
కొత్త ఏడాదిలో సోని రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. లాస్ వేగాస్లోని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2, ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నట్టు సోని ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గతేడాది ఎక్స్‌ఏ1, ఏక్స్‌ఏ1 ఆల్ట్రాలకు అప్‌గ్రేడెడ్‌గా మార్కెట్‌లోకి వచ్చాయి. బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్‌ను మెరుగుపరిచి వీటిని లాంచ్ చేసింది. మరో అతిపెద్ద డిజైన్ మార్పులో ఈ స్మార్ట్‌ఫోన్లకు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చడమే. అంతకముందు ఎక్స్‌ఏ1 స్మార్ట్‌ఫోన్లు మీడియోటెక్ ప్రాసెసర్లతో పనిచేయగా.. తాజాగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్‌తో రూపొందాయి. ఎక్స్‌ఏ2 స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్‌ను, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండగా.. ఎక్స్‌ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్‌ను, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు తమ స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు. అంతేకాక బ్యాటరీ సామర్థ్యం కూడా అంతకముందు వాటి కంటే ఎక్కువగా ఎక్స్‌ఏ2 స్మార్ట్‌ఫోన్ 3,300 ఎంఏహెచ్‌ను, ఎక్స్‌ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 3,580 ఎంఏహెచ్‌ను కలిగి ఉన్నాయి. ఆల్ట్రా-స్లిమ్ సైడ్ బెజెల్స్‌తో ఇవి రూపొందాయి. ఎక్స్‌ఏ2 స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో, ఎక్స్‌ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో మార్కెట్లోకి వచ్చాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఎక్స్‌ఏ2 స్మార్ట్‌ఫోన్‌కు వెనుక వైపు 23ఎంపీ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ కెమెరా, ఎక్స్‌ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 16 ఎంపీ, 8ఎంపీతో డ్యూయల్ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు 23 ఎంపీ కెమెరాను కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment