sony
-
జపాన్ కంపెనీల హవా.. చైనా బ్రాండ్లకు దెబ్బ!
కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు భారత్‌లో జపాన్ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలు కొంతకాలంగా తగ్గిపోయాయి. ఇటీవల కాలంలో జపాన్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల వల్ల తిరిగి ఇండియాలో వాటి ఉత్పత్తుల అమ్మకాలు పుంజుకుంటున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. సోనీ , పానాసోనిక్, హిటాచీ వంటి జపాన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కానీ కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు వాటి అమ్మకాలు స్థానికంగా తగ్గిపోయాయి. దాంతో జపాన్ కంపెనీలు కొత్త విధానాలను అమలు చేస్తూ తిరిగి వాటి ఉత్పత్తుల అమ్మకాలను పునరుద్ధరిస్తున్నాయి.ఎక్కువ మార్జిన్లు ఉండే ఉత్పత్తులు, బిగ్‌స్క్రీన్ టీవీలను విక్రయించడం, తక్కువ మార్జిన్లు ఉండే వాటిని నిలిపేయడం వంటి విధానాలను పాటిస్తున్నాయి. ప్రధానంగా జపాన్ కంపెనీలు ఇండియాలో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర గృహోపకరణాలను విక్రయిస్తున్నాయి. పానాసోనిక్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెరిగాయి. దాదాపు ఆరేళ్ల పాటు వృద్ధి, అమ్మకాల విషయంలో తిరోగమన పథంలో ఉన్న కంపెనీ ఉత్పత్తులు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 30% పైగా పుంజుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2,338 కోట్ల వ్యాపారంతో పోలిస్తే వినియోగదారుల విభాగంలో 2025లో రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.అమ్మకాలు జూమ్సోనీ ఇండియా గత ఎనిమిదేళ్లలో ఈసారి అత్యుత్తమ నికర లాభాన్ని నమోదు చేసింది. సోనీ బ్రావియా టెలివిజన్ల అమ్మకాల్లో 20% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో సోనీ ఇండియా అమ్మకాలు రూ.7,663 కోట్లుగా ఉన్నాయి. 2014-15లో గరిష్టంగా కంపెనీకి రూ.11,000 కోట్ల రెవెన్యూ సమకూరింది. తర్వాత ఈసారి వచ్చిన ఆదాయమే అధికంగా ఉంది.చైనా బ్రాండ్లతో పోటీపానాసోనిక్ ఇండియా బిజినెస్ ఛైర్మన్ మనీష్ శర్మ మాట్లాడుతూ..‘జపాన్ బ్రాండ్లు ధరల విషయంలో పోటీ పడటం లేదు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాయి. వైఫల్యాల రేటును గణనీయంగా తగ్గించుకోవాలనుకుంటున్నాం. భారత్‌లో క్రమంగా విక్రయాలు పెరుగుతున్నాయి. షావోమీ, హైసెన్స్, హాయర్ వంటి చైనీస్ బ్రాండ్లు, కొడాక్, థామ్సన్ వంటి ఆన్లైన్ కేంద్రీకృత బ్రాండ్ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలున్నాయి. కొరియన్ కంపెనీలైన ఎల్జీ, సామ్‌సంగ్‌లతో కూడా జపాన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటనఎయిర్ కండీషనర్ తయారీ రంగంలో ఉన్న జపాన్ కంపెనీ హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లాభాలు నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదిక 64% అమ్మకాలు పెరగడం ద్వారా రూ.1,392 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ తెలిపింది. -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్'కు మహాత్మా గాంధీ మునిమనవడు ప్రశంసలు
చారిత్రాత్మక స్వాతంత్య్రపోరాట నేపధ్యంలో తీసిన 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సోనీలివ్ వేదికగా ఓటీటీ వీక్షకుల ఆదరణ చూరగొంటోంది. దర్శకుడు నిక్కిల్ అద్వానీ విజన్ ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. తాజాగా మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈ సిరీస్‌ను చూడాల్సిందిగా సిఫారసు చేయడం విశేషం. ఆయన ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారిలా... ’ఫ్రీడం ఎట్ మిడ్నైట్’ చూడటం మొదలుపెట్టాను. ఇది బాపు – పండిట్ నెహ్రూ – మన ఫ్రీడమ్‌కు సంబంధించిన ఒక హిందూత్వ వెర్షన్ అని నేను అనుకున్నాను. కానీ నేను పొరపడ్డాను. ఇది ముందస్తు అంచనాలు ఉండవద్దనే పాఠం నాకు నేర్పింది. దీని గురించి చెప్పాల్సింది ఇంకా ఉంది. అయతే తప్పక దీన్ని చూడాల్సిందిగా నేను సిఫార్సు చేస్తున్నాను’’ తుషార్ గాంధీ మాత్రమే కాకుండా ఆలోచింపజేసే చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు సుధీర్ మిశ్రా కూడా ఈ సిరీస్‌కు సంబంధించి దర్శకుని కృషిని ఎంతగానో ప్రశంసించారు. లారీ కాలిన్స్, డొమినిక్ లాపియర్ రాసిన పుస్తకం ఆధారంగా ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ రూపొందింది. ఇందులో సిధాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా, మలిష్కా మెండోన్సా, రాజేష్ కుమార్, కేసీ శంకర్, ల్యూక్ మెక్‌గిబ్నీ, కార్డెలియా బుగేజా, అలిస్టెయిర్ ఫిన్లే, ఆండ్రూ కల్లమ్, రిచర్డ్ టెవర్సన్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో నెక్ట్స్తో కలిసి ఎమ్మే ఎంటర్టైన్ మెంట్ (మోనిషా అద్వానీ – మధు భోజ్వానీ) దీన్ని నిర్మించింది. ఈ సిరీస్‌కు నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు. -
బిగ్‌బీని కదిలించిన కేబీసీ 16 ‘కరోడ్‌పతి’ ఎమోషనల్ జర్నీ
బుల్లితెరపై రియాల్టీ, గేమ్, క్విజ్ షోలు చూసేటపుడు, పోటీదారులతోపాటు వీక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్విజ్‌లలో అయితే సమాధానం తెలిసినవారు ‘అబ్బ.. ఛ.! అదే నేనైతేనా అంటూ తెగ ఆరాటపడి పోతారు. కానీ అంత ఈజీ కాదు. అందుకే హాట్ సీట్ అయింది. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి( KBC). తాజా కేబీసీ 16వ ఎడిషన్‌లో కోటి రూపాయలు గెల్చుకున్నాడు ఓ కుర్రాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ ఎమోషనల్ జర్నీని తెలుసుకుందాం.ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో యుపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న చంద్ర ప్రకాష్ అన్ని దశలను పూర్తి చేసుకుని కేబీసీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 24న చాలెంజర్ వీక్‌లో భాగంగా హాట్ సీట్లో బిగ్ బీ ముందు ధైర్యంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ సీజన్లో తొలి 'కోటీశ్వరుడు' అయ్యాడు. దీంతో పాటు ఒక కారును కూడా గెల్చుకున్నాడు. ఇక్కడి దాకా రావడానికి చందర్ పడ్డకష్టాలు గురించి తెలుసుకున్న బిగ్‌బీ కూడా చలించిపోయారు. చందర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా చందర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు చందర్. ఆయన గుండె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏడు శస్త్రచికిత్సలు చేయించు కున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి వైద్యులు అతనికి ఎనిమిదో శస్త్రచికిత్స చేయించు కోవాలని సూచించారు. ఇన్ని సర్జరీలు, బాధల్ని దాటుకుని చందర్ విజేతగా నిలవడం విశేషం.చందర్ కష్టాలను విన్న అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ చెప్పిన ‘ప్రాణమున్నంత వరకు పోరాటం తప్పదు’ అనే మాటల్ని గుర్తు చేశారు. పట్టుదల, అంకిత భావమే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటూ విజేత చందర్ ప్రకాష్‌ను అభినందించారు. కోటి రూపాయల ప్రశ్న "ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు, కానీ 'శాంతి నివాసం' అని అర్ధం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవు? డబుల్ డిప్ లైఫ్‌లైన్‌ని అనే లైఫ్‌లైన్‌ని ఎంచుకుని దీనికి సరియైన టాంజానియాగా చెప్పాడు. దీంతో కోటి గెల్చుకున్నాడు. ఇక ఏడు కోట్ల ప్రశ్నకుచందర్ని రూ. 7 కోట్ల ప్రశ్న '1587లో ఉత్తర అమెరికాలో ఆంగ్లేయ తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'. లైఫ్లైన్లు లేకపోవడంతో, సమాధానం కచ్చితంగా తెలియక షో నుంచి క్విట్ అయ్యాడు. కానీ వర్జీనియా డారే అనే జవాబును సరిగ్గానే గెస్ చేశాడు. ఇలాంటి హృదయాలను కదిలించే కథలు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అనేకం విన్న సంగతి తెలిసిందే. -
Brinda Web Series Review: 'బృంద' వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్: బృందవిడుదల: ఆగష్టు 2 నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్సామి రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల ఓటీటీ స్ట్రీమింగ్ : సోనీ లివ్జానర్: క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ఎపిసోడ్స్: 8స్ట్రీమింగ్ భాషలు: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లాసౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా త్రిష కొనసాగుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వెండితెరపై దూసుకుపోతుంది. గ్లామరస్ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న సినిమాలతో తనేంటో సత్తా చాటుతుంది. ఇండస్ట్రీలో సుమారు 25 ఏళ్లుగా పైగా రాణించిన త్రిష.. తొలిసారి బృంద అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. బృందతో మెప్పించిందా..? అనేది తెలియాలంటే ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.కథకథ పరంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేక్షకులకు తప్పకుండా క్రైమ్ థ్రిల్లర్‌ను అందిస్తుంది. ఇందులో దర్శకుడు సూర్య మనోజ్ విజయం సాధించారని చెప్పవచ్చు. సిరీస్ ప్రారంభంలోనే వీక్షకులను చూపు తిప్పుకోలేని పాయింట్‌తో కథ ప్రారంభం అవుతుంది. త్రిష చిన్నతనం ఎపిసోడ్స్‌తో మొదలైన స్టోరీ ఆమె పెద్ద అయ్యాక ఓ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా ఉద్యోగంలో చేరుతుంది. మహిళ అనే భావనతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. అంతే కాకుండా అప్పటికే అక్కడ పనిచేస్తున్న సీఐ సాల్మన్‌తో పాటు మిగిలిన సిబ్బందికి బృంద పనితీరు పట్ల అంతగా నమ్మకం ఉండదు. ఆమెను ఆఫీస్‌కే పరిమితం చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఓ రోజు పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం దొరుకుతుంది. గుండెల్లో సుమారు 16సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలుతుంది. దీంతో ఈ కేసును వదిలేయండి అంటూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చూపుతారు. అయితే, ఈ కేసును పట్టుబట్టి బృంద ఇన్వెస్టిగేషన్ చేయడం. అదే తరహాలో మొత్తం 16మంది అతి దారుణంగా చంపబడ్డారని ట్విస్ట్ రివీల్ అవుతుంది. దీంతో అధికారులు అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసి కేసును పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తారు. ఈ టీమ్ సాయంతో సీరియల్ కిల్లర్‌ను బృంద ఎలా పట్టుకుంది అనేది కథ. త్రిష గతం ఏంటి.. ఏం జరిగింది..? త్రిష చిన్నతనంలో జరిగిన మూఢ నమ్మకాల హత్యలకు వీటికి ఉన్న లింకేంటి..? చిన్న తనంలో తప్పిపోయిన తన అన్నయ్యను త్రిష కులుసుకుందా..? వీటితో పాటు హత్యల వెనుక ఉన్నదెవరు..? అసలు సీరియల్ కిల్లర్‌గా మారడం వెనుకున్న స్టోరీ ఏంటి..? తెలుసుకోవాలంటే బృంద ఇన్వెస్టిగేషన్ చూసేందుకు భాగం కావాల్సిందే.ఎలా ఉందంటే..కథ ప్రారంభం 1996 టైమ్‌లైన్ అయినప్పటికీ కొంత సమయం తర్వాత వర్తమానంలోకి పరిచయం అవుతుంది. గంగవరం అనే అటవీ ప్రాంతంలోని ఒక తెగలో బృంద చిన్నతనం గడుస్తుంది. అక్కడ తన తల్లిని, అన్నయ్యను కోల్పోయిన బృంద ఎలా నగరానికి చేరుతంది అనే మంచి ఓపెనింగ్ సీన్‌తోనే దర్శకుడు సిరీస్‌పై క్యూరియాసిటీ కలిగించాడు. ఒక మహిళ పోలీస్ ఉద్యోగానికి పనికిరాదని హేళన చేసిన తొటి ఉద్యోగుల చేతనే శభాష్ అనిపించుకునేలా బృంద పాత్ర చాలా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా త్రిష యాక్టింగ్ మెప్పిస్తుంది. మూఢనమ్మకాల వల్ల అన్యాయానికి గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్స్‌గా మారుతున్నారు అనే అంశాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. కథపరంగా చూస్తే.. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పోలీసు, కిల్లర్ మధ్య జరిగే సీన్స్ చాలా ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. త్రిష గతంతో పాటు వర్తమాన కాలంలోని అంశాలను జత చేస్తూ చూపిన స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అయింది. ఇన్వెస్టిగేషన్ పేరుతో నిడివి కాస్త పెరిగినట్లు అనిపించినా త్రిష నటనతో ఎంగేజ్ చేసింది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం కథ అయితే.. అందుకు తగ్గట్లుగా పోలీసు పాత్రలో నటించిన త్రిష, హంతకుడి పాత్రలో కనిపించిన ఆనందసామి నటన. వీరిద్దరితో పాటు ఇంద్రజీత్, రవీంద్ర విజయ్, ఆమని తదితరులు తమ పరిధి మేరకు నటించారని చెప్పవచ్చు. గతం, వర్తమాన అంశాలను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా మంచి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సిరీస్‌ను నడిపించారు. బృంద ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడ లాజిక్‌లు లేకున్నా సినిమా కదా అని చూస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో 4,5 ఎపిసోడ్స్ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కాస్త నిడివి తగ్గించుంటే బాగుండు అనే భావన కలుగుతుంది. ఫైనల్‌గా బృంద ఇన్వెస్టిగేషన్తో అదరగొడుతుంది. ఎలాంటి సందేహం లేకుండా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. అందరినీ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. -
సివిల్స్ కల జల సమాధి
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా): ఎలాగైనా ఐఏఎస్ కావాలని ఆ యువతి కన్న కల జల సమాధి అయ్యింది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ముంచెత్తిన దుర్ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన తానియా సోని (22) దుర్మరణం పాలయ్యింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..అందులో సోని ఉన్నట్లు అందిన సమాచారంతో శ్రీరాంపూర్‌లో విషాదం నెలకొంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్సారీ్ప–1 గని మేనేజర్‌గా పని చేస్తున్నారు. నస్పూర్‌లోని సీసీసీ టౌన్షిప్ బీ–2 కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. విజయ్‌కుమార్– బబిత దంపతులకు ముగ్గురు సంతానం కాగా సోనిపెద్ద కుమార్తె. రెండో కూతురు పలక్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బీటెక్ చేస్తోంది.కుమారుడు ఆదిత్యకుమార్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సోని గతేడాదే ఢిల్లీలోని అగ్రసేన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. కలెక్టర్ కావాలనే తన కోరికను తండ్రికి చెప్పింది. తండ్రి ఆశ కూడా అదే కావడంతో మూడు నెలల క్రితం రావూస్ కోచింగ్ సెంటర్లో చేరి్పంచి శిక్షణ ఇప్పిస్తున్నారు. శనివారం ఏం జరిగింది..? ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్న భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు రావడం ప్రారంభమయ్యింది. విషయం గమనించిన విద్యార్థులు బయటపడేందుకు ప్రయతి్నంచారు. కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయి బేస్మెంట్లోని లైబ్రరీలో బయోమెట్రిక్ గేటు జామ్ అయింది. దీంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. బల్లలపై నిల్చుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.చూస్తుండగానే 10–12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడివారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. 14 మందిని తాళ్ల సహాయతో రక్షించారు. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున సోనితో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్ (22), కేరళకు చెందిన నెవిన్ డాలి్వన్ (29) మృతదేహాలను వెలికితీశారు. స్పందించిన సింగరేణి అధికారులు సమాచారం తెలిసిన వెంటనే సింగరేణి సీఎండీ, ఇతర డైరెక్టర్లు, శ్రీరాంపూర్‌లోని ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలోని సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, కోల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ డీజీఎం అజయ్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సోని మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అనంతరం మూడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రయాణంలో ఉండగా మరణ వార్త విజయ్‌కుమార్–బబిత దంపతులు రెండో కూతురు పలక్‌ను కాలేజీలో దింపడం కోసం శనివారం రైల్లో లక్నో బయల్దేరారు. కాగజ్‌నగర్‌కు చేరుకోగానే వారికి సోని మరణవార్త తెలిసింది. దీంతో వారు తీవ్ర విషాదంలోనే నాగ్‌పూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న సోనిని చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వస్థలమైన ఔరంగాబాద్‌కు తరలించారు. విజయ్‌కుమార్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారి కేరీర్ గురించి ఎప్పుడు తమతో చర్చిస్తూ ఉండేవాడని తోటి అధికారులు తెలిపారు. 10 మందికి పైగా గల్లంతు? ముంపు ఘటన నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి నుంచే ఆందోళనకు దిగారు. 10 మందికి పైగా గల్లంతయ్యారని ఆరోపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో స్టడీ సర్కిల్ యజమాని స్టడీ సర్కిల్ యజమాని అభిõÙక్ గుప్తాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బేస్మెంట్లోకి నీరు చేరిందని గుప్తా పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్పందించింది. రావూస్ సంస్థకు బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహణకు తాము అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రాష్ట్ర మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా ఢిల్లీ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బిహార్‌కు చెందిన సోని తండ్రి విజయ్‌కుమార్ మంచిర్యాలలో సింగరేణి సంస్థలో పని చేస్తున్నారని ఆయన వివరించారు. కాగా విజయ్‌కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్‌ను ఫోన్లో పరామర్శించారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. -
ఓటీటీలో రియల్‌స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించిన సినిమాలు మలయాళం నుంచే ఉన్నాయి. 2024 శాండల్‌వుడ్ చిత్రపరిశ్రమకు బాగా కలిసొచ్చిన సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. ఈ క్రమంలో వచ్చిన మరొక చిత్రమే 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'. మే 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ఇందులో నటించారు. ఈ సినిమాను డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేశాడు. జనగణమన సినిమా హిట్ తర్వాత 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'ను ఆయన తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.మలయాళీ ఫ్రమ్ ఇండియా అనే చిత్రాన్ని యథార్థంగా జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని తెరకెక్కించారు. కథలో బలం ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే, ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఆకతాయిగా ఉన్న ఒక యువకుడు ఊహించని ఘటనతో తన ఇల్లు వదిలి దుబాయ్ వెళ్లిపోతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది..? గ్రామంలో ఆకతాయిగా ఉన్న ఆ యువకుడి జీవితంలో వచ్చిన మార్పు ఏంటి..? ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ఎలా మెప్పించింది..? వంటి అంశాలు తెలియాలంటే మలయాళీ ఫ్రమ్ ఇండియా చూడాల్సిందే. ఫస్టాఫ్‌లో సినిమా కాస్త బోర్‌గా అనిపిస్తుంది. కొంత సమయం తర్వాతా చాలా ఆసక్తిగా కథ ఉంటుంది. మస్ట్ వాచెబుల్ సినిమా అని చెప్పవచ్చు. యథార్థ సంఘటనల ద్వారా తీసిన ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసేయ్యండి. చివరి 30 నిమిషాలు సినిమాకి ప్రధాన బలం అని చెప్పవచ్చు. -
రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. 'స్కామ్ 2010' వచ్చేస్తుంది
ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్‌ల గురించి ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హన్సల్ మెహతా నిర్మించిన ఈ సిరీస్‌లను తుషార్ దర్శకత్వం వహించారు. భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్‌సిరీస్ 'స్కామ్ 1992'. ఎలాంటి అంచనాలు లేకుండా 2020లో సోనీ లివ్‌లో విడుదలైంది. కానీ, ఈ వెబ్ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. అదే తరహాలో 'స్కామ్ 2003' తెరకెక్కింది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద చూపించారు. ఈ రెండింటికీ సోనీ లివ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'సుబ్రతా రాయ్ సహారా' స్కామ్ గురించి హన్సల్ మెహతా మరో సిరీస్‌ను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్‌కు 'స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా' అని హన్సల్ వెల్లడించారు. తమల్ బందోపాధ్యాయ రాసిన సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.కేవలం రూ. 2000తో వ్యాపారం మొదలుపెట్టిన సుబ్రతా రాయ్.. రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే, ఆయనపై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలో రావడంతో 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించారు. ఆయన తల్లి మరణంతో అంత్యక్రియల కోసం 2016లో బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్‌పై బయటే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాదిలో సుబ్రతా రాయ్ గుండెపోటుతో మరణించారు. సహారా స్కామ్‌లో దాగివున్న నిజాలను ఈ సిరీస్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది. -
ఓటీటీలోకి 'ఏజెంట్' సినిమా.. ట్వీట్ చేసిన నిర్మాత
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇదొక శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఎజెంట్ నిర్మాత అనిల్ సుంకర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ముందు ఏజెంట్ సినిమాను ఓటీటీలో విడుదల చేయండి అంటూ కామెంట్లు చేశారు. దీంతో అనిల్ సుంకర రిప్లై ఇచ్చారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నట్లు అనిల్ తెలిపారు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. అతి త్వరలోనే ఏజెంట్ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అనిల్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ సుమారు రూ. 85 కోట్లతో తెరకెక్కినట్లు సమాచారం. కానీ ఇందులో పది శాతం కలెక్షన్స్ కూడా సినిమా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎజెంట్‌లో మలయాళ టాప్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. దీంతో మలయాళంలో కూడా సినిమాను విడుదల చేశారు. కానీ అక్కడ కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్ సుంకర చేసిన ట్వీట్‌తో ఏజెంట్ ఓటీటీ విషయంపై మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. I already informed couple of times. We sold the digital to B4U and they to Sony. Hopefully they will do it asap. https://t.co/5k0aFYKZbB — Anil Sunkara (@AnilSunkara1) April 8, 2024 -
900 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ
జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ తన ప్లేస్టేషన్ విభాగంలో పనిచేస్తున్న దాదాపు 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించించి. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కష్టతరమైనప్పటికీ తప్పదని సంస్థ వర్గాలు తెలిపాయి. సంస్థ తాజా నిర్ణయంతో దాదాపు 8 శాతం ఉద్యోగులు తగ్గినట్లవుతుందని తెలిసింది. టెక్, గేమింగ్ రంగంలో లేఆఫ్‌లను ప్రకటించిన తాజా సంస్థ ఇదే. పరిశ్రమలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ జిమ్ ర్యాన్ పేర్కొన్నారు. యూకే, యూరోపియన్ స్టూడియోలలో ‘ప్లేస్టేషన్ స్టూడియోస్ లండన్ స్టూడియో’ను పూర్తిగా మూసివేయనున్నట్లు తెలిపారు. గెరిల్లా, ఫైర్స్ప్రైట్ విభాగాల్లో ఉద్యోగుల తగ్గింపులు ఉండనున్నాయని చెప్పారు. డిసెంబరు 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో ఐదు గేమింగ్ విభాగాల్లో విక్రయాలు మందగించడంతో సోనీ గ్రూప్ ఈ నెల ప్రారంభంలో వాటి ఆదాయ అంచనాను తగ్గించింది. యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలు అనంతరం 2,000 మంది సిబ్బందిని తొలగిస్తామని నెల కిందట మైక్రోసాఫ్ట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు రియోట్ గేమ్స్ సంస్థ జనవరిలో 11 శాతం ఉద్యోగులను తగ్గించుకొంది. ఇదీ చదవండి: ఆండ్రాయిడ్‌లో రానున్న అద్భుతమైన అప్డేట్లు.. గత ఏడాదిలో యూఎస్‌లో ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 32,000 ఐటీ ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది. ఇటీవల స్నాప్ ఇంక్ అనే సంస్థ తన ఉద్యోగుల్లో 10 శాతాన్ని (దాదాపు 540 మంది) తగ్గించనున్నట్లు ప్రకటించింది. -
భారీగా 'భ్రమయుగం' కలెక్షన్స్.. బిగ్ మార్క్‌ను దాటేసిన మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం మూడు పాత్రలతో అది కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని భాషలతో కలుపుకుని రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సితార ఎంటర్టైన్మెంట్ వారు ప్రకటించారు. సినిమా పట్ల మంచి టాక్ రావడంతో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మమ్ముట్టి సత్తా చాటుతున్నాడు. భ్రమయుగం ఓటీటీ రైట్స్ కూడా సుమారు రూ. 25 కోట్లకు పైగా సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి చివరి వారంలో సోనీ లివ్‌లో భ్రమయుగం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
సోనీతో విలీనానికి మళ్లీ రెడీ.. అంతలోనే ‘జీ’కి భారీ షాక్..
మీడియా దిగ్గజం జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్)కు భారీ షాక్ తగిలింది. జీ సంస్థ భారీ మొత్తంలో నిధుల మళ్లించినట్లు మార్కెట్ రెగ్యులేటరీ బోర్డ్ సెబీ గుర్తించింది. ఫలితంగా ఆ సంస్థ షేర్లు పతనమవుతున్నాయి. జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్) తాజాగా సోనీ గ్రూప్ తో వీలిన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గత నెలలో రండు సంస్థల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన విలీన ప్రతిపాదన రద్దయిన నేపరథ్యంలో తాజా అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ తరుణంలో జీ వ్యవస్థాపకులపై సెబీ జరిపిన విచారణలో కంపెనీ నుండి సుమారు 20 బిలియన్ల ($241 మిలియన్లు) మొత్తాన్ని మళ్లించినట్లు తేలింది. నిధుల వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. జీలో నిధులు మళ్లించడం సెబీ ఊహించిన దానికంటే దాదాపు పది రెట్లు ఎక్కువ ఉందని సమాచారం. సెబీ రివ్యూ భారీ మొత్తంలో నిధులు మాయమవ్వడంపై జీ ఇచ్చే సమాధానాలపై సెబీ రివ్వ్యూ జరపనుంది. రివ్యూ జరిపేందుకు రెగ్యులేటరీ జీ ఫౌండర్ సుభాష్ చంద్ర, అతని కుమారుడు పునిత్ గోయాంక్తో పాటు ఇతర బోర్డ్ సభ్యులు హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే రివ్యూ అనంతరం పైన పేర్కొన్నట్లుగా జీలో నిధులు మళ్లీంపు, లేదంటే దుర్వినియోగం జరిగిందా అనే అంశంపై స్పష్టత రానుంది. -
‘జీ’కి మరో ఎదురు దెబ్బ.. న్యాయ పోరాటం చేయనున్న సోనీ
భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ ప్రసారాల విషయంలో జీ - డిస్నీ హాట్ స్టార్ మధ్య 1.4 బిలియన్ల డాలర్ల సబ్ లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నుంచి జీ బయటకు వచ్చింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు డిస్నీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిస్నీ మాతృసంస్థ సోనీ గ్రూప్ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో దావా వేసింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు సోనీకి తొలి విడతగా జీ గ్రూప్ 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించడంలో జీ విఫలమైంది.ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపింది. దీంతో జీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సోనీ గ్రూప్ ఉపక్రమించింది. కాగా, ఈ పరిణామాలపై జీ గ్రూప్, సోనీ గ్రూప్‌లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. -
శశి సోనీ ఎవరు? పద్మశ్రీ ఎందుకు వరించింది?
‘నిరంతర శ్రమతోనే విజయం సాధ్యం’ అని అంటారు. శశి సోనీని చూస్తే ఇది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. నేడు ఆమె రూ. 4 వేల కోట్లకు పైగా విలువైన కంపెనీకి యజమానిగా మారి, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శశి సోనీ రూ. 10,000 ప్రారంభ మూలధనంతో ఒక కంపెనీని ప్రారంభించారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. నాటి నుంచి నేటి వరకూ శశి సోనీ జీవిత ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా సాగింది. 2024 పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో శశి సోనీ పేరు కూడా ఉంది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో 1941, ఏప్రిల్ 4న శశి సోనీ జన్మించారు. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం ఢిల్లీకి తరలివచ్చింది. ఢిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం సాగింది. శశి 1971లో తన 30 ఏళ్ల వయసులో తొలిసారిగా సొంత వ్యాపారం ప్రారంభించారు. రూ. 10,000 పెట్టుబడితో ఆమె ‘డీప్ ట్రాన్స్పోర్ట్’ను ప్రారంభించారు. దానిని 1975 వరకు నిర్వహించారు. ఆ తర్వాత 1975లో ముంబయిలోని ములుంద్ ప్రాంతంలో ‘దీప్ మందిర్ సినిమా’ పేరుతో మొదటి ఏసీ సినిమా థియేటర్‌ను ప్రారంభించారు. దీనిని శశి సోనీ 1980 వరకు నడిపించారు. దశాబ్ద కాలం పాటు శ్రమించిన శశి ఆ తర్వాత అమోఘ విజయాన్ని అందుకున్నారు. శశి సోనీ ‘ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. మైసూర్లో నెలకొల్పిన ఈ గ్యాస్ తయారీ కర్మాగారంతో ఆమెకు మంచి ఆదాయం సమకూరింది. అనంతరం ఆమె సాంకేతిక రంగంలో కాలుమోపారు. శశి సోనీ 2005లో ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియాలో హైటెక్ ఆటోమోటివ్, ఈ-రిటైలింగ్ సేవలను అందిస్తోంది. ఈ కంపెనీకి చైర్‌పర్సన్‌గా శశి వ్యవహరిస్తున్నారు. ఐజెడ్ఎంఓ లిమిటెడ్.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ జాబితాలో చేరింది. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.4,150 కోట్లకు చేరింది. శశి ‘దీప్ జనసేవా సమితి’ సభ్యురాలు. ఈ సంస్థ మహిళలకు ఉద్యోగాలు కల్పించడంలో సహాయం చేయడంతో పాటు, మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం, పెన్షన్ పథకాలు ప్రారంభించడం, వికలాంగుల కోసం నిధుల సేకరణ తదితర సేవా కార్యక్రమాలను చేస్తుంటుంది. ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీకి పలు అనుబంధ కంపెనీలు కూడా ఉన్నాయి. పద్మశ్రీ అవార్డుకు ముందు శశి సోనీ వ్యాపార, సామాజిక సంక్షేమ రంగాల్లో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 1990లో ఆమె మహిళా గౌరవ్ అవార్డును అందుకున్నారు. ఆమె ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ గ్యాస్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అలాగే ఆమె డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్లో కూడా సభ్యురాలిగా కొనసాగుతున్నారు. -
సోనీ - జీ ఒప్పందం రద్దు..!
జపనీస్ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య ఒప్పందం రద్దయింది. దీంతో 10 బిలియన్ డాలర్ల (రూ. 8,31,32,55,00,000) ఒప్పదం నిలిచిపోయింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం రద్దు కావడానికి కారణం ఏంటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా పేరును దాని మాతృ సంస్థ చాలా రోజుల కిందటే కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్గా మార్చింది. నిజానికి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీను సోనీ తనలో విలీనం చేసుకోవాలని ప్రారంభంలో అనుకున్నప్పటికీ, అది పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో ఒప్పందం పూర్తిగా రద్దయింది. సోనీ & జీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక నెల గ్రేస్ పీరియడ్‌తో కలుపుకొని, 2023 డిసెంబర్ 21లోపు అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి కావాలి. అనుకున్న విధంగా జరగకపోతే.. ఇరుపార్టీలు కలిసి ఈ కాలవ్యవధిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఆలా జరగకపోతే.. నోటీసు ఇచ్చి విలీనం నుంచి తప్పుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అంబానీ ఖరీదైన నివాసం.. అంతా రామమయం - వీడియో వైరల్ సోనీ-జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఇదివరకే ఫెయిర్ ట్రేడ్ రెగ్యూలేటర్ సీసీఐ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, సహా కంపెనీ వాటాదారులు, రుణదాతలు అందరూ ఆమోదం తెలిపారు. 2023 ఆగస్టులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముంబయి బెంచ్ కూడా ఈ విలీనానికి అనుమతి ఇచ్చింది. కానీ రెండు కంపెనీలు గడువును ఒక నెల పొడిగించినప్పటికీ తమ విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. -
Zee-Sony Merger Deal: సోనీతో విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ – సీఎంఈపీఎల్) విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నామని జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తున్నామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. విలీన సంస్థకు జీల్ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించడం ఇష్టం లేని కారణంగా సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జీల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీల్‌తో తమ భారత విభాగం సీఎంఈపీఎల్ను విలీనం చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ గ్రూప్ రెండేళ్ల క్రితం డీల్ కుదుర్చుకుంది. అప్పట్నుంచి వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. జీల్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన తనయుడైన గోయెంకా .. కంపెనీ నిధులను మళ్లించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరిపింది. గోయెంకాను ఏ లిస్టెడ్ కంపెనీ బోర్డులో చేరరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అప్పిలేట్ న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ వైఫల్యంగా భావిస్తున్న సోనీ.. విలీన సంస్థకు గోయెంకాను సీఈవోగా చేసేందుకు ఇష్టపడటం లేదని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఒప్పందం పూర్తి కావడానికి జనవరి 20 వరకు గడువు ఉండటంతో ఏం జరగనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సీఈఎస్ వేదికపై అట్రాక్ట్ చేస్తున్న 'అఫీలా' కారు - వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్‌లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. -
జీకి భారీ షాక్.. ‘సోనీ సంచలన నిర్ణయం!’
ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్‌కు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జపాన్‌కి చెందిన డైవర్సిఫైడ్ దిగ్గజం సోనీ గ్రూప్.. జీతో పెట్టుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందని, అందుకు ఆ సంస్థ ఫౌండర్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, కుమారుడు సీఈఓ పునిత్ గోయెంక్ కారణమని తెలుస్తోంది. 2021లో ఒప్పందం 2021లో ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సోనీ - జీ విలీనం తర్వాత ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పునిత్ గోయెంకా బాధ్యతలు చేపట్టాలి. ఆయన నియామకాన్ని సోనీ గ్రూప్‌తో పాటు సోనీ పిక్చర్ నెట్ వర్క్ ఇండియా సీఈఓ ఎన్పీసింగ్తో పాటు ఇతర డైరెక్టర్లు ఆమోదం పొందాల్సి ఉంది. సెబీ మధ్యంతర ఉత్వరులు అయితే ఈ రెండు సంస్థల మధ్య విలీన ప్రక్రియ చివరి దశలో ఉందనగా.. గత ఏడాదిలో జీ మీడియా సంస్థ నుంచి నిధులు మళ్లించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సెబీ జీ మీడియా యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించింది. జీ వ్యవస్థాకుడు సుభాష్ చంద్ర, సీఈఓ పునీత్ గోయెంకాపై సెబీ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. పునీత్ గోయెంకాకు సెబీ ఆదేశాలు అందులో గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకా ఏ నమోదిత సంస్థలోనూ డైరెక్టర్ లేదా ఇతర ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. దీంతో సుభాష్, గోయెంకాలు సెబీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎస్ఏటీ)ని ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో జీ, సోనీ విలీనం సందిగ్ధం నెలకొంది. పునిత్ నాయకత్వంపై నీలినీడలు తాజాగా పరిణామాలతో జీ సీఈఓ పునిత్ గోయెంకా విలీన సంస్థకు నాయకత్వం వహిస్తారా? లేదా? అనే అంశంపై ప్రతిష్టంభన కారణంగా సోనీ, జీ మీడియాతో పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చూస్తోంది.కొత్త కంపెనీకి గోయెంకా నేతృత్వం వహిస్తారని 2021లో సంతకం చేసిన ఒప్పందం కాగా, సెబీ ఉత్వర్వులతో సోనీ ఆయనను సీఈఓ ఉండేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. విలీనానికి అవసరమైన కొన్ని షరతులు నెరవేరలేదని పేర్కొంటూ, ఒప్పందాన్ని ముగించడానికి జనవరి 20 పొడిగించిన గడువులోపు రద్దు నోటీసును దాఖలు చేయాలని సోనీ యోచిస్తోంది. ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. గడువులోపు ఇంకా స్పష్టత రావొచ్చని సమాచారం. -
అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఉన్న చిక్కులు అన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా 'ఏజెంట్' చిత్రాన్ని 'సోని లివ్' ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వల్ల సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఏజెంట్ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు కూడా తీసుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ బ్రేక్ పడుతూ వచ్చింది. ఈసారైనా జనవరి 26న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా..? అంటూ సోషల్‌మీడియాలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తొలగించి.. మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్‌ను విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారట. -
కౌన్ బనేగా కరోడ్‌పతి మళ్లీ వచ్చేస్తుంది.. అమితాబ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తున్నారు. భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి'కి పేరుంది. తాజాగా సోనీ టీవీ తన ట్వీటర్ వేదికగా తెలియజేస్తూ.. కౌన్ బనేగా కరోడ్‌పతి ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి అయ్యాయి. 2000 నుంచి ఈ షో ప్రారంభమైంది. ఆగష్టు 14 నుంచి సీజన్-15 ప్రారంభం కానుంది. ఈ షో కోసం హోస్ట్‌గా వ్యవహరించేందుకు అమితాబ్ బచ్చన్ రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని షోలను ఆయనే విజయవంతంగా నడిపారు. అందుకు సంబంధించి అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. 2000లో ప్రారంభం అయిన మొదటి సీజన్ అత్యంత ప్రశంసలు పొందింది. షో మొదటి సీజన్లో ప్రైజ్ మనీ రూ.1 కోటి ఉండగా 2005లో వచ్చిన రెండో సీజన్లో ప్రైజ్ మనీ రెండింతలు పెరిగి రూ.2 కోట్లకు చేరింది. అలా మూడో సీజన్ వరకు అలాగే ఉంది. 2010లో సీజన్ 4 ప్రైజ్ మనీని మళ్లీ రూ.1 కోటికి తగ్గించారు. కానీ 2013లో వచ్చిన ఏడో సీజన్ నుంచి ప్రైజ్ మనీని ఒక్కసారిగా రూ.7 కోట్లకు పెంచారు. ఈసారి ఎంత ప్రైజ్ మనీ అనేది తెలియాల్సి ఉంది. అమితాబ్ రెమ్యునరేషన్ షో ప్రారంభ సమయంలో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.25 లక్షలు వసూలు చేశారు. మొదటి సీజన్ హిట్ కాగానే అమితాబ్ తన ఫీజును కోటి రూపాయలకు పెంచేశారు.పలు మీడియా కథనాల ప్రకారం ఆయన 6,7 సీజన్లలో రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు తీసుకున్నారు. కానీ 8వ సీజనలో అది కాస్త రూ.2 కోట్లకు చేరింది. ఎనిమిదవ సీజన్లో రాణి ముఖర్జీ, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే వంటి తారలు కూడా ఆ స్టేజీపైన మెరిశారు. ఆ తర్వాత 9వ సీజన్లో అమితాబ్ బచ్చన్ రూ.2.6 కోట్లు తీసుకున్నారు. ఆ సీజన్లో హాట్ సీట్లో క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి విద్యాబాలన్ అతిథులుగా కనిపించారు. 10వ సీజన్లో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 కోట్లు వసూలు చేశారు. ఆ సంవత్సరం ప్రత్యేక పోటీదారులలో ఆయుష్మాన్ ఖురానా, అమీర్ ఖాన్ ఉన్నారు. 11, 12, 13వ సీజన్లలో మెగాస్టార్ అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 3.5 కోట్లు తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 13వ సీజన్‌కు క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్‌లతో సహా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ సీజన్ కోసం రూ. 4 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని బాలీవుడ్ మీడియా తెలుపుతుంది. -
తుది దశలో సోనీ–జీ విలీనం
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), కల్వర్ మ్యాక్స్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా) విలీన అంశం తుది దశకు చేరుకుందని జీల్ ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. ప్రమోటర్లమైన తమకు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మధ్య నెలకొన్న వివాదం ఈ డీల్‌కు అడ్డంకి కాబోదని ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన వివరించారు. ఈ విలీన ఒప్పందానికి షేర్హోల్డర్లతో పాటు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), స్టాక్ ఎక్సే్చంజీలు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కూడా ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. ప్రమోటరు కుటుంబ స్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమకు మాత్రమే పరిమితమని, కంపెనీకి ఇబ్బంది కలిగించబోవని గోయెంకా వివరించారు. -
లోకల్’కు 120 కోట్ల నిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైపర్‌లోకల్ కంటెంట్, కమ్యూనిటీ, క్లాసిఫైడ్ వేదిక అయిన లోకల్ తాజాగా రూ.120 కోట్ల సిరీస్-బి ఫండింగ్ అందుకుంది. గ్లోబల్ బ్రెయిన్, సోనీ ఇన్నోవేషన్ ఫండ్, ఇండియా కోషెంట్ తదితర ఇన్వెస్టర్లు ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. లోకల్ సేవలు అందిస్తున్న మార్కెట్లలో వృద్ధికి, కొత్త విభాగాల పరిచయానికి తాజా నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు రూ.225 కోట్లకుపైగా ఫండింగ్ అందుకున్నట్టు లోకల్ ఫౌండర్, సీఈవో జానీ పాషా తెలిపారు. బెంగళూరు కేంద్రంగా 2018లో ప్రారంభమైన లోకల్ యాప్ 7 రాష్ట్రాల్లో 6 భాషల్లో అందుబాటులో ఉంది. డెయిలీ అప్డేట్స్, కమోడిటీ ధరలు, స్థానిక జాబ్స్, రియల్టీ, మ్యాట్రిమోనియల్, స్థానిక యాడ్లు, క్లాసిఫైడ్స్ సమాచారాన్ని అందిస్తోంది. 4 కోట్లకుపైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. (బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) -
పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపడింది!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన నేమ్‌తో పాటు ఫేమ్‌ను సంపాదించుకుంది ఐఫోన్. దీని తయారీ వెనుక ఏ విషయాన్ని యాపిల్ కంపెనీ బయటపెట్టేది కాదు. అయితే తాజాగా సంస్థ సీఈఓ ఐఫోన్లకు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్‌ని రివీల్ చేశారు. అదేంటో తెలుసుకుందాం! ఐఫోన్ కెమెరాతో క్లిక్ చేస్తే ఫోటో అద్భుతంగా రావాల్సిందే. ఎందుకంటే దాని క్లారిటీ అలాంటిది మరీ. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ కెమెరాలకు సంబంధించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఐఫోన్ కెమెరాలను సోనీ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. అత్యున్నత కెమెరా సెన్సర్ల కోసం దశాబ్ధకాలంగా సోనీ సంస్థతో తాము చేతులు కలిపామని కుక్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తమ భాగస్వామ్యం నిరంతం కొనసాగుతుందన్నారు. సంవత్సరాలుగా, ఆపిల్ ఐఫోన్ మోడల్‌లలో ఉపయోగించే హార్డ్‌వేర్ గురించి పెదవి విప్పలేదు. అంతేకాకుండా ఏదైనా ఐఫోన్ మోడల్స్‌లో కూడా అధికారిక స్పెక్స్ షీట్న్ చూసినట్లయితే, కంపెనీ ర్యామ్, కెమెరా రిజల్యూషన్ సహా నిర్దిష్ట వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు. సోనీ ఐఫోన్ల కోసం కెమెరా సెన్సార్లను తయారు చేస్తుందన్న విషయాన్ని టిమ్ కుక్ తొలిసారిగా వెల్లడించడం గమనార్హం. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సోనీ తన కెమెరా సెన్సార్ పనితనం మరింత పెంచేందుకు కొత్త సెమీకండక్టర్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించే కొత్త ఇమేజ్ సెన్సార్‌ను అభివృద్ధి చేస్తోందట. We’ve been partnering with Sony for over a decade to create the world’s leading camera sensors for iPhone. Thanks to Ken and everyone on the team for showing me around the cutting-edge facility in Kumamoto today. pic.twitter.com/462SEkUbhi — Tim Cook (@tim_cook) December 13, 2022 చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
ఎలక్ట్రిక్ వాహనాల్లోకి సోనీ
టోక్యో: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వినోద రంగంలో ఉన్న జపాన్ సంస్థ సోనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన తయారీ దిగ్గజం హోండాతో చేతులు కలిపింది. సోనీ హోండా మొబిలిటీ పేరుతో ఏర్పాటైన కంపెనీ 2025 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనుంది. డెలివరీలు 2026 నుంచి మొదలు కానున్నాయి. తొలుత యూఎస్ మార్కెట్లో ఇవి రంగ ప్రవేశం చేయనున్నాయి. ఆ తర్వాత జపాన్, యూరప్‌లో అడుగుపెడతాయని సోనీ హోండా మొబిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యసుహిదె మిజూనో వెల్లడించారు. పూర్తిగా కొత్తదనం ఉట్టిపడేలా రూపొందిస్తామన్నారు. యూఎస్‌లోని హోండా ప్లాంటులో ఈవీలను తయారు చేస్తారు. అయితే ఇది ఒక ప్రత్యేక మోడల్ అని, భారీ విక్రయాల కోసం ఉద్దేశించి తయారు చేయడం లేదని కంపెనీ అధికారులు తెలిపారు. చెరి 50 శాతం వాటాతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ స్థాపించాలని 2022 మార్చిలో సోనీ గ్రూప్ కార్పొరేషన్, హోండా అంగీకరించాయి. ఇమేజింగ్, నెట్వర్క్, సెన్సార్, వినోద నైపుణ్యంతో సోనీ.. వాహనాలు, మొబిలిటీ టెక్నాలజీ, అమ్మకాలలో హోండాకు ఉన్న నైపుణ్యాన్ని ఒకచోట చేర్చే ఆలోచనతో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రెండేళ్ల క్రితం లాస్ వెగాస్‌లో జరిగిన సీఈఎస్ గ్యాడ్జెట్ షోలో సోనీ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. -
సోనీ–జీ విలీనానికి షరతులతో ఆమోదం
న్యూఢిల్లీ: సోనీ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కాంపిటిషన్ కమిషన్ ఈ విలీనానికి షరతులతో కూడిన ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత విలీనానికి కొన్ని సవరణలతో ఆమోదం తెలియజేసినట్టు సీసీఐ ట్విట్టర్‌పై వెల్లడించింది. వినోద కార్యక్రమాల ప్రసారాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోనీ, జీ విలీనం.. మార్కెట్లో ఆరోగ్యకర పోటీకి విఘాతమన్న ఆందోళన మొదట సీసీఐ నుంచి వ్యక్తమైంది. ఇదే విషయమై ఇరు సంస్థలకు షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో తమ డీల్‌కు సంబంధించి కొన్ని మార్పులు, పరిష్కారాలను అమలు చేస్తామంటూ ఇరు పార్టీలు సీసీఐ ముందు ప్రతిపాదించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీంతో సీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన మేరకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ విలీనం కానుంది. ఈ విలీనంతో సోనీ భారత మార్కెట్లో మరింత బలపడనుంది. స్టార్ నెట్వర్క్ నుంచి వస్తున్న పోటీని బలంగా ఎదుర్కోవడానికి అనుకూలతలు ఏర్పడనున్నాయి. అందుకే ఈ విలీనం పట్ల సోనీ, జీ రెండూ ఆసక్తిగా ఉన్నాయి. సీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైతే కొన్ని చానల్స్‌ను మూసేయడానికి జీ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. -
విక్రమ్ ‘కోబ్రా’ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించించింది. మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రల్లో కనిపించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 31న థియేటర్లో విడుదలైంది. విక్రమ్ విభిన్న పాత్రల్లో అలరించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎప్పటిలాగే విక్రమ్ నటన మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌పై తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ తాజా బజ్ ప్రకారం తమిళం, తెలుగులో సెప్టెంబర్ 23 లేదా 30న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్