fingerprint
-
సైఫ్ అలిఖాన్పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్!
ముంబై: దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారిస్తున్న ముంబై పోలీసులు (mumbai police) దుండగుడు సైఫ్‌పై దాడి చేసిన ప్రదేశం నుంచి ఫింగర్ ప్రింట్స్ (fingerprints) సేకరించారు. ఆ వేలిముద్రలకు.. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ఇస్లాం వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని తేలింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దొంగతనం చేసే ప్రయత్నంలో నిందితుడు షరీఫుల్ఇస్లాం సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడికి యత్నించాడు. అయితే హైప్రొఫైల్ కేసు కావడంతో ముంబై పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటినుంచి 19 సెట్ల వేలిముద్రల్ని సేకరించారు. ఆ వేలి ముద్రలు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని నిర్ధారించారు.ముంబై పోలీసులు సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలను సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపారు. అక్కడ వేలిముద్రల్ని పరిశీలించగా..షరీఫుల్ ఫింగర్ ప్రింట్లతో సరిపోలడం లేదని సిస్టమ్ జనరేటేడ్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఫింగర్ ప్రింట్ పరీక్షల్లో ఫలితం నెగిటీవ్‌గా వచ్చింది. ఫలితం నెగిటివ్ అని సీబీఐ అధికారులు ముంబై పోలీసులకు సమాచారం అందించారు. తదుపురి పరీక్షల కోసం సైఫ్ ఇంటినుంచి మరిన్ని వేలిముద్రల నమోనాల్ని సేకరించిన పోలీసులు మరోసారి సీఐడీ విభాగానికి పంపినట్లు సమాచారం.దాడి జరిగిందిలా.. సైఫ్ వాంగ్మూలం ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. -
అటెండెన్స్ ఇక ఆధునికంగా..
సాక్షి, హైదరాబాద్: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆరి్టఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కారి్మకులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దురి్వనియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల క్రితం వేలిముద్రల బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్‌తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్ఎఫ్ఏ పరిధిలో ఉండే 21 మంది కారి్మకులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు. అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్‌లు, సీఎంఓహెచ్‌కు సైతం వాటాలున్నాయని కారి్మకులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్ఎఫ్ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్‌సెట్‌లో తమ ఫింగర్ ప్రింట్స్ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్ రోనాల్డ్‌రాస్ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రత్యేక యాప్‌తో.. ఫేషియల్ రికగి్నషన్ను మొబైల్ ఫోన్‌తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ తయారు చేస్తారు. యాప్ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. 25 వేల మందికి వర్తింపు.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్‌తో పాటు వెబ్‌పోర్టల్ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కారి్మకులు గ్రూపులుగా పనులు చేస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కారి్మకుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్ఎఫ్పీలను ఆహా్వనించిన జీహెచ్ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది. రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు.. 2017లో మే 21 తేదీ నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్‌ప్రింట్స్ బయో మెట్రిక్ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్‌ప్రింట్స్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ తాజాగా ఫేషియల్ బయోమెట్రిక్‌కు సిద్ధమవుతోంది. -
అటెండెన్స్ ఇక ఆధునికంగా..
సాక్షి, హైదరాబాద్: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల క్రితం వేలిముద్రల బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్‌తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్ఎఫ్ఏ పరిధిలో ఉండే 21 మంది కార్మికులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు. అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్‌లు, సీఎంఓహెచ్‌కు సైతం వాటాలున్నాయని కార్మికులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్ఎఫ్ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్‌సెట్‌లో తమ ఫింగర్ ప్రింట్స్ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్ రోనాల్డ్‌రాస్ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రత్యేక యాప్‌తో.. ఫేషియల్ రికగ్నిషన్‌ను మొబైల్ ఫోన్‌తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ తయారు చేస్తారు. యాప్ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. 25 వేల మందికి వర్తింపు.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్‌తో పాటు వెబ్‌పోర్టల్ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులు గ్రూపులుగా పనులు చేస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కార్మికుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్ఎఫ్పీలను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది. రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు.. 2017లో మే 21 తేదీ నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్‌ప్రింట్స్ బయో మెట్రిక్ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్‌ప్రింట్స్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ తాజాగా ఫేషియల్ బయోమెట్రిక్‌కు సిద్ధమవుతోంది. -
అయ్యో పాపం అబ్మాయి!
‘ప్రేమా మజాకా!’ అని మరోసారి అనిపించే సంఘటన ఇది. పంజాబ్‌కు చెందిన ఆంగ్రేజ్ సింగ్, పరమ్‌జిత్ కౌర్ ప్రేమికులు. కౌర్ ‘బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ నిర్వహించే మల్టీ–పర్పస్ హెల్త్ వర్కర్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతుంది. అయితే తన ప్రియురాలు కష్టపడడాన్ని ఆంగ్రేజ్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ‘నీ బదులు నేను ఎగ్జామ్ రాస్తాను. ఆ కష్టమేదో నేను పడతాను’ అంటూ రంగంలోకి దిగాడు. ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు కష్టపడ్డాడో లేదో తెలియదుగానీ మీసాలు, గెడ్డాలు గీయించి, పెదాలకు లిపిస్టిక్ పూసి, సల్వర్ కమిజ్ వేసుకొని అచ్చం అమ్మాయిలాగే కనబడడానికి చాలానే కష్టపడ్డాడు. అయితే బయోమెట్రిక్ దగ్గర ఫింగర్‌ప్రింట్స్ ఫెయిల్ కావడంతో ఆంగ్రేజ్ సింగ్ పట్టుబడ్డాడు. దీంతో సోషల్ మీడియాలో ఆంగ్రేజ్సింగ్పై మీమ్సే మీమ్స్. అయ్యో పాపం అబ్మాయి! -
ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్!
కరీంనగర్: ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్ చేస్తే రాళ్లు వచ్చిన సంఘటన కోనరావుపేట మండలం కనగర్తిలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన కొల్లూరి వికాస్ ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కోసం జనవరి 1న బుక్ చేశాడు. 12న డెలివరీ ఇస్తామని షాపింగ్ సంస్థ స్పష్టం చేయగా.. ఆదివారమే పార్సిల్ ఇంటికొచ్చింది. డెలివరీ బాయ్‌కి రూ.2,718 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. పార్సిల్ తెరిచి చూడగా రాళ్లు కనిపించడంతో కంగుతినడం యువకుడి వంతైంది. మోసం జరిగిందని వెంటనే డెలివరీ బాయ్‌కి చెప్పగా ఐటమ్ రిటర్న్ పెట్టమంటూ వెళ్లిపోయాడు. -
క్లోనింగ్ ముప్పు : తక్షణమే ఆధార్ బయోమెట్రిక్ డేటా లాక్ చేయండి ఇలా..!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్టం పడటం లేదు.సైబర్ క్రైం నేరాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. మనం ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ మోసానికి పాల్పడుతున్న కొత్త తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేలిముద్రతో తస్కరించి బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు కాజేసిన ఘటన ఆందోళన రేపుతోంది. క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమేంట్ సిస్టం ద్వారా దాదాపు లక్షల మేర టోకరా వేస్తున్నారు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా ప్రారంభించాలన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా, చివరికి మొబైల్ సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్‌తోపాటు ఫింగర్ ప్రింట్ కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇలా అవసరం ఉన్న ప్రతి చోటా ఆధార్, ఫింగర్ ప్రింట్ ఇస్తాం. దీన్ని అదునుగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు పౌరుల ఫింగర్ ప్రింట్స్ సేకరించి, నగదు స్వాహా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆధార్ కార్డులోని వేలి ముద్రలు, ఇతర బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఈ క్రమంలో UIDAI పోర్టల్ ద్వారా బయోమెట్రిక్ డేటా లాక్ లేదా అన్ లాక్ ప్రక్రియ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బయోమెట్రిక్ లాకింగ్ ఎలా? ♦ ముందుగా మై ఆధార్ పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ♦ మైఆధార్ పోర్టల్‌లోకి ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. ♦ స్క్రీన్ పై లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ అందులో లాక్, అన్‌లాక్ మీకు ఎలా ఉపయోగపడుతుందనేది వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ వెంటనే ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది. తరువాత టర్మ్స్ బ్యాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయాలి. ♦ Your Biometric Have Been Locked Successfully (బయో మెట్రిక్ విజయవంతంగా లాక్ చేయబడింది’) అనే సందేశం డిస్ప్లే అవుతుంది. ♦ లాక్ కాగానే లాక్ లేదా అన్ లాక్ బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ స్క్రీన్‌పై కనబడుతుంది. బయోమెట్రిక్ అన్‌లాక్ ఎలా? ♦పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగులో నిపిస్తుంది. ఇలా ఉంటే బయోమెట్రిక్ లాక్ అయినట్టే. ♦అన్‌లాక్ ప్రక్రియ కోసం Please Select To Lock టిక్ చేసిన తరువాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ♦బయోమెట్రిక్ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని మెసేజ్ కనిపిస్తుంది. ఇక్కడ కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని, నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి ♦Your Biometrics Have Been Unlocked Successfully అని స్క్రీన్‌పై కనిపిస్తుంది. ♦ తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే బయోమెట్రిక్ అన్‌లాక్ అవుతుంది అనేది గమనించాలి -
క్లోన్డ్ వేలి ముద్రలతో దందా
సాక్షి, హైదరాబాద్: భూ దస్తావేజుల నుంచి లభించిన వివరాల ఆధారంగా క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్)ను దుర్వినియోగం చేసి బ్యాంకు ఖాతాల నుంచి రూ.10 లక్షల మేర టోకరా వేసిన ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసు లు రట్టు చేశారు. తొమ్మిది మంది నిందితులున్న ఈ గ్యాంగ్‌లో ఆరుగురిని అరెస్టు చేశామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ గజరావ్ భూపాల్ తెలిపారు. డీసీపీ డి.కవిత, ఏసీపీ ఆర్జీ శివమారుతీలతో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జైలు నుంచి వచ్చి.. స్నేహితులకు చెప్పి ఏపీలోని ప్రకాశం జిల్లా కంబంకు చెందిన ఎం. యువరాజు గతంలో వేలిముద్రల్ని క్లోన్ చేసి, వాటి ద్వారా ఏఈపీఎస్ విధానంలో బ్యాంకు ఖాతాల్లోని నగదు కాజేసి అరెస్టయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చాక ఈ స్కామ్ ఎలా చేయాలో తన స్నేహితుడైన కంబం వాసి రఫీకి చెప్పాడు. ఇతడు అసా ధారణ్, ఉదయ్‌కిరణ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఓ రూమ్‌లో ఉంటున్నాడు. వీరంతా కలిసి ఆ దందా చేద్దామని నిర్ణయించుకున్నారు. క్లోన్డ్ వేలిముద్రలు చేయడానికి అవసరమైన నమూనాలు, ఆధార్ నంబర్లు యువరాజే ఇచ్చాడు. కంబం వాసి నరేంద్రకు అక్కడ మీ సేవ కేంద్రం నిర్వాహకుడితో స్నేహం ఉంది. తరచూ ఆ సేవా కేంద్రంలో కూర్చునే ఇతగాడు అక్కడి కంప్యూటర్లో ఉన్న దాదాపు 2,500 భూ రిజిస్ట్రేషన్ పత్రాల సాఫ్ట్‌కాపీలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకుని యువరాజు, రఫీకి ఇచ్చాడు. అసాధారణ్ త్రయం క్లోన్డ్ వేలిముద్రలు తయారీకి అవసరమైన మిషన్, ఇతర సామగ్రిని ఆన్లైన్లో ఖరీదు చేసింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు కాపీతోపాటు వేలిముద్రల్నీ డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. వీరు తమ వద్ద ఉన్న 2,500 దస్తావేజుల సాఫ్ట్‌కాపీల నుంచి ఆధార్ నంబర్లు, వేలిముద్రల్ని సంగ్రహించి క్లోన్డ్ వేలి ముద్రలు తయారు చేశారు. ఏఈపీఎస్ విధానంలో డబ్బు డ్రా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ సంస్థల్లో ఏదో ఒక దాని నుంచి మర్చంట్ ఐడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అనుసంధానించి ఉన్న బ్యాంకు ఖాతాదారుడు పరిమిత మొత్తాలు ఈ మర్చంట్స్ వద్దే డ్రా చేసుకుంటారు. ఇలా డ్రా చేయడానికి బ్యాంకు ఖాతా నంబర్, ఓటీపీ తదితరాలు అవసరం లేదు. నిరుద్యోగికి ఎర వేసి మర్చంట్ ఐడీ వీరికి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి న కె.శ్రీను తారసపడ్డాడు. శ్రీను ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మర్చంట్ ఐడీ తీసుకునేలా అసాధారణ్ ప్రేరేపించాడు. శ్రీను తన పేరుపై ఐడీ, బయోమెట్రిక్ మిషన్ తీసుకుని అసాధారణ్‌కు ఇచ్చాడు. ఫినో పేమెంట్స్ వెబ్సైట్లో మర్చంట్ ఐడీని నమోదు చేసి, ఉపకరణం ద్వారా శ్రీను వేలిముద్రను తనిఖీ చేసి ఏఈపీఎస్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఖాతాదారు ఆధార్ నంబర్‌ను పొందుపరిచి, వేలిముద్ర రీడింగ్ చేస్తే నిర్ణీత మొత్తం అతడి ఖాతా నుంచి మర్చంట్ ఖాతాలోకి వస్తుంది. మర్చంట్ తన వద్ద ఉన్న మొత్తం నుంచి ఖాతాదారుడికి తక్షణం చెల్లించేస్తాడు. ఫినో పేమెంట్స్ సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత అసాధారణ్ త్రయం తమ వద్ద ఉన్న ఆధార్ నంబర్లు, క్లోన్డ్ వేలిముద్రలు వినియోగించి రూ.10 లక్షల్ని మర్చంట్ ఖాతాలుగా యాడ్ చేసిన తరుణ్, శివకృష్ణలకు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది. ఆపై ఏటీఎం కార్డులు వినియోగించి ఆ మొత్తాలు డ్రా చేసుకుని అంతా పంచుకుంటున్నారు. సహకరించిన ఎథికల్ హ్యాకర్ అసాధారణ్ త్రయానికి ఓ దశలో సాంకేతిక సమస్యలు రావడంతో తమ స్నేహితుడైన ఎథికల్ çహ్యాకర్ మహ్మద్ ఇయాజ్ సాయం తీసుకుంది. ఆ సమస్యను పరిష్కరించి వీరికి సహకరించిన హ్యాకర్ ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బు డ్రా చేసుకుని వచ్చాడు. తాము శ్రీనుకు జారీ చేసిన మర్చంట్ ఐడీ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరుగుతున్నట్లు బ్యాంకుల నుంచి ఫినో పేమెంట్స్ సంస్థకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సంస్థ సైబర్‌క్రైమ్ ఠాణాలో కేసు పెట్టింది. ఇన్స్పెక్టర్ ఎస్.సీతారాములు నేతృత్వంలో ఎస్సై వై.యాదగిరితో కూడిన బృందం దర్యాప్తు చేసింది. రఫీ, యువరాజు, తరుణ్ మినహా మిగిలిన ఆరుగురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి ల్యాప్‌టాప్‌లు, ఇతర ఉపకరణాలు స్వా«దీనం చేసుకుంది. -
కేవైసీ కోసం క్యూ... రేషన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరే!
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల నుంచి బియ్యం, ఇతర సరుకులు తీసుకునేందుకు కేవైసీ (నో యువర్ కస్టమర్– మీ వినియోగదారుని తెలుసుకోండి) నమోదు తప్పనిసరి కాబోతుంది. రేషన్ దుకాణాల్లో అప్డేట్ చేసిన ఈపాస్ మిషన్ల ద్వారా కార్డులో నమోదైన వారందరి వేలి ముద్రలు తీసుకొని, వారి వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా ఈ కేవైసీకి ఈనెల 5వ తేదీ నుంచి శ్రీకారం చుట్టారు. వేలి ముద్రలు వేయకుంటే రేషన్ కార్డులో పేరుండదు అనే ప్రచారం నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా వచ్చి ఈ కేవైసీ కోసం రేషన్ దుకాణాల వద్ద బారులుతీరి మరీ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కూడా కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈపాస్ మిషన్లను అప్‌గ్రేడ్ చేసి, కార్డుదారుల వేలి ముద్రలు తీసుకోవలసిందిగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రేషన్ దుకాణాల్లో కార్డు దారుల వేలి ముద్రలు తీసుకుంటున్నారు. మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి రేషన్‌కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని , కార్డుదారుల పేర్లు ఎవరివీ తొలగించడం జరగదని స్పష్టం చేశారు. కేవైసీ విషయంలో మరోసారి సీఎంతో చర్చించి తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తామని తెలిపారు. గడువు తేదీ ఏమీ లేదు: అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఈ కేవైసీకి తుది గడువు అంటూ ఏమీ లేదని పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ‘సాక్షి’కి తెలిపారు . కేవైసీలో వివరాలు ఇవ్వని కార్డుదారుల పేర్ల విషయంలో ఎలాంటి ఆదేశాలు లేవని, దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే వేలి ముద్రలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్డుల నుంచి ఎవరి పేర్లు తొలగించబోమని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రలు సేకరించి..
సాక్షి, హైదరాబాద్: సిలికాన్ ఫింగర్‌ప్రింట్స్ (నకిలీ వేలిముద్రల)ను తయారు చేసి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను తెలంగాణ సీఐడీ పోలీస్ బృందం అరెస్టు చేసింది. ఈ ముఠాలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన రంజిత్‌షాను ఆ రాష్ట్రంలోని కిషన్‌గంజ్ జిల్లాలో ఈనెల 24న, మరో నిందితుడు సఫాత్ ఆలంను ఈనెల 14న బెంగళూరులో అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ మంగళవారంనాడిక్కడ తెలిపారు. ఈ ముఠాలో కీలక నిందితుడు అక్మల్ ఆలంను సీఐడీ పోలీసులు గతేడాది డిసెంబర్లో బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోని వేలిముద్రలతో... ఈ సైబర్ మోసంలో నిందితులు రిజిస్ట్రేషన్ , రెవెన్యూశాఖల వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఈ ముఠా ముందుగా రిజిసే్ట్రషన్, రెవెన్యూ శాఖల వెబ్సైట్లోకి వెళ్లి సేల్‌డీడ్, ఇతర డాక్యుమెంట్లలో వేలిముద్రలను, ఆధార్ నంబర్లను, బ్యాంక్ ఖాతాల్లో పేర్లను సేకరిస్తుంది. ఈ వేలిముద్రలను ఆధారంగా సిలికాన్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్ పాయింట్స్ (సీఎస్పీ)ల సిబ్బందితో కుమ్మక్కై ఆ సెంటర్లలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) విధానంలో వేలిముద్రలను పెట్టి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సదరు వ్యక్తులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును డ్రా చేస్తున్నారు. ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలో పేరు, వేలిముద్ర ఉంటే ఏఈపీఎస్‌ల నుంచి డబ్బులు డ్రా చేసే అవకాశం ఉండటం సైబర్ నేరగాళ్లకు కలిసొచ్చే అంశంగా మారింది. ఇలా వెలుగులోకి వచ్చింది... హైదరాబాద్‌లోని సెయింట్ మేరిస్ రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఖాతా ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగి గతేడాది డిసెంబర్లో సీఐడీ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 4, 5 తేదీల్లో తన బ్యాంకు ఖాతా నుంచి నాలుగు విడతల్లో మొత్తం రూ.24 వేలు తనకు తెలియకుండానే ఎవరో డ్రా చేసినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి పెట్టిన సీఐడీ అధికారులు నగదు విత్‌డ్రా చేసిన ప్రాంతంలో బ్యాంకు ఖాతాలు, అక్కడ నిందితులు వాడిన ఫోన్ నంబర్ల ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది డిసెంబర్ 22న కీలక నిందితుడు అక్మల్ ఆలంను అరెస్టు చేశారు. అతడి నుంచి సేకరించిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీఐడీ సైబర్‌క్రైం ఎస్పీ లావణ్య ఎన్జేపీ, మరో ఎస్పీ బి. రామ్‌రెడ్డిని మహేశ్‌భగవత్ అభినందించారు. -
భారీ మోసం.. సిలికాన్ ఫింగర్ ప్రింట్స్‌తో ఆన్లైన్లో డబ్బు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఫేక్ సింగర్ ప్రింట్స్‌తో ఆన్లైన్లో నగదును విత్ డ్రా చేసుకున్నారు. ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు భారీ స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. కేటుగాళ్లు ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌ను ఉపయోగించి ఆన్లైన్లో నగుదును విత్ డ్రా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న సేల్ డీడ్ల ద్వారా ఫింగర్ ప్రింట్స్‌ను నిందితులు కాజేశారు. ఫ్రింగర్ ప్రింట్స్‌తో పాటుగా ఆధార్ నంబర్లను కూడా దొంగతనం చేశారు. ఈ క్రమంలో సేల్ డీడ్‌లో ఉన్న ఫింగర్ ప్రింట్స్‌ను తీసుకుని సిలికాన్ ఫింగర్ ప్రింట్స్‌ను నిందితులు తయారు చేశారు. ఇక, ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు భారీ స్కెచ్ వేశారు. సిలికాన్ ఫింగర్ ప్రింట్స్, ఆధార్ నెంబర్ ద్వారా కస్టమర్లకు తెలియకుండానే నగదును దోచుకున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి సీఐడీ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంజిత్ సాహ, అలం అనే ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే, వీరిద్దరికీ సహకరించిన కస్టమర్ సర్వీస్ అధికారులపై కూడా సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: భార్యపై అత్యాచారం చేశాడని!.. మైలార్‌దేవ్‌పల్లి మైనర్ రాజా కేసులో వీడిన మిస్టరీ -
వివేకా లేఖకు నిన్‌హైడ్రేట్ పరీక్ష.. సీబీఐ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో.. సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు అవసరమైన నిన్‌హైడ్రేట్ (Ninhydrin Test) పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే.. ఈ పరీక్ష ద్వారా లేఖ పాడైపోయే అవకాశం ఉన్నందున.. పరీక్షకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది దర్యాప్తు సంస్థ. వివేకా హత్య జరిగిన ఘటనాస్థలంలో దొరికిన లేఖను 2021 ఫిబ్రవరి 11వ తేదీన ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్కు పంపింది సీబీఐ. అయితే తీవ్ర ఒత్తిడిలోనే వివేకా ఆ లేఖ రాసినట్లుగా సీఎఫ్ఎస్ఎల్ తేల్చి చెప్పింది. ఇక ఇప్పుడు.. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ను కోరింది సీబీఐ. అయితే.. లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్ఎస్ఎల్ చెప్పింది. నిన్‌హైడ్రేట్ పరీక్ష చేస్తే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సీఎఫ్ఎస్ఎల్, సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో.. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ టెస్ట్ నిర్వహణ కోసం కోర్టును ఆశ్రయించించింది సీబీఐ. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అలాగే రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో సీబీఐ పిటిషన్‌పై నిందితుల స్పందన కోరింది సీబీఐ న్యాయస్థానం. ఈ పిటిషన్‌పై జూన్ 2వ తేదీన విచారణ జరపనుంది నాంపల్లి సీబీఐ కోర్టు. ఇదీ చదవండి: వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన స్టేట్మెంట్ -
ఫింగర్ ప్రింట్స్ కోసం సీఐడీకి అధునాతన కిట్లు
సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు వాటిని ఛేదించేందుకు ఫింగర్ ప్రింట్స్ కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫింగర్ ప్రింట్స్ సేకరణ, తరువాత వాటిని విశ్లేషించడానికి అవసరమైన అధునాతన కిట్స్‌ను రాష్ట్ర సీఐడీ విభాగం సమకూర్చుకుంది. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఫింగర్ ప్రింట్ కిట్స్‌ను సీఐడీ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆరు జోన్లలోని అధికారులకు అందజేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లోని ఎల్బీ నగర్ జోన్, సైబరాబాద్‌లోని శంషాబాద్ జోన్, హైదరాబాద్ నగరంలోని సౌత్, నార్త్, వెస్ట్, సెంట్రల్ జోన్లకు ఈ కిట్లను అందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఫింగర్ ప్రింట్ యూనిట్లకు వీటిని అందచేయనున్నట్లు మహే ష్భగవత్ చెప్పారు. సీఐడీలోని ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ తాతా రావు మాట్లాడుతూ ఒక్కో కిట్‌లో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయని తెలిపారు. మాస్టర్ ఎక్స్పర్ట్ లేటంట్ ప్రింట్ కిట్, ఫింగర్ ప్రింట్ కెమికల్ ప్రాసెసింగ్ కిట్, లెటంట్ బ్రషెస్, మాగ్నటిక్ పౌడర్ అప్లికేటర్, పోస్టు మార్టమ్ ఇంక్ టూల్, ఇంక్డ్ స్ట్రిప్స్, మాగ్నటిక్ పౌడర్స్, లెటెంట్ ప్రింట్ బేసిక్ పౌడర్స్, పోర్టబుల్ మల్టీబాండ్ లైట్సోర్స్ ఉంటాయి. కార్యక్రమంలో సీఐడీ అధికారులు ఎం.నారాయణ(అడ్మిన్), ఆర్ వెంకటేశ్వర్లు(ఎస్సీఆర్బీ) రవీందర్(నార్కొటిక్స్), డీఎస్పీ నందుకుమార్(ఎఫ్‌పీబీ) పాల్గొన్నారు. -
అమెరికాలో వరుస ఘటనలు, సరికొత్త స్మార్ట్ గన్.. ఎవరుపడితే వారు కాల్చలేరు
వాషింగ్టన్: యజమాని మినహా మరెవరూ పేల్చడం సాధ్యంగాని 9ఎంఎం తుపాకీని తయారు చేసింది అమెరికాకుచెందిన బయోఫైర్ కంపెనీ. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కాల్చే వ్యక్తిని పోల్చుకునే ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ దీని సొంతం. ఇలాంటి తుపాకీ ప్రపంచంలో ఇదే మొదటిది. గన్ను పక్కన పెట్టేయగానే లాక్ అవుతుంది. అమెరికా వంటి దేశాల్లో చిన్నారులు పొరపాటున తుపాకీ కాల్చడం, గన్ చోరీ తదితరాలకు ఇక తెర పడుతుందని బయోఫైర్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థకు ఇంటెల్, గూగుల్, నాసాలు తోడ్పాటునందిస్తున్నాయి. అమెరికాలో తరచూ తుపాకీల కాల్పులు ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ హింసను నియంత్రించి తుపాకీని ఎవరు పడితే వారు వాడకుండా చేయాలనే సదుద్దేశంతో ఈ స్మార్ట్గన్ను అభివృద్ధి చేసినట్లు బయోఫైర్ పేర్కొంది. వచ్చే ఏడాది ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇప్పుడే ప్రీ ఆర్డర్లు కూడా తీసుకుంటోంది. ఈ స్మార్ట్ గన్ను బయోఫైర్ వ్యవస్థపకుడు క్లోయేఫర్(26) అభివృద్ధి చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే దీన్ని రూపొందిస్తున్నారు. సాంకేతికతతో ప్రతి సమస్యను పరిష్కరించేలేమని, కానీ అమెరికాలో క్లిష్టమైన సమస్యలను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించుకోగలమని క్లోయేఫర్ పేర్కొన్నారు. ఈ గన్‌తో పొరపాటున పిల్లల చేతుల్లో తుపాకులు పేలే ఘటనలు తగ్గుతాయని చెప్పారు. యజమానులు తప్ప మరెవరికీ తుపాకీని ఉపయోగించడం సాధ్యం కాకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉండవన్నారు. చదవండి: కృత్రిమ మేధపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆందోళన.. తేడావస్తే అంతే! -
వేలిముద్రలు కొట్టేసి.. బ్యాంకు ఖాతా లూటీ చేసి..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెర తీస్తున్నారు. తాజాగా ‘ఆధార్’ను ఆధారంగా చేసుకుని దోచుకుంటున్నారు. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్)’ మోసాలు క్రమంగా పెరుగుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాలు హరియాణా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇటీవల పెరిగాయన్నారు. ఇవి తెలంగాణలోనూ అక్కడక్కడ వెలుగు చూస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే తెలంగాణ సీఐడీ విభాగంలోని సైబర్ క్రైం పోలీసులు ఈ తరహా కేసులో నిందితుడిని బిహార్‌లో అరెస్టు చేసి నగరానికి తెచ్చారు. ఈ తరహా మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. – సాక్షి, హైదరాబాద్ ఇలా జరిగితే అప్రమత్తం కావాలి మీకు తెలియకుండానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంలో మీ బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు పోయినట్టు గుర్తిస్తే వెంటనే మీ ఆధార్ కార్డుతో అనుసంధానమైన మీ వేలిముద్రలను డిజేబుల్ చేసుకోవాలని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. ఆధార్ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దన్నారు. వివిధ మార్గాల్లో దొంగిలించిన వేలిముద్రలను సిలికాన్ ఫింగర్ ప్రింట్స్‌గా రూపొందించి వాటి ద్వారా ఏఈపీఎస్ విధానంలో ఆధార్ లింకై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నట్టు తెలిపారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ►ఏఈపీఎస్ సదుపాయాన్ని తరచుగా వాడనట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆ సదుపాయాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. ►మీ బయోమెట్రిక్ దుర్వినియోగం కాకుండా ఆధార్ వెబ్సైట్లోకి (https:// resident. uidai. gov. in/ aadhaar& lockunlock) వెళ్లి ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేసుకోవాలి. ►వీలైనంత వరకు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఆధార్‌కార్డ్ కాపీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఆధార్‌కార్డును ఏదైనా ధ్రువీకరణ కోసం వాడాల్సి వస్తే తప్పకుండా మాస్క్డ్ ఆధార్ (ఆధార్ నంబర్పూర్తిగా కనిపించకుండా ఉండేది) కాపీని వాడుకోవాలి. ►సైబర్ నేరం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్‌కు లేదా www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలి. ►అనధికార వెబ్సైట్లు, ఏజెన్సీల వారికి వేలిముద్రలను ఇవ్వవద్దు. మాస్క్డ్ ఆధార్ అంటే? ఆధార్ కార్డులోని మొత్తం 12 నంబర్లలో మొదటి ఎనిమిది నంబర్లు కనిపించకుండా (వాటి స్థానంలో గీగీగీ గుర్తులు ఉంటాయి) కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే దాన్ని మాస్క్డ్ ఆధార్ అంటారు. ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి మాస్క్ ఆధార్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే మన ఆధార్‌కార్డు ఆన్లైన్లో ఎవరు డౌన్లోడ్ చేసినా పూర్తి వివరాలు కనిపించవు. దీని వల్ల ‘ఆధార్’మోసాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఏఈపీఎస్ అంటే..? ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏపీపీఎస్) అంటే.. ఏటీఎంలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఏర్పాటు (మైక్రో ఏటీఎంలుగా పేర్కొనవచ్చు) చేసేవి. ఏ బ్యాంక్ ఏజెంట్ అయినా ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా ఇతర ఏ బ్యాంకునకు సంబంధించిన నగదు లావాదేవీలనైనా ఆన్లైన్లో చేయొచ్చు. ఇందుకోసం ఖాతాదారుడి పేరు, బ్యాంక్ ఖాతాకు లింకైన ఆధార్ నంబర్, ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్ర ఉంటే సరిపోతుంది. సదరు ఖాతాదారుడు ఏఈపీస్ విధానంలో నగదు తీసుకోవాలంటే సంబంధిత బాం్యక్ ఏజెంట్ దగ్గరకు వెళ్లి బ్యాంకు పేరు, ఆధార్ నంబర్, వేలిముద్ర ఇస్తే సరిపోతుంది. సరిగ్గా ఇదే అంశాన్ని కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ విభాగం వెబ్సైట్ నుంచి వేలిముద్రలను సేకరించి వాటిని సిలికాన్ షీట్ల ద్వారా నకిలీ వేలిముద్రలను తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. -
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రాత్రి బైకులు ఆపి ఫింగర్ ప్రింట్ టెస్టులు!
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రాత్రి సమయంలో చోరీలకు తెగబడే దొంగలకు అడ్డుకట్టవేయడానికి నగర పోలీసులు కొత్త పథకం రూపొందించారు. రాత్రి సమయంలో గస్తీలు, వాహనాల తనిఖీల సమయంలో అనుమానితులు, వాహనదారుల వేలిముద్రలు, వాహనాల నంబర్లు పరిశీలనకు నాంది పలికారు. ఇందులో నేరపూరిత చరిత్ర ఉంటే అక్కడే వాహనాలను లాక్ చేస్తారు. వాహన సమాచారం కూడా డేటా బేస్‌లో వస్తుంది కాబట్టి దొంగ వాహనమైతే సీజ్ చేస్తారు. తద్వారా రాత్రి వేళల్లో దొంగలకు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లో తేలిపోతుంది పోలీసులు గస్తీ, నాకాబందీ సమయాల్లో జనం వేలిముద్రలను తమ మొబైల్ఫోన్లో సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో పరిశీలిస్తారు. సాధారణ పౌరులైతే ఏమీ ఉండదు. నేరాల్లో భాగస్వామి అయితేనే అతని నమోదైన కేసుల వివరాలు లభ్యమౌతాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు. సరైన కారణాలు లేకపోతే తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే వాహనం నంబరును బట్టి చోరీ చేసిన వాహనమా, నేరాల్లో ఉపయోగించారా, లేదా అనేది కూడా యాప్ ద్వారా నిర్ధారిస్తారు. సీఐ, ఎస్ఐలకు శిక్షణ గత రెండు నెలలనుంచి వివిధ పోలీస్స్టేషన్లలో మల్లోకి తీసుకువచ్చారు. ప్రతిపోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐలకు శిక్షణ అందించి ఉపకరణాలు అందజేశారు. నిత్యం తలా 20 మందిని తనిఖీ చేయడం తప్పనిసరి. దశలవారీగా నగరవ్యాప్తంగా విస్తరిస్తారు. పోలీసులు ప్రజలు వేలిముద్రలు తీసుకుంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి అవుతుందనే భయం వద్దని, కేవల వేలిముద్రలు స్కాన్ అవుతాయని, రహస్య సమాచారం సేకరణ జరగదని పోలీసులు తెలిపారు. జరగబోయే నేరాలను అడ్డుకోవచ్చు రాత్రి సమయంలో దొంగలు, నేర చరిత్ర కలవారి ఆచూకీ కనిపెట్టి, జరగబోయే నేరాలను తప్పించడానికి సీసీటీఎన్ఎస్ డేటా ద్వారా రాత్రి సమయంలో తనిఖీలు చేపడుతున్నట్లు తూర్పు విభాగం అదనపు పోలీస్ కమిషనర్ సుబ్రమణ్యేశ్వరరావ్ తెలిపారు. -
వేలిముద్రలు మార్చి.. కువైట్‌కు తిప్పి పంపి! ఇంతకూ ఆ దేశానికే ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: వేలిముద్రలు పడకుండా చోరీలు చేసే కిలాడీల కథలు లేదా నకిలీ వేలిముద్రలతో నేరాలకు పాల్పడే కేటుగాళ్ల ఉదంతాల గురించి మీరు ఇప్పటివరకు విని ఉంటారు. కానీ ఏకంగా శస్త్రచికిత్సల ద్వారా వేలిముద్రలను మార్చి కువైట్ నుంచి బహిష్కరణకు గురైన వలస కార్మికులను అక్రమంగా తిరిగి ఆ దేశం పంపుతున్న ఓ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు తొలిసారి రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) డీసీపీ కె. మురళీధర్‌తో కలసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గురువారం మీడియాకు వెల్లడించారు. పోలీసుల అదుపులో నిందితులు వేలిముద్రల సర్జరీ గురించి తెలుసుకొని.. సీపీ తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ కడప జిల్లా సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన గజ్జలకొండగారి నాగమునేశ్వర్‌రెడ్డి తిరుపతిలోని చంద్రగిరిలోని కృష్ణా డయాగ్నస్టిక్స్‌లో రేడియాలజిస్ట్. అతనికి ఓ రోజు కువైట్‌లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాటల సందర్భంలో తాను వీసా గడువు ముగిశాక కువైట్‌లో అక్రమంగా ఉండటంతో ఆ దేశ అధికారులు తిప్పి పంపారని... దీంతో శ్రీలంక వెళ్లి అక్కడ మ్యూటిలేటెడ్ ఫింగర్‌ప్రింట్స్ సర్జరీ చేయించుకొని మళ్లీ కువైట్‌కు వెళ్లినట్లు వివరించాడు. ఈ శస్త్రచికిత్స ద్వారా వేలిముద్రలు తాత్కాలికంగా కొత్త రూపంలోకి మారతాయని పేర్కొన్నాడు. ఈ సర్జరీ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయిన మునేశ్వర్... కువైట్ నుంచి బహిష్కరణకు గురైన వారికి ఈ సర్జరీలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్లాన్‌ను తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా పనిచేస్తున్న వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి గ్రామానికి చెందిన సాగబాల వెంకట్ రమణకు తెలపగా అతను అంగీకరించాడు. తొలుత రాజస్తాన్‌కు... మునేశ్వర్‌రెడ్డికి కువైట్‌లోని తన స్నేహితుడి ద్వారా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురైన రాజస్తాన్‌లోని ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వారికి మ్యూటిలెటెడ్ ఫింగర్‌ప్రింట్ సర్జరీ చేసేందుకు మునేశ్వర్, వెంకట రమణ రాజస్తాన్‌కు వెళ్లారు. ఒక్కొక్కరికీ రూ. 25 వేల చొప్పున వసూలు చేసి శస్త్రచికిత్స చేశారు. అక్కడి పరిచయాలతో కేరళలోని మరో వ్యక్తి మునేశ్వర్‌ను సంప్రదించాడు. ఈ ఏడాది మేలో మునేశ్వర్, వెంకటరమణ కేరళకు వెళ్లి ఆరుగురికి ఈ సర్జరీ చేసి రూ. లక్షన్నర వసూలు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లా జ్యోతి గ్రామానికి చెందిన బోవిళ్ల శివశంకర్‌రెడ్డి, పాత అట్లూరి గ్రామానికి చెందిన రెండ్ల రామకృష్ణారెడ్డిలతోపాటు మరో వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. కువైటే ఎందుకంటే? కువైట్ ఇమ్మిగ్రేషన్ విభాగంలో ఐరిస్, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత అందుబాటులో లేదు. కేవలం వేలిముద్రల స్కానింగ్ మాత్రమే ఉంది. దీన్ని నేరస్తులు ఆసరాగా చేసుకుంటున్నారు. దీంతోపాటు ఒక కువైటీ దినార్ భారతీయ కరెన్సీలో రూ. 258.15గా ఉండటం మరో కారణం. ఎలా చేస్తారంటే? చేతివేళ్ల మొనలపై చర్మం పొరను కత్తిరించి కణజాలంలో కొంత భాగాన్ని తీసేస్తారు. సర్జరీ కిట్‌ను ఉపయోగించి కుట్లు వేస్తారు. ఒకట్రెండు నెలల్లో గాయం మానాక వేలిముద్రల నమూనాలలో స్వల్ప మార్పులు వస్తాయి. ఈ కొత్త ఫింగర్ ప్రింట్లు ఏడాదిపాటు ఉంటాయి. ఆ తర్వాత యథాస్థితికి వచ్చేస్తాయి. దీంతో ఈలోగా కొత్తగా ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, ఇతరత్రా గుర్తింపు కార్డులను కేటుగాళ్లు పొందుతున్నారు. వాటితో కొత్త అభ్యర్థి లాగా కువైట్‌కు వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కువైట్ ఇమ్మిగ్రేషన్‌లో స్కానర్‌లో వేలిముద్రలను నమోదు చేసుకుంటున్నప్పుడు మ్యూటిలేటెడ్ ఫింగర్‌ప్రింట్స్ కావడంతో కొత్త ప్రవాసుడు అనుకొని వీసా స్టాంపింగ్ వేస్తున్నారు. ఒకవేళ కువైట్‌లో పట్టుబడితే.. ఒకసారి బహిష్కరణకు గురైతే పాస్‌పోర్టు రద్దవుతుంది. అందుకే నేరస్తులు మ్యూటిలెటెడ్ ఫింగర్ప్రింట్లతో కొత్త పాస్‌పోర్టు, వీసాలను పొందుతున్నారు. ఒకవేళ అక్కడి పోలీసులకు చిక్కినా.. అక్రమ పాస్‌పోర్టు కలిగి ఉన్నందుకు 2–7 రోజుల జైలుశిక్ష అనంతరం స్వదేశానికి డిపోర్ట్ అవుతున్నారు. ఆపై మళ్లీ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్‌తో మళ్లీ కువైట్‌కు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసంపై కువైట్ ఎంబసీని, ఇమ్మిగ్రేషన్ అధికారులకు లేఖ రాస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. హైదరాబాద్‌లో సర్జరీ కోసం వచ్చి... ఇప్పటివరకు ఈ ముఠా 11 మంది కువైట్ బహిష్కృతులకు ఈ సర్జరీలు నిర్వహించిందని.. వారిలో కొందరు నకిలీ పాస్‌పోర్టు, వీసాలతో మళ్లీ కువైట్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కువైట్ నుంచి బహిష్కరణకు గురైన పలువురు హైదరాబాదీలకు ఈ ముఠా సభ్యులు పరిచయమయ్యారు. దీంతో వారికి ఈ సర్జరీ చేసేందుకు కడప నుంచి ఈ ముఠా సభ్యులు గత నెల 29న అన్నోజిగూడకు చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న మల్కజ్గిరి ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు... నిందితులు బస చేసిన లాడ్జీపై ఆకస్మిక దాడులు చేసి మునేశ్వర్‌రెడ్డి, వెంకటరమణ, శివశంకర్, కృష్ణారెడ్డిలను అరెస్టు చేశారు. ఈ ముఠాలో మరో 9 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని సీపీ తెలిపారు. నిందితుల నుంచి 4 సెల్ఫోన్లు, సర్జికల్ గ్లౌవ్స్, అయింట్మెంట్, యాంటీ బయోటిక్ మాత్రలు, హైడ్రోక్లోరైడ్ జెల్, ఇంజెక్షన్లు, సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఇతరత్రా సర్జరీ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో మరో కొత్తరకం మోసం
-
HYD: పోలీసులే ఊహించని బిగ్ స్కామ్.. ఐడియా మామూలుగా లేదు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు కనిపించకుండా సర్జరీలు చేస్తున్న డాక్టర్ సహా సిబ్బందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ నేరాలపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. ఫింగర్ ప్రింట్ స్కామ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు రిజక్ట్ కావడంతో యువకులు ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేస్తున్న డాక్టర్, సిబ్బందిని అరెస్ట్ చేశాము. కాగా, శ్రీలంకలో మొదటి ఫింగర్ ప్రింట్ ఆపరేషన్ జరిగింది. నిందితులపై 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము. ఇది హ్యోమన్ స్మగ్లింగ్. ఒక్కో సర్జరీకి రూ.25వేలు తీసుకున్నారు. కేరళలో ఆరుగురు, రాజస్థాన్‌లో ఇద్దరు, తెలంగాణలో ఇద్దరికి ఫింగర్ ప్రింట్స్ ఆపరేషన్ జరిగింది. కువైట్‌లో ఉద్యోగాల కోసం ఫింగర్ ప్రింట్స్ మార్చుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ మార్చుకున్నవాళ్లు కువైట్ వెళ్లారు అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో ఇంటి వచ్చే కొరియర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి: సీపీ సీవీ ఆనంద్ -
హైదరాబాద్‌లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఈ ముఠా ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే ఒకసారి రిజక్ట్ అయిన యువకులు సర్జరీలతో మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంవత్సరం పాటు వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా కొత్త రకం సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. సర్జరీ తర్వాత దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్‌తో పాటు కొంత మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: (అనంతపురం ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు) -
GHMC: యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో చోటు చేసుకున్న కృత్రిమ వేలిముద్రల వ్యవహారాన్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లుగా పని చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది? ఇంకా ఎందరి పాత్ర ఉంది? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. గోషామహల్ సహా మరికొన్ని ప్రాంతాలకు చెందిన జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఉండే పారిశుద్ధ్య కార్మికుల వద్దకు ప్రతి రోజూ వెళ్లి బయోమెట్రిక్ మిషన్ల ద్వారా వారి హాజరును తీసుకుంటారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేసే ఒక్కో కార్మికుడికీ నిర్దేశిత పని వేళలు ఉంటాయి. పని ప్రారంభించే ముందు బయోమెట్రిక్ మిషన్‌లో లాగ్ ఇన్, పూర్తయ్యాక లాగ్ ఔట్ నిర్దేశిస్తూ వీళ్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. దీన్ని గమనించిన కొందరు ఉద్యోగులు భారీ స్కెచ్ వేశారు. కొందరు పరిచయస్తుల్ని శానిటరీ వర్కర్లుగా ఎన్రోల్ చేశారు. వీరిని ప్రతి రోజూ ఫీల్డ్‌లోకి తీసుకువెళ్లడం, అక్కడే వారితో వేలిముద్రలు వేయించి హాజరు తీసుకోవడం సాధ్యం కాదు. దీంతో కృత్రిమ వేలిముద్రలు తయారు చేయడంపై దృష్టి పెట్టారు. యూ ట్యూబ్‌లో సెర్చ్ చేయడం ద్వారా ఫెవికాల్, ఎంసీల్ తదితరాలు కలపడం ద్వారా ఓ రకమైన సింథటిక్ పదార్థం తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. దీనిపై డమ్మీ కార్మికుల వేలిముద్రల్ని సేకరించారు. ఆ సింథటిక్ పదార్థాన్ని వేలిముద్రల ఆకారంలో కట్ చేశారు. వీటిని తమ జేబులో వేసుకుని ఫీల్డ్‌కు వెళ్తున్న ఉద్యోగులు అదును చూసుకుని లాగ్ ఇన్, లాగ్ ఔట్ కోసం వీటితో వేలిముద్రలు వేసేస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు స్కామ్ గుట్టరట్టు చేయడంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని 21 కృత్రిమ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులపై స్పష్టత వస్తుందని, ఆపై అందరినీ అరెస్టు చేస్తామని టాస్క్‌ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. -
జీహెచ్ఎంసీలో మరోసారి ఫింగర్ ప్రింట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి ఫింగర్ ప్రింట్ల స్కామ్ కలకలం రేగింది. శానిటైజేషన్ కార్మికుల హాజరులో గోల్మాల్ వెలుగు చూసింది. కార్మికులు విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లు చేసిన వైనం బయటపడింది. సింథటిక్ ఫింగర్ ప్రింట్లు వాడి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు గోషామహల్ సర్కిల్ శానిటరీ సూపర్వైజర్ వెంకటరెడ్డి. పోలీసులు సుమారు 21 మంది ఫింగర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. -
ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో ఇదీ పరిస్థితి: 155 పోస్టులు .. 102 ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: హత్యలు, దొంగతనాలు, కిడ్నాపులు, డాక్యుమెంట్ల ఫోర్జరీ.. ఇలా ఏవిధమై న నేరాల్లోనైనా నిందితుల గుర్తింపునకు తొలి ఆయుధంగా ఉపకరించేది వేలిముద్రలే. ఆయా కేసుల్లో దర్యాప్తు అధికారులు ముందుకు సాగేందుకు నేరం జరిగిన ప్రదేశం (సీన్ ఆఫ్ అఫెన్స్) లో, ఇతర చోట్ల వేలిముద్రల (ఫింగర్ ప్రింట్స్) సేకరణే కీలకం. ఇంత ప్రాధాన్యత ఉన్న ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో అధిక సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఒక్క ఇన్స్పెక్టర్ కూడా లేరు రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలో పనిచేసే స్టేట్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో (ఎస్‌ఎఫ్‌పీబీ)లో మొత్తం మంజూరు పోస్టులు 155 కాగా, ఇందులో 102 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ఫింగర్ ప్రింట్స్ బ్యూరో (సీఎఫ్‌పీబీ) తాజాగా వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సంస్థ డైరెక్టర్ పోస్టుతో పాటు ఐదు డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టుల్లో మూడు, 39 ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను 39 ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా మంజూరైన 77 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 26 భర్తీ కాగా, 51 ఖాళీగా ఉండగా, 33 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 8 ఖాళీగా ఉన్నట్టు సీఎఫ్‌పీబీ పేర్కొంది. భర్తీ చేస్తే మరింత జోష్‌తో... తక్కువ సిబ్బందితో ఒత్తిడికి గురవుతూ ఎలాగో నెట్టుకొస్తున్న రాష్ట్ర సంస్థ.. 2020 ఏడాదికి పెం డింగ్ కేసులు లేకుండా చేయడంతో పాటు అనేక కేసుల్లో సేకరించిన వేలిముద్రలను భద్రపరిచే పని కూడా చేస్తోంది. కేంద్ర బ్యూరో కలిసి డేటా అప్డేట్ నిర్వహిస్తోంది. ఇంతటి కీలకమైన సంస్థ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే నిందితుల గుర్తింపు మరింత త్వరగా జరుగుతుందని, కేసులను మరింత త్వరగా పరిష్కరించవచ్చని సంస్థ ఉన్నతాధికారులు అంటున్నారు. వరుసగా జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈ ఖాళీలను కూడా భర్తీ చేయాలని కోరుతున్నారు. అద్భుత పనితీరుతో కేసుల పరిష్కారం సిబ్బంది తక్కువగా ఉన్నా వేలిముద్రల సేకరణ, వాటి విశ్లేషణలో మాత్రం తెలంగాణ ఎస్‌ఎఫ్‌పీబీ పనితీరు అద్భుతంగా ఉన్నట్టు సీఎఫ్‌పీబీ రిపోర్టు స్పష్టం చేస్తోంది. గత 2020 ఏడాదికి సంబంధించి అద్బుతమైన రీతిలో కేసులు పరిష్కరించేందుకు దోహదపడినట్లు పేర్కొంది. నల్లగొండ జిల్లా రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దొంగతనం కేసును నాలుగు రోజుల్లోనే ఎస్‌ఎఫ్‌పీబీ సహాయంతో పోలీసులు ఛేదించినట్లు తెలిపింది. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాల్వంచలో జరిగిన ఓ దొంగతనం కేసులో కూడా రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేయడానికి రాష్ట్ర బ్యూరో దోహదపడింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఇంటి దొంతనం కేసులోనూ ప్రతిభ చూపి వారంలోనే నిందితులను అరెస్ట్ చేసేలా తోడ్పాటు అందించింది. ఇలా ఎన్నో కేసులు ఛేదించడంలో ఎస్‌ఎఫ్‌పీబీ చురుకైన పాత్ర పోషించింది. -
బాప్రే! ఇది నోకియా ‘బాహుబలి’
ఒకప్పుడు మొబైల్ ఫోన్ బ్రాండ్లలో నోకియా అంటే మన్నికకు మరో పేరు. ఈ కంపెనీ ఫోన్లు కొంటే త్వరగా రిపేరుకు రావని ఎక్కువ కాలం వాడుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఉండేది. ఇంతకాలం ఫీచర్లపై దృష్టి పెడుతూ వచ్చిన నోకియా ఈసారి రూటు మార్చి ఎక్కువ కాలం వాడుకునేలా ధృఢమైన ఫోన్‌ని మార్కెట్లోకి తేనుంది. పూర్వ వైభవం కోసం ఒకప్పుడు ఇండియా మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన నోకియా మరోసారి పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్ఎండీ గ్లోబల్‌కి మారిన తర్వాత గత ఐదేళ్లుగా రకరకాల మోడల్స్‌ని ప్రవేశ పెట్టినా పెద్దగా మార్కెట్ సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మార్కెట్లో పట్టు సాధించే లక్ష్యంతో కొత్త మొబైల్‌ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ ఫీచర్లతో ఎస్ఆర్ 20 మొబైల్‌ని నోకియా మార్కెట్లోకి తెచ్చింది. కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఫోన్‌ను డిజైన్ చేసింది. ఈ మొబైల్‌కి ఐపీ 68 సర్టిఫికేట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంతో డస్ట్ ఫ్రూఫ్, వాటర్ ప్రూఫ్‌గా పని చేస్తుంది. అంతేకాదు 1.8 ఎత్తు నుంచి కింద పడినా పగిలిపోకుండా ఉండేలా డిస్ప్లే ధృడంగా తయారు చేసింది. లేటెస్ట్ 5జీ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 480 ఇంటర్నల్ ఫీచర్లకు సంబంధించి నోకియా కొంత మేరకు కాంప్రమైజ్ అయ్యింది. స్నాప్‌డ్రాగన్ 480 చిప్సెట్ని ఉపయోగించింది. 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందిస్తోంది. వెనుక వైపు 48 మెగా పిక్సెల్, 13 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను అందించింది. వీటికి విడివిడిగా ఎల్ఈడీ ఫ్లాష్‌లను ఇచ్చింది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్. ప్రస్తుతం మార్కెట్లో 4కే డిస్ప్లేల హవా నడుస్తుండగా నోకియా 6.7 అంగులాల ఫుల్హెచ్డీ డిస్‌ప్లేకే పరిమితమైంది. కాకపోతే తడి చేతులతో ముట్టుకున్నా ‘టచ్’ పని చేసేలా డిజైన్ చేసింది. వైర్లెస్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌పై ఈ మొబైల్ ఫోన్ పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్తయం 4,630 ఎంపీఎహెచ్గా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చని నోకియా హామీ ఇస్తోంది. ఈ మొబైల్‌కు సపోర్ట్‌గా 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్‌ను అందిస్తోంది. సెక్యూరిటీగా ఫ్రింగర్ ప్రింట్ స్కానర్‌ని ఫోన్ డిస్పై వైపు కాకుండా పవర్ బటన్ ఉండే వైపున ఏర్పాటు చేసింది. ఆగస్టు 24న నోకియా ఎక్స్ఆర్ 20 మోడల్ని ఆగస్టు 24 మార్కెట్లో అమ్మకానికి రానుంది,. మొబైల్ ధర రూ.43,800ల నుంచి ప్రారంభం కానుంది. ఈ మొబైల్‌కి సంబంధించి నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని నోకియా తెలిపింది. -
రియల్మీ ల్యాప్‌ట్యాప్.. ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ కావాల్సిందే
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గణనీయమైన వాటా దక్కించుకున్న రియల్మీ ఇప్పుడు ల్యాప్‌ట్యాప్ మార్కెట్‌పై గురి పెట్టింది. రియల్మీ బుక్ పేరుతో పర్సనల్ ల్యాప్‌ట్యాప్‌లు మార్కెట్లోకి తేనుంది. రియల్మీ తక్కువధరలో నాణ్యమైన ఫోన్లు అందించి మొబైల్ మార్కెట్లో మంచి వాటాను దక్కించుకుంది. ఇప్పుడు ల్యాప్‌ట్యాప్‌ల విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో కానుంది. రూ.40,000 రేంజ్లో పవర్ఫుల్ ల్యాప్‌ట్యాప్ తెచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. రియల్మీ బుక్ 1.5 కేజీల బరువుతో 14 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రానుంది. యాంటీగ్లేర్ డిస్ప్లేను అమర్చారు. ఇక సాంకేతిక విషయాలకు సంబంధించి ఇంటెల్ 11 జనరేషన్‌కి చెందిన ఐ కోర్ 3, ఐ కోర్ 5 చిప్సెట్లను ఉపయోగించారు. రిలయ్‌మీ బుక్ లోపలి వైపు సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ ఫినీషింగ్ మధ్యలో కీబోర్డు చూడటానికి బాగుండెలా డిజైల్ చేశారు. ఈ రిలయ్‌మీ బుక్ ఇన్‌బిల్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి రానుంది. అయితే అన్ని ఫీచర్లలోకి ఆకట్టుకునే కొత్త రకం ఫీచర్‌గా లాప్ట్యాప్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనుంది రియల్మీ. ఆగస్టులో రియల్మీ బుక్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.రియల్మీ బుక్‌లో యూఎస్బీ ఏ పోర్టు ఒకటి, యూఎస్బీ సీ టైప్ పోర్టులు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఉన్నాయి. అయితే ఈ రియల్మీ ల్యాప్‌టాప్‌లో బిల్ట్ ఇన్ వెబ్‌కామ్ ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. -
వేలిముద్రకు రూ.150
కార్తీక్ మేడ్చల్ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తు చేశాక.. ఆధార్ ఆధారిత వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో సమీపంలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి వేలిముద్రలు సమర్పించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రూ.20కి రశీదు చేతిలో పెట్టిన మీసేవ నిర్వాహకుడు రూ.150 ఇవ్వాలని స్పష్టం చేశాడు. గతేడాది ఇదే మీసేవ కేంద్రంలో రూ.50 ఇచ్చానని కార్తీక్ చెప్పినా లాభం లేకపోయింది. కోవిడ్-19 తర్వాత ఇదే రేటు అని చెప్పడంతో చేసేదేమీ లేక రూ.150 చెల్లించుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని మీసేవ కేంద్రం నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించిన తర్వాత వాటిని ఆన్లైన్లో ఆమోదించాలంటే సదరు విద్యార్థి వేలిముద్రలను దరఖాస్తుతో అప్లోడ్ చేయాలి. ఎక్కడినుంచైనా ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే అవకాశం ఉన్నప్పటికీ... వేలిముద్రలు అప్లోడ్ చేసే ఆప్షన్ మీసేవ కేంద్రాలకు ప్రభుత్వం ఇచ్చింది. దీనికి రూ.20 రుసుముగా నిర్ణయించింది. అయితే పలు మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికంటే కొన్నిరెట్లు అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. రూ.10 కోట్లు దాటుతున్న వసూళ్లు! రాష్ట్రంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి ప్రతి సంవత్సరం సగటున 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 20 చొప్పున బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీజు రూపంలో సర్కారు ఖజానాకు రూ. 2.6 కోట్లు జమవుతోంది. కానీ చాలాచోట్ల మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.50 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. సగటున రూ. 100 చార్జ్జ్ చేస్తున్నారనుకుంటే... ఈ లెక్కన ఏటా రూ.10 కోట్లకు పైగా విద్యార్థుల నుంచి దోచుకుంటున్నారు. కౌంటర్లు పెట్టి మరీ దోపిడీ మీసేవ కేంద్రాల నిర్వాహకులతో కొన్ని కాలేజీ యాజమాన్యాలు కుమ్మక్కై కాలేజీలోనే బయో మెట్రిక్ అప్డేషన్ కానిచ్చేస్తున్నారు. మీసేవ కేంద్రం నిర్వాహకుడు కంప్యూటర్‌తో కాలేజీలోనే ఒకచోట సెటప్ ఏర్పాటు చేసి అక్కడే వేలిముద్రలు అప్డేట్ చేస్తున్నారు. అలా కాలేజీలోనే దుకాణం తెరిచి ఒ క్కో విద్యార్థికి రూ.200 చార్జ్ చేస్తున్నారు. ఇందులో కాలేజీ సిబ్బందికి సైతం వాటాలందుతున్నాయి. వేలిముద్రల స్వీకరణ ప్రక్రియను ఉచితంగా నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. మీసేవ కేంద్రాలకు ఆప్షన్ ఇచ్చే బదులుగా కాలేజీల్లోనే ప్రత్యేకంగా ఈ సెటప్ ఏర్పాటు చేయాలని, యాజమాన్యాలు సైతం బాధ్యతగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే దోపిడీకి ఆస్కారం ఉండదని విద్యార్థులు అంటున్నారు. అయితే మీసేవ కేంద్రాల్లో వసూళ్లపై ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. కాలేజీలోనే వేలిముద్రలిచ్చే ఆప్షన్ ఉండాలి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బయోమెట్రిక్ విధానం మీసేవ కేంద్రంలో కాకుండా కాలేజీలోనే సమర్పించేలా ఆప్షన్ ఉండాలి. ట్యూషన్ ఫీజుతో పాటు ఇతరత్రా ఫీజులు తీసుకుంటున్నందున... ఉచితంగా వేలిముద్రలను అప్డేట్ చేసే బాధ్యతను కాలేజీ యాజమాన్యాలకే అప్పగించాలి. దీంతో విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి... మీసేవ కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చే బాధ తప్పుతుంది. - సాత్విక్, బీటెక్ ఫైనలియర్, శంషాబాద్ -
వైరల్:ఎటీఎంనే ఎత్తుకుపోయారు!
చెన్నై: తమిళనాడులోని కొయంబత్తురులో దొంగలు బీభత్సం సృష్టించారు. ముఖానికి మాస్కులు ధరించి బ్యాంక్‌లో చొరబడిన దుండగులు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ఉతుకులిలోని పీఎస్‌యు బ్యాంకులో ఆదివారం తెల్లవారుజామున ఈ చోరి జరిగింది. బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ఏటీఎం లోపలికి చొరబడిన దొంగలు అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎంను ప్రత్యేక తాళ్ళతో చుట్టి, ఒక ప్రత్యేక వాహనం సహయంతో అక్కడి నుంచి కదిలించారు. అప్పటికే రోడ్డుపై సిద్ధంగా ఉన్న మరొక వాహనంలో ఎటీఎంను ఎక్కించుకొని రెప్పపాటులో అక్కడి నుంచి పారిపోయారు. కాగా, ఎటీఎం తీయడానికి ఉపయోగించిన పెద్దకారును విజయమంగళం సమీపంలో వదిలిపారిపొయారు. కాగా, ఈ చోరికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఉదయాన్నే దీన్ని గమనించిన స్థానికులు సంబంధింత బ్యాంకు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే.. అక్కడికి చేరుకున్న ఉతుకులి పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో వేలిముద్రలను స్వీకరించారు. కాగా, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు -
దొంగలను పట్టించిన వేలిముద్రలు
మహబూబ్‌నగర్ క్రైం: ఓ పెళ్లింట్లో దొంగ తనం జరిగిన 12 రోజుల్లోనే వేలిముద్ర ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన సొత్తు, వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బుధవారం మహబూబ్‌నగర్‌లో ఎస్పీ రెమా రాజేశ్వ రి వెల్లడించారు. మిడ్జిల్ మండలం బో యిన్‌పల్లిలో ఈనెల 18న అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాధితుడు చంద్రారెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పలువురి వేలిముద్రలు సేకరించారు. దొంగతనానికి పాల్పడిం ది పాత నేరస్తులేనని గుర్తించారు. వీరిలో మహబూబాబాద్ జిల్లా నెల్లికూడురు మండలం రాజులకొత్తపల్లికి చెందిన అంగడి సురేష్, దాసరి మురళీకృష్ణ, మల్లయ్య, పీరయ్య ఉన్నారు. కాగా, వీరి కోసం పోలీసు బృందాలు గాలించడానికి వెళ్లిన సమయంలో దొంగతనం చేసిన సొమ్మును మధ్యవర్తి ద్వారా విక్రయించడానికి యత్నిస్తుంటే మల్లయ్య తప్పా మిగతా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 61 తులాల బంగారం, రూ.2.98 లక్షలు, ఆటో, రెండు బైకులను స్వా«దీనం చేసుకున్నారు. కాగా నిందితులపై వరంగల్, రాచకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల పరిధిలో 40 చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
30 సెకన్లలోనే అన్ని వివరాలు
సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంతకల్లు, నెల్లూరు డివిజన్ పరిధిలో కొత్త మొబైల్ యాప్స్‌ను రూపొందించినట్లు నెల్లూరు డీఎస్పీ వసంత్ కుమార్ గురువారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 8.4 లక్షల నేరగాళ్ల డేటాను ఆన్లైన్లో పొందిపరిచినట్లు తెలిపారు. మొబైల్ గుర్తింపు పరికరంలో నేరగాళ్లు ఏ వేలిముద్ర వేసిన వాళ్ల వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇంతకముందు ఎడమచేతి బొటన వేలి ముద్రలను తీసుకునే వారని తెలిపారు.వేలిముద్ర వేయగానే 23 నుంచి 30 సెకన్లలో అన్ని వివరాలు నమోదవుతాయని వెల్లడించారు. దీని ద్వారా నేరాలు జరగకుండా నియంత్రించవచ్చని, నేరాగాళ్ల కదలికలను గుర్తించడంలో తేలికవుతుందన్నారు. అలాగే 15 పోలీస్ స్టేషన్లకు అధికారులు 30 మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్‌లను అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదే విధంగా రైళ్లలో రోజుకు 60 నుంచి 70 బీట్లు ఉంటాయని, బీట్‌ళో ఉన్న సిబ్బంది ట్యాబ్, సెల్ ద్వారా మెసేజ్, వీడియోను ఈ యాప్ ద్వారా పంపవచ్చన్నారు. వేసవిలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
వేలిముద్రలే పట్టించాయి
నేరేడ్మెట్, సాక్షి, సిటీబ్యూరో: కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జవహర్‌నగర్ ఠాణా పరిధిలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో లభించిన నిందితుడి వేలిముద్రల ఆధారంగా 5 రోజుల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.29 లక్షల విలువైన 66 తులాల బంగారు నగలు, మూడు కేజీల వెండి వస్తువులు, ల్యాప్‌టాప్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో మల్కాజ్గిరి డీసీపీ రక్షిత కే మూర్తితో కలిసి సీపీ మహేష్ భగవత్ సోమవారం వివరాలు వెల్లడించారు. జైలుకు వెళ్లొచ్చినా.. మేడ్చల్ జిల్లా, బాలాజీనగర్‌కు చెందిన తూన సంజయ్ సింగ్ అలియాస్ తునా ఇంటర్మీడియట్‌తో చదివి ఆపేశాడు. చిన్నప్పటి నుంచే జులాయిగా తిరుగుతున్న సంజయ్‌కి మౌలాలికి చెందిన మనీష్ ఉపాధ్యాయ్ అలియాస్ సంజూ మహరాజుతో పరిచయం ఏర్పడింది. జల్సాలకు అలవాటు పడిన వీరు అందుకు అవసరమైన డబ్బులకోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. 2017లో తుకారాంగేట్ ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారు. అయినా తమ పంథా మార్చుకోకుండా చోరీలకు పాల్పడుతున్నారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సంజయ్ సింగ్ 8, మనీష్ ఉపాధ్యాయ్ 6 కేసులు ఉన్నాయి. 2019 జూన్‌లో జరిగిన చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన సంజయ్ సింగ్, మనీష్ ఉపాధ్యాయ్, బాలాజీనగర్‌కు చెందిన మరో మిత్రుడు ప్రదీప్ శ్యామ్‌తో కలిసి డిసెంబర్ 31న జవహర్‌నగర్ ఠాణా పరిధిలో తాళంవేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 51 తులాల బంగారు నగలు, నాలుగు కిలోల వెండి, రూ.50,000 నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుడు దానమ్ నర్సింగ్‌రావు ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ అధికారి అనిల్ కుమార్ బృందం అక్కడికి చేరుకొని వేలిముద్రలను సేకరించింది. ఈ వేలిముద్రలను పాత ప్రాపర్టీ ఆఫెన్స్‌లో నిందితుల నుంచి సేకరించిన వేలిముద్రలతో పొల్చి చూడగా సంజయ్ సింగ్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అప్పటినుంచి అతని కదలికలపై నిఘా వేసిన జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు, మల్కాజ్గిరి ఎస్వోటీ,సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు నవీన్ కుమార్, ఎస్.లింగయ్య నేతృత్వంలోని బృందం దమ్మాయిగూడ ఎక్స్‌రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం సంజయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను మరో ఇద్దరు నిందితులు మనీష్ ఉపాధ్యాయ్, ప్రదీప్ శ్యామ్ పేర్లు వెల్లడించడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
వేలి ముద్రతో నగదు డ్రా
రామకృష్ణ అత్యవసర పని మీద అనంతపురం జిల్లాలోని ఇప్పేరు గ్రామానికి వెళ్లాడు. ఆన్లైన్ చెల్లింపులకు అలవాటు పడిన అతను అత్యవసరంగా అక్కడ రూ.8,000 నగదు చెల్లించాల్సి వచ్చింది. ఆ ఊళ్లో బ్యాంకు, ఏటీఎం లేదు. కనీసం 20 కి.మీ దూరం వెళ్తేకానీ ఏటీఎం సెంటర్ లేదు. ఏం చేయాలో పాలుపోక బిజినెస్ వ్యవహారాలపై అవగాహన ఉన్న తన స్నేహితునికి ఫోన్ చేశాడు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్తే రూ.10 వేల వరకు నగదు తీసుకోవచ్చని అతను సలహా ఇచ్చాడు. నమ్మకం కలగనప్పటికీ, ప్రయత్నిద్దామని పక్కనే ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి పోస్టుమాస్టర్‌కు తన పరిస్థితి వివరించాడు. అతను రామకృష్ణ వేలిముద్రలు తీసుకొని వెంటనే రూ.10 వేలు ఇచ్చాడు. ఆ వెంటనే తన ఎస్బీఐ ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయాడు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోస్ట్‌మ్యాన్ మన ఇంటి వద్దకే వచ్చి నగదు డిపాజిట్, విత్‌డ్రా, మనీ ట్రాన్స్ఫర్ వంటి సేవలను అందిస్తున్నారు. విద్యుత్, గ్యాస్, వాటర్ బిల్లు తదితర చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలన్నీ పోస్టాఫీసు వద్దకు వెళ్లి ఉచితంగా పొందవచ్చు. పోస్ట్‌మ్యాన్ ఇంటి వద్దకు వచ్చి ఈ సేవలు అందిస్తే క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్స్‌కు రూ.25, ఇతర సేవలకు రూ.15 చొప్పున సర్వీస్ చార్జి వసూలు చేస్తారు. రాష్ట్రంలో 10,489 పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సాక్షి, అమరావతి: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గత ఏడాది అధునాతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 15 రోజుల క్రితం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో పనిలేకుండా నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి వేలిముద్ర వేయడం ద్వారా నగదు తీసుకునే సౌకర్యం కల్పించింది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా నుంచి ఈ విధానంలో నగదు తీసుకోవచ్చు. ఖాతాదారునికి నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉంటే, ఆధార్ డేటాబేస్‌లో చివరిసారి ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా కొన్ని బ్యాంకులు రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, మరికొన్ని బ్యాంకులు రూ.5 వేలు తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖాతాల పెంపుపై దృష్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కొద్ది రోజులుగా ఖాతాల పెంపుపై దృష్టి సారించారు. ఈ ఖాతాల్లో గరిష్టంగా రూ.లక్షకు మించి దాచుకోవడానికి వీలుండదు. అందుకని వీటిని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రూ.లక్షకు మించి ఉన్న నగదు నేరుగా సేవింగ్స్ ఖాతాలోకి వెళ్తుంది. (రూ.లక్షకు మించి డిపాజిట్ చేయాలంటే సేవింగ్స్ ఖాతా తప్పనిసరి) అవసరమైనప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న బ్యాంకింగ్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రామ్ భరోసా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన, అతి తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాలతో పాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల పథకాలు, సేవలను పోస్టాఫీసుల్లో అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 59 పోస్టల్ ఏటీఎంలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొదటి స్థానంలో ఏపీ సర్కిల్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించడంలో ఏపీ సర్కిల్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10.33 లక్షల ఖాతాలతో రూ.21.59 కోట్ల డిపాజిట్లను సేకరించింది. గత ఏడు నెలల్లోనే 6.91 లక్షల ఖాతాలను ప్రారంభించాం. ఈ ఏడాది మొత్తం ఖాతాల సంఖ్యను 30 లక్షలకు చేర్చాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క. – జి.ప్రశాంతి, సీనియర్ మేనేజర్, పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, విజయవాడ డివిజన్. -
నేరపరిశోధనలో నంబర్ వన్!
సాక్షి, హైదరాబాద్: నేర పరిశోధన దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను వినియోగించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీసు శాఖ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం ఉన్న 10 ఫింగర్ ప్రింట్ యూనిట్లకు తోడు మరో 26 ఫింగర్ ప్రింట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తగినన్ని నిధులు, సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి పనిచేయడం ప్రారంభిస్తే.. ఆధారాల సేకరణ, నిందితుల గుర్తింపు, నేర దర్యాప్తులో ప్రపంచదేశాల సరసన చేరుతామని పోలీసు ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉండబోతోంది? నేరదర్యాప్తులో ఆధారాలు చాలా కీలకం. క్లూస్ టీంలు ఆలస్యంగా రావడం వల్ల చాలావరకు ఆధారాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. అదే నిమిషాల్లో చేరుకోగలిగితే కీలకమైన ఆధారాలు అప్పటికప్పుడు సేకరించగలుగుతారు. ఫలితంగా జరిగిన ఘటనలో నిందితుల పాత్రను శాస్త్రీయంగా, పకడ్బందీగా నిరూపించగలుగుతారు. అందుకే అదనంగా మరో 26 ఫింగర్‌ప్రింట్ యూనిట్లను ఏర్పాటు చేస్తూ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కమిషనరేట్ల పరంగా హైదరాబాద్‌లో ఇకపై 5, సైబరాబాద్‌లో 3, రాచకొండలో 3, వరంగల్‌లో 2, రామగుండంలో ఒకటి చొప్పున ఏర్పాటు కానున్నాయి. మొత్తం విభాగానికి ఐపీఎస్ (నాన్‌కేడర్) అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఇంకా నలుగురు డీఎస్పీలు, 26 మంది ఇన్స్పెక్టర్లు, 57 మంది ఎస్సైలను త్వరలోనే ప్రభుత్వం నియమించనుంది. ఈ విషయంలో డీజీపీ కార్యాలయం కసరత్తు పూర్తి చేసింది. అన్ని కొత్త యూనిట్లకు కనీసం ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లతో కూడిన జాబితాను ఇప్పటికే రూపొందించింది. వీరంతా ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, శాంపిల్స్ సేకరణలో అనుభవమున్నవారు కావడం విశేషం. ఈ యూనిట్లకు కావాల్సిన సాంకేతిక పరికరాలు, వాహనాలను త్వరలోనే ఆయా కేంద్రాలకు పంపనున్నారు. త్వరలో ప్రపంచ దేశాల సరసన... వేలిముద్రల ఆధారంగా కేవలం 10 సెకండ్లలో పాతనేరగాళ్ల చిట్టా విప్పే అత్యాధునిక సాంకేతికత ‘పాపిలాన్’దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేకం. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ పాపిలాన్ సాఫ్ట్‌వేర్‌తో పాత నేరస్తులను కేవలం 10 సెకండ్లలో గుర్తిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక డేటాబేస్ కూడా నిర్వహిస్తున్నారు. మొబైల్ గాడ్జెట్ల ద్వారా ఘటనా స్థలం నుంచే నిందితుడిని గుర్తించే విధానం దేశంలో ఒక్క తెలంగాణలోనే ఉంది. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ఇంగ్లండ్ కంటే ముందుండటం విశేషం. ఇంగ్లండ్‌లో పాత నేరస్తులను గుర్తించేందుకు కనీసం 60 సెకండ్లు పడుతుండటం గమనార్హం. కొత్త 26 యూనిట్లు కూడా పనిచేయడం ప్రారంభమైతే.. నేర దర్యాప్తు, నిందితుల గుర్తింపు, కేసుల పరిష్కారంలో వరల్డ్ టాప్–10లో నిలబడుతుందని పోలీసు శాఖ ధీమాగా ఉంది. -
వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్
ప్రముఖ మెసెంజర్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను యాడ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు చూడకుండా...లేదా వాడకుండా ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పనిచేస్తుంది. యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత దృష్ట్యా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్లో ఫేస్ రిగక్నైజేషన్ లేదు. స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ ఫీచర్ మాత్రమే కాకుండా..టచ్ ఐడీ, ఫేషియల్ రిగక్నైజేషన్ ఫీచర్ల ద్వారా కూడా వాట్సాప్ అన్ లాక్ అవుతుంది. ఈ ఫీచర్ ఎలా ఆక్టివేట్ చేయాలంటే.. ఆండ్రాయిడ్ బీటా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర అకౌంట్ పై క్లిక్ చేయాలి. ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. యూస్ ఫింగర్ ఫ్రింట్ టు అన్‌లాక్ అప్షన్‌పై ప్రెస్ చేయాలి -
‘మీ–సేవ’లో ఏ పొరపాటు జరిగినా అతడే బాధ్యుడు
సాక్షి,సిటీబ్యూరో: ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే అన్ని కార్యకలాపాల సేవలకు కేంద్ర బిందువు మీ–సేవా కేంద్రాలే. విద్యుత్ బిల్లు చెల్పింపు నుంచి పాస్‌పోర్టు నమోదు దాకా.. రెవెన్యూ సేవలను ఇక్కడి నుంచి పొందాల్సిందే. అయితే, ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఏర్పాటైన ఈ కేంద్రాలు చాలావరకు బినామీల చేతుల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల వివిధ సేవలకు ఇష్టానుసారం ఫీజులు, సర్వీస్ చార్జీల వసూలు చేస్తున్నారు. ఇకపై ఇలాంటి దందాలకు, వసూళ్లకు ప్రభుత్వం చెక్ పెట్టే ఏర్పాట్లు చేసింది. కేంద్రాల నిర్వహణలో ఏ చిన్నపాటి తప్పిదం జరిగినా దానికి ఆ కేంద్రం యాజమానే (లైసెన్స్‌దారు) బాధ్యత వహించాలి. ఇందుకోసం మీ–సేవా కేంద్రాల నిర్వాహణలో ‘బయోమెట్రిక్’ విధానం ప్రవేశపెట్టారు. కేంద్రం యాజమాని బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేస్తేనే మీ–సేవా సర్వీసులు అందించేందుకు వీలవుతుంది. దీంతో హైదరాబాద్ మహా నగరంలో సగానికి పైగా బినామీల నిర్వాహణలో కొనసాగుతున్న కేంద్రాలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సేవలకు సంబంధించి వినియోగదారుల వద్ద ఇష్టానుసారం చేస్తున్న వసూళ్లకు కూడా అడ్డుకట్ట పడనుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో సగానికి పైగా మీ–సేవా కేంద్రాలు బినామీల నిర్వాహణలో సాగుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా 447 ఆన్లైన్ కేంద్రాలు ఉండగా, అందులో టీఎస్ ఆన్లైన్ సర్వీసులు 198, ప్రభుత్వ ఈ–సేవా సర్వీసులు 26, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) కేంద్రాలు 220 ఉన్నాయి. తాజాగా మరో 70కి పైగా కొత్త కేంద్రాలు మంజూరు చేయనున్నారు. మొత్తంమీద ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాల్లో సగానికి పైగా లైసెన్స్ పొందినవారి చేతుల్లో లేనట్లు తెలుస్తోంది. బయోమెట్రిక్ విధానంతో కేంద్రం యాజమాని తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో సదరు బినామీ నిర్వాహకులు చిక్కుల్లో పడినట్లే. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు మీ–సేవా కేంద్రాలను బయోమెట్రిక్‌తో అనుసంధానం చేశారు. మీ–సేవా కేంద్రం యాజమానితో పాటు ఒక ఆపరేటర్ మాత్రమే బయోమెట్రిక్ విధానంలో ఆన్లైన్ సేవలు అదించేలా ప్రత్యేక ప్రోగ్రామింగ్ రూపొందించారు. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయగానే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆన్లైన్ సేవలు ముందుకు వెళ్తాయి. కేంద్రం నిర్వాహకుడు(యాజమాని) బయోమెట్రిక్‌పై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మీ–సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. మీ–సేవా ద్వారానే అన్ని సేవలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆన్లైన్ సేవలన్నింటినీ మీ–సేవా కేంద్రాల ద్వారానే కొనసాగుతున్నాయి. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ప్రజాపంపిణీ, రిజిస్ట్రేషన్, రోడ్డు రవాణ, కార్మికశాఖ, విద్యుత్, వైద్య, విద్య, సంక్షేమ, పోలీసు, వాణిజ్య పన్ను తదితర శాఖల సేవలు మీ–సేవా ద్వారానే అందుతున్నాయి. దీంతో మీ–సేవా కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా కుప్పలు తెప్పలుగా గల్లీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి కొందరు ఉపాధి కోసమని మీ–సేవా కేంద్రాలను మంజూరు చేయించుకొని ఇతరులకు విక్రయించడం, లీజు, అద్దె, కమీషన్ పద్ధతిపై ఇతరులకు అప్పగించడం పరిపాటిగా మారింది. దీంతో కేంద్రాల నిర్వాహకులు సేవలందించేందుకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు మీ–సేవా కేంద్రాల ముసుగులో అక్రమ దందా కూడా సాగుతున్న ఉదాంతాలు అనేకం వెలుగు చూశాయి. కేంద్రాల అక్రమ వసూళ్లు అధికారుల దృష్టికి వెళ్తే ఆపరేటర్లు తప్పిదం చేశారని యాజమానులు కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. తాజగా వచ్చిన బయోమెట్రిక్ విధానంతో బినామీలు కేంద్రాలు నిర్వహించేందుకు వీలుండదు. ఆపరేటర్ వెసులుబాటునివినియోగించుకుంటే వారు చేసే అక్రమాలకు, అధిక వసూళ్లకు సదరు యాజమానే బాధ్యత వహించాలి. పారదర్శకత కోసమే.. మీ–సేవా కేంద్రాల నిర్వాహణతో పాటు పార్శదర్శకంగా సేవలందించేందుకు బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చాం. దీంతో బినామీల నిర్వహణకు వీలుండదు. ప్రజలకు అందించే సేవలకు అధిక చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. చిన్నపాటి తప్పిదానికైనా కేంద్రం యాజమానే బాధ్యత వహించాలి. – రజిత, ఈ–డిస్ట్రిక్ మేనేజర్, హైదరాబాద్ -
వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్’
సాక్షి,సిటీబ్యూరో: పాస్‌పోర్ట్ వెరిఫికేషన్.. ఒకప్పుడు పెద్ద ప్రహసనం. కానీ కొన్నాళ్ల క్రితం ఈ ప్రక్రియను పోలీసు విభాగం సులభతరం చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలోనే పూర్తి చేస్తోంది. అయితే, ఏ ఒక్క నేరచరితుడికీ పాస్‌పోర్ట్ జారీ కాకూడదనే ఉద్దేశంతో అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ‘వెరీ ఫాస్ట్’లో ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్‌ను సైతం భాగం చేసింది. ఇది అమల్లోకి తెచ్చాక మహానగరంలో 40 మంది గత చరిత్ర బయటపడి వారికి పాస్‌పోర్టులు నిలిచిపోయాయి. ఈ విధానాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరం నుంచి ఏటా కొన్ని లక్షల మంది పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఇలా పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లే దరఖాస్తులు ప్రాథమిక పరిశీలన తర్వాత వెరిఫికేషన్ కోసం పోలీసు విభాగానికి చేరతాయి. స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు క్షేత్రస్థాయిలోనూ తనిఖీ చేస్తారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మరింత కఠినం వీరిచ్చే నివేదిక ఆధారంగా సదరు దరఖాస్తుదారుకు రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. ఒకప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం నెలరోజులు పట్టేది. కొన్నేళ్ల క్రితం ‘వెరీఫాస్ట్’ అనే విధానం ప్రవేశపెట్టిన పోలీసు విభాగం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ చేసింది. అభ్యర్థి పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసిన నాటి నుంచి గరిష్టంగా 72 గంటల్లో పోలీసు వెరిఫికేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నేరచరితుల రికార్డులను వెరీ ఫాస్ట్‌తో అనుసంధానించారు. ఫలితంగా నేరచరితుడై ఉండీ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ విషయం ఈ వెరిఫికేషన్‌లో బయటపడి, అప్లికేషన్ తిరస్కారానికి గురవుతోంది. దీనికి తోడు వరసగా నేరాలు చేసే నేరగాళ్లలో కొందరు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకూ కొత్త ఎత్తులు వేయడం ప్రారంభించారు. పోలీసులకు చిక్కినప్పుడు, పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తున్న సందర్భంలోనూ పేర్లను మార్చి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారు తమ పేర్లను పూర్తిగా మార్చరు. ఎక్కువగా స్పెల్లింగ్స్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఇదే విధానాన్ని పాస్‌పోర్ట్ దరఖాస్తు సమయంలోనూ అవలంబిస్తున్నారు. ఉదాహరణకు పేరు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే అరెస్ట్ అయినప్పుడు చివరి స్పెల్లింగ్ (్గ్గఅ) ఒకలా, పాస్‌పోర్ట్ దరఖాస్తులో (ఐఅఏ) మరోలా రాస్తూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వారికీ చెక్ చెప్పడానికి అధికారులు వెరీఫాస్ట్లో ఫింగర్ ప్రింట్ ఎనాలసిస్ అంశాన్నీ చేర్చారు. ఆన్లైన్లోనే కోర్టు కేసుల వివరాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ–కోర్ట్స్ విధానం అమలులో ఉంది. వివిధ సివిల్, క్రిమినల్ న్యాయస్థానాల్లో ఉన్న కేసులకు సంబంధించిన సమగ్ర వివరాలను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) క్రోడీకరిస్తోంది. దాదాపు 19 వేల కోర్టులకు సంబంధించిన ఏడున్నర కోట్లకు పైగా రికార్డులతో డేటాబేస్ ఏర్పాటైంది. ఆయా న్యాయస్థానాల్లో ఉన్న అన్ని తరహా కేసుల వివరాలు ఆన్లైన్లో ఉన్నాయి. దీని ఆధారంగానే పోలీసు విభాగం ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఆయా కేసుల్లో నిందితులుగా, పిటిషనర్లుగా ఉన్న వారి పేర్లు, ఇతర వివరాలతో కూడిన ప్రత్యేక డేటాబేస్కు సెర్చ్ ఇంజన్ అనుసంధానించారు. దాంతా కేసుల వివరాలు నిమిషాల్లో వస్తున్నాయి. అలాగే పోలీసు డేటాతోనూ అనుసంధానించారు. వివిధ నేరాల్లో అరెస్టు అయినప్పుడు నిందితుల నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరిస్తారు. ఈ డేటాబేస్‌ను సైతం వెరిఫాస్ట్తో అనుసంధానించారు. ఫలింతంగా ట్యాబ్ తీసుకుని వెరిఫికేషన్‌కు వెళ్ళిన ఎస్బీ సిబ్బంది అతడి వివరాలను ఆన్‌లైన్‌తో తనిఖీ చేస్తారు. అలా చేసినప్పుడు క్షణాల్లో ఆ వ్యక్తి దాచిన, ‘మార్చిన’ నేరచరిత్ర బయట పడుతోంది. ప్రస్తుతం రాజధాని నగరంలోనిహైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ పోలీస్ కమిషనరేట్లలోనూ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం ‘వెరీ ఫాస్ట్’ అమల్లో ఉంది. ఇప్పుడు ఇందులో భాగంగా ఫింగర్ ప్రింట్స్‌ను సైతం తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ పక్కాగా సాగుతున్న ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగావిస్తరించడానికి పోలీసు విభాగం కసరత్తు ప్రారంభించింది.’’ -
తెగిన వేలే పట్టించింది
న్యూఢిల్లీ : కత్తితో బెదిరిస్తూ.. దొంగతనానికి ప్రయత్నిస్తుండగా నిందుతుడి వేలు తెగిపోయింది. చివరకు అదే వేలు.. ఆధారంగా మారి దొంగను పట్టించిన సంఘటన ఢిల్లీ జనక్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. రంజిత్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం మధ్యహ్నాం తన బంధువుతో కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఈ సమయంలో నిందితులు రాహుల్(24), ధరంబీర్(35) కూడా అదే బస్సు ఎక్కారు. రంజిత్ బస్సు దిగుతుండగా అతని పర్సు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించాడు. సరిగా అదే సమయంలో బస్సులో ఉన్న రాహుల్, రంజిత్ పర్సును బయటకు విసిరేశాడు. అంతేకాక రాహుల్, అతని స్నేహితుడితో కలిసి రంజిత్ బంధువును కత్తితో బెదిరిస్తూ.. అతని వద్ద ఉన్న సొమ్ము లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ గొడవలో రాహుల్ వేలు తెగిపడింది. సొమ్ము తీసుకుని నిందితులిద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దాంతో రంజిత్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ తెగి పడిన వేలు దొరికింది. దాని ఆధారంగా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న పోలీసులు పాత నేరస్తుల డాటాతో పోల్చీ చూడగా రాహుల్ వేలిముద్రలతో సరిపోలింది. రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్, అతని స్నేహితుడు ధరంబీర్ను అదుపులోకి తీసుకోవడమే కాక వారు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిద్దరి మీద ఇప్పటికే పలు కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. -
దొంగల్ని పట్టించిన వేలిముద్రలు
నెల్లూరు(క్రైమ్): ఈజీ మనీకోసం ఇద్దరూ దొంగలుగా మారారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఓ దొంగ వేలిముద్రల ఆధారంగా నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఇరుకళల పరమేశ్వరి ఆలయం సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం చిన్నబజారు పోలీసు స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ♦ మెక్లెన్స్‌రోడ్డులో ముజీబ్, రబ్బానీ దంపతులు నివాసం ఉంటున్నారు. వారిద్దరూ పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పైసాపైసా కూడపెట్టి బంగారు, వెండి ఆభరణాలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 23వ తేదీ రాత్రి ముజీబ్ కోటమిట్టలోని తన అత్త ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు అతని ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. పడకగదిలోకి వెళ్లి బీరువాను తెరచి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకెళ్లారు. ఈ మేరకు అప్పట్లో బాధితురాలు రబ్బానీ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. ఇన్స్పెక్టర్ షేక్ అల్లాభక్షు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలు ఆధారంగా ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఎస్సై కరిముల్లా అతని సిబ్బంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వేలిముద్రల ఆధారంగా.. మైపాడుగేట్ సెంటర్‌కు చెందిన ఎ.రాజేష్ ఈజీ మనికోసం దొంగగా మారాడు. నవాబుపేట, వేదాయపాళెం, బాలాజీనగర్ తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. కొంతకాలం క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన అతనికి కొత్తూరు చంద్రబాబునగర్ ఎ–బ్లాక్‌కు చెందిన డి.సందీప్‌తో పరిచయమైంది. ఇద్దరూ కలిసి మెక్లెన్స్‌రోడ్డులోని రబ్బానీ ఇంట్లో గతేడాది దొంగతనానికి ♦ పాల్పడ్డారు. ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా నిందితుల్లో ఒకరు పాతనేరస్తుడు రాజేష్ అని తెలియడంతో అతని కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం అర్ధరాత్రి రాజేష్, సందీప్‌లు ఇరుకళల పరమేశ్వరి ఆలయ సమీపంలోని గేటుసెంటర్ వద్ద ఉన్నారన్న సమాచారం చిన్నబజారు ఇన్స్పెక్టర్కు అందింది. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణలో నిందితులు రబ్బానీ ఇంట్లో దొంగతనం చేశామని, త్వరలో నెల్లూరు నుంచి విశాఖపట్నం పారిపోయి అక్కడ నేరాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడంతో వారిని అరెస్ట్ చేశామని డీఎస్పీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.2.70 లక్షలు విలువచేసే సుమారు 13 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. సిబ్బందికి అభినందన నిందితులను అరెస్ట్ చేసి చోరీసొత్తు రాబట్టేందుకు కృషిచేసిన చిన్నబజారు ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్‌బాషా, ఎస్సై కరిముల్లా, హెడ్‌కానిస్టేబుల్ ఎస్.భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుల్స్ ఈ.రమణ, సురేష్, నజ్మల్, ఉదయ్‌కిరణ్, అల్తాఫ్‌లను డీఎస్పీ అభినందించారు. త్వరలో ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో ఎస్సై పి. బలరామయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్‌లో మరో ఆకర్షణీయ ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. సోషల్ మీడియాలో డేటా చోరీ వార్తలు భయపెడుతున్న తరుణంలో వాట్సాప్ ఒక సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. వాట్సాప్ వినియోగదారుల సంభాషణలు ఇతరులు చూడకుండా కాపాడేందుకు ఆండ్రాయిడ్ వెర్షన్లో వాట్సాప్‌కు ఫింగర్ ప్రింట్ అధెంటికేషన్ ఆప్షన్ తీసుకరానుంది. ఇకపై వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలంటే వేలిముద్ర అవసరమని మంగళవారం వెల్లడైన ఒక నివేదిక తెలిపింది. తాజా నివేదికల ప్రకారం ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ తీసుకురానున్న ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫీచర్ పరీక్ష, ప్రయోగ దశలో ఉంది. ఈ ఫీచర్ నిర్దిష్ట సంభాషణలను కాపాడటమే కాదు, మొత్తం యాప్‌కు భద్రత నిస్తుందనీ, ఇతరులకు మన వాట్సాప్ యాక్సెస్‌ను నియంత్రిస్తుందనీ.. అంటే వాట్సాప్‌లో మన చాటింగ్‌కు స్పెషల్‌గా లాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. డైరెక్టుగా యాప్‌కే ఫింగర్ ప్రింట్ ఫీచర్ రక్షణనిస్తుందని వాబ్ఈటల్ ఇన్ఫో అనే వెబ్సైట్ నివేదించింది. కాగా పరీక్షల దశను విజయవంతంగా పూర్తి చేసుకుని..లాంచింగ్ అయితే...ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్(వేలిముద్ర ప్రామాణీకరణ) ఫీచర్ సెట్టింగ్స్‌లో అకౌంట్.. ప్రైవసీ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. -
నకిలీ వేలి ముద్రల తయారీ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : క్లోనింగ్ పద్ధతిలో నకిలీ వేలి ముద్రలను తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సైదాబాద్‌లోని చంపాపేట్‌లో అక్రమంగా క్లోనింగ్ వేలి ముద్రలు తయారు చేస్తూ అమ్మకాలు సాగిస్తోంది. వివిధ కాలేజీల్లో పని చేస్తున్న ఫ్యాకల్టీ వేలి ముద్రలను తయారు చేస్తూ తప్పుడు విధానంతో ఆన్లైన్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఇప్పిస్తున్నారు. కెమికల్స్ ఉపయోగించి క్లోనింగ్ ద్వారా 29 మంది వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీకి చెందిన ఫ్యాకల్టీ వేలి ముద్రలు తయారు చేశారు. 15 మంది విద్యార్థులకు ఒక ప్రోపెసర్ ఉండాలన్న యూనివర్సిటీల నిబంధనను తప్పించుకునేందుకు క్లోనింగ్ వేలి ముద్రలు తయారు చేశారు. నిందితులను బొమ్మ రామకృష్ణ, పోరెడ్డి సుదర్శన్ రెడ్డి, గోపాల్ రెడ్డిలుగా పోలీసుల గుర్తించారు. బొమ్మ రామకృష్ణ అసోషియేట్ ప్రోపెసర్ కాగా, పోరెడ్డి సుదర్శన్ రెడ్డి వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ బాటసింగారంలో వైఎస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. గోపాల్ రెడ్డి కూడా వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో సెక్రెటరీగా పని చేస్తున్నాడు. వీరు ఫీజు రిఎంబర్స్మెంట్ కోసం విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా క్లోనింగ్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా తీసుకున్నారని సిటీ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. -
వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
ప్రముఖ చైనా మొబైల్ తయారీదారు వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'వివో ఎక్స్21ఎస్' పేరిట చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. వివో వీ11ప్రో ఫోన్ మాదిరిగా ఈ సరికొత్త 'ఎక్స్21ఎస్' ఫోన్లోనూ అమర్చింది. అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, బెజెల్ లెస్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 660 వంటి అధునాతన ఫీచర్లు అదనంగా జోడించింది. దీని ధర సుమారు రూ.26,100గా వుండనుంది. వివో ఎక్స్21ఎస్ ఫీచర్లు 6.41 ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 24.8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400ఎంఏహెచ్ బ్యాటరీ -
సాంకేతికతలో భేష్ అనిపించాలి
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో భారత్ భేష్ అనిపించేలా పని చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్ (సీడీఎఫ్‌డీ) విభాగం పని చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నూతనంగా నిర్మించిన సీడీఎఫ్‌డీ భవనాన్ని హర్షవర్దన్ ఆదివారం ప్రారంభించారు. డీఎన్ఏ, ఫింగర్ ప్రింట్స్ గుర్తింపు, సమాచార సేకరణలో దర్యాప్తు సంస్థలకు సీడీఎఫ్‌డీ కీలకమని, దేశంలోని అన్ని దర్యాప్తు విభాగాలు ఉపయోగించుకునేలా పనిచేయాలని కోరారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ మారబోతోందని, అనేక కేంద్ర సంస్థలు ఇక్కడ ఏర్పాటవడం సంతోషకర పరిణామమని అన్నారు. దక్షిణ భారతదేశానికి ఉపయోగపడేలా సౌత్ విజ్ఞాన్ భవన్‌కు రెండు రోజుల క్రితమే శంకుస్థాపన చేశామని, హైదరాబాద్ ఇప్పుడు దేశంలో కీలకమైన నగరమని అభిప్రాయపడ్డారు. వచ్చే సమావేశాల్లోనే డీఎన్ఏ బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో డీఎన్ఏ టెక్నాలజీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందుతుందని హర్షవర్దన్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి ఏర్పడ్డప్పుడే డీఎన్ఏ టెక్నాలజీ బిల్లు రూపొందించామని, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లోనే ఉందన్నారు. ఇటీవల ముగిసిన సమావేశాల్లో బిల్లును లోక్‌సభకు పరిచయం చేశామని, వచ్చే శీతాకాల సమావేశాల్లో డీఎన్ఏ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. డీఎన్ఏ బిల్లు ఆమోదం వల్ల అదృశ్యమైన చిన్నారుల కేసులు, సంచలనాత్మకమైన కేసుల్లో పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నామన్నారు. డీఎన్ఏ టెక్నాలజీ యాక్ట్‌లో ఆధార్ అనుసంధానం అంశం లేదని, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆధార్‌ను ఈ యాక్ట్‌కు అనుసంధానించే ఆలోచన కూడా తమకు లేదని వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, సీడీఎఫ్‌డీ డైరెక్టర్ మిత్రా, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీడీఎఫ్‌డీ మాజీ డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ల్యాకోన్స్ కృషి భేష్ సమన్వయంతో పనిచేస్తే ఎన్ని అద్భుతాలైనా సాధించవచ్చనేందుకు హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ (ల్యాకోన్స్) నిదర్శనమని హర్షవర్ధన్ అన్నారు. అంతరించిపోతున్న అరుదైన జింక జాతిని ఆధునిక శాస్త్ర పద్ధతుల ద్వారా వృద్ధి చేయడం.. వాటిని మళ్లీ అడవుల్లోకి ప్రవేశపెట్టడం హర్షణీయమని చెప్పారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఆదివారం వన్యప్రాణి జన్యువనరుల కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ల్యాకోన్స్ వంటి కేంద్రాలను అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని విధాలుగా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వన్యప్రాణి జన్యు వనరుల కేంద్రంలో ప్రస్తుతం 23 జీవజాతులకు సంబంధించిన జన్యువులు, కణజాలం అండాలను నిల్వ చేశామని, రానున్న మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్యను ఐదు రెట్లు ఎక్కువ చేసేందుకు ప్రయతిస్తున్నామని సీసీఎంబీ ల్యాకోన్స్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కార్తికేయన్ వాసుదేవన్ ‘సాక్షి’కి తెలిపారు. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా మౌస్ డీర్ల సంఖ్యను పెంచగలిగామని.. ఇప్పటివరకూ అవి స్థానిక జంతు సంరక్షణాలయంలో ఉండగా.. దశల వారీగా వాటిని మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్, తదితర అటవీ ప్రాంతాల్లో వదిలేస్తామని ఆయన వివరించారు. -
ఆర్థిక బాధలతోనే ఈ పనిచేశా
సాక్షి, హైదరాబాద్: నకిలీ వేలిముద్రలు తయారుచేసిన సంతోష్‌కుమార్‌ను శనివారం కౌంటర్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. సంతోష్ డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డులు ఫింగర్ ప్రింట్ల కోసమే వాడినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇతడికి ఏ తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని, డబ్బుకోసం మాత్రమే సంతోష్ ఈ నేరానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. 2013 డిసెంబర్ నుంచి వొడాఫోన్ డీలర్‌గా పనిచేస్తున్న సంతోష్ ఐదేళ్లపాటు శ్రమిస్తే తనకు ఏడాదికి రూ.20 వేలే ఆదాయం వచ్చిందన్నాడు. జియో సిమ్ రావడంతో వొడాఫోన్ సిమ్ల కొనుగోలు తగ్గిందని పోలీసులకు వెల్లడించాడు. వొడాఫోన్‌ను మోసం చేయడంలో భాగంగానే నకిలీ సిమ్ కార్డుల యాక్టివేషన్ కోసం ప్లాన్ చేశానని, ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్, ఫింగర్ ప్రింట్ల డౌన్లోడ్ చేస్తున్నట్టు అంగీకరించాడు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన భూ సర్వే నెంబర్లు సేకరించి ఆధార్ కార్డులు డౌన్లోడ్ చేయాలనుకున్నానన్నారు. యంత్రం, రబ్బర్ స్టాంపులు, పాలిమార్ లిక్విడ్, గేట్‌వే పేపర్‌కు రూ.12వేలు మాత్రమే ఖర్చయ్యాయని వెల్లడించాడు. వీటిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఈసీ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేయడం మొదలు పెట్టానని, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన రైతుల ఆధార్, ఫింగర్ ప్రింట్లను డౌన్లోడ్ చేశానన్నాడు. ఇలా రోజుకు 200 నుంచి 300 డౌన్లోడ్ చేసేవాడినని సంతోష్ అంగీకరించాడు. గత ఎనిమిదేళ్లలో తాను వివిధ వ్యాపారాలు చేసి కోటిన్నర రూపాయలు నష్టపోయానని పోలీసులకు తెలిపాడు. ఆర్థికంగా నిలబడడం కోసం మాత్రమే ఈ పని చేశానని అంగీకరించాడు. సిమ్ కార్డు యాక్టివేషన్ చేసి, తర్వాత ఆ ఆధార్ కార్డును ఫింగర్ ప్రింట్ పేపర్లను కాల్చేసినట్టు చెప్పారు. అయితే సంతోష్‌ను మరోసారి విచారించేందుకు కస్టడీ కోరామని పోలీసులు వెల్లడించారు. -
మూడు వేల సిమ్‌కార్డులు స్వాధీనం?
సాక్షి,పెద్దపల్లి/ధర్మారం: నకిలీ వేలిముద్రల తయారీ నిందితుడు పాత సంతోష్‌కుమార్‌ను తన సొంతగ్రామమైన ధర్మారంలో పోలీసులు విచారించారు. పోలీసు కస్టడీలో ఉన్న సంతోష్‌ను శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాలోని ధర్మారానికి తీసుకువచ్చారు. ధర్మారంలోని తన నివాసం,దుకాణంలో సంతోష్ సమక్షంలో క్రైమ్ స్పెషల్ బ్రాంచీ పోలీసులు, క్లూస్‌టీమ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోష్ ఇల్లు, దుకాణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు, వేలిముద్రల తయారీకి వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకొన్నారు. సంతోష్‌ను తొలిసారిగా ధర్మారం తీసుకురావడంతో ఈ ప్రాంతంలో అలజడి నెలకొంది. ఎక్కడ చూసినా సంతోష్ చర్చ కొనసాగింది. ఆయనను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. ధర్మారంలో ఎనిమిదిన్నర గంటలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీవేలిముద్రల తయారీ నిందితుడు పాతసంతోష్ అరెస్ట్ తర్వాత తొలిసారిగా తన స్వగ్రామం ధర్మారం తీసుకువచ్చారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్ఆర్ నగర్ ఎస్సై రాజేందర్‌గౌడ్, క్లూస్‌టీమ్ ఎస్సై బాల్‌రెడ్డిలు సంతోష్‌కుమార్‌తో పాటు సిబ్బంది ఉదయం 8.30 గంటలకే ధర్మారంలోని సంతోష్‌కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు మూసి ఉంచి దాదాపు గంట సేపు సోదాలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎస్సై దేవయ్య సహకారంతో సోదాల సమయంలో రెవెన్యూ సిబ్బంది పిలిపించుకున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు రాంచంద్రం, భానుకుమార్‌ల సమక్షంలో తిరిగి తనిఖీలు కొనసాగించారు. మధ్యాహ్నం 12 గంట వరకు ఇంటిలో సోదాలు నిర్వహించిన అనంతరం, మరో ప్రాంతంలో ఉన్న ఆయన దుకాణానికి తీసుకెళ్లారు. అక్కడ గంట పాటు సోదాచేశాక,« దర్మారం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి పంచనామా రాశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. మూడు వేల సిమ్‌కార్డులు లభ్యం? సోదాల సందర్భంగా సంతోష్ ఇంట్లో మూడు వేల సిమ్‌కార్డులు, సగం కాల్చివేసిన సిమ్‌కార్డులు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సంతోష్ ఇల్లు, దుకాణంలో సోదాలు నిర్వహించిన పోలీసులు నకిలీవేలిముద్రల తయారీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. బీరువాలో దాచి ఉంచిన డాక్యుమెంట్లను, కంప్యూటర్ హార్డు డిస్కు, కనెక్టర్, ప్రింటర్, కెమికల్ ఇంక్‌ప్యాడ్‌లను స్వాదీనం చేసుకున్నారు. ముందుగా ప్రింటర్‌ను రిపేర్ కోసం మేడారంలో ఇచ్చానని, సంతోష్ చెప్పటంతో పోలీసులు ఆయనను మేడారం తీసుకెళ్లారు. అక్కడ రిపేరుచేసే వ్యక్తి అందుబాటులో లేడు. మళ్లీ తన దుకాణంలోనే ఉండవచ్చని సంతోష్ చెప్పటంతో, దుకాణంలో తిరిగి సోదా చేయగా ప్రింటర్ లభించింది. తరలివచ్చిన ప్రజానీకం సంతోష్ కుమార్‌ను పోలీసులు ధర్మారం తీసుకవచ్చారనే సమాచారంతో బంధువులు, మిత్రులు, స్థానిక ప్రజానీకం చూసేందుకు తరలివచ్చారు. సామాన్య వ్యాపారిగా ఉన్న వ్యక్తి దేశద్రోహస్థాయి నేరానికి పాల్పడినట్లు తేలడం జిల్లాలో సంచలనం సృష్టించింది. వేలిముద్రలే నకిలీవి తయారు చేసిన సంతోష్ ఇతనేనా అంటూ పరిశీలించి చూడడం కనిపించింది. ఆయనను కలిసేందుకు బంధువులు, మిత్రులు ప్రయత్నించినప్పటికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినా గంటల తరబడి ఆయన ఇంటి ముందు వేచి ఉన్నారు. చివరకు సంతోష్‌ను కారులో తరలిస్తున్న సమయంలో ప్రజానీకం ఆసక్తిగా గమనించారు. రహస్య విచారణ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపడంతో పాటు, దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు దృష్టిపెట్టిన కేసు కావడంతో పోలీసులు రహస్యంగా విచారణ కొనసాగించారు. సంతోష్ ఇల్లు,దుకాణంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మీడియాతో పాటు ఎవరినీ లోనికి అనుమతించలేదు. సోదాల అనంతరం సంతోష్‌కుమార్‌ను తీసుకవెళ్ళుతుండగా, ఫోటోలు తీసేందుకు సైతం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
నకిలీ వేలిముద్రల స్కాంలో దర్యాప్తు వేగవంతం
-
నకిలీ వేలిముద్రల స్కాంలో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్: నకిలీ వేలిముద్రల స్కాంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. స్కాం నిందితులు రేషన్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ వేలముద్రలతో బియ్యం అక్రమ రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగి నలుగురు రేషన్ డీలర్లను అదుపులోకి తీసుకుంది. కాగా, నకిలీ వేలిముద్రల స్కాంలో నిందితుడు పాత సంతోష్ కుమార్‌ను పోలీసులు రెండవరోజు విచారణ జరుపుతున్నారు. సంతోష్‌ను గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం తరలించిన ఎస్సార్ నగర్ పోలీసులు ధనలక్ష్మీ కమ్యునికేషన్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వేలుముద్రలతో పాటు కొన్ని కీలక పత్రాలు, ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు స్వాదీనం చేసుకున్నారు. ఓ కంప్యూటర్, నకిలీ వేలిముద్రల తయారీ యంత్రాన్ని కూడా గుర్తించారు. కాగా ఈరోజుతో సంతోష్ పోలీస్ కస్టడీ ముగియనుంది. -
కుట్ర లేదు.. కుతంత్రం లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘కుట్ర లేదు.. కుతంత్రం లేదు.. సిమ్‌కార్డుల టార్గెట్ పూర్తి చేసుకో వడానికే నకిలీ వేలి ముద్రలు సృష్టించా. అలా యాక్టివేట్ చేసిన సిమ్‌కార్డుల్ని ధ్వంసం చేశా. ఇందులో మావోయిస్టులు, ఉగ్రవాదుల ప్రమే యమో లేదు. సెల్ఫోన్లో ఫోర్జీ సిమ్‌కార్డు ఉంది. దీంతో కంప్యూటర్‌తో పని లేకుండా సెర్చ్‌లు చేశా’ అని పాత సంతోష్‌కుమార్ పోలీసు, నిఘా వర్గాల దగ్గర ఏకరువు పెట్టాడు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో చూసి ఈ పని చేశానని, ఇంత పెద్ద నేరమనే విషయం కూడా తెలియదని చెప్పాడు. గత వారం అరెస్టు చేసిన సంతోష్‌ను ఎస్సార్‌నగర్ పోలీసులు విచారణ కోసం కోర్టు అనుమతితో గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అసాంఘిక శక్తుల కోణానికి సంబం ధించి పోలీసులు సంతోష్‌ను వివిధ కోణా ల్లో ప్రశ్నిస్తున్నారు. అయితే, రూ.51 టాక్‌టైమ్‌తో కూడిన సిమ్‌కార్డుల్ని ఉచితంగా ఇద్దామన్నా సాధ్యం కాలేదని, అందుకే నెలకు 600 సిమ్‌కార్డుల యాక్టివేషన్ టార్గెట్ పూర్తి చేయడానికి ప్రత్యా మ్నాయ మార్గాలు వెతికానన్నాడు. సిమ్‌కార్డు పొందాలంటే ఆధార్ వివరాలు, వేలిముద్ర తప్పనిసరి కావడంతో ఇబ్బందులు ఎదుర య్యాయని, కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఓ వ్యక్తి పేరుతో గరి ష్టంగా 9 సిమ్కార్డులే జారీ అయ్యేలా నిబం ధనలు అమల్లోకి రావడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నాడు. టార్గెట్ పూర్తి చేయడం కోసం అనేక మార్గాలు అన్వేషించానన్నాడు. స్థిరాస్తుల క్రయ విక్రయాల సమయంలో పూర్తి పేరు, చిరు నామా, ఆధార్ నంబర్‌తోపాటు వేలిముద్రలు డాక్యుమెంట్లో పొందుపరు స్తారని గుర్తించానని చెప్పాడు. దాదాపు 8 నెలలుగా.. దాదాపు 8 నెలలుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయడం ప్రారంభించానని సంతోష్‌కుమార్ అధికారులకు వెల్లడించాడు. పాలిమర్ ఆధారిత రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని ఇండి యా మార్ట్ వెబ్సైట్ నుంచి రూ.16 వేలకు ఖరీదు చేసి నకిలీ వేలిముద్రలు సృష్టించానని వివరించాడు. 3 వేలకు పైగా వేలిముద్రలు తయారు చేసి, 6 వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసినట్లు అంగీకరించాడు. యాక్టివేటైన కార్డుల ను, పని పూర్తయిన వేలిముద్రల్ని ధ్వంసం చేశానని, కొన్నింటిని టాక్‌టైమ్ పూర్తయ్యే వర కు వాడి పడేశానన్నాడు. అంతేతప్ప ఎలాంటి హ్యాకింగ్‌కు పాల్పడలేదని, ఆధార్ సహా ఏ వెబ్సైట్లోకి అక్రమంగా చొరబడలేదని సంతోష్‌కుమార్ వివరించాడు. తొలిరోజు విచారణ హైదరాబాద్‌లో పూర్తి చేసిన అధికారులు శుక్రవారం సంతోష్ స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధర్మారం తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అక్కడ అతనికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్లో సోదాలు చేయనున్నారు. ఇప్పటికే రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రంతో పాటు అతడి సెల్‌ఫోన్, డౌన్లోడ్ చేసిన 1,400 డాక్యుమెంట్లు, నకిలీ వేలిముద్రల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఫింగర్ ప్రింట్ స్కాం విచారణ.. షాకింగ్ నిజాలు..
సాక్షి, హైదరాబాద్ : ఫింగర్ ప్రింట్ స్కాం నిందితుడు సంతోష్ విచారణ మొదటి రోజు ముగిసింది. నిందితుడు సంతోష్‌ను ఐబీ, రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్‌లు గురువారం విచారించాయి. టార్గెట్ పూర్తి చెయ్యడానికే ఫేక్ వేలిముద్రల తయారీ చేపట్టినట్లు అతను అంగీకరించాడు. విచారణలో వెల్లడైన అంశాలు.. ఈ వ్యవహారం గత 8నెలలుగా సాగుతుందని అతను చెప్పాడు. దాదాపుగా 1400లకు పైగా డాక్యుమెంట్ల డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాక 3వేలకుపైగా వేలిముద్రలు సేకరించి, 3వేల నుంచి 4వేల సిమ్ కార్డ్స్ యాక్టివేట్ చేసినట్లు సమాచారం. ల్యాండ్ డాక్యుమెంట్ల నుంచి వేలి ముద్రలు సేకరించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఇండియన్ మార్ట్ అనే సంస్థ నుంచి ఫింగర్ ప్రింట్ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. సిమ్‌కార్డులను, ఫేక్ ఫింగర్ ప్రింట్లను దగ్ధం చేసినట్లు నిందితుడు తెలిపాడు. వెస్ట్ జోన్ పోలీసులతో పాటు, ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్‌లు సంతోష్‌ను విచారించారు. -
వేలిముద్రలు : ఏపీ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు
సాక్షి, అమరావతి: తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ వేలిముద్రల ఉదంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తోంది. తెలంగాణలో సిమ్‌కార్డుల అమ్మకాల కోసం నకిలీ వేలిముద్రలు తయారు చేసిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి కాపీల డౌన్‌లోడ్‌ను నిలిపివేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ సర్వర్‌ను నిలిపివేసింది. పెద్దపల్లి జిల్లాలో బయటపడిన నకిలీ వేలిముద్రల కుంభకోణంలో నిందితుడు సంతోష్‌కుమార్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ నుంచి డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేశాడన్న సంగతి తెలిసిందే. వాటి ఆధారంగా నిందితుడు నకిలీ వేలిముద్రలు తయారు చేయడంతో ఆధార్ బయోమెట్రిక్ భద్రత సవాలుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దాదాపు 7.4 లక్షల సర్టిఫైడ్ రిజిస్ట్రేషన్ కాపీలు జారీ కాగా.. విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనే 2.5 లక్షల డాక్యుమెంట్లు డౌన్లోడ్ అయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో కొన్నింటిని నకిలీ ఆధార్, సిమ్ కార్డులు పొందడానికి వినియోగించినట్టు ఏపీ, కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో వెలుగుచూసిన నకిలీ వేలిముద్రల స్కాం తరహాలో ఏపీలో కూడా ఏమైనా అవకతవకలు జరిగాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
నకిలీ వేలిముద్రల స్కాం ; నిందితుడి విచారణ
సాక్షి, హైదరాబాద్: సిమ్‌కార్డుల అమ్మకాల్లో టార్గెట్‌ను చేరుకోవడానికి నకిలీ వేలిముద్రలు తయారు చేసిన నిందితుడిని విచారణ నిమిత్తం పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్ వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి సేకరించిన వేలిముద్రలకు నకిలీ వేలిముద్రలు తయారు చేసి సంతోష్‌కుమార్ దాదాపు ఆరువేల సిమ్‌కార్డులు ఆక్టివేషన్ చేశాడు. అయితే, ప్రాథమిక విచారణలో సిమ్‌కార్డుల విక్రయానికి సంబంధించిన టార్గెట్‌ను పూర్తిచేయడానికే నకిలీ వేలిముద్రలు తయారు చేసినట్టు బయడపడినా, ఎవరైనా సంఘవిద్రోహ శక్తులకు అతను సిమ్‌కార్డులు అందించాడా? ఈ నకిలీ వేలిముద్రల తయారీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. వేల సంఖ్యలో నకిలీ వేలిముద్రల స్కాం బయటపడడం ఆధార్ బయోమెట్రిక్ భద్రతకు సవాల్‌గా నిలిచింది. కాగా, ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థలో వెలుగుచూసిన లోపాలను సరిదిద్దేందుకు యూఐడీఏఐ అధికారులు రంగంలోకి దిగారు. -
మన ఊరి సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా?
ధర్మారం (పెద్దపల్లి) : నకిలీ వేలిముద్రల తయారీ పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని ధర్మారం మండల కేంద్రానికి చెందిన పాత సంతోష్ కుమార్ (38) చిన్న వయస్సులోనే వ్యాపారం చేస్తూ లాభాలు ఆర్జించేందుకు వక్రమార్గం ఎంచుకున్నాడు. తాను చేస్తున్న పని దేశద్రోహానికి పాల్పడుతున్నట్లు గుర్తించలేని ఆయన.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అక్రమ సంపాదన కోసం ఆధార్‌కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్‌కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించింది. అతి సామాన్యుడిగా కనిపించే సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా అని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ ఏడవ తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్నాడు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు కరీంనగర్లో చదివాడు. అనంతరం ఇంజనీరింగ్ చదవాలని ప్రవేశపరీక్ష రాశాడు. ఇతర రాష్ట్రాల్లో సీటు రావడంతో మధ్యలోనే చదువు మానేసి వ్యాపారంలో దిగాడు. అప్పటికే తండ్రి గౌరయ్య చేస్తున్న అడ్తి వ్యాపారానికి సహకరించే సంతోష్ ధర్మారం శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని ఈముపక్షుల పెంపకం చేశాడు. ఇందులో దివాలా తీశాడు. చివరికి తన షెటర్‌లోనే ధనలక్ష్మి కమ్యూనికేషన్ పేరుతో వొడాఫోన్ ప్రీపెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎక్కువ కనెక్షన్స్ విక్రయిస్తే కమీషన్ ఎక్కువగా ఇస్తామని కంపెనీ టార్గెట్ పెట్టింది. దీంతో సంతోష్ ధర్మారం, వెల్గటూర్ కళాశాలలు, పాఠశాలల్లో సిమ్‌కార్డులు విక్రయించాడు. ఈ క్రమంలో బంధువులు, మిత్రుల ఆధార్ కార్డులను తీసుకునేవాడు. చివరికి ఆధార్‌కార్డులు లభించకపోవడంతో నకిలీ వేలిముద్రలకు పాల్పడినట్లు సమాచారం. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించేవాడని మిత్రులు అంటుంటారు. కాగా.. సిమ్‌కార్డుల టార్గెట్ చేరేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల స్థానికులు నివ్వెరపోతున్నారు. -
ఆ కేసుల మాటేమిటి?
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఏటా చోటు చేసుకుంటున్న నేరాల్లో వేలిముద్రల ద్వారా కొలిక్కి వస్తున్న వాటి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ కేసుల్లో నిందితులపై అభియోగాలు మోపడం, నేరం నిరూపించడంలోనూ ఈ వేలిముద్రలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ‘ఆధార్’గోప్యతపై దేశ వ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వ్యవస్థల్లో ఉన్న లోపాలపై మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన ‘వేలికి ‘నకిలీ’ముద్ర!’కథనం తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన పాత సంతోష్ కుమార్ సిమ్‌కార్డుల యాక్టివేషన్ కోసం నకిలీ వేలిముద్రలు తయారు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై మంగళవారం పోలీసులతో పాటు మరికొన్ని విభాగాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. నష్టనివారణ చర్యలతో పాటు విచారణ దశలో ఉన్న కేసుల అంశాన్నీ చర్చించాయి. వివిధ కేసుల పరిశోధన, నేర నిరూపణలో వేలిముద్రల పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలూ ఒకేలా ఉండవనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే సంతోష్ సృష్టించిన నకిలీ ‘వేలి ముద్రలు’దీన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ ప్రభావం కేసుల దర్యాప్తు, విచారణ తీరుపై ఉండే అవకాశం లేకపోలేదని, అనేక కేసులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీడిపోయే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నేర స్థలిలో సేకరించిన వేలిముద్రలు నిందితులవే అని పక్కాగా నిర్ధారించడానికి అవసరమైన పరిజ్ఞానం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓ వ్యక్తి పూర్తి పేరు, ఆధార్ నంబర్, వేలిముద్ర... ఇవి అసాంఘిక శక్తుల చేతికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పడానికి సంతోష్‌దే పెద్ద కేస్ స్టడీగా పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క నకిలీ వేలిముద్రలు తయారు చేయడానికి సంతోష్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన వివరాలనే వినియోగించడంతో ఆ శాఖకు ఓ లేఖ రాయాలని పోలీసులు భావిస్తున్నారు. డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లోకి అప్లోడ్ చేసే సమయంలో ఆధార్ వివరాలు, వేలిముద్రల కాలమ్స్ కనిపించకుండా చేసేలా సిఫార్సు చేయనున్నారు. మరోపక్క సంతోష్ వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీలో ప్రతి 3 నెలలకు ఓసారి జరిగే మల్టీ ఏజెన్సీస్ కమిటీ (మ్యాక్) సమావేశం మరో వారంలో జరుగనున్నట్లు తెలిసింది. ఇందులో నిఘా నుంచి పరిపాలన వరకు అన్ని విభాగాల అధికారులు పాల్గొని వివిధ అంశాల్ని చర్చిస్తుంటారు. ఇందులో ఈ కేసును ఓ స్టడీగా చూపించి దేశ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి లోపాలు గుర్తించడంతో పాటు వాటిని సరిచేయడానికి మార్గాలు అన్వే షించాల్సిందిగా అన్ని విభాగాలను కేంద్రం కోరనున్నట్లు సమాచారం. సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా? ధర్మారం (పెద్దపల్లి): నకిలీ వేలిముద్రల తయారీ పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. అక్రమ సంపాదన కోసం ఆధార్‌కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్‌కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించింది. అతి సామాన్యుడిగా కనిపించే సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా అని ధర్మారం వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సిమ్‌కార్డుల టార్గెట్ చేరేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల నివ్వెరపోతున్నారు. కాగా.. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో సంతోష్ వివాదాస్పదంగా వ్యవహరించేవాడని మిత్రులు అంటున్నారు. -
వేలికి ‘నకిలి’ ముద్ర!
శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి వేలిముద్రలు.. ప్రపంచంలో ఏ ఇద్దరివీ సరిపోలవు.. కానీ ఓ టెలికం సంస్థ డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రం మీ వేలిముద్రలు ఉంటాయి. మీ ఆధార్ నంబరు, పేరు, చిరునామా అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడూ ఈ–కేవైసీ యంత్రంలో మీ వేలిముద్ర పడుతూ మీ పేరిట సిమ్‌కార్డులు జారీ అయిపోతుంటాయి. చదువును మధ్యలోనే ఆపేసిన సంతోష్‌కుమార్ అనే యువకుడు.. ఇంటర్నెట్ సాయంతో నకిలీ వేలిముద్రల తయారీని నేర్చుకుని, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని ఓ లోపాన్ని ఆసరాగా తీసుకుని వేలాది మందికి చెందిన నకిలీ వేలిముద్రలను తయారుచేశాడు. ఆ వేలిముద్రలను ఆధార్ డేటాబేస్ నుంచి కేవైసీ అప్రూవల్ పొందడానికి వినియోగించి.. వేల సంఖ్యలో కొత్త సిమ్‌కార్డులను యాక్టివేషన్ చేశాడు. దీనిపై ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ సహా కేంద్ర నిఘా అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనివెనుక ఉగ్రవాదులు, మావోయిస్టుల కోణం ఉందేమోనని సందేహించారు. కానీ లోతుగా పరిశీలించాక.. కేవలం సిమ్‌కార్డుల ‘టార్గెట్’పూర్తి చేసుకోవడానికి సంతోష్ ఈ పనిచేసినట్టు తెలుసుకుని నివ్వెరపోయారు. సంతోష్ అనుసరించిన విధానం ఏ ఉగ్రవాదుల చేతుల్లోనో, మావోయిస్టుల చేతుల్లోనో పడితే.. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారేదని ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ లోని ‘ఆధార్’కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు గత బుధవారం కేసు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు సంతోష్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు. తన వివరాలు గోప్యంగా ఉంచాల్సిందిగా కోరిన ఢిల్లీలో పనిచేసే యూఐడీఏఐ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’కి పూర్తి వివరాలు వెల్లడించారు. సిమ్‌కార్డుల టార్గెట్ పూర్తి కోసం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన పాత సంతోష్‌కుమార్ బీఎస్సీ చదువు మధ్యలోనే మానేశాడు. ధర్మారం బస్టాండ్ సమీపంలో ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ పేరుతో దుకాణం ఏర్పాటు చేసి వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రూ.51 టాక్‌టైమ్‌తో ఉచితంగా ఇచ్చే ఈ సిమ్‌కార్డులను నెలకు కనీసం 600 విక్రయిస్తే.. ఒక్కో కనెక్షన్‌కు రూ.15 చొప్పున కమీషన్ ఇస్తామన్నది కంపెనీ పెట్టిన టార్గెట్. ఈ టార్గెట్ పూర్తికాకపోతే కమీషన్ చాలా తక్కువగా వస్తుంది. దాంతో సంతోష్ కొన్నాళ్ల పాటు కాలేజీలు, పాఠశాలల వద్ద స్టాల్ ఏర్పాటు చేసి.. తానే రూ.5 ఎదురిస్తూ సిమ్‌కార్డులు విక్రయించాడు. మొత్తంగా టార్గెట్ పూర్తి చేసి కమీషన్ పొందేవాడు. ఉచితంగా రూ.50కిపైగా టాక్‌టైమ్ వస్తుండటంతో విద్యార్థులు తరచూ సిమ్‌కార్డులు తీసుకుంటుండేవారు. కానీ ఒక్కొక్కరి పేరిట గరిష్టంగా తొమ్మిది సిమ్‌కార్డులు మాత్రమే తీసుకునేలా.. కచ్చితంగా ఆధార్, ఈ–కేవైసీ యంత్రంలో వేలిముద్ర నమోదు తర్వాతే సిమ్ యాక్టివేషన్ జరిగేలా కొంతకాలం కింద నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల సిమ్ విక్రయాల టార్గెట్ పూర్తిగాక కమీషన్ రావడం ఆగిపోయింది. దీంతో సంతోష్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. వివరాలన్నీ ఒకే చోట దొరకడంతో.. ఎవరో ఒకరి పేరు మీద సిమ్‌కార్డులు యాక్టివేట్ చేయడం ద్వారా టార్గెట్ పూర్తి చేసుకోవాలని సంతోష్ భావించాడు. సాధారణంగా ఓ సిమ్‌కార్డు యాక్టివేట్ కావాలంటే.. వినియోగదారు పూర్తి పేరు, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయడంతోపాటు ఈ–కేవైసీ తనిఖీ పరికరంలో ఆ వ్యక్తి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఎక్కడ దొరుకుతాయనే దానిపై అధ్యయనం చేసిన సంతోష్.. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ఈ మూడు వివరాలను డాక్యుమెంట్లో పొందుపరుస్తారని గుర్తించాడు. అంతేకాదు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ లో డాక్యుమెంట్ నంబర్, పలు వివరాలు నమోదు చేస్తే.. రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలుసుకున్నాడు. సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేటాయించే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నంబర్ల సిరీస్‌ను పరిశీలించాడు. వాటి తరహాలో కొన్ని నంబర్లను వెబ్సైట్లో నమోదు చేస్తూ వెళ్లగా.. ఓ డాక్యుమెంట్ డౌన్లోడ్ అయింది. దాంతో ఆ సిరీస్‌లో తర్వాతి నంబర్లను నమోదు చేస్తూ.. వరుసగా డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేశాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది స్థిరాస్తుల యజమానుల ఆధార్, పేరు, చిరునామా, వేలిముద్రలు వంటి పూర్తి వివరాలను సమకూర్చుకున్నాడు. ఇంటర్నెట్లో ‘వేలిముద్రల’తయారీ నేర్చుకుని.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల చివరి పేజీలో ఆ స్థిరాస్తిని విక్రయించిన, కొనుగోలు చేసిన వారి వేలిముద్రలు ఉంటాయి. ఇలా పేపర్ మీద ఉన్న వేలిముద్రలను.. తిరిగి ఎక్కడైనా వేయగలిగేలా ఎలా తయారు చేయాలన్న దానిపై ఇంటర్నెట్లో వెతికాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని వినియోగించి వేలిముద్రలు తయారు చేసే విధానం నేర్చుకున్నాడు. కాగితంపై ముద్రించి ఉన్న లోగోలు, డిజైన్లను స్టాంపుగా మార్చడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. లోగోనుగానీ, డిజైన్నుగానీ కాంతి కిరణాలతో స్కాన్ చేసే ఆ యంత్రం.. అదే లోగో/డిజైన్‌ను రబ్బరుపై ఏర్పరుస్తుంది. అలాంటి ఓ యంత్రాన్ని కొనుక్కొచ్చి తన ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ దుకాణంలో ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యంత్రంలో లోగోను, డిజైన్‌ను పెట్టాల్సిన చోట.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోని వేలిముద్రల కాగితాన్ని పెట్టాడు. దాంతో ఆ యంత్రం వేలిముద్రను స్కాన్ చేసి.. రబ్బరుపై అదే ఆకృతిని ఏర్పాటు చేసింది. అయితే సంతోష్ ఈ–కేవైసీ యంత్రంలో ముద్ర వేయడానికి వీలుగా రబ్బరుకు బదులుగా.. ప్రత్యేకమైన మెత్తటి ప్లాస్టిక్ పాలిమర్‌ను వినియోగించాడు. ఈ–కేవైసీ యంత్రంపై ఈ పాలిమర్ ముద్రను పెట్టినప్పుడు.. నేరుగా వేలిముద్ర వేసిన తరహాలో పనిచేసింది. ఇలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సహాయంతో పెద్ద సంఖ్యలో నకిలీ వేలిముద్రలను తయారు చేసిన సంతోష్.. ఈ–కేవైసీ యంత్రంలో సదరు ఆధార్ వివరాలు, ఇతర వివరాలు నమోదు చేసి, వేలిముద్రను పెట్టి.. సిమ్‌కార్డులను యాక్టివేషన్ చేశాడు. తర్వాత ఆ సిమ్‌కార్డులను ధ్వంసం చేసేసినా.. కొత్త కనెక్షన్ల టార్గెట్ మాత్రం పూర్తయి, సిమ్ విక్రయాల కమీషన్ అందింది. ఉలిక్కిపడిన యూఐడీఏఐ సంతోష్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ నుంచి ఒక్కోసారి ఒక్కో ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసి, నకిలీ వేలిముద్రలు తయారు చేసి.. సిమ్‌కార్డులను యాక్టివేట్ చేశాడు. ఇలా దాదాపు నెల రోజుల్లో ఆరు వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశాడు. అయితే ఒకే ఈ–కేవైసీ యంత్రం నుంచి భారీగా సిమ్‌కార్డుల కోసం ఆధార్ అప్రూవల్స్ పొందిన విషయాన్ని గుర్తించిన యూఐడీఏఐ విజిలెన్స్ విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు, మావోయిస్టులతోపాటు అసాంఘిక శక్తులకు అక్కడి నుంచి సిమ్‌కార్డులు చేరుతున్నాయని సందేహించి.. కేంద్ర నిఘా వర్గాల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన నిఘా అధికారులు, 18 ప్రభుత్వ విభాగాల అధికారులు.. సంతోష్‌కుమార్‌ను విచారించారు. సిమ్‌కార్డుల యాక్టివేషన్ టార్గెట్ పూర్తి చేసుకోవడం కోసం సంతోష్ చేసిన పని.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రల సేకరణ, రబ్బరు స్టాంపుల యంత్రంతో నకిలీ వేలిముద్రల తయారీ, ఇందుకోసం ఇంటర్నెట్ను వినియోగించుకున్న తీరు వంటివి తెలుసుకుని అవాక్కయ్యారు. జాతీయ స్థాయిలో ‘అలర్ట్’! వేలిముద్రల ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్ విధానాన్ని భద్రమైన మార్గంగా పరిగణిస్తూ మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దానిని వినియోగిస్తున్నాయి. మన దేశంలోనైతే ‘ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య)’కు కూడా వేలిముద్రనే ప్రధాన ఆధారంగా ఉంది. ఈ నేపథ్యంలో సంతోష్ చెప్పిన వివరాలను విన్న అధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ వేలిముద్రల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశముందని.. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు తస్కరించడం వంటి ఆర్థిక నేరాల నుంచి ఓ వ్యక్తి ప్రమేయం లేకుండా అతడిని నేరాల్లో ఇరికించడం వంటి క్రిమినల్ నేరాలకూ దారితీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో ప్రతి మూడు నెలలకోసారి ‘మల్టీ ఏజెన్సీస్ కమిటీ’పేరుతో పిలిచే మ్యాక్ సమావేశం జరుగుతుంది. అందులో నిఘా నుంచి పరిపాలన వరకు అన్ని విభాగాల అధికారులు పాల్గొని వివిధ అంశాల్ని చర్చిస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సంతోష్ వ్యవహారం నేపథ్యంలో.. వారం రోజుల్లో మ్యాక్ సమావేశం ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ నిర్ణయించింది. అందులో ఈ కేసును చర్చించి.. దేశవ్యాప్తంగా ఇలాంటి లోపాలు గుర్తించాలని, ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని యూఐడీఏఐ కోరనుంది. ఆయా లోపాలను పరిష్కరించేలా సూచనలు చేయనుంది. -
ఠాణా నుంచి ఇంటర్‌పోల్ దాకా..
సాక్షి, హైదరాబాద్: రాజధాని కమిషనరేట్ పరిధిలో ప్రతీక్షణం రద్దీగా ఉంటే ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ హత్య జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీం ఫింగర్ ప్రింట్ సేకరించారు. అనుమానిత వేలిముద్రలను ఫింగర్ ప్రింట్‌బ్యూరో, ఫ్యాక్ట్ (ఫింగర్ ప్రింట్ అనాలసిస్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్) ఆన్లైన్లో ప్రవేశపెట్టారు. అతికొద్ది నిమిషాల్లోనే నిందితుడిని గుర్తించారు. నిందితుడు పాత నేరస్తుడు ఎంజే నాగరాజుగా తేలింది. దీంతో అతడి కోసం వేట సాగించిన పోలీసులు 24 గంటల్లోనే నేరస్థుడిని కటకటాల్లోకి పంపించారు. రెండేళ్ల క్రితం వరకు కేవలం రాష్ట్రానికి చెందిన నిందితుల వేలిముద్రల డాటా మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ పోలీస్‌స్టేషన్ నుంచి ఇంటర్‌పోల్‌లో ఉన్న నిందితుల జాబితా వరకు ఆన్లైన్ డేటా బేస్ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటగా రాష్ట్ర పోలీస్ శాఖ... టెక్నాలజీని వినియోగించి నేరాల నియంత్రణకు విశేషంగా ప్రయత్నిస్తున్న పోలీస్ శాఖ.. కేసుల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు కోసం వేలిముద్రల డేటాబేస్‌ను ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌తో అనుసంధానించింది. దేశంలోనే తొలి రాష్ట్రంగా ఫింగర్ ప్రింట్స్ డేటాను ఆన్లైన్లో అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉండేలా సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్)తో సైతం అనుసంధానించింది. ఇలా 9 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 1.22 లక్షల నేరస్తుల వేలిముద్రలను డేటాబేస్‌లో పెట్టి 868 పెండింగ్ కేసులను ఛేదించింది. అలాగే రూ.7.2కోట్ల సొత్తును స్వాధీనం చేసుకుంది. 42 గుర్తు తెలియని మృతదేహాలను సైతం గుర్తించింది. ఆటోమేటెడ్ ఫింగర్ ఫ్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను పెట్రోలింగ్ సిబ్బందికి మొబైల్యాప్ ద్వారా అందించింది. దీంతో క్షణాల్లో ఘటన స్థలి నుంచే నిందితుడు పాత నేరస్తుడా? లేకా కొత్తగా నేరం చేశాడా? అన్నది తేలిపోతుంది. ఇంటర్‌పోల్ జాబితా సైతం... కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్‌లో ఓ వ్యక్తి హత్య జరిగింది. నిందితుడు దేశం దాటి పారిపోయినట్లు అక్కడి పోలీసులు ఇంటర్‌పోల్‌కు సమాచారమిచ్చారు. ఇంటర్‌పోల్ నుంచి మన సీబీఐకి సమాచారం అందింది. నిందితుడి అనుమానిత వేలిముద్రలను సీబీఐ–ఎన్సీఆర్బీ ఫ్యాక్ట్‌లోని వేలిముద్రలతో సరిపోల్చి పంజాబ్‌కు చెందిన ఏపీ సింగ్‌గా గుర్తించారు. ఇలా విదేశాల్లో, మన దేశంలో జరిగిన హత్య కేసుల దర్యాప్తులో ఇప్పుడు ఫ్యాక్ట్ ఫింగర్ ప్రింట్ కీలకంగా మారింది. ఇంటర్‌పోల్‌కు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ డేటాను సైతం మన దేశంలోని ఏ స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచైనా దర్యాప్తు అధికారులు అనాలిసిస్ చేసుకునే వెసులుబాటు దొరికింది. దేశవ్యాప్తంగా 11.68లక్షలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు సేకరించిన వేలిముద్రల డేటా ఫ్యాక్ట్‌లో అందుబాటులో ఉంది. ఇలా ఈ ఏడాది మే చివరి వరకు 11,68,775 ఫింగర్ ప్రింట్స్ డేటా బేస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇంటర్‌పోల్ నుంచి మన డేటాబేస్ అనాలిసిస్ కోసం 15,718 ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. ప్రతీ నెలా దేశవ్యాప్తంగా 7,162 వేలిముద్రలు ఫ్యాక్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఆన్లైన్ డేటాబేస్కు వస్తున్నట్లు సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో తెలిపింది. -
సాంకేతికతతో ఆధారాలు పదిలం
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు సేకరించడమే కాకుండా టెక్నాలజీ వినియోగంతో నిందితులను కటకటాల్లోకి పంపడం ఇప్పుడు సులభతరమైందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీ పెరిగి ఆన్లైన్లోనే క్షణాల్లో విశ్లేషణ చేసి నిందితులను పట్టుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెండ్రోజులుగా జరుగుతున్న 19వ జాతీయ స్థాయి ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సదస్సు ముగింపులో నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫింగర్‌ప్రింట్స్ బ్యూరో సమావేశాలు హైదరాబాద్‌లో జరగడం సంతోషకరమని, రాష్ట్ర పోలీస్ ఫింగర్ ప్రింట్స్ డేటా మేనేజ్మెంట్, ఆటోమేషన్‌లో ది బెస్ట్ అని కితాబిచ్చారు. వచ్చే ఏడాది సదస్సుకల్లా తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో పూర్తి స్థాయి సిబ్బంది, అధికారులతో మరింత పటిష్టంగా మారుతుందని ఆకాంక్షించారు. ఫింగర్ ప్రింట్స్ బ్యూరో నిర్వహించిన పలు పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించిన తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ అధికారిణి స్వర్ణలతకు ఆయన అవార్డు అందజేశారు. అన్ని విభాగాలు అందిపుచ్చుకోవాలి.. ఫింగర్ ప్రింట్ విభాగంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. గతంలో ఆధారాల సేకరణ, విశ్లేషణ, ఫలితాల కోసం నెలల కొద్దీ సమయం పట్టేదని, ఇప్పుడలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. బ్రిటన్‌లాంటి దేశాల్లో ప్రతీ పోలీస్ స్టేషన్లో ఫింగర్ ప్రింట్ విభాగం అందుబాటులో ఉంటుందని, అలాగే రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నేరస్తుల ముఖం, పేర్లు మారినా వారి వేలిముద్రలు మాత్రం మారవని, అవే అత్యంత కీలకమైన ఆధారాలు అని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది అన్నారు. భవిష్యత్తులో కార్లను కూడా వేలిముద్రలతో అన్‌లాక్, స్టార్ట్ చేసే టెక్నాలజీ కూడా రాబోతోందని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారినీ.. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని కూడా ఫింగర్ ప్రింట్ ద్వారా గుర్తించేందుకు టెక్నాలజీ తీసుకొస్తున్నామని ఎన్సీఆర్బీ డైరెక్టర్ ఈష్‌కుమార్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఫింగర్ ప్రింట్ విభాగం ఏర్పాటు, వాటి పురోగతికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు 92 శాతం పోలీస్ స్టేషన్లు అనుసంధానమయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే అనుసంధానం చేసి డేటాను షేర్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్, ఎన్సీఆర్బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్‌మాతుర్ తదితరులు పాల్గొన్నారు. -
నలుగురి వేలిముద్రలు లభ్యం
బొబ్బిలి : పట్టణంలోని స్వామివారి వీధిలో మంగళవారం రాత్రి జరిగిన చోరీ ప్రయత్నం సంఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలుగు ఇళ్లల్లో వేలిముద్రలు సేకరించారు. సేకరించిన వేలిముద్రల్లో సొంతింటి వారివి తొలగించగా మరో నలుగురి వేలిముద్రలు లభించాయి. వీటిని పాత నేరస్తుల వేలిముద్రలతో సరిపోలుస్తున్నారు. గతంలో దావాల వీధిలో ఒకేసారి నాలుగు ఇళ్లల్లో చోరీ జరిగి రూ.లక్షా 50 వేల నగదు, బంగారం చోరీ జరిగింది. ఈ సారి కూడా నాలుగిళ్లలోనే ఒకేసారి చోరీ ప్రయత్నం జరిగినా ధన నష్టం జరగలేదు. ఇదిలా ఉంటే సీఐ దాడి మోహనరావు ఆధ్వర్యంలో ఎస్సై బి. రవీంద్రరాజు కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఎస్సై రవీంద్రరాజు విలేకరులకు తెలిపారు. -
ఏడి‘పింఛెన్’
వై.రామవరం (రంపచోడవరం): దట్టమైన అటవీప్రాంతం.. మారుమూల గ్రామాలు.. కమ్యూనికేషన్ చాలా కష్టం.. ఫోన్లు పనిచేయవు. వెళ్లే దార్లు బాగోవు.. విద్యుత్‌సరఫరా అంతంతమాత్రమే. అటువంటి ప్రాంతంలో ఎందరో పింఛనులబ్ధిదారులు.. వారికి నెలనెలా పింఛను ఇవ్వడం నిజంగా కత్తిమీద సామే. వై.రామవరం మండలంతోపాటు తూర్పు, సరిహద్దు ప్రాంతమైన విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వేలిముద్రలు పడక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నెలనెలా పింఛన్లు రద్దయ్యి, లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతోంది. సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా లోతట్టు ఏజెన్సీ ప్రాంతంలో అయితే అధికార యంత్రాంగం బహుదూరంలో ఉండడం వల్ల సగానికిపైగా పింఛన్లు రద్దయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. వై.రామవరం మండలంలో.. మండలంలో ఆరు నెలల క్రితం సుమారు 3100 మంది పింఛన్లు అందుకునేవారు. వరుసగా మూడేసి నెలలు పింఛన్లు సక్రమంగా తీసుకోకపోవడంతో అవి రద్దయ్యి ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 2806కు చేరింది. మండల ఎగువ ప్రాంతంలో పాతకోట, కానివాడ, బొడ్డగండి, చింతలపూడి, దారగడ్డ, గుర్తేడు, పంచాయతీల పరిధిలో సుమారు వంద గ్రామాలున్నాయి. ఎక్కువ శాతం దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలపై ఉన్నాయి. అక్కడ కమ్యూనికేషన్ ఉండదు. మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు లేవు. ట్యాబ్‌లు పనిచేయవు. విద్యుత్ సరఫరా లేక చార్జింగ్ పడిపోయి, మరోపక్క వ్యవసాయ పనులు చేసుకునే గిరిజనుల వేళ్లు అరిగిపోయి వేలి ముద్రలు పడక ప్రతినెలా సక్రమంగా పింఛన్లు అందడం లేదు. ఎంపీడీఓ కె.బాపన్న దొర స్వయంగా వాహనాలు పెట్టుకుని పింఛన్ల పంపిణీ సిబ్బందిని ఆయా గ్రామాలకు తీసుకువెళ్లినా ఫలితం లేదన్న ఆరోపణలున్నాయి. ట్యాబ్‌లు అక్కడ పనిచేయక ఆయా పంచాయతీల్లోని లబ్ధిదారులు రానుపోను సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం మారేడుమిల్లి రావల్సిన దుస్థితి నెలకొంది. ట్యాబ్‌లు మొరాయిస్తుండడంతో అధికారులు కూడా తిరిగిన గ్రామాలకే పదిసార్లు తిరగాల్సి వస్తోంది. ప్రతి నెలా ఐదోతేదీలోపు నూటికి నూరు శాతం పింఛన్లు పంపిణీ కావలసి ఉండగా ఈ నెల తొమ్మిదో తేదీ వచ్చినా మండలంలో ఇంత వరకు 1345 పింఛన్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. 50 శాతం కూడా పూర్తికాకపోవడం దురదృష్టకరం. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసినా ప్రయోజనం శూన్యం. పాత పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేయాలి ఏజెన్సీ ప్రాంతంలో ఆన్లైన్ విధానానికి స్వస్తి పలికి పాతపద్ధతిలోనే సిబ్బంది ద్వారా లబ్ధిదారుడి చేతికి పింఛను సొమ్ము అందించాలని మండల ఎగువప్రాంత లబ్ధిదారులు కోరుతున్నారు. శనివారం పింఛన్ల కోసం మారేడుమిల్లి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన లబ్ధిదారులు వేలి ముద్రలు పడక నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంపిణీ అధికారులు, సిబ్బందిని నిలదీశారు. ఏజన్సీ ప్రాంతంలో సక్రమంగా పింఛన్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. -
వేలి ముద్రలతో దొంగల పట్టివేత
ఖమ్మంక్రైం : వేలి ముద్రలు.. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పట్టించాయి. తొమ్మిదిన్నర లక్షల రూపాయల విలువైన 28 తులాల బంగారాన్ని స్వాధీనపర్చుకున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించిన వివరాలు... గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన పెండ్ర పెద్ద వెంకటేశ్వర్లు కూలి పని చేస్తూనే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఇతనిపై 30 చోరీ కేసులు, ఒక హత్య కేసు ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఉప్పు తిరుపతిరావు, ఆరు చోరీ కేసుల్లో నిందితుడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నల్లమోతుల సురేష్ అలియాస్ యర్రోడు, 50 చోరీ కేసులలో నిందితుడు. వీరు ముగ్గురూ జైలులో స్నేహితులుగా మారారు. బయటకు వచ్చిన తరువాత ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం రూరల్, ఖమ్మం, వైరా సబ్ డివిజన్లలో దొంగతనాలు చేయసాగారు. వీరు మొదట రెక్కీ చేసిన తరువాత చోరీలు చేస్తుంటారు. పట్టపగలు చోరీలు చేయడంలో వీరు దిట్ట. ఖమ్మం రూరల్, వైరా, ముదిగొండ, ఖానాపురం హవేలి, ఖమ్మంటూటౌన్, కామేపల్లి, ఏన్కూరు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశారు. ఇలా చిక్కారు.. వరుస చోరీలకు పాల్పడుతున్న వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా చిక్కడం లేదు. ఖమ్మం అడిషనల్ డీసీపీ కొల్లు సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో సీసీఎస్ ఏసీపీ ఈశ్వరయ్య, సీఐ కరుణాకర్.. వీరు చేస్తున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఫింగర్ ప్రింట్ విధానంపై అత్యాధునిక టెక్నాలజీని ఇటీవల తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించింది. దాని ద్వారా ఈ దొంగల వివరాలు బయటపడ్డాయి. దీంతో ఇక్కడి నుంచి సీసీఎస్ ప్రత్యేక బృందం విజయవాడకు వెళ్లింది. అక్కడ ఈ దొంగల ఆచూకీ దొరకలేదు. వారి స్వగ్రామాలలో సైతం పోలీసులు వెతికారు. అనంతరం, వీరిని ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ చేసిన 28 తులాల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ తొమ్మిదిన్నర లక్షల రూపాయలు. వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దొంగల భరతం పట్టిన అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్, ఏసీపీ ఈశ్వరయ్య, సీసీఎస్ సీఐ కరుణాకర్ బృందాన్ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో ఖమ్మం ఏసీపీ వెంకట్రావు, సీసీఎస్ ఎస్సై ఆనందరావు, సిబ్బంది లింగయ్య, డానియెల్, శ్రీను, రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
కొత్త టెక్నాలజీతో వివో తొలి స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఈ డివైస్‌ను లాంచ్ చేస్తోంది. ఎక్స్21 యూడి పేరుతో మే 29న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు లాంచింగ్ ఆహ్వానాలను వివో పంపించింది. దీని ధరను రూ .40,000గా నిర్ణయించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీతో లాంచ్ కానున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని తెలిపాయి. చైనా సహా ఇతర అంతర్జాతీయ మార్కట్లోల ఈ ఫోన్ రెండు వెర్షన్లలో ఎక్స్ 21, ఎక్స్ 21 ప్లస్ యూడీ డివైస్‌లను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఇండియన్ మార్కెట్లో ఏ పేరుతో విడుదల చేయనుందీ స్పష్టత లేదు. ఎక్స్21 యూడి ఫీచర్లు 6.2 అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్ 1080 x 2280 రిజల్యూషన్ (19: 9 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 చిప్సెట్ ) ఆండ్రాయిడ్ ఓరియో 8.1 6జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే సదుపాయం 12+5ఎంపీ రియర్ కెమెరా 12ఎంపీ సెల్ఫ కెమెరా 3200 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ అభివృద్ధిలో తాము మార్గదర్శిగా ఉన్నామని వివో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ ఫెంగ్ చెప్పారు. ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వినియోగదారులకి ఈ ఫ్యూచరిస్టిక్ మొబైల్ అనుభవాన్ని అందించడంలో అడుగు ముందుకు వేశామనీ, చాలా త్వరగా వినియోగదారులకు అందుబాటులోకి రావటానికి చాలా సంతోషిస్తున్నామన్నారు. -
నామినీ ముసుగులో బినామీలు...?
ప్రభుత్వం విసిరిన వలలో బినామీ డీలర్లు చిక్కుకున్నారు... రేషన్ సరుకుల పంపిణీకి డీలర్‌వేలిముద్రను మాత్రమే అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్‌తో బినామీల బండారం బట్టబయలవుతోంది.నెల ప్రారంభమై ఐదురోజులు గడుస్తున్నా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రేషన్ దుకాణాలు తెరుచుకోని పరిస్థితి. సరుకుల కోసం లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు డీలర్ కోసం బినామీ లు పరుగులు పెడుతున్నారు. పౌరసరఫరాలశాఖ మాత్రం సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నంచేస్తోంది. జిల్లాలో బినామీలు ఎవరూ లేరు..సాంకేతిక సమస్యతోనే దుకాణాలు తెరుచుకోలేదని పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తోందనేవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుత్తూరు: ప్రజా పంపిణీ వ్యవస్థలో బినామీల రాజ్యం కుప్పకూలుతోంది. నామినీల ముసుగులో ఇన్నాళ్లుగా దుకాణాలు నడుపుతున్న బినామీలకు కాలం చెల్లినట్లే. ఈ పాస్ విధానం అమలులోకి వచ్చాక సరుకుల పంపిణీలో డీలర్లకు వెసులుబాటు కోసం నామినీల వ్యవస్థను ప్రవేశపెట్టారు. కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఈపాస్ యంత్రంలో డీలర్‌తో పాటు నామినీల వేలిముద్రతో కూడా సరుకులు పంపిణీ చేసేఅవకాశం ఉండేది. బినామీల పరమైన దుకాణాలు... టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ అనుయాయులు రెచ్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా అప్పటి వరకు డీలర్లుగా ఉన్న వారిని నయానో భయానో బెదిరించి దుకాణాలను తమ పరం చేసుకున్నారు. ఈ పాస్ విధానం అమలు, కిరోసిన్, చక్కెర పంపిణీని రేషన్ దుకాణాల్లో నిలిపివేశాక డీలర్లకు వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. దీంతో చాలామంది డీలర్లు వేరొకరిని తమ నామినీలుగా నమోదు చేయించి దుకాణాలను వారికి అప్పగించినట్లు సమాచారం. ఇలా దుకాణాలు నడుపుతున్న బినామీలు చేతివాటానికి తెరతీశారు. రేషన్ బియాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న సంఘటనల్లో బినామీ డీలర్లదే కీలకపాత్రగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇప్పటివరకు డీలర్లకు వెసులుబాటుగా ఉన్న నామినీ వ్యవస్థను ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం రద్దు చేసింది. తప్పనిసరిగా డీలర్ వేలిముద్ర వేస్తేనే సరుకులను పంపిణీ చేసే విధంగా పౌరసరఫరాల శాఖ సర్క్యులర్‌ను జారీ చేసింది. తెరుచుకోని దుకాణాలు... నెల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా జిల్లా వ్యాప్తంగా సుమారు 214 రేషన్ దుకాణాలు తెరుచుకోలేదు. డీలర్ వేలిముద్ర లేకుండా సరుకులు పంపిణీ చేయలేని పరిస్థితి ఉండడంతో దుకాణాలను మూసేసినట్లు సమాచారం. ఇదివరకే వేరే ఊర్లలో స్థిరపడిపోయిన అసలైన డీలర్లు వచ్చే వరకు సరుకుల పంపిణీ నిలిచిపోయినట్లే. దీంతో సరుకుల కోసం నిరుపేదలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క దుకాణం నెలకు రూ.600 వరకు పౌరసరఫరాల శాఖకు ముడుపుల రూపంలో చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారుల కనుసన్నల్లోనే బినామీల వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ దుకాణాల్లో బినామీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటిదేమీ లేదు... రేషన్ దుకాణాల్లో బినామీ డీలర్ల వ్యవహారం మా దృష్టికి రాలేదు. సాంకేతిక సమస్యల కారణంగానే జిల్లాలో కొన్ని దుకాణాలు తెరుచుకోలేదు. సమస్యను సరిదిద్ది, లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందిస్తాం. - చాముండేశ్వరి,జిల్లా పౌరసరఫరాల అధికారి, చిత్తూరు -
విలవిలలాడిన పసిప్రాణం
సాక్షి, హైదరాబాద్: పొరపాటున బ్లేడు కోసుకుంటేనే బాధను తట్టుకోలేం.. అలాంటిది కత్తెరతో వేలినే కత్తిరించినపుడు.. అదీ పది రోజుల పసికందుకు జరిగితే.. ఆ పసిప్రాణం విలవిల్లాడుతుంది.. ఈ లోకంలోకి వచ్చీరాగానే నరకం చూసింది. ఈ సంఘటన సికింద్రాబాద్ మారేడుపల్లిలోని బసంత్ సహాని ఆస్పత్రిలో జరిగింది. పదిరోజుల ఆడశిశువు చిటికెన వేలును నర్సు నిర్లక్ష్యంగా కత్తిరించేసింది. బోయిన్పల్లి సర్వదామనగర్కు చెందిన సూర్యకాంత్, అంబిక భార్యాభర్తల కుమార్తె బాధితురాలిగా మిగిలింది. పుట్టిన కవల పిల్లలు బరువు తక్కువగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం డిచ్చార్జి చేసేందుకు సిద్దమయ్యారు. శిశువుకు చేతికి వేసిన బ్యాండేజ్‌ను తొలగిస్తూ సుమలత అనే నర్సు పాప వేలిని కట్‌చేసింది. చిటికెన వేలు కొంతభాగం ముక్క తెగిపడింది. దీంతో ఒక్కసారిగా బంధువులు ఆందోళనకు గురై ఆస్పత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. దీంతో నర్సు అక్కడి నుంచి పరారైంది. పాప చేతి వేలికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం సాధ్యం కాదని వైద్య నిపుణులు చెప్పారు. -
బడ్జెట్ ధరలో ఇంటెక్స్ ‘ఉదయ్’
సాక్షి, ముంబై: దేశీయ మొబైల్ తయారీదారు ఇంటెక్స్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫీచర్‌తో ‘ఉదయ్’ అనే ఈ సరికొత్త డివైస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 7,999 రూపాయల బడ్జెట్ ధరలో దీన్ని కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను విక్రయించేందుకు వివిధ రిటైల్ అవులెలెట్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్టు ఇంటెక్స్ ప్రకటించింది. అంతేకాదు రిలయన్స్ జియో ద్వారా 2,200 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ప్రస్తుత, కొత్త జియో కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. రూ.198 లేదా రూ.299 ప్లాన్ల రీచార్జ్ (44) లపై 50 రూపాయల విలువైన 44 క్యాష్‌బ్యాక్ వోచర్లను మై జియో యాప్ ద్వారా పొందవచ్చు. ఇంటెక్స్ ఉదయ్ ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ స్క్రీన్ 1280 × 720 పిక్సల్ రిజుల్యూషన్ ఆండ్రాయిడ్ 7 ఆపరేటింగ్ సిస్టం 1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఆటోఫోకస్ అండ్ ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 2800 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెండు చేతి వేళ్లతోనే పది పరీక్ష రాసిన విద్యార్థి
చిట్టమూరు: మండల పరిధిలోని ఈశ్వరవాక గ్రామ ఉన్నత పాఠశాల్లో పది విద్యార్థి రెండు చేతి వేళ్లతోనే పది పరీక్షలు రాశాడు. గ్రామానికి చెందిన కూర పాటి మునిరత్నం, రాజమ్మల కుమారుడు కూరపాటి నాగ మురళీ కొత్తగుంట గ్రామంలోని టీఎమ్మార్ స్కూల్లో పది పరీక్షలు రాశా డు. పుట్టుకతోనే వికలాంగుడైన మురళీకి ఒక్కో చేతికి ఒక్క వేలు మాత్రమే ఉంది. దీంతో పెన్ను పట్టుకుని పరీక్ష రాయాలంటే చాలా కష్టం. తన పని తాను చేసుకోలేని మురళీ చదవాలనే తపనతో కష్టమైనా బడికి వెలుతూ పరీక్షలకు హాజరయ్యాడు. తాను కష్టపడి చదివి కలెక్టర్ కావాలని సంకల్పంతో ఉన్నానని చెప్పాడు. పది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానని , చదువు విషయంలో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తనకు సహా య సహకారాలు అందించారన్నాడు. నాగ మురళీ సాహసం చూసి ఉపాధ్యాయులు మెచ్చుకున్నారు. -
‘బయో’బాధలు..!
సాక్షి, యాదాద్రి : రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం జనవరి 1 నుంచి ఈ పాస్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా సరుకులు తీసుకోవాలంటే బయోమెట్రిక్ యంత్రాల్లో లబ్ధిదారుల వేలిముద్రలను తప్పనిసరి చేసింది. అయితే వయస్సు మళ్లిన వృద్ధులు, రక్తహీనత రోగులు, కష్టజీవులు, రోజువారి కూలీలు చేతి వేళ్ల రేఖలు కనిపించపోవడంతో వారి వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రాల్లో పడడం లేదు. జిల్లాలో ప్రతి నెలా వేలాది యూనిట్లకు ఇలాంటి సమస్య తలెత్తుతోంది. ఫలితంగా లబ్ధిదారులకు నెలనెలా ఇవ్వాల్సిన బియ్యం కోటా అందడం లేదు. వీటికి తోడు సాంకేతిక సమస్యలు, సిగ్నల్స్ అందకపోవడం కూడా వేలిముద్రలు పడకపోవడానికి కారణమవుతున్నాయి. శాపంగా మారిన ఒక్క శాతం నిబంధనఅక్రమాల నివారణ కోసం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. వేలి ముద్రలు పడని వారికి వీఆర్వోల ధ్రువీకరణ ద్వారా బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే ప్రతి రేషన్ దుకాణంలో ఒక్క శాతం మేరకే వీటిని ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నాయి. దీంతో ప్రతి రేషన్ దుకాణంలో పదుల సంఖ్యలో వేలిముద్రలు పడని వారు ఉంటున్నప్పటికీ అందరికీ బియ్యం అందడం లేదు. వారందరికీ రేషన్ ఇవ్వడం డీలర్లకు ఇబ్బందిగా మారింది. తమకు బియ్యం ఇప్పించాలని లబ్ధిదారులు రేషన్ దుకాణం, గ్రామంలోని వీఆర్వో, మండలంలోని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు పెట్టుకుంటున్నా వారికి న్యాయం జరగడం లేదు. భువనగిరిలో 823 మంది భువనగిరి పట్టణం, మండల పరిధిలో 36 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటిలోని 712 మంది లబ్ధిదారుల వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రాల్లో పడడం లేదు. వేలిముద్రలు పడనివారికి ఒక్క శాతం రేషన్ ఇవ్వాలన్న నిబంధన ప్రకారం కేవలం 192మందికి మాత్రమే బియ్యం అందుతున్నాయి. మిగతా 520 మందికి బియ్యం నెలనెలా అందడం లేదు. ఈపరిస్థితి జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఉంది. అర్హులందరికీ బియ్యం ఇవ్వాలి వేలిముద్రలు పడనివారందరికీ నెలనెలా రేషన్ బియ్యం ఇవ్వాలి. ఒక్క శాతం నిబంధనతో పేదలందరికీ బియ్యం అందడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూడాలి. –చల్లగురుగుల రఘుబాబు, మైఫ్రెండ్ సోషల్ ఆర్గనైషన్ అధ్యక్షుడు ఆధార్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి వేలిముద్రలు రానివారు తమ ఆధార్‌కార్డును ఆధార్ సెంటర్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. వేలిముద్రలను కూడా ఆన్లైన్ చేసుకోవాలి. వేలిముద్రలు రాని వారికి వీఆర్వో ద్వారా బియ్యం, సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రేషన్‌షాపుకు వీఆర్వోలను కేటాయించాం. –కొప్పుల వెంకట్‌రెడ్డి, భువనగిరి తహసీల్దార్ -
ఆకర్షిస్తున్న యువరాణి చేతి వేళ్లు.. వైరల్
లండన్ : ఇంటర్నెట్లో ఇప్పుడు ఓ అంశంపై తెగ చర్చ నడుస్తోంది. బ్రిటన్ టాబ్లాయిడ్లలో, వెబ్ సైట్లలో ఆ అంశంపై మోతమోగిపోతోంది. ఇక డెయిలీ మెయిల్ అయితే ఏకంగా తన ముఖ పేజీలో ఒక స్టోరీనే ప్రచురించింది. ఇంతకీ ఏమిటా అంశం అంటే బ్రిటన్ ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ చేతివేళ్లు. 'ఎందుకు కేట్ వేళ్లు సమానంగా ఉన్నాయి?' అనే హెడ్డింగ్‌తో డెయిలీ మెయిల్ పెద్ద కథనం వెలువరించింది. అంతేకాదు ఆమె చేతి వేళ్లను కూడా బాగా దగ్గరిగా చేసి ఛాయాచిత్రంగా ప్రచురించింది. అసలేం జరిగింది? గత వారం ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు తల్లి అయి ప్రస్తుతం గర్భవతిగా ఉన్న బ్రిటన్ యువరాణి కేట్ ఆక్స్‌ఫర్డ్‌లోని పిగాసస్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఓ చారిటీ సంస్థ పనితీరును అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లారు. సాధారణంగానే ఆమెను ఫొటోలు ఎప్పటి మాదిరిగానే తీశారు. అయితే, ఆ ఫొటోలు పరిశీలించిన వారు ఆమె కుడిచేత్తో పర్సును పట్టుకున్న సమయంలో ఆమె చేతి వేళ్లు మూడు సమానంగా కనిపించాయి. ఉంగరపు వేలు కొంచెం చిన్నగా, చూపుడువేలు దానికి కాస్త సమానంగా మధ్య వేలి పొడవుగా అందరికీ ఉంటుంది. అయితే, కేట్కు మాత్రం మూడు వేళ్లు సమానంగా ఉన్నట్లు కనిపించాయి. దాంతో ఇదే అంశంపై పెద్ద మొత్తంలో చర్చ మొదలుపెట్టి పుంఖాను పుంఖాలుగా టాబ్లాయిడ్లలో రాతలు మొదలుపెట్టారు. -
రాతలు మారుస్తున్నవేలి ముద్రలు!
సాక్షి, విశాఖపట్నం: చేతిరేఖలు జీవితాన్ని మారుస్తాయని విన్నాం కానీ .. వేలిముద్రలు పండుటాకుల రాతలు మారు స్తున్నాయంటే కొంత ఆశ్చర్యమే..అయినా అది నిజమే మరి. మునగపాక మండలం చూచుకొండ గ్రామానికి చెందిన దాదాపు 30 మంది వృద్ధులకు, వికలాంగులకు వేలిముద్రలు పడలేదన్న కారణంతో గ్రామ కార్యదర్శి పిం ఛన్లు ఆపేశారు. మూడు నెలలుపాటు పెన్షన్ తీసుకోకపోతే శాశ్వతంగా రద్దు అయిపోతుందని చెప్పడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.జీవిత చరమాంకంలో ఎంతో ఆసరా నిచ్చేపెన్షన్కు దూరమైపోతామన్న ఆందోళన వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిండితిప్పలు మాని సోమవారం తెల్లవారుజామున 4గంటలకు బయల్దేరి విశాఖకు వచ్చారు. గ్రీవెన్స్‌లో తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన వారికి కలెక్టర్ ఇంకా రాలేదని తెలియడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మామూలుగా గ్రామంలో ఒ కరికి లేదా ఇద్దరికి వేలిముద్రలు పడలేదంటే సరే . కానీ ఒకే గ్రామంలో ఏకంగా 30 మందికి పైగా వృద్ధులు, వికలాంగులకు వేలిముద్రలు పడలేదంటే యంత్రంలో లోపమా లేదా యంత్రాంగంలో లోపమా తెలియని దుస్థితి నెలకొంది.ఈ పరిస్థితి ఒక్క మునగ పాకలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. వేలాదిమంది ఇదే సమస్య తో పింఛన్ అందక చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ ప్రతి నెలా రోజుల తరబడ్రిçపదక్షిణలు చేçస్తూ్తనే ఉన్నారు. పాతికవేలమందికి అవస్థ వేలిముద్రలు పడక..ఐరిష్ కాప్చర్ చేయక పోవడంతో పింఛన్ అందకపస్తులతో అలమటిస్తున్నారు. 5వ తేదీలో గానే పింఛన్ పంపిణీ చేసేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప 25వతేదీ వచ్చిన పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది. సాప్ట్వేర్ అప్‌గ్రేడ్ చేసి నాలుగు నెలలు కావస్తున్నా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. వేలిముద్రలు, ఐరిష్ కాప్చర్ సాకుతో ప్రతి నెలా పాతిక వేల మందికి పింఛన్లు అందని దుస్థితి. ప్రతి నెలా 1500 పింఛన్ల్ల కోత ఇక వరుసగా మూడు నెలల పాటు పింఛన్ తీసుకోలేదనే సాకుతో ప్రతి నెలా 500 నుంచి 1500 వరకు పింఛన్లకు మంగళం పాడేసింది. ఇలా గడిచిన ఏడాదిలో ఏకంగా 13,027 పింఛన్లను రద్దు చేశారు. గతేడాది జనవరి నాటికి పెంచిన పింఛన్లతో కలిసి జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,47,449కు చేరాయి. కానీ ఆ తర్వాత ప్రతి నెలా వేలిముద్రలు, సాంకేతిక సమస్యలతో ప్రతి నెలా వెయ్యికి పైగా పింఛన్లకుకోతపడుతూనే ఉంది. ఇలా కోతల మీద కోతలు పడగా ప్రస్తుతం జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,34,422కు చేరాయి. కనీసం ఈ పింఛన్లయినా అందుతున్నాయా అంటే అదీ లేదు. మార్చి నెలలో ఇప్పటి వరకు 2.94లక్షల మందికి మాత్రమే పింఛన్లు అందాయి. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో ఈ నెల 12వ స్థానంలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. రూ.4కోట్లు కొరత ప్రతి నెలా 30వ తేదీకల్లా మండలాలకు పింఛన్ల సంఖ్యను బట్టి అవసరమైన నగదును బట్వాడా చేస్తుంటాం. కానీ ఈ నెల నగదు కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో పింఛన్ల సంఖ్యను బట్టి రూ.37.39కోట్ల నగదు కావాలి కానీ రూ.4కోట్ల వరకు కొరత వచ్చింది. బ్యాంకుల్లో కూడా సొమ్ముల్లేక సర్దుబాటుచేయలేకపోయారు. 30వ తేదీలోగా సర్దుబాటు చేయాల్సిన నగదు 10వతేదీ వచ్చినా సర్దుబాటుచేయలేకపోయారు. సుమారు 12 మండలాలకు కనీసం మూడో వంతు పింఛన్‌దారులకు కూడా సరిపడా డబ్బు లేని పరిస్థితి నెలకొంది. తిండి తిప్పలు లేకుండా వచ్చాం.. నాకు రెండు నెలలుగా వేలిముద్రలు పడలేదని పెన్షన్ ఇవ్వలేదు. మా తహశీల్దారు కార్యాలయంలో విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికే రెండు నెలలు అయ్యింది. మూడు నెలలు దాటితే పూర్తిగా నిలిపివేస్తామని చెప్పడంతో ఇక్కడకు వచ్చాం. తిండి తిప్పలు లేకుండా వచ్చాం.. మళ్లీ సోమవారం రమ్మన్నారు.–పెంటకోట దుర్గాలమ్మ ఆందోళన చెందొద్దు వేలిముద్రలు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. వేలిముద్రలు పడకపోయినా చివరి రోజున కార్యదర్శుల వేలిముద్రలతో ఇవ్వొచ్చని చె ప్పాం. ఈ నెలలో 300 ఐరిష్ మిషీన్లు కొత్తగా కొనుగోలు చేశాం. ఈ నెలలో నగదు కొరత కారణంగా 90 శాతానికి మించి పంపిణీ చేసే అవకాశాలు కన్పించడం లేదు. అందని వారికి 2 నెలలదీ కలిపి ఒకసారి ఇస్తాం. పింఛన్‌దారులు ఆందోళన చెందొద్దు. –సత్యసాయిశ్రీనివాస్, పీడీ, డీఆర్డీఎ -
వేలిముద్ర వేస్తేనే రేషన్
సాక్షి, హైదరాబాద్: ఇక ఆహార భద్రత(రేషన్) కార్డు లబ్ధిదారులు వేలిముద్రలు వేస్తేనే రేషన్ సరుకుల పంపిణీ జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో ఈ–పాస్ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17,031 రేషన్ షాపులు ఉండగా వాటిలో ఈ–పాస్ యంత్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో పూర్తి స్థాయిలో బయోమెట్రిక్‌పైనే సరుకులు పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఛత్తీస్గడ్ తరహాలో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే పోర్టబిలిటీ విధానం ఏప్రిల్ నుంచి అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ–పాస్ విధానంలో సరుకుల పంపిణీ జరుగుతుండటం రేషన్ పోర్టబిలిటీకి కలిసి వచ్చింది. ఈ–పాస్ బయోమెట్రిక్‌లో లబ్ధిదారుల డేటా ఉండటంతో వేలిముద్ర లతో రేషన్ సరుకులు ఎక్కడ నుంచైనా తీసుకునే వెసులుబాటు కలిగింది. -
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.
బీజింగ్: చైనీస్ మొబైల్ తయారీదారు సంస్థ వివో తాజాగా మరో ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. పలు అంచనాల తరువాత చివరకు చైనాలో వివోఎక్స్ 20ప్లస్ యూడీ పేరుతో ఈ డివైస్‌ను లాంచ్ చేసింది. సినాప్టిక్స్ క్లియర్ ఐడీ 9500 అండర్- ఫింగర్ ప్రింట్ సెన్సర్ మోలెడ్ ప్యానెల్ దీని ప్రధాన ఆకర్షణగా కంపెనీ చెబుతోంది. అంతేకాదు ఈ ఫీచర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి (సుమారుగా రూ .36,100) చైనా మార్కెట్లో విక్రయానికి లభ్యం. బ్లాక్ కలర్ విత్గోల్డెన్ ఫ్రేమ్‌తో లాంచ్ చేసింది. అయితే భారత్ సహా ఇతరమార్కెట్లలో ఎపుడు లభ్యమయ్యేది ఇంకా వెల్లడికాలేదు. వివో ఎక్స్ 20 ప్లస్ యూడీ ఫీచర్లు 6.43 అంగుళాల ఫుల్హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే సదుపాయం 12+ 5ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 12 ఎంపి సెల్ఫీ కెమెరా 3900ఎంఏహెచ్ బ్యాటరీని -
కొత్త ఏడాదిలో వచ్చేసిన సోని స్మార్ట్ఫోన్లు
కొత్త ఏడాదిలో సోని రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. లాస్ వేగాస్లోని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎక్స్‌పీరియా ఎక్స్ఏ2, ఎక్స్‌పీరియా ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నట్టు సోని ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు గతేడాది ఎక్స్ఏ1, ఏక్స్ఏ1 ఆల్ట్రాలకు అప్‌గ్రేడెడ్‌గా మార్కెట్లోకి వచ్చాయి. బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్‌ను మెరుగుపరిచి వీటిని లాంచ్ చేసింది. మరో అతిపెద్ద డిజైన్ మార్పులో ఈ స్మార్ట్ఫోన్లకు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చడమే. అంతకముందు ఎక్స్ఏ1 స్మార్ట్ఫోన్లు మీడియోటెక్ ప్రాసెసర్లతో పనిచేయగా.. తాజాగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్లు ఎక్కువ శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్‌తో రూపొందాయి. ఎక్స్ఏ2 స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్‌ను, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండగా.. ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్‌ను, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు తమ స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు. అంతేకాక బ్యాటరీ సామర్థ్యం కూడా అంతకముందు వాటి కంటే ఎక్కువగా ఎక్స్ఏ2 స్మార్ట్‌ఫోన్ 3,300 ఎంఏహెచ్ను, ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 3,580 ఎంఏహెచ్ను కలిగి ఉన్నాయి. ఆల్ట్రా-స్లిమ్ సైడ్ బెజెల్స్‌తో ఇవి రూపొందాయి. ఎక్స్ఏ2 స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లేతో, ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో మార్కెట్లోకి వచ్చాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఎక్స్ఏ2 స్మార్ట్‌ఫోన్‌కు వెనుక వైపు 23ఎంపీ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ కెమెరా, ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ 16 ఎంపీ, 8ఎంపీతో డ్యూయల్ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు 23 ఎంపీ కెమెరాను కలిగి ఉన్నాయి. -
మర్మం ఏదైనా.. మార్గం డీఎన్ఏ..!
ఇటీవల కేరళలో సముద్రంలోకి వెళ్లిన చాలామంది జాలర్లు ఓక్కీ తుపాను తీవ్రతకు మరణించారు. గుర్తింపు పత్రాలేవీ లేకపోవడంతో ఏ మృతదేహం ఎవరిదో తెలుసుకోలేకపోయారు!! ఏం చేయాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పని చేసిన ఎన్.డి.తివారీ గుర్తున్నారా? ఆయన తన తండ్రి అంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసి మరీ గెలిచాడు! ఎలా తెలిసింది? హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఇటీవల చిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక నవజాత శిశువుకు పొరపాటున రెండు ట్యాగులు కట్టేయడంతో బిడ్డ ఎవరికి పుట్టారన్న విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి ఈ కేసు ఎలా తేలింది? ఈ మూడు చిక్కు ప్రశ్నలకు సమాధానం వెతకడం.. ఒకప్పుడైతే చాలా కష్టమయ్యేదేమో గానీ ఇప్పుడు రోజుల వ్యవధిలో పరిష్కారమైపోతాయి. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ మహత్యమే ఇదంతా. మనిషి మాత్రమే కాదు.. భూమ్మీది ప్రాణి కోటిలోని ఈ ప్రత్యేక జన్యు సమాచార నిధిని సక్రమంగా వాడుకుంటే.. అటు నేర సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు, జంతు ప్రపంచాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సాధ్యమవుతుంది. మరి ఈ డీఎన్ఏ అంటే ఏమిటి? వేలిముద్రల కంటే డీఎన్ఏ ఆనవాళ్లు ఎంత ప్రత్యేకం? డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎలా చేస్తారు? అన్న సందేహాలు మీకూ ఉన్నాయా? చదివేయండి మరి! నిచ్చెన ఆకారం.. సకల సమాచారం.. అతి సూక్ష్మ బ్యాక్టీరియా మొదలుకొని ఒకప్పటి రాక్షస బల్లుల వరకూ అన్ని జీవుల్లోని కణాల్లో ఉండే ప్రాథమికమైన విషయం డీఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్.. క్లుప్తంగా డీఎన్ఏ. మనం ఎంత పొడవు పెరగాలి? కళ్ల రంగు ఏంటి? వచ్చే జబ్బులేవి? వంటి అన్ని రకాల సమాచారం దీంట్లోనే ఉంటుంది. మన కణ కేంద్రకాల్లోని మైటోకాండ్రియాలో ఉండే క్రోమోజోమ్‌లలో ఈ డీఎన్ఏ ఉండ చుట్టుకుని ఉంటుంది. అడినైన్, గ్వానైన్, థయమీన్, సైటోసైన్ అనే నాలుగు రసాయనాలతో ఏర్పడే డీఎన్ఏ.. మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుందని 1953లో జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిచ్చెన మెట్లు రెండు రకాలుగా ఉంటాయి. అడినైన్ కేవలం థయమీన్‌తో మాత్రమే జతకట్టి ఒక మెట్టులా ఉంటే.. సైటోసైన్ గ్వానైన్తో మాత్రమే జతకడుతుంది. ఇలాంటి ఒక్కో మెట్టును న్యూక్లియోటైడ్ బేస్ పెయిర్ అంటారు. మానవ డీఎన్ఏలో దాదాపు 300 కోట్ల బేస్ పెయిర్స్ ఉంటాయని అంచనా. ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ ఇదీ రక్తం, స్వేదం, ఎముక, వెంట్రుకలు, శుక్ర కణాలు, కణజాలం ఇలా ఏదైనా జీవ పదార్థాన్ని సేకరించడంతో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నమూనాల ఆధారంగా వాటి కణాల్లోంచి డీఎన్ఏను ప్రత్యేక పద్ధతుల ద్వారా వేరు చేస్తారు. పాలిమరేస్ చైన్ రియాక్షన్ ద్వారా ఈ డీఎన్ఏ పోగుల సంఖ్యను కొన్ని వేల రెట్లు పెంచుతారు. ఈ పోగులన్నింటినీ ఓ ద్రావణంలోకి వేసి విద్యుత్తు ప్రసారం చేస్తారు. దీన్ని జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటారు. డీఎన్ఏ పోగులకు రుణావేశం ఉంటుంది కాబట్టి అవన్నీ ధనావేశమున్న చోట గుమిగూడతాయి. కొన్ని రసాయనాలను వాడటం ద్వారా ఈ పోగులను ప్లాస్టిక్ కాగితంపై కనిపించేలా చేస్తారు. ఇలా రెండు జన్యు క్రమాలను పోల్చినప్పుడు వాటిలో ఎంత మేరకు ఒకేలా ఉందో తెలిసిపోతుంది. ఉపయోగాలేంటి? నేర నిర్ధారణతోపాటు అనేక ఇతర రంగాల్లో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎంతో ఉపయోగకరం. మాతృత్వ, పితృత్వ వివాదాల పరిష్కారానికి, అవశేషాల ఆధారంగా వ్యక్తులు, జంతువులను గుర్తించేందుకూ ఈ పద్ధతిని వాడుతున్నారు. ఆస్పత్రుల్లో నవజాత శిశువుల మార్పిడికి సంబంధించిన వార్తలు వింటూ ఉంటాం.. అలాంటి వివాదాలను పరిష్కరించేందుకు డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మేలైన మార్గం. ప్రతి ఒక్కరిదీ ప్రత్యేకం.. భూమ్మీద 730 కోట్ల మందికిపైగా మనుషులుంటే.. ఇందులో ఏ ఒక్కరి డీఎన్ఏ కూడా ఇంకొకరి మాదిరిగా ఉండదు. అయితే డీఎన్ఏలోని 300 కోట్ల బేస్ పెయిర్స్‌లో 99.7 శాతం అందరికీ సమానమే. మిగిలిన బేస్ పెయిర్స్‌లో ఉండే తేడాలే ఒకొక్కరినీ ప్రత్యేకం చేస్తాయి. ఈ తేడాలు ఎక్కడున్నాయో గుర్తించడం ద్వారా ఇద్దరి డీఎన్ఏను పోల్చవచ్చు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పని చేసేది ఇలాగే. బిడ్డకు తండ్రికి మధ్య ఉండే పోలికలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే.. తోబుట్టువుల మధ్య ఇది 25 శాతం నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. ఒకే పిండం రెండుగా విడిపోయి పుట్టిన కవలల్లో మాత్రమే వంద శాతం పోలిక కనిపిస్తుంది. ఎవరైనా డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవచ్చా? భారత్‌లో ప్రస్తుతానికి ఇది సాధ్యం కాదు. మాతృత్వ, పితృత్వ పరీక్షల కోసం కోర్టు ఆదేశాలు తప్పనిసరి. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్‌తోపాటు తిరువనంతపురంలోని ద రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్జీసీబీ) ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నియంత్రణ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు, ప్రమాదాల్లో మరణించి రూపురేఖలు తెలియని స్థితిలో ఉన్న వారి కి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు అందులో ప్రామాణిక పద్ధతులను నిర్దేశించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జయ వేలిముద్రల వెల్లడికి సుప్రీం నో
న్యూఢిల్లీ: దివంగత మాజీ సీఎం జయలలిత వేలిముద్రల రికార్డులను అందజేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గత ఏడాది నవంబర్‌లో తిరుప్పన్కుండ్రమ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఏఐఏడీఎంకే అభ్యర్థి ఏకే బోస్‌కు జయలలిత వేలి ముద్రలున్న బీఫారం అందజేశారు. ఆ సమయంలో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆ వేలిముద్రలపై అనుమానం వ్యక్తం చేస్తూ డీఎంకే నేత పి.శరవణన్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు జయలలిత వేలిముద్రల రికార్డులను అందజేయాలంటూ బెంగళూరు జైలు అధికారులకు, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమార్జన కేసులో జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో 2014లో కొంతకాలం శిక్ష అను భవించారు. ఆ సమయంలో ఆమె వేలిముద్రలను జైలు అధికారులు సేకరించారు. అయితే, హైకోర్టు ఉత్తర్వులపై ఏకే బోస్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. వేలి ముద్రలు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కు అని, చనిపోయిన తర్వాత కూడా ఇది ఉంటుందని వీటిని వెల్లడించటం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లేనని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే విధించింది. ఇదిలా ఉండగా, జయలలిత వేలిముద్రల రికార్డులను బెంగళూరు జైలు అధికారులు శుక్రవారం మద్రాస్ హైకోర్టుకు సమర్పించారు. -
చనిపోయాకే వేలిముద్రలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫారం కోసం అపోలో ఆస్పత్రిలో అప్పటికే మరణించిన జయలలిత నుంచి వేలిముద్రలు సేకరించారని డీఎంకే వైద్య విభాగ కార్యదర్శి డాక్టర్ శరవణన్ ఆరోపించారు. సంబంధిత ఆధారాలను జయ మరణంపై దర్యాప్తు చేస్తున్న విచారణ కమిషన్‌కు బుధవారం ఆయన అందజేశారు. జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న జయను గత ఏడాది చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించడం తెలిసిందే. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడే తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. పోటీలో నిలిచిన పార్టీ అభ్యర్థులకు ఇచ్చే బీఫారంలపై పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయ సంతకం చేయాల్సి ఉంది. దాంతో అప్పటికే మరణించిన జయ వేలిముద్రలను బీఫారంలపై వేయించారని శరవణన్ కమిషన్ ముందు వాంగ్మూలమిచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు బాలాజీ సమక్షంలోనే జయ స్వయంగా వేలిముద్రలు వేశారని అప్పట్లో అన్నాడీఎంకే వర్గాలు చెప్పాయి. జయ త్వరగా కోలుకుంటున్నారని చికిత్స రోజుల్లో అపోలో ఆస్పత్రి బులెటిన్లు కూడా విడుదల చేసింది. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి కావాలనేది జయ అభీష్టమని అపోలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి స్వయంగా ప్రకటించారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం త్వరలో అమ్మ డిశ్చార్జి అంటూ ప్రచారం చేశాయి. కానీ, జయ ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని రాష్ట్రవ్యాప్తంగా అనుమానాలు పెరిగాయి. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నా డీఎంకే చీలిక నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సైతం న్యాయవిచారణకు పట్టుపట్టారు. దీంతో జయ మరణంపై రిటైర్డు జడ్జి నేతృత్వంలో సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. జయ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మరణం వరకు జరిగిన ఘటనలపై నవంబర్ 22లోగా ప్రమాణపత్రాలివ్వాలని సంబంధిత వ్యక్తులను కమిషన్ ఆదేశించింది. జయ నివాసం పోయెస్ గార్డెన్‌లోని సిబ్బంది, అపోలో వైద్యులు, జయకు చికిత్స చేసిన లండన్ వైద్యుడు, ఎయిమ్స్ డాక్టర్లు, ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లు, ఉన్నతాధికారులు తదితరులకు ఈ సమన్లు ఇచ్చింది. కాగా, కమిషన్‌కు ఇప్పటివరకు 12 ప్రమాణపత్రాలు, 70కి పైగా అఫిడవిట్లు అందాయి. డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, ఆమె భర్త మాధవన్, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు..ఇలా మొత్తం ఏడుగురు ప్రమాణపత్రాలు ఇచ్చారు. -
‘ఆమె జాక్‌పాట్ కొట్టింది’
వాషింగ్టన్ : జూలీ బ్రిస్క్‌మాన్.. అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్యవేలు చూపించి తన అసహనాన్ని ప్రకటించిన మహిళ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వస్తుంది. రెండువారాల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వర్జీనియాలో గోల్ఫ్ ఆడి తిరిగి వెళుతున్న సమయంలో జూలీ.. ఆయన కాన్వాయ్‌ని వెంబడించి మరీ మధ్య వేలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జూలీని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచి ఆమెకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో ఆమెకు ఆర్థిక అవసరాల నిర్వహణ కోసం ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న అకిమా.. సామాజిక మాధ్యమాల ద్వారా క్రౌడ్ ఫండింగ్‌ను సేకరించడం మొదలు పెట్టారు. ట్రంప్‌కు జూలీ మధ్యవేలు చూపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం..అదే సమయంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో నెటిజన్లకు జూలీ మీద అభిమానం పొంగింది. దీంతో కేవలం 7 రోజుల్లోనే 70 వేల డాలర్ల ఫండ్ సమకూరాయి. ఈ మొత్తాన్ని కేవలం 3 వేల మంది దాతలు అందించడం విశేషం. క్రౌడ్ ఫండింగ్ ద్వారా లక్ష డాలర్లు సేకరించి ఆమెకు అందిస్తున్నట్లు అకిమా తెలిపారు. -
ఆ వేలిముద్ర 'అమ్మ' దేనా
సాక్షి, చెన్నై : ఆ బీ ఫారంలోని వేలి ముద్ర దివంగత సీఎం జయలలిత వేసిందేనా..? అని మద్రాసు హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించింది. వాస్తవికతను ధ్రువీకరించే విధంగా వివరణ ఇవ్వాలని, కోర్టుకు హాజరుకావాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శికి బుధవారం నోటీసులు జారీ అయ్యాయి. ఇక, తమ వద్ద ఉన్న అన్ని వివరాలను విచారణ కమిషన్ ముందు ఉంచుతామని అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. అమ్మ జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు తామెవరూ చూడలేదని కొందరు, తాము చూశామని మరికొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అసలు అమ్మను ఎవ్వరూ కలవలేదన్నట్టుగా మరి కొందరు వివాదాస్పద వ్యాఖ్యల్ని సంధించారు. అలాగే, ఆస్పత్రిలో అమ్మకు అందిన వైద్య చికిత్సలపై అనుమానాలు రేకెత్తే రీతిలో స్పందించిన వాళ్లూ ఉన్నారు. దీంతో ప్రతిపక్షాలన్నీ మిస్టరీ నిగ్గుతేలే రీతిలో విచారణ సాగాలని ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డాయి. బుధవారం మంత్రి జయకుమార్ నో కామెంట్ అంటూనే, జయలలిత మరణం మిస్టరీ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. ఇక, మరో మంత్రి ఓఎస్ మణియన్ అయితే, అమ్మకు వైద్యం అందించిన డాక్టర్ల వద్ద సమగ్ర విచారణ సాగాలని నినదించారు. చివరకు తిరుప్పర గుండ్రం ఎమ్మెల్యే బోసు అయితే, నాలుగు అడుగులు ముందుకు వేశారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ తనను చూసి చేతులు ఊపారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో జయలలిత బీ ఫారంలో చేసిన వేలి ముద్ర వ్యవహారం బుధవారం మద్రాసు హైకోర్టు ముందుకు వచ్చింది. అన్నీ విచారణ కమిషన్ ముందు ఉంచుతాం జయలలితకు అందించిన వైద్య పరీక్షల మీద మంత్రులు భిన్న స్వరాల్ని వ్యక్తం చేస్తుండడం, వ్యవహారం వివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి , మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడారు. జయలలితకు అందించిన వైద్య వివరాలన్నీ విచారణ కమిషన్ ముందు ఉంచుతామన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలోని విచారణ కమిషన్‌ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. జయలలితకు చికిత్స అందించిన గదిలో సీసీ కెమెరాలు లేవని తెలిపారు. అయితే, మంత్రులందరూ అపోలోకు వచ్చారని పేర్కొంటూ, జయలలితను ఎవరెవరు కలిశారో అన్న వివరాలన్నీ విచారణ కమిషన్‌కు సమర్పిస్తామన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఇతర సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీలను అందిస్తామన్నారు. జయలలితకు అందించిన చికిత్స, ఆహారం గురించిన సమగ్ర వివరాలన్నీ విచారణ కమిషన్‌కు సమర్పిస్తామని, సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు. ఇదిలా ఉండగా, బెంగళూరుకు చెందిన నర్శింహమూర్తి సమాచార హక్కు చట్టం మేరకు సేకరించిన వివరాల్లో జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో కావేరి వ్యవహారంపై అధికారులతో సమాలోచన సమావేశం నిర్వహించినట్టుగా ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ వివరాల్ని సమర్పించి ఉండడం గమనార్హం. సీఈసీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పర గుండ్రం, పుదుచ్చేరిలోని నెల్లితోపు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల బీ ఫారంలో జయలలిత సంతకానికి బదులుగా వేలి ముద్రలు ఉండడం చర్చకు దారితీసింది. వివాదం సైతం సాగింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం తిరుప్పరగుండ్రంలో ఓటమి చవి చూసిన డీఎంకే అభ్యర్థి శరవణన్ ఆ వేలి ముద్రలపై అనుమానాల్ని వ్యక్తంచేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వడానికి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖాని, మదురై జిల్లా ఎన్నికల అధికారి సైతం కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం పిటిషన్ విచారణకు రాగా, న్యాయమూర్తి వేల్ మురుగన్ ముందు వాదనలు సాగాయి. వాదనల అనంతరం ఆ వేలి ముద్ర జయలలితదేనా అన్న వాస్తవికతను ధ్రువీకరించే విధంగా కోర్టుకు స్పష్టత తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శి కోర్టుకు వచ్చి మరీ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణ అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. -
నాటి బాలనేరస్తుడే.. నేటి ఘరానా చోరుడు
♦ 22 ఏళ్ల క్రితం తీసుకున్న వేలిముద్రలతో వీడిన చోరీ కేసు ♦ సాంకేతిక పరిజ్ఞానంతో దొంగను పట్టుకున్న పోలీసులు ♦ 26 చోరీలు చేసినట్లుగా గుర్తింపు హైదరాబాద్: బాలనేరస్తుడిగా 1995లో పోలీసులకు చిక్కిన సమయంలో తీసుకున్న వేలిముద్రలే దాదాపు 22 ఏళ్ల తర్వాత ఓ దొంగను పట్టించాయి. మీర్‌పేట ఠాణా పరిధిలో రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగులగొట్టి సొత్తు దోచుకెళ్లిన కేసులో హబీబ్ అలియాస్ చోటు అలియాస్ యూసుఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. మీర్‌పేటలో జరిగిన ఓ చోరీ కేసుకు సంబంధించి ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులకు లభించిన వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ విభాగానికి పంపగా, 22 ఏళ్ల క్రితం పోలీసులకు చిక్కిన హబీబ్ అలియాస్ చోటు అలియాస్ యూసుఫ్ వేలిముద్రలతో సరిపోలినట్లు నివేదిక వచ్చింది. అప్పటి నుంచి అతడిపై నిఘా ఉంచిన పోలీసులు రాజేంద్రనగర్ మండలం, హసన్ననగర్లోని ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించి ఈ నెల13న అతడిని అరెస్టు చేసి, రూ.30 లక్షల విలువచేసే కిలో బంగారం, 2.5కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా మీర్‌పేట, బాలాపూర్, హయత్‌నగర్, పహడీషరీఫ్, ఎల్బీ నగర్, చైతన్యపురి, వనస్థలిపురం, నార్సింగ్ ఠాణా పరిధిల్లో 26 ఇళ్లల్లో చోరీ చేసినట్లుగా అంగీకరించాడు. వేలిముద్రలు పడకుండా చాలా చాకచాక్యంగా వ్యహరించిన హబీబ్ మీర్‌పేటలో చేసిన చోరీలో మాత్రం చేసిన తప్పుతో పోలీసులకు దొరికిపోయాడు. ♦ 22 ఏళ్ల తర్వాత తొలిసారి అరెస్టు... ఉదయం, రాత్రి వేళల్లో రెక్కీలు నిర్వహించే యూసుఫ్ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి ప్రధాన ద్వారం తలుపులకు ఉన్న తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడేవాడు. ఇంట్లో దాచి ఉన్న బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళతాడు. చిన్నతనంలో చెడుస్నేహాల కారణంగా జల్సాల కోసం చోరీల బాట పడ్డాడు. 1995లో అతను తన సహచరులు సంజయ్, సర్వర్, హర్షద్‌లతో కలిసి చోరీ చేసిన కేసులో హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి జువైనల్ కోర్టుకు తరలించారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక తన ప్రవర్తన మార్చుకొకుండా చోరీలు కొనసాగిస్తున్నాడు. అయితే అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న హబీబ్‌ను ఎట్టకేలకు మీర్‌పేటలో చోరీ చేసిన ప్రాంతంలో లభించిన వేలిముద్రలు పట్టించాయి. -
ఫెవికాల్ వేలి ముద్రలు!
లెక్చరర్ల ‘అటెండెన్స్’లో వృత్తివిద్యా కాలేజీల మాయాజాలం ►బయోమెట్రిక్ మిషన్లను సైతం ఏమారుస్తున్న యాజమాన్యాలు ► విధులకు రాకున్నా వచ్చినట్టుగా నకిలీ వేలి ముద్రలు ►వందలాది కాలేజీల్లో ఇదే మోసం సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో 42 మంది లెక్చరర్లు ఉన్నారు. ఇందులో నిత్యం సగానికిపైగా గైర్హాజరవుతారు. కొందరైతే కాలేజీ ముఖం చూడరు! కానీ బయోమెట్రిక్ మిషన్లలో మాత్రం ప్రతిరోజు వేలిముద్రలు సమర్పిస్తారు. కాలేజీకి వచ్చినట్లు హాజరుపట్టీలో ఉంటుంది. వ్యక్తి లేకుండా వేలిముద్రలెలా సమర్పిస్తారు? ఆశ్చర్యమేస్తుంది కదూ.. కాలేజీ యాజమాన్యం మాయాజాలం అదే మరి!...ఈ తతంగం ఒకట్రెండు కాలేజీల్లోనే కాదు.. వందలాది వృత్తివిద్యా కాలేజీల్లో ఇదే తీరు. లెక్చరర్లు రాకున్నా వచ్చినట్టు చూపిస్తుండటంతో ఉన్నత విద్యా శాఖ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తుండగా.. కాలేజీ యాజమాన్యాలు దాన్ని కూడా ఏమార్చేస్తున్నాయి. దీంతో లెక్చరర్లకు చేసే ఖర్చును మిగుల్చుకుంటూ... బోధనను గాలికొదిలేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 310 వృత్తి విద్యా కాలేజీలున్నాయి. ఇందులో 210 ఇంజనీరింగ్ కాలేజీలు కాగా.. మిగతావి ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర కాలేజీలు. కోర్సులకు తగినట్లు ఫ్యాకల్టీ ఉంటేనే వాటికి అనుమతి లభిస్తుంది. ఈ క్రమంలో నిర్దేశిత సంఖ్యలో బోధకులను నియమించుకోవాల్సి ఉండగా.. అంకెల గారడీతో వారిని భర్తీ చేసుకున్నట్లు రికార్డులు సృష్టిస్తూ దొడ్డిదారిలో అనుమతులు పొందుతున్నాయి. సర్టిఫికెట్లు సమర్పిస్తే లెక్చరరే! లెక్చరర్ల నియామకాల్లో కాలేజీలు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నాయి. వాస్తవానికి కాలేజీ వేళలో పూర్తిస్థాయిలో పనిచేసే లెక్చరర్లను మాత్రమే నియమించుకోవాలి. అలాకాకుండా పలు కాలేజీ యాజమాన్యాలు నిర్వహణ ఖర్చును తగ్గించుకునేందుకు ఒక్కో లెక్చరర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. మరోవైపు సంఖ్యను సర్దుబాటు చేసేందుకు నకిలీ లెక్చరర్లను సృష్టిస్తున్నాయి. కొందరు పూర్వ విద్యార్థులనే లెక్చరర్లుగా నియమించుకున్నట్లు రికార్డులు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పూర్వ విద్యార్థుల నుంచి సర్టిఫికెట్లను అట్టిపెట్టుకుని వారినే పూర్తిస్థాయి లెక్చరర్లుగా లెక్కల్లో చూపుతున్నాయి. కాలేజీ యాజమాన్యం వద్ద సర్టిఫికెట్లు పెట్టినందుకు సదరు విద్యార్థులకు నెలకు రూ.4 వేల నుంచి రూ.8 వేల దాకా చెల్లిస్తున్నాయి. దీంతో తరగతి గదిలో పాఠం చెప్పని, కాలేజీ ముఖం చూడని వారంతా సీనియర్ లెక్చరర్‌గా చెలామణి అవుతున్నారు. వేలి ముద్రలో ఇలా మాయ.. వేలిముద్రల విషయంలో అక్రమాలకు కాలేజీలు కొత్త పద్ధతి పాటిస్తున్నాయి. లెక్చరర్లుగా జాబితాలో పేర్లు చేర్చిన తర్వాత వారి వేలిముద్రలను కొత్త పరిజ్ఞానంతో స్వీకరిస్తారు. సదరు వ్యక్తి వేలికి ప్రత్యేకమైన రసాయనాన్ని పూసి దానిపై ఫెవికాల్‌ను మందంపాటిగా రుద్దుతారు. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత క్రమపద్ధతిలో తొలగిస్తారు. దీంతో ఆ వ్యక్తి వేలిముద్రలు మందంపాటి ఫెవికాల్ తొడుగుకు వచ్చేస్తాయి. అలా వచ్చిన వేలిముద్రలను బయోమెట్రిక్ మిషన్‌లో ప్రవేశపెట్టి హాజరు నమోదు చేస్తారు. ఈ వ్యవహారాన్ని సాఫీగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కాలేజీలో ఒక ఉద్యోగిని కూడా నియమించుకుంటున్నారు. అంతా కనికట్టు.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం బయోమెట్రిక్ హాజరు విధానం కొనసాగుతోంది. లెక్చరర్ల హాజరులో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ హాజరు తీరు ఆధారంగా కాలేజీల నిర్వహణను ఉన్నత విద్యాశాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ హాజరు తీరులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. లెక్చరర్లు విధులకు హాజరు కానప్పటికీ అటెండెన్స్ మాత్రం పూర్తిస్థాయిలో నమోదవుతోంది. బయోమెట్రిక్ మిషన్లలో వేసే వేలిముద్రలను ఏమార్చుతున్నారు. ఇదే సమాచారాన్ని సంబంధిత ఉన్నత శాఖలకు పంపుతూ నిర్వహణ పక్కాగా ఉన్నట్లు గణాంకాలు చూపుతున్నారు. పైన చిత్రంలోని బాక్సుల్లో కనిపిస్తున్నవి ఫెవికాల్తో తయారుచేసిన వేలి ముద్రల తొడుగులు. వీటిని కింద ఉన్నచిత్రంలో కనిపిస్తున్న గన్‌లాంటి పరికరానికి తొడుగుతారు. ఆ గన్‌లోంచి ఓ లిక్విడ్ వచ్చి తొడుగులు ఉబ్బుతాయి. వాటిని తీసుకెళ్లి బయోమెట్రిక్ మిషన్‌పై నొక్కుతారు. దీంతో కాలేజీకి లెక్చరర్ రాకుండానే వచ్చినట్టుగా నమోదు చేసి బురిడీ కొట్టిస్తారు.. -
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్, రూ. 5,290లకే
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ తయారీదారు కార్బన్ కే 9 కవచ్ 4జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫింగర ప్రింట్ సెన్సర్‌తో వస్తున్న ఈ 4జీ మొబైల్ ధరనుకేవలం రూ.5290 కేఅందిస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ యాప్‌ను ఈ డివైస్‌లో అందుబాటులో ఉంచింది. కార్బన్ కె9 కవచ్ 4జీ ఫీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 2300 ఎంఏహెచ్ బ్యాటరీ -
కన్నుల భాషలు
-
మెయ్‌జు ఎం5 స్మార్ట్‌ఫోన్ లాంచ్..ధర?
సుదీర్ఘ విరామం తర్వాత మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎం5' ను విడుదల చేసింది. భారత మార్కెట్ లో దీని ధరను రూ.10,499 లుగా కంపెనీ ప్రకటించింది. బ్లూ, షాంపైన్ గోల్డ్ కలర్ వేరియంట్లలో టాటాసిలిక్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. అలాగే 2జీబీ, 3 జీబీ వేరియంట్లలో అక్టోబర్ లో చైనాలో లాంచ్ చేసిననప్పటికీ 3 జీబీ ఎంను మాత్రమే ప్రస్తుతం భారత్ లో లాంచ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్బట్, హోమ్ బటన్ క్రింద అమర్చింది. పాలీ కార్బోనేట్బాడీతో డిజైన్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ లో కుడి అంచున పవర్ , వాల్యూమ్ బటన్లను, 3.5 ఎంఎ ఆడియో జాక్, స్పీకర్లు, చార్జింగ్ పోర్ట్ కిందిభాగాన పొందుపర్చింది. ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. మెయ్‌జు ఎం5 ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్ఈ 3070 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం చైనాలో లాంచ్ చేసిన చాలా తక్కువ సమయంలోనే దీన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టామని మొయిజు సౌత్ ఆసియా మార్కెటింగ్ హెడ్ లియాన్ జాంగ్ ప్రకటించింది. కీలక మార్కెట్ గా ఉన్న భారతకు మంచి ఆదరణ లభిస్తోందని ఈ నేపథ్యంలో కొన్ని నెలల కాలంలోనే దీన్ని భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. -
భారీ బ్యాటరీతో ‘కె10000 ప్రొ’ త్వరలో
చైనీస్ కంపెనీ ఆకిటెల్ భారీ బ్యాటరీ సామర్ధ్యంతో తన తాజా స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే వారం రోజుల పాటు పనిచేసేలా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ అభివృద్ధి చేస్తున్నామంటూ చైనా కంపెనీ ఆకిటెల్ 2015లో లైమ్ లైట్లోకి వచ్చింది. 10వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ’కె 10000 ప్రొ’ పేరుతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు సమాచారం. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది జూన్‌లోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. టు బి ద కింగ్ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఆ స్మార్ట్‌ఫోన్ ఫోటో ఇపుడు నెట్ లో హల్చల్ చేస్తోంది. దీని ప్రకారం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను వెనుక భాగంలో అమర్చింది. కె 10000ప్రో వేరియంట్ ఇతర ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. కె 10000ప్రో ఫీచర్స్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5.5 అంగుళాల డిస్ప్లే 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్, 1.5 మీడియా టెక్ ఎంటీ6750టీ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ -
ఇక వేలిముద్రే మన సీక్రెట్ పిన్!
వాషింగ్టన్: ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఈ విషయం అందరికి తెలిసిందే. అందుకే వేలిముద్రల ద్వారా లావాదేవీలు నిర్వహించునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తే ఎటువంటి అక్రమాలకు తావుండదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కేవలం పిన్ నంబర్‌తో లావాదేవీలు నిర్వహించే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. పిన్ ఎవరికైనా తెలిస్తే ఇక అంతే సంగతి. ఇటువంటి సమస్యలకు వేలిముద్రలే పరిష్కారమని చెబుతున్నారు సాంకేతిక నిపుణులు. అందుకే వేలిముద్రలతో పనిచేసే బయోమెట్రిక్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ కంపెనీ ప్రకటించింది. ఈ బయోమెట్రిక్ కార్డులో ఉండే చిప్‌లో వేలిముద్రల డేటాని పొందుపరుస్తామని, ఎక్కడైనా కొనుగోలు జరిపినప్పుడు ఆ కార్డుని స్వైప్ చేసి పిన్‌కి బదులుగా మన వేలిముద్ర వేయడం ద్వారా లావాదేవీని పూర్తిచేయవచ్చని మాస్టర్ కార్డ్ కంపెనీ గురువారం వెల్లడించింది. ఈ టెక్నాలజీని ఈ మధ్యనే దక్షిణాఫ్రికాలో పరీక్షించారు. విజయవంతం కావడంతోపాటు అక్కడి వినియోగదారులు కూడా ఎంతో సురక్షితమైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని కంపెనీ అధ్యక్షుడు అజయ్ బళ్ళా తెలిపారు. ఈ కార్డులకు నకిలీలను ఎవరూ తయారు చేయలేరు కాబట్టి మన లావాదేవీలు మరింత సురక్షితంగా జరుగుతాయని, కేవలం బ్యాంకులో ఒకసారి రిజస్టర్ చేసుకుంటే చాలని చెబుతున్నారు. తద్వారా బ్యాంకు నిర్వాహకులు వేలిముద్రల డాటాను కార్డులో పొందుపర్చి, కార్డును జారీ చేస్తారు. అంతేకాక బ్యాంకులు డిజిటల్ టెంప్లెట్‌ని తయారు చేస్తాయి. దీనిని ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్ కార్డులు చిప్‌లు కలిగి ఉన్న కార్డుల్లానే పనిచేస్తాయి. దీని వల్ల నిజమైన కార్డు యజమానే దానిని వినియెగించడానికి వీలుంటుంది. అంతేగాక దీని కోసం కొత్త సాప్ట్వేర్, హార్డ్‌వేర్ ఏదీ అవసరంలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈఎమ్వీలోనే ఇది పనిచేస్తుంది. మరిన్ని సదుపాయాలను ఇందులో పొందుపర్చి, త్వరలోనే వీటిని విడుదల చేస్తామని మాస్టర్ కార్డు కంపెనీ ప్రకటించింది. ముందుగా యూరప్, ఫసిపిక్ ఆసియాలలో వీటిని పరీక్షించనున్నారు. -
చైనాలో విదేశీయుల వేలిముద్రల సేకరణ
బీజింగ్: చైనాకు వచ్చిపోయే విదేశీయుల వేలిముద్రలను ఆ దేశం భద్రపరచనుంది. తమ దేశ భద్రత కోసం ఈ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించినట్లు చైనా ప్రజా భద్రత మంత్రిత్వ శాఖ గురువారం తెలిసింది. శుక్రవారం నుంచి షెంజెన్ విమానాశ్రయంలో వేలి ముద్రలను నమోదు చేస్తారు. రానున్న కాలంలో అన్ని విమానాశ్రయాలు, సరిహద్దు ప్రదేశాల్లో దీనిని అమలు చేస్తారు.