సెమికండక్టర్ల తయారీ సంస్థ, వైర్‌లెస్ సేవల్లో ప్రసిద్ధి చెందిన క్వాల్‌కామ్ సంస్థ అమెరికా వెలుపల హైదరాబాద్‌లో నిర్మిస్తున్న అతి పెద్ద సెంటర్ అక్టోబరు కల్లా అందుబాటులోకి రానుంది. నగరంలోని రాయదుర్గం ఐటీ కారిడార్లో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ నిర్మాణం జరుపుకుంటోంది. దీని కోసం క్వాల్‌కామ్ రూ.3905 కోట్లు వెచ్చిస్తోంది.
హైదరాబాద్‌లో భారీ క్యాంపస్‌ల నిర్మాణానికి అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ సంస్థలు ముందుకు వచ్చిన సందర్భమైన 2018లో క్వాల్‌కామ్ నుంచి కూడా ప్రకటన వెలువడింది. తాజాగా భవణ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఆ కంపెనీ ప్రతినిధులు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌కు వెల్లడించారు. ఈ క్యాంపస్ అందుబాటులోకి వస్తే సుమార 8,700ల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. క్వాల్‌కామ్ ఉత్పత్తి చేస్తున్న స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌కి మొబైల్ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment