chipset
-
‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లు ప్రారంభించిన ప్రముఖ కంపెనీ
హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ (హెచ్‌పీఈ) తాజాగా దేశవ్యాప్తంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సర్వర్లను మనేసర్‌లోని వీవీడీఎన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తయారుచేసినట్లు చెప్పింది. గత ఏడాది జూలైలో హెచ్‌పీఈ, వీవీడీఎన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో మేక్ ఇన్ ఇండియా ప్రణాళికలను వెల్లడించింది. అందులో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లను తయారుచేస్తామని హామీ ఇచ్చింది. దాంతో అలా హామీ ఇచ్చిన ఏడాదికాలంలోపే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న ఐదు ఏళ్లలో భారత్‌లో సుమారు 1 బిలియన్ డాలర్ల(రూ.8300 కోట్లు) విలువైన హైవాల్యూమ్ సర్వర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. హెచ్‌పీఈ సర్వర్లు ఐటీ పరిశ్రమ అంతటా పనిభారాన్ని తగ్గిస్తూ విస్తృత శ్రేణి అప్లికేషన్ల కోసం ఉపయోగపడుతాయని కంపెనీ తెలిపింది. వీవీడీఎన్ టెక్నాలజీ హెచ్‌పీఈ తయారుచేస్తున్న సర్వర్ మదర్‌బోర్డులను రూపొందించడానికి పూర్తి స్థాయి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ)ని అందిస్తున్నట్లు తెలిసింది. ప్రాసెసర్లు, మెమరీలు, డిస్క్‌లు, డ్రైవ్‌లతో సర్వర్ మదర్‌బోర్డులను తయారు చేయడానికి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ)కి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అవసరం అవుతుంది. ఇదీ చదవండి: కొత్త యూజర్లు ఫీజు చెల్లించాల్సిందే.. ఎందుకంటే.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎస్ఐ) పథకం ద్వారా విదేశీ కంపెనీలను భారత్‌లోకి ఆహ్వానించి ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు ప్రోత్సాహకాలు కల్పించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని హెచ్‌పీఈ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సోమ్ సత్సంగి అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ)కి అభినందనలు తెలియజేశారు. -
‘లక్ష రూపాయల ల్యాప్‌టాప్..రూ.40వేలకే ఇవ్వొచ్చు’!
వేదాంత రిసోర్సెస్..దేశంలో మెటల్ తయారీలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. స్టీల్, కాపర్, అల్యూమీనియం తయారీలో దూసుకుపోతోంది. దేశంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో ఇది ఒకటి. కిక్కిరిసిన జనం మధ్యన ట్యాక్సీలో చేసిన ప్రయాణం, అప్పుడు వినిపించిన మహ్మద్ రఫి గొంతుతో..వో కోన్సీ ముష్కిల్ హై (సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు) అనే పాట స్ఫూర్తి వేదాంత ప్రస్థానానికి నాందిగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థ చిప్ సెట్లు, డిస్ప్లే తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది వేదాంతా, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్ ప్లాంటును రూ.1.54 లక్షల కోట్లతో గుజరాత్లో నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, ఈ ప్లాంటులో ఫాక్సాకాన్ వాటా 38శాతం ఉండగా.. మిగిలిన సింహభాగం వేదాంతాదే. ఈ నేపథ్యంలో వేదాంతా గ్రూప్ ఛైర్మన్ ఓ మీడియా ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ..చిప్ సెట్లు, డిస్ప్లే తయారీ ప్రారంభమైతే దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గుతాయి. ‘ప్రస్తుతం మనం ల్యాప్ ట్యాప్ తీసుకుంటే దాని ధర రూ.లక్ష ఉంటే..డిస్ప్లే, చిప్ సెట్లను దేశీయంగా తయారు చేస్తే అదే ల్యాప్ ట్యాప్ ధర రూ.40వేలు అంతకంటే తక్కువే ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. -
ఆర్డర్లు ఉన్నాయి.. కానీ టైమ్‌కి డెలివరీ చేయలేం!
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్సెట్ల కొరత విపరీతంగా పెరిగిపోయింది. ప్రముఖ కంపెనీలు తమ దగ్గరున్న ఆఖరి కార్లను కూడా అమ్మేశాయి. చిప్ సెట్ల కొరత కారణంగా కొత్త కార్లు తయారు చేయడం గగనంగా మారింది. దేశీయంగా మహీంద్రా మొదలు ఇంటర్నేషనల్ లెవల్లో మెర్సిడెజ్ బెంజ్ వరకు అన్ని సంస్థలు ఇదే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని తాజా ట్వీట్ ద్వారా తెలిపారు ఆనంద్ మహీంద్రా. మెర్సిడెజ్ బెంజ్ గ్లోబల్ హెడ్ మార్టిన్ ష్వెంక్ ఇటీవల మాట్లాడుతూ.. తమ దగ్గరున్న చివరి కారును కూడా అమ్మేశామని, ఇప్పటికిప్పుడు తమకు ఐదు వేల కార్లకు ఆర్డర్ రెడీగా ఉందని తెలిపారు. అయితే ఈ కార్లు తయారు చేసేందుకు అవసరమైన చిప్సెట్లు మాత్రం సరిపడా అందుబాటులో లేవన్నారు. దీంతో మెర్సిడెజ్ బెంజ్‌లో కొత్త కారు కావాలంటే కనీసం రెండు నెలల నుంచి రెండేళ వరకు ఎదురు చూడక తప్పడం లేదంటూ స్పష్టం చేశారు. This is what I was referring to in my last tweet… It’s a problem for all car manufacturers.. https://t.co/8bd29HnrbB — anand mahindra (@anandmahindra) May 17, 2022 చదవండి: ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్ -
‘డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం మార్మోగాలి!
బెంగళూరు: దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ నినాదం ’ఇంటెల్ ఇన్సైడ్’ తరహాలో ’డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం ప్రపంచంలో మార్మోగాలని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీపై డెల్, సోనీ వంటి సంస్థలు డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ–వీ (డీఐఆర్–వీ) ప్రోగ్రామ్‌లో కలిసి పనిచేస్తున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. డీఐఆర్–వీ కింద దేశీయంగా తయారైన తొలి చిప్‌సెట్‌ను 2023–24 నాటి కల్లా వ్యాపార అవసరాల కోసం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు వివరించారు. -
“మేక్ ఇన్ ఇండియా”..5 కంపెనీలు..రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: వచ్చే నాలుగేళ్లలో (2026 నాటికి) దేశీయంగా 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం 70–80 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్లు (చిప్‌లు) అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2022 సదస్సుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చే దిశగా సెమీకాన్ ఇండియా తొలి సదస్సు ఏప్రిల్ 29–మే 1 మధ్య బెంగళూరులో జరగనుంది. ఈ సదస్సులో పలు దిగ్గజ సెమీకండక్టర్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ‘డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విజన్ డాక్యుమెంట్ ప్రకారం 2026 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దీని ప్రకారం చూస్తే దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగమే 70–80 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. సెమీకాన్ ఇండియా పథకం కింద భారత్‌లో దాదాపు రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్ చిప్, డిస్ప్లే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అయిదు కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. వేదాంత ఫాక్స్‌కాన్ జేవీ, ఐజీఎస్ఎస్ వెంచర్స్, ఐఎస్ఎంసీ సంస్థలు..ఎలక్ట్రానిక్ చిప్ తయారీ ప్లాంట్లను పెట్టే యోచనలో ఉన్నాయి. వేదాంత, ఎలెస్ట్ సంస్థలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిలో ఉపయోగించే డిస్ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేశాయి. -
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం..భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ,ఎలక్ట్రిక్ కార్ల ధరలు?!
Smartphones And Laptops Become More Expensive: రష్యా - ఉక్రెయిన్ ల యుద్ధం ఇతర ప్రపంచ దేశాలపై వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌లు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా పెరగన్నాయని ఆర్ధిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ -డీజిల్ ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగనున్నాయని వెలుగులోకి వస్తున్న రిపోర్ట్‌లతో ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. తాజాగా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల ధరలు పెరుగుతుండడం సామాన్యులపై మరింత భారం పడనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లకు అవసరమైన చిప్సెట్ల కొరత తీవ్రంగా ఉండనుంది. ఎందుకంటే? పలు నివేదికల ప్రకారం..ఉక్రెయిన్ యూఎస్‌కు 90శాతం సెమీకండక్టర్ గ్రేడ్ నియాన్‌ను, సెమీకండక్టర్లను తయారు చేసేందుకు ఉపయోగించే అరుదైన లోహం పల్లాడియంను రష్యా అమెరికాకు 35శాతం ఉత్పత్తి చేస్తుంది. అత్యంత ఖరీదైన పల్లాడియం లోహం రష్యాలో లభ్యం కావడంతో.. యుద్ధం కారణంగా రష్యా పల్లాడియం ధరల్ని పెంచే అవకాశం ఉంది. ప్రపంచ చిప్సెట్ సరఫరాలో రష్యా వాటా 45 శాతం. ఉక్రెయిన్, రష్యా నుండి నియాన్, పల్లాడియం సరఫరా ఆ ప్రభావం సెమీకండక్టర్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదే విషయంపై జపాన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉత్పత్తుల సరఫరా తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో యుద్ధం మరింత సంక్షోభం తలెత్తుతుందని జపాన్ చిప్ తయారీదారు తెలిపారు. -
భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా?
Semiconductor Manufacturing: కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చైనాకు భారీగా నష్టాలు కలిగించే అవకాశాలు ఉన్నాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కొరతను అధిగమించడానికి భారత్ ప్రయత్నిస్తుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి భారతదేశం మెగా మల్టీ-బిలియన్-డాలర్ క్యాపిటల్ సపోర్ట్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చిప్ కొరత కారణంగా అన్నీ రంగాలలోని పరిశ్రమలు భారీ ఉత్పత్తి కోతలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. టీఓఐ నివేదికప్రకారం, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), ఇంటెల్, ఎఎమ్‌డీ, యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్ప్, ఫుజిట్సు వంటి కొన్ని అగ్ర సెమీకండక్టర్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. సెమీకండక్టర్ తయారీదారులను వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలనే ప్రధానమంత్రి కార్యాలయం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. కంపెనీలను దేశంలోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన విధానంతో ముందుకు రావాలని బహుళ మంత్రిత్వ శాఖలు ఆదేశించింది. ప్రత్యేక ప్రోత్సాహకాలు సెమీకండక్టర్ తయారీదారులకు దిగుమతి వస్తువులపై సుంకం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ & సెమీకండక్టర్(ఎస్ఎసీఎస్), తయారీని ప్రోత్సహించే పిఎల్ఐ స్కీం వంటి పథకాల నుంచి కూడా ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను అందించాలని చూస్తుంది. దేశంలో సెమీకండక్టర్లను తయారు చేయకపోవడంతో దేశంలోని డిమాండ్ తీర్చడం కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. భారతదేశంలో సెమీకండక్టర్ల డిమాండ్ 2025 నాటికి ప్రస్తుతం ఉన్న 24 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకొనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. చైనాకు దెబ్బ సెమీకండక్టర్ తయారీదారులను దేశానికి ఆకర్షించడానికి ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, రక్షణ & ఆటో వంటి ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అవసరాలు కంపెనీలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు దేశంలో పెట్టుబడులు వస్తే మాత్రం చైనాకు దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ల ఎగుమతి దేశంగా చైనా ఉంది. మన దేశంలో ఏర్పాటు కాబోయే ఈ పరిశ్రమ వల్ల ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. -
సొంత దుకాణానికి సిద్ధమైన ఒప్పో...! వారికి మాత్రం పెద్ద దెబ్బే..!
స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో చిప్సెట్ మంటలను రాజేసింది. ఎవరికీవారు తమ చిప్సెట్లను తామే తయారుచేసుకోవడానికి పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సిద్దమైయ్యాయి. చిప్సెట్ల తయారీ విషయంలో గూగుల్, క్వాల్కమ్ మధ్య విభేదాలు మొదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో కూడా తమ సొంత చిప్ సెట్ల తయారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సొంత చిప్సెట్లను తయారుచేసే ఆపిల్, శాంసంగ్, గూగుల్ కంపెనీల సరసన ఒప్పో చేరనుంది. చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు క్వాలకమ్కు పెద్ద దెబ్బే...! ఒప్పో తీసుకున్న నిర్ణయంతో ప్రముఖ మొబైల్ చిప్ తయారీ దిగ్గజం క్వాలకమ్కు భారీ దెబ్బ తగలనుంది. ఒప్పో స్వంత చిప్సెట్లతో క్వాలకమ్ భారీ ఎత్తున నష్టపోనుంది ఒప్పో తన హై-ఎండ్ చిప్‌లను 2023 లేదా 2024 లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జపాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ నిక్కీ నివేదించింది. ప్రపంచంలో నాల్గో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఒప్పో నిలిచింది. వివో, రియల్మీ , వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఒప్పో మాతృ సంస్థగా నిలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్, మీడియాటెక్ చిప్సెట్లను వాడుతున్నారు. కాగా హై ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల తయారీలో కంపెనీ తన స్వంత చిప్సెట్లను వాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సొంత చిప్ సెట్లతో పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు...! ప్రపంచంలోని అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇప్పుడు వేగవంతమైన కస్టమ్ చిప్‌ను అభివృద్ధి చేసే రేసులో ఉన్నాయి. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చిప్సెట్ తయారీ కంపెనీలకు గడ్డుకాలంగా తయారైంది. గూగుల్ ఇప్పటికే పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌లకు బదులుగా గూగుల్ తన సొంత టెన్నార్ చిప్ సెట్లను అమర్చింది. ఆపిల్ ఇప్పటికే ఐఫోన్, ఐప్యాడ్ కోసం తన స్వంత A- సిరీస్ చిప్సెట్లను తయారు చేస్తుంది. శాంసంగ్ తన ఎక్సినోస్ చిప్సెట్తో గెలాక్సీ ఫోన్లను, టాబ్లెట్లకు అందిస్తున్నాయి. హువావే కూడా దాని స్వంత హైసిలికాన్ చిప్సెట్లను తయారు చేస్తోంది. చదవండి: సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..! -
Realme: ఫెస్టివల్ సీజన్.. టార్గెట్ బిగ్‌సేల్స్!
న్యూఢిల్లీ: పండగ సీజన్‌గా పేర్కొనే సెప్టెంబరు–అక్టోబర్‌లో 60 లక్షల పైచిలుకు స్మార్ట్ఫోన్ల విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. ట్యాబ్లెట్ పీసీల్లో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు వివరించారు. ల్యాప్టాప్స్ తయారీ కోసం మూడు కంపెనీలతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దేశంలో వీటి తయారీ ప్రారంభం అవుతుందన్నారు. ట్యాబ్లెట్ పీసీలు సైతం దేశీయంగా ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. 2020లో భారత్‌లో 1.9 కోట్ల యూనిట్ల రియల్మీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. చిప్సెట్ల ఎఫెక్ట్ లేదు ప్రపంచవ్యాప్తంగా చిప్సెట్ కొరత నెలకొన్నా... దాని ప్రభావం ఈ పండుగల సీజన్లో తమ కంపెనీపై ఉండబోదని రియల్మీ స్పష్టం చేసింది. భారత్‌లో తమ కంపెనీ ఈ ఏడాది 2.4–2.7 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాదికి సైతం సరిపడ చిప్సెట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. భారత మార్కెట్ విషయంలో చిప్సెట్ కొరత రాకుండా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు. రియల్మీ ప్యాడ్.. రూ.13,999 ధరలో రియల్మీ ప్యాడ్‌ను కంపెనీ గురువారం భారత్‌లో విడుదల చేసింది. మీడియాటెక్ హీలియో జీ80 గేమింగ్ ప్రాసెసర్, 10.4 అంగుళాల స్క్రీన్, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. 3/4 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే రియల్మీ 8ఎస్ 5జీ, రియల్మీ 8ఐ స్మార్ట్ఫోన్లను సైతం ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధరలు రూ.13,999 నుంచి మొదలవుతున్నాయి. చదవండి: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్..! -
చిప్‌ల కొరత, కలవరంలో కార్ల కంపెనీలు
ముంబై:అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత భారత్‌లో వాహనాల తయారీకి ప్రతికూలంగా మారుతోంది. దీంతో ఆగస్టు–సెప్టెంబర్ హోల్‌సేల్ అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ ఒక నివేదికలో తెలిపింది. ‘మారుతి, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ప్రభావం ఉండవచ్చు‘ అని వివరించింది. మలేషియాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్ కూడా చిప్‌ల కొరతకు కారణంగా ఉంటోందని జెఫ్రీస్ తెలిపింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బ నుంచి డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితులు ఆటోమొబైల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. చదవండి : ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది! విరివిగా సెమీకండక్టర్ల వినియోగం.. వాహనాలు మొదలుకుని కంప్యూటర్లు, సెల్ఫోన్లతో పాటు ఇతరత్రా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో సెమీకండక్టర్లుగా వ్యవహరించే సిలికాన్ చిప్‌లను వాడుతున్నారు. ఆయా ఉత్పత్తులు వివిధ పనులను సక్రమంగా నిర్వర్తించేందుకు (కంట్రోల్, మెమొరీ మొదలైనవి) చిప్‌లు ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్ట్, నేవిగేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో కొత్త వాహనాల రూపకల్పనలో సెమీకండక్టర్ల వాడకం గణనీయంగా పెరిగింది. కీలకమైన చిప్‌లకు కొరత నెలకొనడంతో అంతర్జాతీయంగా ఆటోమోటివ్ సహా ఇతర పరిశ్రమలపైనా ప్రభావం పడుతోంది. దీంతో అవి ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నివేదికలోని ఇతర వివరాలు.. 2019 ఆగస్టుతో (కరోనాకి పూర్వం) పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ 41–44 శాతం పెరిగింది. ట్రక్కుల రిజిస్ట్రేషన్ 15 శాతం తగ్గినప్పటికీ క్రమంగా మెరుగుపడుతోంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం ఆగస్టులో ఏకంగా 19 శాతం పడిపోయాయి. ►2019 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 29 శాతం తగ్గాయి. కోవిడ్ సెకండ్ వేవ్ పరిణామాలు ఇందుకు కారణం. డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. జులై ద్వితీయార్థంలో ఆటోమొబైల్ కంపెనీల కోసం ఆన్లైన్లో సెర్చి చేయడం కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం మళ్లీ పెరుగుతోంది. కన్జూమర్ సెంటిమెంట్ మెరుగుపడుతోందనడానికి ఇది నిదర్శనంగా జెఫ్రీస్ తెలిపింది. ►ఇక 2019తో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టూవీలర్ల రిజిస్ట్రేషన్లు 46 శాతం పడిపోయినప్పటికీ క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ►జులై–ఆగస్టు మధ్య కాలంలో ట్రాక్టర్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 2019తో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ట్రక్కులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ►ఆటోమొబైల్ కంపెనీల స్థూల మార్జిన్ ఒత్తిళ్లలో అత్యధిక భాగం సెప్టెంబర్ త్రైమాసికానికి తగ్గిపోవచ్చని జెఫ్రీస్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కంపెనీలు సీక్వెన్షియల్ ప్రాతిపదికన మెరుగైన మార్జిన్లు నమోదు చేసుకోవచ్చని వివరించింది. సెప్టెంబర్‌లో మారుతీ ఉత్పత్తి డౌన్..? చిప్‌ల కొరత కారణంగా సాధారణ స్థాయితో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉత్పత్తి 40 శాతానికి తగ్గిపోవచ్చని దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. హర్యానా, గుజరాత్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రభావం పడవచ్చని సంస్థ తెలిపింది. హర్యానాలోని గుర్గావ్, మానెసర్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 15 లక్షల యూనిట్లుగా ఉంది. దీంతో పాటు గుజరా త్‌లోని సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్ఎంజీ) ప్లాంటు స్థాపిత సామర్థ్యం వార్షికంగా మరో 7.5 లక్షల యూనిట్ల స్థాయిలో ఉంది. జులైలో మారుతీ సుజుకీ మొత్తం ఉత్పత్తి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లుగా నమోదైంది. -
అయ్యో మారుతి ! ఆటోమొబైల్ సెక్టార్‌పై ‘చిప్’ ఎఫెక్ట్
దేశంలోనే నంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కార్ల తయారీలో కీలకమైన సెమికండర్లు (చిప్)ల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సమస్యను అధిగమించేందుకు మారుతి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. చిప్సెట్ల ఎఫెక్ట్ దసరా, దీపావళి పండుగలకి మన దగ్గర కార్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. మారుతి సైతం ఇదే లక్ష్యంతో భారీగా సేల్స్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన చిప్సెట్ల కొరత కారణంగా ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. మారుతికి చిప్సెట్లు తయారు చేసే కంపెనీలు ఇప్పుడప్పుడే డిమాండ్‌కు తగ్గట్టు చిప్‌లు సరఫరా చేయలేమంటూ తేల్చిచెప్పాయి. దీంతో పండగ సీజన్ అమ్మకాల మాట అటుంచి చివరకు నెలవారీ తయారీ యూనిట్లలోనూ కోత పెట్టేందుకు మారుతి సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. టార్గెట్ కుదింపు ? దసరా, దీపావళీలను లక్ష్యంగా చేసుకుని మారుతి సెప్టెంబరు నెల తయారీ టార్గెట్ 60,000 నుంచి 90,000 యూనిట్లుగా ఆగస్టులో నిర్ధేశించుకుంది. అయితే చిప్సెట్ల కొరత కారణంగా ఈ టార్గెట్‌ను 50,000 నుంచి 70,000లకు కుదించినట్టు ఎకనామిక్ టైమ్స్ లో కథనాలు ప్రచురితం అయ్యాయి. సాధారణంగా పండగ సీజన్లో లక్షకు పైగా యూనిట్లను మారుతి తయారు చేస్తుంది. కానీ చిప్ సెట్ల కొరతతో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. 2014 తర్వాత కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్లు విధించినప్పుడు కూడా మారుతి కార్ల తయారీ ఈ స్థాయిలో దిగువకు చేరుకోలేదు. చివరి సారిగా 2014లో యాభై వేల యూనిట్లు తయారు చేశారు. ఆ తర్వాత ప్రతీ ఏడు 70వేలకు పైగానే కార్లు తయారు అయ్యేవి. చిప్సెట్లు, సెమికండక్టర్ల కొరతతో మారుతి ప్రణాళిక అమలు కష్టంగా మారింది. ఓపెన్ మార్కెట్ నుంచి చిప్సెట్లు కొనుగోలు చేసే దిశగా కూడా మారుతి ప్రయత్నాలు చేస్తోంది. షేర్ ధర తగ్గలేదు చిప్ సెట్ల కొరతతో ఇబ్బందుల్లో మారుతి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నా ఆ కంపెనీ షేర్ వ్యాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం రోజు మారుతి షేర్ ధర రూ.6605 నుంచి 6,675కి చేరుకోవడం ఈ కంపెనీపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. చదవండి: ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ? -
పర్సనల్ కంప్యూటర్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్సెట్ కొరత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) విభాగంపై స్పష్టంగా కనపడుతోంది. ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పని విధానం కారణంగా డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ సరఫరా ఆ స్థాయిలో జరగడం లేదు. ఇదే అదనుగా తయారీ కంపెనీలు ధరలను 50 శాతంపైగా పెంచాయి. లో ఎండ్ మోడళ్ల ఉత్పత్తిని దాదాపు నిలిపివేశాయి. రూ.50,000లోపు ధరలో ల్యాప్‌టాప్‌లు దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఆల్ ఇన్ వన్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏప్రిల్–జూన్ కాలంలో దేశవ్యాప్తంగా 32 లక్షల యూనిట్ల పీసీలు అమ్ముడైనట్టు సమాచారం. నిలిచిపోయిన సరఫరా.. ల్యాప్‌టాప్స్‌లో కొన్ని నెలల క్రితం వరకు రూ.17–25 వేల ధరల శ్రేణి వాటా 70 శాతం దాకా ఉండేది. రూ.26–40 వేల ధరల విభాగం 20 శాతం, రూ.40 వేలపైన ధరల్లో లభించే హై ఎండ్ మోడళ్ల వాటా 10 శాతం నమోదయ్యేది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మార్కెట్ అంతా హై ఎండ్ మోడళ్లతోనే నిండిపోయింది. వీటికి కూడా 40–50 శాతం కొరత ఉంది. ఇక లో ఎండ్ మోడళ్లు అయితే కానరావడం లేదు. 100 శాతం నగదు ఇచ్చి కొనేందుకు వినియోగదార్లు సిద్ధపడ్డా పీసీ దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితి పరిశ్రమలో ఇదే తొలిసారి అని ఐటీ మాల్ ఎండీ అహ్మద్ తెలిపారు. లో ఎండ్ ల్యాప్టాప్స్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. పేరుతోపాటు ధర కూడా.. కంపెనీలు ఎప్పటికప్పుడు మోడళ్ల పేరు మారుస్తున్నాయి. కొత్త స్టాక్ వచ్చిందంటే మోడల్ పేరు మారుతోంది. అంతేకాదు ఫీచర్లు మారకపోయినా ధరలను సవరిస్తున్నాయి. చిప్సెట్ కొరతను అడ్డుపెట్టుకుని పూర్తిగా హై ఎండ్ మోడళ్లవైపే మొగ్గు చూపుతున్నాయంటే కంపెనీలు ఏ స్థాయిలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయో అవగతమవుతోంది. కనీస ధరలు ల్యాప్‌టాప్ రూ.18 వేలది కాస్తా రూ.30 వేలకు చేరింది. హై ఎండ్‌లోనూ ధర 20 శాతంపైగా అధికమైంది. డెస్క్‌టాప్ రూ.25 వేల నుంచి రూ.38 వేలకు, ఆల్ ఇన్ వన్ రూ.30 వేల నుంచి రూ.43 వేలు అయింది. ప్రింటర్ల విషయంలో ఇంక్జెట్ రూ.2 వేల నుంచి రూ.4,500లు, లేజర్‌జెట్ రూ.9 వేలది కాస్తా రూ.16 వేలపైమాటే ఉంది. ధర పెరిగినా ప్రింటర్లు దొరకడం లేదు. -
రియల్మీ ల్యాప్‌ట్యాప్.. ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ కావాల్సిందే
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గణనీయమైన వాటా దక్కించుకున్న రియల్మీ ఇప్పుడు ల్యాప్‌ట్యాప్ మార్కెట్‌పై గురి పెట్టింది. రియల్మీ బుక్ పేరుతో పర్సనల్ ల్యాప్‌ట్యాప్‌లు మార్కెట్లోకి తేనుంది. రియల్మీ తక్కువధరలో నాణ్యమైన ఫోన్లు అందించి మొబైల్ మార్కెట్లో మంచి వాటాను దక్కించుకుంది. ఇప్పుడు ల్యాప్‌ట్యాప్‌ల విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో కానుంది. రూ.40,000 రేంజ్లో పవర్ఫుల్ ల్యాప్‌ట్యాప్ తెచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. రియల్మీ బుక్ 1.5 కేజీల బరువుతో 14 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రానుంది. యాంటీగ్లేర్ డిస్ప్లేను అమర్చారు. ఇక సాంకేతిక విషయాలకు సంబంధించి ఇంటెల్ 11 జనరేషన్‌కి చెందిన ఐ కోర్ 3, ఐ కోర్ 5 చిప్సెట్లను ఉపయోగించారు. రిలయ్‌మీ బుక్ లోపలి వైపు సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ ఫినీషింగ్ మధ్యలో కీబోర్డు చూడటానికి బాగుండెలా డిజైల్ చేశారు. ఈ రిలయ్‌మీ బుక్ ఇన్‌బిల్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి రానుంది. అయితే అన్ని ఫీచర్లలోకి ఆకట్టుకునే కొత్త రకం ఫీచర్‌గా లాప్ట్యాప్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనుంది రియల్మీ. ఆగస్టులో రియల్మీ బుక్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.రియల్మీ బుక్‌లో యూఎస్బీ ఏ పోర్టు ఒకటి, యూఎస్బీ సీ టైప్ పోర్టులు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఉన్నాయి. అయితే ఈ రియల్మీ ల్యాప్‌టాప్‌లో బిల్ట్ ఇన్ వెబ్‌కామ్ ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. -
కష్టమర్లకు శామ్సంగ్ షాక్ ! పెరిగిన ధరలు
శామ్సంగ్ మొబైల్ ఫోన్ల ధరలు పెరిగాయి. ఇటీవల శామ్సంగ్ మార్కెట్లోకి తెచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ఓ2, శామ్సంగ్ గెలాక్సీ ఎంఓ2, శామ్సంగ్ గెలాక్సీ12 ధరలు పెరిగాయి. ఈ మెడల్స్ అన్నీ ఈ ఏడాదిలోనే శామ్సంగ్ రిలీజ్ చేసింది. చిప్సెట్ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్లో చిప్సెట్ల ధరలు పెరిగాయి. దాంతో వరుసగా ఒక్కో కంపెనీ తమ మొబైల్ హ్యాండ్సెట్ల ధరలను పెంచుతూ పోతున్నాయి. గత వారం షావోమి నోట్ 10 సిరీస్‌లో మొబైల్ ఫోన్ల ధరలు పెంచింది. తాజాగా శామ్సంగ్ కూడా ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. రూ.500 పెంపు శామ్సంగ్ ఎఫ్ఓ2 మోడల్‌పై రూ. 500 పెరిగింది. 3జీబీ 32 జీబీ స్టోరేజీ, 4 జీబీ 64 జీబీ వేరియంట్లలో ఈ మోడల్ లభిస్తోంది. ఈ ఫోన్ లాంఛ్ చేసినప్పుడు 3 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 8,999 ఉండగా ప్రస్తుతం రూ. 9,499గా ఉంది. 4 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 9,999 నుంచి రూ. 10,499కి చేరుకుంది. శామ్సంగ్ ఎఓ2ఎస్, శామ్సంగ్ ఏ 12ల మోడల్స్‌లో కూడా అన్ని వేరియంట్లపై రూ. 500 వరకు ధర పెరిగింది. అయితే ధరల పెంపుపై శామ్సంగ్ ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. కానీ వెబ్సైట్లో మాత్రం పెంచిన ధరలతోనే ఫోన్ అందుబాటులో ఉంచింది. -
మొబైల్స్‌పై మళ్లీ బాదుడు
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు మరో విడత ధరల పెంపు వడ్డన తప్పేట్లు లేదు. చిప్సెట్లకు తీవ్ర కొరత నెలకొనడంతో కంపెనీలు ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. పరిశ్రమ ఇప్పటికే విడిభాగాల కొరతను ఎదుర్కొంటూ, పన్నుల పెంపు, కరోనా కారణంగా కొన్ని నెలల పాటు అమ్మకాల్లేని పరిస్థితులను చవిచూడగా.. ఇప్పుడు చిప్సెట్ల కొరత రూపంలో మరో సమస్య వచ్చి పడింది. ధరలను మరో విడత పెంచితే 2020లో నాలుగో విడత పెంపు అవుతుంది. ఫోన్ల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెంచొచ్చని తయారీదారులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, అంతర్జాతీయంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరం నెలకొనడంతో ఉత్పత్తులకు–ధరల మధ్య సమతుల్యం విషయంలో కంపెనీలకు సమస్య ఏర్పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5.43 కోట్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నమోదు కాగా.. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం అధికం. చైనాకు చెందిన హువావే నుంచి అతిపెద్ద కాంట్రాక్టు రావడంతో చిప్సెట్ల డిమాండ్–సరఫరా మధ్య అంతరం పెరిగిపోయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చిప్సెట్లకు హువావే భారీ ఆర్డర్ ‘‘హువావే భారీ సంఖ్యలో చిప్సెట్లను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లు సంస్థ అవసరాల పరంగా చూస్తే ఏడాదికి మించినవి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చిప్సెట్లకు తీవ్ర కొరత ఏర్పడింది’’ అని ఓ ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మరో ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ సైతం స్పందిస్తూ.. ‘‘హువావే భారీ ఆర్డర్ మధ్య స్థాయి కంపెనీలకు చిప్సెట్ల సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ కంపెనీలకు సరఫరాదారులతో స్వల్పకాల కాంట్రాక్టులే ఉన్నాయి’’ అని వివరించారు. అంతర్జాతీయంగా అతిపెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీలకు ఇటువంటి పరిస్థితుల నుంచి సాధారణంగా రక్షణ ఉంటుందని.. అయినకానీ, వాటి సరఫరాలపైనా 10–20% వరకు ప్రభావం ఉండొచ్చన్నారు. చిప్సెట్ల సరఫరా ఇప్పుడు మరీ తగ్గిపోయిందంటూ తమ అవసరాల్లో మూడు శాతం వరకే సమకూర్చుకోగలిగిన పరిస్థితి ఉందన్నారు. ఫలితంగా స్పాట్ మార్కెట్ నుంచి చిప్సెట్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీంతో అక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. సరఫరా కొరత కారణంగా స్పాట్ మార్కెట్లో చిప్సెట్ల ధరలు 25–27 శాతం వరకు పెరిగినట్టు పరిశ్రమ అంటోంది. దీంతో మొబైల్ హ్యాండ్సెట్ తయారీ వ్యయం 8–20 శాతం వరకు పెరుగుతుంది. ఈ భారాన్ని కొంతవరకు సర్దుబాటు చేసుకునేందుకు గాను 10 శాతం వరకు ఫోన్ల ధరలను పెంచాలన్నది కంపెనీల ప్రణాళిక. వచ్చే ఏడాది మెరుగుపడొచ్చు.. చిప్సెట్ల సరఫరాలో లోటు కొంత కాలం పాటు కొనసాగొచ్చని ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. సాధారణంగా అదనపు తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలంటే అందుకు ఏడాదన్నా పడుతుందని పరిశ్రమ చెబుతోంది. వచ్చే ఏడాది మొదటి భాగంలో పరిస్థితులు కాస్త మెరుగుపడొచ్చని అంచనా వేస్తోంది. కొరత ఇప్పటికే తటాక స్థాయికి చేరిందని, రానున్న కాలంలో పరిస్థితులు కుదుటపడొచ్చని మొహింద్రూ చెప్పారు. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న కాలంలో భారీ సంఖ్యలో చిప్‌లను కంపెనీలు కొని నిల్వ చేసుకోలేవని.. కొన్ని త్రైమాసికాలకే చిప్‌లు పాతబడడమే కాకుండా, పనికిరాకుండా పోతాయన్నారు. 2020లో ధరల పెంపు ఇలా.. మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదల 2020 ఏప్రిల్‌లో మొదటి విడత చోటుచేసుకుంది. వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడమే ఇందుకు కారణమైంది. చైనా నుంచి వచ్చే విడిభాగాల ధరలు పెరగడంతో ఫోన్ల ధరలు సెప్టెంబర్‌లో మరో విడత పెరిగాయి. ఫోన్ల డిస్ప్లే ప్యానెళ్లపై డ్యూటీని కేంద్రం పెంచడంతో అక్టోబర్‌లో మరో విడత ధరలు పెరిగేందుకు దారి తీసింది. చిప్సెట్ల కొరత కారణంగా పెరిగిన తయారీ వ్యయాలు.. మరో విడత ధరలు పెరిగేందుకు దారీతీయవచ్చు. -
తొలి దేశీ ఎలక్ట్రానిక్ చిప్!!
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌ను నియంత్రించడంతో పాటు 5జీ కనెక్షన్స్‌కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్ చిప్సెట్ పృథ్వీ 3ని బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్స్‌లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని డిజైనింగ్, అభివృద్ధి పూర్తిగా దేశీయంగానే జరిగినట్లు చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి, అధునాతన టీవీ వ్యవస్థ గల చిప్ అని ఆయన పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు ఎదుర్కొంటున్న కాల్స్ నాణ్యతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. వీడియో కంటెంట్‌ను మొబైల్ నెట్వర్క్ నుంచి వేరు చేయడం ద్వారా స్పెక్ట్రంపై ఎక్కువ భారం పడకుండా కాల్ నాణ్యతను పెంచేందుకు ఈ చిప్ తోడ్పడుతుందని సాంఖ్య ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పరాగ్ నాయక్ చెప్పారు. దీనితో.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను శాటిలైట్ ఫోన్లా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ చిప్సెట్స్ను ప్రస్తుతం విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయి. దేశీయంగా అధునాతన సెమీకండక్టర్ తయారీ ప్లాంటు లేకపోవడంతో భారత్‌లో వీటిని ఉత్పత్తి చేయడం లేదు. సాంఖ్య ల్యాబ్స్ ఎలక్ట్రానిక్ చిప్సెట్స్.. దక్షిణ కొరియాలోని శామ్సంగ్ ప్లాంటులో తయారవుతున్నాయి. -
‘కంప్యూటర్’ నగరం!
ఈ ఫొటోను ఓ సారి పరిశీలించండి.. ఏముంది కంప్యూటర్లోని చిప్స్, ట్రాన్సిస్టర్లే కదా అనుకుంటున్నారా.. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అందులో ఓ నగరం ఉంటుంది. అవును ఈ ఫొటోలో ఉన్నది మన్ హట్టన్ నగరం. అదేంటి నిజంగా ఆ నగరం అలాగే ఉంటుందా అని అనుకుంటున్నారా..? అది నిజమైన నగరం కాదు కానీ.. అమెరికాలోని న్యూయార్క్ పక్కనే ఉండే మన్హట్టన్ను పోలి ఉండేలా నిర్మించారు. కంప్యూటర్లోని పనికిరాని వస్తువులను ఉపయోగించి దీన్ని తయారు చేశాడు ఓ స్కూల్ పిల్లాడు. జింబాబ్వేకు చెందిన జేడ్ మెంక్ అనే 17 ఏళ్ల కుర్రాడు ఈ నగరాన్ని రూపొందించేందుకు 3 నెలల సమయం తీసుకున్నాడట. అది కూడా 0.0635:100 నిష్పత్తిలో చిన్న తేడా కూడా లేకుండా మొత్తం నగరాన్ని తీర్చిదిద్డాడు. ఇదంతా కూడా ఆ పిల్లాడి స్కూల్ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడి మరీ తయారు చేశాడు. ఇందుకోసం 27 మదర్‌బోర్డులు, 11 సీపీయూలు, 10 సీఆర్టీ మానిటర్ మదర్‌బోర్డులు, 18 ర్యామ్ స్టిక్‌లు, 12 నోకియా ఈ–సిరీస్ ఫోన్లు, 4 వాచ్‌లు, 4 ఆడియో కార్డులు, 2 టెలిఫోన్లు ఇలా వాడి పాడేసిన వస్తువుల సాయంతో తయారు చేశాడు. మన్‌హట్టన్‌లోని భవంతులు, ఆకాశహర్మ్యాలు ఇలా ఒక్కటేమిటి అచ్చు ఆ నగరాన్ని పోలినట్లే ఆ పిల్లాడు తయారు చేశాడు. ఇదంతా తయారు చేయడానికి మంచి తెలివితో పాటు ఎంతో ఓపిక ఉండాలి కదా..! -
4జీ ఫీచర్ ఫోన్ల కోసం క్వాల్కామ్ చిప్సెట్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీ సంస్థ క్వాల్కామ్ తాజాగా క్వాల్కామ్ 205 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఇది సుమారు రూ. 3,500 మేర ధర ఉండే 4జీ ఫీచర్ ఫోన్స్‌లో తయారీలో ఉపయోగపడనుంది. భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో 4జీ టెక్నాలజీ, ఫీచర్ ఫోన్స్ వినియోగం గణనీయంగా ఉందని క్వాల్కామ్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జిమ్ కేథీ చెప్పారు. తమ కొత్త చిప్సెట్.. ఫీచర్ ఫోన్స్‌లో 4జీ అనుభూతిని అందించగలిగేలా మొబైల్స్ తయారీ సంస్థలు, ఆపరేటర్లు, కంటెంట్ ప్రొవైడర్లకు ఉపయోగపడగలదని ఆయన వివరించారు. భారత్‌లో 4జీ ఫీచర్ ఫోన్ల విక్రయానికి సంబంధించి రిలయన్స్ జియో, మైక్రోమ్యాక్స్, మెగాఫోన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్ తదితర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జిమ్ పేర్కొన్నారు.