
వరల్డ్ క్రికెట్‌లో బిగ్గెస్ట్ రైవలరీలలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి. ఈ దాయాదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయాల ఉద్రిక్తల కారణంగా రెండు జట్లు కేవలం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లు మాత్రమే తలపడతున్నాయి.
దీంతో ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరు రోజున యావత్తు క్రికెట్ ప్రపంచం టీవీలకు అతుక్కుపోతారు. అయితే అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమవుతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నారు.
ఆసియాకప్-2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా పాక్-భారత్ జట్లు తలపడనున్నాయి. అయితే భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజును సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) భారీగా క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఆసియాకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌ల సమయంలో పది సెకన్ల సెకన్ల ప్రకటనకు రూ. 14 నుంచి 16 లక్షలు సోనీ నెట్‌వర్క్ నిర్ణయించినట్లు సమాచారం. భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు కూడా ఇదే ధర వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా 2031 వరకు ఆసియా కప్ మీడియా హక్కులను 170 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో వెయ్యి కోట్ల పైగా)కు సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు సోనీ లివ్‌లో యాప్‌లో కూడా ప్రసారం కానున్నాయి.
ఇక 8 మ్యాచ్‌లు పాల్గోనే ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆసియాకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా.. బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో భారత జట్టును వెల్లడించనుంది.
ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్
ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ