కూల్‌గా...స్టయిల్‌గా! | Latest cool and stylish electronic gadgets | Sakshi
Sakshi News home page

కూల్‌గా...స్టయిల్‌గా!

Published Sat, Nov 2 2013 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

Latest cool and stylish electronic gadgets

సౌకర్యాన్ని అందిస్తాయి... స్టైలిష్ అనిపిస్తాయి... సరదాగా... సరికొత్తగా ఉంటాయి... కొన్ని వైర్ లెస్, మరికొన్ని వెయిట్‌లెస్... కొంచెం కాస్ట్‌లెస్ కూడా! టెక్ కంపెనీలు కొత్త  ప్రపంచానికి కొత్త అనుభవం ఇవ్వడానికి అన్నట్లుగా  రూపొందించిన గాడ్జెట్స్ ఇవి. మార్కెట్‌ను ముంచెత్తుతూ ఆకట్టుకుంటున్న గమ్మత్తై గాడ్జెట్స్ ఇవి...
 
 సోనీ త్రీ ఇన్ వన్...
 
 రేడియో, టేప్ రికార్డర్ మిక్స్‌డ్‌గా వస్తే దాన్ని టూ ఇన్ వన్ అనుకొని ముచ్చటపడే వాళ్లం. అయితే ఇప్పుడు టూ ఇన్ వన్ కాలాలు పోయాయి. త్రీ ఇన్ వన్ అంటూ సోనీ ఒక కొత్త ప్రోడక్ట్‌ను తీసుకు వచ్చింది. హెడ్‌ఫోన్స్‌లోనే ఎమ్‌పీ త్రీ ప్లేయర్‌ను మిక్స్ చేసి ‘3 ఇన్ వన్ ఎన్‌డబ్ల్యూజెడ్-డబ్ల్యూహెచ్303’ అనే ప్రోడక్ట్‌ను తీసుకు వచ్చింది. ఇది అత్యంత ఆసక్తికరమైన ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. వాక్‌మన్, ఎమ్‌పీత్రీ ప్లేయర్, స్పీకర్‌లు మిళితమై ఉన్న దీనికి త్రీ ఇన్‌వన్‌గా పేరు పెట్టుకొంది సోనీ కంపెనీ. స్టైలిష్ లుక్ ప్లస్ సౌకర్యం కలగల్సినదే ఈ త్రీ ఇన్ వన్. బ్లాక్, గ్రే, రెడ్ యాక్సెంట్స్‌లో లభిస్తుంది. సోనీ బ్రాండ్ నేమ్ దీనికి మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది. 4జీబీ ఇన్‌బిల్ట్‌గా ఉండే ఈ మ్యూజిక్ ప్లేయర్‌లో వెయ్యి ట్రాక్స్‌ను స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం హెడ్‌ఫోన్స్‌గానే కాకుండా లౌడ్ స్పీకర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా స్టీరియో ఎఫెక్ట్ పొందవచ్చు. హెడ్‌ఫోన్స్‌గా ఉపయోగించుకొంటున్న సమయంలో ఒక చేత్తోనే వాల్యూమ్, ట్రాక్ లిస్ట్‌ను చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, లాప్‌టాప్‌లకు యూఎస్‌బీ ద్వారా హుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫుల్‌బ్యాటరీతో 20 గంటలపాటు పనిచేస్తుంది. దీని ధర రూపాయల్లో 8,990.  
 
 ర్యాపో.. వైర్‌లెస్ స్పీకర్
 
 మొబైల్, ట్యాబ్లెట్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్.. దేనితోనైనా వైర్‌లెస్ ట్రాన్స్ మిషన్ ద్వారా కనెక్ట్ అయ్యి చక్కటి ధ్వనిని అందిస్తుంది ర్యాపో. తొలి బ్లూ టూత్ మినీ స్పీకర్ ఇది. కొత్తగా స్పీకర్‌లను కొనుగోలు చేయాలనుకొంటున్న వారికి హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్‌గా పేరు పొందిన ర్యాపో ఉత్తమమైన ఛాయిస్. ఇంట్లో ఉన్న అన్ని గాడ్జెట్స్‌కూ కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండటం, ఎక్కడికైనా క్యారీ చేయడానికి అవకాశం ఉండటం రాపూ ప్రత్యేకతలు. ఈ ‘బ్లూటూత్ మినీ స్పీకర్ 3060’ ధర రూ.4,299. దీనికి మైక్రోఫోన్ కూడా ఉంటుంది. దీని ద్వారా స్పీకర్ కాల్స్ మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఒకే స్విచ్ ద్వారా ఫోన్, మ్యూజిక్ ప్లేయర్‌తో పెయిరప్ చేయడానికి అవకాశం ఉంది. దీనికి పై భాగంలో కంట్రోల్ బటన్స్ ఉంటాయి. మినీ యూఎస్‌బీ చార్జర్ ద్వారా చార్జింగ్ అవుతుంది. పది మీటర్ల దూరం వరకూ పనిచేస్తుంది. చార్జింగ్‌తో దాదాపు రెండున్నరగంట సేపు పనిచేస్తుంది. కలర్‌ఫుల్, సింపుల్, ఎలిజంట్, క్లాసీ, కాంపాక్ట్ స్పీకర్ అంటూ ఈ గాడ్జెట్‌ను ప్రశంసిస్తున్నారు విశ్లేషకులు.
 
 సంగీత వర్షంలో తడవండి...!
 
  షవర్ నుంచి జారే ప్రతి నీటి చుక్కకూ ఒక రిథమ్‌ను కలగలిపే మ్యూజిక్ సాధనమిది. స్నానం చేయడంలో ఉత్తేజానికి ఉత్సాహానికి జత చేసే సాధనమిది. షవర్‌కు ఎటువైపు తగిలించినా నీళ్లలో తడుస్తూ కూడా ఇది సంగీత స్వరాలను కురిపిస్తుంది. బాత్‌రూమ్ సింగర్స్ కొందరైతే.. బాత్‌రూమ్‌లో మ్యూజిక్‌ను వినడానికి ఉత్సాహం చూపించే వారు మరికొందరు. అయితే అది అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద నీళ్లు పడితే అవి చెడిపోతాయి. దీంతో బాతింగ్‌లో మ్యూజిక్ వినడానికి అవకాశం ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చింది షవర్ రేడియో వీ3. రోజువారీ జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉండే, ఉత్సాహాన్ని ఇచ్చే ఈ గాడ్జెట్‌ను చార్జింగ్‌తో కాక ఎక్స్‌టర్నల్ పవర్‌తో పనిచేస్తుంది. ఎఫ్‌ఎమ్ రేడియోను కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్‌తో లౌడ్, క్లియర్ సౌండ్‌ను అందిస్తుంది. స్ప్లాష్ రెసిస్టెంట్ ఎఫ్‌ఎమ్ రేడియో కావడం వల్ల నీళ్లలో తడిసినా ఇబ్బంది ఉండదు.
 
 ఎక్కడైనా.. ఎప్పుడైనా ఫొటోల ప్రింటింగ్..
 
 మొబైల్‌లో చక్కటి క్వాలిటీ ఫోటోలను తీసుకొనే అవకాశం వచ్చాక ఫోటో ప్రింటింగ్‌కు అవసరం బాగా తగ్గిపోయింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లో తీసుకొన్న ఫొటోలు అనుకోకుండా డిలీట్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ ప్రింట్ తీసిన ఫొటోను జాగ్రత్త చేస్తే వంద సంవత్సరాల తర్వాత కూడా దాని విలువ భద్రంగా ఉంటుంది. ఫొటోప్రింటింగ్ కోసం ఫొటో స్టూడియోల చుట్టూ తిరిగే ఓపిక లేకుంటే సింపుల్‌గా పాకెట్ ఫొటో ప్రింటర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఎల్‌జీ ఉత్పాదన అయిన పీడీ 233 పాకెట్ ఫొటో ప్రింటర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కూ ప్రింటర్‌కు కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. బ్లూ టూత్ ద్వారా కూడా అనుసంధానించుకోవచ్చు. 45 సెకన్ల సమయంలోనే ఫొటో ప్రింట్ అవుతుంది. జీరో ఇంక్ ఫొటో పేపర్ 2.0 ద్వారా ఫొటోలు ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి ఇంక్ అవసరం ఉండకపోవడం ఈ ప్రింటర్ ప్రత్యేకత.  
 
 ఇక ఎల్‌జీ ఫోన్ కూడా ఉపయోగిస్తుంటే అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఫొటోను డెకరేట్ చేసి ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దీని ధర 14,990. 5.1 x 7.6 సెం.మీ. (2’’x3’’) సైజ్‌లో ఫోటోలను ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది.
 
 ఫ్యాషనబుల్ పెన్‌డ్రైవ్...
 
 పెన్‌డ్రైవ్ నేటి నిత్యావసర వస్తువు. విద్యార్థులకైనా, ఉద్యోగులైనా అవసరం కొద్దీ డిజిటల్ డాటా క్యారీ చేయడం తప్పనిసరి అయ్యింది. దాని కోసం పెన్‌డ్రైవ్ తప్పనిసరి అయ్యింది.  పెన్‌డ్రైవ్‌లో డాటాను క్యారీ చేయడం సులభమే కానీ.. ఆ పెన్‌డ్రైవ్‌ను క్యారీ చేయడమే ఇబ్బంది. కాస్తంత మతి మరుపు ఉన్న వారికి అయితే పెన్‌డ్రైవ్‌తో చాలా చిక్కులే ఉంటాయి. మరి ఈ ఇబ్బందులు తీర్చడానికి పెన్‌డ్రైవ్ రిస్ట్‌బ్యాండ్‌గా అందుబాటులోకి వచ్చింది. రంగు రంగుల్లో స్టైల్ స్టైల్‌గా ఇవి అందుబాటులో ఉన్నాయి. 8జీబీ మెమొరీతో ఉండే రిస్ట్‌బ్యాండ్ పెన్‌డ్రైవ్‌ధర దాదాపు వెయ్యి రూపాయలు.
 
 ఈ మౌస్‌ప్యాడ్ ఒక నోట్ ప్యాడ్!
 
 కంప్యూటర్‌లు ఇంట్లోకి వచ్చేశాక కాగితం, పెన్నులు రిటైర యిపోయాయి. వీటిని కొనాలనే స్పృహ బాగా తగ్గిపోయింది. కమ్యూనికేషన్ అంతా మెసేజ్ రూపంలో మారిపోయాక, మొబైల్‌లో వందల కొద్దీ నంబర్లను సేవ్ చేసుకొనే అవకాశమున్న నేపథ్యంలో పెన్నూ పేపర్‌ల పని తగ్గిపోయింది.  కాగితం, కలాల అవసరాన్ని మరింత నిరోధిస్తూ మౌస్‌ప్యాడ్ మీద రాసుకొనే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ మౌస్‌ప్యాడ్ ను రొటీన్‌ప్యాడ్ గానే కాకుండా రాత కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. అప్పటికప్పుడు ఏదైనా రాసుకోవడానికి సిస్టమ్ పక్కనే ఇది అమరి ఉంటుంది. ఇది ఎరేజబుల్ స్లేట్ లాంటిది. ధర రూ.1,149.
 
 రెట్రో స్టైల్‌హ్యాండ్ సెట్...
 
 టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని పాత వాసనలను వదిలించుకోలేదు. అలాంటి వాటిలో ఒకటి రెట్రో స్టైల్ రిసీవర్. ల్యాండ్‌ఫోన్లకు రిసీవర్‌కు ఉండే ఈ హ్యాండ్‌సెట్‌ను స్మార్ట్‌ఫోన్‌లకు తగిలించుకోవడం స్టైల్ అవుతోంది. మొబైల్‌ను చెవి దగ్గర పెట్టుకొంటే దానివల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయని.. బ్రెయిన్‌పై ప్రభావం చూపుతుందని హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాతస్టైల్‌కు మళ్లీ క్రేజ్‌వస్తోంది. దీని వాడకందార్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. క్లియర్ వాయిస్‌తో, డిస్ట్రబెన్స్ లేకుండా మాట్లాడాలి అంటే.. అది రెట్రో స్టైల్ హ్యాండ్‌సెట్‌తోనే సాధ్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 - జీవన్‌రెడ్డి.బి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement