దేశంలోని ప్రముఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్పూర్ ఈ ఏడాది ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్నట్లు పేర్కొంది. ప్రతిష్టాత్మక ఐఐటీలో 1100 మందికి పైగా ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. "కరోనా మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ, ఐఐటీ ఖరగ్పూర్ అసాధారణ స్థాయిలో ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్లను(పీపీఓలు) పొందింది. ఇది భారతదేశంలోని అన్ని ఇతర ఉన్నత విద్యా సంస్థలలో పోలిస్తే చాలా ఎక్కువ" అని ఖరగ్పూర్ ఐఐటీ తెలిపింది.
ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా విద్యార్థులు 35 అంతర్జాతీయ ఆఫర్లను పొందినట్లు సంస్థ తెలిపింది. సంవత్సరానికి ₹2-2.4కోట్ల ప్యాకేజీలతో ఇద్దరు ప్రధాన రిక్రూటర్లు రెండు పెద్ద ఆఫర్లు చేశారని తెలిపింది. "ఇప్పటి వరకు, మాకు ₹1 కోటికి వేతనంతో 20కి పైగా ఆఫర్లు వచ్చాయి" అని సంస్థ పేర్కొంది. ఐఐటీ ఖరగ్పూర్ ను సందర్శించిన రిక్రూటర్లలో క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఉబెర్, ఇంటెల్, అమెరికన్ ఎక్స్ ప్రెస్, హనీవెల్, శామ్ సంగ్, ఐబిఎమ్ ఉన్నాయి అని కళాశాల పేర్కొంది. ప్లేస్ మెంట్ సెషన్ డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు సాగిందని తెలిపింది. సాఫ్ట్ వేర్, ఎనలిటిక్స్, కన్సల్టింగ్, కోర్ ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ - అన్ని రంగాలలో 100కి పైగా కంపెనీలు నియామక ప్రక్రియలో పాల్గొన్నట్లు ఐఐటి-ఖరగ్ పూర్ ప్రతినిధి తెలిపారు.
(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారికి గుడ్‌న్యూస్..!)
Comments
Please login to add a commentAdd a comment