4జీ ఫీచర్ ఫోన్ల కోసం క్వాల్‌కామ్ చిప్‌సెట్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీ సంస్థ క్వాల్‌కామ్ తాజాగా క్వాల్‌కామ్ 205 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఇది సుమారు రూ. 3,500 మేర ధర ఉండే 4జీ ఫీచర్ ఫోన్స్‌లో తయారీలో ఉపయోగపడనుంది. భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో 4జీ టెక్నాలజీ, ఫీచర్ ఫోన్స్ వినియోగం గణనీయంగా ఉందని క్వాల్‌కామ్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జిమ్ కేథీ చెప్పారు.
తమ కొత్త చిప్‌సెట్.. ఫీచర్ ఫోన్స్‌లో 4జీ అనుభూతిని అందించగలిగేలా మొబైల్స్ తయారీ సంస్థలు, ఆపరేటర్లు, కంటెంట్ ప్రొవైడర్లకు ఉపయోగపడగలదని ఆయన వివరించారు. భారత్‌లో 4జీ ఫీచర్ ఫోన్ల విక్రయానికి సంబంధించి రిలయన్స్ జియో, మైక్రోమ్యాక్స్, మెగాఫోన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్ తదితర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జిమ్ పేర్కొన్నారు.