ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గణనీయమైన వాటా దక్కించుకున్న రియల్‌మీ ఇప్పుడు ల్యాప్‌ట్యాప్ మార్కెట్‌పై గురి పెట్టింది. రియల్‌మీ బుక్ పేరుతో పర్సనల్ ల్యాప్‌ట్యాప్‌లు మార్కెట్‌లోకి తేనుంది.
రియల్‌మీ తక్కువధరలో నాణ్యమైన ఫోన్లు అందించి మొబైల్ మార్కెట్‌లో మంచి వాటాను దక్కించుకుంది. ఇప్పుడు ల్యాప్‌ట్యాప్‌ల విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో కానుంది. రూ.40,000 రేంజ్‌లో పవర్‌ఫుల్ ల్యాప్‌ట్యాప్ తెచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. రియల్‌మీ బుక్ 1.5 కేజీల బరువుతో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో రానుంది. యాంటీగ్లేర్ డిస్‌ప్లేను అమర్చారు.
ఇక సాంకేతిక విషయాలకు సంబంధించి ఇంటెల్ 11 జనరేషన్‌కి చెందిన ఐ కోర్ 3, ఐ కోర్ 5 చిప్‌సెట్‌లను ఉపయోగించారు. రిలయ్‌మీ బుక్ లోపలి వైపు సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ ఫినీషింగ్ మధ్యలో కీబోర్డు చూడటానికి బాగుండెలా డిజైల్ చేశారు. ఈ రిలయ్‌మీ బుక్ ఇన్‌బిల్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మార్కెట్‌లోకి రానుంది. అయితే అన్ని ఫీచర్లలోకి ఆకట్టుకునే కొత్త రకం ఫీచర్‌గా లాప్‌ట్యాప్‌కి ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనుంది రియల్‌మీ.
ఆగస్టులో రియల్‌మీ బుక్‌ను మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.రియల్‌మీ బుక్‌లో యూఎస్‌బీ ఏ పోర్టు ఒకటి, యూఎస్‌బీ సీ టైప్ పోర్టులు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఉన్నాయి. అయితే ఈ రియల్‌మీ ల్యాప్‌టాప్‌లో బిల్ట్ ఇన్ వెబ్‌కామ్ ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment