాక్ అయితే నడుస్తోంది. మరి తనకు వచ్చిన అవకాశం అదేనా? ఇంకేదైనా ఉందా? అనే విషయాలను ఆయన అధికారికంగా చెప్పేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: కోటి రూపాయలు ఎగ్గొట్టిన వర్మ) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
శారదకు అండగా ‘టిటా’
సాక్షి, హైదరాబాద్ : కరోనా మూలంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శారదకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల శనివారం శారదకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ను అందచేశారు. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, కృత్రిమ మేథస్సు (ఏఐ) టెక్నాలజీపై శారదకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో టిటా చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉచిత శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను శారదకు అందించారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శారద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. (‘సాఫ్ట్వేర్ శారద’కు సోనూసూద్ జాబ్) -
షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి ఇక ల్యాప్ ట్యాప్ మార్కెట్లో దూసుకపోయేందుకు సిద్ధమవుతోంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలను అందబాటు ధరల్లో తీసుకొచ్చి వినియోగదారులను విపరీతంగా ఆకర్షించిన షావోమి నోట్‌బుక్‌ను భారతదేశంలో లాంచ్ చేయనుంది. షావోమి రెడ్‌మిబుక్ పేరుతో దీన్ని ఈ నెల 11 వతేదీన ఆవిష్కరించనుంది. (రెడ్మీ 10 ఎక్స్ వచ్చేసింది..) ఎంఐ నోట్‌బుక్ జూన్ 11న భారతదేశంలో ప్రత్యేకంగా ప్రారంభించబోతున్నట్లు షావోమి ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ సోమవారం ధృవీకరించారు. భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, ఇండియాలోనే తయారు చేసిన వీటిని తీసుకొస్తున్నట్లు ట్వీట్ చేశారు. తద్వారా ల్యాప్‌టాప్ మార్కెట్లో హెచ్‌పీ ఆపిల్, డెల్, లెనోవా వంటి టాప్ బ్రాండ్లతో కంపెనీ పోటీ పడాలని షావోమి చూస్తోంది. (మరో సంచలనం దిశగా షావోమి) ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు, ఫీచర్ల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కానప్పటికీ రాబోయే షావోమి ల్యాప్‌టాప్ 1సీ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్కు మద్దతుతో, 35 నిమిషాల్లో 0-50 శాతం వరకూ రీఛార్జ్ చేయగలదని అంచనా. షావోమి రెడ్మి బుక్ ప్రత్యేకతలు 13.3-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే (యాంటీ గ్లేర్ ) 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ 5, 7, ప్రాసెసర్లు ప్రధానంగా ఉండనున్నాయి. ఇక ధరల విషయానికి వస్తే.. రూ. 47,490, రూ. 54,800 ధర వద్ద ప్రారంభం కానున్నాయి. 📢 The brand new #MiNotebook will make its #Global #Debut in #India and will be: 🇮🇳 India 1st 🇮🇳 India exclusive 🇮🇳 Made for India Block the date: 𝐉𝐔𝐍𝐄 𝟏𝟏. No, it's not exactly what you're thinking 😇. RT 🔁 if you can't wait to see it.#Xiaomi ❤️️ pic.twitter.com/IKYkHnSQAk — Manu Kumar Jain (@manukumarjain) June 1, 2020 -
ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు దొరికాయి.. తీసుకెళ్లండి
సాక్షి, తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్‌లోని 4వ ఫ్లాట్‌ఫాంలో 2015 సంవత్సరం నవంబర్ 18వ తేదీన 7 మొబైల్స్, మూడు ల్యాప్‌ట్యాప్‌లు (వివిధ రంగుల్లో, వివిధ కంఫెనీలకు చెందినవి) గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లారు. ఆమేరకు రైల్వే ప్రభుత్వ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా విశాఖపట్నం మువ్వలపాలెం పోలీస్‌స్టేషన్ వారు శుక్రవారం వాటిలో ఓ ల్యాప్‌టాప్, ఓ మొబైల్ ఫోన్‌కు చెందిన బిల్లులతోపాటు తగిన ఆధారాలతో రావడంతో వారికి తిరుపతి రైల్వే ప్రభుత్వ సీఐ రామకృష్ణ నేతృత్వంలో అందజేశారు. మిగిలిన 6 మొబైల్స్, రెండు ల్యాప్‌టాప్‌లకు చెందిన బిల్లులు తగిన ఆధారాలతో సీఐ రామకృష్ణను సంప్రదిస్తే వారికి అందజేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. వివరాలకు 0877 2225347, 94406 27638 సంప్రదించాల్సి ఉందని తెలియజేశారు. (చదవండి: బెడిసికొట్టి జనసేన కిడ్నాప్ డ్రామా) -
'మీరిచ్చే ఆఫర్ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది'
ఆస్టిన్ : ఆస్టిన్ నుంచి లాస్ ఏంజిల్స్ వెళ్లడానికి పాట్రిక్ కాసిడీ అనే వ్యక్తి బుధవారం డెల్టా ఎయిర్‌లైన్స్ ఎక్కాడు. కాసిడీ తన సీటులో కూర్చుని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి పని చేసుకుంటున్నాడు. ఇంతలో తన ముందు సీటులో కూర్చున్న వ్యక్తి నిద్రపోవడానికి తన సీటును వెనక్కు వాల్చాడు. దాంతో ల్యాప్‌టాప్ మీద సీటు బరువు పడడంతో కంప్రెస్ అయి స్ర్కీన్ పగిలిపోయింది. అయితే తన ల్యాప్‌టాప్ అలా అవడానికి కారణమైన వ్యక్తిని ఏం అనకుండా కాసిడీ ఆ విషయాన్ని డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి ట్విటర్లో షేర్ చేశాడు. @Delta small note for the suggestion box, maybe have a little warning sign or someway to prevent my laptop from being destroyed when the person in front of me reclines their seat. pic.twitter.com/QHmphXiDhH — Pat Cassidy (@HardFactorPat) February 26, 2020 ' @డెల్టా ఎయిర్‌లైన్స్.. ముందు సీటులో కూర్చున్న వ్యక్తి తన సీటును వెనక్కి వాల్చే ముందు తగిన హెచ్చరికలు బోర్డులు పెడితే బాగుండేది. మీరు అలా పెట్టకపోవడం వల్లే నా ల్యాప్‌టాప్ ద్వంసమైంది' అని పేర్కొన్నాడు. దీంతో పాటు ల్యాప్‌టాప్ ఫోటోను కూడా వారికి షేర్ చేశాడు. అయితే ఈ విషయంపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందించింది. కాసిడి ఫిర్యాదు మేరకు అతని వస్తువుకు భంగం కలిగించినందుకు మా విమానంలో ఎప్పుడైనా సరే 7500 మైళ్లు ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించింది. అయితే కాసిడీ రీట్వీట్ చేస్తూ..' నాకు 7500 మైళ్లు ఉచిత ప్రయాణం ఆఫర్ చేయడం బాగానే ఉంది. కానీ మీరు ఇచ్చిన ఆఫర్ ఒక ఆరేళ్ల పిల్లాడికి ఇచ్చుంటే ఎగిరి గంతేసేవాడు' అని పేర్కొన్నాడు. అయితే కాసిడి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ల్యాప్‌టాప్ ధ్వంసం కావడానికి ఒక వ్యక్తి కారణమైతే డెల్టా ఎయిర్‌లైన్స్‌ను ఆశ్రయించడం ఏంటని....డెల్టా ఎయిర్‌లైన్స్ ఇచ్చిన ఆఫర్ తీసుకుంటే బాగుండేదని కొందరు పేర్కొనగా... మరి కొందరు మాత్రం పాట్రిక్‌కు మద్దతుగా నిలిచారు. Update: @Delta is giving me the equivalent of a $75 gift card and an explanation that you would give a six year old. Cool. pic.twitter.com/etGLUXOOjs — Pat Cassidy (@HardFactorPat) February 29, 2020 -
లెనోవో నుంచి నూతన థింక్‌ప్యాడ్‌లు
న్యూఢిల్లీ: లెనోవో నూతన తరం థింక్‌ప్యాడ్, థింక్ సెంటర్‌పీసీలను మంగళవారం విడుదల చేసింది. వాణిజ్య ఐవోటీ, సెక్యూరిటీ సొల్యూషన్లలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. థింక్‌ప్యాడ్ టీ490, థింక్‌ప్యాడ్ ఎక్స్390, థింక్‌సెంటర్ నానో, థింక్‌సెంటర్ నానో ఐవోటీ ఆవిష్కరించిన వాటిల్లో ఉన్నాయి. సులభమై, భద్రతతో కూడిన, వేగవంతమైన, అధిక పనితీరు చూపించే పరికరాలను నేడు ఉద్యోగులు కోరుకుంటున్నారని, థింక్‌ప్యాడ్ ఈ అవసరాలను తీరుస్తుందని ఈ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా లెనోవో ఇండియా ఎండీ, సీఈవో రాహుల్ అగర్వాల్ పేర్కొన్నారు. కళ్లను సురక్షితంగా ఉంచే టెక్నాలజీతో వీటిని రూపొందించినట్టు వెల్లడించారు. -
లెనొవొ నుంచి అధునాతన గేమింగ్ ల్యాప్‌టాప్
న్యూఢిల్లీ: ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ (పీసీ) తయారీ కంపెనీ ‘లెనొవొ’.. తాజాగా తన అధునాతన గేమింగ్ ల్యాప్‌టాప్, పీసీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘లెజియన్ వై 540’ పేరుతో ల్యాప్‌ట్యాప్.. ‘లెజియన్ వై 740’ పేరిట డెస్క్‌టాప్‌లను మంగళవారం విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 70,000 నుంచి రూ. 1.3 లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శైలేంద్ర కటియల్ మాట్లాడుతూ.. ‘గతేడాది మొదటి త్రైమాసికంలో లెజియన్ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. దీనికి 14.6% మార్కెట్ వాటా లభించింది. నూతన మోడళ్లతో ఈ ఏడాది మూడవ క్వార్టర్లో 20% మార్కెట్ వాటాకు ఎగబాకుతుందని భావిస్తున్నాం. ఇక రెండేళ్ల కిందట శాతంగా ఉన్న గేమింగ్ మార్కెట్.. ఇప్పుడు 5 శాతానికి పెరిగింది. రూ. 60,000– రూ. 80,000 మధ్య శ్రేణి గేమింగ్ ల్యాప్‌టాప్‌ల మార్కెట్ భారత్‌లో శరవేగంగా వృద్ధిచెందుతోంది’ అని వ్యాఖ్యానించారు. -
విమానాల్లో ‘యాపిల్ మాక్‌బుక్ ప్రో’ తేవద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు యాపిల్ మాక్‌బుక్ ప్రో 15 అంగుళాల మోడల్ ల్యాప్‌టాప్‌ను తీసుకురావద్దని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రయాణికులను కోరింది. ఆ మోడల్లోని కొన్ని ల్యాప్‌టాప్‌ల బ్యాటరీలు అధికంగా వేడికి గురవుతున్నాయని, ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇదే విషయమే జూన్ 20వ తేదీన యాపిల్ సంస్థ సైతం తమ వెబ్సైట్లో ఈ మోడల్ ల్యాప్‌టాప్‌లకు సంబంధించి ఓ హెచ్చరిక నోటీసును అందుబాటులో ఉంచింది. దీని ప్రకారం సెప్టెంబర్–2015 నుంచి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో విక్రయించిన ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీ అధిక వేడికి గురవుతుందని పేర్కొంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీలను ఉచితంగానే మార్పు చేయాలని నిర్ణయించామని యాపిల్ సంస్థ తెలిపింది. బ్యాటరీని మార్పు చేసుకునే వరకు ప్రయాణికులు ఆ మోడల్ ల్యాప్‌టాప్‌లను తీసుకోరావద్దని డీజేసీఏ చీఫ్ అరుణ్ కుమార్ ట్వీట్ చేశారు. -
డెల్ సూపర్ ల్యాప్‌టాప్ : అన్నీ ఎక్స్‌ప్రెస్ ఫీచర్లే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ దిగ్గజం డెల్ ఇండియా సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. వైర్లెస్ చార్జింగ్ ల్యాప్‌టాప్ లాటిట్యూడ్ 7000 సిరీస్‌లో భాగంగా లాటిట్యూడ్ 7400 14 అంగుళాల 2 ఇన్ వన్ ల్యాప్‌టాప్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,35,000 గా నిర్ణయించింది. ఇంటెల్ కంటెక్ట్స్ టెక్నాలజీ ఆధారిత సెన్సర్‌ను ఇందులో జోడించింది. ఎక్స్‌ప్రెస్ చార్జింగ్, ఎక్స్‌ప్రెస్ కనెక్ట్లాంటి ఫీచర్లతో యూజర్లకు బెస్ట్ అనుభవాన్ని ఇస్తుందనీ, ఎలాంటి అంతరాయం లేకుండా వేగవంతమైన, సర్వీసులను అందిస్తుందని డెల్ ప్రకటించింది. స్లీప్‌మోడ్‌లో ఉన్న ల్యాప్‌టాప్ యూజర్ ఉనికిని గుర్తించి విండోస్ హలో (బయోమెట్రిక్ యాక్సెస్) కు లాగిన్ అవుతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. తద్వారా సెక్యూరిటీతో బ్యాటరీ పొదుపు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఫింగర్ ప్రింట్ రీడర్, పవర్ బటన్ లాంటి ఇన్నోవేటివ్ ఫీచర్లతో వ్యాపార సంస్థలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని డెల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఇంద్రజిత్ బెలగుండి చెప్పారు. అయితే ఆసక్తి ఉన్న సాధారణ వినియోగదారులు కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. తొందరలోనే ఆన్లైన్, రీటైల్ స్టోర్లలో ఈ ల్యాప్టాప్లనుఅందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
ఆ ల్యాప్‌టాప్ ఏమైంది?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చెందిన నగదుతో పాటు పట్టుబడ్డ ల్యాప్‌టాప్ ఏమైంది? దాని గుట్టును అధికారులు విప్పారా? ఒకవేళ విప్పితే ఏయే రహస్యాలు బయటపడ్డాయి? ఇప్పటివరకు వాటిని ఎందుకు బహిర్గతం చేయలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కర్నూలు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ప్రైవేటు లాడ్జీలో కోడుమూరు టీడీపీ అభ్యర్థి రామాంజినేయులు తరఫున వ్యవహారాలు నడుపుతున్న ఓ వ్యక్తి వద్ద నగదుతో పాటు చెక్‌బుక్‌లు, ల్యాప్‌టాప్ దొరికాయి. ఈ విషయాన్ని కర్నూలు నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ కూడా అప్పట్లో ధ్రువీకరించారు. ల్యాప్‌టాప్‌లో అప్పటి అధికార పార్టీ వ్యవహారాలతో పాటు నగదు లావాదేవీల వివరాలు కూడా నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దాన్ని వదిలేయాలంటూ అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఇక్కడి అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు. వారు వినకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ల్యాప్‌టాప్ దొరికిందని ప్రకటించినప్పటికీ అందులో ఏ సమాచారం ఉందన్న విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. ఇంకా రహస్యంగానే.. ఎన్నికలు ముగిసిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడైనా ల్యాప్‌టాప్ గుట్టును అధికారులు రట్టు చేస్తారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందులో నగదు పంపిణీ వివరాలతో పాటు మరిన్ని రహస్యాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఆర్థిక లావాదేవీలతో పాటు మరికొద్ది మందిఆ పార్టీ అభ్యర్థుల ఆర్థిక లావాదేవీలు, ఏయే కాంట్రాక్టర్ల నుంచి ఎంత మొత్తం సమీకరించాల్సి ఉందన్న అంశాలు కూడా ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తమై ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి కీలకమైన ల్యాప్‌టాప్ కావడం వల్లే అప్పటి ఇంటెలిజెన్స్ డీజీతో పాటు నేరుగా సీఎంవో జోక్యం చేసుకుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఏకంగా ల్యాప్‌టాప్‌ను మార్చేశారా అనే ప్రశ్నలు సైతం ఉదయిస్తున్నాయి. నగదు మాటేమిటి? ల్యాప్‌టాప్ గుట్టును తెలియజేయకపోవడంతో పాటు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ నగదును కూడా చాలా కొంచెం చూపినట్టు తెలుస్తోంది. తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడిందన్న ప్రచారం అప్పట్లో సాగింది. అయితే..పోలీసులు రూ.వేలల్లోనే చూపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల్లో పనిచేసేందుకు ఎక్కడి నుంచో వచ్చిన సదరు వ్యక్తి వద్ద కేవలం వేలల్లోనే నగదు పట్టుబడిందంటే నమ్మశక్యంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో తనిఖీలు జరిపిన పోలీసులు కళ్లు గప్పారా? లేదా ఒత్తిళ్లకు తలొగ్గి తూతూమంత్రంగా చూపించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే తప్ప అసలు రహస్యాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. రాయల్టీ ఇన్స్పెక్టర్పై దాడి డోన్ రూరల్ : పట్టణ సమీపంలోని కంబలపాడు సర్కిల్లో శనివారం అర్ధరాత్రి రాయల్టీ ఇన్స్పెక్టర్ నాగరాజుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పట్టణ సీఐ కళావెంకటరమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కంబలపాడు సర్కిల్లో శనివారం అర్ధరాత్రి రాయల్టీ ఇన్స్పెక్టర్ నాగరాజు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మోస్ట్ డేంజరస్ ల్యాప్‌టాప్ ఇదే
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్ ఒకటి ఆన్లైన్ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్లు ఈ ల్యాప్‌టాప్ తిష్టవేశాయి. అందుకే 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ ల్యాప్‌టాప్‌గా పేరు తెచ్చుకుంది. అత్యంత ప్రమాదకరమైన, ప్రపంచానికి భారీ నష్టాన్ని మిగిల్చిన ఆరు వైరస్లు ఇందులో పొంచి వున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో సుమారు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందట. అలాంటి ల్యాప్‌టాప్ వేలమా? పైగా అంత భారీ ధర పలకడమా? విచిత్రంగా ఉంది కదూ.. సెక్యూరిటీ సంస్థ డీప్ ఇన్స్టింక్ట్ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్నెట్ ఆర్టిస్ట్ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అతి ప్రమాదకరమైన ఆరు వైరస్‌లను లైవ్లీగా ఉంచి మరీ, ఈ డివైస్‌ను వేలానికి వుంచారు. డిజిటల్ ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును భౌతికంగా ప్రజలకు తెలియ చెప్పేందుకే ఈ ప్రయత్నమని గ్వో చెప్పారు. కంప్యూటర్లోని భయంకరమైన వైరస్లు మనల్ని భౌతికంగా ప్రభావితం చేయలేవని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ అవి ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో గమనించలేక పోతున్నారన్నారు. అందుకే ఆర్థికంగా భారీ నష్టాన్ని కలుగ జేసిన ఈ ఆరు భయంకరమైన వైరస్‌లను ఎంచుకున్నట్టు తెలిపారు. విండోస్ ఎక్స్పీ ఆధారిత శాంసంగ్ ఎన్సీ10 దీని పేరు.10.2 అంగుళాల 14జీబీ (2008) డివైస్ ఇది. వైఫై, ఫ్లాష్‌డ్రైవ్‌కి కనెక్ట్ చేయనంత వరకూ దీన్నుంచి మిగతా పీసీలకు ఈ వైరస్‌లకు వ్యాపించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు. ఐ లవ్యూ, మైడూమ్, సోబిగ్, వాన్నా క్రై, డార్క్ టెక్విలా బ్లాక్ఎనర్జీ అనే ఆరు వైరస్లు ఈ ల్యాప్‌టాప్‌లో దాగి వున్నాయి. 'ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్' అనే శీర్షికతో, గ్వోఓ ఓ డోంగ్ దీన్ని సృష్టించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న ప్రైవేట్ వేలంలో ఇది ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.8 కోట్ల, 34 లక్షలు) ధర పలుకుతోంది. అద్భుతమైన ఈ ఆర్ట్‌పీస్‌పై ఆసక్తి వున్నవారు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. -
అల్లు శిరీష్‌కు ఎంత పెద్ద మనసో..!!
విండోస్ యూజర్‌గా 20 ఏళ్ల పాటు కొనసాగిన టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, మ్యాక్ యూజర్‌గా మారిపోయారు. తన అన్న అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్‌తో అల్లు శిరీష్‌కు కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. ఈ సందర్భంగా తన అన్నకు కృతజ్ఞత చెబుతూ.. అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వెంటనే రిప్లైగా ఓ యూజర్ ఒక ట్వీట్ చేశాడు. ‘అన్నా నాకు కూడా ఒక చిన్న ల్యాప్‌టాప్ గిఫ్ట్ ఇవ్వు అన్నా. నేను కొనాలి అంటే ఇంకో మూడేళ్లు పడుతుంది. నాకు ఫ్యామిలీ ఉంది. శాలరీ తక్కువ. నా ఉద్యోగంలో ల్యాప్‌టాప్ వాడకం ఎక్కువ కానీ నాకు ల్యాప్‌టాప్ లేదు. కానీ నేను మీకు చాలా పెద్ద అభిమానిని శ్రీ’ అంటూ అల్లు అర్జున్‌కు, అల్లు శిరీష్‌కు ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేశాడు. అభిమాని బాధను అర్థం చేసుకున్న వెంటనే అల్లు శిరీష్, ‘అయ్యో.. బాధపడకు బ్రదర్, నీవు సంపాదిస్తున్నావు. మీ కుటుంబాన్ని పోషిస్తున్నాయి. నా దగ్గర కొత్త ల్యాప్‌టాప్ ఉంది. నా సోని వైవో ల్యాప్‌టాప్‌ను నీవు తీసుకో. కూల్. నాకు డైరెక్ట్ మెసేజ్ పంపు. చీర్స్’ అంటూ ఈ యంగ్ హీరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అల్లు శిరీష్‌కు ఎంతో పెద్ద మనసో అంటూ.. అభినందనలు వెల్లువ కొనసాగుతోంది. సూపర్ అన్నయ్య మీలాంటి వాళ్లు రిప్లయ్ ఇవ్వడమే గొప్ప గిఫ్ట్ అని, దయా హృదయం అంటూ.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అల్లు శిరీష్ అభిమానులు. కొంతమంది కొంటె అభిమానులు ‘అన్నా.. నాకు ఎప్పుడు ఇస్తావు గిఫ్ట్’ అంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. బ్రదర్ నాకు ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ కావాలి. కొనాలంటే ఐదేళ్లు పట్టేలా ఉంది అంటూ మరో యూజర్ కొంటెగా రిప్లయి ఇచ్చాడు. అన్నా అలాగే ఇంకొంచెం పెద్ద మనసు చేసుకుని ఏపీ 9 బీడ్ల్యూ 666 ని నాకు ఇచ్చేయ్ అంటూ ట్వీట్ చేశాడు. త్వరలో అల్లు అర్జున్ మీకు కొత్త కారు గిఫ్ట్‌గా ఇస్తారంటూ కూడా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. After being a Windows user for 20 yrs I've made the move to MacOS. Thank you @alluarjun for the gift. From my BenQ Joybook in school to now, you've always gifted me my laptops. pic.twitter.com/9G7oZs6Kd6 — Allu Sirish (@AlluSirish) September 26, 2018 Ayyo.. Dont worry bro, you earn and support your family.. Since I have new laptop, you take my Sony Vaio. Cool? Send me a DM. Cheers. https://t.co/GTKLDWn7I5 — Allu Sirish (@AlluSirish) September 27, 2018 -
అద్భుత ఫీచర్లతో ప్రపంచంలోనే తొలి సూపర్ ల్యాప్‌టాప్
సాక్షి, న్యూఢిల్లీ: చైనీస్ తయారీదారు లెనోవా అద్భుత ఫీచర్లతో ఒక ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక స్టోరేజ్ కెపాసిటీతో తొలి డివైస్నువిడదుల చేసింది. థింక్‌ప్యాడ్ పీ 52 పేరుతో లాంచ్ చేసింది. వర్చువల్ రియాల్టీ సామర్థ్యాలతో 128 జీబీ ర్యామ్, 6టీబీ స్టోరేజ్ కెపాసిటీతో దీన్ని ప్రవేశపెట్టింది. జూన్ చివరినాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ల్యాప్‌టాప్ ధర సుమారు రూ.81 వేల నుంచి ప్రారంభమవుతుంది. లెనోవా థింక్‌ప్యాడ్ పి52 ఫీచర్లు 15.6 అంగుళాల 4కె టచ్ స్క్రీన్ డిస్ ప్లే 1920x1080 పిక్సెల్ రిసల్యూషన్ 8 వ జనరల్ ఇంటెల్ జియోన్ హెక్సా-కోర్ ప్రాసెసర్ 2.5 కిలోగ్రాముల బరువు కనెక్టివిటీ పరంగా ఇందులో యూఎస్బీ 3.1 టైప్-ఎ, రెండు: యూఎస్బీ- సి / థండర్ బోల్డ్, ఒక హెచ్డీఎంఐ 2.0, ఒక మినీ డిస్ప్లేపోర్ట్ 1.4, ఎస్డీ కార్డ్ రీడర్‌ను అందిస్తుంది. అంతేకాదు ఈ ల్యాప్‌టాప్‌లో ఐదు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆప్షన్స్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. విండోస్ 10 ప్రో, విండోస్ 10 ప్రో, విండోస్ 10 హోమ్, ఉబూన్-2 మరియు లైనక్స్ కోసం విండోస్ 10 ప్రో, ఐదు ఆపరేటింగ్ సిస్టమ్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఇందులోని ఇన్ఫ్రారెడ్ కెమెరా (ఫేస్ రికగ్నిషన్ వీడియో కాలింగ్ కోసం హెచ్డీ వెబ్ కెమెరాలా ఉపయోగపడుతుంది. -
షాకింగ్ : ట్విటర్ సీఈవో దగ్గర ల్యాప్‌టాప్ లేదట!
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ తెలుసుగా.. ఈ కంపెనీకి సీఈవో అంటే ఏ స్థాయిలో ఉండొచ్చు. ఆయన వాడని గాడ్జెట్స్ అంటూ ఉండవు. ఆయన దగ్గర లేని వస్తువంటూ ఉండదు. కానీ ట్విటర్ సీఈవోగా పనిచేస్తున్న జాక్ డోర్సే ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. అది వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. డోర్సే దగ్గర ల్యాప్‌టాప్ లేదట. ప్రపంచాన్ని ఏలే ఓ అతిపెద్ద టెక్ కంపెనీ సీఈవో ల్యాప్‌టాప్ లేకపోవడమేంటని చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నిజంగానే జాక్ డోర్సే దగ్గర ల్యాప్‌టాప్ లేదట. దీనికి గల కారణం ఆయన ల్యాప్‌టాప్ వాడకపోవడమేనట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, డోర్సే ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ల్యాప్‌టాప్ వాడననని, ప్రతీది తన ఫోన్ ద్వారానే నిర్వహిస్తానని చెప్పారు. తన సొంత ఆన్లైన్ సెక్యురిటీ ప్రాక్టిస్ విషయాలపై మాట్లాడుతున్న సమయంలో డోర్సే ఈ విషయాన్ని రివీల్ చేశారు. నోటిఫికేషన్లన్నింటినీ ఆపివేసి, ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేస్తానని, తన ముందున్న దానిపైనే దృష్టిపెట్టడం తనకు అలవాటని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌పై అన్ని ఒకేసారి చేయడం కంటే ఇదే బెస్ట్ అని చెప్పారు. అయితే చిన్న ఫోన్ స్క్రీన్‌పై టైప్ చేయడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించగా.. ల్యాప్‌టాప్‌లాగా ఫోన్‌ను వాడటానికి పలు వాయిస్ టైపింగ్ టూల్స్ ఉన్నాయన్నారు. కేవలం మైక్రోబ్లాగింగ్ కంపెనీని నిర్వహించడమే కాకుండా.. తన డిజిటల్ జీవితాన్ని, నిజ జీవితాన్ని తగిన విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ.. పలువురి మన్ననలు పొందుతున్నారు. ప్రైవసీ, సెక్యురిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించాలని, మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి, మీ వద్ద ఉన్న కంపెనీ డేటాకు రక్షణ కలిగించడానికి అవసరమైన టూల్స్ గురించి తెలుసుకుని ఉండాలని చెప్పారు. 2015లో జాక్ డోర్సే రెండోసారి ట్విటర్ సీఈవోగా ఎంపికయ్యారు. -
4జీ ల్యాప్‌టాప్ వస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 4జీ ఫోన్లే కాదు. ల్యాప్‌టాప్‌లూ వస్తున్నాయ్. కాకపోతే వీటిని తెస్తున్నది మాత్రం హైదరాబాదీ స్టార్టప్ ఆర్డీపీ. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్కూ పరిచయం చేస్తున్న తమ ప్రాజెక్టు ఇప్పటికే 80 శాతం పూర్తయిందని.. 4జీతో పాటూ 24 గంటల బ్యాటరీ బ్యాకప్, ధర కూడా రూ.15 వేల లోపే ఉంటుందని చెప్పారు ఆర్డీపీ ఫౌండర్ అండ్ సీఈఓ విక్రమ్ రెడ్లపల్లి. ఈ ఏడాది ఏకంగా 10 మోడళ్లను విడుదల చేస్తామన్నారు. డిగ్రీ పూర్తయ్యాక అనంతపురంలో చిన్న కంప్యూటర్ సర్వీస్ సెంటర్లో పనిచేసిన విక్రమ్.. అక్కడే ఏకంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్‌ను తయారు చేసే కేంద్రమే పెట్టేశాడు. ఆర్డీపీ భవిష్యత్తు ప్రణాళికలను ఆయన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది అనంతపురంలోని కదిరి. ఎస్కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేశా. అక్కడే కంప్యూటర్ సర్వీసెంగ్ సెంటర్‌తో పాటు తొలి సైబర్ కేఫ్ ప్రారంభించా. 2004లోనే స్థానిక కేబుల్ ఆపరేటర్లతో కలిసి ఇంటింటికీ ఇంటర్నెట్ ఇవ్వాలని ప్రయత్నించా. కానీ, బ్యాండ్‌విడ్త్, శాటిలైట్ సమస్యలతో అది సక్సెస్ కాలేదు. 2008లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు థిన్ క్లింట్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా. నాలుగేళ్ల ఈ డిస్ట్రిబ్యూషన్లో వ్యాపారం, నెట్వర్కింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఏంటనేది నేర్చుకున్నా. అదే సమయంలో చైనాలో ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో జరిగింది. విమానం ఎక్కాలనే కోరిక కూడా తీరుతుందని నేరుగా ఎక్స్‌పోకు వెళ్లా. స్థానికంగా ఒకటిరెండు టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సైబర్ సొల్యూషన్ బ్రాండ్ పేరిట వంద కంప్యూటర్లు తయారు చేయించుకొని ఇక్కడ విక్రయించడం మొదలుపెట్టా. అక్కడి నుంచి సొంతంగా బ్రాండ్ ఉండాలని నిర్ణయించుకొని 2012లో ఆర్డీపీ పేరిట సొంత కంపెనీ ప్రారంభించా. టెక్నాలజీ తెలిసిన ఎవరికైనా సరే థిన్‌క్లింట్ అంటే రిమోట్ డెస్క్‌టాప్ ప్రొటోకాల్ (ఆర్డీపీ) అనే. కానీ, సొంతగా కంపెనీ పెట్టాక కూడా ఆర్డీపీ అనే ఉంచడానికి కారణం.. అది మా ఇంటి పేరు కూడా కావటమే. థిన్‌క్లింట్ లోగో కూడా మార్చి.. ఆర్డీపీ అంటే రెడ్లపల్లిగా మార్చేశా. ఇప్పటివరకు ఆర్డీపీలో రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టా. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్.. ప్రస్తుతం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్, థిన్క్లింట్స్ మూడు విభాగాల్లో 16 మోడల్స్ ఉన్నాయి. ధరలు రూ.3,500 నుంచి రూ.45 వేల వరకూ ఉన్నాయి. ఎంటర్ప్రైజ్, రిటైల్, ఈ–కామర్స్ మూడు మాధ్యమాల్లో ఆర్డీపీ విక్రయాలుంటాయి. ఎంటర్ప్రైజ్లో కార్వీ, కేర్ ఆసుపత్రి, సేఫ్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రాబ్యాంక్, ఎయిర్ ఇండియా వంటి 3 వేలకు పైగా కంపెనీలు మా కస్టమర్లు. రిటైల్‌లో 26 ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్లున్నాయి. సొంత వెబ్‌సైట్‌తో పాటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే వంటి ఈ–కామర్స్ సంస్థల్లోనూ మా ఉత్పత్తులను కొనొచ్చు. తెలుగు రాష్ట్రాల వాటా 35 శాతం.. గత ఆర్ధిక సంవత్సరంలో 62 వేల ఉపకరణాలను విక్రయించాం. ఈ ఏడాది లక్షకు చేరాలని లకి‡్ష్యంచాం. ఏటా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. మా విక్రయాల్లో ల్యాప్‌టాప్ వాటా 40 శాతం. మా అమ్మకాల్లో డిస్ట్రిబ్యూషన్ల వాటా 30 శాతం, ఆన్లైన్ వాటా 15 శాతం వరకూ ఉంది. మన దేశంతో పాటూ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లోనూ విక్రయాలున్నాయి. మా వ్యాపారంలో తెలుగు రాష్ట్రాల వాటా 35 శాతం. ఎగుమతుల వాటా 5 శాతం. ఈ ఏడాది ముగిసేసరికి ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ల సంఖ్యను 100కు చేర్చాలని లకి‡్ష్యంచాం. అనంతపురంలో తయారీ కేంద్రం.. ఈ ఏడాది రూ.4 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ఆయా ఉత్పత్తుల తయారీకి అవసరమైన విడిభాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. అనంతపురంలో 7 వేల చదరపు అడుగుల్లో తయారీ కేంద్రం ఉంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 65–70 వేలు. ప్రభుత్వం రాయితీలిస్తే విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో నెలకు 50 వేల ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం. ఐఓటీ, ఏఐ ఆధారిత ఉపకరణాల అభివృద్ధిపై దృష్టిసారించాం. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు, విద్యా సంస్థలు, ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రూ.30 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం సంస్థలో 94 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 15 మంది ఇంజనీర్లు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల ఆదాయాన్ని చేరాం. ఈ ఏడాది రూ.80 కోట్లు లకి‡్ష్యంచాం. 2020 నాటికి రూ.150 కోట్లు చేరుకోవాలనేది లక్ష్యం. 2019 నాటికి రూ.100 కోట్ల వాల్యుయేషన్‌తో 6 శాతం వాటాను విక్రయించేందుకు బ్రాండ్ క్యాపిటల్‌తో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే ఏడాదిలో రూ.30 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం. -
రూ.14వేలకే ల్యాప్‌టాప్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల్లో ల్యాప్‌టాప్ లను అందించే ఐబాల్ సంస్థ తాజాగా మరో నూతన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. కాంప్బుక్ మెరిట్ జీ9 పేరుతో విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. కేవలం రూ.13,999 ధరకే ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో తమ ల్యాప్‌టాప్‌లో సెల్రాన్ ఎన్3350 ప్రాసెసర్ , మల్టీ ఫంక్షనల్ టచ్ ప్యాడ్, ఆరు గంటల బ్యాటరీ లైఫ్ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెబుతోంది. గత ఫిబ్రవరిలో తక్కువ ధరలో లాంచ్ చేసిన ప్రీమియో వి2.0 ధరకంటే కూడా చవకగా ధరలో దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు, బడ్జెట్ ధర, రీజనబుల్ మెమొరీతో చూడటానికి ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది. ఐబాల్ కాంప్బుక్ మెరిట్ జీ9 11.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ 2.4గిగాహెడ్జ్ ఇంటెల్ సెల్రాన్ ఎన్ 3350 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీ ద్వారా ఒక టీబీ దాకా దాకా కూడా విస్తరించుకునే అవకాశం కూడా కల్పించింది. 5000 ఎంఏహెచ్ లి-పాలిమర్ బ్యాటరీ 0.3 మెగాపిక్సెల్ వెబ్ కెమెరా డ్యుయల్ బ్యాండ్ వైర్లెస్ ఏసీ3165, బ్లూటూత్ 4.0, మినీ హెచ్డీఎంఐ 4.1పోర్ట్, 2.0.+ 3.0 యూఎస్బీ పోర్ట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఐబాల్ కాంప్బుక్ మెరిట్ జీ9 రోజువారీ కస్టమర్ల కంప్యూటింగ్ అవసరాలను తీర్చడంకోసం ప్రీమియం డిజైన్‌తో ఆల్-ఇన్-వన్ ల్యాప్ట్యాప్కు రూపకల్పన చేశామని ఐబాల్ డైరెక్టర్, సీఈఓ సందీప్ పరశాంపురియా ఒక ప్రకటనలో తెలిపారు. -
స్మార్ట్రాన్ హైబ్రీడ్ ల్యాప్‌టాప్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ టెక్నాలజీ, ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారుదారు(OEM) స్టార్ట్రాన్ కంపెనీ కొత్త టూ ఇన్వన్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. భారతదేశంలో దాని తరువాతి తరం "టీబుక్ ఫ్లెక్స్" హైపర్ ల్యాప్‌టాప్‌లను శుక్రవారం ప్రారంభించింది. ఇవి మే 13నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోఉంటాయని వెల్లడించింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ హైబ్రిడ్ ల్యాప్‌టాప్ చాలా తొందరగా టాబ్లెట్, ల్యాప్‌టాప్ మోడ్‌లోకి మారడమే ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది. ఎం3, ఐ 5 అనే వెర్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన వీటి ధరలు వరుసగా రూ .42,990, రూ. 52,990 లుగా ఉండనున్నాయి. 12.2అంగుళాల డిస్ప్లే, 2560x1600 పిక్సెల్స్ రిజల్యూషన్, లైట్ బాడీ, డిటాచ్బుల్ బ్యాక్లిట్ కీబోర్డు, ఫింగర్ ప్రింట్ స్కానర్, థండర్ బోల్ట్ 3 యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా మల్టీ-టచ్ డిస్ ప్లే, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను ఈ డివైస్ కలిగి ఉంది. డబుల్ మైక్, ఫవర్‌ఫుల్ స్పీకర్లు , ఫాస్ట్ డ్యుయల్ బ్యాండ్ వై-ఫై ఇతర ఫీచర్లు. స్పెషల్ డ్యుయల్ టోన్ ఫినీష్, ఫిక్స్ స్టాండ్‌సహాయంతో 150 డిగ్రీల వరకు ఈ ల్యాప్‌టాప్‌ను నిలవపచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరెంజ్ గ్రే, బ్లాక్ గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. -
ప్రపంచంలోనే అతి సన్నని ల్యాప్‌టాప్ లాంచ్
ఏసెర్ ప్రపంచంలోనే పలుచనైన ల్యాప్‌టాప్‌ను సీఈఎస్ 2018లో లాంచ్ చేసింది. కేవలం 9.98 మి.మి మందంతో అల్ట్రాపోర్టబుల్ ల్యాప్‌ట్యాప్‌ను స్విఫ్ట్ 7 పేరుతో ప్రవేశపెట్టింది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో దీన్ని విడుదల చేసింది. వినియోగదారులు సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యంతో దీన్నిరూపొందించింది. ముఖ్యంగా దీర్ఘ-దూర అంతర్జాతీయ విమానాలు లేదా రైలు ప్రయాణాల సందర్భంగా అతి తక్కువ-కాంతి పరిస్థితులలో కూడా బ్యాక్ లిట్ కీబోర్డుతో పనిచేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. సుమారు రూ. 1,07,470 (1699 డాలర్లు)ధరలో మార్చి ఆరంభంనుంచి నార్త్ అమెరికాలో అందుబాటులోకి రానుంది. అనంతరం ఏప్రిల్‌నుంచి సుమారు రూ .1,29,329ధరలో మిగతా దేశాల్లో లభ్యమవుతుంది. ప్రపంచంలోనే అతి సన్నని ల్యాప్‌ట్యాప్‌ను తయారుచేసినందుకు తాము గర్వపడుతున్నామని యాసెర్ ఇంక్ ఐటీ ప్రోడక్ట్స్ ప్రెసిడెంట్ జెర్రీ కాయో చెప్పారు. శక్తివంతమైన ప్రదర్శనతో నిపుణుల కోసం రూపొందించినట్టు తెలిపారు. విండోస్ 10, 7వ జనరేషన్ ఇంటెల్‌కోర్ ప్రాసెసర్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌ట్యాప్ సింగిల్ చార్జ్‌తో 10గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అల్యూమినియం బాడీ డిజైన్, గొరిల్లా గ్లాస్, ఎన్బీటీ టచ్ స్క్రీన్ అండ్ టచ్ ప్యాడ్, 256 స్టోరేజ్ కెపాసిటీ, 8 జీబీ ర్యామ్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటివి ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. దీంతోపాటు స్పిన్ 3 డివైస్‌ను లాంచ్ చేయనున్నట్టు కూడా ప్రకటించింది. కొత్త స్పిన్ 3 ను 8 వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్, ఐసీఎస్ టెక్నాలజీ, తో 14 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే , రెండు ఫ్రంట్-ఫేసింగ్ స్పీకర్లు, ఏసెర్ ట్రూ హార్మోనీ టెక్నాలజీ లాంటి ఫీచర్లతో మరింత శక్తివంతంగా రూపొందిస్తోందట. టాబ్లెట్ స్పేస్-డెవలప్మెంట్ టెంట్ మోడ్‌తో అందివ్వనుంది. -
విమానంలో ల్యాప్‌టాప్ నుంచి మంటలు
ముంబై: తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలోని ఓ ల్యాప్‌టాప్ నుంచి మంటలొచ్చాయి. వెంటనే అగ్నిమాపక పరికరంతో మంటలను అదుపు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ఈ ఘటన శనివారం జరిగింది. ‘తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న 6ఈ445 విమానం క్యాబిన్లో పొగ వాసన వచ్చింది. సీట్ హ్యాట్–ర్యాక్ నుంచి మంటలు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. హ్యాండ్‌బ్యాగ్‌లో కాలుతున్న ల్యాప్‌టాప్‌ను అగ్నిమాపక పరికరంతో అదుపులోకి తీసుకొచ్చారు. నీళ్లతో నింపిన కంటైనర్‌లో ల్యాప్‌టాప్‌ను ఉంచారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. -
ఇండిగో విమానంలో మంటలు
సాక్షి, న్యూఢిల్లీ : గగనవీధిలో ప్రయాణిస్తున్న విమానంలో పర్సనల్ ఎలక్ట్రిక్ డివైజ్ పేలిన ఘటన మరోసారి చోటుచేసుకుంది. తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ల్యాప్‌టాప్ నుంచి మంటల చెలరేగాయి. శనివారం(నవంబర్ 11)న ఈ ప్రమాదం జరిగింది. 6ఈ-445(వీటీ-ఐజీవీ) విమానంలో బ్లాక్ బ్యాగ్ నుంచి కాలుతున్న వాసన వచ్చినట్టు ప్యాసెంజర్లు రిపోర్టు చేశారు. వెంటనే అలర్ట్ అయిన విమానశ్రయ సిబ్బంది స్ప్రేతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాక ప్రయాణికుల సీట్లను వేరే ప్రాంతాలకు మార్చారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు ల్యాప్‌టాప్‌ను వాటర్ కంటైనర్‌లో ఉంచారు. ఈ విషయాన్ని ఇండిగో అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. ''2017 నవంబర్ 11న తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న 6ఈ-445 ఇండిగో విమానంలో పొగ వాసన వచ్చింది. 24ఆర్‌హెచ్ సీటు హ్యాట్-ర్యాక్ నుంచి మంటలు రావడం విమాన సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పైలెట్-ఇన్-కమాండ్‌కు చేరవేశారు. ముందస్తు జాగ్రత్తలు మేరకు వెనువెంటనే ప్రయాణికులనే వేరే సీట్లలోకి సర్దుబాటు చేసి, హ్యాండ్‌బ్యాగ్‌లో కాలుతున్న ల్యాప్‌టాప్‌ను అగ్నిమాపక పరికరంతో అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత నీళ్లతో నింపిన కంటైనర్‌లో ల్యాప్‌టాప్‌ను ఉంచారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందర్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేశాక, డీజీసీఏకు స్వచ్ఛందంగా ఈ విషయాన్ని వెల్లడించాం'' అని ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు. తమకు సహకరించిన ప్రయాణికులందరికీ ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ప్రయాణికుల భద్రతకు తాము ఎంతో ప్రాముఖ్యత ఇస్తామని, ఈ విషయంలో తాము రాజీపడమని పేర్కొంది. గత నెలలో కూడా ఢిల్లీ-ఇండోర్ వెళ్తున్న ఓ విమానంలో మొబైల్ ఫోన్ పేలి విమానంలో మంటలు వచ్చాయి. -
ల్యాప్‌టాప్‌ల కోసం వ్యవసాయశాఖ కసరత్తు
- ఐటీ అధికారులతో పార్థసారథి చర్చలు - 500 ఏఈవో ఉద్యోగాల భర్తీకి మొదలైన ప్రక్రియ సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయాధికారులందరికీ ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయశాఖ తక్షణమే రంగంలోకి దిగింది. వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి బుధవారం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తో చర్చించారు. అధిక సామర్థ్యం గల 3,500 ల్యాప్‌టాప్‌లు తమకు అవసరమని, అందుకు సహకరించాలని ఆయన కోరారు. గతంలో ప్రభుత్వం అధిక మొత్తంలో ల్యాప్‌టాప్‌లు తీసుకున్నందున అదే కంపెనీ ద్వారా తెప్పించాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. అయితే 3,500 ల్యాప్‌ట్యాప్‌లను ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చనీ, విడతల వారీగా వాటిని తెప్పించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు. త్వరగా ల్యాప్‌టాప్‌లు ఇచ్చి రైతులు, భూముల సమగ్ర సమాచారాన్ని జూన్ 10వ తేదీ నాటికి అందజేయాలని, ఆ సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయాలని సీఎం సూచించినందున ఆగమేఘాల మీద తెప్పించాలని యోచిస్తున్నారు. కార్యాలయ అధికారులకు కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకే ఈ ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. మరోవైపు సీఎం ఆదేశంతో 500 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ఫైలును వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. ఆ ఫైలును సీఎం ఆమోదానికి పంపిస్తారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. మోటార్ సైకిళ్ల కోసం బ్యాంకు రుణం వడ్డీ లేని రుణాలతో ఏఈవోలు అందరికీ మోటార్ సైకిళ్లు ఇస్తానని సీఎం ప్రకటించడంతో ఆ కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ద్వారా ఇప్పించే ఆలోచన ఉన్నట్లు పార్థసారథి చెప్పారు. -
ల్యాప్ టాప్ పగలగొట్టిన శిఖర్
-
ల్యాప్ టాప్ పగలగొట్టిన శిఖర్
కోల్‌కతా : కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కోల్‌కతా జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన భారీ షాట్‌కు సన్‌రైజర్స్ జట్టుకు చెందిన కీలక ల్యాప్‌టాప్ పగిలిపోయింది. దానిలో జట్టకు సంబంధించి కీలక సమాచారం ఉన్నట్టు సమాచారం. సన్‌రైజర్స్ సభ్యులు బౌండరీ లైన్ అవతల ల్యాప్‌టాప్‌ను ఒక టేబుల్‌పై ఉంచుకుని పరిశీలిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని శిఖర్ ధావన్ భారీ షాట్ కొట్టాడు. బంతి వేగంగా వచ్చి ల్యాప్‌టాప్ వెనక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో స్క్రీన్ బద్దలైపోయింది. ఆ సమయంలో ల్యాప్‌టాప్ ముందు కూర్చుని ఉన్న విశ్లేషకుడు శ్రీనివాస్ ల్యాప్‌టాప్‌ను వదిలేసి పక్కకు వచ్చేశాడు. దీంతో పక్కనే ఉన్న సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ అతనిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎంతపని చేశాడో చూడండి అన్నట్టు కోచ్ టామ్ మూడీ, యువీ వైపు లక్ష్మణ్ చేయి చూపించాడు. -
జియో ల్యాప్‌టాప్.. ఫీచర్లెలా ఉన్నాయో తెలుసా?