Qualcomm
-
హైదరాబాద్‌లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) ఇండియా మిషన్ డైరెక్టర్ 'వీణా రెడ్డి' హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ క్వాల్కమ్ ఇండియాకు సంబంధించిన ఓఆర్ఏఎన్ రీసెర్చ్ ల్యాబ్‌లను సందర్శించారు. ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ముందుకు సాగుతుందో గమనించారు.యూఎస్ఏఐడీ 5జీ అండ్ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌లతో సహా కొత్త వైర్లెస్ టెక్నాలజీలను పరీక్షించడంలో భారతీయ టెలికమ్యూనికేషన్ కంపెనీలకు కొన్ని సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది టెలికమ్యూనికేషన్ హార్డ్‌వేర్ అమెరికన్ సరఫరాదారు అయిన 'క్వాల్కమ్ టెక్నాలజీ'.క్వాల్కమ్ టెక్నాలజీ సహకారంతో.. భారతీయ టెలికామ్ రంగం కొత్త ఆవిష్కరణలకు పునాది వేస్తుంది, తద్వారా అనేక గ్లోబల్ అప్లికేషన్ల పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఈ సందర్భంగా వీణా రెడ్డి మాట్లాడుతూ.. జీ20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా చెప్పినట్లుగానే యునైటెడ్ స్టేట్స్, భారతదేశంలో విశ్వసనీయ టెలికమ్యూనికేషన్స్ వృద్ధి చెందుతాయని అన్నారు.డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సును పెంచడమే ప్రధాన లక్ష్యం. భారతదేశంలో సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైర్లెస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు మెరుగుపరచడానికి మేము ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని వీణా రెడ్డి పేర్కొన్నారు. -
రూ.8,200కే 5జీ స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే..
భవిష్యత్తును శాసించే టెక్నాలజీల్లో 5జీ సాంకేతికత ప్రధానమైంది. మనం ప్రస్తుతం వాడుతున్న ఇంటర్నెట్ను కంటే మరింత వేగంగా అందించేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్స్ వస్తువులు 5జీ టెక్నాలజీకి అనువుగా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ సాంకేతికతకు సరిపడే మొబైల్ఫోన్లను కొనుగోలు చేయాలి. అలాంటి వారికి రిలయన్స్, క్వాల్కామ్ కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. తక్కువ ధరకే 5జీ చిప్ ఆధారిత స్మార్ట్ఫోన్లను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు అమెరికాకు చెందిన సెమీకండక్టర్ సంస్థ క్వాల్కామ్ తెలిపింది. ధర 99 డాలర్ల లోపు (సుమారు రూ.8,200) ఉండనుంది. గిగాబిట్ 5జీ స్పీడ్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతూ... ఈ చిప్‌లో 2 యాంటెనా 5జీ స్టాండలోన్ (ఎస్ఏ- 2ఆర్ఎక్స్) సొల్యూషన్ ఉందని, దీని వల్ల ఈ ధరల విభాగంలోని 4జీ కంటే కూడా 5 రెట్ల వరకు అధిక వేగం ఉంటుందని పేర్కొంది. ఇదీ చదవండి: ప్రముఖ యాప్‌లో కాల్‌రికార్డింగ్ ఫీచర్.. ఫోన్లలో ఈ చిప్‌ను వాడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మందికి 5జీ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిప్‌తో కూడిన మొదటి ఫోను ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ స్థాయి చిప్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేయడంతో భాగంగా రిలయన్స్ జియోతో పాటు ఇతర ఫోన్ల తయారీ కంపెనీలతో క్వాల్కామ్ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. -
కేంద్రం కొత్త పాలసీ? స్మార్ట్ఫోన్లలో లైవ్ టీవీ.. వ్యతిరేకిస్తున్న కంపెనీలు
స్మార్ట్ఫోన్లలో టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని శాంసంగ్, క్వాల్కమ్, ఎరిక్సన్,నోకియాతో పాటు ఇతర టెక్నాలజీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో లైవ్‌టీవీ బ్రాడ్ కాస్ట్ సర్వీసుల్ని అందించాలంటే ఫోన్లలోని హార్డ్వేర్లని మార్చాలని, అలా మార్చడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు మరో 30 డాలర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయంటూ రాయిటర్స్ ఓ నివేదికను విడుదల చేసింది. అయితే, కేంద్రం టీవీ ప్రత్యక్ష ప్రసారాల కోసం సెల్యూలర్ నెట్‌వర్క్‌తో పనిలేకుండా డైరెక్ట్‌గా స్మార్ట్ ఫోన్లలో లైవ్ సిగ్నల్స్ ఉంటే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చలు సంబంధిత నిపుణలతో చర్చలు జరుపుతుంది. ఈ తరహా సేవలు ఉత్తర అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎస్సీ 3.0 టెక్నాలజీ సాయంతో నేరుగా ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో టెలికం కంపెనీల అవసరం లేకుండానే టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలకు వీలుంది. ఇప్పుడు ఇదే పద్దతిని భారత్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఏటీఎస్సీ 3.0కు అనుగుణంగా ప్రస్తుత దేశీయ మార్కెట్లోని ఏ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవు. ఒకవేళ కేంద్రం లైవ్ టీవీ పాలసీని అమలు చేస్తే తయారీ వ్యవస్థలో భారీ మార్పులు చేయాల్సి వస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. ఇది తమకు చాలా నష్టమని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి కంపెనీల ఆందోళనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!
స్మార్ట్ఫోన్లలో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సాధారణ సిమ్‌కార్డులకు కాలం చెల్లి వాటి స్థానంలో డిజిటల్ సిమ్‌లు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 14, 14ప్రో మోడల్‌లలో ఇప్పటికే ఈ-సిమ్ టెక్నాలజీ ఉంది. అంటే ఈ ఫోన్లలో ప్రత్యేకంగా సిమ్ ట్రేలు ఉండవు. ఇదే క్రమంలో మరో కొత్త టెక్నాలజీ రాబోతోంది. క్వాల్కామ్ (Qualcomm), థేల్స్ (Thales) సంయుక్తంగా మొదటిసారి ఇంటిగ్రేటెడ్ సిమ్(ఐ-సిమ్) సర్టిఫికేషన్‌ను ప్రకటించాయి. దీంతో ఫోన్లలో సాధారణ సిమ్ కార్డులతో పని ఉండదు. Snapdragon 8 Gen 2తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్ల ప్రధాన ప్రాసెసర్‌లో ఈ ఐ-సిమ్‌ను పొందుపరుస్తారు. దీంతో ఇక ప్రత్యేకమైన చిప్ అవసరం ఉండదు. ఈ ఐ-సిమ్ టెక్నాలజీ.. ప్రస్తుతం ఉన్న ఈ-సిమ్ల మాదిరిగానే డిజిటల్ సైనప్‌లు, సేఫ్టీ ఫీచర్స్‌ను అందిస్తుంది. కానీ దీంతో మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఐ-సిమ్ కూడా ఈ-సిమ్ లాగా రిమోట్ ప్రొవిజనింగ్ స్టాండర్డ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే మొబైల్ ఆపరేటర్లు ఈ-సిమ్ టెక్నాలజీ సపోర్ట్ కోసం ఫోన్లను ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేయనవసరం లేదు. ఫోన్లలో సిమ్ స్లాట్ ఉండదు కాబట్టి ఆ స్థలాన్ని పెద్ద బ్యాటరీలు, ఇతర ముఖ్యమైన భాగాలను చేర్చడానికి ఉపయోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) జీఎస్ఎం అసోసియేషన్ ఆమోదించిన ఈ ఐ-సిమ్ టెక్నాలజీ అభివృద్ధిపై క్వాల్‌కాం టెక్నాలజీస్, థేల్స్ సంస్థలు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఈ-సిమ్‌తో పాటు థేల్స్ 5జీ ఐ-సిమ్ టెక్నాలజీ.. తమ కస్టమర్లకు మెరుగైన ఎయిర్-ది-ఎయిర్ కనెక్టివిటీ, ఉత్సాహకరమైన ఉత్పత్తులను అందించేందుకు మొబైల్ తయారీదారులు, ఆపరేటర్లకు మరింత అవకాశాన్ని ఇస్తుందని థేల్స్ మొబైల్ ఉత్పత్తుల విభాగం వైస్ ప్రెసిడింట్ గుయిలామ్ లాఫయిక్స్ పేర్కొన్నారు. -
5జీ టెక్నాలజీ: హెచ్ఎఫ్సీఎల్, క్వాల్కామ్ జట్టు
న్యూఢిల్లీ: 5జీ అవుట్డోర్ స్మాల్ సెల్ ఉత్పత్తులను డిజైనింగ్, అభివృద్ధి చేసేందుకు క్వాల్కామ్ టెక్నాలజీస్‌తో జట్టు కట్టినట్లు దేశీ టెలికం పరికరాల తయారీ సంస్థ హెచ్ఎఫ్సీఎల్ వెల్లడించింది. టెల్కోలు 5జీ సేవలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో నిరంతరాయ 5జీ అనుభూతిని అందించేందుకు స్థూల నెట్వర్క్కి అనుబంధంగా చిన్నపాటి అవుట్డోర్ సెల్స్ కూడా అవసరమవుతాయని పేర్కొంది. పెద్ద బేస్ స్టేషన్ల కవరేజీ అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతాలు లేదా అస్సలు లేని ప్రాంతాల్లోనూ స్మాల్ సెల్స్ ఏర్పాటుతో సర్వీసులను మెరుగుపర్చవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫార్చూన్ బిజినెస్ ఇన్సైట్స్ అంచనాల ప్రకారం 2020లో 740 మిలియన్ డాలర్లుగా ఉన్న 5జీ స్మాల్ సెల్ మార్కెట్ 2028 నాటికి 17.9 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
అందుబాటులోకి 5జీ, భారత్‌లో ఇక టెక్నాలజీకి తిరుగుండదు
న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రావడమనేది టెక్నాలజీని మెరుగుపర్చుకోవడానికి సంబంధించి ఒక ఉత్ప్రేరకం లాంటి ఘటనగా ఉండగలదని చిప్సెట్ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో అమోన్ తెలిపారు. లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యంలోని వర్ధమాన దేశాల్లో 5జీ విస్తరించడానికి దోహదపడగలదని పేర్కొన్నారు. అలాగే, వివిధ ధరల్లో 5జీ పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు సహాయపడుతుందని అమోన్ వివరించారు. మరోవైపు, భవిష్యత్ డిజిటల్ ఎకానమీలో ఎలక్ట్రానిక్ చిప్స్ కీలకమైనవిగా మారనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ పరిశ్రమలో ముఖ్య పాత్ర పోషించేందుకు భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పటిష్టమైన సెమీకండక్టర్ల సరఫరా వ్యవస్థను నిర్మించడం ఏ ఒక్క దేశం వల్లనో సాధ్యం కాదని.. ఇందుకోసం అమెరికా, యూరప్ దేశాలు, భారత్ మొదలైనవన్నీ కలిసి పనిచేయాల్సి ఉంటుందని అమోన్ పేర్కొన్నారు. -
రూ.15వేలకే ల్యాప్‌ట్యాప్,‘రిలయన్స్ జియో సరికొత్త సంచలనం!’
ల్యాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త సంచలనం సృష్టించనుంది. రూ.15వేల బడ్జెట్ ధరలో ల్యాప్ ట్యాప్‌ను విడుదల చేయనుంది. 4జీ సిమ్ కనెక్ట్ చేస్తూ లో బడ్జెట్ ల్యాప్ ట్యాప్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జియో అధినేత ముఖేష్ అంబానీ ఇప్పటికే జియో బుక్ కోసం టెక్ దిగ్గజం క్వాల్కామ్, మైక్రోసాఫ్ఠ్‌తో చేతులు కలిపారు. ఇప్పుడు ఈ లోబడ్జెట్ ల్యాప్ ట్యాప్ చిప్ కోసం యూకేకి చెందిన ఏఆర్ఎం కంపెనీతో జతకట్టినట్లు..ఈ సంస్థ తయారు చేసిన చిప్‌తో విండోస్ ఓఎస్ తో పాటు మరికొన్ని యాప్స్ వినియోగించుకునే సౌలభ్యం కలగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ల్యాప్ ట్యాప్‌పై జియో ప్రతినిధులు ఇప్పుటి వరకు స్పందించలేదు. ఈ నెలలో విడుదల జియో సంస్థ ఈ సెప్టెంబర్ నెలలో ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జియోఫోన్ మాదిరిగానే, 5జి ఎనేబుల్డ్ వెర్షన్‌ను సైతం ఈ ల్యాప్ ట్యాప్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని తెలుస్తోంది. జియో ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్లు ఈ ల్యాప్ ట్యాప్‌లో జియో సొంత ఆపరేటింగ్ సిస్టం ‘జియో ఓఎస్’ ఉండనుంది. కావాల్సిన యాప్స్‌ను జియోస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కార్పొరేట్ ఉద్యోగులు వినియోగించే ట్యాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా జియో ల్యాప్‌ట్యాప్ పనిచేస్తుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 5జీ, ఏమిటో వింత పరిణామం! -
'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ
సాక్షి,ముంబై: భారతదేశంలో 'అల్ట్రా-అఫర్డబుల్' 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఇందుకోసం జియో గూగుల్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ పలు కీలక విషయాలను వెల్లడించారు. (Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి) మేడ్ ఇన్ ఇండియా 5జీ సేవలకుగాను ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలను భాగస్వాములుగా ఉండటమ విశేషమని ముఖేష్ అంబానీ అన్నారు. జియో ప్రస్తుతం మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సిస్కో వంటి గ్లోబల్ నెట్వర్క్ టెక్నాలజీ ప్రొవైడర్లతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. అలాగే ఇండియా 5జీ సొల్యూషన్స్ డెవలప్మెంట్కి క్వాల్కంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, రిటైల్ దిగ్గజం ఈ సంవత్సరం ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. అలాగే తన తల్లి నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ అనేక సేవలందించిందని తెలిపారు. -
క్వాల్కామ్ సెంటర్ అక్టోబరుకల్లా రెడీ!
సెమికండక్టర్ల తయారీ సంస్థ, వైర్లెస్ సేవల్లో ప్రసిద్ధి చెందిన క్వాల్కామ్ సంస్థ అమెరికా వెలుపల హైదరాబాద్‌లో నిర్మిస్తున్న అతి పెద్ద సెంటర్ అక్టోబరు కల్లా అందుబాటులోకి రానుంది. నగరంలోని రాయదుర్గం ఐటీ కారిడార్‌లో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ నిర్మాణం జరుపుకుంటోంది. దీని కోసం క్వాల్కామ్ రూ.3905 కోట్లు వెచ్చిస్తోంది. హైదరాబాద్‌లో భారీ క్యాంపస్‌ల నిర్మాణానికి అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ సంస్థలు ముందుకు వచ్చిన సందర్భమైన 2018లో క్వాల్కామ్ నుంచి కూడా ప్రకటన వెలువడింది. తాజాగా భవణ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఆ కంపెనీ ప్రతినిధులు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌కు వెల్లడించారు. ఈ క్యాంపస్ అందుబాటులోకి వస్తే సుమార 8,700ల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. క్వాల్కామ్ ఉత్పత్తి చేస్తున్న స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌కి మొబైల్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. -
దిగ్గజ కంపెనీలు భాగ్యనగర్ దిశగా!
సాక్షి, హైదరాబాద్: మరో మూడు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. భారీ పెట్టుబడులతో ఆ కంపెనీలు తరలిరానున్నా యి. ఈ కంపెనీల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సాఫ్ట్ వేర్, వైర్లెస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల రంగంలో క్వాల్కమ్, గోల్ఫ్ బ్రాండ్లలో ‘కాల్‌అవే గోల్ఫ్’తోపాటు ఎలక్ట్రిక్ వాహన రంగం లోని ఫిస్కర్ కంపెనీ తమ కార్యాలయాలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో మం గళవారం శాండియాగోలోని క్వాల్కమ్, ‘కాల్‌అవే గోల్ఫ్’, లాస్ ఏంజెలిస్‌లోని ఫిస్కర్ ప్రధాన కార్యా ల యాల్లో ఆ సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. క్వాల్కమ్ సంస్థ సీఎఫ్‌వో ఆకాశ్ ఫాల్కీవాలా, ఉపాధ్యక్షులు జేమ్స్ జిన్, లక్ష్మి రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్సింగ్లతో కూడిన ప్రతినిధుల బృందం కేటీఆర్‌తో చర్చలు జరిపింది. క్వాల్కమ్ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయా న్ని హైదరాబాద్‌లో ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రారంభించనుందని తెలిపింది. పెట్టుబడి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ.3,904 కోట్లు పెట్టనున్నట్లు, 8,700 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ పాల సీల వల్లే తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు క్వాల్కమ్ ప్రతినిధి బృం దం వెల్లడించింది. అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్ డివైస్ల వినియోగం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో భాగస్వామ్యానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భవిష్యత్తులో సెమీకండక్టర్ చిప్ తయారీ వంటి రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాల్కమ్ పెట్టుబడి ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిస్కర్ ఐటీ, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్.. లాస్ ఏంజెల్స్‌లోని ఫిస్కర్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో హెన్రీక్ ఫిస్కర్, సీఎఫ్‌వో గీతా ఫిస్కర్‌లతో కేటీఆర్ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారనుందని కేటీఆర్ వివరించా రు. జఢ్‌ఎఫ్, హ్యుందాయ్ వంటి పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ను త్వర లో ఏర్పాటు చేస్తామని, ఇందులో భాగస్వాములు కావాలని మంత్రి కోరగా ఫిస్కర్ కంపెనీ అంగీకరిం చింది. ఈ సెంటర్‌తో 300 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయని కంపెనీ తెలిపిం ది. భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరించి, మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొంది. ఫిష్కర్ కంపెనీ తయారు చేసిన ఓషన్ మోడల్ ఎలక్ట్రిక్ కారును కేటీఆర్ పరిశీలించారు. ‘కాల్‌అవే’తో 300 మందికి ఉపాధి.. ‘కాల్‌అవే గోల్ఫ్’ సంస్థకు ఏటా 3.2 బిలియన్ డాల ర్ల రాబడి ఉంది. హైదరాబాద్ కాల్‌అవే డిజిటెక్ సెంటర్ ద్వారా ప్రాథమిక దశలో 300 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌తో కార్యకలాపాలు ప్రారంభమ వుతాయి. అంతర్జాతీయ కార్యకలాపాలకు డేటా ఎనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అవసరమైన సేవలను హైదరాబాద్ డిజిటెక్ సెంటర్ ద్వారా అందిస్తుంది. అత్యంత విలువైన గోల్ఫ్ క్రీడాపరికరాలు, వివిధ రంగాలకు చెందిన వారి అభిరుచుల మేరకు అంతర్జాతీయ బ్రాండ్లను కలిగి ఉన్న సంస్థగా కాల్అవేకు పేరుంది. కాల్‌అవే గోల్ఫ్, ఒజియో, ట్రావిస్ మ్యాథ్యూ, జాక్ వోల్ఫ్స్కిన్ వం టి ప్రముఖ బ్రాండ్లు కాల్‌అవే జాబితాలో ఉన్నా యి. కేటీఆర్ భేటీలో స్పోర్ట్స్ టూరిజం, రాష్ట్రంలో క్రీడాపరికరాల తయారీ అవకాశాలపై చర్చించడం తోపాటు అనేక నగరాల పేర్లు పరిశీలించిన తర్వాత హైదరాబాద్‌ను డిజిటెక్ సెంటర్ ఏర్పాటుకు అనువైనదిగా ఎంపిక చేసినట్లు కాల్‌అవే ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చీఫ్ రిలేషన్స్ అధికారి ఆత్మకూరి అమర్నాథ్రెడ్డి, డిజిటల్ మీడియా డైరె క్టర్ దిలీప్ కొణతం, కాల్‌అవే తరపున కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రియాన్ లించ్, సీఐవో సాయి కూరపాటి పాల్గొన్నారు. -
పెద్ద చిక్కుల్లో పడిన షావోమి ఇండియా..!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షావోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద చిక్కుల్లో పడింది. షావోమి ఇండియా కస్టమ్స్ సుంకాన్ని ఎగవేస్తోందని వచ్చిన సమాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) షావోమి, దాని కాంట్రాక్టు ఉత్పత్తిదారులపై దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తు సందర్భంగా డీఆర్ఐ దేశవ్యాప్తంగా ఉన్న షావోమి ఇండియా కార్యాలయాల్లో సోదాలను నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా ఒప్పంద నిబంధన ప్రకారం క్వాల్కామ్ యూఎస్ఏ, బీజింగ్ షావోమి మొబైల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్‌కు షావోమి ఇండియా రాయల్టీ, లైసెన్స్ ఫీజుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నట్టు గుర్తించింది. భారత్‌లో ఎంఐ బ్రాండ్‌తో షావోమి ఇండియా మొబైల్స్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్లలో కొన్నింటిని విదేశాల నుంచి షావోమి ఇండియా దిగుమతి చేసుకుంటుంది. లేదంటే విడి పరికాలను ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబుల్డ్ చేస్తుంది. దేశంలోని స్మార్ట్‌ఫోన్ విపణిలో షావోమికి గణనీయమైన వాటానే ఉంది. విలువను తగ్గించి షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించామని డీఆర్ఐ తెలిపింది. సంబంధిత కంపెనీ, ఒప్పంద తయారీ సంస్థల్లో పరిశోధన చేపట్టామని పేర్కొంది. 'షావోమి ఇండియా, సంబంధిత తయారీ కంపెనీల్లోని కీలక ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేశాం. షావోమి కంపెనీ డైరెక్టర్ ఒకరు రాయల్టీ చెల్లించినట్టు ధ్రువీకరించారు' అని డీఆర్ఐ ప్రకటించింది. రాయల్టీ, లైసెన్స్ ఫీజు చెల్లించడమే కాకుండా ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తి లావాదేవీల విలువను జోడించలేదని వెల్లడించింది. దీంతో షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేసినట్టు గుర్తించామని పేర్కొంది. ఇలా చేయడం కస్టమ్స్ చట్టం-1962 కస్టమ్స్ వాల్యుయేషన్ నిబంధనలను, 2007లోని సెక్షన్ 14ను ఉల్లంఘించడమే అని తెలిపింది. 'డీఆర్ఐ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత 1962, కస్టమ్స్ చట్టం ప్రకారం.. షావోమి టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 01-4-2017 నుంచి 30-06-2020 కాలానికి రూ.653 కోట్లు రికవరీకి డిమాండ్ చేస్తూ 3 షోకాజ్ నోటీసులు జారీ చేశాం' అని డీఆర్ఐ తెలిపింది. (చదవండి: ఆకర్షణీయమైన లుక్స్‌తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..!) -
ఐఐటీ చరిత్రలో ఖరగ్‌పూర్ రికార్డు.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే!
దేశంలోని ప్రముఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్ ఈ ఏడాది ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్నట్లు పేర్కొంది. ప్రతిష్టాత్మక ఐఐటీలో 1100 మందికి పైగా ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. "కరోనా మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ, ఐఐటీ ఖరగ్‌పూర్ అసాధారణ స్థాయిలో ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్లను(పీపీఓలు) పొందింది. ఇది భారతదేశంలోని అన్ని ఇతర ఉన్నత విద్యా సంస్థలలో పోలిస్తే చాలా ఎక్కువ" అని ఖరగ్‌పూర్ ఐఐటీ తెలిపింది. ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా విద్యార్థులు 35 అంతర్జాతీయ ఆఫర్లను పొందినట్లు సంస్థ తెలిపింది. సంవత్సరానికి ₹2-2.4కోట్ల ప్యాకేజీలతో ఇద్దరు ప్రధాన రిక్రూటర్లు రెండు పెద్ద ఆఫర్లు చేశారని తెలిపింది. "ఇప్పటి వరకు, మాకు ₹1 కోటికి వేతనంతో 20కి పైగా ఆఫర్లు వచ్చాయి" అని సంస్థ పేర్కొంది. ఐఐటీ ఖరగ్‌పూర్ ను సందర్శించిన రిక్రూటర్లలో క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఉబెర్, ఇంటెల్, అమెరికన్ ఎక్స్ ప్రెస్, హనీవెల్, శామ్ సంగ్, ఐబిఎమ్ ఉన్నాయి అని కళాశాల పేర్కొంది. ప్లేస్ మెంట్ సెషన్ డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు సాగిందని తెలిపింది. సాఫ్ట్ వేర్, ఎనలిటిక్స్, కన్సల్టింగ్, కోర్ ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ - అన్ని రంగాలలో 100కి పైగా కంపెనీలు నియామక ప్రక్రియలో పాల్గొన్నట్లు ఐఐటి-ఖరగ్ పూర్ ప్రతినిధి తెలిపారు. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారికి గుడ్‌న్యూస్..!) -
ప్రపంచంలోనే తొలిసారిగా...! మీడియాటెక్ నుంచి పవర్ఫుల్ ప్రాసెసర్..!
క్వాలకమ్ పోటీగా ప్రముఖ చిప్‌మేకర్ మీడియా టెక్ సంస్థ ‘డైమెన్సిటీ 9000 5జీ’ పేరుతో కొత్త చిప్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త చిప్‌సెట్‌ను ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో వాడనున్నట్లు తెలుస్తోంది. ఎన్4 చిప్‌మేకింగ్ ద్వారా ఈ కొత్త డైమెన్సిటీ 9000 5జీ చిప్సెట్ తయారుచేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఎన్4 చిప్‌మేకింగ్ టెక్నాలజీ ఉపయోగించి చేసిన చిప్‌గా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. కాంపాక్ట్ సైజ్‌తో, అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్తో పనిచేయనున్నాయి. చదవండి: భారత మార్కెట్లపై దండయాత్ర చేయనున్న మోటరోలా..! గత ఏడాది మీడియాటెక్ సంస్థ సుమారు 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం లాంచ్ చేసిన కొత్త చిప్సెట్తో ఈ ఏడాది గాను కంపెనీ ఆదాయం 17 బిలియన్ల డాలర్లకు చేరుకోవాలని మీడియాటెక్ భావిస్తోంది. మీడియాటెక్ 4జీ చిప్‌లు బహిరంగ మార్కెట్లలో 10 డాలర్లకు అమ్ముడవుతుండగా...ఈ 5జీ చిప్సెట్లను 30 నుంచి 50 డాలర్లకు విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని 5జీ స్మార్ట్‌ఫోన్ చిప్ తయారీ కంపెనీల్లో మీడియో టెక్ మూడో స్థానంలో నిలవగా, తొలి స్థానంలో క్వాలకమ్, రెండో స్థానంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చిప్సెట్స్ ఉన్నాయి. షావోమీ, ఒప్పో, వివోకు చెందిన తక్కువ, మధ్య స్థాయి స్మార్ట్ఫోన్లలో మీడియాటెక్ ప్రాసెసర్లను వాడుతున్నారు. చదవండి: క్రిప్టో కరెన్సీపై ఆర్ఎస్ఎస్ శాఖ కీలక వ్యాఖ్యలు -
ఏపీలో తయారవుతున్న జియో నెక్ట్స్ ఫోన్లు.. ఎక్కడంటే?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నుంచి జియో నెక్ట్స్ ఫోన్ ప్రకటన వెలువడినప్పటి నుంచి దేశమంతటా ఆసక్తి నెలకొంది. ఈ చౌకైన అధునాతన ఫోన్ చేజిక్కించుకునేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫోన్‌ను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో తయారు చేస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన నియోలింక్ ప్లాంట్లలో ఇవి తయారుకానున్నాయి. సూపర్ ఫీచర్స్ మన దేశ అవసరాలు, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఈ ఫోన్లో ఫీచర్లు పొందు పరిచారు. ముఖ్యంగా పది భాషలను అనువదించే ఫీచర్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులోని రీడ్ అలౌడ్ ఫంక్షన్ స్క్రీన్‌పై తెరిచిన యాప్‌లో ఉన్న కంటెంట్‌ను బిగ్గరగా చదువుతుంది. వాయిస్ అసిస్టెంట్‌తో ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇంటర్నెట్ నుంచి కావాల్సిన సమాచారం పొందవచ్చు. సాఫ్ట్వేర్ దానంతట అదే అప్డేట్ అవుతుందని కంపెనీ తెలిపింది. హై క్వాలిటీ ధర తక్కువైనా క్వాలిటీ విషయంలో రిలయన్స్ కాంప్రమైజ్ కావడం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ ప్రాసెసర్‌ను పొందుపరిచారు. జియోఫోన్ నెక్ట్స్ కోసం ఆన్‌డ్రాయిడ్ ఆధారిత అత్యాధునిక ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్‌తో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ దీపావళి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. -
సొంత దుకాణానికి సిద్ధమైన ఒప్పో...! వారికి మాత్రం పెద్ద దెబ్బే..!
స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో చిప్సెట్ మంటలను రాజేసింది. ఎవరికీవారు తమ చిప్సెట్లను తామే తయారుచేసుకోవడానికి పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సిద్దమైయ్యాయి. చిప్సెట్ల తయారీ విషయంలో గూగుల్, క్వాల్కమ్ మధ్య విభేదాలు మొదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో కూడా తమ సొంత చిప్ సెట్ల తయారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సొంత చిప్సెట్లను తయారుచేసే ఆపిల్, శాంసంగ్, గూగుల్ కంపెనీల సరసన ఒప్పో చేరనుంది. చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు క్వాలకమ్కు పెద్ద దెబ్బే...! ఒప్పో తీసుకున్న నిర్ణయంతో ప్రముఖ మొబైల్ చిప్ తయారీ దిగ్గజం క్వాలకమ్కు భారీ దెబ్బ తగలనుంది. ఒప్పో స్వంత చిప్సెట్లతో క్వాలకమ్ భారీ ఎత్తున నష్టపోనుంది ఒప్పో తన హై-ఎండ్ చిప్‌లను 2023 లేదా 2024 లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జపాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ నిక్కీ నివేదించింది. ప్రపంచంలో నాల్గో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఒప్పో నిలిచింది. వివో, రియల్మీ , వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఒప్పో మాతృ సంస్థగా నిలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్, మీడియాటెక్ చిప్సెట్లను వాడుతున్నారు. కాగా హై ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల తయారీలో కంపెనీ తన స్వంత చిప్సెట్లను వాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సొంత చిప్ సెట్లతో పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు...! ప్రపంచంలోని అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇప్పుడు వేగవంతమైన కస్టమ్ చిప్‌ను అభివృద్ధి చేసే రేసులో ఉన్నాయి. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చిప్సెట్ తయారీ కంపెనీలకు గడ్డుకాలంగా తయారైంది. గూగుల్ ఇప్పటికే పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌లకు బదులుగా గూగుల్ తన సొంత టెన్నార్ చిప్ సెట్లను అమర్చింది. ఆపిల్ ఇప్పటికే ఐఫోన్, ఐప్యాడ్ కోసం తన స్వంత A- సిరీస్ చిప్సెట్లను తయారు చేస్తుంది. శాంసంగ్ తన ఎక్సినోస్ చిప్సెట్తో గెలాక్సీ ఫోన్లను, టాబ్లెట్లకు అందిస్తున్నాయి. హువావే కూడా దాని స్వంత హైసిలికాన్ చిప్సెట్లను తయారు చేస్తోంది. చదవండి: సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..! -
గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా?
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్(ఆల్ఫబెట్ కంపెనీ), చిప్‌మేకర్ క్వాల్కమ్ మధ్య విభేధాలు మొదలయ్యాయి. చిప్ తయారీ విషయంలో గూగుల్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు గూగుల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్వాల్కమ్ ఒక ట్వీట్ చేయడం విశేషం. అమెరికన్ చిప్‌మేకర్ కంపెనీ క్వాల్కమ్.. సొంతంగా చిప్‌లు తయారు చేసుకోవాలన్న గూగుల్ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతోంది. రాబోయే పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్స్‌ను గూగుల్ తాము సొంతంగా రూపొందించిన చిప్ సిస్టమ్‌తో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నిర్ణయంపై క్వాల్కమ్ ట్వీట్ రూపంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. "We've decided to make our own smartphone SoC instead of using Snapdragon" 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 — Snapdragon (@Snapdragon) October 13, 2021 స్నాప్‌డ్రాగన్‌కు బదులు ఇకపై సొంత స్మార్ట్‌ఫోన్ ఎస్‌వోసీని తయారు చేబోతున్నాం అంటూ ఎర్ర జెండాల ఎమోజీతో ఒక ట్వీట్ చేసింది క్వాల్కమ్. ఇప్పటిదాకా పిక్సెల్ ఫోన్లకు చిప్సెట్లను సప్లై చేస్తూ వస్తోంది క్వాల్కమ్. కానీ, తాజా నిర్ణయంతో క్వాల్కమ్కు నష్టం వాటిల్లనుంది. గూగుల్ టెన్సర్ చిప్‌ను నమ్మకూడదంటూ ఆండ్రాయిడ్ యూజర్లను క్వాల్కమ్ హెచ్చరించడం విశేషం. అయితే పొరపచ్చాలు..ఈ రెండు కంపెనీల భవిష్యత్తు వ్యాపారంపై పడే నష్టం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పిక్సెల్ ఫోన్లను మినహాయిస్తే.. మిగతా డివైజ్‌లన్నీ క్వాల్కమ్ ప్రాసెసర్‌లతోనే మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ, రాబోయే రోజుల్లో ఇది శత్రుత్వంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక గూగుల్ డెవలప్ చేస్తున్న సొంత చిప్ అండ్ ప్రాసెసింగ్ వ్యవస్థ 2023 నాటికల్లా మార్కెట్లోకి రానుంది. ప్రపంచంలో 90 శాతం మొబైల్ డివైజ్ వ్యవస్థలో ఉపయోగించే.. బ్లూప్రింట్ ఆఫ్ ఆర్మ్స్ ఆధారంగా గూగుల్ సీపీయూ, మొబైల్ ప్రాసెసర్ ను గూగుల్ తీసుకురాబోతోంది. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం! -
రండి భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయిదు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహా్వనించారు. భారత్‌లో వ్యాపార అవకాశాల గురించి వివరించారు. చిప్ తయారీ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఇ అమోన్, సౌర విద్యుత్ సంస్థ ఫస్ట్ సోలార్ చీఫ్ మార్క్ విడ్మర్, ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ చైర్మన్ స్టీఫెన్ ఎ ష్వార్జ్‌మాన్, అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్, జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్‌తో ప్రధాని భేటీ అయ్యారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం ఐటీ, డిజిటల్ రంగానికి భారత్ ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో నారాయణ్‌తో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సాయుధ బలగాల కోసం భారత్ గణనీయంగా డ్రోన్లను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో మి లిటరీ డ్రోన్ల తయారీ దిగ్గజం జనరల్ అటామిక్స్ సీఈవో లాల్‌తో ప్రధా ని సమావేశమయ్యారు. జనరల్ అటామిక్స్ నుంచి భారత్ ఇప్పటికే కొన్ని డ్రోన్లను లీజుకు కూడా తీసుకుంది. దాదాపు 18 బిలియన్ డాలర్ల విలువ చేసే ద్వైపాక్షిక రక్షణ రంగ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో లాల్ కీలక పాత్ర పోషించారు. చదవండి: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు మరోవైపు, మరిన్ని పెట్టుబడులను సాధించే క్రమంలో అగ్రగామి ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ చైర్మన్ ష్వార్జ్‌మాన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. అటు దేశీయంగా 5జీ టెలికం టెక్నాలజీ అమల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా క్వాల్కామ్ చీఫ్ అమోన్‌తో సమావేశమయ్యారు. దేశీయంగా తయారీ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన్ను ఆహ్వానించారు. ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఫస్ట్ సోలార్ హెడ్ విడ్మర్‌తో సమావేశం సందర్భంగా భారత్‌లో పునరుత్పాదక విద్యు త్ రంగంలో అవకాశాల గురించి ప్రధాని చర్చించినట్లు వివరించింది. -
గూగుల్, యాపిల్.. అంతా గప్పాలేనా?
యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, టెస్లా, బైడూ.. ఈ కంపెనీలకు ఏమైంది? ఒక పక్క చిప్‌ల కొరత, మరోపక్క సొంతంగా తయారు చేసుకుంటామని ప్రకటనలు. ఈ ప్రకటనలు ఆచరణలోకి వచ్చేది ఎప్పుడు?..అమలయ్యేది ఎప్పుడు? పాత ప్రకటనలను తెర మీదకు తెచ్చి.. కొత్తగా డబ్బా కొడుతున్న టెక్ కంపెనీలు ఎందుకంత హడావిడి చేస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలన్నీ సొంతంగా చిప్ తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయన్న వార్తలు ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్, యాపిల్లు ఈ రేసులో ముందున్నాయని, ‘గూగుల్‌బుక్ ల్యాప్‌ట్యాప్’ కోసం గూగుల్ సొంతంగా సీపీయూలను తయారు చేయడంలో చివరి దశకు చేరుకుందని ప్రకటనలు వెలువడుతున్నాయి. కానీ, ఏ లెక్కన చూసినా ఈ ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేది 2023 చివరికే. క్లిక్ చేయండి: ఫేస్ కాదు ఫేక్ బుక్ అయితే సొంత చిప్ తయారీ వ్యవహారం అంత సులువు కాదని, చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని టెక్ నిపుణులు చెప్తున్నారు. తాజాగా టీఎస్ఎంసీ కంపెనీ తైవాన్‌లో అత్యాధునిక చిప్‌ల ఫ్యాక్టరీ పెట్టనున్నట్లు ప్రకటించింది. సుమారు పది బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ ఫ్యాక్టరీ.. పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కోసం ఎన్నేళ్లు పడుతుందో కచ్చితంగా చెప్పడం లేదు. ఈ లెక్కన టెక్ దిగ్గజాలేవీ ఇప్పటికిప్పుడే చిప్ తయారీలోకి స్వయంగా దిగే అవకాశాలేవని, ప్రకటనలన్నీ ఉత్త ప్రకటనలేనని అభిప్రాయపడుతున్నారు. ఆగమేఘాల మీద ప్రకటనలు.. పీసీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, టీవీ, ఆటోమొబైల్స్ రంగాల్లో మైక్రోప్రాసెసర్ల(సెమీ-కండక్టర్)ను ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో వీటికి హై డిమాండ్ ఉంది. అయితే కరోనా టైం నుంచి చిప్ షార్టేజీ మొదలైంది. చాలా వరకు కంపెనీలు బాగా నష్టపోయాయి. ఆ ప్రభావంతో ఉత్పత్తి తగ్గి.. రేట్లు ఆకాశానికి అంటాయి. ప్రత్యేకించి కొన్ని బ్రాండ్లు ప్రొడక్టివిటీ ఉన్నా.. ఎక్కువ రేట్లకు అమ్మేస్తుండడంతో కంపెనీలకు అసహనం పెరిగిపోతోంది. అందుకే సొంతంగా చిప్ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. వరుసగా ఒక్కో కంపెనీలు చిప్ ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి. అయితే ఇలాంటి ప్రకటనల ద్వారా అవతలి కంపెనీలను దిగొచ్చి చేసే స్రా్టటజీ కూడా అయ్యి ఉండొచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. సొంత ఆలోచన మంచిదే ఒకవేళ కంపెనీలు నిజంగా సొంత చిప్ తయారీ రంగంలోకి అడుగుపెట్టినా.. అది మంచి ఆలోచనే అంటున్నారు ‘డైలాగ్ సెమీకండక్టర్’(యూకే) మాజీ బాస్ రస్ షా. ప్రస్తుతం మార్కెట్లో ఒకేరకమైన చిప్స్ ఉన్నాయి. ఇవి కాకుండా తమ డివైజ్‌లకు తగ్గట్లుగా చిప్స్ తయారీ చేసుకోవాలనేది టెక్ కంపెనీల ఉద్దేశం. తద్వారా డివైజ్‌ల సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్ కూడా వాళ్ల నియంత్రణలో ఉంటుంది. పైగా చీప్‌గా వర్కవుట్ అయ్యే వ్యవహారమని, డివైజ్‌లకు అందే ఎనర్జీని కూడా తక్కువగా తీసుకుంటుందని, స్మార్ట్ ఫోన్లు అయినా.. క్లౌడ్ సర్వీసెస్‌లకైనా ఒకేలా పని చేస్తాయని రస్ షా చెబుతున్నారు. పాత ప్రకటనలే! సొంత చిప్‌ల ప్రకటనలు వరుసగా చేస్తున్న బడా కంపెనీలు.. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. నిజానికి నవంబర్ 2020లోనే యాపిల్.. ఇంటెల్ ఎక్స్86 తరహా సొంత ప్రాసెసర్‌ను తయారు చేయబోతున్నట్లు ప్రకటించింది. కానీ, ఆ ప్రయత్నాలు అసలు మొదలుకాలేదు. ఇక టెస్లా ఏమో ఆరు నెలల కిందటే డేటా సెంటర్ల్లోని అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ కోసం ‘డోజో’ చిప్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించుకుంది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్లౌడ్ సర్వీసులు ఉన్న అమెజాన్.. నెట్వర్కింగ్ చిప్‌ను రూపొందించే పనిలో చాలాకాలం నుంచే ఉంది. ఫేస్బుక్ రెండేళ్ల క్రితమే అర్టిఫీషియల్ సొంత చిప్ ప్రకటన చేసింది. గూగుల్ కూడా సేమ్ ఇదే తీరు. ఒకవేళ నిజంగా వీళ్లు రంగంలోకి దిగినా.. డిజైనింగ్ వరకే పరిమితం అవుతారని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క కంపెనీ కూడా చిప్ తయారీ రంగంలోకి దిగే పరిస్థితులు లేవని కరాఖండిగా చెప్తున్నారు. ఒకవేళ ధైర్యం చేస్తే.. తడిసి మోపెడు అవ్వడం ఖాయమంటున్నారు. చదవండి: అసలు చిప్‌లు ఏం చేస్తాయి? వివాదాలు ఎందుకంటే.. -
ఇక మొబైల్ ఫోన్లలో అదిరిపోయే గ్రాఫిక్స్!
ప్రముఖ చిప్సెట్ తయారీ సంస్థ క్వాల్కామ్ తర్వాత తరం రాబోయే చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ కోసం పనిచేస్తోంది. అలాగే, ఈ కంపెనీతో పాటు శామ్సంగ్ కూడా తర్వాతి తరం ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ కోసం పనిచేస్తున్నాయి. ఈ రెండూ కంపెనీలు కూడా ప్రధానంగా మొబైల్ గేమర్లను లక్ష్యంగా పెట్టుకొని వస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఉన్న ఎఎమ్ డి ఆర్డీఎన్ఎ జీపీయు గ్రాఫిక్స్ వల్ల గేమర్స్ కి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. లెనోవో చైనా ఫోన్ బిజినెస్ మేనేజర్ చెన్ జిన్ వీబోలో పోస్ట్ చేసిన ప్రకారం.. స్నాప్‌డ్రాగన్ 895 చిప్సెట్ అప్ గ్రేడ్ జీపీయుతో రానుంది. లెనోవో కంపెనీ నుంచి రాబోయే ఫ్లాగ్ షిప్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లెజియన్ 3 ప్రోను టీజ్ చేసినప్పుడు అతను ఈ సమాచారాన్ని వెల్లడించాడు. స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ ఎస్ఎమ్ 8450 అని కోడ్ నేమ్ కలిగి ఉంది. ఈ ఏడాది చివరిలో హవాయిలో క్వాల్కామ్ వార్షిక సమావేశంలో లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వస్తున్న లీక్స్ ప్రకారం, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్, ఎక్స్65 5జీ మోడెంను 4 ఎన్ఎమ్ మీద నిర్మిస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 5 ఎన్ఎమ్ మీద తయారు చేశారు. స్నాప్‌డ్రాగన్ 895 గల ఫోన్లు ఎంఎంవేవ్/సబ్-5 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ గల 5జీ నెట్ వర్క్ లను కనెక్ట్ చేస్తాయి. ప్రస్తుతం, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 895, ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ తో పోటీ పడటానికి సిద్దం అవుతుంది.(చదవండి: మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు) గేమ్ ఛేంజర్ ఎక్సినోస్ 2200 చిప్సెట్ కొన్ని బెంచ్ మార్క్ లలో యాపిల్ ఏ14 బయోనిక్ చిప్సెట్ ను అధిగమించినట్లు సమాచారం. ముఖ్యంగా, మాన్హాటన్(Manhattan) 3.0 1080పీ అని పిలిచే ఒక బెంచ్ మార్క్ లో ఎక్సినోస్ 2200 చిప్సెట్ సెకనుకు 170.7 ఫ్రేమ్ లను నమోదు చేసింది. ఇది ఏ14 బయోనిక్, స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ లు నమోదు చేసిన 120 ఫ్రేమ్స్ కంటే చాలా ఎక్కువ. 2022లో స్నాప్‌డ్రాగన్ 895, ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ గల శామ్సంగ్ స్మార్ట్ ఫోన్లను మనం చూసే అవకాశం ఉంది. షియోమీ, వన్ ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ ఉపయోగించవచ్చు. ఇక అప్పటి మార్కెట్ ని బట్టి శామ్సంగ్ స్నాప్‌డ్రాగన్ 895, ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు.. శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రాలో స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ను యుఎస్ వంటి మార్కెట్లలో తీసుకొస్తే, ఇతర మార్కెట్లలో ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. -
చిప్‌ల తయారీలోకి ఆపిల్, గూగుల్.. ఏమిటీ వివాదం?
ఎవరనుకున్నారు...???? అమెరికా అమలాపురాలను ఒక్క ఫోన్ కాల్ కలిపేస్తుందని! ఆఫీసు, ఇల్లు, సినిమాహాలు, ఒలింపిక్ క్రీడలు... అరచేతిలో ఇమిడిపోతాయని!! గుడిలో, బడిలో.. వాషింగ్మెషీన్లో.. నడిపే వాహనంలో, తళుకుల బల్బుల్లో.. ఇందుగలదందు లేదన్న సందేహంబు వలదన్నట్టు... చిప్‌లు చేరిపోతాయనీ.. సుఖసౌఖ్యాలను మన దరికి చేరుస్తాయని!! మనిషి మేధకు తాజా తార్కాణమా అన్నట్లు.. యాభై ఏళ్ల క్రితం మొదలైన మైక్రోప్రాసెసర్ ప్రస్థానం... గతం... ప్రస్తుతం.. భవిష్యత్తు...!!! ‘‘స్పర్ధయా వర్ధతే విద్య’’ అంటుంది ఓ సంస్కృత నానుడి. పోటీ ఉంటేనే విద్యలో రాణించగలం అని అర్థం. మరి.. పోటీ వ్యాపారంలో ఉంటే? ఇంకొన్నేళ్లలో మనకు ఇది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటారా? పీసీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్లకు అత్యంత కీలకమైన మైక్రోప్రాసెసర్ల తయారీలో ఇప్పుడు పోటీ నెలకొంది కాబట్టి! మైక్రోప్రాసెసర్ల గతం... ప్రస్తుతం.. భవిష్యత్తుల గురించి తెలుసుకునే ముందు ఆసక్తికరమైన ఈ పోటీ సంగతేమిటో అర్థం చేసుకుందాం. సాక్షి, హైదరాబాద్: నిన్న మొన్నటివరకూ మైక్రోప్రాసెసర్ అంటే.. ఇంటెల్. ఇంటెల్ అంటే మైక్రోప్రాసెసర్ అదీ పరిస్థితి. కాలక్రమంలో సాంసంగ్, టీఎస్ఎంసీ, క్వాల్కామ్, మీడియాటెక్ వంటివి పీసీ, స్మార్ట్‌ఫోన్ మైక్రోప్రాసెసర్ల తయారీ రంగంలోకి దిగినా ఆధిపత్యం మాత్రం ఇంటెల్‌దే కొనసాగింది. కానీ ఆ పరిస్థితులిప్పుడు మారిపోతున్నాయి. దిగ్గజం ఇంటెల్‌ను తోసిరాజని ఒకవైపు ఆపిల్ ఇంకోవైపు గూగుల్ రెండూ తమదైన మైక్రోప్రాసెసర్లను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న క్వాల్కామ్కూ చెక్ పెట్టేందుకు ఆపిల్, గూగుల్‌లు రెండూ పావులు కదుపుతూండటం విశేషం. ఆపిల్ ఇప్పటికే పీసీ, స్మార్ట్ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్‌లు తయారు చేసుకుంటున్నా... క్వాల్కామ్, ఇంటెల్ వంటి సంస్థల చిప్‌లను కూడా కొంతమేరకు ఉపయోగిస్తోంది. త్వరలోనే దీనికీ స్వస్తి చెబుతామని ఆపిల్ ప్రకటించింది. మరోవైపు గూగుల్ కూడా తన స్మార్ట్ఫోన్లు ‘పిక్సెల్ –6’, ‘పిక్సెల్ –6 ప్రో’లకు సొంతంగా మైక్రోప్రాసెసర్లు తయారు చేసుకుంటామని ప్రకటించింది. ఈ పరిణామం కాస్తా.. మరింత సమర్థమైన ఫోన్లు, క్రోమ్‌బుక్‌లు చౌకధరల్లో వినియోగదారుడికి అందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గూగుల్ కూడా 2016లో క్వాల్కామ్ సరఫరా చేసే చిప్‌లతో పిక్సెల్ బ్రాండు స్మార్ట్ఫోన్లను తయారు చేస్తూండగా.. వీటి ధరల విషయంలో పలు విమర్శలు వచ్చాయి. సొంతంగా చిప్‌లు తయారు చేసుకుంటే తాము అనుకున్న ఫీచర్లను స్మార్ట్ఫోన్ల ద్వారా అందించే వీలుంటుందని కంపెనీ భావిస్తోంది. కృత్రిమ మేధ, రియల్‌టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి కొత్త కొత్త టెక్నాలజీలను తమ చిప్‌ల ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏమిటీ వివాదం కంప్యూటర్లకు మాత్రమే కాదు.. స్మార్ట్ఫోన్లకు, ట్యాబ్లెట్లకు, ఇతర ఆపిల్ ఉత్పత్తులకు కొంతకాలం క్రితం వరకూ ఇంటెల్, క్వాల్కామ్లే అందించేవి. అయితే ఆపిల్, గూగుల్ల అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ సామర్థ్యంతో ఉన్న చిప్‌లను తయారు చేయడంలో ఇంటెల్ కొన్నేళ్లుగా వెనుకబడటం, ఇతర కంపెనీల చిప్‌లను వాడటంలో ఉన్న కొన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఆపిల్, గూగుల్ రెండూ సొంతంగా చిప్‌లు తయారు చేసుకోవాలని తీర్మానించుకున్నాయి. పీసీ, స్మార్ట్ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్‌లు తయారు చేసుకున్న ఆపిల్ స్మార్ట్ఫోన్లలోని మెడెమ్లు, ఇతర పరికరాల కోసం మాత్రం క్వాల్కామ్పైనే ఆధారపడుతోంది. కానీ ధరలు ఎక్కువగా ఉండటం, కొన్ని గుత్తాధిపత్య ధోరణిల కారణంగా వీటిని కూడా సొంతంగా తయారు చేసుకోవాలని రెండేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంత సులువా? మైక్రోప్రాసెసర్ల తయారీ అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతాయి. ఇసుక నుంచి సిలికాన్‌ను తయారు చేసే ఫౌండ్రీలను ఏర్పాటు చేయడం మొదలుకొని మిల్లీమీటర్ల సైజున్న చిప్‌లలో వెయ్యికోట్లకుపైగా ట్రాన్సిస్టర్లను ఇమడ్చేలా డిజైన్లు తయారు చేయాలంటే ఏళ్లుపూళ్లవుతాయి. ఆపిల్ పీసీ చిప్‌ల తయారీలో విజయం సాధించినా స్మార్ట్ఫోన్లతో వ్యవహారం అంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. ఇంటెల్ నుంచి కొను గోలు చేసిన మోడెమ్ తయారీ కేంద్రం సాయంతో సొంత తయారీ మొదలుపెట్టనుంది. కాకపోతే చిప్‌ల తయారీతోపాటు క్వాల్కామ్ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలపై విస్తృత పరిశోధనలు, పరీక్షలు చేస్తూండటం, ప్రమాణాలను నిర్ణయించడంలో చాలా ముందున్న కారణంగా 5జీ ఫోన్ల విషయంలో మాత్రం క్వాల్‌కామ్‌పై ఆధారపడాల్సి ఉంటుందని అంచనా. ఏతావాతా.. ఆపిల్ తనదైన స్మార్ట్‌ఫోన్ చిప్‌లను తయారు చేసుకునేందుకు మరికొంత సమయం పట్టనుందన్నమాట. లక్షల కోట్ల వ్యవహారం! మైక్రోప్రాసెసర్ తయారీ మార్కెట్ విలువ ఎకాఎకిన కొన్ని లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇంటెల్, మోటరోలా, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఐబీఎం, సన్ మైక్రోసిస్టమ్స్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి దిగ్గజాలు కొన్ని వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టడమే కాకుండా.. పోటాపోటీగా మరింత సమర్థమైన, మెరుగైన ఫీచర్లు ఉన్న మైక్రోప్రాసెసర్లను అందుబాటు లోకి వెచ్చాయి. యాభై ఏళ్ల క్రితం నాటి తొలి మైక్రోప్రాసెసర్‌లో కేవలం 2300 ట్రాన్సిస్టర్లు ఉంటే.. తాజాగా ఈ సంఖ్య 1600 కోట్లకు చేరిపోయిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చూ. అది కూడా ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యంలోనే ఇన్ని కోట్ల ట్రాన్సిస్టర్లను ఇమడ్చేందుకు ఎంత సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్, పరికరాలు అవసరమవుతాయో ఊహించుకోవచ్చు. ఇలా తయారైన మైక్రోప్రాసెసర్లు పీసీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లతోపాటు పరిశ్రమల్లో, వాహనాల్లో, దైనందిన వాడకంలో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాల్లోకీ చేరిపోయాయి. ఇంత విస్తృత వాడకం ఉన్న కారణంగానే మైక్రోప్రాసెసర్ల మార్కెట్ విలువ ఏడాదికి దాదాపు రూ.6.75 లక్షల కోట్లు ఉంది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది వృద్ధి 6.4 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. 2021 చివరకల్లా మార్కెట్ రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లదే హవా.. మైక్రోప్రాసెసర్ల రంగంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో వేగంగా వృద్ధి కనపడుతోంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉండటం, ప్రజల వద్ద ఖర్చు పెట్టేందుకు ఉండే ఆదాయం పెరుగుతూండటం నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల విక్రయాలు పెరుగుతూండటం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు 2019లో సగటు అమెరికన్ చేతిలో ఖర్చు పెట్టేందుకు సగటున 15 వేల డాలర్లు ఉంటే అది గత ఏడాది అక్టోబరు నాటికి 47,673 డాలర్లకు చేరినట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. భారత్, చైనా వంటి దేశాల్లోనూ మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలపై పెడుతున్న ఖర్చు ఎక్కువవుతూండటం మైక్రోప్రాసెసర్ రంగానికి వరంగా మారుతోంది. ఒక్క భారత్‌లోనే వచ్చే ఏడాదికల్లా స్మార్ట్ఫోన్లు ఉన్న వారి సంఖ్య 82 కోట్లకు చేరుతుందని అంతర్జాతీయ సంస్థ కేపీఎంజీ లెక్కకడుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడకం పెరిగిన కొద్దీ అందులోనూ చిప్‌ల వాడకం ఉన్న కారణంగా మైక్రోప్రాసెసర్ రంగం వృద్ధి వేగంగా సాగుతుందని అంచనా. దిగ్గజ తయారీదారులు వీరే... మైక్రోప్రాసెసర్ల తయారీలో తైవాన్‌కు చెందిన మీడియాటెక్, దక్షిణ కొరియాకు చెందిన సాంసంగ్, జపాన్‌లోని తోషిబాలు కలసి అమెరికా బయట ఆధిపత్యం కనబరుస్తున్నాయి. మొత్తమ్మీద చూస్తే అమెరికన్ కంపెనీ ఇంటెల్‌దే తొలిస్థానం. మార్కెట్ దీని షేర్ 19.5 శాతంగా ఉంది. తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 11.25 శాతంతో రెండో స్థానంలోనూ, దాదాపు 10 శాతంతో మూడోస్థానంలో క్వాల్కామ్ ఉన్నాయి. సాంసంగ్ సెమీ కండక్టర్, బ్రాడ్‌కామ్, ఫ్రీస్కేల్ సెమీ కండక్టర్, ఎన్విడియా, ఏఎండీ, స్ప్రెడ్ట్రమ్, టీఐ, ఆపిల్, ఐబీఎం, ఆట్మెల్, టీఎస్ఎంసీ, లీడ్కోర్, ఆమ్లాజిక్, నూఫ్రంట్, ఇన్‌జెనిక్ వంటి కొన్ని కంపెనీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మైక్రో ప్రాసెసర్ సెగ్మెంట్‌ను స్థూలంగా మూడు భాగాలుగా విడదీయవచ్చు. ఆర్మ్, ఎక్స్–86 ఆధారిత ఎంపీయూలు ఒక వర్గమైతే.. అప్లికేషన్ల ఆధారంగా చేసే వర్గీకరణ (పీసీలు, సర్వర్లు, ట్యాబ్లెట్లు, సెల్ఫోన్లు, ఎంబెడెడ్ ఎంపీయూలు) రెండోది. ఉపయోగించే రంగం ఆధారంగా జరిగే మూడో వర్గీకరణలో సమాచారం, కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటివి ఉంటాయి. స్మార్ట్ఫోన్లలో మాత్రం క్వాల్కామ్ పెత్తనం కొనసాగుతోంది. 2020 లెక్కల ప్రకారం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ప్రాసెసర్ రంగంలో క్వాల్కామ్ 32 శాతం ఆదాయాన్ని దక్కించుకుంది. చైనాకు చెందిన హైసిలికాన్ 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆపిల్ 19 శాతంతో మూడో స్థానంలో ఉండగా.. మిగిలిన అన్ని సంస్థలు కలిసి 27 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
ఏడాదిలో రెట్టింపైన టెలికాం రంగం ఉద్యోగాలు
టెలికాం రంగంలో త్వరలో రాబోయే 5జీ టెక్నాలజీ వల్ల 2020 నాల్గవ త్రైమాసికం, 2021 మొదటి త్రైమాసికంలో ఉద్యోగాల నియామకం రెట్టింపు అయినట్లు డేటా అండ్ ఎనలిటిక్స్ సంస్థ గ్లోబల్‌డేటా తన నివేదికలో వెల్లడించింది. కొత్త తరం టెక్నాలజీ 5జీపై మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు, ప్రభుత్వం ట్రయల్స్, టెస్టింగ్ కోసం అనుమతించినట్లు తెలిపింది. 5జీ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న నెట్వర్క్ ఎలిమెంట్స్‌కి అనుసంధానించాలని కంపెనీలు చూస్తున్నాయి. "2020 నాల్గవ త్రైమాసికంలో, 2021 మొదటి త్రైమాసికంలో మధ్య ఉద్యోగాల నియామకం రెట్టింపు అయ్యాయి. 5జీ డొమైన్లో నైపుణ్యం గల ఇంజనీర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. నెట్‌వర్క్‌లు, ఐపీ నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, ఫర్మ్‌వేర్, ఆటోమేషన్ వంటి రంగాలలో అనుభవం గల ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నట్లు" గ్లోబల్‌డేటాలో బిజినెస్ ఫండమెంటల్స్ అనలిస్ట్ అజయ్ తల్లూరి తెలిపారు. టెలిఫోనాక్టిబోలాగేట్ ఎల్ఎమ్ ఎరిక్సన్(ఎరిక్సన్) భారతదేశంలో 2020 జనవరి 1 నుంచి కొత్తగా మరో 20 శాతం ఉద్యోగా నియామకాలను చేపట్టింది. ఎందుకంటే కంపెనీ సెల్యులార్, రేడియో నెట్వర్క్ అవకాశాలను పరిశీలిస్తుంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 5జీ ప్రాజెక్టుల కోసం సిస్కో సిస్టమ్స్ 5 బిలియన్ డాలర్ల(రూ.36,546 కోట్లు)ను పెట్టుబడి పెట్టింది. అందులో భాగంగానే 2020 1 జనవరి నుంచి కంపెనీ భారతదేశంలో మరో 30 శాతానికి కంటే ఎక్కువ శాతం ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వర్చువలైజ్డ్ క్లౌడ్ సేవలను ప్రారంభించడానికి సిస్కో క్లౌడ్ కోర్, ప్యాకెట్ కోర్ కోసం ఇంజనీర్లను ఎంచుకుంటుంది. డెల్ టెక్నాలజీస్ (డెల్), క్వాల్కామ్ టెక్నాలజీస్ వంటి 5జీ డొమైన్లో భారీగా ఉద్యోగా నియామకాలు చేపడుతున్నాయి. అందుకే కేవలం ఒక ఏడాదిలో ఈ డొమైన్లో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయినట్లు గ్లోబల్‌డేటా సంస్థ తన నివేదికలో పేర్కొంది. చదవండి: RockYou2021: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి -
ప్రమాదంలో లక్షల క్వాల్కామ్ స్మార్ట్ఫోన్లు
ప్రముఖ క్వాల్కామ్ సంస్థ కొత్తగా ఉత్పత్తి చేసిన ఫోన్ చిప్‌లలో ఒక బగ్ కనుగొనబడింది. దీని ద్వారా హ్యాకర్లు సులభంగా స్మార్ట్ఫోన్లు హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఫోన్ వినియోగదారు సంభాషణలు వినడానికి, డేటాను దొంగిలించడానికి, మాల్వేర్లను దాచడానికి క్వాల్కామ్ మోడెమ్‌లను ఉపయోగించుకోవచ్చని ఆ నివేదికలో తెలిపింది. క్వాల్కామ్ మొబైల్ స్టేషన్ మోడెమ్(ఎంఎస్ఎమ్) 1990ల నుంచి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ఎస్ఎంఎస్ ద్వారా ఎంఎస్‌ఎంను రిమోట్‌గా హ్యాక్ చేయవచ్చని భద్రతా సంస్థ చెక్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న 30 శాతం స్మార్ట్ఫోన్లపై ఈ బగ్ దోపిడీకి గురిచేస్తుందని పేర్కొంది. హ్యాకర్లు ఒక్కసారి చేస్తే వారు మీరు ఏమి మాట్లాడేది వినడం, సందేశాలను చదవడం స్వంత ప్రయోజనాల కోసం మీ డేటాను, సిమ్‌ను అన్‌లాక్ చేయవచ్చు. చెక్ పాయింట్ రీసెర్చ్.. ఈ బగ్ ప్రస్తుతం శామ్సంగ్, గూగుల్, షియోమీ, ఎల్జి తో సహా మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల మొబైల్స్ మీద ప్రభావితం చూపనుంది. ప్రపంచ మొత్తం జనాభాలో ప్రస్తుతం 40 శాతం మంది ఈ హాని కలిగించే చిప్స్ గల మొబైల్స్ వాడుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే 30 శాతం ప్రజలు వాడుతున్న ఫోన్లపై దాడులను నిర్వహించడానికి అవసరమైన యాజమాన్య ఇంటర్ఫేస్, క్వాల్కమ్ ఎంఎస్ఎం ఇంటర్ఫేస్(QMI) ద్వారా హ్యాక్ చేసే అవకాశం ఉంది. గతంలో దీనికి సంబందించి భద్రతా సమస్యను క్వాల్కామ్ పరిష్కరించినట్లు అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా 2020 డిసెంబర్ నుంచి వచ్చిన సెక్యూరిటీ పాచ్ ద్వారా ఫోన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్‌కు సంబంధించిన లోపాలపై గూగుల్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. చదవండి: ఈ కంపెనీ కార్లపై రూ.1.5 లక్షల వరకు ధర తగ్గింపు! -
క్వాల్‌కామ్‌తో ఎయిర్టెల్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ సేవలను మరింత వేగంగా అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తాజాగా అమెరికన్ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌తో చేతులు కలిపింది. క్వాల్కామ్కి చెందిన ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ఓ-రాన్) ప్లాట్‌ఫామ్ తోడ్పాటుతో శ్జీ5 నెట్‌వర్క్‌ను తీరిదిద్దుకోనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. అలాగే ఇళ్లు, వ్యాపార సంస్థలకు బ్రాడ్యూండ్ సర్వీసులను మరింత చౌకగా, వేగ వంతంగా అందించేందుకు కూడా ఈ భాగస్వామ్య ఒప్పందం ఉపయోగపడగలదని వివరించింది. 5జీ సాంకేతికతతో గిగాబిట్ పరిమాణమున్న భారీ ఫైళ్లను కూడా సెకన్ల వ్యవధిలో డౌన్లోడ్ చేసుకోవచ్చని, 4కే వీడియోలను స్మార్ట్ఫోన్లు... కంప్యూటింగ్ సాధనాల్లో నిరాటంకంగా వీక్షించవచ్చని భారతి ఎయిర్టెల్ సీటీవో రణ్‌దీప్ సెఖాన్ తెలిపారు. దేశ సామాజిక-ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి 5జీ సేవలు ఎంతగానో తోడ్పడగలవని క్వాల్కామ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజేన్ వగాడియా చెప్పారు. చదవండి: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..! ఆస్ట్రేలియా-ఫేస్‌బుక్‌ల మధ్య డీల్ కుదిరింది -
బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3
న్యూఢిల్లీ: పోకో ప్రియులు ఎంతగానో ఇష్టపడే పోకో ఎం3 మొబైల్ నేడు ఇండియన్ మార్కెట్ లో విడుదలైంది. వాటర్‌డ్రాప్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన పోకో ఎం2కు కొనసాగింపుగా పోకో ఎం3 మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. పోకో ఎం3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.(చదవండి: మహిళను రక్షించిన యాపిల్ స్మార్ట్‌వాచ్) పోకో ఎం3 ఫీచర్స్: డ్యూయల్ నానో సిమ్ గల పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 మీద పనిచేయనుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో 6.53-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్(1,080x2,340 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.79 లెన్స్ 48ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 మాక్రో లెన్స్‌తో 2ఎంపీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం పోకో ఎం3 ముందు భాగంలో ఎఫ్/2.05 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. పోకో ఎం3 64జీబీ,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ లలో లభిస్తుంది. ఇవి రెండూ మైక్రో SD కార్డ్ ద్వారా 512జీబీ వరకు సపోర్ట్ చేస్తాయి. ఇందులో కనెక్టివిటీ కోసం 4జీ వోల్టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఇన్ఫ్రారెడ్(ఐఆర్) బ్లాస్టర్, యుఎస్బి టైప్-సి, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీనిలో స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 198 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి!) పోకో ఎం3 ధర: భారతదేశంలో పోకో ఎం3 6 జీబీ+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర రూ.10,999 ఉండగా, 6 జీబీ+128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. ఫోన్ కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఫిబ్రవరి 9 మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో సేల్ కి రానుంది. పోకో ఎం3ను ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ లేదా ఇఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. -
ఆ మొబైల్స్ కంటే పవర్ ఫుల్ గా ఐఫోన్ 12ప్రో
క్వాల్కామ్ ప్రతి సంవత్సరం డిసెంబరులో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల కోసం శక్తివంతమైన ప్రాసెసర్‌ను తీసుకొస్తుంది. ఈ ప్రాసెసర్‌ను వచ్చే ఏడాది రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల కోసం ఉపయోగిస్తారు. అలాగే, ఈ ఏడాది కూడా క్వాల్కామ్ కంపెనీ స్నాప్‌డ్రాగన్ 888 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్‌ని 2021లో అన్ని ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లలో తీసుకొస్తారు. కానీ ఒక విషయం ఏమిటంటే కొత్తగా తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఈ ఏడాది విడుదలైన ఆపిల్ యొక్క ప్రాసెసర్ కంటే శక్తివంతమైనది కాదని నిరూపితమైంది.(చదవండి: పబ్జి గేమ్ లాంచింగ్ ఇప్పట్లో లేనట్లే..) ఇటీవల కొత్తగా క్వాల్కామ్ తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ యొక్క బెంచ్‌మార్క్ సమాచారం బయటకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ని ఆపిల్ యొక్క ఏ14 బయోనిక్, ఆపిల్ ఏ13 ప్రాసెసర్ స్కోర్లతో పోల్చారు. సీపీయూ బెంచ్‌మార్కింగ్ వెబ్సైట్ గీక్‌బెంచ్ 5లో ఈ మూడింటిని పరీక్షించారు. సింగిల్ కోర్ పనితీరులో ఆపిల్ ఐఫోన్ 12ప్రో(ఎ14 బయోనిక్) 1603 స్కోరు సాధించింది. అలాగే, స్నాప్‌డ్రాగన్ 888 1135తో ఎ14 బయోనిక్ కంటే తక్కువ స్కోరు సాధించింది. ఇంకా చెప్పాలంటే ఐఫోన్ 11 ప్రో(ఎ13) 1331 స్కోరు కంటే తక్కువ. మల్టీకోర్ పనితీరు ఆధారంగా చుస్తే స్నాప్‌డ్రాగన్ 888 యొక్క 3794 స్కోర్ తో పోలిస్తే ఐఫోన్ 12ప్రో 4187 స్కోరు సాధించింది. అలాగే గ్రాఫిక్స్ పనితీరును పరీక్షించే వెబ్సైట్ జిఎఫ్ఎక్స్ లో జీపీయు పనితీరును కూడా పరీక్షించారు. ఫలితాల ప్రకారం, ఐఫోన్ 12 ప్రో సెకనుకు 102.2 పీక్ ఫ్రేమ్‌లను సాధించింది. స్నాప్‌డ్రాగన్ 888 సెకనుకు 86 పీక్ ఫ్రేమ్లకు మాత్రమే చేరుకుంది. ఇది ఐఫోన్ 12, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్ఇ(2020) స్కోర్ల కంటే కూడా తక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే 2021లో తీసుకురాబోయే అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ కంటే 2020లో వచ్చిన ఐఫోన్ 12ప్రో శక్తివంతమైనది అని తెలుస్తుంది. అయితే, గీక్‌బెంచ్, జిఎఫ్ఎక్స్ బెంచ్ ఫలితాలలో, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ప్రస్తుత హై-ఎండ్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లైన గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా, హువావే 40 ప్రో, ఆసుస్ రోగ్ ఫోన్ కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. స్నాప్‌డ్రాగన్ 888, ఆపిల్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్లు 5ఎన్ఎమ్ ప్రాసెస్‌పై తయారు చేయబడ్డాయి. క్వాల్కమ్ యొక్క చిప్‌సెట్‌లో ఏ14 బయోనిక్‌లో ఉపయోగించిన మాదిరిగానే కార్టెక్స్ X-1ను దాని పెద్ద-చిన్న డిజైన్‌లో ఉపయోగించారు. -
క్వాల్కామ్ నుంచి మరో వేగవంతమైన ప్రాసెసర్
క్వాల్కామ్ ఈ నెల మొదటి వారంలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ని లాంచ్ చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రాసెసర్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ లో భాగంగా 675 ప్రాసెసర్ కి కొనసాగింపుగా 678 ప్రాసెసర్ ని తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్ 11నానోమీటర్ టెక్నాలజీపై తయారు చేయబడింది. దీని యొక్క డౌన్లోడ్ స్పీడ్ 600ఎంబిపిఎస్ కాగా, అప్లోడ్ స్పీడ్ 150 ఎంబిపిఎస్ గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 678 ప్రాసెసర్ లో ఎక్స్ 12 ఎల్టీఈ మోడమ్ ని అందించారు. ఇది 4కే రికార్డింగ్ వీడియోకి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్ సి కూడా సపోర్ట్ చేస్తుంది. 675 ప్రాసెసర్ ని 2018లో తీసుకొచ్చారు. క్వాల్కామ్ మిడ్ రేంజ్ మొబైల్స్ కోసం ఈ ప్రాసెసర్ ని తీసుకొచ్చింది.(చదవండి: ఈ 25వేలు మీ సొంతం) స్నాప్‌డ్రాగన్ 678 ఫీచర్స్: క్వాల్కామ్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్ ద్వారా కొత్త చిప్ ని ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 675ప్రాసెసర్ తీసుకొచ్చిన రెండేళ్ల తర్వాత దీనిని తీసుకొచ్చారు. స్నాప్‌డ్రాగన్ 678ని 2.2గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల క్వాల్కమ్ క్రియో 460 ఆక్టా-కోర్ సిపియుపై తయారు చేసారు. స్నాప్‌డ్రాగన్ 675 యొక్క 2గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కంటే కొంచెం వేగంగా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 678లో క్వాల్కమ్ అడ్రినో 612 జీపీయు కూడా ఉంది. దింతో ఇది వేగంగా గ్రాఫిక్స్ రెండరింగ్‌ను డ్రైవ్ చేస్తుంది, తక్కువ ఫ్రేమ్ డ్రాప్‌లతో అధిక ఫ్రేమ్రేట్ల వద్ద మంచి విజువల్స్‌ను అందిస్తుంది అని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ కోసం, స్నాప్‌డ్రాగన్ 678 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 12 ఎల్‌టిఇ మోడెమ్‌తో వస్తుంది. దీని గరిష్ట డౌన్లోడ్ స్పీడ్ 600 ఎమ్‌బిపిఎస్,అప్లోడ్ స్పీడ్ 150 ఎమ్‌బిపిఎస్ గా ఉంది. ఇది డ్యూయల్-సిమ్ డ్యూయల్ VoLTE, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్ సి, బీడౌ, గెలీలియో, గ్లోనాస్, జిపిఎస్, QZSS, SBAS నావిగేషన్ సిస్టంలకు కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ టెక్నాలజీకి కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 678 4కే అల్ట్రా హెచ్డి రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఆడియో పరంగా క్వాల్కమ్ ట్రూవైర్‌లెస్ స్టీరియో ప్లస్ టెక్నాలజీ, క్వాల్కమ్ అక్స్టిక్ ఆడియో టెక్నాలజీ, క్వాల్కమ్ ఆప్టిఎక్స్ ఆడియో టెక్నాలజీతో వస్తుంది. -
1జీబీ స్పీడ్‌తో దూకుడు : జియో, క్వాల్కామ్ జట్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెక్నాలజీ మొబైల్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రిలయన్స్ జియో, క్వాల్కామ్ టెక్నాలజీస్ వెల్లడించాయి. క్వాల్కామ్ 5జీ ఆర్ఏఎన్ ప్లాట్‌ఫాంపై రిలయన్స్ జియో 5జీఎన్ఆర్ సొల్యూషన్ తో 1 జీబీపీఎస్ పైగా స్పీడ్‌ను సాధించగలిగినట్లు తెలిపాయి. మరింత వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్కు 5జీ టెక్నాలజీ తోడ్పడుతుంది. దేశీ అవసరాలకు అవసరమైన 5జీ సొల్యూషన్స్, నెట్వర్క్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు జియోవెల్లడించింది. స్థానికంగా తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, ఆత్మనిర్భర భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ తెలిపారు. క్వాల్కమ్ టెక్నాలజీస్, 4జీ /5జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ మేనేజర్ దుర్గా మల్లాడి కూడా సంతోషం వ్యక్తం చేశారు. [ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ టిప్‌తో సేఫ్‌గా ఉండండి ] -
జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో క్వాల్కామ్ పెట్టుబడి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా క్వాల్కామ్ వెంచర్స్ సంస్థ 0.15 శాతం వాటా కోసం రూ.730 కోట్లు పెట్టుబడులు పెట్టిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇది 12వ విదేశీ సంస్థ పెట్టుబడి. క్వాల్కామ్ పెట్టుబడి పరంగా చూస్తే, జియో ప్లాట్ఫార్మ్స్ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగాను, ఎంటర్ప్రైజ్ విలువ రూ.5.16 లక్షల కోట్లుగా ఉంది. -
హైదరాబాద్‌లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసింది. వైర్లెస్ టెక్నాలజీ అగ్రగామి క్వాల్కామ్ టెక్నాలజీస్ సహకారంతో దీనిని స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న సంస్థల నూతన డిజిటల్ అవసరాలను తీర్చేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని డొమెయిన్ ఆధారిత పరిష్కారాలను ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తారు. ఆరోగ్యం, వాహన, తయారీ, చిల్లర వర్తకం వంటి వివిధ రంగాల్లో 5జీ వినియోగం ద్వారా కొత్త అవకాశాలను కనుగొంటారు. ఈ పరిష్కారాలతో కస్టమర్లు సరికొత్త వ్యాపార పద్ధతులు, విభిన్న ఉత్పత్తులు, విలువ ఆధారిత సేవలతోపాటు వినియోగదార్లకు మెరుగైన అనుభూతి కలిగించేందుకు దోహదం చేస్తుందని టీసీఎస్ తెలిపింది. తద్వారా కంపెనీలకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయని వివరించింది. -
5జీ ఫోన్ రేసులో ఒప్పో
సాక్షి, ముంబై: ప్రముఖ చైనా మొబైల్ సంస్థ ఒప్పో కూడా 5జీ రేసులోకి వచ్చేస్తోంది. త్వరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి క్వాల్కామ్ పవర్డ్ డ్యూయల్ మోడ్ 5 జి ఫోన్‌ను విడుదల చేయాలనే ప్రణాళికను వెల్లడించింది. బార్సిలోనాలో జరగనున్న క్వాల్కమ్ 5 జి సమ్మిట్ 2019 లో ఒప్పో 5జీ సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ ఈ వివరాలను వెల్లడించారు సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ చేసినవివరాల ప్రకారం ఒప్పో కొత్త 5 జీ మొబైల్ డ్యూయల్-మోడ్‌తోవస్తుంది. స్టాండ్‌లోన్ (ఎస్ఐ), నాన్-స్టాండలోన్ (ఎన్ఎస్ఎ) నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. 5 జీపై ప్రస్తుత స్థితి, భవిష్యత్ ఉత్పత్తులు, యాప్స్, భవిష్యత్తరానికి అందనున్న కట్టింగ్ ఎడ్జ్ అనుభవాలపై తన అంచనాలను పంచుకున్నారు. తమ తరువాతి తరం డ్యూయల్-మోడ్ 5జీ డివైస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మార్కెట్లలో ఎక్కువమంది వినియోగదారులకు ఉన్నతమైన అనుభవాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 2019 నాటికి, 2,500 గ్లోబల్ పేటెంట్ ఫ్యామిటీకి దరఖాస్తు చేయగా 1,000 కి పైగా యూరోపియన్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ కు ప్రకటించినట్టుఆయన ఒక ప్రకటనలో తెలిపారు. -
మెగా క్వాల్కామ్ క్యాంపస్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ క్వాల్కామ్ హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో తన ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కోకాపేటలో ఈ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. 400 మిలి యన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌లో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొంది. దశల వారీగా ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్ ద్వారా పరోక్షంగా వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తా యని తెలిపింది. విప్లవాత్మకమైన 5జీ మొబైల్ టెక్నాలజీపై ఈ క్యాంపస్‌లో పరిశోధనలు, పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబైల్ ప్లాట్‌ఫామ్స్ రంగా ల్లో పరిశోధనలు, వైర్లెస్ సాంకేతికత, పరికరాల తయారీ వంటి అంశాలపై పెద్ద ఎత్తున ఈ మెగా క్యాంపస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంస్థ ఈ రోజు ప్రకటించింది. మొదటి దశలో భాగంగా సుమారు 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అమెరికాలోని శాన్‌డియాగో కేంద్రంగా తమ కంపెనీ పని చేస్తోందని వెల్లడించింది. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఈ అభివృద్ధి కేంద్రం అమెరికా బయట ఉన్న వాటిలో అతిపెద్ద క్యాంపస్ కానుందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పెట్టిన పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద పెట్టుబడి అని ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో నిర్మాణ పనులను ప్రారంభిస్తామని పేర్కొంది. కేటీఆర్‌ను కలిసిన కంపెనీ ప్రతినిధులు.. బేగంపేట క్యాంపు కార్యాలయంలో శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శశిరెడ్డి బృందం కలిసి నగరంలో క్వాల్కామ్ ఉత్పత్తుల అభివృద్ది కేంద్రం ఏర్పాటుపై చర్చలు జరిపింది. ఇప్పటికే భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, హైదరాబాద్‌లో కంపెనీ అభివృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నామని పేర్కొంది. ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, నాణ్యమైన మానవ వనరుల లభ్యత బట్టీ నగరాన్ని తమ క్యాంపస్ ఏర్పాటుకు ఎంపిక చేసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం నగరంలో తమ సంస్థ తరఫున 4 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని కొన్నేళ్లలో ఇది 10 వేలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. సెమీ కండక్టర్ల పరిశ్రమకు ఊతం: కేటీఆర్ క్వాల్కామ్ సంస్థ మెగా క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ కేంద్ర కార్యాలయాలకు అవతల హైదరాబాద్‌లో ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ అమెజాన్, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు అతిపెద్ద క్యాంపస్‌లు కలిగి ఉన్నాయని, ఈ జాబితా లో క్వాల్కామ్ చేరనుందన్నారు. క్వాల్కామ్ సంస్థ ఏర్పాటు చేయనున్న మెగా క్యాంపస్ ద్వారా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల పరిశ్రమకు భారీ ఊతం లభించనుందన్నారు. -
సెవరెన్స్ ప్యాకేజీ ఇచ్చి మరీ ఇంటికి పంపేస్తోంది
చిప్ దిగ్గజం క్వాల్కామ్ భారీగా ఉద్యోగాల కోత చేపట్టింది. వార్షికంగా తన వ్యయాలను 1 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకుంటానని పెట్టుబడిదారులకు ఇచ్చిన వాగ్దానం మేరకు క్వాల్కామ్ ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఉద్యోగుల కోత ప్రక్రియను ప్రారంభించినట్టు చిప్‌మేకర్ క్వాల్కామ్ బుధవారం ప్రకటించింది. తమ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులపైనా ఈ ప్రభావం ఉండనుందని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. అయితే ఎంతమంది ఉద్యోగులను తీసివేస్తోందో మాత్రం క్వాల్కామ్ వెల్లడించలేదు. ఉద్యోగుల కోతకు ప్రభావితమయ్యే ఉద్యోగులకు క్వాల్కామ్ సెవరెన్స్ ప్యాకేజ్‌ను ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి, మార్కెట్లో విజయం సాధించడానికి వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడం ఎంతో అవసరమని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. మొత్తంగా సెప్టెంబర్ 24 వరకు కంపెనీలో 33,800 మంది ఫుల్-టైమ్, పార్ట్‌టైమ్, టెంపరరీ ఉద్యోగులున్నారు. క్వాల్కామ్ చేపట్టబోయే ఉద్యోగాల కోత చాలా పెద్దదని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది. క్వాల్కామ్ హెచ్చరికల నోటీసులు కూడా ఫైల్ చేసినట్టు పేర్కొంది. 1బిలియన్ డాలర్ల వార్షిక వ్యయాలను పొదుపు చేసుకోవడానికి తమ వ్యాపారాల వ్యాప్తంగా ఈ తగ్గింపు చేపడుతున్నట్టు క్వాల్కామ్ జనవరిలో తెలిపింది. పెట్టుబడిదారులకు ఈ మేరకు తాము వాగ్దానం ఇచ్చామని చెప్పింది. తన ఆదాయాల వృద్ధిన మెరుగు పరుచుకునేందుకు తన ఆపరేషన్స్‌ను కూడా ఈ చిప్‌మేకర్ సమీక్షిస్తోంది. -
మరో సంచలనానికి జియో రెడీ
న్యూఢిల్లీ : సంచలనాలకు మారుపేరుగా రిలయన్స్ జియో మార్కెట్లో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. టెలికాం సర్వీసులు, స్మార్ట్ఫోన్లు, 4జీ ఫీచర్ ఫోన్ వంటి వాటితో ఇప్పటికే మార్కెట్లో తిరుగులేకుండా ఉన్న జియో.. ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెరతీయబోతోందని తెలుస్తోంది. తన ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్)ను పెంచుకోవడం కోసం సిమ్ కార్డుతో ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనిపై ఇప్పటికే అమెరికా చిప్ దిగ్గజం క్వాల్‌కామ్‌తో ముఖేష్ అంబానీకి చెందిన ఈ కంపెనీ చర్చలు కూడా జరిపిందని తెలిసింది. బిల్ట్-ఇన్ సెల్యులార్ కనెక్షన్స్తో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ల్యాప్‌టాప్‌లను ఇది మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి. క్వాల్కామ్ ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోన్ కోసం జియోతో కలిసి పనిచేస్తోంది. ‘జియోతో మేము మాట్లాడాం. డేటా, కంటెంట్‌తో కూడిన ఒక డివైజ్‌ను వారు తేవాలనుకుంటున్నారు’ అని క్వాల్కామ్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ మిగ్యుల్ న్యున్స్ చెప్పారు. ఈ చీప్‌మేకర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) బ్రాండ్ స్మార్ట్రాన్‌తో కూడా పనిచేస్తోంది. సెల్యులార్ కనెక్టివిటీతో స్నాప్‌డ్రాగన్ 835 అందించే ల్యాప్‌టాప్‌లను ఇది ప్రవేశపెట్టబోతోంది. ఈ చర్చలను స్మార్ట్రాన్ కూడా ధృవీకరించింది. గ్లోబల్‌గా హెచ్‌పీ, ఆసుస్, లెనోవో వంటి కంపెనీలతో కూడా క్వాల్కామ్ పనిచేస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి రిలయన్స్ జియో నిరాకరించింది. ఆపరేటర్లు తమ ఆర్పూను పెంచుకోవడానికి తర్వాత డివైజ్‌లు, సెల్యులార్ కనెక్టెడ్ ల్యాప్‌టాప్‌లేనని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డివైజస్, ఎకోసిస్టమ్స్ రీసెర్చ్ డైరెక్టర్ నైల్ షా అన్నారు. కౌంటర్‌పాయింట్ డేటా ప్రకారం ప్రతేడాది భారత్‌లో 50 లక్షల ల్యాప్‌టాప్‌లు అమ్ముడుపోతున్నాయని తెలిసింది. వీటిని సెల్యులార్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేస్తే, వీటి విలువ పెరిగి, ఈ రంగంలో వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. వైఫై హాట్స్పాట్లతో పోలిస్తే, సెల్యులార్ కనెక్టివిటీ ఎక్కువ భద్రంగా ఉంటుందని తెలిపారు. -
బ్రాడ్‌కామ్ డీల్‌కు ట్రంప్ బ్రేకులు..
వాషింగ్టన్: చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ను టేకోవర్ చేసేందుకు సింగపూర్ సంస్థ బ్రాడ్‌కామ్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. జాతీయ భద్రతా కారణాల రీత్యా ఈ డీల్‌కు అనుమతివ్వడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఒకవేళ క్వాల్‌కామ్‌ను గానీ బ్రాడ్‌కామ్ టేకోవర్ చేసిన పక్షంలో ఆ సంస్థ అమెరికా భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే విధమైన చర్యలు తీసుకోవచ్చంటూ విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయంటూ ట్రంప్ వివరించారు. వాటి ఆధారంగానే టేకోవర్ డీల్‌కు అనుమతులు నిరాకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ప్రతిపాదిత టేకోవర్ ఒప్పందాన్ని తక్షణమే శాశ్వతంగా పక్కన పెట్టాలి‘ అని బ్రాడ్‌కామ్, క్వాల్కామ్లను ట్రంప్ ఆదేశించారు. క్వాల్‌కామ్‌ను బ్రాడ్‌కామ్ టేకోవర్ చేయడం నిషిద్ధమని, అలాగే ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు సంబంధిత ఉత్తర్వుల్లో ట్రంప్ స్పష్టం చేశారు. దాదాపు 117 బిలియన్ డాలర్ల ఈ డీల్ గానీ సాకారమైన పక్షంలో ఇంటెల్, శాంసంగ్ తర్వాత ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మైక్రో చిప్ తయారీ సంస్థ ఆవిర్భవించేది. అంతే కాకుండా టెక్నాలజీ రంగంలో ఇదే అత్యంత భారీ డీల్‌గా కూడా నిల్చేది. అయితే, అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం క్వాల్కామ్ గానీ ఆసియా సంస్థ బ్రాడ్‌కామ్ చేతుల్లోకి వెళ్లిపోయిన పక్షంలో .. మొబైల్ టెక్నాలజీలో అమెరికా ఆధిపత్యానికి గండిపడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడి ఆదేశాలను పరిశీలిస్తున్నట్లు బ్రాడ్‌కామ్ పేర్కొంది. క్వాల్‌కామ్‌ను కొనుగోలు చేయడం వల్ల అమెరికా భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందన్న ఆందోళనలను ఖండించింది. -
5జీ స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్...
2జి శకం ముగిసింది. 3జీ కూడా ముగిసిపోయి కాలం 4జీ వైపు పరుగులు పెడుతోంది. అయితే త్వరలో 4జీ శకం కూడా ముగిసిపోయి 5జీ వైపు అడుగులు వేగంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో 5జీ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు తెలుస్తోంది. క్వాల్కామ్, ఇంటెల్ రెండూ కూడా కొన్ని నెలల నుంచి దీనిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని, 2018 చివరి వరకు లేదా 2019 ప్రారంభంలో 5జీ కేపబుల్ తొలి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. 2019లో స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 5జీ మోడమ్స్తో స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు 18 ఫోన్ తయారీదారి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్టు క్వాల్కామ్ ప్రకటించింది. ఈ కంపెనీల్లో నోకియా/హెచ్ఎండీ, సోని, షావోమి, ఒప్పో, వివో, హెచ్‌టీసీ, ఎల్జీ, ఆసుస్, జడ్‌టీసీ వంటి కంపెనీలున్నట్టు పేర్కొంది. ఈ అన్ని కంపెనీలు కమర్షియల్ వాడకం కోసం 2019లో 5జీ డివైజ్‌లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అంతేకాక స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 మోడమ్స్‌ను విడుదల చేసినట్టు కూడా ధృవీకరించింది. తర్వాత తరం 5జీ మొబైల్ అనుభవాన్ని తన వినియోగదారులకు అందించడానికి క్వాల్కామ్ టెక్నాలజీస్ ఎంతో అంకితభావంతో పనిచేస్తుందని క్వాల్కామ్ టెక్నాలజీస్ ఇంక్ మొబైల్, జనరల్ మేనేజర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ కటౌజియాన్ తెలిపారు. అయితే 5జీ స్మార్ట్ఫోన్లను అందించే కంపెనీ జాబితాలో ఆపిల్, శాంసంగ్, హువావే లేకపోవడం గమనార్హం. ఆపిల్‌కు గత ఏడాదిగా క్వాల్‌కామ్‌తో న్యాయ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్వాల్‌కామ్‌తో కలిసి ఆపిల్ పనిచేయడం లేదని తెలుస్తోంది. ఆపిల్ తన మోడమ్ ఆర్డర్స్‌ను ఇంటెల్ నుంచి స్వీకరిస్తుంది. శాంసంగ్ తన సొంత ఎక్సీనోస్ చిప్‌సెట్‌నే 5జీ కోసం వాడనుంది. క్వాల్కామ్ చిప్స్‌ను ఇది వాడటం లేదు. శాంసంగ్ తొలి 5జీ చిప్‌ను ఎక్సీనోస్ 5జీగా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ చిప్‌ను ఈ ఏడాది చివరిలో లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రపంచంలోనే తొలి 5జీ ఫోన్ ఇదే..
వెబ్ డెస్క్ : మొబైల్లో ఇంటర్నెట్ వాడాలంటే.. 2జీ, 3జీ నెట్‌వర్క్‌పై ఆధారపడే రోజులు పోయాయి. ప్రస్తుతం 4జీ టెక్నాలజీతో సగటు భారతీయుడు వేగంగా సమాచారం అందుకుంటున్నాడు. అయితే, దేశవ్యాపంగా 4జీ నెట్వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదు. కానీ, అప్పుడే 5జీ ఫోన్ సిద్ధమైపోతోంది. 2020 కల్లా 5జీ టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రపంచస్థాయి సంస్థలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించేశాయి. ఫొటోలో కనిపిస్తున్నది 5జీ ఫోన్. దీన్ని క్వాల్కామ్ అభివృద్ధి చేసింది. 5జీ టెక్నాలజీతో ఇంటర్నెట్ 1 జీబీ వేగంతో వస్తుంది(అంటే ఒక సెకనులో ఒక జీబీ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు). 5జీ మొబైల్లో క్వాల్కామ్ అభివృద్ధి చేసిన స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 మోడెమ్ చిప్‌సెట్‌ను వినియోగించింది. వాస్తవానికి ఎక్స్ 50 మోడెమ్ చిప్‌సెట్‌ను అభివృద్ధి చేసేందుకు క్వాల్కామ్ ఎప్పటినుంచో కుస్తీలు పడింది. పూర్తిగా తయారైన ప్రపంచంలోని తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను క్వాల్కామ్ ఉద్యోగి ఒకరు ట్విట్టర్లో షేర్ చేశారు. -
శ్రీనివాస్ ఎరవెల్లి మృతి పట్ల ఆటా సంతాపం
శాన్ డియాగో : ప్రముఖ సాప్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఎరవెల్లి ఆకస్మిక మృతి పట్ల అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. కరీంనగర్లో పాఠశాల విద్యను అభ్యసించిన శ్రీనివాస్ 20 ఏళ్లుగా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నగరంలో నివసిస్తున్నారు. ప్రఖ్యాత కంపెనీ క్వాల్కామ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి డైరెక్టర్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గణితం, కంప్యూటర్ సైన్స్‌లో శ్రీనివాస్‌కు ప్రావీణ్యం ఉంది. చిన్ననాటి నుంచి ఆయనకు గణితంపై ఉన్న కుతూహలమే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకునేలా చేసింది. అనంతరం ఆయన అరిజోనా స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఖాళీ సమయంలో శ్రీనివాస్ స్థానిక పాఠశాలలకు వెళ్లి గణితాన్ని బోధించేవారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఆటా ప్రగాఢ సానుభూతి తెలిపింది. శ్రీనివాస్ ఆటా రీజినల్ డైరెక్టర్లలో ఒకరైన వెంకట్ తుడికి సోదరుడు. కాగా, శుక్రవారం శాన్‌డియాగోలోని గ్రీన్ వుడ్ మెమోరియల్‌లో శ్రీనివాస్ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. -
దేని దారి దానిదే...రన్నింగ్‌లోనే రీచార్జ్
ఇంకొన్నేళ్లలో... కచ్చితంగా చెప్పాలంటే 13 సంవత్సరాల్లో భారత్‌తో 90 శాతం వాహనాలు విద్యుత్తుతోనే నడుస్తాయి. కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. బాగానే ఉందిగానీ.. ఎలక్ట్రిక్ వాహనాలతో వచ్చే ఇబ్బందుల మాటేమిటి? వందల కిలోమీటర్ల దూరం వెళ్లాంటే? మార్గమధ్యంలో బ్యాటరీ ఖాళీ అయిపోతే? ఏం ఫర్యాలేదు అంటోంది క్వాల్కామ్. మీరు రోడ్డుపై మీ విద్యుత్తు వాహనంతో అలా అలా దూసుకెళుతూ ఉండండి.. మేము మా టెక్నాలజీతో ఎప్పటికప్పుడు అక్కడికక్కడే బ్యాటరీలు ఛార్జ్ చేసేస్తూ ఉంటాం అంటోంది. కొన్ని రకాల స్మార్ట్ఫోన్లను వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ చేసుకుంటున్నాం చూడండి అలాగన్నమాట! మొబైల్ఫోన్ల మైక్రోప్రాసెసర్లు తయారు చేసే ఈ కంపెనీ కొన్నేళ్లుగా విద్యుత్తు వాహనాలను సులువుగా ఛార్జ్ చేయడం ఎలా అన్నదానిపై కూడా పరిశోధనలు చేస్తోంది. హాలో పేరుతో ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించింది. మన ఇళ్లల్లో వాడే ఇండక్షన్ స్టౌ గురించి మీకు తెలిసే ఉంటుంది. అచ్చం దీని మాదిరిగానే హాలో కూడా అయస్కాంతాలను ఉపయోగించుకుని విద్యుత్తును వైర్లెస్ పద్ధతిలో సరఫరా చేస్తుందన్నమాట. రోడ్డు వెంబడి ఇండక్షన్ పొయ్యి లాంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం.. వీటి ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తును గ్రహించేందుకు అవసరమైన ఏర్పాట్లు వాహనాల అడుగున చేసుకోవడం ద్వారా హాలో పనిచేస్తుంది. రోడ్డుపై వాహనం వెళుతున్నప్పుడు ఒక్కో పరికరం కొంత చొప్పున విద్యుత్తు అందిస్తూంటుందన్నమాట. అంతేకాదు.. పార్కింగ్ స్థలాల్లోనూ హాలో పరికరాలు ఏర్పాటు చేసుకుంటే.. ప్రత్యేకంగా ప్లగ్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాటరీలను ఛార్జ్ చేయవచ్చు. ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా ఏ కారుకు ఎంత మేరకు విద్యుత్తు అవసరమో గుర్తించి అంతే సరఫరా అయ్యేలా చేయవచ్చు కూడా. కారు సైజును బట్టి 3.3 కిలోవాట్/గంటల నుంచి 20 కిలోవాట్/గంటల విద్యుత్తును సరఫరా చేయగలమని... ఈ టెక్నాలజీ వచ్చే ఏడాది నుంచే అందుబాటులోకి రానుందని క్వాల్కామ్ అంటోంది. -
క్వాల్కామ్ కొత్త ప్రాసెసర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ ప్రాసెసర్ల సంస్థ క్వాల్కామ్ రెండు కొత్త ప్రాసెసర్లను ఆవిస్కరించింది. సింగపూర్‌లో జరిగిన 'టెక్-డే' కార్యక్రమంలో స్నాప్‌డ్రాగన్ 630, 660లను సంస్థ వైస్ ఛైర్మెన్ కేదార్ కొందప్ ఆవిస్కరించారు. ఇందులో 4కె వీడియోని రికార్డు చేసుకొనే సామర్థ్యం ఉంది. 8జీబీ ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. స్నాప్‌డ్రాగన్660, 2కెవీడియోని సోర్టు చేస్తుంది. ఈ రెండు ప్రాసెసర్లు ఎక్స్-12 ఎల్టీఈ సామర్థ్యంతో పనిచేస్తాయి. 600 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడును సపోర్టు చేస్తాయి. వీటిలో క్విక్ చార్జింగ్ 4.0ను నిక్షిప్తం చేశారు. కేవలం 5 నిమిశాలు చార్జింగ్‌తో 5గంటలు మాట్లాడుకోవచ్చు. 50శాతం బ్యాటరీ కేవలం 15నిమిశాల్లో ఎక్కుతుంది. ఇవి బ్లూటూత్ 5.0ని సపోర్టు చేస్తాయి. ఈరెండిటిని స్నాప్‌డ్రాగన్ న్యూరల్ ప్రాసెసింగ్ ఎస్డీకే ఉపయోగించి తయారుచేశారు. క్వాల్కామ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ ప్రాసెసర్లు సరికొత్త అనుభవాలను అందిస్తాయిని, వేగవంతమైన ఎల్టీఈ డౌన్లోడ్ స్పీడు అందిస్తాయని తెలిపారు. ఎక్కువ మందికి హైక్వాలిటీ కెమెరా, ఆడియో, వీడియో, కనెక్టివిటీ అనుభూతులను పొందుతారని తెలిపారు. మెరుగైన సీపీయూ, గ్రాఫిక్స్ పనితీరు, వేగవంతమైన చార్జింగ్, భద్రతా వీటి సొంతం అని కేదార్ తెలిపారు. స్నాప్‌డ్రాగన్ 660 జూన్‌లో, స్నాప్‌డ్రాగన్ 630లు డిసెంబర్లో అందుబాటులోకి రానున్నాయి. -
హైదరాబాద్‌లో క్వాల్కామ్ ఇన్నోవేషన్ ల్యాబ్
టీ–హబ్‌తో చేతులు కలిపిన కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్... హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో ఇలాంటి ల్యాబ్ ఒకటుంది. హైదరాబాద్‌లో ఉన్న కంపెనీ కార్యాలయంలో ఏప్రిల్‌లో ఈ ల్యాబ్‌ను నెలకొల్పుతున్నట్టు క్వాల్కామ్ ఇండియా ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ శశి రెడ్డి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. స్టార్టప్‌లు తమ వ్యాపార ప్రణాళికను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ఈ ల్యాబ్ దోహదం చేస్తుందన్నారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన ఉత్పాదనకు అనుగుణంగా చిప్‌ల డిజైన్ చేపడతామని వెల్లడించారు. కాగా, కంపెనీ ఎంపిక చేసిన స్టార్టప్‌లకే ల్యాబ్స్ అందుబాటులో ఉంటాయి. క్వాల్కామ్ డిజైన్ ఇన్ ఇండియా (క్యూడీఐపీ) కార్యక్రమం కింద దేశంలో కంపెనీ సుమారు రూ.60 కోట్లు వ్యయం చేస్తోంది. స్టార్టప్‌లకు ఫండింగ్.. క్వాల్కామ్ డిజైన్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా టీ–హబ్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టీ–హబ్ ఫౌండర్ శ్రీనివాస్ కొల్లిపర, సీఈవో జయ్ కృష్ణన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. టీ–హబ్‌లో ఒక ల్యాబ్‌ను సైతం క్వాల్కామ్ ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్, స్మార్ట్ సిటీస్ లక్ష్యంగా పనిచేస్తున్న స్టార్టప్‌లు ఈ ల్యాబ్‌ను వినియోగించుకోవచ్చు. టీ–హబ్ మెంటార్‌గా వ్యవహరిస్తుంది. ఇక క్యూడీఐపీలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 14 స్టార్టప్‌లను ఎంపిక చేసి ఒక్కొక్కదానికి రూ.6.80 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తారు. ఫైనల్స్‌కు చేరిన నాలుగు కంపెనీలకు ఒక్కోదానికి రూ.68 లక్షలు ఇస్తామని శశి రెడ్డి తెలిపారు. -
4జీ ఫీచర్ ఫోన్ల కోసం క్వాల్కామ్ చిప్సెట్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీ సంస్థ క్వాల్కామ్ తాజాగా క్వాల్కామ్ 205 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఇది సుమారు రూ. 3,500 మేర ధర ఉండే 4జీ ఫీచర్ ఫోన్స్‌లో తయారీలో ఉపయోగపడనుంది. భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో 4జీ టెక్నాలజీ, ఫీచర్ ఫోన్స్ వినియోగం గణనీయంగా ఉందని క్వాల్కామ్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జిమ్ కేథీ చెప్పారు. తమ కొత్త చిప్సెట్.. ఫీచర్ ఫోన్స్‌లో 4జీ అనుభూతిని అందించగలిగేలా మొబైల్స్ తయారీ సంస్థలు, ఆపరేటర్లు, కంటెంట్ ప్రొవైడర్లకు ఉపయోగపడగలదని ఆయన వివరించారు. భారత్‌లో 4జీ ఫీచర్ ఫోన్ల విక్రయానికి సంబంధించి రిలయన్స్ జియో, మైక్రోమ్యాక్స్, మెగాఫోన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్ తదితర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జిమ్ పేర్కొన్నారు. -
చిప్ దిగ్గజంపై ఆపిల్ న్యాయపోరాటం
శాన్ఫ్రాన్సిస్కో : చిప్ తయారీదారి క్వాల్‌కామ్‌కు, టెక్ దిగ్గజం ఆపిల్‌కు న్యాయపోరాటం ఉధృతమవుతోంది. పేటెంట్ లైన్సెసింగ్ విధానంపై ఈ రెండు కంపెనీలు ఒకదానిపై ఒకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గతవారమే అమెరికాలో క్వాల్‌కామ్‌పై ఫిర్యాదు దాఖలు చేసిన ఆపిల్, ప్రస్తుతం చైనాలో కూడా ఆ కంపెనీపై దావా వేసింది. ఈ చిప్ తయారీదారి కంపెనీ మోనోపలీ అధికారాలను చెల్లాయిస్తుందని ఆపిల్ పేర్కొంటోంది. 1 బిలియన్ డాలర్ల(రూ.6,808కోట్లకు పైగా) దావాను క్వాల్కామ్ వ్యతిరేకంగా దాఖలు చేసినట్టు ఆపిల్ ధృవీకరించింది. ప్రస్తుతం ఈ చిప్ మేకర్ పేటెంట్ లైసెన్సింగ్ దోపిడీ విధానాన్ని చేపడుతుందని ఆపిల్ తన దావాలో పేర్కొంది. బీజింగ్ ఇంటెలెచ్యువల్ ప్రాపర్టీ కోర్టులో మరో రెండు దావాలు వేసినట్టు ఆపిల్ తెలిపింది. నమ్మకద్రోహం కింద గతవారమే ఆపిల్, క్వాల్‌కామ్‌పై ఫిర్యాదు నమోదుచేసింది. చాలాఏళ్ల నుంచి క్వాల్కామ్ టెక్నాలజీస్‌పై అన్యాయంగా రాయల్టీలను వసూలు చేస్తుందని ఆపిల్ ఆరోపిస్తోంది. దీనిపై తామేమీ చేయలేకపోతున్నామని ఆపిల్ పేర్కొంటోంది.క్వాల్కామ్, ఆపిల్ రెండు కంపెనీలు కాలిఫోర్నియాకు చెందినవి. చైనా యాంటీ-మోనోపలీ చట్టాలను కంపెనీ ఉల్లంఘిస్తుందని ఫిర్యాదు దాఖలైనట్టు బీజింగ్ కోర్టు పేర్కొంది. ఈ రెండు దిగ్గజాల వివాదం గడిచేకొద్ది తీవ్ర స్థాయికి చేరుతోందని టెక్ విశ్లేషకులంటున్నారు. -
సురక్షితమైన పేమెంట్ యాప్ ఒక్కటీ లేదు
భారత్‌లో డిజిటల్ చెల్లింపుల యాప్స్‌పై క్వాల్కామ్ న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మొబైల్ ఫోన్స్ ద్వారా డిజిటల్ చెల్లింపుల చేయాలంటూ ఊదరగొడుతున్న నేపథ్యంలో భారత్‌లో ఈ తరహా సాధనాలు పూర్తిగా సురక్షితం కాదని చిప్సెట్ తయారీ సంస్థ క్వాల్కామ్ హెచ్చరించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో అత్యుత్తమ స్థాయి భద్రత ప్రమాణాలు గల హార్డ్‌వేర్ ఉండటం లేదని సంస్థ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ చౌదరి తెలిపారు. సాధారణంగానే ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న వాలెట్, బ్యాంకింగ్ యాప్స్‌లో సురక్షితమైన హార్డ్‌వేర్ ఉండదని ఆయన చెప్పారు. ఎక్కువగా ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ యాప్స్ నుంచి యూజర్ పాస్వర్డ్లు చోరీకి గురి కాగలవని తెలిపారు. భారత్‌లోనూ డిజిటల్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ పరిస్థితీ ఇదేనన్నారు. దేశంలోనే అత్యధికంగా ప్రాచుర్యం పొందిన డిజిటల్ పేమెంట్ యాప్ కూడా హార్డ్‌వేర్ స్థాయిలో భద్రత ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్స్ ద్వారా చెల్లింపులు సురక్షితంగా జరిగేలా పాటించాల్సిన ప్రమాణాల విషయంలో డిజిటల్ పేమెంట్స్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చౌదరి వివరించారు. డూప్లికేట్ చేయడానికి ఆస్కారమే లేని విధంగా కొత్త ఫీచర్‌తో రూపొందిస్తున్న మొబైల్ చిప్సెట్స్ను 2017లో అందుబాటులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు. -
గాలిలో మీ ఫోన్ ఫీచర్లు కనిపిస్తే..!
మన ఫోన్లోని ఫీచర్స్‌ని స్క్రీన్ మీద కాకుండా త్వరలో గాలిలో చూడబోతున్నామా? అంటే అవుననే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా వర్చువల్ స్ర్కీన్ పేరు విన్నారా? అదేనండీ ఎదురుగా కంటికి కనిపించకపోయినా సాఫ్ట్వేర్ సాయంతో చూపడం. ప్రస్తుతం పరిశోధనలో ఉన్న ఈ టెక్నాలజీని ఉపయోగించే మేజిక్ లీప్ అనే అమెరికన్ స్టార్టప్ మనకు కావలసినప్పుడు అవసరమైన చోట దీన్ని ఉపయోగించుకునేలా తయారుచేయడానికి నిర్ణయించుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో గాలిలోనే యాప్స్ సాయంతో వర్క్, ఆన్లైన్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ తదితరాలను చేసుకోవడం ఉంది. ఈ వీడియో అంతా ఒక గదిలోనే చిత్రించడం వల్ల పగటిపూట ఎలా పనిచేస్తుందోననే అనుమానాలూ ఉన్నాయి. అయితే, కంపెనీ దీని గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా ప్రకటించకపోయినా కళ్లజోడు లేక కాంటక్ట్ లెన్స్‌లను ఉపయోగించడం వల్ల పగటిపూట కూడా ఈ టెక్నాలజీని వాడేందుకు ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇది మైక్రోసాఫ్ట్ 2015లో విడుదల చేసిన హాలోగ్రామ్(కాంతితో ఏ ఆకారన్నయినా తయారుచేసుకోవడం)ను పోలినట్లుగా ఉంది. ఇప్పటికే గూగుల్ ఈ టెక్నాలజీ మీద పరిశోధనలు చేస్తూ 3డి కళ్లజోడు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి 2015లోనే విడుదల కావాల్సిన గూగుల్ కళ్లజోడుకు మరికొన్ని ఫీచర్స్‌ను జతచేసేందుకు ఆ పనిని విరమించుకుంది. ప్రస్తుతం గూగుల్‌తో పాటు ఆలీబాబా, క్వాల్కామ్లు ఈ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. -
దక్షిణ కొరియా సంస్థపై మైక్రోమ్యాక్స్ కన్ను
సియోల్: దేశీ మొబైల్ సంస్థ మైక్రోమ్యాక్స్... దక్షిణ కొరియా కంపెనీ పాన్టెక్లో వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. విదేశాలలో విస్తరించేందుకు వీలుగా పాన్టెక్లో వాటాను కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పాన్‌టెక్ మూడో స్థానంలో ఉంది. అయితే విపరీతమైన పోటీ కారణంగా వరుసగా ఆరు క్వార్టర్లపాటు నష్టాలను ప్రకటించింది. దీంతో రుణ పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. కాగా, వాటా కొనుగోలుకి ఆసక్తిగా ఉన్న విషయాన్ని పాన్‌టెక్ కంపెనీకి మైక్రోమ్యాక్స్ వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎంతమేర వాటాను కొనుగోలు చేసేదీ, అలాగే వాటాకు సంబంధించిన విలువ తదితర వివరాలు వెల్లడికాలేదు. పాన్టెక్లో 9 రుణదాత సంస్థలు సంయుక్తంగా 37% వాటాను కలిగి ఉన్నాయి. ఇక క్వాల్‌కామ్‌కు 12%, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు 10% చొప్పున వాటా ఉంది. వ్యాఖ్యానించలేం: భాగస్వామ్యం, కొనుగోలు వంటి కార్యకలాపాలకు డెరైక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేయాలని, దీంతోపాటు సంబంధిత నియంత్రణ సంస్థలు, నిబంధనలు అనుమతించాలని పాన్‌టెక్ కొనుగోలు అంశంపై మైక్రోమ్యాక్స్ స్పందించింది. ఊహాజనిత అంశాలపై వ్యాఖ్యానించబోమంది. దక్షిణ కొరియా మార్కెట్లో శామ్సంగ్, ఎల్జీ వంటి కంపెనీలతో పోటీ కారణంగా పాన్‌టెక్ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుంది. -
ఎయిర్టెల్ చేతికి క్వాల్కామ్ విభాగం
న్యూఢిల్లీ: అమెరికన్ సంస్థ క్వాల్కామ్కి చెందిన వైర్లెస్ బిజినెస్ సర్వీసెస్ (డబ్ల్యూబీఎస్పీఎల్) కంపెనీలో వంద శాతం వాటాలను దక్కించుకున్నట్లు దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ శుక్రవారం తెలిపింది. అయితే, ఈ డీల్ విలువ వివరాలు మాత్రం తెలపలేదు. గతేడాది డబ్ల్యూబీఎస్పీఎల్లో ఎయిర్టెల్ సుమారు 165 మిలియన్ డాలర్లకు 49 శాతం వాటాలు కొంది. తాజాగా మిగతా వాటాలు కొంది. అప్పట్లో వాటాల కొనుగోలుకు వెచ్చించిన రేటును బట్టి చూస్తే ప్రస్తుత డీల్ విలువ సైతం సుమారు 165 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,008 కోట్లు) మేర ఉంటుందని అంచనా. డబ్ల్యూబీఎస్పీఎల్కి ముంబై, ఢిల్లీ, హర్యానా, కేరళ సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ (4జీ) సర్వీసులు అందించేందుకు కావాల్సిన స్పెక్ట్రం ఉంది. ఎయిర్టెల్ ఇప్పటికే బెంగళూరు, పుణె, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో ఎయిర్టెల్ 4జీ సర్వీసులు అందిస్తోంది.